shreya saran
-
‘గమనం’ నుంచి నిత్య ఫస్ట్ లుక్ అవుట్
శ్రియ 'సరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గమనం. సునారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లముడి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రియ చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం ధరించి ఓసాధారణ గృహిణిలా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిత్యామీనన్ ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ నటుడు శర్వానంద్ ట్విటర్లో విడుదల చేశారు. ‘గమనం నుంచి శైలపుత్రీదేవి(నిత్యామీనన్)ను పరిచయం చేస్తున్నాను. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. (శ్రియ ‘గమనం’ ఎటువైపు..?) ఈ సినిమాలో నిత్యా కర్ణాటక గాయకురాలు శైలపుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ఇక సంప్రదాయ లుక్‌లో చీర కట్టుతో ఉన్న నిత్యా మీనన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటు సమకూరుస్తుండగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్ శివ కందుకూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. (ఇది కామ్ టైమ్ఇది కామ్ టైమ్) చదవండి : సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. -
లండన్ పోలీసులకు చిక్కిన శ్రియ
చెన్నై : నటి శ్రియ లండన్ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. ఈ బ్యూటీ కథానాయకిగా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్ఫ్రెండ్ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నటనకు కొద్ది కాలం దూరంగా ఉంది. అలాంటిది ప్రస్తుతం తమిళంలో సండైక్కారి అనే చిత్రంలో నటిస్తోంది. వివాహానంతరం ఈ బ్యూటీ నటిస్తున్న దక్షిణాది చిత్రం ఇదొక్కటేనన్నది గమనార్హం. నటుడు విమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాస్ ప్రొడక్షన్స్ కార్పొరేషన్ అండ్ మెట్రో నెట్ మలీ్టమీడియా సంస్థల సమర్పణలో జే.జయకుమార్ నిర్మిస్తున్నారు. ఆర్.మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. కాగా సండైక్కారి చిత్ర షూటింగ్ ఇటీవల లండన్‌లో నిర్వహించారు. ఆ వివరాలను దర్శకుడు తెలుపుతూ లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్పోర్టులో విమల్, శ్రియ, సత్యన్ నటించిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. నటి శ్రియ తెలియకుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి వెళ్లిందన్నారు. దీంతో లండన్ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. దీంతో బిత్తరపోవడం శ్రియ వంతైందన్నారు. దీంతో సమస్య జఠిలం అవుతుందని గ్రహించిన ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న నటుడు విమల్ వెంటనే అక్కడికి వెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించారన్నారు. దీంతో పోలీసులు శ్రియను చిరునవ్వులో వదిలిపెట్టినట్లు చెప్పారు. కాగా ఇందులో నటుడు ప్రభు, కేఆర్.విజయ, రేఖ, ఉమా పధ్మనాభన్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా మగ«దీర చిత్రం ఫేమ్ దేవేందర్ సింగ్గిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రీష్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఎవరి కోసం ఎదురు చూపులు?
ఎవరో రావాలని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఎదురుచూపులో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు.. ఇలా నెలలు గడిచిపోయాయి. అప్పుడు దేశం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అసలు అందరూ ఎవరికోసం ఎదరు చూస్తున్నారు? అనే మిస్టరీలు వీడాలంటే ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చూడాల్సిందే. నారా రోహిత్, శ్రియా, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. అప్పారావ్ బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో సాగే భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హీరో హీరోయిన్ల లుక్స్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ గురించి చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్. -
నాపై కుట్ర జరుగుతోంది
తనపై కుట్ర జరుగుతోందని నటి శ్రీయ ఆరోపిస్తున్నారు. శ్రీయ మార్కెట్ ప్రస్తుతం దిగజారింది. కొత్త చిత్రాల అవకాశాలూ తగ్గుముఖం పట్టాయి. రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో నటించిన తర్వాత నయనతార, త్రిష వలే మార్కెట్‌ని స్థిరంగా ఉంచుకోగలరని పలువురు భావించారు. అయితే వరుసగా చిత్రాలు ఫ్లాప్ కావడంతో వెనుకబడ్డారు. తమిళంలో చివరిగా రౌద్రం చిత్రంలో నాయకిగా నటించారు. ఈ చిత్రం 2011లో వచ్చింది. ఆ తర్వాత ఆమె కన్నడంలో నటించిన చంద్రా చిత్రాన్ని డబ్ చేసి తమిళంలో విడుదల చేశారు. చాలా కాలంగా చిత్రాలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో శశికుమార్ కథానాయకునిగా బాలా దర్శకత్వం వహిస్తున్న తారై తప్పట్టై చిత్రంలో నటించేందుకు శ్రీయను ఎంపిక చేశారు. దీంతో సంతోషించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యారు. చిత్రం షూటింగ కోసం చెన్నైలో బస చేశారు. అయితే చివరి క్షణంలో ఈ అవకాశమూ చేజారింది. ఆమెకు బదులు వరలక్ష్మి నటిస్తున్నారు. కొందరు చిత్రంలో శ్రీయ వద్దంటూ సూచనలు చేయడంతో తొలగించినట్లు వార్తలు వ్యాపించాయి. దీంతో శ్రీయ మనో వేదనకు గురయ్యారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. -
శ్రీయకు డబుల్ ధమాకా!
ఒకేసారి రెండు విలక్షణ పాత్రలు చేసే అవకాశం వస్తే, ఏ ఆర్టిస్ట్‌కైనా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ ఆ ఆనందంలోనే ఉన్నారు. విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు శ్రీయ. శశికుమార్, శ్రీయ జంటగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికది డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో శ్రీయను తీసుకున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మకు క్లాసికల్ డాన్స్ తెలియడం ఈ విధంగా ప్లస్ అయ్యింది. ఇక, మరో అవకాశం విషయానికొస్తే.. విద్య అనేది దాచుకోవడానికి కాదు.. సమాజ శ్రేయస్సు కోసం పది మందికి పంచేదంటూ, కుల, మతరహితంగా అందరికీ జ్ఞానాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువు రామానుజాచార్యుల జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో రామానుజాచార్యుల భార్య బీబీ నాంచారి పాత్రను శ్రీయ పోషించనున్నారు. ఇక, శ్రీయ కెరీర్ అయిపోయిందని కొంతమంది ఫిక్స్ అవుతున్న తరుణంలో ఇలా డబుల్ ధమాకా తగలడం శ్రీయకు స్వీట్ షాక్ తిన్నట్లు అనిపించిందట. ఇటీవలే తెలుగులో ఆమె ‘మనం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా వచ్చే నెలాఖరున విడుదల కానుంది. -
దానికి ఆండ్రియా కారణం కాదు...
టాలీవుడ్, కోలీవుడ్ పక్కన పెట్టేయడంతో మలయాళం, కన్నడ చిత్రాలవైపు దృష్టిని సారించారు శ్రీయ. ఇటీవలే ఓ మలయాళ చిత్రానికి ఆమె సైన్ చేశారు కూడా. ప్రకాశం పరత్తున్నా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లబోతోంది. అయితే... ఈ సినిమా నుంచి శ్రీయ ఉన్నట్టుండి తప్పుకున్నారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని శ్రీయ వదులుకోవడం మల్లూవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే... ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా తమిళ నటి ఆండ్రియాను తీసుకోవడం వల్లే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నట్లు కొత్త వార్త ప్రచారంలోకొచ్చింది. గతంలో ఓ తమిళ సినిమా విషయంలో శ్రీయ, ఆండ్రియాకు పెద్ద గొడవే జరిగిందట. అలాంటి ఆండ్రియాతో తెరను పంచుకోవడం ఇష్టం లేకే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నారని మలయాళ పరిశ్రమలో అనుకుంటున్నారు. ఈ వార్తను శ్రీయ ఖండించారు. ఆ సినిమా వదులుకోవడానికి వ్యక్తిగత కారణాలే కారణమని, అంతేతప్ప ఆండ్రియా చేస్తున్న కారణంగా ఆ సినిమాను వదులుకున్నాననడం కరెక్ట్ కదని చెప్పారు శ్రీయ.