కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది.
గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది.
(ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!)
గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది.
వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు
సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు.
(ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?)
రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు.
అజిత్ సాయం కోరితే...
తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది.
కనీసం ఫోన్‌లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు.
కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
(ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో)
Comments
Please login to add a commentAdd a comment