ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 18–21, 21–12, 21–16తో ప్రపంచ 7వ ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచింది.
63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాతి రెండు గేముల్లో గెలిచి ముందంజ వేసింది. హాన్ యువెపై సింధుకిది ఏడో విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–2తో గ్రెగోరియాపై ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment