
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుధీర్ బాబు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న సుధీర్ బాబు, బాలీవుడ్‌లో విలన్‌గానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత‍్వంలో సమ్మోహనం సినిమాతో పాటు మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాల్లో నటిస్తున్న సుధీర్, మరో సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఇటీవల ఒకేసారి అరడజను సినిమాలను ప్రకటించిన సుధీర్, వాటిలో ఓ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు బ్యానర్ పేరు ఫైనల్ చేయకపోయినా.. సినిమాను మాత్రం పూర్తి చేసేస్తున్నాడట. రామానాయుడు ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రాజశేఖర్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యిందట. త్వరలో హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌లో బ్యానర్ పేరుతో పాటు సినిమా విశేషాలను కూడా వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment