టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వెస్ట్‌జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్‌లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు.
మూడోరోజు తొలి సెషన్‌లో వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్‌లో ఉంది.
అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్‌శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'
'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?'
Comments
Please login to add a commentAdd a comment