నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది.
(ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం)
తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్‌మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల‍్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది.
కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment