కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి.
ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌లో తొలిసారి నార్తంప్టన్‌షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్‌జోన్, సౌత్‌జోన్‌ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది.
ఇక సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్‌కు కాస్త స్మార్ట్‌నెస్‌ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్‌లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్‌నెస్ బ్యాటింగ్‌ను వదులుకోలేను.. కానీ స్మార్ట్‌గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్‌జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది.
నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్‌కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్‌బాల్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్‌బాల్‌లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్‌బాల్ క్రికెట్‌లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
Comments
Please login to add a commentAdd a comment