తిరుమల అతిథిగృహంలో పీవీ సింధూ, పుల్లెల గోపీచంద్, భానుప్రకాష్‌రెడ్డి, హరీంద్రనాథ్
సాక్షి, తిరుమల: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ శనివారం తిరుమలకు వచ్చారు. ఈ విశ్వ రజత విజేత గతంలో రియో ఒలింపిక్స్ ముందు ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అత్భుత ప్రతిభతో వెండి పతకం సాధించిన నేపథ్యంలో ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు తల్లిదండ్రులు పీవీ రమణ, పి.విజయ, కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలసి శనివారం రాత్రి 10 గంటలకు తిరుమలకు వచ్చారు. ఇక్కడి జీఎమ్మార్ అతిథిగృహం వద్ద బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు.