
సాక్షి, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకి నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఆమె నిష్క్రమించింది. శనివారం సాయంత్రం సెమీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-14, 21-9 తేడాతో ఓటమిపాలైంది.
తొలి రౌండ్ లో హోరాహోరీ ప్రదర్శన కనబరిచినప్పటికీ.. అడ్వాంటేజ్ పాయింట్ నుంచి యమగుచి విజృంభించటం మొదలుపెట్టింది. రెండో సెట్‌ను పూర్తిగా చేజార్చుకున్న సింధు చివరకు సెమీస్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయ్యింది. మరోపక్క మెన్స్ సింగిల్స్ లో కిదంబి శ్రీకాంత్ మీద ప్రత్యర్థి హెచ్‌ఎస్ ప్రన్నోయ్ 21-14తో తొలిసెట్‌ను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment