
నారా రోహిత్
ఎవరో రావాలని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఎదురుచూపులో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు.. ఇలా నెలలు గడిచిపోయాయి. అప్పుడు దేశం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అసలు అందరూ ఎవరికోసం ఎదరు చూస్తున్నారు? అనే మిస్టరీలు వీడాలంటే ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చూడాల్సిందే.
నారా రోహిత్, శ్రియా, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. అప్పారావ్ బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో సాగే భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హీరో హీరోయిన్ల లుక్స్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ గురించి చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment