french open badminton tournment
-
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లింది. ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 21–10, 21–14తో గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 21–18, 21–13తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ 78 నిమిషాల్లో 21–19, 12–21, 20–22తో గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సాత్విక్- చిరాగ్ జోడి సంచలనం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల డబుల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-18, 21-14తో చోయ్ సోల్ గ్యు-కిమ్ వాన్ హో ద్వయం(కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్- చిరాగ్ జంట ఆద్యంతం ఆధితప్యం చెలాయించారు. #FrenchOpen2022 #FrenchOpenSuper750 #Badminton Indian pair of Satwiksairaj Rankireddy and Chirag Shetty reaches French Open men's doubles final pic.twitter.com/CZIDpIXM2x — TOI Sports (@toisports) October 29, 2022 కాగా ఈ ఏడాదిలో ఈ జోడికి ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇంతకముందు జనవరిలో ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడి టైటిల్ కొల్లగొట్టింది. తాజాగా మరో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌పై కన్నేసింది. కాగా ఈ టోర్నీలో ఎనిమిది మంది భారత షట్లర్లు పాల్గొనగా మిగిలింది ఈ ఒక్క జంట మాత్రమే. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తో పాటు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యారు. -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆశల పల్లకిని మోస్తున్న ఏకైక జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న భారత పురుషుల డబుల్స్ జోడీ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ టకురొ హొకి–యుగొ కొబయషి (జపాన్) జంటను కంగు తినిపించింది. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుస గేముల్లో 21–12, 21–16 టాప్‌సీడ్ జంటకు ఇంటిదారి చూపింది. హొకి–యుగొతో తలపడిన నాలుగు మ్యాచ్‌లలో వీరికి ఇది మూడో విజయం కాగా... వీరిద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇది మూడో సారి. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ కొరియాకు చెందిన చొయ్ సొల్ గ్యు–కిమ్ వోన్ హో జంటను ఎదుర్కొంటుంది. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
French Open: రాఫెల్ నాదల్ X రూడ్
పారిస్: 13 సార్లు చాంపియన్ ఒకవైపు... తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన యువ ఆటగాడు మరోవైపు... క్లే కోర్టు అడ్డా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తుది పోరులో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన రాఫెల్ నాదల్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌తో తలపడతాడు. తన 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డులో 13 ఇదే కోర్టులో నెగ్గిన నాదల్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ప్రయత్నంలోనే కొండను ఢీకొట్టబోతున్న రూడ్ ఏమాత్రం పోటీనిస్తాడనేది చూడాలి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్ 3–6, 6–4, 6–2, 6–2తో సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి నార్వే ప్లేయర్‌గా రూడ్ ఘనత సాధించాడు. -
సెమీస్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–14తో బుసానన్ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో సయాకా తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 15–21తో హెయో క్వాంగ్గీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–18, 18–21, 17–21తో ఆరోన్ చియా–సో వుయ్ యికి (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్‌లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ (భారత్) 21–17, 21–13తో లో కీన్ య్యూ (సింగపూర్)పై నెగ్గాడు. హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్ నుంచి సమీర్ వర్మ (భారత్) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్ జొర్డాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
ఫ్రెంచ్ ఓపెన్‌పై కరోనా పంజా.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్‌కు పాజిటివ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 టెన్నిస్ టోర్నీపై కరోనా వైరస్ పంజా విసిరింది. అత్యంత కఠిన నిబంధనల నడుమ సాగుతున్న ఈ టోర్నీలో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డట్టు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. పురుషుల డబుల్స్ ఈవెంట్లో పాల్గొంటున్న టాప్ సీడ్ క్రొయేషియా ఆటగాళ్లు నికోలా మెక్టిక్, మేట్ పావిక్‌లకు కరోనా సోకడంతో ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్టీ) వారిని క్వారంటైన్‌కు తరలించింది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో స్పెయిన్‌కు చెందిన మరో పురుషుల డబుల్స్ జోడీ జామే మునార్, ఫెలిసియానో లోపెజ్ లు మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు అదృశ్యమయ్యారు. వీరిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో నిర్వాహకులకు సమాచారం ఇవ్వకుండా టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగారని తెలుస్తోంది. దీంతో వీరి పేర్లను కూడా డ్రా నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లతో పాటు స్టాఫ్ మెంబర్స్ బయో బబుల్‌లోనే గడుపుతున్నారు. ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ ఇప్పటివరకు దాదాపు 3000 పరీక్షలు నిర్వహించింది. అయినప్పటికీ కేసులు క్రమంగా బయట పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పారిస్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం అర్థరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మహిళల ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణి నయోమీ ఒసాకా తొలి మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశానికి హాజరుకానందున ఆమెకు జరిమానా విధించడంతో ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డు బ్రేక్.. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
సైనా... 12వ‘సారీ’
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 20–22, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా 12వ పరాజయం కావడం విశేషం. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు చేతిలో సైనా ఓడిన సంగతి తెలిసిందే. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సైనా 20–16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో ఈ భారత స్టార్ పూర్తిగా చేతులెత్తేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–17, 21–11తో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం క్వార్టర్ ఫైనల్లో సుమీత్–మను అత్రి జంట 21–16, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియు చెంగ్–నాన్ జాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. -
అందరూ ముందుకు
పారిస్: భారత స్టార్ షట్లర్లంతా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ చేరారు. అయితే మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీషా రామ్ జోడీకి ప్రి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సింధు 21–17, 21–16తో సయాక సాటో (జపాన్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 12–21, 21–16, 21–18తో లీ డాంగ్ కిన్ (కొరియా)పై చెమటోడ్చి నెగ్గాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో మొదటి గేమ్‌ను కోల్పోయిన భారత ఆటగాడు తర్వాత పుంజుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా శ్రీకాంత్‌లాగే తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ తర్వాత రెండు గేముల్లోను ప్రత్యర్థిని చిత్తు చేసింది. డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ అయిన సైనా 10–21, 21–14, 21–17తో మాజీ ప్రపంచ చాంపియన్, ఎనిమిదో సీడ్ నొజోమి ఒకుçహార (జపాన్)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–19తో హి జితింగ్–తన్ కియాంగ్ (చైనా) జంటపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీష జోడి 15–21, 13–21తో నాలుగో సీడ్ గ్రేసియా పొలి–అప్రియని రహయు (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మరో వైపు ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ సింధు మళ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో ఆమె ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్–2లో కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ఆమె రెండో ర్యాంకులోకి వచ్చినా ఆ స్థానంలో పదిలంగా కొనసాగలేకపోయింది. -
సింధు ప్రతీకారం
పారిస్: ఈ ఏడాది వరుసగా రెండుసార్లు బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మూడోసారి మాత్రం పైచేయి సాధించింది. మంగళవారం మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌పై గెలిచింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఇచ్చిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, గత వారం డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో సింధుపై నెగ్గిన జాంగ్ ఈసారి మాత్రం ఓటమి రుచి చూసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) జంట 14–21, 17–21తో లీ జున్హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడింది. -
సైనా, శ్రీకాంత్ క్వార్టర్స్ దాటేనా?
పారిస్: కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల ప్రదర్శనను మినహాయిస్తే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. సైనా, సింధు నిలకడగా రాణిస్తున్నప్పటికీ తుది పోరులో బోల్తా పడటం... లేదంటే తై జు యింగ్ (చైనీస్ తైపీ), బీవెన్ జాంగ్ (అమెరికా), అడ్డంకిని దాటలేకపోతున్నారు. మరోవైపు గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన శ్రీకాంత్ ఈ సీజన్లో తొమ్మిది టోర్నీల్లో ఆడినా ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరలేకపోయాడు. ముఖ్యంగా శ్రీకాంత్‌కు ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో కెంటో మొమోటాతో ఆడిన శ్రీకాంత్ ఒక్కసారీ అతడిని ఓడించలేకపోయాడు. మరోవైపు ఈ ఏడాది తై జు యింగ్ చేతిలో సైనా ఐదుసార్లు... బీవెన్ జాంగ్ చేతిలో సింధు రెండుసార్లు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లోనూ సైనా, సింధు, శ్రీకాంత్‌లకు వరుసగా తై జు యింగ్, బీవెన్ జాంగ్, కెంటో మొమోటా ఎదురుకానున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే బీవెన్ జాంగ్‌తో సింధు తలపడనుంది. గతవారం డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో, ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో బీవెన్ జాంగ్ చేతిలో సింధు పరాజయాన్ని ఎదుర్కోంది. సైనా తొలి రౌండ్లో సెనా కవకామి (జపాన్)తో ఆడనుంది. తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) లేదా బీట్రిజ్ కొరాలెస్ (స్పెయిన్)లలో ఒకరితో సైనా తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ సైనా గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ఈ ఏడాది ఎనిమిది టైటిల్స్ నెగ్గి అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న తై జు యింగ్ ఎదురయ్యే చాన్స్ ఉంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ ఆడనున్నాడు. ఆసియా క్రీడల్లో రెండో రౌండ్లోనే వోంగ్ వింగ్ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఒకవేళ శ్రీకాంత్ తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో లీ డాంగ్ కెయున్ (కొరియా)... క్వార్టర్ ఫైనల్లో కెంటో మొమోటా ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాంత్‌తోపాటు సమీర్ వర్మ, సాయిప్రణీత్ కూడా ఈ టోర్నీ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో బ్రెజిల్ ఆటగాడు వైగోర్ కొల్హోతో సాయిప్రణీత్... ఆసియా క్రీడల చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్ వర్మ ఆడనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మను అత్రి–సుమీత్ రెడ్డి; అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీలు... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని; రోహన్ కపూర్–కుహూ గార్గ్; మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీషా రామ్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ఫ్రెంచ్ ఓపెన్.. పీవీ సింధు ఓటమి
సాక్షి, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకి నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఆమె నిష్క్రమించింది. శనివారం సాయంత్రం సెమీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-14, 21-9 తేడాతో ఓటమిపాలైంది. తొలి రౌండ్ లో హోరాహోరీ ప్రదర్శన కనబరిచినప్పటికీ.. అడ్వాంటేజ్ పాయింట్ నుంచి యమగుచి విజృంభించటం మొదలుపెట్టింది. రెండో సెట్‌ను పూర్తిగా చేజార్చుకున్న సింధు చివరకు సెమీస్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయ్యింది. మరోపక్క మెన్స్ సింగిల్స్ లో కిదంబి శ్రీకాంత్ మీద ప్రత్యర్థి హెచ్ఎస్ ప్రన్నోయ్ 21-14తో తొలిసెట్‌ను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
‘ఫ్రెంచ్’లో ఖేల్ ఖతం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. అటు పురుషుల విభాగంలో శ్రీకాంత్, అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ కూడా ఓటమి చవిచూశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సైనా 22-20, 15-21, 20-22తో యోన్ జూ బే (దక్షిణకొరియా) చేతిలో కంగుతింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏపీ అమ్మాయి తొలి గేమ్‌లో దూకుడును కనబర్చింది. అయితే రెండో గేమ్‌లో స్థాయి మేరకు రాణించలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలో 12-10తో పైచేయి సాధించింది. నెట్ వద్ద మెరుగ్గా ఆడిన జూ బే 12-12తో స్కోరును సమం చేసింది. ఇక ఇక్కడి నుంచి ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు క్రీడాకారిణిలు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో 14-14, 17-17తో స్కోరు సమమైనా సైనా రెండు బలమైన స్మాష్‌లతో చెలరేగి 19-17 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని ఎక్కువసేపు కాపాడుకోలేకపోవడంతో 19-19, 20-20తో స్కోరు సమమైంది. చివరకు జూ బే రెండు గేమ్ పాయింట్లతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) 10-21, 21-19, 21-16తో సింధుపై నెగ్గింది. చకచకా వరుస పాయింట్లతో తొలి గేమ్‌ను సునాయసంగా గెలిచిన సింధు... రెండో గేమ్‌లోనూ అదే ఊపును కొనసాగించింది. అయితే చివర్లో రెండు గేమ్ పాయింట్లను చేజార్చుకోవడంతో మూల్యం చెల్లించుకుంది. మూడో గేమ్‌లో స్కోరును 11-11తో సమం చేసినా ఆ తర్వాత క్రమంగా ఆటపై పట్టు కోల్పోయింది. పురుషుల విభాగంలో రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ 21-15, 18-21, 15-21తో ఆరోసీడ్ బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో; అజయ్ జయరామ్ 18-21, 18-21తో టాప్‌సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; ఆనంద్ పవార్ 20-22, 18-21తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.