నాపై కుట్ర జరుగుతోంది | Intrigues going on Shreya Saran | Sakshi
Sakshi News home page

నాపై కుట్ర జరుగుతోంది

Published Fri, Mar 28 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

నాపై కుట్ర జరుగుతోంది

నాపై కుట్ర జరుగుతోంది

 తనపై కుట్ర జరుగుతోందని నటి శ్రీయ ఆరోపిస్తున్నారు. శ్రీయ మార్కెట్ ప్రస్తుతం దిగజారింది. కొత్త చిత్రాల అవకాశాలూ తగ్గుముఖం పట్టాయి. రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో నటించిన తర్వాత నయనతార, త్రిష వలే మార్కెట్‌ని స్థిరంగా ఉంచుకోగలరని పలువురు భావించారు. అయితే వరుసగా చిత్రాలు ఫ్లాప్ కావడంతో వెనుకబడ్డారు. తమిళంలో చివరిగా రౌద్రం చిత్రంలో నాయకిగా నటించారు. ఈ చిత్రం 2011లో వచ్చింది. ఆ తర్వాత ఆమె కన్నడంలో నటించిన చంద్రా చిత్రాన్ని డబ్ చేసి తమిళంలో విడుదల చేశారు. చాలా కాలంగా చిత్రాలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోయారు.

ఈ నేపథ్యంలో శశికుమార్ కథానాయకునిగా బాలా దర్శకత్వం వహిస్తున్న తారై తప్పట్టై చిత్రంలో నటించేందుకు శ్రీయను ఎంపిక చేశారు. దీంతో సంతోషించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యారు. చిత్రం షూటింగ కోసం చెన్నైలో బస చేశారు. అయితే చివరి క్షణంలో ఈ అవకాశమూ చేజారింది. ఆమెకు బదులు వరలక్ష్మి నటిస్తున్నారు. కొందరు చిత్రంలో శ్రీయ వద్దంటూ సూచనలు చేయడంతో తొలగించినట్లు వార్తలు వ్యాపించాయి. దీంతో శ్రీయ మనో వేదనకు గురయ్యారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement