semi final match
-
ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైనల్‌కు సింగరేణి జట్టు
నాంపల్లి: ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలు తలపడుతున్న ప్రతిష్టాత్మక ఎన్ఎండీసీ క్రికెట్ టోర్న్ లో సింగరేణి కాలరీస్ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హైదరాబాద్‌లోని విజయ్ ఆనంద్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింగరేణి జట్టు హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) జట్టుతో తలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హెచ్ఏఎల్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెచ్ఏఎల్ జట్టు ఓపెనర్ సందీప్‌కుమార్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. సింగరేణి జట్టు బౌలర్లు జగదీష్ (2 వికెట్లు), మహేష్ (2 వికెట్లు), హరికిషన్ (ఒక వికెట్)లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి హెచ్ఏఎల్ జట్టును తక్కువ స్కోర్‌కు పరిమితమ్యేలా చేయడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత 109 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సింగరేణి జట్టు ఓపెనర్లు శశికాంత్, డేవిడ్, రిచర్డ్స్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే కాకుండా తొలి వికెట్‌కు కేవలం 9 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 47 పరుగుల వద్ద డేవిడ్ రిచర్డ్స్ అవుట్ అయ్యాక.. జట్టు కెపె్టన్ శశికాంత్ నిలకడగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. డేవిడ్ రిచర్డ్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ టోరీ్నలో సింగరేణి జట్టు లీగ్ దశలో తాను ఆడిన ఈసీఐఎల్, మిథాని, ఎన్ఆర్ఎస్ఈ జట్లను ఓడించి ఓటమి లేని జట్టుగా నిలిచింది. ఆగస్టు 6న ఆదివారం ఫైనల్ మ్యాచ్ భెల్‌తో తలపడనుంది. -
Novak Djokovic: వరుసగా 27వ విజయం.. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో
సెర్బియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ ఐదో ర్యాంకర్.. నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్స్‌కు వెళ్లడం ఇది పదోసారి. శుక్రవారం అమెరికాకు చెందిన 35వ ర్యాంకర్ టామీ పాల్‌ను 7-5, 6-1,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. తొలి సెట్ నుంచే జొకోవిచ్ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్ మ్యాచ్ మొత్తంలో ఏడు బ్రేక్ పాయింట్స్ సాధించడం విశేషం. ఇప్పటికే రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టిన జొకోవిచ్ 10వ టైటిల్‌పై కన్నేశాడు. అంతేకాదు 21 కెరీర్ గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ప్రతీసారి జొకోవిచ్ టైటిల్ కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లుగా ఓటమనేదే లేకుండా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ సిట్సిపాస్‌తో జొకోవిచ్ అమితుమీ తేల్చుకోనున్నాడు. #AusOpen semifinals: ✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️#AusOpen finals: 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆❓ Will X mark the spot for @DjokerNole on Sunday?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AO2023 pic.twitter.com/lcx6Wnm3dT — #AusOpen (@AustralianOpen) January 27, 2023 ఇంటిబాట పట్టిన కచనోవ్.. ఫైనల్‌కు సిట్సిపాస్ అంతకముందు జరిగిన మరో సెమీస్ పోరులో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెపానోస్ సిట్సిపాస్(ప్రపంచ నాలుగో ర్యాంకర్).. రష్యాకు చెందిన కచనోవ్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో సిట్సిపాస్.. కచనోవ్‌ను 7-6(7-2), 6-4,6-7(8-6), 6-3 తేడాతో మట్టికరిపించాడు. A sizzling semifinal ends in Greek glory 🇬🇷 @steftsitsipas overcomes a valiant Karen Khachanov to reach his first #AusOpen final. It ends 7-6(2) 6-4 6-7(6) 6-3 👏#AO2023 pic.twitter.com/jsik2uaovL — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
మహిళల టి20 వరల్డ్‌కప్: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
FIFA WC: సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరింది. ఇక, డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నిలిచింది. ఇదిలా ఉండగా.. రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను ఓడించి విన్నర్‌గా నిలిచింది. 🔝 performance 💥@AntoGriezmann covered every blade of grass to ensure @FrenchTeam would reach back-to-back #FIFAWorldCup Finals 🔥 Enjoy his Hero of the Day display, presented by @Mahindra_Auto#FRAMAR #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/G7UOQ42HCa — JioCinema (@JioCinema) December 14, 2022 -
FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ(డిసెంబర్ 14న) మొరాకో, ఫ్రాన్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో డిఫెండర్ అచ్రాఫ్ హకీమిలు ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మెన్కు(పీఎస్జీ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నెలన్నర వ్యవధిలో పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒక్కటే. ఎంబాపె గోల్ కొడితే.. అచ్రాఫ్ హకీమి సెలబ్రేట్ చేయడా.. అదే విధంగా హకీమి గోల్ కొడితే ఎంబాపె సంబరం చేసుకుంటాడు. హాలిడే టూర్ వెళ్లాల్సి వస్తే ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు దేశం కోసం ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఫ్రాన్స్ తరపున ఎంబాపె.. మొరాకో తరపున అచ్రాఫ్ హకీమిలు ఎదురుపడనున్నారు. ఇంతకాలం స్నేహితులుగా ఉన్న వీళ్లలో ఎవరిరపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె ఈ వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన ఎంబాపె అత్యధిక గోల్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్ చేరింది. మరోవైపు మొరాకో మాత్రం సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూఫ్ దశలో బెల్జియంను, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్ లాంటి పటిష్టమైన జట్లకు షాక్ ఇస్తూ రోజురోజుకు మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ముందు మొరాకో ఆటలు సాగుతాయా లేక ఛాంపియన్స్‌కు మొరాకో షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొరాకో ఫైనల్ చేరితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించనుంది. చదవండి: FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్ పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి View this post on Instagram A post shared by Achraf Hakimi (@achrafhakimi) -
ARG VS CRO: అన్నంత పని చేసిన ఫిఫా.. ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అన్నంత పని చేసింది. వరల్డ్‌కప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హద్దు మీరి ప్రవర్తించిన అర్జెంటీనా ఆటగాళ్లపై వేటు వేసింది. మార్కోస్ అకునా, గొంజాలో మాంటియల్పై ఫిఫా ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. ఫిఫా ఇచ్చిన ఈ ఊహించని షాక్‌తో అర్జెంటీనా ఖంగుతింది. డిసెంబర్ 14న క్రొయేషియాతో జరుగబోయే కీలక సెమీస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఫిఫా.. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ జట్టు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. Gonzalo Montiel and Marcos Acuña will not be able to play the semifinals due to suspension. pic.twitter.com/PGoqnT8wzF — Abubakar Ahmad Mulawa (@Mulawa99) December 10, 2022 కాగా, డచ్ టీమ్‌తో డిసెంబర్ 10న జరిగిన హోరాహోరీ క్వార్టర్స్ సమరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఓవరాక్షన్ చేయడంతో రిఫరీ అంటోనియో మాథ్యూ ఏకంగా 16 సార్లు ఎల్లో కార్డ్ (ఆటగాళ్లకు మందలింపులో భాగంగా ఎల్లో కార్డులను చూపుతారు) చూపించాడు. ఇందులో భాగంగానే ఫిఫా.. ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇదిలా ఉంటే, తొలి సెమీఫైనల్లో క్రితం వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా.. అర్జెంటీనా ఢీకొంటుంటే.. డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో తలపడుతుంది. ఈ రెండు సెమీస్‌లో విన్నర్లు.. డిసెంబర్ 18వ తేదీన జరిగే తుది సమరంలో అమీతుమీ తేల్చుకుంటాయి. -
'ఒక్క మ్యాచ్‌కే తీసిపారేయొద్దు.. నెంబర్-1 ర్యాంక్ రాత్రికి రాత్రే రాలేదు'
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఓడిపోవడం అభిమానులను చాలా బాధించింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసిన టీమిండియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అందుకే మ్యాచ్ జరిగి రెండు రోజులు పూర్తవుతున్నా అభిమానులు మాత్రం దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా సెమీస్ ఓటమిపై ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. '' ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. తొలుత భారీ స్కోరు చేయకపోవడం టీమిండియాను దెబ్బకొడితే.. ఆపై బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. ఒక్క మ్యాచ్‌కే టీమిండియాను విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా టి20ల్లో టీమిండియా బాగానే రాణిస్తుందని.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో ఉందన్న విషయం మరిచిపోవద్దు. నెంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది టి20 ప్రపంచకప్‌లో ఒక సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనను చూసి తప్పుబట్టకూడదు. ఆటలో ఎత్తుపల్లాలు ఉండడం సహజమే. అయితే ఒక మేజర్ టోర్నీలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన ఇచ్చిందన్న బాధ అభిమానులకు ఉంటుంది.'' అని పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్, పాకిస్తాన్ల మధ్య ప్రతిష్టాత్మక ఫైనల్ జరగనుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. రిజర్వ్ డే రోజున వర్షం వల్ల ఫలితం రాకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. #WATCH | I know that the Semi Finals against England was very disappointing. Let's accept that we did not put up a good total on the board. It was a tough game for us, a bad and disappointing defeat. We have been World number 1 T-20 side as well: Cricketer Sachin Tendulkar to ANI pic.twitter.com/zjT3SjwZ8l — ANI (@ANI) November 12, 2022 చదవండి: T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం రూల్స్ సవరింపు! T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే? -
సెమీస్ అంటే కోహ్లికి పూనకాలే..
టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్థసెంచరీతో మెరిశాడు. టి20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ అంటే చాలు కోహ్లిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక కోహ్లికి సెమీఫైనల్స్ అంటే పూనకాలే అన్నట్లుగా అతని బ్యాటింగ్ ఉంటుంది. తాజా దానితో కలిపి ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో మూడు అర్థసెంచరీలు సాధించాడు. తొలిసారి 2014లో సౌతాఫ్రికాపై 72 పరుగులు నాటౌట్, 2016లో వెస్టిండీస్‌పై 89 పరుగులు నాటౌట్, తాజాగా ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించాడు. ఇలా ఒక వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో మూడు అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లికి ఇది నాలుగో అర్థసెంచరీ కావడం విశేషం. చదవండి: IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి! -
ఫైనల్ దారిలో రికార్డులు బద్దలు కొట్టిన పాక్
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ రెండోసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► టి20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు కివీస్‌ను పాకిస్తాన్ 18 సార్లు(తాజా మ్యాచ్‌తో కలిపి) ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఇండియా వెస్టిండీస్‌ను 17సార్లు, ఇండియా శ్రీలంకను 17 సార్లు, ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను 17సార్లు మట్టికరిపించాయి. ► 2009 నుంచి టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు సెమీఫైనల్లో ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా మూడోసారి(ఇంతకముందు 2007, 2009) కాగా.. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం. ► ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ సెమీస్‌లో ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2007, 2022 టి20 ప్రపంచకప్‌లలోనూ కివీస్‌ను సెమీస్‌లో ఓడించింది. ► 2021 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన టి20 మ్యాచ్‌ల్లో సౌథీ వికెట్ తీయకపోవడం ఇది రెండో సారి మాత్రమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు. చదవండి: NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్ -
'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం
న్యూజిలాండ్ జట్టును ఇష్టపడని వారు ఉండరు. వివాదరహిత జట్టుగా పేరున్న కివీస్‌కు మంచి జట్టు అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ ట్యాగ్‌లైన్ ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ కివీస్ విషయంలో అలా పిలవచ్చో లేదో అనే డైలమా నెలకొనేలా చేశారు. క్రికెట్లో సౌతాఫ్రికాకు 'చోకర్స్' అనే ముద్ర ఉంది. కానీ కివీస్‌ను అలా పిలవాలన్న మనసొప్పదు. కారణం వారి ఆటతీరు. సౌతాఫ్రికాకు దురదృష్టం ఎక్కువగా ఉంటే.. కివీస్ విషయంలో మాత్రం కొంత దురదృష్టం.. కొంత స్వయంకృతం తోడవుతాయి. అందుకే వారికి బ్లాక్‌క్యాప్స్ అని ముద్ర పడింది. సైన్స్‌ను నమ్మేవాళ్లకు వింత అనిపించినా.. న్యూజిలాండ్ జట్టు ధరించే బ్లాక్ జెర్సీని మారిస్తేనైనా కప్ కొడుతుందేమోనన్న నమ్మకం ఈరోజుతో మరింత బలంగా తయారైంది. బ్లాక్ క్యాప్స్ అని ఊరికే అనలేదన్న విషయాన్ని కివీస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు మరోసారి తేలిపోయింది. ఈసారి కప్ కచ్చితంగా కొడుతుంది అన్న తరహాలో వారి ప్రదర్శన కొనసాగడం.. తీరా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2022లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సూపర్-12 దశలో ఇంగ్లండ్ చేతిలో ఓటమి మినహా టాప్ ప్రదర్శన కనబరిచిన కివీస్ అందరూ ఊహించినట్లుగానే సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో మాత్రం మళ్లీ పాత కథే. గ్రూప్-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్.. కీలకమైన నాకౌట్(సెమీస్)లో తమకు అలవాటైన రీతిలోనే పాకిస్తాన్ చేతిలో చిత్తైంది. అందునా పాకిస్తాన్‌తో సెమీఫైనల్ అంటేనే చెత్త రికార్డు కలిగి ఉన్న న్యూజిలాండ్ దానిని విజయవంతంగా నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ఐసీసీ మెగాటోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ నాలుగుసార్లు ఓడించింది. ఇందులో రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్‌లో(1992, 1999).. రెండుసార్లు (2007, 2022) టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఉన్నాయి. అంతేకాదు 2015 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నీల్లో(ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ మినహా) కనీసం సెమీస్ చేరిన జట్టుగా నిలిచింది న్యూజిలాండ్. అయితే నాకౌట్ ఫోబియా మాత్రం ఆ జట్టును వీడడం లేదు. ఇక వచ్చే ఏడాది 2023లో వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో అప్పుడైనా తమపై ఉన్న బ్లాక్‌క్యాప్స్ ముద్ర తొలగించుకుంటారేమో చూడాలి. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం న్యూజిలాండ్ ఆటతీరు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. మంచి జట్టుగా పేరున్న కివీస్‌కు ఈ నాకౌట్ ఫోబియా ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఎందరు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మారడం లేదని.. తాను కెప్టెన్సీ చేపట్టిన ఆరేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో కివీస్‌ను మూడుసార్లు కనీసం సెమీస్ చేర్చిన కేన్ విలియమ్సన్ కల కూడా నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు. 2019లో న్యూజిలాండ్ టైటిల్ కొట్టబోతుందంటూ ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో జోస్యం చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూయడం సగటు అభిమానిని బాధపడేలా చేసింది. కనీసం ఈసారైనా టైటిల్ కొట్టి తామేంటో నిరూపించుకోవాలనుకున్న కివీస్‌కు మరోసారి భంగపాటే ఎదురైంది. ఇక కివీస్ ఓటమికి కొన్ని కారణాలున్నాయి. అందులో మార్టిన్ గప్టిల్ లాంటి సీనియర్ ప్లేయర్‌ను పక్కనబెట్టడం జట్టు సమతుల్యం దెబ్బతీసిందని చెప్పొచ్చు. అతను ఫామ్‌లో ఉన్నాడో లేదో తెలియదు కానీ జట్టుకు ఒక సీనియర్ ఆటగాడి సేవలు చాలా అవసరం. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్స్‌తో పాటు 2021 టి20 ప్రపంచకప్‌ల్లో కివీస్ ఫైనల్ చేరడంలో మార్టిన్ గప్టిల్‌ది కీలకపాత్ర. అతనికి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రీడా ఫ్యాన్స్ వాపోయారు. ఏమో గప్టిల్ ఉండి ఉంటే.. సెమీఫైనల్లో బాగా స్కోరు సాధించి జట్టును ఫైనల్ చేర్చేవాడేమో అని పేర్కొన్నారు. అయినా న్యూజిలాండ్ కథ ముగిసింది.. ఇక ఇప్పుడు ఎన్ని మాట్లాడి ఏం ప్రయోజనం. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌కు సెమీస్ వరకే రాసిపెట్టి ఉన్నట్లుంది. చదవండి: NZ Vs Pak: న్యూజిలాండ్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్ ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత -
డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు!
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు అంటే న్యూజిలాండ్ కచ్చితంగా ఫైనల్ వెళుతుంది అని అభిమానులు పేర్కొంటున్నారు. మిచెల్ సెమీస్‌లో అర్థసెంచరీ వెనుక ఒక చిన్న కథ దాగుంది. అదేంటంటే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో ఆడిన సెమీఫైనల్లో డారిల్ మిచెల్ అర్థశతకంతో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిచెల్ కివీస్‌ను దగ్గరుండి గెలిపించాడు. దీంతో కివీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా మిచెల్ అర్థసెంచరీ చేశాడు. దీంతో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని కొందరు ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. డారిల్ మిచెల్ మాత్రం టి20 ప్రపంచకప్‌లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా మిచెల్ నిలిచాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 72 పరుగులు నాటౌట్.. తాజా వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో సెమీస్‌లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 2014లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో 72 నాటౌట్, ఆ తర్వాత 2016 టి20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై 89 నాటౌట్ చేశాడు. ఇక క్రిస్ గేల్ 2009లో శ్రీలంకతో సెమీస్‌లో 63 నాటౌట్, 2012లో ఆస్ట్రేలియాపై 75 నాటౌట్ రెండు అర్థసెంచరీలు సాధించాడు. చదవండి: ఐదు మ్యాచ్‌లుగా ఒక్క వికెట్ లేదు.. ఒక్క రనౌట్‌తో -
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వెస్ట్‌జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్‌లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్‌శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
47వ సారి ఫైనల్లో ముంబై.. మధ్యప్రదేశ్‌తో అమితుమీ
దేశవాళీ దిగ్గజ టీమ్ ముంబై ఐదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్‌ను సాధించింది. ఉత్తరప్రదేశ్‌తో ముగిసిన రెండో సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై 47వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 449/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబై మరో 16 ఓవర్లలో 84 పరుగులు జోడించి 533/4 వద్ద డిక్లేర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (59 నాటౌట్), షమ్స్ ములాని (51 నాటౌట్) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ 213 పరుగుల ఆధిక్యం కలిపి ముంబై మొత్తం స్కోరు 746కు చేరింది. ముంబై ముందంజ వేయడం ఖాయం కావడంతో యూపీ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగలేదు. గతంలో 46 సార్లు రంజీ ఫైనల్ చేరిన ముంబై 41 సార్లు టైటిల్ గెలుచుకొని ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. -
బెంగాల్‌పై ఘన విజయం.. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో మధ్యప్రదేశ్
బెంగళూరు: రంజీ ట్రోఫీలో 23 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం ముగిసిన సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ 174 పరుగులతో బెంగాల్‌పై ఘన విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 96/4 స్కోరుతో బరిలోకి దిగిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైనా... ఆ తర్వాత బెంగాల్ 28.2 ఓవర్లలోనే మరో 79 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్ (157 బంతుల్లో 78; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (5/67) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. 1998–99 సీజన్లో ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ తుది పోరులో కర్ణాటక చేతిలో 96 పరుగుల తేడాతో ఓడింది. నాటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా సాధించి, ‘డ్రా’గా ముగిస్తే చాలనే స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ ఆఖరి రోజు చివరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఆట ముగియడానికి ఐదు ఓవర్ల ముందు ఆలౌటైంది. -
ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా
ఐర్లాండ్‌తో టి20 సిరీస్‌కు తనను ఎంపిక చేయలేదనే కోపమో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ పృథ్వీ షా విషయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. రంజీ చరిత్రలోనే అరుదైన ఫీట్ నమోదు అయింది. సాధారణంగానే పృథ్వీ షా వేగానికి పెట్టింది పేరు. ఇటీవలి కాలంలో పృథ్వీ షా ఓపెనర్‌గా వస్తూనే దూకుడు కనబరుస్తున్నాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోనే మరో బ్యాటర్‌ను ఉంచి తాను మాత్రం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ తరహా ఆటను పృథ్వీ షా నుంచి ఐపీఎల్లో చాలాసార్లు చూశాం. తాజాగా అదే తరహా దూకుడును ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చూపెట్టాడు పృథ్వీ షా. విషయంలోకి వెళితే.. రంజీ ట్రోపీ 2022 సీజన్లో భాగంగా ముంబై, ఉత్తర్ ప్రదేశ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై.. కెప్టెన్ పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్‌లు ఓపెనర్లుగా వచ్చారు. మ్యాచ్‌లో పృథ్వీ 71 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ విశేషమేమిటంటే పృథ్వీ షా 64 పరుగులు చేసి ఔటైనప్పుడు జట్టు స్కోరు 66. మరో ఓపెనర్ జైశ్వాల్ స్కోరు (0). దీనిని చూస్తే ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. అవునండీ తొలి వికెట్ పడే సమయానికి జట్టు 66 పరుగులు చేయగా.. అందులో పృథ్వీ షావి 64 పరుగులు కాగా.. మరో రెండు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. తొలి వికెట్‌కు జైశ్వాల్‌తో 66 పరుగులు జోడించగా.. అందులో 96.96 శాతం పరుగులు పృథ్వీ షావే. తొలి వికెట్‌కు 50 ప్లస్ స్కోరు చేయడంలో ఒక్క బ్యాటర్‌దే స్కోరు మొత్తం ఉండడం ఫస్ట్‌క్లాస్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1888లో ఆస్ట్రేలియా క్రికెట్లో జరిగింది. నార్త్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ పెర్సీ మెక్‌డోనెల్ అలెక్స్ బ్యానర్‌మెన్‌తో కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. అందులో పెర్సీ మెక్‌డోనెల్‌వి 95.34 శాతం పరుగులు. తాజాగా 134 ఏళ్ల అనంతరం పృథ్వీ షా-జైశ్వాల్ జోడి ఆ రికార్డును బద్దలు కొట్టింది. పృథ్వీ షా ఔటయ్యే సమయానికి 52 బంతులు ఆడిన జైశ్వాల్ ఒక్క పరుగు చేయలేదు. ఆ తర్వాత 55వ బంతికి బౌండరీ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. ఎట్టకేలకు పరుగు తీయడంతో జైశ్వాల్ బ్యాట్ పైకి లేపగా.. ప్రత్యర్థి ఆటగాళ్లు చప్పట్లతో అభినందించడం కొసమెరుపు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై పట్టు బిగించింది. ఆట ముగిసే సరికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 133 పరుగులు చేసి ఓవరాల్‌గా 346 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పృథ్వీ షా (71 బంతుల్లో 64; 12 ఫోర్లు) దూకుడుగా ఆడగా, యశస్వి జైస్వాల్ (35 నాటౌట్), అర్మాన్ జాఫర్ (32 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు 25/2తో ఆట కొనసాగించిన యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. శివమ్ మావి (55 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకి 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. Highest contribution in 50+ opening partnership in first-class cricket: 96.96% - Prithvi Shaw (64/66) with Yashasvi Jaiswal For Mumbai v Uttar Pradesh, 2022 95.34% - Percy McDonnell (82/86) with Alec Bannerman For Australians v North, 1888#RanjiTrophy — Kausthub Gudipati (@kaustats) June 16, 2022 చదవండి: IND vs IRE T20 Series: పృథ్వీ షా చేసిన నేరం.. 'పనికిరాని ఆటగాడిగా కనిపిస్తున్నాడా?' -
'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో పీవీ సింధు అలవోకగా విజయం సాధించింది. ఇక రెండో గేమ్ లో యామగుచి పుంజుకోవడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మ్యాచ్ రిఫరీలు సింధు విషయంలో ప్రవర్తించిన తీరు ఇక్కడ వివాదాస్పదంగా మారింది. రెండో గేమ్ లో స్కోర్లు 14-12తో సింధు లీడ్ లో ఉన్న సమయంలో అంపైర్లు సింధు కు ఒక పాయింట్ ను పెనాల్టీగా విధించారు. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్ ను పెనాల్టీగా ప్రకటించారు. దీనిపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపు అంపైర్లతో వాగ్వివాదానికి కూడా దిగింది. అనంతరం సింధు ఆట గాడి తప్పగా.. అద్బుతంగా ఆడిన యామగుచి ఆ గేమ్ గెలవడంతో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. Nice umpiring! #BAC2022 pic.twitter.com/3EgLS4kW7n — Sammy (@Sammy58328) April 30, 2022 -
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
ఒక బంతి.. 22 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అదో చెత్త నిర్ణయంగా మిగిలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌తో దురదృష్టానికి దగ్గరగా.. అదృష్టానికి దూరంగా నిలిచిపోయింది సౌతాఫ్రికా. నిషేధం తర్వాత ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆ మ్యాచ్ ఒక చీకటి రోజు. 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే లెక్కలు వేసి మరి దక్షిణాఫ్రికాను ఇంటి దారి పట్టేలా చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది. మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. 1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 ,1992న జరగ్గా.. సరిగ్గా నేటితో 30 ఏళ్లు పూర్తైంది. చదవండి: IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..? -
యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్ సూపర్ సెంచరీకి(110 పరుగులు) తోడు షేక్ రషీద్(94) రాణించడంతో యువ భారత్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 96 పరుగులతో మట్టికరిపించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్‌లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఐదోసారి టైటిల్‌పై కన్నేసింది. చదవండి: U19 World Cup Semi Final: ఆసీస్‌పై సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్ ఇదిలాఉంటే.. సూపర్ సెంచరీతో మెరిసిన యశ్ ధుల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతను కొట్టిన ఒకే ఒక్క సిక్స్ ఇప్పుడు క్లాసిక్‌గా మిగిలిపోనుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆసీసీ బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. బంతి షార్ట్‌పిచ్ అవగా.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చిన యష్.. డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ బ్యాట్ ఎడ్జ్‌ను తగిలించాడు. అంతే.. బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్‌లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఒక్క క్లాసిక్ సిక్స్‌తో ఐసీసీ ప్లే ఆఫ్ ది డే అవార్డు కొల్లగొట్టాడు.. ఇంతకీ యష్ ధుల్ కొట్టిన సిక్స్‌కు క్రికెట్ పుస్తకాల్లో ఏ పేరుందో కాస్త చెప్పండి'' అంటూ పేర్కొంది. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
U-19 ప్రపంచకప్ సెమీఫైనల్ లైవ్ అప్డేట్స్: భారత్ వర్సస్ ఆసీస్
-
'సూపర్' వాషింగ్టన్ సుందర్.. ఫైనల్‌కు తమిళనాడు
Tamil Nadu Enters Final Beating Saurashtra In Semi Final-2.. విజయ్ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్ బాబా అపరాజిత్(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5 వికెట్లు తీశాడు. చదవండి: ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్ కీపన్ షెల్డన్ జాక్సన్(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్ మన్కడ్ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ 4, సిలింబరాసన్ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ -
T20 WC 2021: జట్టు ఏదైనా సరే.. పాక్‌ను ఓడించడం అసాధ్యం..!
Impossible To Beat Pakistan Says PCB Cheif Ramiz Raja: టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ రమీజ్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా టోర్నీలో భాగంగా ఇవాళ(నవంబర్ 11) ఆసీస్‌తో కీలక సమరానికి ముందు జట్టు సభ్యులను ఉత్తేజపరుస్తూ ఓ వీడియా సందేశాన్ని రూపొందించి పీసీబీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. పాక్ జట్టు ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. ప్రపంచంలో ఏ జట్టునైనా మట్టికరిపించగలదని ధీమా వ్యక్తం చేశాడు. Play with pride and passion! PCB chairman Ramiz Raja has a special message for Babar Azam's team. #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/fS0rghZ4nG — Pakistan Cricket (@TheRealPCB) November 10, 2021 జట్టు సభ్యులందరూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా కలిసి కట్టుగా ఆడుతున్నారని, నాయకుడు బాబర్ ఆజమ్ జట్టును అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడని కొనియాడాడు. తాను కూడా మూడు ప్రపంచకప్‌లు ఆడానని, ఓ ఆటగాడికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడే అనుభవం వేరుగా ఉంటుందని అన్నాడు. పాక్ జట్టు ఇప్పటివరకు అద్భుతంగా రాణించిందని, మూడు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్ధి ఎవరైనా పాక్‌ను ఓడించడం అసాధ్యమంటూ బాబర్ సేనను ఆకాశానికెత్తాడు. కాగా, రమీజ్.. పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాక్ ప్రపంచకప్ జట్టులో కీలక మార్పులు చేసిన విజయంతమైన సంగతి తెలిసిందే. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్: షాట్‌పుట్‌లో నిరాశపరిచిన తేజిందర్‌పాల్
షార్ట్పుట్లో తేజిందర్‌పాల్ నిరాశ ► టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ తేజిందర్‌పాల్ సింగ్ నిరాశపరిచాడు. మొత్తం మూడు ప్రయత్నాల్లో ఒకసారి మాత్రమే సఫలమైన తేజిందర్ 19.99 మీ దూరం విసిరాడు. మిగతా రెండుసార్లు ఫౌల్ చేసి ఫెయిల్యూర్ అయ్యాడు. Tokyo Olympics Day 12 Live Updates: ఒలింపిక్స్‌లో భారత్ వరుస ఓటములు చవిచూస్తోంది. మంగళవారం జరిగిన ఈవెంట్స్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది. ఓవైపు హాకీ, మరోవైపు జావెలిన్ థ్రో, ఇంకోవైపు రెజ్లింగ్‌లో ఓటములే ఎదురయ్యాయి. మహిళల రెజ్లింగ్ 62 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో తలపడి ఓడింది. Tokyo Olympics Wrestling: ► 2-2తో స్కోర్ సమమైనప్పటికీ.. ఖురెల్ఖూ పాయింట్ మూవ్ ఆధారంగా ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో సోనమ్ మాలిక్ ఓటమి పాలైంది. ► ఆరంభంలో దూకుడు చూపించినప్పటికీ.. ఫస్ట్ రౌండ్ బౌట్‌ను ఓడింది సోనమ్. ► తొలి పాయింట్ సాధించిన సోనమ్ ►మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ బరిలోకి దిగింది. ఆసియన్ సిల్వర్ మెడలిస్ట్, మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూతో పోరాడుతోంది. India-Belgium Men's Hockey Semi-Final Live Updates: ►చివర్లో మరో పాయింట్‌తో 5-2 తేడాతో బెల్జియం భారత్‌పై ఘన విజయం సాధించింది. ►మొదలైన నాలుగో క్వార్టర్. 2-2తో కొనసాగింది మ్యాచ్. ఈ తరుణంలో బెల్జియం మరో గోల్‌తో 3-2 ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ తరుణంలో మరో పెనాల్టీ కార్నర్ దక్కింది బెల్జియంకు. ఆ వెంటనే మరో గోల్‌తో బెల్జియం 4-2తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ►మూడో క్వార్టర్ ముగిసేందుకు ఏడు నిమిషాలుండగా.. భారత్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ, ఎటాకింగ్ గేమ్‌తో బెల్జియం భారత్‌ను ఇరకాటంలో పెడుతోంది. మూడో క్వార్టర్ ముగిసేసరికి.. స్కోర్ 2-2తో సమంగానే కొనసాగుతోంది. ►సెకండ్ క్వార్టర్ ముగిసేసరికి 2-2 తేడాతో స్కోర్ సమం అయ్యింది. బెల్జియం తరపున లూయిపరట్, అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ చెరో గోల్ కొట్టారు. బెల్జియం డిఫెండింగ్ గేమ్ ఆడుతుండడంతో టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో మూడో క్వార్టర్లో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ► భారత పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో తలపడుతోంది భారత పురుషుల హాకీ జట్టు. తొలి క్వార్టర్‌లోనే బెల్జియంపై గోల్ చేసిన భారత్.. ఆపై బెల్జియంకు ఓ గోల్ అప్పజెప్పింది. ఆపై మరో గోల్‌తో 2-1తో నిలిచింది. మన్దీప్, హర్మన్‌ప్రీత్ చెరో గోల్ కొట్టారు. తొలి క్వార్టర్ ముగిసేసరికి.. భారత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రెండో క్వార్టర్ మొదలైన కాసేపటికే.. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెన్డ్రిక్స్ గోల్ కొట్టడంతో స్కోర్ 2-2 అయ్యింది. క్లిక్ చేయండి: పతకాలు గెస్ చేయండి.. క్యాష్ ప్రైజ్ గెల్వండి టోక్యో వేదికగా ఒలింపిక్స్ 2020లో పురుషుల హాకీ సెమీస్‌లో బెల్జియంతో భారత హాకీ జట్టు తలపడిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ఓయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో మ్యాచ్ ప్రారంభం కాగా.. మ్యాచ్ మూడో క్వార్టర్ దాకా హోరాహోరీగా నడిచింది. అయితే నాలుగో క్వార్టర్ నుంచి బెల్జియం డామినేషన్ కొనసాగింది. చివర్లో బెల్జియం మూడు గోల్స్ సాధించడంతో 5-2 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది బెల్జియం. I’m watching the India vs Belgium Hockey Men’s Semi Final at #Tokyo2020. Proud of our team and their skills. Wishing them the very best! — Narendra Modi (@narendramodi) August 3, 2021 #WATCH | CRPF jawans cheer for Indian men's hockey team in Jammu, chant 'Jeetega bhai jeetega, India jeetega' & 'Bharat Mata ki Jai'. India is playing against Belgium in the semi-final at #TokyoOlympics. pic.twitter.com/ohEneoSOtx — ANI (@ANI) August 3, 2021 Tokyo Olympics Women's Javelin Throw: భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో Annu Rani సత్తా చాటలేకపోయింది. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో 54.4 మీటర్ల దూరం విసిరి 14వ పొజిషన్‌తో సరిపెట్టుకుని.. ఫైనల్ ఈవెంట్‌కు క్వాలిఫై కాలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి(ఆగష్టు 3) భారత్ షెడ్యూల్ ఉ.7గం.లకు బెల్జియంతో తలపడనున్న భారత్ పురుషుల హాకీ జట్టు (సెమీస్) ఉదయం 7:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల లాంగ్‌జంప్ ఫైనల్ ఉదయం 8:30కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం ( సోనమ్ మాలిక్) ఉదయం 8:50 నుంచి అథ్లెటిక్స్ పురుషుల 400 మీ. హార్డిల్స్ ఫైనల్ మధ్యాహ్నం 2:20 నుంచి జిమ్నాస్టిక్స్ మహిళల బ్యాలెన్స్ బీమ్ ఫైనల్ మధ్యాహ్నం 2:45కు మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం సెమీస్ మధ్యాహ్నం 3:45కు పురుషుల షాట్‌బాల్ (తజిందర్ పాల్) క్వాలిఫికేషన్ మధ్యాహ్నం 3:50కి అథ్లెటిక్స్ పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్ సాయంత్రం 5:05 నుంచి అథ్లెటిక్స్ మహిళల హ్యామర్ త్రో ఫైనల్ సాయంత్రం 5:55 నుంచి అథ్లెటిక్స్ మహిళల 800 మీ. పరుగు ఫైనల్ సాయంత్రం 6:20 నుంచి అథ్లెటిక్స్ మహిళల 200 మీ. పరుగు ఫైనల్ -
భారత అభిమానుల గుండె పగిలిన రోజు
ముంబై : 2019.. జూలై 10వ తేది.. ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. భారత విజయలక్ష్యం 240 పరుగులు. అప్పటికే టీమిండియా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో క్రీజులో ఉన్న ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు జట్టును ఓటమి నుంచి తప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇద్దరు కలిపి 7వ వికెట్‌కు అబేధ్యమైన 116 పరుగులు జోడించారు. కాగా జట్టు స్కోరు 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు 77 పరుగులు చేసిన జడేజా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయినా భారత అభిమానులు ఏ మాత్రం బెదరలేదు .. ఎందుకంటే అప్పటికే ధనాదన్ ధోని క్రీజులో పాతుకుపోయాడు. ధోని ఉన్నాడన్న ధైర్యం అభిమానులను కుంగిపోకుండా చేసింది. 2011 ఫైనల్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని, లార్డ్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఉంటుందని అంతా భావించారు.అయితే విజయానికి 24 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోని రనౌట్ అయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకునేలోపే ధోని పెవిలియన్ బాట పట్టాడు. అప్పటిదాకా ధోని ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగిన అభిమానుల గుండెలు పగిలాయి. టీమిండియాను ఫైనల్లో చూస్తామన్న వారి కలల ఆవిరయ్యాయి. చూస్తుండగానే భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.('కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') అప్పటిదాకా ధోని మీద అభిమానం ఉన్నవాళ్లు కూడా.. ధోని ఎందుకిలా చేశాడు.. ఒక్క పరుగుతో సరిపెట్టుకుంటే ఫలితం వేరేలా వచ్చి ఉండేది అంటూ దుమ్మెత్తిపోశారు. యాదృదశ్చికమె లేక దురదృష్టమో తెలియదు గాని మహీ చివరిసారిగా మైదానంలో కనిపించింది ఆరోజే. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ ధరించలేదు.ఈ బాధ భారత్ క్రికెట్‌తో పాటు అభిమానులను కూడా చాలా కాలం వెంటాడింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఈ రోజుకు ఏడాది. ఐసీసీ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ట్విటర్లో ధోని రనౌట్ వీడియోను షేర్ చేసింది. 'భారత అభిమానుల గుండె పగిలిన సన్నివేశం ఇది' అంటూ క్యాప్షన్ జత చేశారు. WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 కాగా అప్పటి 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా ఆడాల్సి వచ్చింది. జూలై 9, 2019న టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేన్ విలియమ్సన్ సేనను భూవీ, బుమ్రా జోడి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టింది. కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేసింది. మరుసటి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ విఫలంతో 49.3 ఓవర్లలో 221 పరుగులు వద్ద ఆలౌటైంది. -
ఆ ఓటమి ఇంకా వెంటాడుతోంది
ముంబై: గతేడాది వన్డే ప్రపంచకప్ మెగా టోర్నీలో సెమీఫైనల్ పరాజయం తనను ఇంకా వెంటాడుతోందని భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని టీమిండియా ఇంకా మర్చిపోలేదని రాహుల్ అన్నాడు. ఏదైనా ఒక మ్యాచ్ ఫలితాన్ని మార్చే శక్తి గనక తనకు లభిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్ ఫలితాన్నే తిరగ రాస్తానని రాహుల్ పేర్కొన్నాడు. ‘మాలో ఎవరూ కూడా ఆ మ్యాచ్ మిగిల్చిన బాధను ఇంకా మరచిపోలేదు. అది ఇంకా మమ్మల్ని వెంటాడుతోంది. టోర్నీ ఆసాంతం మేం మెరుగ్గా రాణించాం. చివరిమెట్టుపై బోల్తాపడ్డాం. చాలా బాధాకరం. ఒక్కోసారి ఈ పీడకలతో నేను నిద్రలేస్తుంటా’ అని రాహుల్ నాటి ఓటమిని తల్చుకున్నాడు. కోవిడ్–19 కారణంగా అనూహ్యంగా లభించిన ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తు న్నానని రాహుల్ చెప్పాడు. ‘లాక్‌డౌన్‌ను ప్రశాంతంగా గడుపుతున్నా. కాసేపు ఇంటిపనులు చేస్తున్నా. మరికాసేపు పాత ప్రదర్శనల వీడియోలు చూస్తూ నోట్స్ తయారు చేసుకుంటున్నా. వీటి ద్వారా నేను ఇంకా ఏ అంశాల్లో మెరుగవ్వాలో తెలుసుకుంటున్నా’ అని రాహుల్ అన్నాడు. -
ఫిఫాలో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు షాక్
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెనుసంచలనం. క్రొయేషియా తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫిఫా-2018 తుదిసమరానికి చేరింది. మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. ఆట 5వనిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు ట్రిపియర్ గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ లో సీన్ మారింది. క్రొయేషియా ప్లేయర్లు మైదానంలో చురుక్కుగా కదులుతూ ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. క్రొయేషియా ఆటగాడు పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్ ఆశలను గల్లంతు చేశాడు. ఈ చిరస్మరణీయ విజయంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది.