ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది.
అయితే రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment