
డబుల్స్‌లో గాయత్రి జోడీ సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment