Sindhu
-
Trekker Sindhu: తనయ నడిచే.. తండ్రిని గెలిపించే!
ఆధునిక మహిళల విజయాలు వ్యక్తిగతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ పిల్లల నుంచి పేరెంట్స్ వరకూ సక్సెస్ ఫుల్ అనిపించుకునేలా కూడా చేస్తున్నాయి. అలాంటి ఓ యువతి.. కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలి అని సమాజం నిర్దేశించిన వయసులో ఉన్న తండ్రిని యువకులతో సమానంగా ట్రెక్కింగ్‌లో రాణించేలా తీర్చిదిద్దింది. సాక్షి, సిటీబ్యూరో రిటైర్మెంట్ తర్వాత శ్రమ పడకూడదని తల్లిదండ్రులను ఇంటి దగ్గరే ఉంచి ఇల్లు, నౌకర్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ అమర్చి జాగ్రత్తగా చూసుకునే కూతుళ్లు, కొడుకులను చూసి ఉంటాం. కానీ 60 ఏళ్ల వయసులో తండ్రిని కొండలు, గుట్టలు ఎక్కించి వేల కిలోమీటర్లు తనతోపాటు నడిపించిన కూతుర్ని చూశామా? అంటే.. ‘మా అమ్మాయే నా చేత తొలి అడుగులు వేయించింది..’ అంటూ సంతోషంగా చెబుతారు ఆమె తండ్రి ఏబీఆర్పీ రెడ్డి. కొండాపూర్‌లో నివసించే సింధు రెగ్యులర్‌గా కొండలు, గుట్టలు ఎక్కేసే సిటీ ట్రెక్కింగ్ లవర్స్‌లో ఒకరు. వ్యాపార వ్యవహారాల నుంచి విశ్రాంతికి షిఫ్ట్ అయిన వెంటనే తన ట్రెక్కింగ్ హాబీని తండ్రికి వారసత్వంగా అందించారు. తద్వారా ఓ మంచి ట్రెక్కర్‌గా మారేందుకు మాత్రమే కాదు 73 ఏళ్ల వయసులో రికార్డ్స్ సృష్టించేందుకు కూడా దోహదపడ్డారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న సింధు ఇప్పటి వరకూ ఎనిమిది చెప్పుకోదగ్గ సాహసవంతమైన ట్రెక్స్ని పూర్తి చేశారు. సింధు ఇటు ఆటలు, అటు సాహసాలతో ఆత్మ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తూ.. విలాసాల వెనుక పరుగులు తీసేవారికి ఓ గుణపాఠంలా నిలుస్తున్నారు. ‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె.మైండ్‌సెట్‌లోనే అంతా ఉంది.‘వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అంతా మైండ్‌సెట్‌లోనే ఉంది అని నేను నమ్ముతాను’ అంటారు సింధు. అందుకే అరవైలో ఉన్న తండ్రిని సైతం తనతో పాటు సాహస యాత్రలవైపు నడిపించారు. ‘నాన్న మొదటి నుంచీ చాలా ఫిట్‌గా ఉంటారు. బిజినెస్ నుంచి ఫ్రీ కాగానే జిమ్‌లో చేరడమే కాకుండా నాతో పాటు ట్రెక్కి రమ్మని ప్రోత్సహించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు.. తాను 23 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన సింధు.. రన్నింగ్, సైక్లింగ్ ఇలా ప్రతి హాబీనీ తండ్రితో కలిసి పంచుకున్నారు. ‘నాన్నకు చిన్నప్పుడు సాహస యాత్రలు చేసే అలవాటు ఉండేది, అయితే వర్క్‌లో పడిపోయాక దాన్ని మరచిపోయారు. నేను దానిని మళ్లీ గుర్తు చేశా అంతే’ అంటూ చెప్పారామె. గత డిసెంబర్లో తన తండ్రితో కలిసి చేసిన ట్రెక్.. ఎప్పటికీ మరచిపోలేనిదని అంటారామె. అప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రెక్కింగ్ అనుభవం లేని తండ్రి తొలిసారే ఉత్తరాఖండ్‌లో 12వేల కిమీ అధిరోహించి రికార్డ్ సృష్టించారు. అయితే నాన్న ఫిట్నెస్ గురించి నాకు తెలుసు. అలాగే ఎప్పుడైతే మా అడ్వెంచర్ గ్రూప్‌లో జాయిన్ చేశానో.. దాని నుంచి నాన్న కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు.’ అంటూ వివరించారామె. -
చదువు పూర్తవగానే కొత్తిల్లు కొన్న డ్యాన్సర్.. గృహప్రవేశం (ఫోటోలు)
-
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది. -
చదువుల తల్లికి ఎంత కష్టం
సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు. వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
చైనాకు భారత మహిళల షాక్
షా ఆలమ్ (మలేసియా): బ్యాడ్మింటన్‌లో మేటి జట్టయిన చైనాకు భారత్ చేతిలో ఎదురుదెబ్బ తగిలింది.. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శనతో భారత మహిళల జట్టు 3–2తో చైనా బృందాన్ని కంగు తినిపించింది. అన్నింటికి మించి భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు చాన్నాళ్ల తర్వాత విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత సీజన్ ఆసాంతం నిరాశపర్చిన ఆమె ఈ ఏడాది గట్టి ప్రత్యర్థిపై ఘనమైన విజయంతో సత్తా చాటుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–17, 21–15తో హన్ యుపై గెలిచి జట్టును 1–0తో ఆధిక్యంలో నిలిపింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన సింధు కేవలం 40 నిమిషాల్లోనే తనకన్నా మెరుగైన ర్యాంకర్ ఆట కట్టించింది. రెండో గేమ్‌లో సింధు ఒక దశలో 10–13తో వెనుకబడినా...తర్వాతి 13 పాయింట్లలో 11 గెలుచుకొని విజేతగా నిలవడం విశేషం. అనంతరం జరిగిన డబుల్స్ పోటీల్లో అశ్విని పొన్నప్ప–తనీషా కాస్ట్రో జోడీ 19–21, 16–21తో లియు షెంగ్ షు–తన్ నింగ్ జంట చేతిలో ఓడటంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ వెంటనే జరిగిన రెండో సింగిల్స్‌లో అషి్మత చాలిహ 13–21, 15–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో ఓడిపోవడంతో భారత్ 1–2తో వెనుకబడింది. ఈ దశలో మరో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి... ట్రెసా జాలీతో కలిసి డబుల్స్ బరిలో దిగి మ్యాచ్ గెలుపొందడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. గాయత్రి–ట్రెసా ద్వయం 10–21, 21–18, 21–17తో లి యి జింగ్–లు జు మిన్ జంటపై నెగ్గడంతో భారత్ 2–2తో చైనాను నిలువరించింది. దీంతో అందరి దృష్టి నిర్ణాయక పోరుపైనే పడింది. ఇందులో అంతగా అనుభవం లేని 472 ర్యాంకర్ అన్మోల్ ఖర్బ్ 22–20, 14–21, 21–18తో ప్రపంచ 149వ ర్యాంకర్ వు లు యుపై అసాధారణ విజయం సాధించి భారత్‌ను గెలిపించింది. తొలి సారి ఈ టోర్నీలో బరిలోకి జాతీయ చాంపియన్ అన్మోల్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రణయ్ ఓడినా... పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 4–1తో హాంకాంగ్‌పై జయభేరి మోగించింది. తొలి సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 18–21, 14–21తో ఎన్గ్ క లాంగ్ అంగుస్ చేతిలో ఓడినా... తుది విజయం మనదే అయింది. ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–16, 21–11తో లుయి చున్ వాయ్–యింగ్ సింగ్ చొయ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. రెండో డబుల్స్‌లో ఎమ్.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జంట 21–12, 21–7తో చొ హిన్ లాంగ్–హంగ్ కుయె చున్ జోడీపై నెగ్గింది. 3–1తో విజయం ఖాయమవగా... ఆఖరి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–14, 21–18తో జాసన్ గునవాన్‌పై గెలుపొందడంతో ఆధిక్యం 4–1కు పెరిగింది. మహిళల గ్రూప్ ‘డబ్ల్యూ’లో రెండే జట్లు ఉండటంతో భారత్, చైనా ఈ మ్యాచ్‌కు ముందే నాకౌట్‌కు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో మాత్రం గురువారం జరిగే పోరులో చైనాతో భారత్ తలపడుతుంది -
కొత్త సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌కు తనకు పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది. గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్‌తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... | ♦ గత రెండు ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్‌లతో పోలిస్తే నాకు పారిస్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ♦ మహిళల సర్క్యూట్లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం. ♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్‌గా నేను ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమయ్యాను. ♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాను. నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్‌లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది. -
వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం
అచ్చంపేట: వరకట్న వేధింపులతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడగా.. యువతి తరఫు బంధువులు ఆగ్రహంతో భర్త పై దాడి చేయడంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన అతికారి సింధు (26), ఖమ్మం జిల్లాకు చెందిన నిమ్మతోట నాగార్జున (28) అచ్చంపేట ప్రగతి డిగ్రీ కళా శాలలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2021 మార్చిలో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని తన బాబాయ్ డాక్టర్ కృష్ణకు చెందిన శ్రీరాంసర్రాం ఆస్పత్రి లో పనిచేస్తున్నాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గొడ వలు మొదలయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా కట్నం తీసుకురావాలని సింధును నాగార్జున, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సింధు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయతి్నంచింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీరాంసర్రాం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగర్‌కర్నూల్‌కు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్, చివరికి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే సింధు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం తీసుకువస్తుండగా.. కాగా, సింధు మృతదేహాన్ని భర్త నాగార్జున అ చ్చంపేటకు తీసుకొస్తుండగా ఆమన్‌గల్ సమీపంలో బంధువులు వాహనాన్ని అడ్డగించి నాగార్జునను మరో వాహనంలో తీసుకెళ్లి చితకబాది అచ్చంపేట తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులకు విషయం తెలియడంతో సింధు బంధువుల వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సింధు, నాగార్జున మృతదేహా లు ఒకే దగ్గర ఉంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు సింధు మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి, నాగార్జున మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమ కూతురు మృతికి డాక్టర్ కృష్ణ, అతని భార్య, నాగార్జున తల్లి, చెల్లి కారణమని సింధు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. నాగార్జున బాబాయ్ డాక్టర్ కృష్ణ వరకట్నం డబ్బులు తేవాలని.. లేకపోతే తన కోరిక తీర్చాలని సింధుని వేధించినట్లు పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింధుది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆస్ప త్రుల చుట్టూ తిప్పారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సెమీస్‌లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
ఒడెన్స్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రత్యర్థినుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా చివరకు తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21–14, 18–21, 21–10 స్కోరుతో కిర్స్టీ గిల్మర్ (స్కాట్లండ్)పై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న తర్వాత సింధుకు ఆ తర్వాత గిల్మర్ గట్టి పోటీనిచ్చి పోరును 1–1తో సమం చేసింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు తన స్థాయికి తగినట్లుగా చెలరేగింది. ఒక దశలో వరుసగా 7 పాయింట్లు సాధించి దూసుకుపోయిన భారత షట్లర్ చివరి వరకు దానిని కొనసాగించింది. మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆకర్షి 10–21, 22–20, 21–12 తేడాతో లి వైవోన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ను నిరాశ ఎదురైంది. తొలి పోరులో శ్రీకాంత్ 21–19, 10–21, 16–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓడి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. థాయిలాండ్‌కు చెందిన కంటఫాన్ వాంగ్ చరన్ 21–16, 21–18తో లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. మరో వైపు ఆసియా క్రీడల స్వర్ణపతక జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి చివరి నిమిషంలో టోర్నీనుంచి నిష్క్రమించింది. ఈ జంట వాకోవర్ ఇవ్వడంతో మలేసియా ద్వయం ఆంగ్ యు సిన్ – టియో యీ యి రెండో రౌండ్‌కు చేరింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ పీవీ సింధు మరో అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21–11, 21–10తో ప్రపంచ 22వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. ఈ ఏడాది వెన్ చి సుపై సింధుకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్ చి సుపై సింధు వరుస గేముల్లో నెగ్గింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్ థయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 15–21, 12–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 10–21, 20–22తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్‌లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్‌కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్‌గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్‌కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్‌లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్‌లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!
నటీనటులు అనగానే కోట్లకు కోట్లు గడిస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ అదృష్టం తక్కువమందికి దక్కుతుందనేది నిజం. హీరోహీరోయిన్ల తప్పితే మిగతావాళ్లకు ఇచ్చే డబ్బులు తక్కువగానే ఉంటాయి. ఇక సైడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్లయితే చాలావరకు సాధారణ జీవితం గడుపుతుంటారు. అలా ఉండే ఓ నటి.. ఇప్పుడు ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. సోమవారం వేకువజామున 2:15 గంటలకు చనిపోయింది. (ఇదీ చదవండి: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం) తెలుగమ్మాయి అంజలి నటించిన 'షాపింగ్‌మాల్' సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీలో సింధు(44) అనే నటి కూడా ఓ పాత్ర చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. 2020లో ఈమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో పరిస్థితులు తారుమారు అయిపోయాయి. అసలే మధ్య తరగతి జీవితం.. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. చేతులో డబ్బులేక ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంది. కొన్నిరోజుల ముందు ఆరోగ్యం మరింత విషమించడంతో చేసేదేం లేక కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సింధు చేరింది. కానీ చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి కష్టాలతో పోరాడుతూ వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన సింధుకు 14వ ఏట పెళ్లి చేశారు. అదే ఏడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నటి అయినప్పటికీ సమస్యలు తగ్గలేదు. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఈమెని కబళించేసి, కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగిల్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
సింధు మృతి కేసులో నిందితుడి అరెస్టు
గుణదల (విజయవాడ తూర్పు): సీఏ విద్యార్థిని సింధు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసులో నిందితుడు ప్రసేన్‌ను విజయవాడలోని మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో సింధును లోబరుచుకుని మోసం చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ప్రసేన్.. సింధును వదిలించుకోవాలన్న దురాలోచనతో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు 306 సెక్షన్ కింద ప్రసేన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి పై పలు అనుమానం
-
హిమాలయాలపై భయాంకర నిజాలను వెల్లడించిన ఐఐటీ ఇండోర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు ఎదుర్కొంటున్న సమస్య వాతావరణ మార్పులు. వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో అకాల వర్షాలు, తుఫాన్లు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. గతంలో హిమాలయాల్లో గ్లేసియర్ కరిగిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను వెల్లడించింది. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని పేర్కొన్నారు. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్ పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తెలిపారు. హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయని హెచ్చరించారు. మైదానాలు పూర్తిగా ఏడారులే..! హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలు 2.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, హిమానీనదాలతో ఈ ప్రాంతంలోని ఒక బిలియన్ మందికి పైగా నీటి అవసరాలు తీరుతాయి. ఒక శతాబ్దం అంతా హిమానీనదాల మంచు కరిగిపోతే, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని పరిశోధన నిర్వహకులు డాక్టర్ ఆజామ్ తెలిపారు. గంగా నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఏడారిగా మారే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఐఐటీ ఇండోర్ బృందం గ్లేసియర్ కరిగిపోతున్న సమస్యకు మూడు రకాల పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఈ బృందం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా అధ్యయనాలను జరపాలి. ఈ పరిశోధనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. చదవండి: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న సింధూ
మహబూబ్‌నగర్ క్రీడలు: వనపర్తి జిల్లా కొన్నూర్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన గంటల సింధూ వెయిట్ లిఫ్టింగ్‌లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శిస్తూ జిల్లా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2007లో స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్‌లో సింధూ ప్రతిభ కనబరిచి 4వ తరగతిలో హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశం పొందింది. రెండేళ్లపాటు కండీషన్ ట్రైనింగ్ అనంతరం సింధూ వెయిట్ లిఫ్టింగ్‌కు ఎంపికైంది. అప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అనతి కాలంలోనే రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తాచాటింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వనపర్తి జిల్లా ఉత్తమ క్రీడాకారిణిగా మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుంది. 27 నేషనల్ పోటీల్లో 19 పతకాలు సింధూ ఇప్పటివరకు 30 జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 19 పతకాలు సాధించింది. మొదటగా 2010 హర్యానాలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో 48 కిలోల విభాగంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మహారాష్ట్ర (సాంగ్లీ)లో జరిగిన పోటీల్లో 53కిలోల విభాగంలో బంగారు పతకం పొందింది. చత్తీస్ఘడ్ (రాయ్‌పూర్)లో జరిగిన పోటీల్లో 53 విభాగంలో బంగారు పతకం సాధించింది. 2013లో అస్సాం (గౌహతి)లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం, 2015 హర్యానాలో 58 కిలోల విభాగంలో రజతం, 2016 పంజాబ్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55కిలోల విభాగంలో రజతం పతకాలు సాధించింది. 2017లో బెంగళూర్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో, 2018లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ, వైజాగ్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొంది. గత ఏడాది డిసెంబర్లో తమిళనాడులోని ఎంఎస్‌యూ యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీలో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి కోల్‌కత్తాలో జరిగిన సీనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సింధూ కోల్కత్తా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఏడాది మార్చిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం వెయిట్ లిఫ్టింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా కష్టపడతా. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉంది. పాలమూరురెడ్డి సేవా సమితి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మధ్యతరగతి అనే భావనను వీడి కష్టపడితే క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. – సింధూ, వెయిట్‌లిఫ్టర్ 2018లో.. ప్రస్తుత మంత్రి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డు అందుకుంటున్న సింధూ -
డిప్యూటీ కలెక్టర్‌గా సుబ్రహ్మణ్యం కుమార్తె
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల నిబంధనలను అనుసరించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సింధు కృష్ణా జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. (చదవండి: అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్) -
టోక్యో ఒలింపిక్స్ వరకు... ‘టాప్’లో సైనా, సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుస్తున్న మేటి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టాప్) పథకాన్ని పొడిగించారు. సింగిల్స్‌లో వీరిద్దరితో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్.ఎస్.ప్రణయ్లకూ టోక్యో ఒలింపిక్స్–2020 దాకా ‘టాప్’ చేయూతనిచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన ‘టాప్’ జాబితాను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) బుధవారం ప్రకటించింది. అయితే మరో తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్, లక్ష్య సేన్లను ఈ జాబితా నుంచి తప్పించింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రాలు ‘టాప్’ జాబితాలో ఉన్నారు. కాగా ప్రదర్శన బాగుంటే టాప్‌లో చేర్చే ‘వాచ్‌లిస్ట్’ లో జక్కంపూడి మేఘన, పూర్వీషారామ్, మను అత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ‘2024 ఒలింపిక్స్ డెవలప్మెంటల్ గ్రూప్’లో సైక్లింగ్‌ను చేర్చే అంశాన్ని బుధవారం నాటి సమావేశంలో చర్చించారు. జూనియర్ ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇటీవల భారత్ 10 పతకాలు సాధించింది. దీంతో సైక్లిస్ట్‌లు అల్బెన్, రొనాల్డో సింగ్, జేమ్స్ సింగ్, రోజిత్ సింగ్‌లను ఈ డెవలప్మెంటల్ తుది జాబితాలో చేర్చారు. పారాలింపియన్లకు అండదండ... తాజా ‘టాప్’ పథకంలో పారా అథ్లెట్లకు పెద్దపీట వేశారు. పారాలింపిక్స్, పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాలతో దేశానికి కీర్తిప్రతిష్టలు తెస్తుండటంతో ఈసారి ఏకంగా 12 మంది పారా అథ్లెట్లను ఎంపిక చేశారు. పారా ఆసియా క్రీడల స్వర్ణ విజేత శరద్ కుమార్ (హైజంప్), వరుణ్ భటి (హైజంప్), జావెలిన్ త్రోయర్లు సందీప్ చౌదరి, సుమిత్, సుందర్ సింగ్ గుర్జార్, రింకు, అమిత్ సరోహ (క్లబ్ త్రోయర్), వీరేందర్ (షాట్‌పుట్), జయంతి బహెరా (మహిళల 400 మీ. పరుగు) ‘టాప్’ జాబితాలో ఉన్నారు. -
పెంట్‌హౌస్ రాబరీ
మూడున్నరకే చీకటి పడిపోయినట్టుగా కనిపిస్తోంది. రాత్రికి భారీ వర్షం పడే సూచనలున్నాయని వార్తల్లో చెబుతున్నారు. రాయల్ అపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది. పెంట్‌హౌస్ నుంచి కేకలు వినబడుతున్నాయి. అది మూడంతస్తుల అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తులో నాలుగు, గ్రౌండ్ ఫ్లోర్లో మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. పైన పెంట్‌హౌస్ ఉంది. బిల్డర్ జగ్గారావు ఫ్యామిలీతో పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు. పెంట్‌హౌస్‌పై నుంచి కేకలు వినబడుతూ ఉండటంతో మెయిన్ గేటు పక్కన ఉన్న ఔట్‌హౌస్‌లో జోగుతున్న వాచ్‌మేన్ అప్పారావు ఉలిక్కిపడ్డాడు. ఏదో జరిగిందని అర్థమై మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. ఆ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు. కార్ పార్కింగ్ కూడా జగ్గారావు ఒక్కడికే ఉంది. మిగిలిన వారికి స్కూటర్ పార్కింగ్‌లే. అప్పారావు వెళ్లేసరికి సింధూరాణి ఆయాసపడిపోతూ ఉంది.‘‘ఏమైందమ్మా?’’ అని అడిగాడు అప్పారావు.‘‘సార్ పంపారని ఎవరో వచ్చారు. నిన్న ఇంట్లో పెట్టిన బ్రీఫ్‌కేస్ తెమ్మన్నారంటే నిజమే అనుకున్నాను. ఆయన నిన్న రాత్రి ఒక బ్రీఫ్‌కేస్ తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. రేపు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. వెళ్లేటప్పుడు ఆయన అడగలేదు. నేను గుర్తు చెయ్యలేదు.’’ సింధూరాణి ఆయాసం పెరిగిపోయి మాట్లాడలేక ఆగింది. ఆమె అవస్థ గమనించి, ‘‘కూర్చోండమ్మా!’’ అన్నాడు అప్పారావు. ఆమె కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. ‘‘వచ్చిన ఇద్దరిలో ఎవరూ నాకు తెలిసిన వాళ్లు కాదు. బీరువాలోంచి బ్రీఫ్‌కేస్ తీశాను. ఇవ్వబోయే సమయానికి అనుమానం వచ్చింది. సరే, నేనే కాల్ చేసి అడుగుదామనుకున్నాను. టీపాయ్ మీదున్న ల్యాండ్‌లైన్ ఫోన్ డయల్ చేస్తున్నాను. సార్ నెంబర్ ఎంగేజ్ వస్తోంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతలో వాళ్లలో ఒకడు టీపాయ్ మీద ఉంచిన బ్రీఫ్‌కేస్ తీసుకుని పరిగెత్తాడు. రెండోవాడూ వాడితోపాటు పోయాడు’’ చెప్పింది సింధూరాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేశారా?’’ ఎవరో అడిగారు. ‘‘అమ్మా! ముందు సార్‌కి ఫోన్ చేయండి!’’ అన్నాడు అప్పారావు. సింధూరాణి తేరుకుని భర్తకి కాల్ చేసింది. అతను లైన్లోకి వచ్చాడు. ‘‘హలో!’’ అన్నాడు.‘‘ఏమండీ! చాలాసేపట్నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. లైన్ కలవడం లేదు. దొంగతనం జరిగిందండీ..’’ అంటూ సింధూరాణి చెప్పడం మొదలుపెట్టింది. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. వర్షం పెద్దదైనట్టు ఉంది. అందరూ రెయిన్కోట్లు వేసుకున్నారు. అవి కొంతమేర తడిసివున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతనుబాగా లావుగా బాన పొట్టతో ఉన్నాడు. అన్ని మెట్లు ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేసింది. ఎస్సై జోసఫ్, నలుగురు కానిస్టేబుల్స్ నిలబడి అందరివంకా చూస్తున్నారు.‘‘ఎవరయ్యా వాచ్‌మేన్?’’ అన్నాడు సీఐ. ‘‘సార్! నేనే..’’ అంటూ ముందుకు వచ్చాడు అప్పారావు.‘‘అందర్నీ పంపెయ్!’’ అన్నాడు.అప్పారావు అక్కడున్నవాళ్లని దూరంగా వెళ్లమని చెప్పి వచ్చాడు. ‘‘మీరేనా ఇందులో ఉండేది?’’ అన్నాడు సీఐ సింధూరాణితో. ‘‘ఔనండీ!’’‘‘మీ పేరు?’’‘‘సింధూరాణి’’‘‘మీవారు ఎవరు? ఏం చేస్తుంటారు?’’‘‘జగ్గారావండీ. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు.’’‘‘అలాగా? ఏం జరిగింది?’’సింధూరాణి జరిగింది చెప్పింది.‘‘బ్రీఫ్‌కేస్‌లో ఏమున్నదమ్మా?’’‘‘తెలీదండీ! రాత్రి తెచ్చి బీరువాలో పెట్టమన్నారు. పొద్దున ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ఇవ్వమన్నారు. ఆయన వెళ్లేటప్పుడు అడగలేదు. పాపిష్టిదాన్ని నేనూ గుర్తు చేసుకుని ఇవ్వలేదు. ఇచ్చివుంటే ఇదంతా జరిగేది కాదు.’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. సీఐ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్లు తెరిచాడు. ‘‘మీ వారేరీ?’’ అడిగాడు సింధూరాణిని.‘‘జరిగిందంతా చెప్పానండీ! వస్తుంటారు.’’ అంది. ‘‘జోసెఫ్ ఆయన నెంబర్ తీసుకుని కాల్ చెయ్యి. అర్జెంటుగా రమ్మను.’’ అన్నాడు ఎస్సైతో. ‘‘ఎస్ సార్!’’ అని సింధూరాణిని అడిగి జగ్గారావు సెల్ నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేస్తుంటే రింగవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ‘‘సార్! ఆయన లిఫ్ట్ చేయడం లేదు.’’ చెప్పాడు జోసెఫ్.‘‘జర్నీలో ఉన్నాడేమో? ఓకే!’’ అన్నాడు సీఐ.‘‘వాచ్‌మేన్! ఇద్దరు మనుషులు మెయిన్‌గేట్ దాటి రావడం నువ్వు చూశావా?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘లేదండీ. నేనప్పుడు నా రూమ్‌లో ఉన్నాను.’’‘‘నువ్విక్కడ వాచ్మేన్వి. గేట్లో నుంచి వచ్చే పోయే వాళ్లని చూస్తుండొద్దా? ఏం చేస్తున్నావు? తాగి తొంగున్నావా?’’ గర్జించాడు సీఐ. అప్పారావు బెదిరిపోయాడు. ‘‘చూస్తూనే ఉంటానండీ. ఎవరోకళ్లు ఏదోక పని చెప్తుంటారండి. చెయ్యకపోతే కోపం. ఒక్కడ్నేనండి. ఎన్నని చెయ్యను!’’ నెమ్మదిగా చెప్పాడు అప్పారావు. ‘‘అట్లాంటప్పుడు ఆ పని చెప్పినవాళ్లని గేటు దగ్గర ఉండమని చెప్పాలి. ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఎట్లా?’’అప్పారావు మౌనంగా ఉండిపోయాడు. ‘‘అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టించారా?’’అప్పారావు తల అడ్డంగా ఊపాడు. ‘‘సీసీ కెమెరాలు లేవు. లిఫ్ట్ లేదు. ఏం అపార్ట్మెంటమ్మా? ఏదైనా జరిగినప్పుడు మా చావుకొస్తుంది.’’ అసహనంతో అన్నాడు సీఐ. సీఐ మాటమాటకీ వాచ్ చూసుకుంటున్నాడు. ‘‘ఏవండీ! మీ ఆయన ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు?’’ సింధూరాణితో అన్నాడు.‘‘నేనూ ట్రై చేస్తున్నానండీ. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.’’ అంది ఆమె. ‘‘అయితే పోయిన బ్రీఫ్‌కేస్‌లో ఏముందో మీకు తెలియదన్నమాట?’’సింధూరాణి తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్టుగా. అంతలో ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. సింధూరాణి లిఫ్ట్ చేసి, ‘‘హలో!’’ అంది. అవతల చెప్పింది విని ఆమె ముఖం వివర్ణమయింది.‘‘ఎక్కడా?’’ అంది ఆందోళనపడుతూ. సింధూరాణి ఫోన్ పెట్టేసింది. అరవడం మొదలుపెట్టింది. ‘‘ఏమైందండీ!’’ అని అడిగాడు సీఐ.‘‘ఆయనకి గుండెపోటు వచ్చిందంటండీ! హాస్పిటల్లో చేర్పించారట. ఆఫీస్ వాళ్లు చెప్పారు.’’ ఏడుస్తూనే చెప్పింది సింధూరాణి. సీఐ మల్లికార్జున్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘బ్రీఫ్‌కేస్ పోయిందని తెలియగానే గుండెపోటు వచ్చిందంటే, దాంట్లో డబ్బు ఉండుంటుంది..!’’ అన్నాడు ఎస్సై వైపు చూస్తూ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘జోసెఫ్! వర్షం బాగా కురుస్తోంది. పాపం మేడమ్ ఎట్లా వెళ్తారు? ఆమెను హాస్పిటల్లో డ్రాప్ చెయ్. ఆయనకి ఎట్లా ఉందో డాక్టర్స్‌ని ఎంక్వయిరీ చేసి, నాకు కాల్ చెయ్! నేనిక్కడే ఉంటాను.’’ అన్నాడు సీఐ. ‘‘ఎస్ సార్!’’ అన్నాడు జోసెఫ్. ‘‘అమ్మా! మీరు మా వాళ్లతో వెళ్లండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. వర్రీ పడకండి. కష్టార్జితం ఎక్కడికీ పోదు. తప్పక దొరుకుతుంది.’’ ధైర్యం చెప్పాడు మల్లికార్జున్. ఎస్సైతో పాటు సింధూరాణి బయలుదేరింది. జగ్గారావు కోలుకున్నాడనీ, ఐసీయూ నుంచి రూమ్‌లోకి షిఫ్ట్ చేశారని సమాచారం వచ్చింది. సీఐ మల్లికార్జున్ తన స్టాఫ్‌తో హాస్పిటల్‌కి వెళ్లాడు. రూమ్‌లో అతని భార్య సింధూరాణి లేదు. వేరే ఇంకొక ఆమె ఉంది. ఎర్రగా పొడుగ్గా ఉంది. ఆమె పక్కన టీనేజ్ కుర్రాడు, పదేళ్ల పాప ఉన్నారు. ‘‘హలో సార్!’’ అని పలకరించాడు సీఐ. ‘‘నమస్తే!’’ అని లేవబోయాడు జగ్గారావు. ‘‘మీరు లేవొద్దు. ప్లీజ్!’’ అని ఆమె వైపు చూసి, ‘‘మీరు?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘నా వైఫ్ రాజేశ్వరి. వీళ్లు నా పిల్లలు’’ చెప్పాడు జగ్గారావు. మల్లికార్జున్ షాక్ తిన్నట్టయ్యాడు. ఈవిడ వైఫ్ అయితే, మరి సింధూరాణి? గురుడికి ఇద్దరు భార్యలా? అనుకున్నాడు. ‘‘ఓకే! చెప్పండి జగ్గారావుగారూ. బ్రీఫ్‌కేస్‌లో ఏముంది?’’ ప్రశ్నించాడు సీఐ. ‘‘యాభై లక్షలు క్యాష్ సార్!’’ విచారంగా అన్నాడు.‘‘మై గాడ్! ఫిఫ్టీ ల్యాక్స్? అంత డబ్బు ఇంటికి తీసుకెళ్లినట్టు మీ స్టాఫ్‌లో ఎవరికైనా తెలుసా?’’‘‘మా అకౌంటెంట్‌కి తెలుసు.’’ ‘‘ఓకే.. అమ్మా! మీరు కొంచెం బయటకు వెళ్తారా?’’ రాజేశ్వరి వైపు చూసి అన్నాడు సీఐ మల్లికార్జున్. రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని గది బయటికి వెళ్లిపోయింది. ‘‘ఏమండీ! మీకు ఇద్దరు భార్యలా?’’‘‘ఔనండీ! సింధూరాణికి పిల్లలు లేరు. తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను.’’ చెప్పాడు జగ్గారావు. యాభై లక్షల క్యాష్ పోవడంతో అప్సెట్ అయ్యాడు జగ్గారావు. ఒక స్థలం కొనుగోలు చేయడానికి అంత క్యాష్ సమకూర్చుకునేసరికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్, తోటి బిల్డర్స్ దగ్గర సేకరించుకోవాల్సి వచ్చింది. స్థలం యజమాని క్యాష్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అంత క్యాష్ తెచ్చి పెద్ద భార్య సింధూరాణి ఇంట్లో ఉంచాడు. ఉదయం వెంట తెచ్చుకోవాల్సింది కానీ ఈ రోజుకి అవసరం లేదని ఊరుకున్నాడు. అందుకే ఇలా జరిగింది. ‘‘మీ బ్రీఫ్‌కేస్ ఏ రంగులో ఉంది?’’‘‘సిమెంట్ కలర్ సార్!’’ అన్నాడు జగ్గారావు. జగ్గారావు ఆఫీసుకెళ్లి అకౌంటెంట్ని విచారించాడు సీఐ. అతను రామశర్మ. రిటైరైపోయిన వృద్ధుడు. అతను తనకు ఏం తెలియదని నొచ్చుకున్నాడు అనుమానించినందుకు. రామశర్మ అనుమానించదగ్గ మనిషి కాదని మల్లికార్జున్‌కి అర్థమైంది. ‘‘సార్! సింధూరాణి భర్త మీద చాలా కోపంగా ఉంది. తరచుగా ఘర్షణ పడుతుంటుందని వాచ్‌మేన్ అప్పారావు చెప్పాడు. అపార్ట్మెంట్లో ఆడవాళ్లు కొన్ని సంగతులు చెప్పారు. జగ్గారావు పెద్ద భార్య దగ్గరికి వారానికి ఒకసారి కూడా రాడట. ఎక్కువగా రెండో భార్య, పిల్లలతోనే గడుపుతాడట. గచ్చిబౌళిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెండో భార్యకు విల్లా కొని ఇచ్చాడట. అప్పట్నుంచి సింధూరాణి భర్త మీద మండి పడుతున్నదట.’’ చెప్పాడు ఎస్సై. సీఐకి కేసులో క్లూ దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హెడ్ కానిస్టేబుల్ వాచ్‌మేన్ అప్పారావుని పట్టుకొచ్చాడు. స్టేషన్లోకి గడగడలాడుతూ వచ్చాడు అప్పారావు. వచ్చీ రావడంతోనే కాళ్ల మీద పడిపోయాడు. ‘‘సార్! నాకేం తెలీదు.’’ అన్నాడు ఏడుస్తూ. ‘‘నీకు తెలీదుగాని ఒక సంగతి చెప్పు! ఆ రోజు పొద్దున జగ్గారావు కారులో వెళ్లిపోయాడు. సాయంకాలం మూడున్నర, నాలుగు గంటలకు దొంగతనం జరిగింది. ఈ లోపల పెంట్‌హౌస్‌కి ఎవరు వచ్చారు?’’ ప్రశ్నించాడు. అప్పారావు అతని పేరు చెప్పాడు. ఆ ఇల్లు కూడా తనకి తెలుసు అన్నాడు. వాచ్‌మేన్‌ని వెంటపెట్టుకుని సీఐ స్టాఫ్‌తో పోలీస్ వ్యాన్‌లో బయలుదేరాడు.పోలీసులు తన ఇంటికి రావడంతో బెదిరిపోయాడు భిక్షపతి. ఇల్లంతా గాలిస్తే దొరికింది బ్రీఫ్‌కేస్. అది బరువుగానే ఉంది. తను ఓపెన్ చేయలేదన్నాడు. పోలీస్ స్టేషన్లో తలవంచుకుని నిలబడి ఉంది సింధూరాణి. ‘‘చెప్పవమ్మా! బ్రీఫ్‌కేస్ మీ నాన్నకు ఇచ్చి పంపి, దొంగలు ఎత్తుకెళ్లారని ఎందుకు నాటకం ఆడావు?’’ గద్దించాడు సీఐ. ‘‘మా ఆయన నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడండీ. చిన్న పెళ్లానికి కోటి రూపాయలు పెట్టి విల్లా కొనిచ్చాడు. నేను అదే అడిగితే నువ్వుండే పెంట్‌హౌస్ నీకే రాసిస్తాను అన్నాడు. అదీ చెయ్యడం లేదు. నాకీ పెంట్ హౌస్ వద్దు. ఇది అనాథరైజ్డ్. దీనికి విలువలేదు. పది లక్షలకు కూడా ఎవరూ కొనరు. నాకూ విల్లా కొనివ్వు అని అడిగాను. పిల్లా జెల్లా లేరు నీకెందుకే విల్లా అని తిట్టాడండీ. ఏం చేయమంటారు? అందుకే బ్రీఫ్ కేస్ దొంగలెత్తుకెళ్లారని నాటకం ఆడాను. నాకు తెలుసు, అందులో యాభై లక్షలున్నాయని.’’ తప్పు ఒప్పుకుంటూ చెప్పింది సింధూరాణి. వాణిశ్రీ -
మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 21–13తో సోనియా చెయా (మలేసియా)పై అలవోకగా గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో గ్రెగోరియా మరిస్కా తున్జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–0తో ఆధిక్యంలో ఉంది. -
అజయ్, సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అజయ్ 7–5, 6–1తో అభిషేక్ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది. ఇతర మహిళల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్ (ఒడిశా)పై, దీక్ష అజిత్ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు శివదీప్ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్ కుమార్ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్ (కర్ణాటక)పై, సాయి శరణ్‌రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్ (ఏపీ)పై, అనికేత్ వెంకట్ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్‌పై, టి. వినయ్ కుమార్ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్ కుమార్‌పై, డి. అఖిల్ కుమార్ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్‌పై, ఆయుశ్ (పంజాబ్)6–2, 6–3తో తరుణ్ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్ (తెలంగాణ)పై గెలుపొందారు. -
సైనా సింధులకు సన్మానం
-
కాళ్లపారాణి ఆరక ముందే..
చింతలపూడి : కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చింతలపూడి మండలం ఫాతిమాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే నూతంకి సింధు (24) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 25న కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జువ్వన రవికిరణ్‌తో ఫాతిమాపురం గ్రామానికి చెందిన నూతంకి సింధుకు నూజివీడులో వివాహం జరిగింది. మరుసటి రోజు 26న సింధు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో భర్త పక్క గదిలో ఉండగా సింధు గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ పి.రాజేష్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ శవ పంచనామా నిర్వహించారు. సింధు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి కాని, అత్తింటి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక సింధు మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పెళ్లిలో నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన సింధు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మనసులోని బాధను తమతో చెప్పినా అర్థం చేసుకుని తీర్చేవారమని ఇలా అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. సింధు మృతితో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సింధు... మళ్లీ శ్రమించి
బర్మింగ్‌హామ్ : ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది. బుధవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) 9–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–19, 21–18తో యుగో కొబయాషి–హోకి టకురో (జపాన్) జంటను ఓడించింది. రెండో స్థానానికి శ్రీకాంత్ గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్‌లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్‌వన్ అవుతాడు. భారత్‌కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో, సైనా 12వ ర్యాంక్‌లో ఉన్నారు. -
అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
-
లక్ష్యం... టాప్ ర్యాంక్
బ్యాడ్మింటన్ సంచలనం సింధు స్పష్టమైన లక్ష్యాలతో ముందడుగు వేస్తోంది. త్రుటిలో చేజారిన ఫలితాలను రాబట్టేందుకు సిద్ధమైంది. ‘రియో’లో చేజారిన స్వర్ణం, గతేడాది ఫైనల్ ఓటములతో టాప్ ర్యాంక్‌ను అందుకోలేకపోయిన ఈ హైదరాబాదీ... మెగా ఈవెంట్లున్న ఈ ఏడాదిని విజయవంతంగా మలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ముంబై: ప్రతిష్టాత్మక ఈవెంట్లున్న 2018లో భారీ విజయాలపై దృష్టి పెట్టింది బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు. ముఖ్యంగా ఈ సీజన్లోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధిస్తానని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం తెస్తానని చెప్పుకొచ్చింది. ఏడాదిలో తప్పనిసరిగా 15 టోర్నమెంట్లు ఆడాల్సిందేనన్న నిబంధన అమలవుతున్న నేపథ్యంలో శారీరక సామర్థ్యానికి ఈ సీజన్ పెద్ద పరీక్షలాంటిదని చెప్పింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఈ తెలుగు తేజం పలు అంశాలపై మీడియాతో ముచ్చటించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఆల్ ఇంగ్లండ్ నుంచి... గతేడాది కీలకమైన టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం వల్ల టాప్ ర్యాంక్కూ చేరువయ్యా. కానీ తుదిపోరులో ఓడిపోవడం వల్ల అగ్రస్థానం అందకుండా పోయింది. ఈ ఏడాది మాత్రం తప్పకుండా నంబర్‌వన్ ర్యాంకు సాధిస్తా. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచే నా ప్రదర్శనకు ‘నంబర్‌వన్’ పట్టుదల కూడా జోడిస్తా. ఏడాది చివరికల్లా టాప్ ర్యాంకులో నిలుస్తా. ప్రతీ టోర్నీ భిన్నమైంది... ప్రతీ టోర్నీ ఒకలాగే సాగదు. నా వరకైతే ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు కఠినమైంది. చాలా సుదీర్ఘంగా సాగింది ఆ మ్యాచ్. ఇలాంటి పోటీల్లో కడదాకా పోరాడాలంటే కేవలం ఫిట్నెస్ ఉంటే సరిపోదు. మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. బీడబ్ల్యూఎఫ్ ఈ ఏడాది నుంచి ప్రతీ ప్లేయర్ 15 టోర్నీలు ఆడాలన్న నిబంధన అమలు చేస్తున్న దృష్ట్యా ఆటగాళ్లకు మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం. పతకం వన్నె మారుస్తా... రియో ఒలింపిక్స్‌లో పోరాడాను. క్వార్టర్ ఫైనల్లో తీవ్రంగా చెమటోడ్చాను. మొత్తానికి పతకం వేటలో నిలిచాను. తుదిపోరులో ఒకదశలో ఆధిక్యంలో నిలిచి పసిడి పతకానికి చేరువైనా... త్రుటిలో చేజార్చుకున్నాను. చిన్నపొరపాట్లతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ (2020)లో మాత్రం అలా కానివ్వను. తప్పకుండా బంగారు పతకం గెలుస్తాను. ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాను. 21 పాయింట్లే ముద్దు... ప్రస్తుతమున్న గేమ్ పాయింట్ల పద్ధతిని మార్చాల్సిన పనిలేదు. 21 పాయింట్లతో ‘బెస్టాఫ్ త్రీ గేమ్స్’ విధానమే బాగుంది. దీనికి బదులు 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్ గేమ్స్’ పద్ధతి తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో మ్యాచ్‌లో పుంజుకునేందుకు చాలా కష్టమవుతుంది. ఐదారు పాయింట్లు వెనుకబడినా... ఇంకా 15 పాయింట్ల దాకా ఉండే ఆటలో ముందంజ వేసే అవకాశముంటుంది. అదే 11 పాయింట్ల పద్ధతిలో ఈ అవకాశం చాలా తక్కువ. -
సైనా ఇంటికి... సింధు సెమీస్‌కి
టాప్ సీడ్ సింధు ఈ సీజన్లో తొలి టైటిల్ దిశగా ఆడుగులు వేస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కథ క్వార్టర్స్‌లో ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి జోడీ సెమీస్ చేరింది. న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బరిలో భారత్ నుంచి సింగిల్స్‌లో సింధు, డబుల్స్‌లో సిక్కి రెడ్డి మిగిలారు. మిగతా వారంతా క్వార్టర్‌ఫైనల్స్‌కే పరిమితమయ్యారు. ఈ ఏడాది తొలి టైటిల్‌పై కన్నేసిన భారత స్టార్, టాప్ సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేసియా టోర్నీ రన్నరప్, నాలుగో సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోనే కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్ పరాజయం చవిచూశారు. శ్రమించిన సింధు... ఈ టోర్నీలో అలవోక విజయాలతో నెగ్గుకొచ్చిన సింధుకు క్వార్టర్స్‌లోనూ అలాంటి ఫలితమే ఎదురవుతుందని తొలి గేమ్‌తో అనిపించింది. కానీ రెండో గేమ్‌లో ఆమె ప్రత్యర్థి బియట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్) నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సింధు ఈ టోర్నీలో తొలిసారి మ్యాచ్ గెలిచేందుకు మూడో గేమ్ వరకు పోరాడింది. చివరకు తెలుగు తేజం 21–12, 19–21, 21–11తో గెలుపొందింది. సెమీఫైనల్లో సింధు... ప్రపంచ మూడో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్)తో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో సైనా 10–21, 13–21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–8, 21–13తో హన్ చెంగ్‌కాయ్–కా తొంగ్ వీ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 13–21తో మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) 21–17, 21–14తో సమీర్ వర్మను ఓడించగా, కశ్యప్‌నకు 16–21, 18–21తో కియావో బిన్ (చైనా) చేతిలో చుక్కెదురైంది. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ మేఘన–పూర్వీషా జంట 10–21, 15–21తో జోంగ్ కొల్ఫన్ – ప్రజోంగ్జయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో, సిక్కి–అశ్విని జంట 17–21, 21–23తో డు యుయి–యిన్హుయ్ (చైనా) ద్వయం చేతిలో కంగుతిన్నాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని జంట 17–21, 11–21తో క్రిస్టియన్సన్–క్రిస్టినా (డెన్మార్క్) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మనూ–సుమీత్ రెడ్డి ద్వయం 19–21, 19–21తో ఫెర్నాల్డి–çసుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడాయి. -
నడక ఇక బస్!
బాల్యం నుంచి నడిచి, నడిచి విసుగెత్తి... ఊరికి బస్సు కోసం 17 ఏళ్ల సింధు పడిన ఆరాటం, చేసిన పోరాటం చివరికి ఫలించింది. ఎంత కష్టపడితే ఫలించిందన్నది ఆమె మాటల్లోనే... చిమ్నాపూర్. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం. మండల కేంద్రానికి సమీప గ్రామం. ఎటు వెళ్లాలన్నా నాలుగైదేళ్ల క్రితం వరకూ కాలి నడకే. ఇప్పుడు తారు రోడ్డు ఉంది. కానీ షేరింగ్ ఆటో కోసం రెండు కిలోమీటర్లు.. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటే మూడున్నర కిలోమీటర్లు.. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా.. అత్యవసరమైనా.. ఆటో కిరాయికి రెండొందలు! ఆ చిన్నారి పాదాలకు ఈ దూరాలు, లెక్కలు ఏవీ తెలియవు. ఊహ తెలిసినప్పటి నుంచి అనుభవంలోకి వచ్చింది ఒక్కటే.. బడికి వెళ్లాలంటే నడవాలి... కాలేజీకి వెళ్లాలన్నా నడవాల్సిందే. ఒంటరి నడకలో బాల్యంలో భయపెట్టే దెయ్యాలు, భూతాలు.. టీనేజ్‌కి వచ్చాక.. ఎవరు వెంట పడతారో.. వేధిస్తారోనని.. అనునిత్యం భయాలు. బస్సు ఉంటే భయం లేకుండా వెళ్లొచ్చు. గతంలో రోడ్డు లేదు కాబట్టి బస్సు రావడం లేదన్నారు. ఇప్పుడు రోడ్డున్నా బస్సు రావడం కుదరదంటున్నారు.. తెగించింది.. మొండికేసింది.. తిండి మానేసింది.. చివరకు ఒక్కొక్కరు కదలివచ్చారు. చివరకు బస్సు కూడా!! మాది సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికి అనుబంధ గ్రామం చిమ్నాపూర్. నాన్న నారాయణరెడ్డిగారి శ్రీనివాస్‌రెడ్డి, అమ్మ సునీత. ఊర్లో కొద్దిపాటి భూమి ఉన్నా పంట పండదు. నాన్న పొద్దునే ప్రైవేటు కంపెనీకి పనికి వెళ్తాడు. అమ్మ గృహిణి, చెల్లి సంగారెడ్డిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ‘కంది’ శిశు మందిర్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా చదువుకున్నా. బడికి వెళ్లాలంటే ఊరు చివర ఉన్న పెద్ద చెరువు కట్ట మీదుగా నడవాల్సిందే. వీలైతే నాన్న వచ్చేవాడు. లేదంటే అటు వైపు వెళ్లేవారితోనో.. కొన్నిసార్లు ఒంటరిగానో నడవాల్సి వచ్చేది. దార్లో ఎదురయ్యే కుక్కలు, పశువులంటే విపరీతమైన భయం. ఐదో తరగతి దాటింది. మళ్లీ ఆరు నుంచి సంగారెడ్డి శిశు మందిర్.. నడక రెండు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు. కుక్కలు కరిస్తే.. రెండుమార్లు ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను. చావు తప్పిందన్నారు. కల్వకుంట మీదుగా నడక తొమ్మిది, పదిలో సాయంత్రం పొద్దుపోయే వరకూ స్పెషల్ క్లాస్‌లు. బస్సు ఉంటే బాగుండు.. నడక తప్పేది.. సమయం కలిసి వచ్చేది.. రోజంతా ఇవే ఆలోచనలు. ఎవరికైనా చెపితే నవ్వుతారేమో.. అమ్మా, నాన్నకు చెపితే చదవలేక సాకులు వెతుకుతుందంటారేమో. గతంలో రోడ్డు లేదు.. ఇప్పుడు తారు రోడ్డు.. అయినా ఆటో అంకుల్ ఊరికి రానంటాడు. రెండు కిలోమీటర్లు నడిచి కందికి వెళ్తే.. మళ్లీ సంగారెడ్డికి రాను పోను 20 రూపాయలు. పోనీ కల్వకుంట మీదుగా సంగారెడ్డికి నేరుగా నడిచి వెళ్తే నాలుగు కిలోమీటర్లు. ఎవరైనా వెంటబడతారని భయం! చిన్నప్పుడు ఒక ఆంటీని చంపి.. ఆ కాల్వలోనే పడేశారు. ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్.. కొద్దిగా పెద్దదాన్నయిన ఫీలింగ్. కలెక్టర్ ఆఫీస్‌కి నడక తొమ్మిది నెలల క్రితం.. అమ్మా నాన్నలకు కూడా తెలియదు.. ఓ సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లా. గవర్నమెంట్ కాలేజీలో పాములు, తేళ్లు వస్తున్నాయి. పక్కనే స్మశానం ఉంది.. అంటూ ఓ విజ్ఞాపన. దాంతో పాటే మా ఊరికీ బస్సు వేయమని మరో అర్జీ. కాలేజీ ఆవరణ శుభ్రం చేశారు. బిల్డింగ్‌కు రంగులు వేశారు. స్మశానం కనబడకుండా గోడ కట్టారు. కానీ ఊరికి బస్సు వేస్తామని చెప్పరేం? అసహనం.. దుఃఖం. అర కిలోమీటరు నడక తప్పుతుందని.. సెకండ్ ఇయర్లో ప్రైవేటు కాలేజీకి. ఇప్పుడు నాతో పాటు చెల్లి కూడా సంగారెడ్డి కాలేజీకి.. ఒకరికి ఒకరం తోడు.. అయితే కంది.. అక్కడ నుంచి ఆటో.. లేదంటే కల్వకుంట మీదుగా నడక. బస్సు కోసం నడక జనవరి 2. కాలేజీకి వెళ్లలేదు. అమ్మ సంగారెడ్డి హాస్పిటల్లో చెకప్ కోసం వెళ్లింది. బాల్యం గుర్తొస్తోంది.. నడక.. దాని చుట్టూ ముడిపడ్డ అనుభవాలు, జ్ఞాపకాలు, భయాలు. ఇంట్లో ఉండాలనిపించడం లేదు. సంగారెడ్డి కొత్త బస్టాండు వద్దకు వెళ్లా. వెంట తీసుకెళ్లిన బ్లేడుతో చేయి కోసుకున్నా. రక్తం కారుతోంది.. ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత అసలు పోలీసులు.. ఎందుకు చేశావని గదమాయిస్తున్నారు. అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఊరికి బస్సు కావాలి అన్నాను. పిచ్చిది.. మెంటల్.. అని కామెంట్లు. అయితే స్టేషన్‌కు నడువు.. హుంకరింపు. నా మొండితనం చూసి సంగారెడ్డి డీఎం ఉమా మహేశ్వర్ స్టేషన్‌కు వచ్చిండు. ఐదు రోజుల్లో బస్సు వస్తుందని హామీ. నాన్న వచ్చిండు.. కట్టు కట్టించి ఇంటికి తీసుకుపోయిండు. ఐదు రోజులు.. అన్నం సహించదు.. నీళ్లు తాగబుద్ది కాదు.. ఊర్లో ఎవరికీ పట్టనిది.. నీకెందుకు? చదువుకో.. బాగుపడు.. కన్నందుకు మమ్మల్ని గోస పెట్టకు.. అమ్మా నాన్న హితబోధ, వేడుకోలు.. ఒక రకంగా నిర్బంధం.. వాళ్లకేం.. తెలుసు నడకంటే నాకెంత నరకమో! బస్సు వేయలేదని నడక ఐదు రోజులైనా హామీ ఇచ్చినోళ్లు అడ్రస్ లేరు. అవమానం అనిపించింది. అమ్మా నాన్న వద్దన్నా.. ఊర్లో హనుమాండ్ల గుడికాడ కూర్చున్నా. ఐదు రోజులు.. పది రోజులు.. ఊర్లో వాళ్లు వస్తున్నరు.. మంచి పని చేస్తున్నవన్నరు. నాకు ఇవేమీ పట్టడం లేదు. బస్సు ఎందుకు వేయరు.. ఇదే నా ఆలోచన.. ఆవేదన. పేపర్లలో అప్పుడప్పుడూ నా గురించిన చిన్న వార్తలు. ఆరోగ్యం దెబ్బతింది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయిండ్రు. ఈమె బతకదు.. గాంధీకి తీసుకెళ్లమన్నరు.. బస్సు వస్తేనే ఏదైనా అని తెగేసి చెప్పిన. ఐసీయూలో పెట్టిన్రు. బస్సును చూసేందుకు నడక జనవరి 24. మా ఊరికి ఎంపీటీసీ కృష్ణగౌడ్ వచ్చిండు. డీఎం వచ్చిండు.. ఇంకెవరెవరో ఉన్నరు.. ‘రేపు మీ ఊరికి బస్సు వస్తుంది.. ఎమ్మెల్యే చెప్పమన్నడు’ అన్నరు. నాకు నమ్మకం లేదు.. అయినా ఏదో మూలన సంతోషం. రాత్రికి ఇంటికి వెళ్లిన. తెల్లారేసరికి ఊర్లో నా ఫొటోతో ఫ్లెక్సీ! బస్సు వచ్చింది. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వచ్చిండు. దండ వేసి.. నాతోనే రిబ్బన్ కట్ చేయించిండు. అందరం సంగారెడ్డికి వచ్చి.. మళ్లా బస్సులోనే వెనక్కి వచ్చినం. ఇప్పుడు బస్సు వస్తోంది... కానీ టైం ఇదని చెప్పలేం. పరీక్షలు దగ్గరకు వస్తున్నయి. పోయినేడు నడక టెన్షన్‌తో ఇంగ్లీషులో ఫెయిలైన. ఇప్పుడు చదువుకోవాలే.. పాస్ కావాలే.. వాళ్లు మాట నిలబెట్టుకుంటరనే అనుకుంటున్న. ఊరికి రోజూ బస్సు వస్తే.. ఇంకా బాగా చదువుకుంట. – కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ఊరికి బస్సు సౌకర్యం కావాలని..
-
వైవిధ్యంగా...
విజయ్‌భాస్కర్‌రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కార్తిక’. కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై మచెందర్ నట్టల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. కొత్త పరశురామ్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ్భాస్కర్రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా పూర్తి న్యాయం చేసాడు’’ అన్నారు. ‘‘పరశురామ్ నాకు చెప్పిన కథను అలానే తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం బాగా వచ్చింది. మా టీమ్‌కి మంచి పేరొస్తుంది. త్వరలో పాటలు రిలీజ్ చేసి ఆ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత మచెందర్ నట్టల. అజయ్‌ఘోష్, రూలర్ రఘు, ప్రీతి, ప్రియ కోల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, కెమెరా: వల్లి ఎస్కె, సంగీతం: సుభాష్ ఆనంద్. -
బాక్సింగ్‌లో బేబి కిక్
బాక్సింగ్.. మగాళ్లే భయపడే ఆట.. బరిలోకి దిగి పంచ్‌లు విసరడం అంత సామాన్యం కాదు.. ఎంతో ఆత్మవిశ్వాసం అవసరం. ఇప్పుడా క్రీడలో తెనాలి అమ్మాయి తెగువ చూపుతోంది. అతి స్వల్ప కాలంలోనే రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచి, బంగారు పతకాన్ని సాధించింది. జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ‘దెబ్బలు తగులుతాయి కదా’ అని ప్రశ్నిస్తే, ‘దెబ్బ కొడితేనే మనకూ పాయింట్లొస్తాయి.. అదే ఈ గేమ్‌లో కిక్’ అంటున్న బేబి సింధును ‘సాక్షి’ పలకరించింది. తొలి కిక్‌తోనే బంగారు పతకం.. తన పేరు బేబి సింధు. పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శారద, ఆర్టీసీ హైర్డ్ ప్రైవేటు బస్ డ్రైవర్ బి.కృష్ణకిషోర్ల కుమార్తె. ఈనెల 13, 14, 15 తేదీల్లో విశాఖపట్టణంలో నిర్వహించిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ క్రీడల పోటీల్లో విమెన్స్ బాక్సింగ్‌లో అండర్–17, 63–66 కిలోల విభాగంలో పోటీ పడింది.రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా పాల్గొన్న పోటీలోనే తన పంచ్ అదిరింది. ప్రథమస్థానం సాధించి, బంగారు పతకాన్ని గెలుచుకుంది. హరియాణలో నవంబరు 2–10 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళల బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి పతకం సాధించాలనే ఆశయంతో జోరుగా సాధన చేస్తోంది. బాక్సింగ్ కోసం ఆర్ట్స్ గ్రూపు.. స్థానిక వివేక పబ్లిక్ స్కూలు నుంచి పదో తరగతిలో 8.7 జీపీఏతో ఉత్తీర్ణురాలైన సింధు ప్రస్తుతం గుంటూరు ఏసీ కాలేజిలో జూనియర్ ఇంటర్ చదువుతోంది. పదో తరగతి పరీక్షలైన వెంటనే గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బాక్సింగ్ సాధన ఆరంభించింది. ఆషామాషీ సాధన కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనేది ఆశయం. ‘సైన్స్, మేథ్స్ గ్రూపులు తీసుకుంటే, చదువుకూ సమప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. చదువుకు ఎక్కువ సమయం ఇవ్వటం సాధ్యంకాదన్న అభిప్రాయంతో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నా’నని చెప్పింది. ప్రేరణ అన్నయ్య విశాల్.. డిగ్రీ చేస్తున్న అన్నయ్య విశాల్ తనకు స్ఫూర్తి. చదువుకుంటూ బాక్సింగ్ సాధన చేస్తుండే విశాల్‌ను, దెబ్బలు తగులుతాయనే భావనతో తల్లిదండ్రులు ప్రోత్సహించే వారు కాదు. అలాంటిది బేబి సింధును అనుమతించటం విశేషం. బాక్సింగ్ ప్రాధాన్యం, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందనీ నచ్చజెప్పటంతో తల్లిదండ్రులు ఇద్దరికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో అన్నాచెల్లెళ్లు నచ్చిన కోర్సులో చేరి, అటు సాధనకు, ఇటు చదువుకు సమయాన్ని సర్దుబాటు చేసుకున్నారు. రోజూ 5 గంటలపైగా సాధన.. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగింటికి లేచి సిద్ధమై ఐదు గంటల బస్సుకు గుంటూరు చేరుకుంటారు. అక్కడ బీఆర్ స్టేడియంలో శిక్షకుడు హనుమంతు నాయక్ దగ్గర 6 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ. తరువాత కాలేజి, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ, సాధన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. హెచ్ఈసీ గ్రూపు అయినందున పోటీలప్పుడు కాలేజి అనుమతితో, సాధనకు అధిక సమయం వెచ్చిస్తున్నట్లు సింధు చెప్పింది. ఆత్మరక్షణకూ.. సెప్టెంబరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మహిళల బాక్సింగ్ పోటీలకు బీఆర్ స్టేడియంలోనే ఎంపిక నిర్వహించారు. అక్కడ ప్రదర్శనతో రాష్ట్ర పోటీలకు అర్హత లభించినట్లు బేబి సింధు చెప్పింది. ‘ఆత్మరక్షణకు బాక్సింగ్ ఎంతో ఉపయోగం.. ఇష్టంగా సాధన చేస్తే పతకాలు గెలిచే అవకాశం ఉంటుంది’ అనేది ఆమె అభిప్రాయం. అదే ఈ గేమ్‌లో కిక్’ అంటూ సమాధానమిచ్చింది. జాతీయ పోటీల్లో పతకం సాధించి, భారతదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంటులో పాల్గొనాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. -
శ్రీకాంత్, ప్రణయ్ ముందుకు
∙ సింధు, సైనా, సమీర్ ఇంటికి ∙ జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సమీర్ వర్మ ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ పరాజయం చవిచూశారు. అలవోకగా...: వరుసగా మూడో సూపర్ సిరీస్ టైటిల్‌పై దృష్టి పెట్టిన శ్రీకాంత్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ 27వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ కేవలం 29 నిమిషాల్లో గెలుపొందాడు. ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–11తో హు యున్ను ఓడించాడు. హు యున్‌తో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్లు చొప్పున సాధించడం విశేషం. ‘మ్యాచ్ బాగా జరిగింది. హు యున్ ప్రమాదకర ప్రత్యర్థి. అతనికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే నిలకడగా పాయింట్లు సాధించడంపైనే దృష్టి పెట్టాను’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 23–21తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... సమీర్ వర్మ 21–10, 17–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్... షి యుకితో ప్రణయ్ తలపడతారు. ఈసారి ఏకపక్షం...: మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో ఓడిపోయింది. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడోసారి ముఖాముఖిగా తలపడటం విశేషం. ఈ విజయంతో గతవారం కొరియా ఓపెన్ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి ఒకుహారా బదులు తీర్చుకుంది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో 6–2తో ముందంజ వేసిన సింధు ఆ తర్వాత చివర్లో 18–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహారా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకుహారా జోరు పెంచగా... సింధు డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాకపోవడం గమనార్హం. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో, కొరియా ఓపెన్ ఫైనల్లో వీరిద్దరి మధ్య పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు జరగ్గా, ఈసారి అవి అంతగా కనబడలేదు. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 16–21, 13–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో 14–10తో... రెండో గేమ్‌లో 6–4తో ఆధిక్యంలో వెళ్లినప్పటికీ దీనిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది. క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ జోడీ: మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–13, 21–17తో యుకి కనెకో–కొహారు యెనెమోటో (జపాన్) జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్పప్ప (భారత్) జోడీ 27–29, 21–16, 12–21తో నాలుగో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–డెబ్బీ సుశాంతో (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు, సమీర్
∙ సాయిప్రణీత్, కశ్యప్ అవుట్ ∙ కొరియా సూపర్ సిరీస్ టోర్నీ సియోల్: ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లోనూ కొనసాగుతోంది. ఈ భారత బ్యాడ్మింటన్ సంచలనం మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల ఈవెంట్లో సమీర్ వర్మ క్వార్టర్స్ చేరగా... భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 22–20, 21–17తో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థి జిందాపోల్ నుంచి తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో సింధు కాస్త వెనుకబడింది. దీంతో థాయ్‌లాండ్ అమ్మాయి 9–7తో ఆధిక్యంలో నిలిచింది. మరో నాలుగు పాయింట్లు చేసి 13–10తో జోరు కొనసాగించింది. అనంతరం కాసేపటికి 16–14 స్కోరు వద్ద సింధు వరుసగా 6 పాయింట్లు చేసి తొలిసారిగా ఆధిక్యంలోకి వచ్చింది. దీటుగా బదులిచ్చిన జిందాపోల్ కూడా నాలుగు పాయింట్లు చేయడంతో స్కోరు సమమైంది. ఈ దశలో సింధు రెండు పాయింట్లు చేసి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా ఆరంభంలో హోరాహోరీగా సాగడంతో 8–8 వద్ద, 15–15 వద్ద స్కోరు సమమైంది. ఈ క్రమంలో జాగ్రత్తగా ఆడిన తెలుగమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించింది. క్వార్టర్ ఫైనల్లో సింధు... జపాన్‌కు చెందిన మినత్సు మితానితో తలపడనుంది. సమీర్ దూకుడు సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి చాంపియన్ సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21–19, 21–13తో హాంకాంగ్‌కు చెందిన వోంగ్ వింగ్ కీ విన్సెంట్‌పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 16–21, 21–17, 16–21తో సన్ వాన్ మో (కొరియా) చేతిలో కంగుతినగా... సాయిప్రణీత్ 13–21, 24–26తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి 23–21, 16–21, 21–8తో ఏడో సీడ్ లీ జె హుయి–లీ యాంగ్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో భారత జంట...మూడో సీడ్ తకెషి కముర–కెయిగో సొనోడా (జపాన్) జోడీతో తలపడుతుంది. సమీర్ వర్మ... టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)ను ఎదుర్కొంటాడు. -
ఫేవరెట్‌గా సింధు
∙ నేటి నుంచి కొరియా ఓపెన్ ∙ సైనా, శ్రీకాంత్ గైర్హాజరు సియోల్: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్, భారత స్టార్ పూసర్ల వెంకట సింధు కొరియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ ఈవెంట్లో ఆమెకు ఐదో సీడింగ్ దక్కింది. తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్ పోరులో హైదరాబాదీ టాప్ స్టార్ చెంగ్ ఎన్గన్ యి (హాంకాంగ్)తో తలపడనుంది. ఈ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తప్పుకున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ కోసం వీళ్లిద్దరు ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో సన్నద్ధమవుతున్నారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఎన్గ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)తో పోటీపడనున్నాడు. సింగపూర్ ఓపెన్ చాంపియన్ భమిడిపాటి సాయిప్రణీత్ కూడా హాంకాంగ్‌కే చెందిన హు యున్‌తో తలపడతాడు. మిగతా మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ... తనోంగ్సక్ సాన్సోంబూన్సుక్ (థాయ్‌లాండ్)తో, సౌరభ్ వర్మ క్వాలిఫయర్‌తో ఆడనున్నారు. నేడు జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్ తలపడతాడు. డబుల్స్ క్వాలిఫయింగ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం... జాంగ్ వూ చొ–హూ తే కిమ్ (కొరియా) జంటతో పోటీపడనుంది. -
‘సింధు’ వదనం చిన్నబోవద్దు
అద్భుతం ఆ పోరాటం...అసాధారణం ఆ ప్రదర్శన... అయితే ఆటలో క్రూరత్వం కూడా దాగి ఉంటుంది... అది మీ శ్రమను, చిందించిన చెమటను లెక్కలోకి తీసుకోదు. ప్రపంచాన్ని జయించాలంటే పడ్డ కష్టం పాయింట్ల రూపంలోనే కనిపించాలి. తుది ఫలితంలో చాంపియన్ ఒక్కరే కనిపిస్తారు. అలా చూస్తే సింధుకు ఇది పరాజయం కావచ్చు! కానీ 110 నిమిషాల పాటు కోట్లాది మంది అభిమానులను మునివేళ్లపై నిలబెట్టించగలిగిన ఆట అది. కోర్టులో ఆమె కదలికలకు ఫిదా అయిపోయిన క్షణాలు అవి. స్మాష్, డ్రాప్, ర్యాలీ... ఏదైతేనేం ఆమె చూపించిన ఆటకు జయహో అనకుండా ఉండగలమా? ‘రియో’ ఒలింపిక్ వేదికపై రజతంతో మురిపించిన మన సింధూరం ఈసారి మరో ప్రపంచ వేదికపై బంగారాన్ని అందుకునేందుకు చూపించిన పట్టుదలకు సలామ్ చేయకుండా ఆగిపోగలమా? ఆమె ఓటమి మనల్ని బాధించడం లేదు. ఎందుకంటే ఆమె ఒక్కో పాయింట్ సాధించిన తీరు గెలుపుతో సమానమైన సంతృప్తిని ఇచ్చింది. సింధు ఓడిపోయిందనే మాటను చెప్పేందుకు కూడా మనకు మనస్కరించడం లేదు. ఈ మ్యాచ్‌లో స్వర్ణాన్ని కోల్పోయినా... షటిల్ ప్రపంచంలో ఆమె ఎప్పటికీ మన బంగారు బాలికనే. సరిగ్గా ఏడాది క్రితం రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారతీయులందరి మనసు దోచుకుంది. ఆ వెంటనే సన్మానాలు, సత్కారాలు, కోట్ల రూపాయల కనకాభిషేకం, బ్రాండింగ్ బంధాలు... ఒక్కటేమిటి, సంవత్సరం వ్యవధిలో ఇలాంటివన్నీ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సాధారణంగా అయితే ఒక 22 ఏళ్ల ప్లేయర్ ఇలాంటి వాటి మాయలో ఆదమరిచి ఆటను కూడా వెనక్కి పంపే ప్రమాదం చాలా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిన క్రీడాకారులు ఎందరికో చరిత్ర సాక్షిగా నిలిచింది. ఒక ఒలింపిక్ పతకంతో జీవిత కాలపు ఆనందాన్ని అనుభవించి అంతటితో సంతృప్తి చెందే అల్ప సంతోషులు కూడా ఎందరో ఉంటారు. కానీ సింధులో గొప్పతనమంతా ఇక్కడే కనిపించింది.ఆమెపై ఎన్ని ప్రశంసలు ముంచేసినా... తను ఆటను మాత్రం అంతే అపురూపంగా చూసుకుంది. అందుకే ఎక్కడా తను ఆగిపోలేదు. ఒలింపిక్స్‌లో విజయం తర్వాత కూడా మూడు ప్రతిష్టాత్మక టోర్నీలలో విజేతగా నిలిచి తన ప్రాధాన్యాలేమిటో ఆమె చూపించింది. ముందుగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ గెలిచిన సింధు... ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో, సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది. ‘రియో’ నుంచి మొదలైన జోరును గ్లాస్గోలో ప్రపంచ విజేతగా ముగించాలని ఆమె కలగంది. దురదృష్టవశాత్తూ అది స్వర్ణ తీరం చేరలేకపోయినా... ఆమె స్థాయిని మరింత పెంచింది. ప్రిక్వార్టర్స్‌లో మినహా... ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత కూడా కోచ్ పుల్లెల గోపీచంద్ సంతృప్తి చెందలేదు. మనమేంటో ప్రపంచం గుర్తించాలంటే ప్రపంచ చాంపియన్ కూడా కావాలి అంటూ ఆయన తన ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా చెప్పారు. అదే లక్ష్యంగా సింధును సిద్ధం చేశారు కూడా. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అలవోకగా నెగ్గిన సింధు, రెండో మ్యాచ్‌లో తడబడింది. తొలి గేమ్‌ను కోల్పోయి, చివరకు చచ్చీ చెడి మ్యాచ్ గెలుచుకుంది. బహుశా ఇదే ఆమెలో పట్టుదల పెంచింది. తన అసలు సత్తా ఏమిటో ఆమెకు మరోసారి గుర్తు చేసింది. ఫలితం... తర్వాతి రెండు మ్యాచ్‌లలో సింధు ప్రత్యర్థులకు ఏడుపొక్కటే తక్కువ! క్వార్టర్ ఫైనల్లో 21–14, 21–9 సున్ యు (చైనా)పై... సెమీస్‌లో 21–13, 21–10తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. సరిగ్గా చెప్పాలంటే తన ఆటతో ఆమె వారందరినీ తొక్కేసింది! ఇదే ఊపులో ఫైనల్‌కు కూడా సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన చూస్తే తుది పోరులో కూడా అందరూ అదే అద్భుతాన్ని ఆశించారు. అయితే ప్రాణం ఒడ్డి పోరాడిన తర్వాత చివరకు రెండో స్థానం తప్పలేదు. ఆగిపోవద్దు... 2013లో తొలిసారి సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నప్పుడు అభిమానులకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. సైనా నెహ్వాల్ హవా సాగుతున్న ఆ సమయంలో సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచిన 18 ఏళ్ల అమ్మాయి గురించి కొత్తగా చర్చ మొదలైంది. తర్వాతి ఏడాది మరోసారి అదే పతకం గెలుచున్నప్పుడు సింధును సత్తా ఉన్న షట్లర్‌గా ప్రపంచం గుర్తించింది. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన ఈ తెలుగమ్మాయి రెండేళ్లలోనే ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకొని తన విలువను ప్రదర్శించింది. ఈ మధ్యలో సూపర్ సిరీస్‌లు, గ్రాండ్‌ప్రి గోల్డ్‌లలో సంచలన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫైనల్లో సింధు ఓటమిలో అలసట కూడా ఒక కారణంలా కనిపించింది. అద్భుతమైన ఫిట్నెస్ ఉన్నా మ్యాచ్ ఆఖరి క్షణాల్లో ఆమె కాస్త బలహీనంగా మారిపోయింది. ఇవాళ విజయం దక్కకపోవచ్చు... కానీ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రతీ ఏటా ఆమె ముందుకు వచ్చే అవకాశం. ఈ తరహా ఆట ఆమెకు చాంపియన్ అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని చూపించింది. కాబట్టి సింధుకు స్వర్ణం సుదూర స్వప్నం మాత్రం కాబోదు! – సాక్షి క్రీడా విభాగం -
సింధు శ్రమించి...
►క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ►శ్రీకాంత్, సైనా ముందుకు.. సాయి ప్రణీత్ అవుట్ ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింధు ప్రిక్వార్టర్స్ ప్రత్యర్థి ఎన్గాన్ యి చెయుంగ్. ఈ హాంకాంగ్ అమ్మాయిపై గతంలో మూడు సార్లు అలవోక విజయం సాధించిన రికార్డు సింధుది. ఆమె ఫామ్ దృష్ట్యా ఈసారి కూడా అదే ఫలితమని భావించినా... మ్యాచ్ మాత్రం మరోలా సాగింది. ఎన్గాన్ పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ తుదికంటా హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు ఒక దశలో రెండో గేమ్‌లోనూ వెనుకబడింది. చివరకు తన అనుభవాన్నంతా రంగరించి మ్యాచ్‌లో నిలిచిన తెలుగమ్మాయి, మూడో గేమ్ విజయంతో గట్టెక్కింది. గ్లాస్గో: అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పీవీ సింధు ఆపసోపాలు పడింది. సులువైన ప్రత్యర్థితో తలపడుతూ కూడా ఓటమి దిశగా వెళ్లినట్లు కనిపించింది. అయితే చివరకు తన అసలు సత్తాను ప్రదర్శించి కీలక సమరంలో విజయాన్ని అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సింధు 19–21, 23–21, 21–17తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. మరో వైపు సైనా నెహ్వాల్ అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 13వ సీడ్ అజయ్ జయరామ్, 15వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. అజయ్ 11–21, 10–21తో ఐదో సీడ్ చెన్ లాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా, సాయిప్రణీత్ 21–19, 10–21, 12–21తో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతిన్నాడు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సివచ్చింది. 13వ సీడ్ ఎన్గాన్ ఆరంభం నుంచి పట్టుబిగించడంతో పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌ను హాంకాంగ్ ప్లేయర్ వశం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ తన దూకుడు పెంచడంతో సింధు 13–16తో వెనుకంజలో నిలిచింది. ఈ దశలో సర్వశక్తులు ఒడ్డి నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. ఐతే చెయుంగ్ కూడా దీటుగా పాయింట్లు సాధిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది చివరకు 21–21 వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న హైదరాబాదీ స్టార్ నిర్ణాయక మూడో గేమ్‌లో మొదటి నుంచి జాగ్రత్తగా ఆడింది. నెట్ వద్ద చురుగ్గా స్పందించిన ఆమె స్మాష్‌లతో రాణించింది. 5–1తో టచ్‌లోకి వచ్చిన ఆమె 12–8 స్కోరు వరకు ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో ఎన్గాన్ వరుసగా 4 పాయింట్లు చేసి 12–12తో స్కోరును సమం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన సింధు వరుసగా మూడు పాయింట్లు చేసి జోరు పెంచింది. 21–17తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది. మరో ప్రి క్వార్టర్స్‌లో 12వ సీడ్ సైనా 21–19, 21–15తో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–18తో 14వ సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. వరుస గేముల్లో 42 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో కాసేపు మాత్రమే పోటీనిచ్చిన డెన్మార్క్ ఆటగాడు ఆ తర్వాత తేలిగ్గానే చేతులెత్తేశాడు. 5–6తో ఉన్న శ్రీకాంత్ వరుసగా 6 పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వచ్చాడు ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవకాశం రాని హైదరాబాద్ ఆటగాడు నిమిషాల వ్యవధిలో గేమ్‌ను ముగించాడు. తర్వాత రెండో గేమ్‌లో రెట్టించిన ఉత్సాహాన్ని కనబరిచిన అతను 11–3తో ఆధిపత్యాన్ని చాటాడు. అయితే ఆంటోన్సెన్ వరుసగా ఆరు పాయింట్లు సాధించి నిలువరించే ప్రయత్నం చేసినా... శ్రీకాంత్ నెట్‌వద్ద తెలివిగా ఆడి పైచేయి కొనసాగించాడు. చివరి దాకా ఆధిక్యంలోనే నిలిచిన ఈ ప్రపంచ పదో ర్యాంకర్ 21–18తో గేమ్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో 15వ సీడ్ సిక్కిరెడ్డి– ప్రణవ్ చోప్రా ద్వయం 22–20, 18–21, 18–21తో ఆరో సీడ్ డెబ్బి సుశాంటో–ప్రవీణ్ జోర్డాన్ జంట చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... టాప్‌సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో, మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు... ఐదో సీడ్ సన్ యూ (చైనా)తో, గిల్మోర్ (స్కాట్లాండ్), బింగ్ జియావో (చైనా) మ్యాచ్ విజేతతో సైనా తలపడుతుంది. -
మిషన్ ‘గ్లాస్గో’
∙ ఆశల పల్లకిలో శ్రీకాంత్, సింధు ∙ నేటినుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గ్లాస్గో (స్కాట్లాండ్): ఈ సంవత్సరంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరుపులు మెరిపిస్తున్నారు. కిడాంబి శ్రీకాంత్ వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించగా... సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్‌ను... సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పీవీ సింధు సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో చాంపియన్ అయింది. వేదిక ఏదైనా, టోర్నీ స్థాయి ఏదైనా భారత క్రీడాకారులు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి దృష్టి భారత క్రీడాకారులపైనే కేంద్రీకృతమై ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఏకంగా 22 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 21 మందిని ఎంపిక చేసినా... మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజక్తా సావంత్ మలేసియా ప్లేయర్ యోగేంద్రన్ కృష్ణన్‌తో కలిసి విడిగా పోటీపడనుంది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్ సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్తో; పాబ్లో అబియాన్ (స్పెయిన్)తో సమీర్ వర్మ తలపడతారు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు ఒకే పతకం వచ్చింది. 1983లో ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సాధించారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్లో ‘బై’ లభించడంతో వీరిద్దరూ నేరుగా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ తొలి రౌండ్లో ఐరీ మికెలా (ఫిన్లాండ్)తో; చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)తో తన్వీ లాడ్ పోటీపడనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను లెక్కలోకి తీసుకుంటే ఈసారీ భారత్‌కు సింగిల్స్ విభాగంలో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబుల్స్ విభాగంలో మాత్రం అంతగా అంచనాలు లేవు. ఒకవేళ డబుల్స్‌లో ఏదైనా పతకం వస్తే అది బోనస్ అవుతుంది. పతకాలే... ప్రైజ్‌మనీ లేదు... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే అన్ని స్థాయి టోర్నమెంట్లలో ప్రైజ్‌మనీ ఉంటున్నా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం పతక విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వరు. సెమీఫైనల్‌కు చేరిన వారికి కాంస్య పతకాలు, ఫైనల్లో ఓడిన వారికి రజత పతకాలు, చాంపియన్స్‌కు స్వర్ణ పతకాలు అందజేస్తారు. 1977లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ జరిగింది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1997లో గ్లాస్గోలో జరిగిన ఈ పోటీల్లో భారత్ తరఫున సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్ పోటీపడగా... 20 ఏళ్ల తర్వాత అదే వేదికపై ఆయన భారత జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. భారత జట్టు వివరాలు ∙ పురుషుల సింగిల్స్: కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ. ∙ మహిళల సింగిల్స్: పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్. ∙ పురుషుల డబుల్స్: సుమీత్ రెడ్డి–మనూ అత్రి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్; సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి. ∙ మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ఆరతి సారా సునీల్–సంజన సంతోష్; మేఘన–పూర్వీషా రామ్. ∙ మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప; సాత్విక్ సాయిరాజ్–మనీషా. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్స్‌లో దేదీప్య, సింధు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సాయిదేదీప్య, సింధు జనగాం ముందంజ వేశారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సాయిదేదీప్య 6–3, 1–6, 7–5తో సృష్టి దాస్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, సింధు 6–3, 6–3తో ప్రియాంక (మహారాష్ట్ర)ను ఓడించింది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య, తమిళనాడుకు చెందిన అద్వైత శరవణన్‌తో తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఇస్కా తీర్థ 5–7, 1–6తో శ్వేతా రాణా (ఢిల్లీ) చేతిలో, మౌళిక రామ్ 4–6, 3–6తో అవిష్క గుప్తా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయారు. -
సింధుకు మరో అవార్డు
ముంబై: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు చేరింది. మారుతీ సుజుకి ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సింధు గెలుచుకుంది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. సింధుతో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. తన శిష్యురాలు సింధు చేతుల మీదుగా గోపీచంద్ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రముఖులు సందడి చేశారు. బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్, ప్లేయర్ గుత్తా జ్వాల, ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా, బాక్సర్ ఆమిర్ ఖాన్, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ‘లివింగ్ లెజెండ్’ అవార్డును పొందారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన భారత టెస్టు క్రికెటర్ లోకేశ్ రాహుల్ ‘గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోగా... బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. వీరితో పాటు రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్, దీపా మలిక్లు కూడా అవార్డులను అందుకున్నారు. జూనియర్ పురుషుల హాకీ జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సింధు జనగాం, సాయిదేదీప్య శుభారంభం చేశారు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిదేదీప్య 6–1, 6–2తో అవిష్క గుప్తాపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సింధు 6–3, 6–3తో గాయత్రి శంకర్ (కేరళ)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మౌలిక (ఏపీ) 3–6, 6–2, 7–6 (7/2)తో ఆస్థా (మహారాష్ట్ర)పై, ఇస్కా తీర్థ (ఏపీ) 6–1, 6–2తో ప్రవీణపై, నిధి సూరపనేని 6–0, 6–0తో పూర్వ రెడ్డి, లాస్య పట్నాయక్ 6–2, 7–6తో అద్వైతపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. -
చైనా గోడ దాటుతారా?
సుదిర్మన్ కప్‌లో నేడు భారత్ కీలక పోరు గోల్డ్ కోస్ట్: సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నేడు (శుక్రవారం) రసవత్తర పోరు జరగనుంది. నాకౌట్ దశలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత్, చైనా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. డెన్మార్క్‌తో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది. 28 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధించడం ఇది రెండోసారి. 2011లో క్వార్టర్స్‌లోనే చైనా చేతిలో 1–3తో భారత్‌కు పరాభవం ఎదురైంది. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇండోనేసియాతో పోరులో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో చైనాపై గెలిచి సంచలన విజయం నమోదు చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇది అంత సులువైన పనేం కాదు. ఒలింపిక్ పతక విజేతలు లిన్ డాన్, చెన్ లాంగ్‌లతో చైనా జట్టు పటిష్టంగా ఉంది. అయితే భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్‌కు లిన్ డాన్‌పై గెలిచిన అనుభవం ఉంది. మరోసారి శ్రీకాంత్ అద్వితీయమైన ఆటతీరును ప్రదర్శిస్తే తప్ప అతన్ని కట్టడి చేయలేం. మరోవైపు ఇటీవల కాలంలో చైనా క్రీడాకారులపై ఆధిపత్యం చలాయిస్తోన్న సింధు తన దూకుడును కొనసాగించాలి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం. 5 సింధు, హి బింగ్ జియావో (ప్రపంచ నెం. 7)తో లేదా సున్ యు (ప్రపంచ నెం. 6)తో తలపడే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బింగ్ జియావో చేతిలో సింధు పరాజయం పాలైంది. మరో క్రీడాకారిణి సున్ యు (4–3)కు కూడా సింధుపై మెరుగైన రికార్డు ఉంది. దీంతో సింధు మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని– సాత్విక్ సాయిరాజ్ జోడీలు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి– మను అత్రి ఈ పోరులో రాణించాల్సి ఉంది. -
సింధు సినిమా కూడా...
బ్యాడ్మింటన్ స్టార్‌పై బయోపిక్కు సన్నాహాలు ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్స్‌పై సినిమాలు నిర్మించే సీజన్ ఇప్పుడు నడుస్తున్నట్లుంది! కొన్నాళ్ల క్రితమే పుల్లెల గోపీచంద్‌పై సినిమా తీయనున్నారనే వార్తలు రాగా... సైనా నెహ్వాల్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించనుందనే అధికారిక ప్రకటన వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుపై సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. సింధు ‘బయోపిక్’ను తాను నిర్మిస్తున్నట్లు నటుడు, నిర్మాత సోనూ సూద్ ప్రకటించారు. రియోలో సింధు పతకం గెలిచిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని, అప్పటి నుంచి సింధు జీవిత, కెరీర్ విశేషాలపై తమ బృందం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డట్లు సూద్ వెల్లడించారు. ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సూద్ చెప్పారు. తనపై చిత్రం రానుండటం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ‘నా ప్రయాణంపై సోనూ సూద్ సినిమా నిర్మించాలని నిర్ణయించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. గత ఎనిమిది నెలల శ్రమతో వారు రూపొందించిన స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంది. ఇది కచ్చితంగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతుందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా యువత తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రోత్సహించేలా ఉంటుందని ఆశిస్తున్నా’ అని సింధు స్పందించింది. -
‘టాప్’కు మరింత చేరువలో..ప్రపంచ నంబర్ 2గా సింధు
-
‘టాప్’కు మరింత చేరువలో...ప్రపంచ నంబర్ 2గా సింధు
న్యూఢిల్లీ: తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు మరో చరిత్రకు సిద్ధమవుతోంది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత వరల్డ్ టాప్ ర్యాంక్‌కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. ఈ హైదరాబాదీ సంచలన షట్లర్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో తెలుగు తేజం సింధు రెండో ర్యాంకుకు ఎగబాకింది. తద్వారా సైనా తర్వాత భారత్ తరఫున టాప్–3లో నిలిచిన రెండో క్రీడాకారిణిగా ఘనత వహించింది. ఆదివారం కరోలినా మారిన్ (స్పెయిన్) ను చిత్తు చేసి ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె మూడు స్థానాల్ని మెరుగుపర్చుకుంది. 75,759 రేటింగ్ పాయింట్లతో సింధు రెండో స్థానంలో నిలువగా... టాప్ ర్యాంకులో తై జు యింగ్ (చైనీస్ తైపీ; 87,911) కొనసాగుతోంది. మారిన్ నిలకడగా మూడో స్థానంలోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మలేసియా ఓపెన్‌లో తొలిరౌండ్లోనే నిష్క్రమించిన సైనా (64,279) ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 20వ ర్యాంకులో ఉన్నాడు. భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
-
మిషెల్ ప్రసంగం స్ఫూర్తితో..
► సేవా రంగం వైపు భారతీయ యువతి సింధూ ► ఒబామాకు లేఖ వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు. -
క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ రాకెట్లు సింధు, సైనా నెహ్వాల్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా రెండో రౌండ్ దాటని పూసర్ల వెంకట సింధుతో పాటు, 2015 రన్నరప్ సైనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఒకవేళ వీళ్లిద్దరు క్వార్టర్స్ అడ్డంకిని అధిగమిస్తే... సెమీఫైనల్లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అతను 13–21, 5–21తో ఏడో సీడ్ తియాన్ హౌవే (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 21–12, 21–4తో ఇండోనేసియాకు చెందిన దినార్ ద్యా అయుస్తిన్‌పై అలవోక విజయం సాధించింది. జోరు మీదున్న ఈ హైదరాబాదీ సంచలనం కేవలం అరగంటలోనే ప్రత్యర్థికి ఇంటిదారి చూపించింది. మరో పోరులో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 21–18, 21–10తో ఫ్యాబియెన్ డెప్రిజ్ (జర్మనీ)ని వరుస గేముల్లో ఓడించింది. తొలి గేమ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో 12–8తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సైనా తర్వాత ప్రతిపాయింట్‌కు చెమటోడ్చాల్సి వచ్చినా చివరకు విజయం దక్కింది. -
సింధు ‘సిక్సర్’
సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కైవసం ‘మిక్స్డ్’ చాంప్ సిక్కి రెడ్డి జోడి లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆమె కెరీర్లో ఇది ఆరో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కాగా... సయ్యద్ మోడి టోర్నీలో మొదటిది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో రెండు సార్లు (2012, 2014) రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21–13, 21–14తో గ్రెగోరియా మరిస్క (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. సింధు జోరు ముందు ఆమె ప్రత్యర్థి 30 నిమిషాల్లోనే తేలిపోయింది. గతంలో సింధు మకావు ఓపెన్‌ను మూడుసార్లు, మలేసియా మాస్టర్స్ టోర్నీని రెండుసార్లు గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రన్నరప్‌తో తృప్తిపడ్డాడు. తుదిపోరులో తొమ్మిదో సీడ్ సాయి 19–21, 16–21తో భారత్‌కే చెందిన ఎనిమిదో సీడ్ సమీర్ వర్మ చేతిలో ఓడాడు. ‘మిక్స్డ్’లో విజేతగా నిలిచిన సిక్కిరెడ్డి... మహిళల డబుల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మిక్స్డ్ ఫైనల్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడి 22–20, 21–10తో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటపై గెలిచింది. డబుల్స్‌లో అశ్వినితో జతకట్టిన ఆమె 16–21, 18–21తో కమిల్ల రైటెర్–క్రిస్టియానా పెడెర్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: భారత నంబర్‌వన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, టాప్‌సీడ్ పి.వి.సింధు సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు భమిడిపాటి సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడి కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–16తో అన్సల్ యాదవ్‌పై గెలుపొందగా, సింధు 21–7, 21–12తో లలిత దహియాపై నెగ్గింది. మిగతా మ్యాచ్‌ల్లో శ్రీకృష్ణప్రియ 23–21, 21–19తో ముగ్ధ అగ్రేపై, తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–17, 21–19తో ఐదో సీడ్ అండర్స్ అంటన్సెన్ (డెన్మార్క్)కు షాకిచ్చాడు. 11వ సీడ్ సౌరభ్ వర్మ 21–14, 21–16తో లక్ష్యసేన్‌పై గెలువగా... ఆరో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్‌కి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్స్‌లో హర్షిల్ డాని 21–18, 21–18తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. 8వ సీడ్ సమీర్ వర్మ 21–15, 21–16తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ మను అత్రి–సుమిత్ రెడ్డి జంట 15–21, 21–17, 17–21తో మహ్మద్ ఆరిఫ్–కిమ్ వా లిమ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని జంట 21–7, 21–10తో డింపాల్ హజరికా–సంఘమిత్ర జోడీపై గెలిచింది. -
సింధు, శ్రీకాంత్ ముందంజ
లక్నో: సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మిం టన్ టోర్నీలో తెలుగుతేజాలు సింధు, శ్రీకాంత్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సింధు 21–9, 21–11తో అనుర ప్రభుదేశాయ్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–5, 21–12తో జుల్హెల్మి జుల్కిఫ్లి (మలేసియా)పై నెగ్గాడు. -
ఇద్దరు అమ్మాయిల ప్రేమకి అడ్డు చెప్పడంతో..
కమాన్‌పూర్(కరీంనగర్): ఇద్దరు యువతులు వివాహం చేసుకునేందుకు యత్నించారు. పెద్దలు అంగీకరించకపోవటంతో చెప్పాపెట్టకుండా ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం జూలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ..గ్రామానికి చెందిన శిరీష, రామగిరి మండలం సెంటనరీకాలనీకి చెందిన సింధు గతకొద్ది రోజులుగా చనువుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరూ కనిపించకుండాపోయారు. దీనిపై రెండు కుటుంబాల వారు కమాన్‌పూర్, రామగిరి పోలీస్‌స్టేషన్‌లో వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు ఠాణాల పోలీసులు విచారణ నిర్వహించగా సింధు, శీరీషలు కలిసి వెళ్లినట్లు తేలింది. రెండు నెలల క్రితం సింధు శిరీషలు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ చానల్ కేంద్రానికి వెళ్లారు. ఆ చానల్ నిర్వహకులు ఇద్దరి యువవతుల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, ఇంటికి పంపించారు. అయితే, ఈ నెల 5న శిరీష, సింధు ఇద్దరు కలిసి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. -
ఢిల్లీ ఏసర్స్ జోరు
స్మాషర్స్‌పై 5–2తో గెలుపు చెన్నై పరువు నిలిపిన సింధు పీబీఎల్–2 బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ ధాటికి చెన్నై స్మాషర్స్ తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 5–2తో చెన్నైపై జయభేరి మోగించింది. ఒక్క చివరి మ్యాచ్ మినహా ఆరంభం నుంచి జరిగిన సింగిల్స్, మిక్స్డ్, పురుషుల డబుల్స్ మ్యాచ్‌లన్నీ ఏసర్స్ ఆటగాళ్లే గెలిచారు. ఢిల్లీ 5–0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న దశలో బరిలోకి దిగిన సింధు తమ ట్రంప్ మ్యాచ్‌లో గెలిచి చెన్నై స్మాషర్స్ పరువు నిలిపింది. ముందుగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో జాన్ ఒ జోర్గెన్సన్ (ఢిల్లీ) 10–12, 11–4, 11–6తో టామీ సుగియార్తో (చెన్నై)పై గెలిచాడు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తా జ్వాల (ఢిల్లీ) జోడీ 7–11, 11–4, 11–9తో క్రిస్ అడ్కాక్–సింధు (చెన్నై) జంటను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లోనూ సన్ వాన్ హో (ఢిల్లీ) 12–10, 11–4తో పారుపల్లి కశ్యప్ (చెన్నై)పై గెలుపొందడంతో ఏసర్స్ ఆధిక్యం 3–0కు పెరిగింది. తర్వాత తమ ట్రంప్ మ్యాచ్‌లో ఢిల్లీ పురుషుల డబుల్స్ జంట ఇవనోవ్–సొజోనోవ్ జంట 11–6, 11–6తో క్రిస్ అడ్కాక్–మడ్స్ కోల్డింగ్ (చెన్నై) జోడీని ఓడించింది. దీంతో మరో 2 పాయింట్లు ఏసర్స్ ఖాతాలో చేరాయి. చివరగా జరిగిన చెన్నై ట్రంప్ మ్యాచ్‌లో సింధు 11–6, 11–7తో తన్వీ లాడ్ (ఢిల్లీ)పై గెలిచి చెన్నైకి ఊరటనిచ్చింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవ«ద్ వారియర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. -
సింధును చిత్తు చేసిన కరోలినా
-
మారో మారో మారిన్...
హైదరాబాద్ గెలిచింది.. హైదరాబాదీ ఓడింది ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో సింధు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది. సింధును చిత్తు చేసిన కరోలినా తొలి మ్యాచ్‌లో హంటర్స్ శుభారంభం ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. ఇద్దరు స్టార్ ప్లేయర్ల పక్షం వహించారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగినా... నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం స్పెయిన్ స్టార్ చెలరేగిపోయింది. హంటర్స్ జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఘనంగా ప్రారంభమైన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)–2 టోర్నీలో అందరూ ఆశించిన వినోదం మొదటి మ్యాచ్‌లోనే దక్కింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది. హైదరాబాద్: పీవీ సింధు వర్సెస్ కరోలినా మారిన్... రియో ఒలింపిక్స్ ఫైనల్ తర్వాత వీరిద్దరి మ్యాచ్‌ను భారత గడ్డపై చూడాలనుకున్న మన అభిమానులకు కొత్త సంవత్సరం మొదటి రోజునే ఆ అవకాశం లభించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టోర్నీ రెండో సీజన్లో భాగంగా ఈసారి తమ ఫ్రాంచైజీలు హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తరఫున ఆదివారం వీరిద్దరు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మారిన్ (హంటర్స్) 11–8, 12–14, 11–2 స్కోరుతో పీవీ సింధుపై విజయం సాధించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లీగ్ మ్యాచ్‌లో సింధు చేతిలో ఓడిన మారిన్, మరోసారి తన సామర్థ్యానికి తగిన ప్రదర్శనను కనబర్చడంతో సింధుకు నిరాశ తప్పలేదు. మారిన్ విజయంతో శుభారంభం చేసిన హంటర్స్ చివరకు ఈ పోరులో 4–3 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ప్రతి పోటీలో రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ను తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంటాయి. ‘ట్రంప్’ మ్యాచ్ ల్లో గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. ఇతర మ్యాచ్‌ల్లో మాత్రం ఒక్కో పాయింట్ దక్కుతాయి. మారిన్ గెలుపుతో హైదరాబాద్ హంటర్స్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో (చెన్నై) 11–6, 11–8తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)ను ఓడించాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. చెన్నై స్మాషర్స్ జట్టు మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ అడ్కాక్–గాబ్రిలీ అడ్కాక్ ద్వయం (చెన్నై) 11–7, 11–9తో హోయ్ వా చౌ–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీని ఓడించింది. దాంతో చెన్నై 3–1తో ఆధిక్యంలో వెళ్లింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 6–11, 11–8, 11–6తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (చెన్నై)పై గెలిచాడు. దాంతో చెన్నై ఆధిక్యం 3–2కి తగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ పోరులో బూన్ హెయోంగ్ తాన్–వీ కియోంగ్ తాన్ (హైదరాబాద్) జంట 11–7, 11–8తో కోల్డింగ్–సుమీత్ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకోవడం, విజయం కూడా సాధించడంతో ఓవరాల్‌గా హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మారిన్ దూకుడు... సింధుతో జరిగిన మ్యాచ్‌లో కరోలినా తొలి పాయింట్ సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 4–4 వద్ద చక్కటి డ్రాప్ షాట్లో మారిన్ ముందంజ వేయగా, వెంటనే సింధు కోలుకుంది. అయితే 6–6 వద్ద సమంగా ఉన్న స్థితిలో మారిన్ వరుసగా మూడు పాయింట్లు సాధించింది. సింధు కాస్త పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండో గేమ్‌లో కూడా ముందుగా పాయింట్లు సొంతం చేసుకొని మారిన్ 3–0తో ముందంజ వేసింది. అయితే 2–5తో వెనుకబడి ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా చెలరేగిపోయింది. స్మాష్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేసిన సింధు వరుసగా 5 పాయింట్లు స్కోర్ చేసి 7–5తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఆ తర్వాత పోరు మరింత రసవత్తరంగా మారింది. ఒకరితో మరొకరు పోటీ పడి ప్రతీ పాయింట్ కోసం శ్రమించడంతో స్కోరు సమమవుతూ వచ్చింది. మారిన్ 10–8 వద్ద మ్యాచ్ సొంతం చేసుకునే స్థితిలో నిలిచినా, సింధు పోరాడింది. తనదైన శైలిలో అద్భుతమైన స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు, ఆ తర్వాత గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో మారిన్ ఆట ముందు సింధు సాధారణ ప్లేయర్‌గా మారిపోయింది. ఏకంగా 5–0తో ముందంజ వేసిన తర్వాత ప్రత్యర్థికి మొదటి పాయింట్ ఇచ్చిన మారిన్, తర్వాత కూడా మరో పాయింట్‌నే సింధుకు కోల్పోయింది. మారిన్ షాట్లకు సింధు వద్ద సమాధానం లేకుండా పోయింది. మారిన్ డ్రాప్ షాట్లతో పాటు లైన్ కాల్‌లను కూడా ఆమె సరిగ్గా అంచనా వేయగా... అన్నింటా పొరబడిన సింధు, సరైన రీతిలో స్పందించలేక ప్రేక్షకురాలిగా మారిపోయింది. పీబీఎల్–2లో నేడు హైదరాబాద్ హంటర్స్ గీ అవధ్ వారియర్స్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
స్పోర్ట్స్ క్యాలెండర్ 2017
గత ఏడాది పలు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిపించారు. అదే జోరును కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తొలిసారిగా భారత్ ఫుట్‌బాల్‌లో అండర్–17 విభాగంలో ప్రపంచకప్ నిర్వహించనుంది. ఇంగ్లండ్ వేదికగా భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడనుంది. బ్యాడ్మింటన్‌లో సింధు, సైనా, శ్రీకాంత్ మరిన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయంగా భారత క్రీడాకారులు సందడి చేయనున్నారు.ఈ నేపథ్యంలో 2017లో జరిగే ప్రధాన క్రీడా టోర్నమెంట్ల వివరాలు తెలుపుతూ ‘సాక్షి క్రీడావిభాగం’ అందిస్తోన్న స్పోర్ట్స్ క్యాలెండర్.... క్రికెట్ జనవరి 15: భారత్–ఇంగ్లండ్ తొలి వన్డే (పుణే) జనవరి 19: భారత్–ఇంగ్లండ్ రెండో వన్డే (కటక్) జనవరి 22: భారత్–ఇంగ్లండ్ మూడో వన్డే (కోల్‌కతా) జనవరి 26: భారత్–ఇంగ్లండ్ తొలి టి20 (కాన్పూర్) జనవరి 29: భారత్–ఇంగ్లండ్ రెండో టి20 (నాగ్‌పూర్) ఫిబ్రవరి 1: భారత్–ఇంగ్లండ్ మూడో టి20 (బెంగళూరు) ఫిబ్రవరి 8–12: భారత్–బంగ్లాదేశ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ (హైదరాబాద్) ఫిబ్రవరి 23–27: భారత్–ఆస్ట్రేలియా తొలి టెస్టు (పుణే) మార్చి 4–8: భారత్–ఆస్ట్రేలియా రెండో టెస్టు (బెంగళూరు) మార్చి 16–20: భారత్–ఆస్ట్రేలియా మూడో టెస్టు (రాంచీ) మార్చి 25–29: భారత్–ఆస్ట్రేలియా నాలుగో టెస్టు (ధర్మశాల) ఏప్రిల్ 5–మే 21: ఐపీఎల్–10 సీజన్ (భారత్‌లో) జూన్ 1–18: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ఇంగ్లండ్‌లో) జులై: వెస్టిండీస్‌లో భారత్ పర్యటన (5 వన్డేలు, ఒక టి20) జులై–ఆగస్టు: శ్రీలంకలో భారత్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20) అక్టోబరు: భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన (5 వన్డేలు, ఒక టి20) టెన్నిస్ జనవరి 2–8: చెన్నై ఓపెన్ టోర్నీ జనవరి 16–29: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫిబ్రవరి 3–5: న్యూజిలాండ్‌తో భారత్ డేవిస్ కప్ మ్యాచ్ మార్చి 9–19: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 23–ఏప్రిల్ 2: మియామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఏప్రిల్ 16–23: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 7–14: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 14–21: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 28–జూన్ 11: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జులై 2–16: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆగస్టు 7–13: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 13–20: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఆగస్టు 28–సెప్టెంబరు 10: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అక్టోబరు 8–15: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబరు 30–నవంబరు 5: పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబరు 12–19: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ బ్యాడ్మింటన్ జనవరి 1–14: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జనవరి 17–22: మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (సిబు) జనవరి 24–29: సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో) ఫిబ్రవరి 14–19: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (వియత్నాం) ఫిబ్రవరి 28–మార్చి 5: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (ముల్హీమ్ యాన్ డెర్ రుర్) మార్చి 7–12: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (బర్మింగ్హమ్) మార్చి 14–19: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (బాసెల్) మార్చి 28–ఏప్రిల్ 2: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 4–9: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (కౌలాలంపూర్) ఏప్రిల్ 11–16: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సింగపూర్ సిటీ) ఏప్రిల్ 25–20: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ మే 21–28: సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (గోల్డ్‌కోస్ట్, ఆస్ట్రేలియా) జూన్ 13–18: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (జకార్తా) జూన్ 20–25: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సిడ్నీ) ఆగస్టు 21–27: ప్రపంచ చాంపియన్‌షిప్ (గ్లాస్గో, స్కాట్లాండ్) సెప్టెంబరు 12–17: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్) సెప్టెంబరు 19–24: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (టోక్యో) అక్టోబరు 17–22: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఒడెన్స్) అక్టోబరు 24–29: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (పారిస్) నవంబరు 14–19: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఫుజు) నవంబరు 21–26: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలూన్) డిసెంబరు 13–17: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ (దుబాయ్) హాకీ జనవరి 21–ఫిబ్రవరి 20: హాకీ ఇండియా లీగ్ జూన్ 15–25: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (లండన్) జులై 9–23: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) జూన్ 21–జులై 2: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–1 (బెల్జియం) జులై 8–22: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్–2 (దక్షిణాఫ్రికా) నవంబరు 18–26: మహిళల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (న్యూజిలాండ్) డిసెంబరు 2–10: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (భారత్) రెజ్లింగ్ జనవరి 2–19: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 (భారత్) జనవరి 31–ఫిబ్రవరి 3: డేవ్ షల్ట్ స్మారక టోర్నీ (అమెరికా) మే 10–14: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) జూన్ 15–18: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (చైనీస్ తైపీ) ఆగస్టు 1–6: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఫిన్లాండ్) ఆగస్టు 21–26: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (పారిస్) టేబుల్ టెన్నిస్ జనవరి 26–28: వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ (ఇండోర్, భారత్) ఫిబ్రవరి 14–19: వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ (న్యూఢిల్లీ) మే 3–7: ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ (న్యూఢిల్లీ) మే 29–జూన్ 5: ప్రపంచ చాంపియన్‌షిప్ (జర్మనీ) వెయిట్‌లిఫ్టింగ్ ఏప్రిల్ 3–10: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్) ఏప్రిల్ 22–28: ఆసియా చాంపియన్‌షిప్ (తుర్క్మెనిస్తాన్) జూన్ 16–23: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (జపాన్) జులై 22–30: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (నేపాల్) సెప్టెంబరు 3–9: కామన్వెల్త్ సీనియర్, జూనియర్, యూత్ చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా) నవంబరు 28–డిసెంబరు 5: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (అమెరికా) ఫార్ములావన్ మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) ఏప్రిల్ 9: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 16: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) మే 14: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 11: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 25: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) జులై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్బర్గ్) జులై 16: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జులై 30: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్టావెలోట్) సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబరు 17: సింగపూర్ గ్రాండ్‌ప్రి (సింగపూర్ సిటీ) అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి (కౌలాలంపూర్) అక్టోబరు 8: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) అక్టోబరు 22: యూఎస్ గ్రాండ్‌ప్రి (టెక్సాస్) అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబరు 12: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి (అబుదాబి) ఫుట్‌బాల్ జనవరి 14–ఫిబ్రవరి 5: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (గాబోన్) మే 20–జూన్ 11: ‘ఫిఫా’ అండర్–20 ప్రపంచకప్ (కొరియా) జూన్ 3: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (కార్డిఫ్, వేల్స్) జూన్ 17–జులై 2: ‘ఫిఫా’ కాన్ఫెడరేషన్స్ కప్ (రష్యా) అక్టోబరు 6–28: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్ (భారత్) డిసెంబరు 6–16: ‘ఫిఫా’ క్లబ్ ప్రపంచకప్ (యూఏఈ) బాక్సింగ్ ఆగస్టు 25–సెప్టెంబరు 3: ప్రపంచ చాంపియన్‌షిప్ (జర్మనీ) నవంబరు: ప్రపంచ మహిళల యూత్ చాంపియన్‌షిప్ చెస్ ఫిబ్రవరి 10–మార్చి 5: ప్రపంచ మహిళల నాకౌట్ చాంపియన్‌షిప్ (ఇరాన్) ఫిబ్రవరి 17–28: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–1 (షార్జా) మార్చి 31–ఏప్రిల్ 9: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) మే 1–10: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (ఇరాన్) మే 11–22: ఆసియా పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ (చైనా) మే 11–22: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–2 (రష్యా) జూన్ 16–28: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (రష్యా) జులై 5–16: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–3 (స్విట్జర్లాండ్) సెప్టెంబరు 1–25: ప్రపంచకప్ (జార్జియా) సెప్టెంబరు 16–26: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (ఉరుగ్వే) అక్టోబరు 1–16: ప్రపంచ జూనియర్, అండర్–20 మహిళల చాంపియన్‌షిప్ (ఇటలీ) నవంబరు 15–26: ఫిడే గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ–4 (స్పెయిన్) అథ్లెటిక్స్ మార్చి 26: ప్రపంచ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్ (ఉగాండా) మే 5: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) మే 13: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) మే 27: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా) జూన్ 8: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) జూన్ 15: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో, నార్వే) జూన్ 18: డైమండ్ లీగ్ మీట్–6 (స్వీడన్) జులై 1–4: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (భారత్) జులై 1: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్) జులై 6: డైమండ్ లీగ్ మీట్–8 (స్విట్జర్లాండ్) జులై 9: డైమండ్ లీగ్ మీట్–9 (లండన్) జులై 12–16: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (కెన్యా) జులై 16: డైమండ్ లీగ్ మీట్–10 (మొరాకో) జులై 21: డైమండ్ లీగ్ మీట్–11 (మొనాకో) ఆగస్టు 4–13: ప్రపంచ చాంపియన్‌షిప్ (బ్రిటన్) ఆగస్టు 20: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్హమ్) ఆగస్టు 24: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిచ్) సెప్టెంబరు 1: డైమండ్ లీగ్ మీట్–14 (బెల్జియం) ఆర్చరీ మే 16–21: ప్రపంచకప్ స్టేజ్–1 (షాంఘై, చైనా) జూన్ 6–11: ప్రపంచకప్ స్టేజ్–2 (అంటాల్యా, టర్కీ) జూన్ 20–25: ప్రపంచకప్ స్టేజ్–3 (సాల్ట్‌లేక్ సిటీ, అమెరికా) ఆగస్టు 8–13: ప్రపంచకప్ స్టేజ్–4 (బెర్లిన్, జర్మనీ) అక్టోబరు 15–22: ప్రపంచ చాంపియన్‌షిప్ (మెక్సికో సిటీ) -
బ్యాడ్మింటన్ బ్రహ్మోత్సవం
► రేపటి నుంచి పీబీఎల్–2 ► బరిలో 6 జట్లు ► మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లు ► తొలి రోజే మారిన్‌తో సింధు ‘ఢీ’ బ్యాడ్మింటన్‌లో మళ్లీ వినోదాల పండగొచ్చింది. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో షటిల్‌పై ఉవ్వెత్తున ఎగసిన అభిమానానికి తోడుగా వేర్వేరు వేదికల్లో భారత ఆటగాళ్లు సాధించిన వరుస విజయాలు మరింత ఊపునిచ్చాయి. దాంతో సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మరోసారి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సన్నద్ధమైంది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతున్న సీజన్–2 పీబీఎల్‌తో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రెండు వారాల పాటు ‘బ్యాడీస్’ వినోదం అందించడం ఖాయం. ఇక సింధు, మారిన్ మధ్య జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులకు ఇప్పుడు వారిద్దరి ప్రత్యక్ష పోరును తిలకించే అవకాశం టోర్నీ తొలి రోజే వచ్చింది. హైదరాబాద్‌లో రెండు రోజుల ‘షో’ తర్వాత మరో నాలుగు నగరాలు ముంబై, లక్నో, బెంగళూరు, న్యూఢిల్లీలలో పీబీఎల్ సందడి చేయనుంది. హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో అంచె పోటీలకు రంగం సిద్ధమైంది. రేపు (ఆదివారం) నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం తొలి రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 14 వరకు జరిగే ఈ టోర్నీలో ఫైనల్‌ను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టాప్ షట్లర్లతో పాటు ప్రపంచంలో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో సింధు చెన్నై స్మాషర్స్‌కు... సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ అవధ్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ హైదరాబాద్ హంటర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. మొత్తం 6 జట్లు తలపడుతుండగా, ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి. 2016 జనవరిలో జరిగిన గత పీబీఎల్‌లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. అనివార్య కారణాలతో ఈసారి చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించారు. మారిన ఫార్మాట్... టోర్నమెంట్లో ఇరు జట్ల మధ్య జరిగే ఒక ‘టై’లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల విభాగంలో రెండు సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లలో ఆటగాళ్లు తలపడతారు. గత ఏడాది మూడు గేమ్‌ల పోరులో మూడో గేమ్ మాత్రమే 11 పాయింట్లుగా ఉంది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 11 పాయింట్ల పద్ధతిని పీబీఎల్‌లో వాడుతున్నారు. ప్రసారకర్తల పరిమితుల వల్ల కూడా ఈసారి మూడు గేమ్‌లను కూడా 11 పాయింట్లతోనే నిర్వహిస్తారు. విజేతను తేల్చేందుకు చివర్లో ప్రత్యర్థుల మధ్య కనీసం 2 పాయింట్ల తేడా ఉండాలి. అది 14–14 వరకు సాగుతుంది. అప్పుడు మాత్రం ‘సడెన్ డెత్’గా ముందు ఎవరు స్కోర్ చేస్తే వారిదే గేమ్ అవుతుంది. వేలంలో మారిన్ టాపర్... ఈ టోర్నీ కోసం నవంబర్‌లో వేలం నిర్వహించారు. అందులో అత్యధికంగా రూ. 61.5 లక్షల మొత్తానికి కరోలినా మారిన్‌ను హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. సుంగ్ జీ హున్ (ముంబై)కి రూ. 60 లక్షలు దక్కాయి. శ్రీకాంత్ (రూ. 51 లక్షలు), సింధు (రూ. 39 లక్షలు), సైనా నెహ్వాల్ (రూ. 33 లక్షలు) ఎక్కువ మొత్తం పొందిన భారత షట్లర్లుగా నిలిచారు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకుంటున్న మారిన్, సైనా అంచనాలకు అనుగుణంగా తమ పూర్తి సత్తాను ప్రదర్శించగలరా చూడాలి. భారీ ప్రైజ్‌మనీ... పీబీఎల్‌లో మొత్తం ప్రైజ్‌మనీని రూ. 6 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 కోట్లు లభిస్తాయి. రన్నరప్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీస్ చేరిన రెండు జట్లకు చెరో రూ. 75 లక్షల చొప్పున అందజేస్తారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో పలు సంస్థలు పీబీఎల్‌తో జత కట్టడానికి ఆసక్తి చూపించడం బ్యాడ్మింటన్‌కు పెరిగిన ఆదరణను చూపిస్తుంది. పలు కార్పొరేట్ సంస్థలు టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘బెంగళూరు బ్లాస్టర్స్’ జట్టును సొంతం చేసుకొని తొలిసారి ఈ లీగ్‌లోకి అడుగు పెట్టడం విశేషం. జట్ల వివరాలు హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, రాజీవ్ ఉసెఫ్, టాన్ బూన్ హెంగ్, టాన్ వీ కోంగ్, చౌ హో వా, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, శ్రీకృష్ణప్రియ, జె.మేఘన. ముంబై రాకెట్స్: సుంగ్ జీ హున్, లీ యోంగ్ డే, నిపిత్ఫాన్, నదీనా జీబా, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, చిరాగ్ శెట్టి, మోహితా సహదేవ్, వృశాలి. ఢిల్లీ ఏసర్స్: జాన్ జొర్గెన్సన్, సన్ వాన్ హో, జిందపాన్, ఇవాన్ సొజొనోవ్, వ్లదీమర్ ఇవనోవ్, గుత్తా జ్వాల, కె. మనీషా, అక్షయ్ దివాల్కర్, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. అవధ్ వారియర్స్: సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, మార్కిస్ కిడో, గో షెమ్, బోడిన్ ఇసారా, విన్సెంట్ వాంగ్ వింగ్ కి, ఆదిత్య జోషి, రితూపర్ణ దాస్, ప్రజక్తా సావంత్, సావిత్రీ అమిత్రపాయ్. బెంగళూరు బ్లాస్టర్స్: బూన్సాక్ పొన్సానా, విక్టర్ అక్సెల్సన్, కో సుంగ్ హ్యూన్, యూ యోన్ సోంగ్, చెంగ్ గాన్ యి, సౌరభ్ వర్మ, రుత్విక శివాని, ప్రణవ్ చోప్రా, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, తనోంగ్సక్ సాన్సోమ్బూన్సక్, టామీ సుగియార్తో, క్రిస్ అడ్కాక్, మ్యాడ్స్ కోల్డింగ్, గాబ్రియెల్ అడ్కాక్, రమ్య తులసి, అరుంధతి పంతవానే, సుమీత్ రెడ్డి. ► హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ► పీబీఎల్ తొలి సీజన్ అభిమానులను ఆకట్టుకోగా రెండో సీజన్‌కు అన్ని వైపుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పదేళ్ల కాలానికి టోర్నీ నిర్వహణ కోసం మేం ‘బాయ్’తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా లాభాలు ఆశించడం లేదు. బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగినట్లే ఈ లీగ్‌ను కూడా పెద్ద స్థాయికి చేర్చాలనేదే మా లక్ష్యం. సచిన్‌లాంటి వ్యక్తి లీగ్‌తో జత కలవడం మా నమ్మకాన్ని పెంచింది. ఈ సీజన్లో అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశాం. –స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధి ఎం. ప్రసాద్ ► భారత్‌కు రావడం చాలా బాగుంది. హంటర్స్ అభిమానులు నాకు మద్దతు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా. సింధు కఠిన ప్రత్యర్థి. ఆమె సొంత నగరంలో ఆమెతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. –కరోలినా మారిన్ ► లీగ్‌లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయి. 11 పాయింట్ల ఫార్మాట్‌తో సమస్య లేదు. ప్రతీ పాయింట్ కీలకమే. – పీవీ సింధు -
సెమీస్‌లో సింధు
సమీర్ వర్మ కూడా ముందుకు క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ కౌలూన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో టాప్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్స్‌లో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో గ్జియావు లియాంగ్‌పై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించిన సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను చకచకా గెల్చుకున్న సింధు, రెండో గేమ్‌లో చేజేతులా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్నా... లియాంగ్ వరుస పారుుంట్లతో దూసుకురావడంతో స్కోరు 18-18 వద్ద సమమైంది. ఆ తర్వాత 21-21కి చేరాక సింగపూర్ అమ్మారుు వరుసగా రెండు పారుుంట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో 15-15 వరకు ఇద్దరు సమఉజ్జీలుగా కనిపించినా, కీలక సమయంలో పారుుంట్లతో సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గాయంనుంచి కోలుకున్న తర్వాత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సైనాకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌ల పాటు పోరాడిన ఆమె ఈ సారి తలవంచింది. హాంకాంగ్‌కు చెందిన చుంగ్ గాన్ రుు 21-8, 18-21, 21-19తో సైనాను ఓడించింది. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో సైనా పేలవ ప్రదర్శన కనబర్చింది. అరుుతే కోలుకొని రెండో గేమ్ గెలుచుకోగలిగింది. మూడో గేమ్‌లో ఒక దశలో 11-18తో వెనుకబడింది. అరుుతే పుంజుకున్న సైనా వరుసగా ఏడు పారుుంట్లు కొల్లగొట్టి 18-18తో సమం చేసింది. కానీ చివరకు ప్రత్యర్థిదే పైచేరుు అరుుంది. సైనాను ఓడించి చుంగ్ గాన్‌తో సెమీస్‌లో సింధు తలపడుతుంది. సెమీస్‌లో సమీర్ వర్మ... పురుషుల విభాగంలోనూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించారుు. భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టగా, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 23-21తో ఫెంగ్ చోంగ్ వీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 15-21, 14-21 తేడాతో ఆంగస్ లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. తొమ్మిదో ర్యాంక్‌కు సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్‌సలో పీవీ సింధు తొమ్మిదో ర్యాంక్‌కు చేరగా... సైనా నెహ్వాల్ టాప్-10లోంచి బయటకు వెళ్లింది. గత వారం చైనా ఓపెన్ గెలిచిన సింధు రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ ఏకంగా ఐదు స్థానాలు కోల్పోరుు 11వ ర్యాంక్‌కు చేరింది. -
గుప్త జ్వాల
మనిషిలో ఉన్న ప్రతిభ గుప్తంగా ఎందుకు ఉండాలి? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గోప్యంగా ఎందుకుంచాలి? యజ్ఞంలో అగ్గిలేకపోతే ఎలా? జీవితంలో జ్వాల లేకపోతే ఎలా? ఈ ప్రజ్వలాలన్నీ కాంతినివ్వకపోతే ఎలా? ఈ కీర్తిని మసకబార్చిన వాళ్లపై కోపం ఉండదా? గుత్తా జ్వాలకు కోపం వచ్చింది! గోప్యం లేకుండా మాట్లాడింది! గుప్త జ్వాల ఎగిసిపడింది!! మీ ఆటకు బదులు మీ దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడితే మీకు బాధనిపించదా? మన దేశంలో విషాదం ఏంటంటే.. ఒక స్పోర్ట్స్ ఉమన్ అంటే సరిగ్గా డ్రెసప్ కాకూడదు. మేకప్ వేసుకోకూడదు. అలా వ్యక్తిగత శ్రద్ధ చూపించకపోతేనే వాళ్లు వాళ్ల కెరీర్ పట్ల ఫోకస్డ్గా ఉన్నట్టు లెక్క. ఒక్క స్పోర్ట్సే కాదు.. ఏ కెరీర్‌లోనైనా అంతే. అమ్మాయి కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నట్టు కనపడితే చాలు. ఈజీగా ముద్ర వేసేసారు. మ్యానిక్యూర్, పెడీక్యూర్ లాంటివి పర్సనల్ హైజీన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. కొంచెం బ్రైట్‌గా కనపడితే చాలు... ఫాస్ట్ అంటారు.. యాక్టివ్ అంటారు. సచ్ ఎ హారిబుల్ థింగ్. భవిష్యత్‌లో వాళ్లూ ఆడపిల్లలకు తండ్రులవుతారనే ఆలోచన ఎందుకు రాదో... అర్థం కాదు. మీరేం మాట్లాడినా కాంట్రవర్సీ అంటారు. ఎందుకు? యా... నన్ను, సానియాను కాంట్రావర్సీ క్వీన్స్ అంటారు. కానీ, నేనెప్పుడు కాంట్రవర్సీ చేశానండీ? ఎవరినైనా తిడితే.. కొడితే కాంట్రవర్సీ. మా ైరైట్స్ గురించి మాట్లాడితే కాంట్రావర్సీయా? నేను, ఈవెన్ సానియా.. మేమెప్పుడూ మా హక్కుల గురించే మాట్లాడాం. మన దేశంలో ఇప్పటికీ మనం రైట్స్ గురించి పోట్లాడాల్సిన దుఃస్థితి. హక్కుల గురించి పోరాడే మహిళలపై చాలా తేలికగా ముద్ర వేస్తారు. మీరు ఇతర స్పోర్ట్స్పర్సన్స్కు మద్దతిచ్చినట్టు మీకు వాళ్ల మద్దతు దొరికిందా? ఏ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, నేను సహించను. వాళ్లకు సపోర్ట్‌గా నిలబడతాను. నా విషయంలో వాళ్లు అలాగే స్పందించాలని ఎక్స్పెక్ట్ చేయను. నాతోపాటు నిలబడితే అది నాకు కాదు... వాళ్లకే హెల్ప్ అవుతుంది. వాళ్లు నా కోసం ఫైట్ చేయనప్పుడు వాళ్ల కోసం వాళ్లూ ఫైట్ చేసుకోలేరు కదా! మిగిలిన ప్లేయర్స్‌లా మీకూ ఎంకరేజ్మెంట్ దొరికిందా? టిల్ డేట్ నేను గవర్నమెంట్‌ని డబ్బులు అడగలేదు. ‘పద్మశ్రీ’ అవార్డ్ అడగలేదు. అవి వస్తే వస్తాయి.. అది సెకండరీ.. రెస్పెక్ట్ మాత్రం కోరుకున్నాను. మొన్న ఒలింపిక్స్ నుంచి సింధు వచ్చాక అందరూ ‘వాళ్ల ఫాదర్ ఇంత కష్టపడ్డారు.. అంత కష్టపడ్డారు’ అని అన్నారు. నో డౌట్ దె వర్క్డ్ హార్డ్. బట్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్. స్పోర్ట్స్ పర్సన్స్ అందరి పేరెంట్స్ అంతే కష్టపడ్తారు. కాని సింధుకు దొరికిన సపోర్ట్ ఏంటి? మిగతావాళ్లకు అందిన సపోర్ట్ ఏంటి? అని ఎవరూ ఎందుకు అడగరు? ఈవెన్ సానియా విషయంలో కూడా అంతే కదా... షి హ్యాడ్ జీవీకే స్పాన్సర్స్ ఆల్ ద టైమ్. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. వియ్ నెవర్ గాట్ ఎనీ సపోర్ట్. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు. అయితే ఎవరి సపోర్టూ అందలేదంటారా? హూ సపోర్టెడ్ మి?మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను నా బ్లడ్ ధారపోశా. బాడ్మింటన్‌కు నా లైఫ్ ఇచ్చా. ఐ బికేమ్ నేషనల్ ఛాంపియన్ బై మై ఓన్. ఐ బికేమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. కామన్వెల్త్ గేమ్స్ మెడల్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్... హ్యావ్ డన్ వెల్. నేను పాపులర్ అయింది, ఫేమస్ అయింది నా ఆటతీరుతో, మీడియా సపోర్ట్‌తో. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్‌కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు. అలాగని ఎవరిపై కంప్లయింట్స్ లేవు. ఈరోజు ఎవరు పీఆర్ మెయిన్టైన్ చేయగలరో వాళ్లకే గుర్తింపు. పని మీదే దృష్టిపెట్టే వాళ్లకు ఏ గుర్తింపు లేదు. మా డాడీ చెప్పే ‘యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బాటిల్’ అనే మాట నమ్ముతా.. ఆచరిస్తా! అబద్ధాలు, రూమర్స్ ప్రచారం గురించి? నా గురించి అబద్ధాలు, రూమర్స్ నమ్మడం ఈజీ. మే బీ బికాజ్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఐయామ్ వెరీ టాల్ అండ్ బ్రాడ్ పర్సనాలిటీ. యారగెంట్నని.. నాట్ ఫ్రెండ్లీ అనీ నిర్ధారణకు వచ్చేస్తారు. పైగా, ఐ హ్యావ్ కలర్డ్ మై హెయిర్.. ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం ప్రెజెంటబుల్‌గా కనిపిస్తాను... కాబట్టి నా మీద వచ్చిన రూమర్స్‌ను జనాలు ఈజీగా నమ్మేస్తారు. నమ్మించేలా డర్టీ గిమ్మిక్స్ కూడా ప్లే చేస్తారు. కాని అవి నన్ను హర్ట్ చేస్తాయని, నాకూ ఓ కుటుంబం ఉంటుందని, ఫ్రెండ్స్ ఉంటారని ఆలోచించరు. నిజానికి నాది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రాక్టీస్ తర్వాత ఇంట్లో, రెస్టారెంట్లలో నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ అవాలనుకుంటా... అవుతాను. ఇండిపెండెంట్ విమెన్‌పై మనవాళ్ల వైఖరిపై మీ వ్యాఖ్య? ఉయ్ లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. బట్ ఇన్ ఎ హిపొక్రటిక్ కంట్రీ. ఇండిపెండెంట్ విమెన్ పట్ల మన మైండ్ సెట్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ అనగానే సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అంటారు. దట్ ఈజ్ సచ్ ఎ హోప్లెస్, డర్టీ థింకింగ్. అయామ్ టెల్లింగ్ ఇట్ టుడే... అలా రాంగ్గా ఉండేది ఎక్కువగా మగవాళ్లే. కాని అబ్బాయికి అలాంటి పేరు లేదు. అమ్మాయికి మాత్రం పేరు పెడతారు. విచ్ ఈజ్ రియల్లీ సిక్. షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ థింగ్ లైక్ దట్. మీకు లేనివాటిని మీకు అపాదిస్తున్నట్టు అనిపిస్తోందా? అయామ్ వెరీ వార్మ్ పర్సన్. పీపుల్ లైక్ టు ఎజ్యూమ్. అండ్ దే ఆల్వేజ్ డన్ ఇట్ విత్ మి... చిన్నప్పటి నుంచి. నా గురించి తెలియని వాళ్లు నన్నెందుకు డిస్లైక్ చేస్తారో? నన్ను ఇష్టపడక పోవడానికి వాళ్లకుండే కారణాలు వాళ్లకుండొచ్చు. అది వాళ్ల సొంతం. నాకర్థమైంది ఏంటంటే.. నన్ను ఇష్టపడకపోవడానికి వాళ్ల ఇగో ఓ రీజన్ కావచ్చు. నేను మాత్రం అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాను. ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తాను. అలా పెంచారు మా డాడీ. మీ మ్యారీడ్ లైఫ్...? నేను పెళ్లి చేసుకునే నాటికి అంత పాపులర్ కాదు. ఫేమస్ కాదు. ఐ వజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైమ్. ఆ పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యభర్తలిద్దరిలో ఎవరికీ రిస్ట్రిక్షన్లా ఉండకూడదు. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ గ్రో టుగెదర్. భర్తకు చేదోడుగా భార్య, భార్యకు చేయూతగా భర్తా ఉండాలి. మా విషయంలో అలా జరగలేదు. సమ్‌వేర్ ఐ థాట్ ఉయ్ వర్ నాట్ గ్రోయింగ్.. ఇంకేవో కొన్ని విషయాలు. వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా? ఎందుకు ఉండదు? అయితే నాకు కొంచెం భయం. అంత త్వరగా ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయడంలో చాలా పూర్. మా పేరెంట్స్ ట్రూత్‌ఫుల్‌గా ఉండడమే నేర్పించారు. నా ఈ నేచర్, నా ఎక్స్పిరీయెన్సెస్ వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ యెస్.. పెళ్లి చేసుకునే ఆలోచనైతే ఉంది. కానీ నాకు కావల్సిన మనిషి ఇంకా దొరకలేదు. టాల్‌గా కూడా ఉండాలి (నవ్వుతూ). మీ సినిమా ఎంట్రీ.. ఎక్స్పెక్టెడా? అనెక్స్పెక్టెడా? నితిన్ నాకు మంచి ఫ్రెండ్. మాకు ఓ కామన్ గ్రూప్ ఉంది. ఓ సారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. ‘జ్వాలా! నా మూవీలో యాక్ట్ చేస్తావా?’అని అడిగాడు. నేను అంతే కాజ్యువల్‌గా ‘ఆ చేస్తాను’ అని చెప్పి ఆ విషయం మరిచిపోయా. త్రీ మంత్స్ తర్వాత ‘జ్వాలా! సాంగ్ రెడీ’ అంటూ వచ్చాడు. ఐ వజ్ షాక్డ్. ఆ టైమ్‌లో బాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడట్లేదు. సో చేసేశాను. భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో... ఐ డోంట్ థింక్. ఇప్పటి వరకు నా లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఓ కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లి మళ్లీ అక్కడ స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. ఐ లైక్ చాట్ షోస్. వాటిని హోస్ట్ చేయడం లాంటివైతే ఓకే. ఐ వాంట్ టు టీచ్ యూత్ టు డీల్ విత్ ట్రూత్. కోచ్‌గా మారే అవకాశం ఏమైనా ఉందా? నాకు పేషెన్స్ తక్కువ. సో మంచి కోచ్‌ని కాలేను. అయితే మన దగ్గర కోచ్‌లను గౌరవించే కల్చర్ లేదు. అలాంటి కల్చర్‌ను పెంచాలనైతే ఉంది. గవర్నమెంట్ సహాయంతో విమెన్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేయాలని ఉంది. మన దగ్గర మంచి పనులకు అవకాశాలు త్వరగా దొరకవుగా. ఎన్నాళ్లో నుంచో ప్రయత్నిస్తున్నా. చూద్దాం! ఫ్యూచర్లో ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నారు? పదిహేనేళ్ల కిందట ఉన్న మంచి వాతావరణం.. భద్రతా ఇప్పుడు లేవు. ఆడవాళ్లను గౌరవంగా చూడాలని, వాళ్లనూ మనుషులుగానే పరిగణించాలని మన మగపిల్లలకు నేర్పించట్లేదు. ఐఫోన్ 7 ఉంటేనో, బీఎమ్‌డబ్ల్యూ కారు ఉంటేనో డెవలప్ అయినట్టు కాదు. ఆడవాళ్లు మగవాళ్లతో సమాన గౌరవం పొందగలిగినప్పుడు, ఆమె భద్రంగా ఉండగలిగినప్పుడే ఈ సొసైటీ డెవలప్ అయినట్టు! మా ఇంట్లో అలాంటి ఎట్మాస్ఫియరే ఉంది. మా అమ్మ విషయంలో, మా విషయంలో దేనికీ రిస్ట్రక్షన్స్ పెట్టలేదు మా నాన్న. ఉయ్ నీడ్ మెన్ లైక్ హిమ్. అలాగే ఆడవాళ్లూ సాటి ఆడవాళ్లకి సపోర్ట్‌గా నిలవాలి. ఇది ఇంటి నుంచే మొదలుకావాలి. ఎందుకంటే పిల్లలు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లను గౌరవించే వాతావరణం ఉంటే అదే పిల్లలకూ అలవడుతుంది! రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా? టు డూ సమ్‌థింగ్ గుడ్ యు నీడ్ పవర్.. సో ఐ విల్ సీ. నాలాంటి అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయవేత్తలైనా నాకు అవకాశం ఇస్తే, నేననుకున్నది చేయగల స్వేచ్ఛను ఇస్తే.. డెఫినెట్లీ డు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే అధికారాన్ని ఈ దేశంలోని మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తా! ‘గాంధీ’ కోసం వచ్చాం! డాడీ (గుత్తా క్రాంతి), మమ్మీ (ఎలెన్) మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఒకటే కాలేజ్‌లో చదువుకున్నారు. మా ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ వస్తూ తన వెంట మా మమ్మీని కూడా తీసుకొచ్చారు. అలా కాలేజ్‌లో కలుసుకున్న మమ్మీ డాడీల పరిచయం... ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా మారింది. డాడీ నాగ్‌పూర్‌లో రిజర్వ్‌బ్యాంక్‌లో పనిచేసేవారు. నేను అక్కడే పుట్టాను. నాకు ఓ చెల్లి (ఇన్సీ). నా నాలుగో ఏట హైదరాబాద్‌కి వచ్చాం. పుల్లెల గోపీచంద్‌తో గొడవేంటి? నాకూ తెలియదు. టిల్ డేట్ ఐ రియల్లీ వండర్. నాకొకటే బ్యాడ్ ఫీలింగ్.. ఏంటంటే.. సింగిల్స్‌కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్‌కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు.. వై? వాట్ ఈజ్ ద రీజన్? గివ్ మి వన్ రీజన్ అని అడుగుతున్నా. ఇఫ్ హి కెన్ మేక్ సింధూ.. కెన్ మేక్ అనదర్ డబుల్స్ ఛాంపియన్.. మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్.. విమెన్ డబుల్స్ ఛాంపియన్. ‘ఐ వజ్ వరల్డ్ నంబర్ 6... యు డోంట్ వాంట్ టు గివ్ మి ఎనీ రెస్పెక్ట్.. ఫైన్! ఎంకరేజ్ ది అదర్ డబుల్స్.. వై నాట్?’ ఇది మాట్లాడ్డానికి చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు. నా విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా. నితిన్ క్లోజ్... ఐ లవ్ ప్రభాస్... నాని కూడా ఇష్టం..! వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ రెండూ ఇష్టపడతా. చీరలంటే చాలా ఇష్టం. సిన్మాలు బాగా చూస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ! తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఐ హ్యావ్ మెట్ ప్రభాస్ వన్స్ ఆర్ ట్వయిస్. హి ఈజ్ సో టాల్ ఆల్సో. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా! (నవ్వు) - సరస్వతి రమ -
క్వార్టర్ ఫైనల్లో సింధు
జయరామ్ కూడా... చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫుజౌ (చైనా): భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సింధు 18-21, 22-20, 21-17తో బెవెన్ జంగ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్ ఆరంభంలో సింధు ఒక దశలో 11-7తో ఆధిక్యంలో నిలిచింది. అరుుతే అమెరికన్ ప్రత్యర్థి వరుసగా పారుుంట్లు సాధించి 13-13తో స్కోరును సమం చేసింది. అదే జోరుతో ఆమె 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా పారుుంట్లు సాధించి గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధుకు ఓడినంత పనైంది. మొదట 8-0తో ఆధిక్యం పొందినప్పటికీ తర్వాత జంగ్... సింధుకు అవకాశమివ్వకుండా రెచ్చిపోరుుంది. 16-16తో స్కోరును సమం చేసి అనంతరం 19-17తో ఆధిక్యంలోకి వచ్చింది. అరుుతే సింధు ఐదు పారుుంట్లు సాధించి గేమ్‌ను కై వసం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ బెవెన్ జంగ్ పట్టుదలను ప్రదర్శించినప్పటికీ సింధు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించింది. తదుపరి క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 20-22, 21-19, 21-12తో వే నాన్ (హాంకాంగ్)పై కష్టపడి గెలిచాడు. క్వార్టర్స్‌లో జయరామ్‌కు ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో భమిడిపాటి సారుుప్రణీత్ 16-21, 9-21తో మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ) చేతిలో, హెచ్.ఎస్.ప్రణయ్ 17-21, 19-21తో కియావో బిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
‘టోక్యో’లో సింధు స్వర్ణం నెగ్గాలి
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్ష హైదరాబాద్: ఫిలింనగర్ దైవసన్నిధానం సాక్షిగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకంతో తిరిగి రావాలని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన పీవీ సింధును ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆయన ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింధు కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవద్దని బంగారు పతకం సాధించి ప్రపంచం గర్విం చదగ్గ క్రీడాకారిణిగా ఎదగాలన్నారు. రియో ఒలింపిక్స్ ముందు దైవసన్నిధానంలో సింధుకు పతకం రావాలని కోరుకుంటూ కుంభాభిషేకం చేయడం జరిగిందని, దేవుడు అనుగ్రహించాడని తెలిపారు. కేవలం దైవభక్తి ఉంటే సరిపోదని గురుభక్తి కూడా కావాలని... గోపీచంద్ గురువుగా సింధు ఆయన మార్గంలో నడిచి ఈ పతకాన్ని సాధించిందన్నారు. గోపీచంద్‌తో తనకు ఐదేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. సింధుకు పతకం రావడానికి గోపీచంద్ ఎంత కారణమో తన వద్దకు చాముండేశ్వరీనాథ్ ఆమెను తీసుకొచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, చాముండేశ్వరీనాథ్, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటిన రోజా
గాయపడ్డ మహిళను ఆస్పత్రిలో చేర్పించిన నగరి ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, తిరుపతి: నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందించే వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను కాపాడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరులో జరిగే జెడ్పీ సమావేశానికి బయల్దేరిన రోజాకు నేండ్రగుంట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సింధు అనే మహిళ కనబడింది. స్కూటీపై వెళ్తున్న ఆమె ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బండి అదుపు తప్పడంతో రోడ్డుపై పడింది. తల రోడ్డుకు బలంగా కొట్టుకొని ర క్తస్రావమైంది. ఈ సంఘటనను చూసిన రోజా డ్రైవర్‌ను అప్రమత్తం చేసి సింధును తన కారులో ఎక్కించుకుని దగ్గర్లో ఉన్న పూతలపట్టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యులు ఆమెను అంబులెన్సులో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఆమె కోలుకుంటోంది. -
శ్రీవారికి సింధూ తులభారం
– 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పణ – శ్రీవారికి తలనీలాలు సమర్పించిన గోపిచంద్ సాక్షి,తిరుమల: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు సమర్పించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితో కలసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. ముందుగా బెల్లంతో తులాభారం సమర్పించారు. తర్వాత శ్రీవారి, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో పోల భాస్కర్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ వారి వెంట ఉన్నారు. బాధ్యత పెరిగింది.. మరింత కష్టపడతా: పీవీ సిం«ధూ రియో ఒలింపిక్స్‌లో వెండిపతకం సాధించడంతో తనపై బాధ్యత పెరిగిందని, మరింత కష్టపడి దేశానికి మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పీవీ సింధూ అన్నారు. ఒలింపిక్స్ ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నానని , పతకం సాధించి మళ్లీ వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందిస్తే మరికొందరి ప్రతిభ తప్పక వెలుగు చూస్తుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దేవుడి కృప ఉండాలని ప్రార్థించాను : పుల్లెల గోపీచంద్ తిరుమల శ్రీవారి ఆశీస్సులు, సింధూ ఆటతీరుతో ఒలింపిక్స్‌లో పతకం వచ్చిందని, ఎల్లప్పుడూ ఆ దేవదేవుని కృప ఉండాలని కోరుకున్నానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. -
అమ్మవారి సేవలో సింధు
తిరుచానూరు: ఒలింపిక్ బ్యాడ్మింటన్ రజత విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లు శనివారం రాత్రి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు జీ.భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రవి స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఈ క్రీడాదిగ్గజాలకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి దర్శనార్థం వీరు తిరుమలకు వెళ్లారు. -
తిరుమల చేరుకున్న సింధు
సాక్షి, తిరుమల: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ శనివారం తిరుమలకు వచ్చారు. ఈ విశ్వ రజత విజేత గతంలో రియో ఒలింపిక్స్ ముందు ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అత్భుత ప్రతిభతో వెండి పతకం సాధించిన నేపథ్యంలో ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు తల్లిదండ్రులు పీవీ రమణ, పి.విజయ, కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలసి శనివారం రాత్రి 10 గంటలకు తిరుమలకు వచ్చారు. ఇక్కడి జీఎమ్మార్ అతిథిగృహం వద్ద బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు. -
సింధుకు వజ్రాల రాకెట్ కానుక
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అంతర్జాతీయ పోటీల్లో రాణించే క్రీడాకారులందరికీ ప్రోత్సాహం, గుర్తింపు అవసరమని ఒలింపిక్స్ రజత విజేత పీవీ సింధు అన్నారు. ప్రసిద్ధ వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ సోమాజిగూడ షోరూమ్‌లో సింధుని శుక్రవారం ఘనంగా సన్మానించింది. కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ వజ్రాలు పొదిగిన బంగారు బ్యాడ్మింటన్ రాకెట్‌ను సింధుకు బహుమతిగా అందజేశారు. సిసలైన బంగారం లాంటి సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ శాంతకుమార్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, మధుసూధన్, సీమా మెహతా పాల్గొన్నారు. -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది. -
ఈ విజయంతో ఆగిపోవద్దు!
‘రియో’ స్టార్లకు సచిన్ సూచన 2020లో మరింత బాగా ఆడాలన్న మాస్టర్ సింధు, సాక్షి, దీప, గోపీచంద్‌లకు కార్లు బహుకరణ హైదరాబాద్: భారత దేశం యావత్తూ కలిసి వేడుకను జరుపుకునేందుకు రియో విజేతలు అవకాశం ఇచ్చారని, మున్ముందు ఇలాంటి రోజులు మరిన్ని రావాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. జాతి మొత్తం ఈ సమయంలో పట్టరాని సంతోషంతో ఉందని ఆయన అన్నారు. రియోలో పతకాలు గెల్చుకున్న సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్‌లను అభినందించేందుకు ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ తరఫున ఈ నలుగురికి బీఎండబ్ల్యూ కార్లను సచిన్ బహుకరించారు. ‘భారత క్రీడల్లో ఇదో సుదినం. మన అమ్మాయిలు గర్వపడే ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడే విజయాల ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మేమందరం మీ కోసం ప్రార్థిస్తాం. మీకు అండగా నిలుస్తాం. మేం సంబరాలు జరుపుకునేందుకు మళ్లీ మీరు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు రానున్నాయని నేను నమ్ముతున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించారు. పుల్లెల గోపీచంద్‌ను రియల్ హీరోగా, యువతరానికి రోల్‌మోడల్‌గా అభివర్ణించిన సచిన్... మరిన్ని పతకాలు సాధించేందుకు ఆయన మార్గదర్శనం కావాలని చెప్పారు. ఈ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు ఉన్నాయని సింధు, సాక్షిలపై మాస్టర్ ప్రశంసలు కురిపించారు. మరిన్ని విజయాలు సాధిస్తాం... దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకం తెస్తానని తాను చెబితే ఎవరూ నమ్మలేదని, సహకరించేందుకు ముందుకు రాలేదని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో అకాడమీ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు వరుస ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవగలిగామని ఆయన అన్నారు. ఒలింపిక్స్‌కు ముందు, ఒలింపిక్స్ సమయంలో కూడా సచిన్ మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాయని గోపీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి దేశంలో సంబరాలకు కారణం కావడం గతంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఒలింపిక్స్‌కు ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని సాక్షి సంతోషం వ్యక్తం చేయగా... పతకం తీసుకురాకపోయినా దేశ ప్రజలు ఇంతటి ప్రేమ చూపించడం గర్వంగా అనిపిస్తోందని దీపా కర్మాకర్ చెప్పింది. చాన్నాళ్ల క్రితం బ్యాడ్మింటన్‌లో ప్రదర్శనకే తొలి కారు స్విఫ్ట్ డిజైర్ అందుకున్నానని, ఇప్పుడు కారు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించడం పట్ల సింధు కృతజ్ఞతలు తెలిపింది. సింధు, గోపీలకు బీఎండబ్ల్యూ 320డి మోడల్... సాక్షి, దీపలకు బీఎండబ్ల్యూ ఎక్స్1 మోడల్ కార్లను బహుమతిగా అందజేశారు. చాముండేశ్వరీనాథ్‌తో పాటు పారిశ్రామికవేత్తలు వై.నవీన్, టి. శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, సి.అనిల్ వీటికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మరోవైపు గోపీచంద్ అకాడమీ తరఫున కూడా సింధు, సాక్షి, దీప లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. -
సింధు సక్సెస్ సీక్రెట్స్
-
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
ఎన్ఏసీ జ్యూవెలరీ ఎండీ అనంత పద్మనాభన్ విజయవాడ స్పోర్ట్స్ : రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి సింధుకు సిగ్నేచర్ నెక్‌పీస్‌ను బహూకరిస్తామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లోనే ఉమెన్ ఫ్రీస్టయిల్(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్‌కు రూ.3లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌లను అందిస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకే తాము వీరికి ఆభరణాలు బహూకరించి గౌరవిస్తున్నట్లు వివరించారు. -
సింధు,గోపీలకు ఘనంగా సన్మానం
-
వెండికొండకు స్వాగతం
-
గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్న సింధు
-
సింధు, సాక్షిలకు ‘ఖేల్‌రత్న’
* జీతూ రాయ్, దీపలకు కూడా... * అథ్లెటిక్స్ కోచ్ రమేశ్‌కు ద్రోణాచార్య * సత్తి గీతకు ధ్యాన్‌చంద్ అవార్డు * రహానేకు అర్జున పురస్కారం * 29న ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న దక్కింది. అలాగే పట్టువదలని పోరాటంతో అందరి మనస్సులు గెలుచుకున్న షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లను కూడా ఈ పురస్కారం వరించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటించింది. దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని కేవలం 0.15 పాయింట్ల తేడాతో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా షూటర్ జీతూ రాయ్ ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించాడు. వీరికి పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇవ్వనున్నారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్.రమేశ్‌కు ద్రోణాచార్య తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత (అథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ అవార్డ్‌కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు. 15ఏళ్ల శ్రమకు గుర్తింపు: రమేశ్ అల్వాల్: శిక్షణలో మానవీయ కోణం జోడిస్తే క్రీడాకారులకు నమ్మకం కలిగి మరింత ప్రోత్సాహం అందుతుందని ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. ‘15 సంవత్సరాల పాటు నా శిక్షణ అనుభవానికి తగిన గుర్తింపు లభించింది. నాకు ఈ గౌరవం దక్కుతుందని గోపీచంద్, లక్ష్మణ్ తరచూ చెప్పేవారు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుల జాబితా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు) పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డులు (రూ.5 లక్షలు) అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు) నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు) సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్). -
పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం
లింగాల ఘాట్‌లో నదీమతల్లికి పూజలు సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/సాక్షి ప్రతినిధి, కర్నూలు : కృష్ణా పుష్కరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్రంలోని పలు పుష్కర ఘాట్లను పరిశీలించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైదలో పర్యటించిన ఆయన.. తొలుత అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుని, దైదలో పుష్కర ఘాట్లను సందర్శించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దైతను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. క్రీడాకారిణి సింధుకు మనం చేసిన ప్రార్థనలతో వెండి మెడల్ వచ్చిందన్నారు. ఇక్కడ పుట్టిన బిడ్డ భారత దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. నేడు ఆమె పుష్కర స్నానానికి వస్తోందని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల పుష్కర ఘాట్‌ను చంద్రబాబు పరిశీలించారు. నది ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. నదీమతల్లికి చీర సమర్పించిన సీఎం కృష్ణా పుష్కరాల్లో భాగంగా శ్రీశైలంలోని లింగాలఘాట్‌ను సీఎం సందర్శించారు. నదిలో పసుపు, కుంకుమ, చీరను వదిలి కృష్ణా నదీమ తల్లికి పూజలు చేశారు. -
జయహో సింధు..
అచ్యుతాపురం: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం గురుకుల పాఠశాల విద్యార్థినులు జయహో సింధు.. ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి అచ్యుతాపురం కూడలి వరకూ ర్యాలీచేసి మానవహారం ఏర్పడ్డారు. ఒలింపిక్స్‌లో రజిత పథకం సాధించి సింధు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా సామూహిక స్వాగతాంజలి సమర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇకనైనా ప్రభుత్వాలు స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి ఉన్నప్పటికీ మైదానం, క్రీడాసామగ్రి లేని కారణంగా వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యం కల్పించాలని, మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలుగుతేజం సింధు దేశానికి ఖ్యాతిని తీసుకురావడం గర్వకారణంగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. -
ఊరు.. ఊరేగింది
మన సింధు సిటీకి వచ్చింది...ఉత్సాహం ఉరకలేసింది..ఊరు ఊరంతా ఊరేగింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి...ప్రశంసలందుకొన్న పీవీ సింధును భాగ్యనగరం ఘనంగా స్వాగతించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జనం జేజేలు పలికారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో..మరికాసేపు గుర్రపు బగ్గీపై ఊరేగుతూ..పూలవర్షంలో తడుస్తూ..అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ ఆమె గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంది. -
సింధు, గోపీచంద్‌కు సర్ఫ్రైజ్
-
గోపీ కష్టానికి ఫలితం దక్కింది
-
'క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు'
హైదరాబాద్: ప్రభుత్వాలు క్రీడలపై దృష్టి పెట్టి యువతను ప్రోత్సహించాలన్నారు. సోమవారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. క్రీడా సంఘాలలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. సింధూని ఆదర్శంగా తీసుకుని యువత ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. మరో వైపు హీరో పవన్ కల్యాణ్ ఏపీ ప్రత్యేక హోదాపై పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ మాట్లాడినతీరు సరిగా లేదన్నారు. ప్రాణహిత చేవేళ్ల డిజైన్ మార్చడం వల్ల జాతీయ హోదా కోల్పోవడం నిజమా? కాదా? అని కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. -
జీవిత కాలపు ఆనందం: సింధు
పతకం సాధించిన క్షణాలు అపురూపం ఇప్పటికీ అంతా కలలాగే ఉంది ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సింధు సాక్షి క్రీడాప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది దేశం నాకేం ఇచ్చిందన్నది ముఖ్యం కాదు.. దేశానికి నేనేం ఇచ్చాననేదే ముఖ్యం.. సింధు కూడా ఇదే భావనతో ఉంది. తన కోసం దేశం మొత్తం ప్రార్థించిన క్షణాన మువ్వన్నెలు గర్వపడేలా పతకం గెలిచి భారతావనిని సంతోష సాగరంలో ముంచెత్తింది. ‘నా దేశానికి పతకం తెచ్చా’ అనే భావన తనకు జీవితకాలపు ఆనందాన్ని ఇచ్చిందని చెబుతున్న ‘సింధు’.. రియోనుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తూ విమానం నుంచి వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’తో ప్రత్యేకం గా మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... పతకం గెలిచిన తర్వాత.. మూడు రోజులు గడిచినా నేను ఇంకా అదే ఆనందంలో మునిగి ఉన్నాను. మాటల్లో చెప్పలేని ఆనందం ఇది. ఫైనల్ ముగిశాక బహుమతి ప్రదానోత్సవం, ఇంటర్వ్యూలు, అభినందనలు... ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఎన్నని చెప్పను. మా అమ్మా నాన్నలతో కూడా అప్పు డు మాట్లాడలేకపోయాను. అయితే అన్నింటికి మించి పోడియంపై నిలబడిన క్షణాన కలిగిన ఉద్వేగం, సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయి. ఒక వైపు భారత జాతీయ పతాకం పైకి ఎగురుతోంది. మరో వైపు స్టేడియం మొత్తం సింధు... సింధు అంటూ అరుపులు. నేను ఈ ప్రపంచం లో లేనని అనిపించింది. ఆ అనుభూతి గురించి నేను మాటల్లోనే చెప్పలేకపోతున్నాను. ఒలింపిక్స్ ప్రదర్శన పోటీలు ప్రారంభమైనప్పుడు ఫైనల్‌కు వెళతానని ఊహించలేదు. అయితే తుది పోరుకు ముందు మూడు మ్యాచ్‌లు కూడా నేను చాలా బాగా ఆడాను. చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌ను ఓడించాక పతకం సాధించవచ్చనే నమ్మకం కలిగింది. ఒకుహరతో ఆడేటప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా నా సహజశైలిలో ఆడటం కలిసొచ్చింది. ఫైనల్లో ఓటమి నిజాయితీగా చెప్పాలంటే కరోలినాతో తొలి గేమ్ గెలిచాక స్వర్ణం సాధిస్తున్నాననే నమ్మకం కలిగింది. కానీ ఒలింపిక్ ఫైనల్ ఇది. అందుకే ఆమె మరింత పట్టుదల ప్రదర్శించింది. నాకూ మంచి అవకాశాలు వచ్చినా కొన్ని సార్లు తడబడ్డాను. గోపీ సర్ పదే పదే ధైర్యం నూరిపోశారు. అయితే మూడో గేమ్‌లో ఆమె 13 పాయింట్లకు వెళ్లినప్పుడు లయ కోల్పోయాను. అక్కడ రెండు పాయింట్లు వస్తే తేడా ఉండేది. చివరకు సర్ మాత్రం ‘చాలా బాగా ఆడావు. ఇంత దూరం వస్తామని మనమూ అనుకోలేదు’ అన్నారు. గత మూడు నెలలు నేను తీవ్రంగా కష్టపడ్డాను. సర్ ఏది చెబితే అది చేశాను. సొంత ఇష్టాలు, సరదాలు అన్నీ మానేసి కఠోర సాధన చేశాను. దానికి దక్కిన ఫలితమే ఇది. అంచనాల ఒత్తిడి నేను టీవీలు, పత్రికలు చూడలేదు. కానీ భారతదేశమంతా నా గురించి ఆలోచిస్తోందని, స్వర్ణాన్ని ఆశిస్తోందని తెలుసు. ప్రధాని నుంచి సాధారణ వ్యక్తి దాకా నాపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నేను ఒత్తిడి మాత్రం పెంచుకోలేదు. అందుకే ఫైనల్లో కూడా అంత దీటుగా ఆడగలిగా. ఆశ్చర్యకరంగా రియోలో నాకు పెద్ద ఎత్తున అభిమానులనుంచి మద్దతు లభించింది. స్టేడియంలో ఒక మూల స్పెయిన్ దేశస్తుల బృందం మినహా మిగతా వారంతా ఇండియా గెలవాలనే కోరుకున్నారు. ప్రతీ పాయింట్‌కు నన్ను ఉత్సాహపరిచారు. దాంతో పరాయి దేశంలో ఆడుతున్న భావనే రాలేదు. నా కోసం ప్రార్థించిన, అండగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు. దైవభక్తి, లాల్‌దర్వాజా బోనాలు నా విజయం వెనక దేవుడి దయ ఉందని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఎంత కష్టపడినా దైవం సహకారం అవసరం. పోటీలకు ముందు లాల్‌దర్వాజా బోనాలకు వెళ్లింది కూడా ఆ నమ్మకంతోనే. వేరే ఇతర దేవుళ్లకు కూడా నేను మొక్కుకున్నాను. ఇక పోటీల్లో పసుపు బట్టలతోనే దిగడంలో ప్రత్యేక సెంటిమెంట్ ఏమీ లేదు. కానీ తొలి మ్యాచ్ తర్వాత దానిని కొనసాగించాను. గేమ్స్ విలేజ్‌లో ఆహారపరంగా ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అందుబాటులో అన్నీ ఉన్నా... ఎలాంటి సమస్యలు రాకూడదని జాగ్రత్త పడేవాళ్లం. నేను పతకం గెలిచిన రోజున గేమ్స్ విలేజ్‌లో పెద్ద పండగ వాతావరణం కనిపించింది. నాపై ఇతర ప్లేయర్లు కురిపించిన అభిమానానికి కృతజ్ఞురాలిని. సింధు విజయం వెనుక గురువు గోపీచంద్ మార్గనిర్దేశనం, ఆమెతో సమానంగా పడిన శ్రమ ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు 24 గంటలు పతకం సాధించడమే లోకంగా బతికానని గోపీచంద్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రతీ చిన్న విషయం కోసం తీవ్రంగా శ్రమించామని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ట్రైనింగ్, ట్రైనింగ్ ఒక్కటే ధ్యాస. మేము రేపు ఓడితే మా శిక్షణలో లోపం ఉందని ఎవరూ అనుకోకూడదు అని భావించాం. ఆట, డైటింగ్, ఫిట్నెస్... ప్రతీదాంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. సింధు గెలుపే కాదు, ఆమె ఆట స్థాయి నిజంగా అద్భుతం. మా ట్రైనర్ కిరణ్ కూడా ఎంతో కష్ట పడ్డాడు. సింధును ఫిట్‌గా ఉంచడంలో అతనిదే కీలక పాత్ర. 20 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో మనకు పతకం వస్తుందంటే నవ్వేవారు. ఇప్పుడు వరుసగా రెండు సార్లు వచ్చింది. ఇది బ్యాడ్మింటన్ సాధించిన విజయం’ అని గోపీచంద్ ఆనందంగా చెప్పారు. కోచ్‌నే అయినా తానూ ఎక్కడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తపడ్డానని తెలిపారు. ‘కనీసం జలుబు, దగ్గులాంటివి వచ్చినా టైమ్ టేబుల్ మారిపోతుంది. అందుకే నేనూ ఆటగాళ్లతో పాటు కష్టపడ్డా. వ్యక్తిగత ఇష్టాలు, మిత్రులతో కనీసం మాట్లాడకుండా వారిని దూరంగా ఉంచాను. సింధుకు కూడా కఠిన నిబంధనలు విధించాను. ఆమె నా నమ్మకాన్ని నిలబెట్టింది. మారిన్‌తో కూడా గెలిచేది. షటిల్ వేగంలో వచ్చిన మార్పు వల్ల మా వ్యూహం ఫలించలేదు’ అని గోపీచంద్ చెప్పారు. -
ఈ వెలుగుల వెనుక ఓ ‘శక్తి’
సింధు పతకం గెలవగానే ఎవరికి వాళ్లు ‘మా వల్లే మా వల్లే’ అంటూ లేని గొప్పతనాన్ని తమకు ఆపాదించుకుంటున్నా... హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారడం వెనక గోపీచంద్ ఆలోచనతో పాటు ఓ బలమైన ‘శక్తి’ సహకారం ఉంది. కేవలం స్నేహం కోసం ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ శక్తి పేరు నిమ్మగడ్డ ప్రసాద్. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన ఆర్థిక సహకారం వల్లే ఈ రోజు బ్యాడ్మింటన్ ఈ స్థాయిలో నిలబడగలిగిందంటే అతిశయోక్తి కాదు. * స్నేహం కోసం అకాడమీకి డబ్బు ఇచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్ * 2003లోనే ఐదు కోట్ల రూపాయలు సహాయం సాక్షి క్రీడావిభాగం: గోపీచంద్ దగ్గర స్థలం ఉంది... అకాడమీ ఎలా నిర్మించాలనే ఆలోచన ఉంది... ప్రపంచస్థాయి వసతులతో మంచి అకాడమీ నిర్మిస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి... కానీ చేతిలో డబ్బు లేదు... తన అకాడమీ కల సాకారం కావాలంటే కనీసం నాలుగు కోట్ల రూపాయలు కావాలి... ఎలా..? 2003లో గోపీచంద్ అకాడమీ నిర్మాణానికి పూనుకున్న సమయంలో ఉన్న పరిస్థితి ఇది. ప్రభుత్వం స్థలం అయితే ఇచ్చిందిగానీ అకాడమీ నిర్మాణానికి డబ్బు మాత్రం ఇవ్వదు. ఈ సమయంలో ఒక కార్పొరేట్ సంస్థను కలిసి ఆయన తన ప్రయత్నాన్ని వెల్లడించారు. ఒకసారి తేరిపార చూసిన ఆయన... ‘మన దేశంలో బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారండీ’ అంటూ ఒక వ్యంగ్య విమర్శ చేశాడు. ఇలాంటి సమయంలో ప్రసాద్‌ను కలిసి గోపి అకాడమీ గురించి వివరించి, నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అప్పటికే వ్యాపారంగంలో బాగా ఎదిగిన ప్రసాద్... ఏ మాత్రం ఆలోచించకుండా సహాయం చేశారు. రెండు కోట్ల రూపాయలు డొనేషన్‌గా ఇచ్చారు. మరో రెండు కోట్లు ఇస్తామని చెప్పిన వేరేవాళ్లు ఎంతకీ ఇవ్వలేదు. దీంతో మిగిలిన రెండు కోట్లు కూడా ప్రసాద్ ఇచ్చేశారు. అకాడమీ పూర్తయినా నిర్వహణకు డబ్బులు లేక మళ్లీ కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ప్రసాద్ మరో కోటి రూపాయలు ఇచ్చేశారు. దీంతో అకాడమీ సాఫీగా నడిచింది. అందుకే గోపీ ఈ అకాడమీకి ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’ అని పేరు పెట్టాడు. ఎంత డబ్బున్నా ఐదు కోట్ల రూపాయలు ఊరికే ఇవ్వడం అంటే చాలామందికి మనసు రాదు. నిజానికి 13 సంవత్సరాల క్రితం ఇది చాలా పెద్ద మొత్తం. మరి ప్రసాద్ ఎందుకు ఇచ్చారు..? దీనికి సమాధానం స్నేహం. గోపీ బ్యాడ్మింటన్ స్టార్ కాకముందే ప్రసాద్, గోపీ తండ్రి స్నేహితులు. ఎల్బీ స్టేడియంకు సమీపంలోని ఒక ఇంట్లో పక్క పక్క పోర్షన్లలో ఉండేవారు. సహజంగానే మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగే స్నేహం... పక్కపక్కన ఉన్న ఈ ఇద్దరి కుటుంబాలకూ పెరిగింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల దృష్యా గోపీ తండ్రి నిజామాబాద్ వెళ్లిపోయారు. ఇటు ప్రసాద్ మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ ద్వారా ఉన్నతస్థితికి వెళ్లారు. ఎంత ఎదిగినా ఆ కుటుంబాల మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. ఆటలపై మొదటి నుంచి ఆసక్తి చూపే ప్రసాద్... గోపీ అకాడమీ ప్రతిపాదనతో రాగానే వెంటనే సహాయం చేశారు. గత పుష్కర కాలంలో నగరంలో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. క్రమంగా గోపీచంద్ అకాడమీ అనే పేరుతోనే అందరూ గుర్తుంచుకున్నారు. కానీ ఇప్పటికీ, ఎప్పటికీ ఆ అకాడమీ పేరు ‘నిమ్మగడ్డ ఫౌండేషన్ గోపీచంద్ అకాడమీ’. ప్రపంచస్థాయి అకాడమీ నిర్మిస్తానని గోపీ వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. మళ్లీ నాకు డబ్బు తిరిగి ఇవ్వొద్దు. ఒక ఒలింపిక్ పతకం తెచ్చి చూపించండి అని అడిగాను. కచ్చితంగా తెస్తానని మాట ఇచ్చాడు. 2012లోనే సైనా రూపంలో గోపీ పతకం తెచ్చాడు. ఇప్పుడు సింధు రజతం తెచ్చేసింది. నాకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడు. భారత్‌కు ఒలింపిక్ పతకం మన అకాడమీ నుంచి రావడం గర్వకారణం’ - నిమ్మగడ్డ ప్రసాద్ ఆటల పట్ల ఆసక్తి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా గతంలో ప్రసాద్ ఎప్పుడూ ఆటలకు సంబంధించిన వ్యాపారంలోకి రాలేదు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించే వ్యక్తిగా వ్యాపార వర్గాల్లో పేరున్న ప్రసాద్... ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ ద్వారా ఇందులోకి వచ్చేశారు. సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టులో ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ కలిసి వాటాలు కొన్నారు. భవిష్యత్తులోనూ క్రీడల్లో మరింతగా భాగం కావాలని ఆయన భావిస్తున్నారు. ‘నా చిన్నతనంలో నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళితే మా నాన్న బ్యాట్ విరగ్గొట్టి చదువుకోమన్నారు. అప్పటితరంలో చదువుకే ప్రాధాన్యత. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారాయి. స్పోర్ట్స్ కూడా ప్రొఫెషనల్‌గా మారాయి. ఒక ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ చుట్టూ ఉన్న పది ఇళ్లలో పిల్లలు కూడా అదే మార్గంలో వచ్చి ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఇప్పుడు సింధు విజయం సాధించిన తర్వాత మరింత మంది బ్యాడ్మింటన్‌లోకి వస్తారు’ అని ప్రసాద్ అన్నారు. -
రా.. బంగారూ!
నేడే సింధు రాక అపూర్వ స్వాగతానికి ఏర్పాట్లు భరతమాత నుదుటిన పతక సింధూరం దిద్దిన తెలుగు తేజం వచ్చేస్తోంది. కోట్లాది మంది భారతీయుల కనులలో వెండి వెలుగు నింపిన మన ముద్దుబిడ్డ మరికొద్ది సేపట్లో తెలుగు గడ్డపై అడుగుపెడుతోంది. రియోలో మువ్వన్నెలు రెపరెపలాడించిన బంగారు తల్లికి ఘన స్వాగతం పలికేందుకు భాగ్యనగరం ముస్తాబయింది. ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ... అడుగడుగునా అభిమానుల జయజయధ్వానాలు... గచ్చిబౌలిలో ప్రభుత్వం చేసే ఘన సన్మానం... ఇలా సోమవారమంతా బిజీబిజీగా గడపబోతోంది. సాక్షి, హైదరాబాద్: రియో వేదికపై భారత కీర్తి పతాకను ఎగురవేసిన తెలుగు తేజం పీవీ సింధు రాక కోసం రాష్ట్రం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది! ఉభాగ్యనగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు సిటీజనులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో రజత పతకంతో సొంత గడ్డపై అడుగుపెట్టనున్న సింధు కు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్రప్రభుత్వం, జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటలకు దిగనున్న సింధుకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. అక్కడ్నుంచి ఆమె భారీ ర్యాలీ మధ్య గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు. ప్రధాన ఊరేగింపు జరిగే రూట్‌ను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ట్రాఫిక్, పోలీసు విభాగాలు పరిశీలించాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ హోర్డింగ్‌లతోపాటు గగన్‌పహాడ్, వ్యవసాయ వర్సిటీ ప్రధాన ద్వారం, ఆరాంఘర్ చౌరస్తా, శివరాంపల్లి, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్ చౌరస్తాలలో స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ఆమెపై పూల వర్షం కురిపించడంతోపాటు వేదికల పైనుంచి ప్రముఖుల ప్రసంగాలతో సింధుకు అపూర్వ స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొననున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం సింధును ఘనంగా సన్మానించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సత్కార సభ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, క్రీడలు, శాప్, సైబరాబాద్ పోలీసు అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఓపెన్‌టాప్ వాహనంలో ర్యాలీ సాగుతుందన్నారు. మార్గం మధ్యలో పదిహేను చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో జరిగే సింధు సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నాయిని, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు పాల్గొంటారు. విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు సుమారు 20 నుంచి 30 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేసినట్లు కమిషనర్ వివరించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ నవీన్‌చంద్ తెలిపారు. -
సింధు రజితం గెలుపుపై హర్షం
బిజినేపల్లి: రియో ఒలింపిక్ బ్యాట్మింటన్‌లో తెలుగు తేజం సింధు ఫైనల్లో రజితం పతకం సాధించడంపై పాలెం నేతాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాట్మింటన్‌లో ఫైనల్లో సింధు స్వర్ణ పతకం సాధించేందుకు ఎంతగానో కషి చేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా దేశంలో వ్యక్తిగత రజితం పతకం సింధు సాధించడం గొప్ప విషయమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో శ్రీనివాస్‌గౌడ్, సిరిజంగం శ్రీనివాసులు, శ్రీనివాస్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కష్ణ, రేణుగౌడ్ ఉన్నారు. -
ప్రమాణాలు పెంచింది
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రకాశ్ పదుకొనే, గోపీచంద్ తర్వాత చాలాకాలం పాటు మరో పెద్ద ఆటగాడు రాలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తర్వాత ఒక్కసారిగా ఈ ఆటపై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత క్రమంగా గోపీచంద్ అకాడమీలో ఆటగాళ్ల సంఖ్య పెరగడం... అంతర్జాతీయ టోర్నీల్లో సైనా విజయాలు, సింధు సంచలనాలతో భాగ్యనగరం బ్యాడ్మింటన్ హబ్‌గా మారింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం గెలిచిన తర్వాత ఇది మరింత జోరందుకుంది. సౌకర్యాలు ఉన్నచోటే ఆటగాళ్ల సంఖ్య పెరగడం సహజమే కాబట్టి... హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు బయటకు వచ్చారు. గోపీచంద్ చీఫ్ కోచ్ కావడం వల్ల జాతీయ క్యాంప్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంది. సైనా లండన్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆమెతో పాటు సింధు కూడా అంతర్జాతీయ వేదికల్లో నిలకడగా రాణించి పతకాలు తేవడం పెరిగింది. ఇదే సమయంలో ప్రత్యేకంగా డబుల్స్ కోచ్‌ను నియమించడం సహా గోపీ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ఈసారి భారత్ నుంచి అనూహ్యంగా ఏడుగురు అర్హత సాధించారు. ఇందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులే కావడం విశేషం. ఈసారి సింధు రజతం గెలిచి బ్యాడ్మింటన్‌లో మన స్థాయిని మరింత పెంచింది. నిజానికి కరోలినా కాకుండా మరే క్రీడాకారిణి ఫైనల్లో ఎదురయినా ఈపాటికి తన ఖాతాలో స్వర్ణం ఉండేది. సైనా సాధించిన కాంస్యాన్ని నాలుగేళ్లలో సింధు రజతం స్థాయికి పెంచింది. కాబట్టి కచ్చితంగా ఇక తర్వాతి లక్ష్యం నాలుగేళ్ల తర్వాత టోక్యోలో స్వర్ణం గెలవడం. పోటాపోటీగా... క్రికెట్‌ను మినహాయిస్తే దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ఒక్క మ్యాచ్ కోసం ఎదురుచూడటం ఇప్పుడే. సింధు పతకం వల్ల దేశంలో బ్యాడ్మింటన్ గురించి చర్చ మరింత విసృ్తతంగా జరుగుతుంది. దీనివల్ల కొత్త క్రీడాకారులు వస్తారు. ఇది కూడా మంచి పరిణామం. ఒకసారి పతకం వచ్చాక ఇకపై ఆడే ప్రతి టోర్నీలోనూ సింధుపై అంచనాలు భారీగా ఉంటాయి. ఈ ఒత్తిడిని తను అధిగమించాల్సి ఉంటుంది. క్రీడాకారుల కెరీర్లో ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి. సైనా లండన్‌లో పతకం గెలిచిన విషయాన్ని ఇప్పుడు చాలామంది మరచిపోయారు. ఇంతకాలం దేశంలో నంబర్‌వన్‌గా ఉన్న సైనా స్థానాన్ని సింధు తీసుకుంది. కాబట్టి తిరిగి అగ్రస్థానానికి రావడానికి సైనా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ బాగుంటుంది. దీనివల్ల భారత బ్యాడ్మింటన్ స్థాయి మరింత పెరుగుతుంది. -
సింధుకు వందనం
రియో ఒలింపిక్స్‌లో మహిళా బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు రావులపాలెం లిటిల్ ప్లవర్ హైస్కూల్, లెర్నింగ్ బడ్స్ విద్యార్థులు వినూత్నంగా జేజేలు పలికారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంగణంలో రజత పతకాన్ని ముద్దాడుతున్న సింధు చిత్రం గీసి, దానిచుట్టూ రంగురంగుల దుస్తులు ధరించిన విద్యార్థులు భారతదేశ పటం ఆకారంలో నిలబడి సెల్యూట్ చేశారు. అనంతరం మోకరిల్లి జేజేలు పలికారు. ‘వియ్ సెల్యూట్ టు యువర్ విక్టరీ సింధు’ అని ఆంగ్ల అక్షరాల్లో రాసి, త్రివర్ణ పతాకం, షటిల్ బ్యాట్ చిత్రాలను వేసి సింధు విజయాన్ని శ్లాఘించారు. పాఠశాల డైరెక్టర్ పీవీఎస్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. – రావులపాలెం -
ఫోన్ ఇచ్చేస్తా... ఐస్‌క్రీమ్ తిననిస్తా
ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుకు నజరానాలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నగదుతో పాటు అమరావతిలో ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. గ్రూప్–1 స్థాయి అధికారి ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. అలాగే కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల రూపాయల నగదు నజరానాతో పాటు అకాడమీ ఏర్పాటు కోసం ఐదెకరాలు స్థలాన్ని కేటాయించనుంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్లు, హర్యానా 50 లక్షల రూపాయలు సింధుకు ఇస్తున్నాయి. సింధుతో పాటు పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చి సహకరిస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తమ ఉద్యోగికి రూ.75 లక్షలు ప్రకటించింది. సింధుని అంబాసిడర్ చేయాలి: చాముండేశ్వరినాథ్ సాక్షి, తిరుమల: ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పీవీ.సింధును తెలంగాణ అంబాసిడర్‌గా ప్రకటింవచ్చని ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ అన్నారు. ‘బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్కరనేం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చు’ అని అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో రజతం గెలవడం దేశానికి గర్వకారణం అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో సింధు బాగా పోరాడిందని అభినందించారు. భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రియో: ఒలింపిక్స్ పతకం కోసం ఆరు నెలలుగా సాగిన ఓ మిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆరు నెలల కాలంలో సింధు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయింది. తనకు ఇష్టమైన ఎన్నో రుచులను వదిలేసుకుంది. అందుకే పతకం గెలవగానే సింధుపై ఉన్న ఆంక్షలను గోపీచంద్ ఎత్తేశారు. ‘గత మూడు నెలలుగా సింధు దగ్గర ఫోన్ లేదు. నేను తీసేసుకున్నా ఇక వెంటనే సింధు ఫోన్ ఇచ్చేస్తా. అలాగే ఆమెకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ కూడా తిననిస్తా’ అని పతకం గెలవగానే గోపీ చెప్పేశారు. అంతెందుకు సింధుకు ఎంతో ఇష్టమైన ‘స్వీట్ పెరుగు’కు కూడా ఆమె గత మూడు వారాలుగా దూరంగా ఉంది. ‘గత మూడు నెలలుగా ఏం చెబితే అది చేసింది. తన ఇష్టాలను వదిలేసుకుంది. ఎక్కడా ఇది ఎందుకు అని అడగలేదు. ఈ పతకం కోసం తను ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసు’ అంటూ శిష్యురాలి గురించి మురిపెంగా చెప్పుకున్నారు కోచ్. -
సింధుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు 22వ తేదీన నగరానికి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. కాగా, సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. -
అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను!
'అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను. గర్వంగా ఉంది'.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తల్లికి చెప్పిన మాటలివి. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధును బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తారు. సల్మాన్ ఖాన్ సింధుతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పెట్టి.. 'మా అమ్మతో కలిసి ఫైనల్ మ్యాచ్ ను టీవీలో చూశాను. సింధుతో నేను ఫొటో దిగిన విషయాన్ని అమ్మకు చెప్పాను. గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు. అమితాబ్ స్పందిస్తూ.. 'సింధు.. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధను పెట్టి ఫైనల్ ఆడావు. నిన్ను చూసి యావత్ దేశం గర్విస్తోంది. గర్వకారణమైన ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. 120 కోట్లమంది నీకు మద్దతుగా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది' అని ట్వీట్ చేశారు. సింధు విజయం భవిష్యత్తులో ఒలింపిక్స్ లో భారత అవకాశాలనే కాదు.. మహిళా సాధికారితకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపికా పదుకొనే కూడా సింధును ప్రశంసల్లో ముంచెత్తింది. Saw d finals on tv with my mom and told her I hv a picture with Sindhu . Proud . pic.twitter.com/Ka9JHvnsjT — Salman Khan (@BeingSalmanKhan) 19 August 2016 -
సింధు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయ్!
రియో ఒలింపిక్స్ లో అసమాన పోరాట ప్రతిభ చూపి.. 120కోట్లమంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది పీవీ సింధు. విశ్వక్రీడల వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ గా మారిపోయింది. ఆమెకు నగదు రివార్డులతోపాటు, ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్ లో సిల్వర్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన 21 ఏళ్లు సింధు పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా మారుమోగనున్నాయి. కానీ ఆమె అందరిలాంటి సిటీ అమ్మాయే. బాలీవుడ్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం. అలాగే ఐస్ క్రీమ్ అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా మక్కువ. అందుకే సిల్వర్ మెడల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ఆమె కోసం సినిమాలు, బిర్యానీ ఎదురుచూస్తున్నాయి. 'రుస్తుం', 'మహెంజోదారో' వంటి కొత్త హిందీ సినిమాల గురించి సింధు నన్ను చాలాసార్లు అడిగింది. తను ఇక్కడి వచ్చాక ఐస్ క్రీమ్, బిర్యానీ తినాలనుకుంటోంది' అని సింధు తండ్రి పీవీ రమణ 'ఇండియా టుడే'కు తెలిపారు. అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెచ్చరికల నేపథ్యంలో బయట వండిన ఆహారం సింధు తినకుండా తాము చర్యలు తీసుకున్నామని, ఆమె కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన వివరించారు. -
సింధుకు భారీ నజరానా
-
సింధుపై అభినందనల పర్వం
-
ఆరడుగుల రాకెట్
ఎవరీ అమ్మాయి? ఇంత పొద్దున్నే ప్రాక్టీస్‌కు వచ్చేసింది? మరీ తెల్లవారుజామున గం. 4.15కే రాకెట్‌తో సిద్ధమైంది? సింధును కెరీర్ ఆరంభంలో చూసిన వాళ్లు వేసిన ప్రశ్నలివి. ఈమె భవిష్యత్తులో భారత్‌కు ఒలింపిక్స్ పతకం తెస్తుందని బహుశా అప్పుడు వాళ్లకు తెలిసుండదు. తల్లిదండ్రులు వాలీబాల్ ప్లేయర్లు అయినా.. తను మాత్రం బ్యాడ్మింటన్‌ను ఎంచుకోవటం గొప్ప విషయమే. కానీ ఇందుకోసం కెరీర్ ఆరంభంలో రోజుకు 56 కిలోమీటర్లు ప్రయాణం చేసేదంటే ఆశ్చర్యకరమే. అయినా ఆమెలో ఏమాత్రం అలసట కనిపించేది కాదు. అనుకున్నది సాధించాలన్న తపనే ఇందుకు కారణం. గురువు గోపీచంద్ పర్యవేక్షణలో.. అహోరాత్రులు శ్రమించి నేడు దేశం గర్వించదగ్గ బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగింది. సాక్షి క్రీడావిభాగం కలలు కనండి వాటి సాకారానికి కృషిచేయండన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తిపూరిత వ్యాఖ్యలకు పీవీ సింధు నిలువెత్తు నిదర్శనం. తన కలను నెరవేర్చుకునేందుకు పడ్డ శ్రమకు నేటి ఈ పతకమే ఉదాహరణ. 1995 జూలై 5న పుట్టిన పీవీ సింధుకు చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఆమె ఇష్టాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో బ్యాడ్మింటన్ కోచ్ మహబూబ్ అలీ వద్ద చేర్పించారు. ఇక్కడ రాకెట్ పట్టుకోవటం నేర్చుకున్న సింధు.. మరింత రాటుదేలాలన్న ఆలోచనతో గోపీచంద్ అకాడమీలో చేరింది. సికింద్రాబాద్ నుంచి అకాడమీకి వెళ్లి రావటానికి రోజుకు 56 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిందే. ఇందుకోసం సింధు తెల్లవారుజామున 3 గంటలకే లేచి గం.4.15కే అకాడమీకి చేరుకునేది. గం. 6.30 వరకు ట్రైనింగ్ పూర్తి చేసుకుని స్కూల్‌కు వెళ్లేది. ఆనాడే చెప్పారు సింధు స్థానిక టోర్నమెంట్లు ఆడటం ప్రారంభించిన కొత్తలో ఓ ప్రముఖుడు ‘రోజుకు 56 కిలోమీటర్లు ప్రయాణించి కోచింగ్‌కు వస్తున్న ఆమె పట్టుదలే ఆమెను ఓ మంచి బ్యాడ్మింటన్ స్టార్‌గా మలుస్తుంది. అందుకు కావాల్సిన కఠోరశ్రమ, చిత్తశుద్ధి ఆమె వద్ద పుష్కలంగా ఉన్నాయి’ అని ప్రశంసించారు. సింధులోని కసిని గుర్తించిన గోపీచంద్ కూడా... ‘ఓటమిని ఎప్పటికీ అంగీకరించని తత్వమే సింధు ఆటతీరుకు అదనపు బలం’ అని చాలా సందర్భాల్లో చెప్పారు. గోపీ అకాడమీలో చేరాకే సింధు పతకాల వేట మొదలైంది. అప్పటికి సింధు వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఇంతింతై.. 2012 జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌లో జర్మన్ షట్లర్ జులియన్ షెంక్ చేతిలో ఓడిన సింధు.. జూలైలో జరిగిన ఏషియా యూత్ అండర్-19 చాంపియన్‌షిప్‌లో కసిగా ఆడి టైటిల్ గెలుచుకుంది. ఇదే ఊపులో 2012 ఒలింపిక్స్ మహిళా సింగిల్స్ విజేత లీ జురీపై సంచలన విజయం సాధించి బ్యాడ్మింటన్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ టోర్నీ సందర్భంగానే సింధు కాలికి గాయమైంది. అదే ఏడాది జరిగిన జపాన్ ఓపెన్‌లో బరిలోకి దిగినా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. తర్వాత జరిగిన జాతీయ ఈవెంట్లలో సత్తాచాటింది. సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. గాయం తీవ్రం కావటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకుంది. ప్రత్యర్థుల ప్రశంసలు 2013లో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్లో రెండో సీడ్ వాంగ్ యిహాన్ (చైనా)పై సంచలన విజయంతో.. ఫైనల్లోకి దూసుకుపోయింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2014లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభతో.. మహామహులైన స్టార్లంతా ముక్కున వేలేసుకునేలా చేసింది. సెమీస్‌లోనే ఓడినా.. ప్రత్యర్థులంతా సింధు అటాకింగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 2015లో కెరీర్లో తొలి సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు (డెన్మార్ ఓపెన్) చేరింది. 2016 ఆరంభంలోనూ.. మరోసారి మలేసియా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో బంగారు పతకం గెలిచింది. పీబీఎల్‌లో కెప్టెన్‌గా.. ఐపీఎల్ ప్రేరణతో 2013 నుంచి మొదలైన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లోనూ సింధు సత్తా చాటింది. అవధ్ వారియర్స్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన సింధు సెమీస్‌లో ముంబై మరాఠాస్‌ను ఓడించి.. వారియర్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. అయితే.. టైటిల్ పోరులో హైదరాబాద్ హాట్‌షాట్స్ చేతిలో ఓడిపోయింది. 2016లో చెన్నై స్మాషర్స్ కెప్టెన్‌గా ఉన్న సింధు.. తను ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి జట్టును సెమీస్‌కు చేర్చింది. సిగలో అర్జున, పద్మశ్రీ 2013లో బ్యాడ్మింటన్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సింధుకు.. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించింది. ఆ ఏడాది టాప్ ప్లేయర్లను ఓడించి రెండు సూపర్ సిరీస్‌లను తన ఖాతాలో వేసుకున్నం దుకు ఈ గౌరవం దక్కింది. తర్వాత 2015లో ఈమె సాధించిన విజయాలకు గుర్తుగా నాలుగో అత్యు త్తమ పౌర పురస్కారం పద్మశ్రీతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 2014లో ఫిక్కీ బ్రేక్‌త్రూ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులందుకుంది. ఇటు క్రీడల్లో రాణిస్తూనే.. విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. సెయింట్ ఆన్స్ కాలేజీలో ఎంబీఏ చేస్తోంది. స్విమ్మింగ్, యోగా, హోటల్లో భోజనం నిరంతరం టోర్నమెంట్లు, శిక్షణతో బిజీగా ఉండే సింధు... అప్పుడప్పుడు రాకెట్‌కు సెలవిచ్చి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సేద తీరుతుంది. సమయం దొరికితే యోగా, స్విమ్మింగ్ ద్వారా రిలాక్సవుతుంది. ఫ్రెండ్స్‌తో కలిసి అప్పుడప్పుడు సినిమాలకూ వెళ్తుంది. టీవీ ప్రోగ్రాములు ఆసక్తిగా చూస్తుంది. చాకొలేట్స్, స్వీట్స్ తక్కువగా తినే సింధు... తల్లిదండ్రులతో కలిసి వారానికి ఒకట్రెండుసార్లు హోటల్‌కెళ్లి భోజనం చేసేందుకు ఇష్టపడుతుంది. చిన్న చిన్న నగలను, ఆభరణాలను కలెక్ట్ చేయటం సింధు హాబీ. సింధు విజయాలు జూనియర్ స్థాయిలో... ►2009 కొలంబో సబ్-జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (కొలంబో)లో కాంస్యం ►2010 ఫజ్ ్రఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్ (ఇరాన్) లో రజతం సీనియర్‌గా విజయాలు ►2011లో ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ టైటిల్ ►2012లో ఏషియా యూత్ అండర్-19 చాంపియన్‌షిప్ ►2013 మలేషియా మాస్టర్స్‌లో బంగారు పతకం (తొలి గ్రాండ్ ప్రి) ►2013, 2014, 2015 మకావు ఓపెన్ టైటిల్స్ ►2013, 2014 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు ►2015 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్ ►2016 మలేసియా మాస్టర్స్ ►2016 రియో ఒలింపిక్స్‌లో రజతం -
అభినందనల పర్వం
ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ‘ధృడ సంకల్పంతో అద్భుతంగా ఆడావు. దేశం తరఫున రజతం సాధించినందుకు అభినందనలు’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ఫైనల్లో మంచి పోరాటాన్ని ప్రదర్శించావు. రియోలో నీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం. కొన్నేళ్లు గుర్తుండిపోతుంది’ - ప్రధాని మోదీ ‘పీవీ సింధు పోరాటం అద్భుతం. ఈ కృషికి కారణమైన కోచ్ గోపీచంద్‌కు కూడా అభినందనలు’ - తెలంగాణ సీఎం కేసీఆర్ ‘ఈ గెలుపు చరిత్రాత్మకం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని విజయాలకు నాంది పలికే స్ఫూర్తిమంతమైన విజయం’ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘సింధు పోరాట పటిమ నూరు కోట్ల భారతీయులకు స్ఫూర్తి నిచ్చింది. స్వర్ణం కోసం తుది వరకూ పోరాడిన సింధు యువతరానికి గర్వకారణం’ - ఏపీ సీఎం చంద్రబాబు ‘చిన్న వయస్సులోనే ఒలింపిక్ పతకం సాధించినందుకు అభినందనలు.అద్భుతంగా ఆడి మా హృదయాలను కొల్లగొట్టావు’ - సచిన్ టెండూల్కర్ ‘వారం రోజుల క్రితం కంటే ఇప్పుడే ఎక్కువగా ‘బాధపడుతున్నాను’. పీవీ సింధు నాకు స్ఫూర్తిగా నిలిచావు’ - అభినవ్ బింద్రా ‘విజేతకు ఫైనలిస్ట్‌కు తేడా స్వల్పం మాత్రమే. నీ ప్రదర్శనతో గర్విస్తున్నాం. రజతాన్ని ఆస్వాదించు’ - విశ్వనాథన్ ఆనంద్ సింధు సాధించిన విజయం దేశంలోని లక్షలాది చిన్నారులకు ఈ ఆట పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ప్రపంచ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ ప్రతిభను చూపగలిగింది’ - బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా కనకవర్షం: సింధు రజతం సాధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది. -
సింధు, వైదిక నాగరికతలు
క్రీ.పూ.2500 నుంచి 1750 మధ్య వాయవ్య భారతదేశంలో సింధు, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో విలసిల్లిన నాగరికతనే సింధు నాగరికత అంటారు. క్రీ.పూ.1500 నుంచి 600 సంవత్సరాల మధ్య సప్త సింధు, గంగా-యమునా మైదాన ప్రాంతాల్లో వెలసిన నాగరికత వైదిక నాగరికత. ఈ నాగరికతలు ఒక దాని త ర్వాత ఒకటి వెలసినప్పటికీ వీటి మధ్య పలు అంశాల్లో అనేక వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి. వ్యత్యాసాలు దాదాపు 250 దాకా అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మించిన పట్టణాలు, కోటలు, కాల్చిన ఇటుకలతో రూపొందించిన నిర్మాణాలు, భూగర్భ మురుగు నీటి కాలువల వ్యవస్థ వంటి పలు అంశాలతో కూడిన సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. కానీ వైదిక నాగరికత చివరి దశలో మాత్రమే ప్రాథమిక స్థాయిలో పట్టణాలు ప్రారంభమయ్యాయి. సింధు నాగరికత రాజకీయ వ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఏదీ లభించడం లేదు. కానీ వేద కాలంలో తెగ ఆధారిత రాజకీయ వ్యవస్థలు ఉండి, చివరి దశలో ప్రాదేశిక రాజ్యాలు కూడా ఏర్పడి నట్లు తెలుస్తుంది. సింధు సమాజంలో కుల వ్యవస్థ కనిపించదు. వర్గ బేధాలు మాత్రమే ఉన్నాయి. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం ఉన్నట్లుగా అసంఖ్యాకంగా లభించిన మాతృ మూర్తి విగ్రహాల వల్ల తెలుస్తుంది. వీరిది మాతృస్వామిక వ్యవస్థ అని కొందరి అభిప్రాయం. కానీ వైదిక సమాజంలో పటిష్టమైన చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. శూద్రులతోపాటు స్త్రీలకు సామాజిక గౌరవం లేదు. మలి వేద కాలంలో అనేక దురాచారాలు వచ్చి చేరాయి. ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ. సింధు ప్రజలది స్థిర జీవనం. ప్రధాన వృత్తి వ్యవసాయం. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. కాగా వరికి అంత ప్రాధాన్యత కనిపించదు. వీరు పలు రకాల చేతి వృత్తుల పరిశ్రమలను స్థాపించుకున్నారు. ప్రామాణికమైన తూనికలు, కొలతలను వినియోగించేవారు. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు. వైదిక ప్రజలు సంచార జీవితాన్ని గడిపేవారు. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. కేవలం మలి వేద కాలంలోనే వీరు వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించారు. ప్రధాన పంట వరి. సింధు ప్రజలకు లేని ఇనుము లోహ పరిజ్ఞానం వీరికి ఉంది. వీరు విదేశీ వ్యాపారాన్ని నిర్వహించలేదు. వీరి ఆర్థిక వ్యవస్థలో గోవులతోపాటు గుర్రాలకు ముఖ్యస్థానం ఉంది. సింధు ప్రజల విషయంలో గుర్రానికి సంబంధించిన వివరాలు సంతృప్తికరంగా నిర్ధారణ కాలేదు. ఒకవేళ వీరికి గుర్రం తెలిసినా.. దాని వినియోగం పరిమితమే. సింధు ప్రజల మతానికి సంబంధించిన సరైన సమాచారం లేకున్నా.. పురావస్తు ఆధారాల ద్వారా వీరు అమ్మతల్లిని ప్రధాన దేవతగా పూజించినట్లు తెలుస్తుంది. ఈ కాలంలో ఒకే ఒక పురుష దేవుడు పశుపతి మహాదేవ. ఆర్యుల దేవతల్లో స్త్రీల కంటే పురుష దేవుళ్ల ఆధిక్యం ఎక్కువ. ఇంద్ర, వరుణ, అగ్ని, త్రిమూర్తులు మొదలైన 33 మంది దేవుళ్లను వీరు పూజించేవారు. సింధు ప్రజల పూజా విధానానికి భిన్నంగా.. యజ్ఞ యాగాలు, క్రతువులకు ఆర్యులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. లిపి విషయంలోనూ రెండు నాగరికతల మధ్య భేదాలు కనిపిస్తాయి. సింధు ప్రజలు చిత్ర లిపిని అభివృద్ధి చేసుకున్నారు. వైదిక ఆర్యులకు లిపి లేదు. కానీ వీరికి మౌఖిక సాహిత్యం ఉంది. పోలికలు సింధు ప్రజల మాతృదేవతను వైదిక మతంలోని దుర్గగా గుర్తించారు. సింధు కాలంలోని పశుపతి మహాదేవుడినే ఆర్యులు రుద్రుడిగా పూజించారు. జంతువులను, వృక్షాలను ఆరాధించే సంప్రదాయం రెండు నాగరికతల్లో కనిపిస్తుంది. భూత ప్రేత పిశాచాలు, దుష్ట శక్తులు, మంత్ర తంత్రాల పట్ల నమ్మకం రెండింటిలోనూ ఉంది. ప్రాతిపదికలు వేరైనా రెండు సమాజాల్లోనూ సామాజిక వివక్షతలు కనిపిస్తాయి. వైద్య విధానాల్లోనూ రెండు నాగరికతల్లో సారూప్యం ఉంది. కుమ్మరి చక్రాన్ని రెండు నాగరికతల్లోని ప్రజలు వినియోగించారు. స్త్రీల అలంకార ప్రియత్వం, రవాణా సాధనాలు మొదలైన అంశాల్లోనూ రెండింటికి సారూప్యం ఉంది. పైన పేర్కొనట్లు సింధు, వేద నాగరికతల మధ్య పలు అంశాల్లో వ్యత్యాసాలు, పోలికలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు నాగరికతల్లోని పలు అంశాలు నేటి సంస్కృతిలో భాగంగా ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటంతో ఈ నాగరికతలను భారతీయ సంస్కృతికి మూల నాగరికతలుగా భావించవచ్చు. -
ఆచార్యదేవోభవ...
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు, మరెన్నో విజయాలు... ఆటగాడిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఆ ఘనత చెప్పుకొని కాలం గడిపేయలేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన, పట్టుదల... తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరిక. అందుకు ఎంచుకున్న మార్గం కోచ్‌గా మారిపోవడం. 2004లో సొంతగడ్డపైనే తన ఆఖరి టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత పుల్లెల గోపీచంద్ మరో కొత్త అవతారంతో కోర్టులోకి వచ్చాడు. శిక్షకుడిగా గత పుష్కర కాలంలో ఎన్నో అద్వితీయ విజయాలను అందుకున్నాడు. సైనా, సింధు, శ్రీకాంత్‌లే కాదు... పెద్ద సంఖ్యలో అతని శిష్యులు ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. తండ్రి పాత్రలో ‘గోపీచంద్ చెప్పినట్లు చేయమ్మా, గోపీ వల్లే ఇది సాధ్యమైంది, ఎలా ఆడాలో, ఏం చేయాలో గోపీకే తెలుసు’... సింధు ఫైనల్‌కు చేరిన సందర్భంగా ఆమె తండ్రి పీవీ రమణ ఎన్నో సార్లు చెప్పిన మాట ఇది. ఒక వైపు కూతురి విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరో వైపు అందుకు కారకుడైన వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే రమణ, తన బిడ్డను గోపీ చేతుల్లో పెట్టేశారు. కోచ్‌ను ఆయన అంతగా నమ్మారు. సాధారణంగా తమ జీవితంలో ఎంతో ఆశపడి, శ్రమపడి కూడా అందుకోలేని లక్ష్యాలను అదే రంగంలో తమ పిల్లల ద్వారా సాధించి ఆ సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించడం ఎంతో మంది తల్లిదండ్రులు చేస్తుంటారు. ఇక్కడ ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పుకుంటే తండ్రి పాత్రలో కోచ్ కనిపిస్తారు. గోపీ ఆటగాడిగా తన కెరీర్లో ఒలింపిక్స్ పతకం గెలుచుకోలేదు. ఆ ఆనందాన్ని ఆయన అనుభవించలేదు. అందుకే తన శిష్యుల ద్వారా దానిని సాధించాలని ఆయన భావించారు. అనుకోవడమే కాదు... ఆటగాళ్లతో సమంగా శ్రమించారు. గత ఒలింపిక్స్‌లో సైనా, ఈ సారి సింధు తమ కోచ్ కలను నిజం చేశారు. శ్రామికుడిలా... రియో సన్నాహకాల్లో శ్రమిస్తున్న సింధు శిక్షణను చూసినప్పుడు గోపీచంద్ ఒక మిలిటరీ అధికారిని తలపించాడు. స్మాష్ కొట్టేటప్పుడు ఆమె మోకాలు సరిగ్గా వంచడం మొదలు మెషీన్ గన్‌నుంచి తూటాల్లా ప్రతీ కార్నర్‌నుంచి దూసుకొచ్చే షటిల్స్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వరకు... కోర్టులో ఆమె ప్రతీ కదలికపై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒలింపిక్స్ కోసం సింధు, శ్రీకాంత్‌లను తీర్చి దిద్దే క్రమంలో తాను కూడా ఒక యువ ఆటగాడిలా గోపీచంద్ సిద్ధమయ్యాడు. వారికి కోచింగ్ ఇచ్చేందుకు కావాల్సిన ఫిట్నెస్ కోసం తాను మూడు నెలలుగా సాధారణ ఆహారం పక్కన పెట్టేసి కేవలం కార్బొహైడ్రేట్లతోనే నడిపించాడు. డోపింగ్, ఇన్ఫెక్షన్ భయంతో బయటి ఆహారం, నీటికి వారిద్దరిని దూరంగా ఉంచడం మొదలు దేవుడి ప్రసాదాలు కూడా దగ్గరికి రానివ్వకుండా, తనతో కలిసి మాత్రమే డైనింగ్ హాల్లో భోజనం చేసే ఏర్పాట్లు చేశాడు. ‘కారణం ఏదైనా కావచ్చు... కానీ సైనా నెహ్వాల్ వెళ్లిపోయాక మరొకరిని ఆ స్థాయిలో తీర్చి దిద్దాలని, ఫలితాలు సాధించి చూపాలనే మొండి పట్టుదల అతనిలో వచ్చేసింది. అందుకే అతను ఈ కఠోర శ్రమకు సిద్ధమయ్యాడు’ అని గోపీచంద్ సన్నిహితుడొకరు చెప్పడం విశేషం. బ్యాడ్మింటన్ బంగారుమయం మన దేశంలో బ్యాడ్మింటన్‌కు ఏం భవిష్యత్తు ఉంటుందండీ... అకాడమీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోసం ఒక కార్పొరేట్‌ను కదిలిస్తే గోపీచంద్‌కు వచ్చిన జవాబిది. కానీ గోపీచంద్ తాను అనుకున్నది చేసి చూపించాడు. అందుకు తన శక్తియుక్తులు, సర్వం ధారబోశాడు. చాంపియన్లను తయారు చేయడం అంటే పార్ట్‌టైమ్ బిజినెస్ కాదని నమ్మిన మనిషి అతను. కొన్నేళ్ల క్రితం సైనా విజయాలతో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు సింధు గెలుపుతో మరింత ఎగసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు చోట్ల గోపీచంద్ అకాడమీలు వచ్చేశాయి. తాజాగా రాజధాని ఢిల్లీ శివార్లలో కూడా కొత్త అకాడమీ వస్తోంది. దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మాకెంత లాభం అంటూ అడిగేసింది. అంతే గోపీచంద్ వారిని వద్దనేశాడు. అయితే అప్పుడూ ఇప్పుడూ గోపిచంద్ చెప్పే మాట ఒక్కటే. ‘నేను అకాడమీల పేరుతో వ్యాపారం చేయడం లేదు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం, గొప్ప ఆటగాళ్లను తయారు చేయడం నా లక్ష్యం. అందుకోసమే శ్రమిస్తాను. లెక్కలు రాసుకొని కోర్టులో దిగితే ఎన్నడూ పతకాలు రావు’ అని తన విజయ రహస్యాన్ని ఆయన చెప్పేశాడు. -
సిల్వర్ సింధుకు జేజేలు
విజయవాడ స్పోర్ట్స్ : ‘బేటీ బచావో,...బేటీ పడావో మాత్రమే కాదు... ‘బేటీ ఖేలావో’ (ఆడపిల్లల్ని ఆడించండి) అంటూ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తన అసమాన ప్రతిభాపాటవాలతో రజత పతక విజేతగా నిలిచిన ‘సింధు’ ఒక క్రీడా నాగరికతగా చాటిచెప్పిందని రాజధాని అమరావతి ప్రజలు కీర్తించారు. రియో ఒలింపిక్స్‌లో శుక్రవారం నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌ను నగర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం, ట్రెండ్‌సెట్, పీవీఆర్ మాల్, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, పుష్కరఘాట్లు, విజయవాడ క్లబ్, టీస్టాల్స్ ఇలా దాదాపు అన్ని చోట్ల టీవీలోప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మొదటి సెట్లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. తరువాత రెండు సెట్లను సీనియర్ క్రీడాకారిణిగా, వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న రెండు సార్లు ఒలింపియన్ పతక విజేతగా కరోలినా మారిన్ విజయం సాధించింది. అయినా కూడా సింధుకు అభిమానులు నీరాజనాలు పలికారు. ‘సింధు, సింధు గో గోల్డ్’ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా తెలుగుతేజానికి జేజేలు పలికారు. నగర ప్రేక్షకుల మాదిరిగానే ఎంతో ఉత్కంఠతతో ్రçపభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలోని ఎల్ఐసీ కాలనీలో సింధు మేనత్తలు శ్రీలక్ష్మి, ప్రసన్న, దుర్గాదేవితో పాటు వారి కుటుంబ సభ్యలంతా టీవీలో లైవ్ మ్యాచ్‌ను వీక్షించారు. సోదరుడు రమణ తండ్రికి తగ్గ తనయిగా వారు అభివర్ణించారు. స్వర్ణపతకం చేజారినా కూడా ఒకింత నిరాశ చెందినా సింధు చూపిన సత్తాకు రజత పతకం కూడా గొప్పదే అని సంతోషం వ్యక్తం చేశారు. సింధుకు చాలా భవిష్యత్తు ఉందని కనీసం మరో రెండు ఒలింపిక్స్‌లో సింధునే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మేనత్తలు ఆకాంక్షించారు. చిన్నారుల ర్యాలీ.. సింధు స్వర్ణపతకం సాధించాలని కోరుతూ దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ చిన్నారులు బందరు రోడ్డు నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించింది. ర్యాలీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.పట్టాభిరామ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రామ్మోహన్, డాక్టర్ ఇ.త్రిమూరి,్త క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. క్రీడా సంఘాల అభినందల వెల్లువ రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి కొత్త రికార్డు సృష్టించిన పీవీ సింధుకు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో శాప్ వీసీ అండ్ ఎండీ జి.రేఖారాణి, ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎంబీ సిరాజుద్దీన్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శులు చెరుకూరి సత్యనారాయణ, ఆకుల రాఘవేంద్రరావు, కేపీరావు, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రంభా ప్రసాద్, త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ఇ.సులోచన, అర్జా పాండు రంగారావు ఉన్నారు. బస్టాండ్‌లో ఉత్కంఠ వీక్షణం విజయవాడ(బస్‌స్టేçÙన్) : బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన సింధు ఆటను వీక్షించేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రెండు భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించారు. భారత్‌కు రెండో పతకం రావడంతో కేరింతలతో అభినందనలు తెలిపారు. -
అప్డేటెడ్... రీమోడల్ సింధు
సింధు విజయాల వెనుక కఠోర శ్రమ ఆ స్మాషింగ్లు అద్భుతం, ఆ దూకుడుకు అడ్డు కనిపించడం లేదు, ఎక్కడో ఎడమ వైపు మూలనుంచి ప్రత్యర్థి కోర్టులో కుడి వైపు మూలకు కొడుతున్న బ్యాక్ హ్యండ్ ఫ్లిప్ అసాధారణం...ఆడుతోంది సింధుయేనా అనిపిస్తోంది. అవును... ఇప్పుడు ఆమె పాత సింధు కాదు, పూర్తిగా అప్డేటెడ్ రీ మోడల్ సింధు! ఒలింపిక్స్‌లో ఆమె ఫిట్నెస్ చూస్తే చైనా గోడను పడకొట్టేందుకు ఆమె ఎన్ని రకాలుగా సన్నద్ధమై వచ్చిందో తెలుస్తుంది. రియోకు సన్నద్ధమయ్యేందుకు సింధు రెండున్నర నెలల పాటు కఠోర సాధన చేసింది. ఒక వైపు కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనలు, వ్యూహాలు, సాంకేతికాంశాలు... మరో వైపు వాటిని సమర్థంగా ఆచరణలో పెట్టాల్సిన చేయాల్సిన శ్రమ... ఇవన్నీ ఒక సైన్స్ క్లాస్‌ను తలపించాయి. 2015 ఆరంభంలో గాయంతో సింధు ఆటకు దూరమైంది. ఆగస్టులో మళ్లీ బరిలోకి దిగిన ఆమె... తొమ్మిది నెలల వ్యవధిలో ఎడాపెడా టోర్నమెంట్లు ఆడేసింది. చిన్నా, పెద్దా కలిపి ఆమె వరుసగా 22 టోర్నీల్లో బరిలోకి దిగడం విశేషం! ఈ మధ్య కాలంలో రెండు గ్రాండ్‌ప్రి టైటిల్స్ నెగ్గగా, ఒక సూపర్ సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. కానీ ఎక్కడో ఆమె ఆటలో తేడా కనిపించింది. సింధు మారాల్సిన, ఆటనూ మార్చాల్సిన అవసరాన్ని గోపీ గుర్తించారు. గతంలో పెద్ద మ్యాచ్‌లలో గెలుపు అవకాశం ఉన్నా... శారీరక దారుఢ్యం విషయంలో కొంత వెనుకబడి మ్యాచ్‌లను కోల్పోయిన విషయంపై కూడా గోపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అంతే... పూర్తిగా కొత్త ప్రోగ్రాం రెడీ అయిపోయింది. శిక్షణ సాగినన్ని రోజులు వీరిద్దరు సూర్యోదయంతో పోటీ పడ్డారు. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే కోచింగ్ మధ్యలో రెండు స్వల్ప విరామాలు తప్ప మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాగేది. మళ్లీ సాయంత్రం మరో నాలుగు గంటల శిక్షణ. ముఖ్యంగా సింధు ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లో వచ్చిన తేడా కూడా ఒలింపిక్స్‌లో స్పష్టంగా తెలిసిపోతోంది. ట్రైనర్ ప్రత్యేక పర్యవేక్షణలో కసరత్తులు, వెయిట్ ఎక్స్‌ర్‌సైజ్‌లు... ఇలా గతంలో ఎప్పుడూ పట్టించుకోని విషయాలపై కూడా సింధు ఫోకస్ చేసింది. టైమ్‌టేబుల్‌ను, ప్రోగ్రాం చార్ట్‌ను కచ్చితంగా అనుసరించింది. ఈ 75 రోజుల్లో ఆమె ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా మిస్ కాలేదంటే ఆమె అంకితభావాన్ని, లక్ష్యసాధనపై ఉన్న పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. తదేక దీక్షతో ఆమె ఆటను తీర్చిదిద్దే పనిలో గోపీచంద్, గురువు మనసెరిగిన శిష్యురాలిగా సింధు ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వలేదు. అవును మరి... తాము చరిత్ర సృష్టించబోతున్నామని వారికి ముందే తెలిసిపోయినట్లుంది! ►ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే రజతం లేదా స్వర్ణం గెలవనున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలువనుంది. 2000 సిడ్నీలో కరణం మల్లీశ్వరి, 2012 లండన్‌లో మేరీకోమ్ కాంస్యాలు గెలిచారు. ►స్వర్ణం సాధించేందుకు నా సర్వశక్తులూ ఒడ్డుతా. ఇక నా లక్ష్యం అదే. నేను పడ్ద కష్టానికి లభించిన ఫలితాలివి. ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా నా వందశాతం అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. ఫైనల్‌కు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాను. మారిన్ కఠినమైన ప్రత్యర్థి. ఆమె కూడా చాలా బాగా ఆడుతోంది. కోచ్ గోపీచంద్ రూపొందించిన వ్యూహాలను అమలు చేసి మంచి ఫలితాన్ని సాధిస్తా.’ - సింధు సింధు, సాక్షిలపై ప్రశంసల వర్షం ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన సాక్షి, సింధులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది... ►రెజ్లింగ్‌లో పతకం తెచ్చిన సాక్షికి అభినందనలు, ఫైనల్లో సింధుకు బెస్ట్ ఆఫ్ లక్’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ► సింధు దేశం గర్వించేలా ఆడావు. స్వర్ణం సాధించాలని కోరుకుంటున్నా. సాక్షి కొత్త చరిత్ర సృష్టించింది. రక్షా బంధన్ రోజు ఈ ఘనతలతో గర్వపడుతున్నా’ - ప్రధాని మోదీ ► సింధుకు అభినందనలు. ఇదే జోరు కొనసాగించాలి’ - తెలంగాణ సీఎం కేసీఆర్ ►అద్భుత ప్రతిభ కనబరిచిన సింధు స్వర్ణం సాధించాలి. సాక్షి మాలిక్ పోరాట స్ఫూర్తికి జేజేలు’ - వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ► ఉదయం లేవగానే శుభవార్త విన్నాను. సాక్షికి శుభాకాంక్షలు. సింధు ఓ అద్భుతం - సచిన్ ► ఆడపిల్ల పుట్టగానే చంపకుండా ఉంటే ఎంత ఎత్తుకు ఎదగగలదో సాక్షి సాధించి చూపింది. సింధు అందరి హృదయాలు గెలిచింది’ -సెహ్వాగ్ ►భారతీయులు తలెత్తుకునేలా చేసిన సాక్షికి వందనాలు. మహిళల శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు. సింధుతో నేను సెల్ఫీ దిగాలి. - అమితాబ్ ►ప్రతీ భారతీయుడి స్ఫూర్తిని తలకెత్తుకున్నందుకు సాక్షికి కృతజ్ఞతలు. స్వర్ణ పతక క్లబ్లో నేనిప్పటిదాకా ఒంటరిగా ఉన్నాను. సింధు.. నీకోసం వేచి చూస్తున్నాను. - అభినవ్ బింద్రా ► ఇంతకుముందు ఏ భారత అమ్మాయి సాధించని ఘనత దక్కించుకున్న సాక్షి నిజమైన హీరో. - సుశీల్ కుమార్ ఇదంతా గోపీ పుణ్యమే ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధించడాకి కోచ్ గోపీచంద్ కారణమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ఎదిగిందని సింధు తల్లిదండ్రులు రమణ, విజయలక్ష్మి పేర్కొన్నారు. ‘సింధు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అంచనాలకు మించి రాణించి పతకం ఖాయం చేసుకుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. తన మ్యాచ్ కోసం దేశం అంతా ఎదురుచూసింది. రోజు రోజుకూ ఆట మెరుగుపడుతోంది. ఫైనల్లో గెలుస్తుందని ఆశిస్తున్నాం’ - రమణ (సింధు తండ్రి) ‘మధ్యాహ్నమే ఫోన్లో మాట్లాడా. ఆహారం, విశ్రాంతి గురించి మాత్రమే అడిగా. మ్యాచ్ గురించి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. సింధు స్వర్ణం సాధించాలని దేశం అంతా కోరుకుంటోంది. చిన్నప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఏడ్చేది. ఇప్పుడు కూడా ఓడపోతే దిగాలుగా ఉంటుంది. సింధు కెరీర్లో ఏ ఘనత సాధించినా అది గోపీచంద్ పుణ్యమే’ - విజయలక్ష్మి (సింధు తల్లి) సింధు స్వర్ణం సాధించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మా తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్ ప్రోత్సాహంతోనే ఇక్కడి వరకు ఎదిగింది. - దివ్య (సింధు అక్క) -
మెరిసిన సింధూరం
ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించిన పీవీ విజయవాడవాసి కూతురి బిడ్డే విజయవాడ స్పోర్ట్స్: రియో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం ‘సింధూ’రం మెరిసింది. గత లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ సెమీస్‌లో చైనా అమ్మాయి యిహాన్‌వాంగ్ చేతిలో ఓడిపోగా, ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ఫైనల్లో అదే యిహాన్‌వాంగ్‌పై సింధూ విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఆ తరువాత జరిగిన ప్లే ఆఫ్‌లో సైనా చైనా అమ్మాయి జిన్‌వాంగ్ (రిటైర్డ్ హర్ట్)పై గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈసారి సింధు 21–19, 21–10 తేడాతో జపాన్‌కు చెందిన ఒకుహారాపై విజయం సాధించి మిసై్సల్లా ఫైన ల్కు దూసుకెళ్లింది. సింధు ఆటతీరుకు నవ్యాంధ్ర క్రీడాభిమానులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా పులకించిపోయారు. రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఎదురు చూసి మొహం వాచిపోయిన భారత్ క్రీడాభిమానులకు తెలుగుతేజం పీవీ సింధు స్వర్ణపతక పోరు కోసం తిరుగులేని స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఒక వేళ. స్వర్ణపతకం చేజారినా... రజత పతకమైనా ఖాయంగా దేశానికి అందించనుంది. భారతీయులు గర్వపడేలా మువ్వన్నెల జెండాను ప్రపంచ క్రీడాపటంలో రెపరెపలాడించి చెరగని ముద్ర వేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ ప్రత్యర్థి చైనా అయితే చాలు ఆమె రాకెట్ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచరై అగ్ని వర్షం కురిపించినట్టుగా శివాలెత్తిపోతుందని గతేడాది జనవరి నెలాఖరులో విజయవాడలో జరిగిన 79వ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆడేందుకు విచ్చేసిన సింధు ఆట తీరు గురించి ఆనాడే ‘సాక్షి’ చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో అదే జరిగింది. ఈ సింధూరం ఎవరో కాదు... అచ్చమైన పదహారణాల తెలుగింటి ముద్దు బిడ్డ పీవీ సింధు పిన్నవయసులోనే భారతదేశ బ్యాడ్మింటన్ స్టార్‌గా దూసుకొచ్చింది. ఈ సింధూరం ఎవరో కాదు...బెజవాడకు ముద్దుల మనువరాలే. ‘కలవారి సంసారం, బందిపోటు వంటి ఆనాటి హిట్ చిత్రాల నిర్మాత జైహింద్ టాకీస్ యజమాని దోనేపూడి బ్రహ్మయ్య కూతురి బిడ్డ. సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. పైగా ఇద్దరూ అర్జున అవార్డీలే. సింధు కూడా అర్జున అవార్డీనే. సింధు పూర్తిగా బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల వయసులో గోపీచంద్ అకాడమీలో చేరింది. రోజూ హైదరాబాద్ గచ్చిబౌలీలోని అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది. 2012లో సీనియర్ నేషనల్స్‌లో చాంపియన్ అయ్యింది. జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్ ఆడింది. 2013 హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. 2014లో మరోసారి కాంస్య పతకం దక్కించుకుంది. 19 ఏళ్లకే అర్జున (2014లో), పద్మశ్రీ (2015లో) అందుకుంది. -
సైనా ఇంటికి...
సింధు, శ్రీకాంత్ ముందుకు అంచనాలు తారుమారయ్యాయి. కచ్చితంగా పతకం గెలుస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గత ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ... ఈ సారి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. అయితే సింధు, శ్రీకాంత్ ప్రి క్వార్టర్స్‌కు చేరి భారత ఆశలను సజీవంగా నిలిపారు. అంచనాలు తారుమారయ్యాయి. కచ్చితంగా పతకం గెలుస్తుందని భావించిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గత ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ... ఈ సారి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. అయితే సింధు, శ్రీకాంత్ ప్రి క్వార్టర్స్‌కు చేరి భారత ఆశలను సజీవంగా నిలిపారు. రియో డి జనీరో: గాయాన్ని దాచి రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు భంగపాటు ఎదురైంది. నాకౌట్ దశ (ప్రిక్వార్టర్ ఫైనల్)కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సైనా అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ 61వ ర్యాంకర్ మరియా ఉలిటినా (ఉక్రెయిన్)తో జరిగిన గ్రూప్ ‘జి’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 5వ ర్యాంకర్ సైనా 18-21, 19-21తో ఓడిపోయింది. ముగ్గురు క్రీడాకారిణిలున్న గ్రూప్ ‘జి’లో టాపర్ మాత్రమే నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఫలితంగా రెండు విజయాలు సాధించిన ఉలిటినా ముందంజ వేయగా... విసెంటి లొహెని (బ్రెజిల్)పై నెగ్గిన సైనా ఒక విజయం, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి నిష్ర్కమించింది. ఉలిటినాతో 39 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా మ్యాచ్ మొత్తం అసౌకర్యంగా కదిలింది. పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లినా అనవసర తప్పిదాలు చేస్తూ ఉలిటినాకు పుంజుకునే అవకాశాన్ని కల్పించింది. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం అటుఇటు అయినా కీలకదశలో సైనా తప్పిదాలు చేసి ఓటమిని ఖాయం చేసుకుంది. పోరాడి నెగ్గిన సింధు మరోవైపు గ్రూప్ ‘ఎమ్’లో పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని సాధించి నాకౌట్ దశకు అర్హత పొందింది. ప్రపంచ 20వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 19-21, 21-15, 21-17తో గెలిచింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు... నెమ్మదిగా తేరుకొని సంయమనంతో ఆడుతూ వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకొని గట్టెక్కింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ శ్రీకాంత్ గ్రూప్ ‘హెచ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో 21-6, 21-18తో హెన్రీ హుర్స్‌కెనైన్ (స్వీడన్)పై గెలుపొంది ముందంజ వేశాడు. ప్రిక్వార్టర్స్‌లో తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు... జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్ తలపడే అవకాశాలున్నాయి. పురుషుల డబుల్స్ నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 23-21, 21-11తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కెనిచి హయకావ-హిరోయుకి ఎండో (జపాన్)పై గెలిచింది. మారథాన్‌లో జైషా : 89... కవిత :120... అథ్లెటిక్స్ మహిళల మారథాన్ రేసులో బరిలోకి దిగిన జైషా, కవిత తుంగర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని జైషా 2 గంటల 47 నిమిషాల 19 సెకన్లలో పూర్తి చేసి 89వ స్థానంలో... కవిత 2 గంటల 59 నిమిషాల 29 సెకన్లలో పూర్తి చేసి 120వ స్థానంలో నిలిచారు. మొత్తం 157 మంది పాల్గొన్న ఈ రేసులో 24 మంది రేసును పూర్తి చేయకుండానే మధ్యలో వైదొలిగారు. ‘రియో ఒలింపిక్స్‌కు పది రోజుల ముందు ప్రాక్టీస్ సందర్భంగా మోకాలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లోనూ నొప్పితోనే బరిలోకి దిగాను. నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేకపోయాను. చురుకుగా కదల్లేకపోయాను. ఈ ఓటమి నా మనసును ఎంతగానో కలిచివేసింది. అందరికంటే ఎక్కువగా నేను బాధ పడుతున్నాను.’ -సైనా నెహ్వాల్ -
రియో ఒలింపిక్స్ లో సత్తా చాటుతాం
వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ అంతటా అకాడమీలు ‘సాయ్’ సహకారంతో 30 మందికి ఉచిత శిక్షణ 1989లో వరంగల్‌లో మెుదటిసారి ఆడాను ఇక్కడి వాతావరణం క్రీడాకారులకు శక్తి ఇస్తుంది బ్యాడ్మింటన్ ఇండియన్ టీం కోచ్ పుల్లెల గోపిచంద్ వరంగల్ స్పోర్ట్స్ : ఆగస్టు 8 నుంచి రియోలో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతారని ఇండియన్ బ్యాడ్మింటన్ టీం కోచ్ పుల్లెల గోపీచంద్ దీమా వ్యక్తం చేశారు. హన్మకొండలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్–17, 19 బాలబాలికల టోర్నమెంట్‌ను శుక్రవారం గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రియోలో సింధు మొదటిసారిగా పాల్గొంటున్నదని, సింధు ఆట పాజిటివ్‌గా ఉందన్నారు. ఒలంపిక్స్ అంటేనే చాలా టఫ్ ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. సింధు సింగిల్స్‌లో రాణిస్తుందనే నమ్మకం ఉందని, సింధుతో పాటు సైనా, జ్వాలా, అశ్వినిలు సైతం దూకుడుపైనే ఉన్నారని, ఒలంపిక్స్‌లో సత్తా చాటడం ఖాయమన్నారు. గతంలో జరిగిన నాలుగు ఒలంపిక్స్లను స్పెయిన్, జపాన్, కొరియా, ఇండియా ఇలా ఒక్కోసారి ఒక్కో దేశం విజయం పరంపర కొనసాగిందని, అందులోనూ ఒక్క ప్లేయరే అన్ని ఒలింపిక్స్ ఆడలేదని, ఒక్కో ఒలింపిక్స్‌లో ఒక్కొక్కరు ఆడారు కాబట్టి మన క్రీడాకారులు నెగ్గుతారని గట్టి చెప్పొచ్చన్నారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని అకాడమీలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని గోపీచంద్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అకాడమీ లో 125 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సహకారంతో తన అకాడమీలో 30 మంది క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. వరంగల్ లో ప్రతిభ గల క్రీడాకారులు ఉంటే వారికి సైతం అవకాశం ఉంటుందన్నారు. కాగా, గోపీచంద్ కూతురు గాయత్రి అండర్–17 విభాగంలో రంగారెడ్డి జిల్లా తరఫున ఆడుతున్నది. కూతురు ఆటను గోపీచంద్ ఇతర క్రీడాకారులు, అధికారులతో కలిసి వీక్షించారు. -
మళ్లీ తొలి రౌండ్లోనే...
► వరుసగా మూడో ‘సూపర్’ టోర్నీలోనూ శ్రీకాంత్‌కు నిరాశ ► ప్రణయ్, జయరామ్ కూడా ఇంటిముఖం ► సింధు శుభారంభం సింగపూర్ సిటీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత గడువు సమీపిస్తున్నకొద్దీ భారత పురుషుల సింగిల్స్ ఆటగాళ్ల ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడో సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ భారత క్రీడాకారులు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు మొదటి రౌండ్‌ను దాటలేకపోయారు. భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు ప్రపంచ 22వ ర్యాంకర్ ప్రణయ్, ప్రపంచ 24వ ర్యాంకర్ అజయ్ జయరామ్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్ టోర్నీల్లోనూ భారత సింగిల్స్ ఆటగాళ్లందరూ మొదటి రౌండ్లోనే నిష్ర్కమించడం గమనార్హం. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సింధు 9-21, 21-17, 21-11తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-15, 21-17తో ఇర్ఫాన్-వెని అంగ్రైని (ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జంట 21-17, 16-21, 22-20తో లియు చెంగ్-లూ కాయ్ (చైనా) జోడీని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 18-21, 18-21తో ఓటమి చవిచూశాడు. గతంలో సు జెన్ హావో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ఓడిపోయాడు. గంటా 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ కీలకదశల్లో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-18, 18-21, 19-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోగా... ప్రపంచ 14వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) 21-17, 21-16తో జయరామ్‌ను ఓడించాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 18-21, 16-21తో గో ఆ రా-యో హే వన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి (భారత్)-పియా జెబాదియా (ఇండోనేసియా) జోడీ 7-21, 6-21తో షిజుకా-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయాయి. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు
► లీ చోంగ్ వీ, లిన్ డాన్ ఓటమి ► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సైనా... కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న పీవీ సింధు... ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21-19, 21-14తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా... సింధు 17-21, 21-19, 21-16తో బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బే యోన్ జు (దక్షిణ కొరియా)తో సింధు; సుంగ్ జి హున్ (దక్షిణ కొరియా)తో సైనా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులందరూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా... పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత జోడీలన్నీ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మొహిత సహదేవ్-సంజన సంతోష్ జంట 21-16, 21-7తో సీహెచ్ పూర్ణిమ-రచిత సహదేవ్ జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 19-21, 12-21తో చెన్ హంగ్ లింగ్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో... జిష్ణు సాన్యాల్-శివమ్ శర్మ ద్వయం 17-21, 15-21తో లీ షెంగ్ ము-సై చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీ 18-21, 15-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్; ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి; మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశాయి. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) 19-21, 19-21తో వీ నాన్ (హాంకాంగ్) చేతిలో, నాలుగో సీడ్ లిన్ డాన్ (చైనా) 13-21, 20-22తో సన్ వాన్ హో (కొరియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయి ఇంటిదారి పట్టారు. -
ఆసియాలో నీటికి ఢోకా లేదు
బీజింగ్: బ్రహ్మపుత్ర, సింధూ నదులతో పాటు ఆసియాలోని చాలా నదులల్లో నీటి నిల్వలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఆసియా ఖండం నదుల్లోని నీళ్లు అడుగంటిపోయి నీటి కటకట ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు భావిస్తున్నట్లు ఏమి జరగదని ఒక కొత్త అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. రానున్న దశాబ్దాల్లో ఆసియా నదుల్లో నీటి నిల్వలు పెరగనున్నట్లు అధ్యయనం తేల్చింది. చైనా, భారత్ ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో చాలా వేగంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధి విస్తరించడమే దీనికి కారణమని స్వీడన్‌లోని గొతేన్బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ డెలియాంగ్ చెన్ పేర్కొన్నారు. -
కొత్త సీజన్‌కు సిద్ధం
నేటి నుంచి మలేసియా మాస్టర్స్ టోర్నీ బరిలో శ్రీకాంత్, సింధు పెనాంగ్ (మలేసియా): రెండు వారాలపాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సందడి చేసిన భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో పలువురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో నందగోపాల్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) జోడీ, శైలి రాణే (భారత్) ఓడిపోయారు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టకూమా ఉయెదా (జపాన్)తో జయరామ్; షో ససాకి (జపాన్)తో సమీర్ వర్మ; వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా)తో శ్రీకాంత్; షాజాన్ షా (మలేసియా) సాయిప్రణీత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)తో సింధు ఆడనుండగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మీ కువాన్ చూ-లీ మెంగ్ యిన్ (మలేసియా) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ తలపడుతుంది. -
గాయాల నుండి కోలుకుంటున్న సింధు
-
కొంచెం ముందుకు.. కొంచెం వెనక్కి
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన వారు ఒకరు... నిలకడైన ఆటతీరుకు అర్థం చెబుతూ ప్రపంచ టైటిల్స్‌ను కూడా అలవోకగా సాధించొచ్చని నిరూపించిన వారు మరొకరు... పక్కాగా నిర్వహిస్తే గ్రామీణ క్రీడ కూడా అందరి హృదయాలను దోచుకోవచ్చని... ముందు చూపులేకపోతే ఎన్నాళ్లయినా తమ నాణ్యతా ప్రమాణాలను పెంచుకోలేమని... ఈ ఏడాది భారత క్రీడారంగానికి అనుభవంలోకి వచ్చింది. ఈ సంవత్సరం కొన్ని క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు మెరుగ్గా రాణించి తమ ఉనికిని మరింత చాటుకోగా... మరికొన్నింటిలో మాత్రం అంతంత ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. - సాక్షి క్రీడావిభాగం సైనా... సాధించెన్ కొన్నేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయ పదంగా నిలుస్తోన్న సైనా నెహ్వాల్ ఈ ఏడాది అనుకున్నది సాధించింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో విజేతగా నిలిచి శుభారంభం చేసిన సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలిసారి టైటిల్ నెగ్గి, అలాగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ఎంతోకాలంగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని దక్కించుకొని ఊరట చెందింది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా రజత పతకం సొంతం చేసుకొని మరో అరుదైన ఘనత సాధించింది. చైనా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మాత్రం లీగ్ దశలో నిష్ర్కమించింది. ఈ ఏడాది సైనా మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి... 37 విజయాలు, 12 పరాజయాలు నమోదు చేసింది. మరోవైపు పీవీ సింధుకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు మిగిల్చింది. గాయాలతో బాధపడిన సింధు చివర్లో మెరిసింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు, మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది చేదు, తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ వరుస వారాల్లో స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత శ్రీకాంత్ ఆటతీరు గాడితప్పింది. వరుసగా 14 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన శ్రీకాంత్ చివర్లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గకుండా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాడు. మరో ప్లేయర్ అజయ్ జయరామ్ కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, డచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ నెగ్గి సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పారుపల్లి కశ్యప్... ఇండోనేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం కెనడా ఓపెన్‌లో... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట మెక్సికో ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గి తమ ఉనికిని చాటుకున్నారు. కబడ్డీ కేక... గతేడాది మొదలైన ప్రొ కబడ్డీ లీగ్‌కు ఈసారి మరింత ఆదరణ పెరిగింది. క్రితంసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న యు ముంబా జట్టు ఈసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో యు ముంబా ఆరు పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తెలుగు టైటాన్స్ జట్టు కూడా ఆకట్టుకొని మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌కు లభించిన ఆదరణతో నిర్వాహకులు వచ్చే ఏడాది రెండుసార్లు ఈ లీగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అదే ‘గురి’ ఈ సంవత్సరం కూడా మన ‘షూటర్లు’ మెరిశారు. ఇప్పటివరకైతే ఎనిమిది మంది భారత షూటర్లు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అంతర్జాతీయ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన ఆధారంగా అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), గగన్ నారంగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), ప్రకాశ్ నంజప్ప, జీతూ రాయ్ (50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్), అపూర్వీ చండిలా (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. అలవోకగా ప్రపంచ టైటిల్స్... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో తనకు తిరుగులేదని భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారీ నిరూపించుకున్నాడు. ప్రపంచ టైటిల్స్ నెగ్గడం ఇంత సులభమా అన్నట్లుగా ఈ సంవత్సరం ఈ బెంగళూరు ప్లేయర్ మూడు ప్రపంచ టైటిల్స్ (బిలియర్స్ టైమ్ ఫార్మాట్, స్నూకర్, సిక్స్ రెడ్ స్నూకర్)ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఉమా దేవి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మందగమనమే గతంతో పోలిస్తే ఈసారీ మన పరుగు మందగమనంగానే ఉంది. అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్స్ పతకాల పంట పండించకపోయినా... వ్యక్తిగత ప్రదర్శనతో ఏకంగా 15 మంది రియో ఒలింపిక్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. మహిళా అథ్లెట్ ద్యుతీచంద్ శరీరంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ (పురుష హార్మోన్ లక్షణాలు) ఉన్నాయనే కారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిషేధం విధించగా... ద్యుతీచంద్ న్యాయం కోసం కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో కేసు వేసింది. వాదనలు విన్నాక కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ మహిళా అథ్లెట్స్ విషయంలో హైపర్‌ఆండ్రోజెనిజమ్ నిబంధనలను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. దాంతో ద్యుతీచంద్ మళ్లీ పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. మళ్లీ డోపింగ్ భూతం గతేడాది డోపింగ్ రహితంగా కనిపించిన భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈసారి మళ్లీ ఆ జాఢ్యం వచ్చింది. ఆయా టోర్నీల్లో పాల్గొన్న లిఫ్టర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా 26 మంది వెయిట్‌లిఫ్టర్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన ప్రమీలా కృసాని, మినాతి సేథి డోపింగ్‌లో పట్టుబడ్డారు. ఒక దేశానికి చెందిన లిఫ్టర్లు ఒకే ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో మూడుసార్లు డోపింగ్‌లో విఫలమైతే ఆ దేశం లిఫ్టర్లపై ఏడాదిపాటు నిషేధం విధిస్తారు. గతంలో భారత్‌పై మూడుసార్లు నిషేధం విధించారు. ఎక్కడ వేసిన బంతి అక్కడే ఒకప్పుడు ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ఫుట్‌బాల్ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా కనిపించడంలేదు. గ్వామ్లాంటి చిన్న జట్టు చేతిలోనూ భారత్‌కు ఓటమి తప్పడంలేదు. ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ ఒకే ఒక్క విజయం సాధించి మరోసారి నిరాశపరిచింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ జట్టు విజేతగా నిలువగా... ఐఎస్ఎల్లో భారత ఫుట్‌బాల్‌కు ఏరకంగా మేలు జరుగుతుందో తెలియదని గోవా జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన బ్రెజిల్ దిగ్గజం జికో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 166వ స్థానంలో ఉన్న భారత్ తమ ఉనికిని చాటుకోవాలంటే క్షేత్రస్థాయి నుంచి మార్పులు మొదలవ్వాలి. జోష్నా జిగేల్ ఐదేళ్ల తర్వాత దీపిక పళ్లికల్‌ను వెనక్కి నెట్టి భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచిన జోష్నా చినప్ప ఈ ఏడాది మెరిపించింది. ఖతార్ క్లాసిక్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ రానిమ్ ఎల్ వెలిలీ (ఈజిప్టు)ను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. మెల్బోర్న్, ముంబై టోర్నీల్లో విజేతగా నిలిచిన జోష్నా ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకుంది. పురుషుల విభాగంలో సౌరవ్ ఘోషాల్ నాలుగు అంతర్జాతీయ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకొని ఒకదాంట్లో విజేతగా నిలిచాడు. ‘ఫోర్స్’ పెరిగింది ఫార్ములావన్‌లో భారత్ నుంచి బరిలో ఉన్న ఏకైక జట్టు ‘ఫోర్స్ ఇండియా’కు ఈ ఏడాది కలిసొచ్చింది. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ (78 పాయింట్లు), నికో హుల్కెన్‌బర్గ్ (58 పాయింట్లు) డ్రైవర్స్ చాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో వరుసగా తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. 30 రేసుల తర్వాత ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. రష్యా గ్రాండ్‌ప్రి రేసులో సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని దక్కించుకొని ఈ ఘనత సాధించాడు. ఇక కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో 136 పాయింట్లతో ఐదో స్థానాన్ని సంపాదించింది. -
సెమీస్‌లో సింధు
సాయిప్రణీత్, ప్రణయ్ ఓటమి మకావు ఓపెన్ టోర్నీ మకావు: డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 21-13, 18-21, 21-14తో చెన్ యుఫీ (చైనా)పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 0-1తో వెనుకబడి ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 16-21, 23-21, 13-21తో గో సూన్ హువాట్ (మలేసియా) చేతిలో; ప్రణయ్ 21-18, 19-21, 11-21తో ఐసాన్ మౌలానా ముస్తఫా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. -
వీరి ప్రాణాలు నిలపండి
ఆడుతూ.. పాడుతూ.. సంతోషంగా గడపాల్సిన బాల్యం మంచానికే పరిమితమైంది. కూలీకి వెళ్తేనే జీవనం గడిచే పేద కుటుంబాల పిల్లలు పెద్ద జబ్బుతో బాధ పడుతున్నారు. డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్య, అదే గ్రామ శివారులోని ఎర్రకుంటతండాకు చెందిన సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు తలసేమియూ వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలకు రక్తం ఎక్కించేం దుకు నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ఎముకల్లోని గుజ్జును మార్చాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దాతల సాయం కోసం ఆ పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నారుు. పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వారు మంచానికే పరిమితమయ్యూరు. తోటి పిల్లలతో ఎంచక్కా ఆడి పాడాల్సిన వయస్సులో నరకయూతన అనుభవిస్తున్నారు. రక్తం ఎక్కిస్తేనే బతికే జబ్బు (తలసేమియూ)తో వారు నిత్యం దిగులు చెందుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో మంచం పట్టిన కంటి పాపలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మానవతావాదులు తమ పిల్లల వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. తలసేమియూ వ్యాధితో తల్లడిల్లుతున్న ఇద్దరు నిరుపేద బాలికల కన్నీటిగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. డోర్నకల్ : మండలంలోని చిలుకోడు శివారు ఎర్రకుంట తండాకు చెందిన మాలోత్ సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు, చిలుకోడు గ్రామానికి చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్యలు కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో బాధపడుతున్న తమ కంటిపాపలను కాపాడుకునేం దుకు తల్లిదండ్రులు ప్రతీ నెలా హైదరాబాద్ విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు తీసుకెళ్లి రక్తం ఎక్కించి తీసుకొస్తున్నారు. కాగా, నెలనెల ఇద్దరికి రక్తం ఎక్కిస్తుండడంతోపాటు మందుల ఖర్చుకు రూ. 10 వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, సింధుకు ప్రస్తుతం 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోం దని తల్లిదండ్రులు సర్వాన్, పద్మలు తెలిపారు. పది రోజుల క్రితం సింధును హైదరాబాద్‌కు తీసుకెళ్లగా రక్తం లేదని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం అందక నీరసం.. సింధుకు పది రోజుల నుంచి రక్తం అందకపోవడంతో పూర్తిగా నీరసించి పోరుుందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. రక్త కణాలు బాగా తగ్గిపోవడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా, దివ్యకు కూడా రక్తం దొరకకపోవడంతో శరీరం ఉబ్బి, తరచు జ్వరం వస్తోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కూలీ పనులు చేస్తేనే కుటుంబాన్ని పోషించుకునే తమ ఇళ్లలో పెద్దజబ్బు పీడిస్తోందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, తలసేమియా వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలంటే పిల్లల ఎముకల్లోని గుజ్జును తొలగించే ఆపరేషన్ చేయించాలని, ఇందు కోసం రూ. లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని సింధు, దివ్యల తల్లిదండ్రు లు చెబుతున్నారు. పిల్లలకు ప్రాణభిక్ష పెట్టండి.. తలసేమియూతో బాధపడుతున్న తమ పిల్లల వైద్యం కోసం సాయం అందించాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను, కలెక్టర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని సింధు, దివ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, దయూమయులు స్పందించి తమ పిల్లల వైద్య చికిత్స కోసం తమవంతు ఆర్థిక సాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలని వారు చేతులెత్తి వేడుకుంటున్నారు. -
క్వార్టర్స్‌లో సింధు, ప్రణీత్
ప్రణయ్ కూడా... మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ మకావు: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-17, 21-18తో లిండావెని ఫనేత్రి (ఇండోనేసియా)పై గెలిచింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 46 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సింధు చైనాకు చెందిన చెన్ యుఫీతో తలపడుతుంది. ఇక పురుషుల విభాగంలో 15వ సీడ్ సాయి ప్రణీత్, ఏడో సీడ్ ప్రణయ్ కూడా క్వార్టర్స్‌కు చేరారు. ప్రి క్వార్టర్స్‌లో ప్రణయ్ 12-21, 21-11, 21-19తో కియావో బిన్ (చైనా)పై నెగ్గాడు. గంటా ఐదు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినా ప్రణయ్ చివరి రెండు గేమ్‌ల్లో బాగా ఆడాడు. సాయి ప్రణీత్ 21-15, 21-6తో గోహ్సూన్ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు. -
జనవరిలో ఐబీఎల్-2
బరిలో ఆరు జట్లు 15 రోజుల పాటు పోటీలు న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా గురువారం ప్రకటించారు. స్టార్ షట్లర్లు సైనా, సింధు, శ్రీకాంత్, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సమక్షంలో టోర్నీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆరింటిలో రెండు ఫ్రాంచైజీలను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ జట్టును ఇన్ఫినిటి సొల్యుషన్స్ తీసుకోగా, లక్నో టీమ్‌ను సహారా పరివార్ చేజిక్కించుకుంది. అయితే ఐబీఎల్ తొలి సీజన్‌ను నిర్వహించిన స్పోర్టీ సొల్యూషన్స్ ఐబీఎల్‌పై హక్కులు తమవేనంటూ ఢిల్లీలో కోర్టుకెక్కింది. -
రన్నరప్ సింధు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ ఒడెన్స్: ఫైనల్‌కు చేరిన మొదటి ప్రయత్నంలోనే కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19-21, 12-21తో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 24,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు సంచలనం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కేవలం 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-12, 21-15తో తై జు యింగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతంలో తై జు యింగ్ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన సింధు ఈసారి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. రెండు గేముల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న సింధు మ్యాచ్ సాగుతున్నకొద్దీ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడుతుంది. -
సైనా అలవోకగా...
ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం శ్రీకాంత్, ప్రణయ్ కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జకార్తా: ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి కచ్చితంగా పతకంతో తిరిగి రావాలని పక్కా ప్రణాళికతో సిద్ధమైన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ సైనా 21-13, 21-9తో ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో రెండుసార్లు వరుసగా ఆరేసి పాయింట్లు సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి, రెండో గేమ్‌లో చెలరేగి ఒకసారి వరుసగా 10 పాయింట్లు సంపాదించడం విశేషం. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా)తో పీవీ సింధు ఆడతారు. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో తకహాషిపై ఆధిక్యంలో ఉండగా... సింధు 1-2తో వెనుకంజలో ఉంది. కశ్యప్‌కు నిరాశ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పదో సీడ్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 11వ సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో సీడ్, ప్రపంచ పదో ర్యాంకర్ కశ్యప్ 21-17, 13-21, 18-21తో ప్రపంచ 34వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-14, 21-15తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21-14, 21-19తో ఎడ్విన్ ఎరికింగ్ (ఉగాండ)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్; యున్ హు (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో తన ప్రత్యర్థిపై శ్రీకాంత్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ప్రణయ్ 0-2తో వెనుకంజలో ఉన్నాడు. జ్వాల-అశ్విని జంట ముందంజ మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జ్వాల-అశ్విని ద్వయం రెండో రౌండ్లో 21-10, 21-18తో సెయి పి చెన్-వు తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) జంట 17-21, 19-21తో షిజుకా మత్సో-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జంట 16-21, 12-21తో పీటర్సన్-కోల్డింగ్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేటి మ్యాచ్‌లు ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
బాలికపై సామూహిక అత్యాచారం
మేడిపల్లిలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి.. ముగ్గురు యువకులు రిమాండ్ హైదరాబాద్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన హైదరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసి ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోడుప్పల్‌కు చెందిన ఓ మైనర్ బాలిక (16) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈమెకు ఉప్పల్ భరత్‌నగర్‌లో ఉండే పి.రవి(27)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఈ నెల 20న రవి సదరు బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి తాను నివాసం ఉండే భరత్‌నగర్ కు తీసుకొచ్చాడు. అదే కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని తన స్నేహితులు కస్తూరి లక్ష్మణ్ అలియాస్ సింధు (25), ఆసాల సురేశ్ అలియాస్ సూరి (24)తో కలసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయాడు. కాగా, బాలిక తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం తమ కూతురు కనిపించడం లేదని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లి దండ్రుల ఫిర్యాదు అనంతరం పోలీసులు విచారణ చేపట్టి వరంగల్‌లో ఉన్న బాధితురాలిని మేడిపల్లికి తీసుకొచ్చి విచారించారు. ఆమె అందించిన వివరాలతో ముగ్గురు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. -
సైనా, సింధులపై ఆశలు
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ) మంగళవారం ప్రారంభమవుతుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ పీవీ సింధులపైనే భారత్ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తొలి రౌండ్లో ‘బై’... రెండో రౌండ్లో తలపడాల్సిన ప్రత్యర్థి వైదొలగడంతో సైనా నెహ్వాల్ నేరుగా మూడో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ నోజోమి ఒకుహారా (జపాన్)తో మ్యాచ్ ఆడనుంది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్లో అనైత్ ఖుర్షుద్యాన్ (ఉజ్బెకిస్థాన్)తో తలపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంటే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. గతంలో సైనా (2010), సింధు (2014) ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకాలు అం దించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆశలన్నీ పారుపల్లి కశ్యప్‌పైనే ఉన్నాయి. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగారు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)తో ప్రపంచ 14వ ర్యాంకర్ కశ్యప్ తలపడతాడు. ఈ పోటీల్లో భారత్ తరఫున 1965లో దినేశ్ ఖన్నా స్వర్ణం, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్యం గెలిచారు. -
సింధుకు నిరాశ
మలేసియా మాస్టర్స్ టోర్నీ కుచింగ్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్ చేరుకోకుండానే ఇంటిముఖం పట్టారు. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు 21-19, 13-21, 8-21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో; పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ 21-10, 17-21, 16-21తో హ్యోక్ జిన్ జియోన్ (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సింధు, జయరామ్‌లిద్దరూ తమ ప్రత్యర్థులపై తొలి గేమ్ గెలిచాక తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకోవడం గమనార్హం. ప్రపంచ 24వ ర్యాంకర్ ఒకుహారా చేతిలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో ఓటమి. గతేడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి రెండు గేముల్లో గట్టిపోటీనే ఇచ్చింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున, మరో రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ఈ జపాన్ అమ్మాయి పాయింట్లు సాధించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన సింధు, జయరామ్‌లకు 1,740 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. లక్షా 7 వేలు)తోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించారు. తొలిరౌండ్లో సైనా 21-17, 21-11 స్కోరుతో జామీ సుబంది (అమెరికా)ను సునాయాసంగా ఓడించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్బుంరుంగ్పాన్పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో చో (చైనీస్ తైపీ)ని మట్టికరిపించాడు. -
సైనా, సింధు పరాజయం
ఒడెన్స్: మరోసారి ‘చైనా' అడ్డంకిని అధిగమించడంలో విఫలమైన సైనా నెహ్వాల్... ఆటలో నిలకడలేని పి.వి.సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించారు. ఈ ఇద్దరితోపాటు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్ 20-22, 15-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. సైనా వరుసగా రెండో ఏడాది డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సింధు 23-25, 20-22తో నాలుగో సీడ్ జీ హున్ సుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో సింధు 18-15తో ముందంజ వేసినా, ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. ఈ దశలో ఆధిక్యం ఇద్దరితో దోబూచులాడినా తుదకు జీ హున్ సుంగ్ గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలకదశలో సింధు తడబడి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-23, 17-21తో ఏడో సీడ్ వాన్ హో సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ 20-15తో ఆధిక్యంలో ఉన్నదశలో ఐదు గేమ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. రెండో గేమ్ ఆరంభంలో శ్రీకాంత్ 5-1తో ముందంజ వేసి, ఆ తర్వాత వెనుకబడి ఇక కోలుకోలేకపోయాడు. -
తొలి అడ్డంకి దాటారు
సైనా, సింధు శుభారంభం ఒడెన్స్: సింగిల్స్‌లో సంతోషం... డబుల్స్‌లో నిరాశ... డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తొలి రోజు భారత ప్రదర్శన ఇది. సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ తొలి రౌండ్ అడ్డంకిని విజయవంతంగా అధిగమించి రెండో రౌండ్లోకి ప్రవేశించగా... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం; మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) జోడీ మాత్రం తొలి రౌండ్లో ఓడిపోయాయి. ఆసియా క్రీడల తర్వాత బరిలోకి దిగుతోన్న తొలి టోర్నమెంట్లో శుభారంభం చేయడానికి సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించగా... సింధు అలవోక విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 12-21, 21-10, 21-12తో కరీన్ షానాస్ (జర్మనీ)పై, సింధు 21-13, 22-20తో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ 21-15, 21-18తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై, శ్రీకాంత్ 21-15, 17-21, 21-18తో జుయ్ సాంగ్ (చైనా)పై గెలిచారు. నిర్ణాయక చివరి గేమ్‌లో 16-18తో వెనుకబడిన దశలో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ 17-21, 15-21తో ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) చేతిలో; మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఇవనోవ్ 18-21, 18-21తో యున్ లంగ్ లాన్-యింగ్ సుయెట్ సె (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు. -
సైనా, సింధులకు పరీక్ష
నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ ఒడెన్స్: సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్, పి.వి.సింధు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన దీర్ఘకాల కోచ్ పుల్లెల గోపీచంద్‌కు వీడ్కోలు పలికి బెంగళూరులో మరో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందుతోన్న సైనాకు ఈ టోర్నీ ఎంతో కీలకంకానుంది. మరోవైపు అద్భుత నైపుణ్యం ఉన్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతోన్న సింధుకు కూడా ఈ టోర్నీ సవాలుగా నిలువనుంది. వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు గతేడాది ఈ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 2012లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సైనా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచి మిగతా టోర్నీలలో నిరాశ పరిచింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కరీన్ షానాస్ (జర్మనీ)తో సైనా; పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ ఇంగ్లండ్‌కు చెందిన రాజీవ్ ఉసెఫ్తో; జుయ్ సాంగ్ (చైనా)తో శ్రీకాంత్ పోటీపడతారు. వాస్తవానికి తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో శ్రీకాంత్ ఆడాలి. అయితే లీ చోంగ్ వీ వైదొలగడంతో అతని స్థానాన్ని జుయ్ సాంగ్‌తో భర్తీ చేశారు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగాల్సినప్పటికీ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మెయిన్ ‘డ్రా’కు అశ్విని-ఇవనోవ్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అశ్విని-ఇవనోవ్ 21-13, 21-17తో క్రిస్టియాన్సన్-లీనా గ్రెబెక్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది. -
సైనా, సింధుపై ఆశలు
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుపై భారీ ఆశలున్నాయి. దక్షిణ కొరియాలో శనివారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్ బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ తరపున 13 మంది బరిలో దిగుతున్నారు. వీరిలో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఏడు కేటగిరిల్లో పతకాల కోసం పోటీపడుతున్నారు. మహిళలు, పురుషుల సింగిల్స్, మహిళలు, పరుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషులు, మహిళల ఈమ్ ఈవెంట్లలో ఆడనున్నారు. సైనా, సింధుతో పాటు పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్, గురుసాయి దత్, సుమీత్, మను అట్రి, సౌరభ్ వర్మ, పీసీ తులసి, అశ్వినీ పొన్నప్ప, తన్వీ లాడ్, ప్రణవ్ చోప్రా ఆడనున్నారు. పతకాల వేటలో సైనా, సింధుపై చాలా అంచనాలున్నాయి. ఇతర ఆటగాళ్ల కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. -
కేసీఆర్ ను కలిసిన సింధు, గోపిచంద్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, కోచ్ గోపీచంద్ లు కలిశారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న కేసీఆర్ ను సింధు, గోపిచంద్ లు అభినందించారు. కేసీఆర్ తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలకు కేసీఆర్ మంచి ప్రోత్సాహకం ఇస్తున్నారు. ఏషియన్ గేమ్స్‌లో మరింత ప్రతిభ కనబరచాలని సీఎం కోరారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలిచినందుకు అభినందించారు అని తెలిపారు. -
వరల్డ్ బ్యాడ్మింటన్ : సింధూకు కాంస్య పతకం
-
వరల్డ్ బ్యాడ్మింటన్: సెమీఫైనల్లోకి ప్రవేశించిన సింధు
కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం వెల్లి విరిసింది. పుసర్ల వెంకట సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చైనాకు చెందిన సెకండ్ సీడ్ వాంగ్ షిజియాన్‌పై 19-21, 21-19, 21-15 స్కోరుతో సింధు జయభేరి మోగించింది. పదకొండో సీడ్ సింధు ఫస్ట్ గేమ్‌లో పోరాడి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, మిగతా రెండు గేముల్లో దుమ్ము రేపింది. నిరుడు గ్వాంగ్జావులో జరిగిన వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన సింధు, ఇప్పుడు మరో మెడల్‌ను గ్యారంటీ చేసుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ రెండు వరుస గేముల్లో 21-15, 21-15 స్కోరుతో టాప్ సీడ్ లీ షురాయ్ చేతిలో ఓడిపోయింది. -
కామన్వెల్త్ వీరులు బిజీ బిజీ
-
హైదరాబాద్ చేరుకున్న కామన్వెల్త్ విజేతలు
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం సాయంత్రం బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ పసిడి పతకం, సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కశ్యప్, సింధుతో పాటు గురుసాయి దత్ ఇతర క్రీడాకారులు నగరానికి వచ్చారు. -
శ్రీచైతన్య నారాయణ అద్భుత విజయాలు
ఎంసెట్ ఫలితాల్లో కనీవినీ ఎరుగుని అద్భుత విజయాలు శ్రీచైతన్య నారాయణ విద్యాసంస్థలు సాధించాయని సంస్థల అధినేతలు బి.ఎస్.రావు, సింధు నారాయణ తెలిపారు. మెడికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు తొలి 10ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 23 తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ గుర్రం సాయి శ్రీనివాస్, రెండో ర్యాంక్ బి.దివ్య, మూడో ర్యాంక్ కె. పృథ్వీరాజ్, 4వ ర్యాంక్ డి.హరిత, 5వ ర్యాంక్ మనోగ్నిత రెడ్డి, 6వ ర్యాంక్ భరత్‌కుమార్, 7వ ర్యాంక్ పి.శ్రీవిద్య, 8వ ర్యాంక్ సాత్విక్‌రెడ్డి, 9వ ర్యాంక్ ఆర్.సాయి హర్ష తేజ, 10 ర్యాంక్ గంటా సాయి నిఖిల సాధించారని పేర్కొన్నారు. 50లోపు 45 ర్యాంక్‌లు, 100లోపు 93 ర్యాంక్‌లు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 24 నారాయణ శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ ఎన్.పవన్‌కుమార్, రెండో ర్యాంక్ చాణుక్య వర్ధన్‌రెడ్డి, మూడో ర్యాంక్ నిఖిల్‌కుమార్, 4వ ర్యాంక్ నారు దివాకర్‌రెడ్డి, 5వ ర్యాంకు వి.ఆదిత్యవర్ధన్, 6వ ర్యాంక్ ప్రేమ్ అభినవ్, 7వ ర్యాంక్ అక్షయ్కుమార్రెడ్డి, 8వర్యాంక్ సాయి కాశ్యప్, 9వ ర్యాంకు పి.ఎస్.సూర్యప్రహర్ష, 10వ ర్యాంక్ సాయి చేతన్ కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 50లోపు 47 ర్యాంక్‌లు, 100లోపు 92 ర్యాంక్‌లు సాధించారని వెల్లడించారు. -
శ్రీకాంత్ సంచలనం
ప్రపంచ పదో ర్యాంకర్ నగుయాన్పై గెలుపు క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సింగపూర్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార కిదాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను 18-21, 21-15, 21-8తో ప్రపంచ పదో ర్యాంకర్, ఏడోసీడ్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. తద్వారా క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ కుర్రాడు పోరాట పటిమను ప్రదర్శించాడు. తొలి గేమ్‌లో 6-14తో వెనుకబడ్డా మెరుగైన ఆటతో 16-16తో స్కోరును సమం చేశాడు. అయితే స్కోరు 18-18 ఉన్న దశలో వియత్నాం ప్లేయర్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను సాధించాడు. రెండో గేమ్‌లో 8-5తో దూకుడు మీదున్న శ్రీకాంత్‌ను నగుయాన్ కాసేపు అడ్డుకున్నాడు. కానీ నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన శ్రీ వరుస పాయింట్లతో హోరెత్తించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం హైదరాబాద్ అబ్బాయి హవా కొనసాగింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 11-3, 16-6తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 24-22, 21-19తో జి లియాంగ్ డెరెక్ వాంగ్ (సింగపూర్)పై నెగ్గగా; హెచ్.ఎస్. ప్రణయ్ 17-21, 21-18, 12-21తో ఐదోసీడ్ పెంగ్యూ డూ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. సత్తా చాటిన సింధు మహిళల సింగిల్స్‌లో ఏపీ అమ్మాయి ఎనిమిదోసీడ్ పి.వి.సింధు 21-17, 17-21, 21-16 ప్రపంచ 123వ ర్యాంకర్ షిజుకా ఉచెద(జపాన్)పై నెగ్గింది. ఈ మ్యాచ్ గంటా 3 నిమిషాల పాటు జరిగింది. ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సింధు రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో గేమ్ ఓ దశలో హైదరాబాదీ 15-11 ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ జపాన్ అమ్మాయి ధాటిగా ఆడుతూ ఆధిక్యాన్ని 16-18కి తగ్గించింది. ఈ దశలో భిన్నమైన షాట్లతో అలరించిన సింధు మూడు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 7-21తో రెండోసీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు 17-21, 22-24తో మహ్మద్ అసాన్-హెంద్రా సెతివాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. దిగజారిన సింధు ర్యాంక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌కు పడిపోయింది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తొలి రౌండ్లోనే ఓడటం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. సైనా నెహ్వాల్ మాత్రం 8వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 19వ ర్యాంక్‌లో నిలిచాడు. శ్రీకాంత్‌కు 25వ ర్యాంక్ లభించింది. -
అగ్రశ్రేణి ఆటగాళ్లకు పరీక్ష
భారత షట్లర్లకు క్లిష్టమైన డ్రా సైనా ఈసారైనా నెగ్గేనా? నేటి నుంచే ఇండియా ఓపెన్ న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలువురు టాప్ షట్లర్లు పాల్గొంటున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌కు నేడే తెరలేవనుంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌తో సహా దాదాపు స్థానిక క్రీడాకారులందరికీ క్లిష్టమైన డ్రాలే ఎదురు కానుండడంతో టోర్నీపై గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి నెలకొంది. భారత షట్లర్లలో సైనాకు మాత్రమే సీడింగ్ (8వ) లభించింది. ప్రపంచ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ రచానోక్ (థాయ్‌లాండ్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. సైనాకు తొలిరౌండ్లో సిమోన్ ప్రచ్ (ఆస్ట్రియా) రూపంలో తేలికైన ప్రత్యర్థే ఎదురు పడనున్నా, క్వార్టర్స్‌కు చేరితే మాత్రం ఎనిమిదో సీడ్ చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో కఠిన పరీక్షే కానుంది. ఈ టోర్నీ గత మూడు ఎడిషన్లలో రెండో రౌండ్ దాటలేకపోయిన సైనా... ఈసారి తన రికార్డును మెరుగు పరచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక హైదరాబాద్ రైజింగ్ స్టార్ సింధు తొలి రౌండ్లోనే రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో తలపడనుంది. అయితే ఇటీవల స్విస్ ఓపెన్‌లో సింధు... షిజియాన్‌ను ఓడించడంతోపాటు ఓవరాల్‌గా ఆమెపై 3-0 రికార్డు కలిగి ఉండడం మానసికంగా పైచేయిగా కనిపిస్తోంది. ఇక ఇండియా ఓపెన్‌లో గత రెండు టోర్నీల్లో వరుసగా క్వార్టర్స్, సెమీఫైనల్‌కు చేరిన సింధుకు మంచి రికార్డే ఉంది. లీ చోంగ్ వీ (మలేసియా) టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌కు తాజా ర్యాంకింగ్ కారణంగా క్లిష్టమైన డ్రానే లభించింది. తొలిరౌండ్లోనే కశ్యప్ ఆరోసీడ్ చైనా ఆటగాడు జెంగ్‌మింగ్ వాంగ్‌తో తలపడాల్సివస్తోంది. మలేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌరభ్ వర్మ, కె.శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్ వంటివారు భారత్ తరపున ప్రధాన ఆటగాళ్లు కాగా... మహిళల సింగిల్స్‌లో పి.సి.తులసి, తన్వీ లాడ్, తృప్తి ముర్గుండే, సైలి రాణే, అరుంధతి లాంటి ద్వితీయశ్రేణి క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి-ప్రద్న్యా గాద్రె, ప్రజక్తా సావంత్-ఆరతి జోడీలు, మిక్స్‌డ్‌లో తరుణ్ కోన-అశ్విని, విష్ణు-అపర్ణా బాలన్ జంటలపై అంచనాలున్నాయి -
స్వస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు
బాసెల్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంచలనం పి.వి. సింధు స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 19-21, 21-16, 21-11తో లీ మిషెల్లి (కెనడా)పై చెమటోడ్చి నెగ్గింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ నిరాశచెందక పోరాడిన తెలుగమ్మాయి వరుసగా రెండు, మూడు గేముల్లో గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సంపాదించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ఆటగాడు ఆనంద్ పవార్ 21-14, 12-21, 12-21తో టియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. చెన్ చేతిలో పవార్ ఓడటం ఇది మూడో సారి. ఈ ఏడాది జర్మన్ ఓపెన్‌లోనూ అతని చేతిలోనే పవార్ ఓడాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ ముందంజ వేసింది. తొలిరౌండ్లో ఆరో సీడ్ సైనా 21-12, 21-12తో క్వాలిఫయర్ చిసాటో హోషి (జపాన్)పై విజయం సాధించింది. హైదరాబాదీ స్టార్ కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఇంటిదారి పట్టించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21-15, 21-14తో లుకాస్ ష్మిడ్ (జర్మనీ)పై గెలుపొందాడు. -
ఆల్ ఇంగ్లాండ్ బ్యాట్మెంటన్లో సైనా శుభారంభం
-
సింధు x సైనా
-
రేపు సైనా, సింధుల సూపర్ ఫైట్
లక్నో: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, వర్ధమాన సంచలనం పీ వీ సింధుల మధ్య మరోసారి సూపర్ ఫైట్ జరగనుంది. ఇండియన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ ఫైనల్లో తెలుగుతేజాలిద్దరూ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్ బెర్తులు దక్కించుకున్నారు. సెమీస్‌లో సింధు 21-6, 12-21, 21-17తో ఫనేట్రిపై పోరాడి గెలిచింది. మరో మ్యాచ్‌లో సైనా 21-14, 17-21, 21-19తో చైనా క్రీడాకారిణి ఝ్వాన్ డెంగ్పై అతికష్టమ్మీద నెగ్గింది. గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో సైనా మూడు గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో కే శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. -
సింధుకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికలు సత్తా చాటారు. అండర్-17, అండర్-19 విభాగాల్లో పోటీ పడిన ఏపీ అమ్మాయిలు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు నెగ్గారు. అసోంలోని గువహటిలో గురువారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 విభాగంలో రాష్ట్రానికి చెందిన జి. సింధు స్వర్ణం గెలుచుకుంది. 58 కేజీల కేటగిరీలో పోటీ పడిన సింధు మొత్తం 131 కిలోల (స్నాచ్ 56 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 75 కేజీలు) బరువు ఎత్తింది. అండర్-17 విభాగంలోనే ఏపీకి మరో మూడు రజతాలు లభించాయి. 44 కేజీల కేటగిరీలో టి. ప్రియదర్శిని (మొత్తం 110 కేజీలు-స్నాచ్ 46, క్లీన్ అండ్ జర్క్ 64 ), 63 కేజీల కేటగిరీలో జి. లలిత (మొత్తం 127 కేజీలు - స్నాచ్ 55, క్లీన్ అండ్ జర్క్ 72), 69 కేజీల కేటగిరీలో డి. సీతామహాలక్ష్మి (126 కేజీలు - స్నాచ్ 58, క్లీన్ అండ్ జర్క్ 68) రజతాలు గెలుచుకున్నారు. అండర్-19 విభాగంలో ఎం. ఊహాసాయికి రజత పతకం లభించింది. 75 కేజీల కేటగిరీలో పోటీ పడిన ఊహ మొత్తం 142 కిలోల (స్నాచ్ 60 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 82 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. -
సెమీస్‌లో పీవీ సింధు
న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం, వర్ధమాన యువ సంచలనం పీవీ సింధు సెమీస్‌లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 21-11, 21-13తో ఇండోనేసియా షట్లర్ హెరా డెసిపై విజయం సాధించింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ లిండవెని ఫనెట్రితో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌లో సింధు అలవోకగా నెగ్గింది. 34 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాదీ వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను వశం చేసుకుంది. సెమీస్ ప్రత్యర్థి డెసితో ముఖాముఖి మ్యాచ్‌ల్లో సింధుకు 3-2 రికార్డు ఉంది. గత టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచింది. -
చాంప్స్ శ్రీకాంత్, సింధు
జ్వాల జోడికి డబుల్స్ టైటిల్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు మెరిశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 20 ఏళ్ల శ్రీకాంత్ తొలిసారి జాతీయ సీనియర్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... 18 ఏళ్ల సింధు రెండోసారి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. గుత్తా జ్వాల తన భాగస్వామి అశ్విని పొనప్పతో కలిసి తన ఖాతాలో 14వసారి జాతీయ టైటిల్‌ను జమచేసుకుంది. సోమవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, సింధు, జ్వాల తమ డిపార్ట్మెంట్ జట్టయిన పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 21-13, 22-20తో రెండో సీడ్ గురుసాయిదత్ (ఆంధ్రప్రదేశ్-పీఎస్‌పీబీ)పై గెలుపొందాడు. ఈ టైటిల్ సాధించిన నాలుగో తెలుగు క్రీడాకారుడు శ్రీకాంత్. గతంలో పుల్లెల గోపీచంద్ (1996 నుంచి 2000 వరకు); చేతన్ ఆనంద్ (2003, 2006, 2007); కశ్యప్ (2012) ఈ ఘనత సాధించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-11, 21-17తో రీతూపర్ణ దాస్ (ఆంధ్రప్రదేశ్)ను ఓడించి 2011 తర్వాత మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 30 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించిన సింధు ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జంట 21-17, 21-16తో సిక్కి రెడ్డి (ఆంధ్రప్రదేశ్-ఏఏఐ)-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ) ద్వయంపై గెలిచి 2009 తర్వాత మరోసారి జాతీయ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో జ్వాల-అశ్విని గత ఆదివారం టాటా ఓపెన్ ఫైనల్లో సిక్కి-ప్రద్న్యా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఓవరాల్‌గా జ్వాలకిది 14వ జాతీయ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)-మనూ అత్రి (ఏఏఐ) ద్వయం 19-21, 17-21తో ప్రణవ్ చోప్రా (పీఎస్‌పీబీ)-అక్షయ్ దివాల్కర్ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ) జోడి 21-10, 21-17తో తరుణ్ (పీఎస్‌పీబీ)-అశ్విని జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
భవనంపై నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
నగరంలోని ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థిని సింధు (20) గత అర్థరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో తోటి విద్యార్థులు వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్న సింధు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సింధు ఆత్మహత్య గల కారణాలను ఆన్వేషించేందుకు పోలీసులు తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. సింధు ఆత్మహత్యపై ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే సింధు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సింధుకు ఆ అదృష్టం ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంచలనం పూసర్ల వెంకట సింధుకు పురస్కారం అందుకునే అదృష్టం మాత్రం దక్కలేదు. శనివారం ముంబైలో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఫైనల్ ఆడుతున్న కారణంగా సింధు...ఢిల్లీలో అర్జున ప్రదానోత్సవం కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. ఆమె తరఫున తల్లిదండ్రులు రమణ, విజయలలో ఒకరు ఈ అవార్డును తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇందుకు నిబంధనలు అంగీకరించవని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కొద్ది రోజుల అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి ద్వారా గానీ, రాష్ట్ర గవర్నర్ ద్వారా గానీ అర్జున అవార్డును సింధుకు అందజేసే అవకాశం ఉంది. మరో వైపు క్రీడా శిక్షణలో అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ‘పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి దక్కిన ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ను గోపీచంద్ తల్లిదండ్రులు సుబ్బారావమ్మ, సుభాష్ చంద్ర అందుకున్నారు. -
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సింధు
గ్వాంగ్జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. దాంతో పుసర్ల వెంకట సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం దక్కింది. తనకన్నా మెరుగైన థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ ఇంతినాన్ చేతిలో సింధు 21-10, 21-13 స్కోరుతో పరాజయం పాలైంది. 36 నిమిషాల పేపు జరిగిన ఈ పోరాటంలో మొదటి సెట్లో సింధు చేసిన పొరబాట్లతో నాలుగో సీడ్ రచనోక్ లాభ పడిందింది. రెండో గేమ్‌లో సింధు పుంజుకున్నప్పటికీ, ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రకాష్ పడుకొనే తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారిణి సింధు కావడం విశేషం. నిరుడు మహిళల డబుల్స్‌లో జ్వాల, అశ్విని కాంస్య పతకాన్ని గెలుపొందారు. -
సెమీస్ నుంచి నిష్క్రమించిన సింధు
గ్వాంగ్జూ (చైనా) : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో తెలుగు తేజం సింధు పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్ నుంచి ఆమె నిష్క్రమించి కాంస్యంతోనే సరిపెట్టుకుంది. రత్చనోక్ (థాయ్‌లాండ్)చేతిలో సింధు 21-10, 21-13 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ షిజియాన్ వాంగ్‌పై 21-18, 21-17 తేడాతో సింధు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు ఓ పతకం రావటం ఇదే మొదటిసారి.