సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు.
ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment