central zone
-
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్‌ను అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్‌లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో సౌత్ జోన్‌తో నార్త్ జోన్; వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సెంట్రల్ జోన్, నార్త్‌జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్‌తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్‌సింగ్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్‌జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్‌రౌండ్ దెబ్బకు... నార్త్‌జోన్ ఆల్‌రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్‌జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్ ఈస్ట్‌జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్‌కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను నార్త్‌జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్‌సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్‌జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్‌తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్‌కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్‌గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
తండ్రి ఎస్సై..కొడుకు 18 కేసుల్లో నిందితుడు
సాక్షి, రాంగోపాల్‌పేట్: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్‌లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని బతుకమ్మ ఘాట్‌వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్‌కుమార్ తాను టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్–1 లోని కమల్ వాచ్ షోరూమ్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్‌ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని నేరుగా నెక్లెస్‌రోడ్‌కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై బాధితులు రాంగోపాల్‌పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, బీఫిట్ లింక్ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో బెదిరింపులు.. నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై నాన్‌బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్‌కుమార్ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్‌పై పోలీస్ స్టిక్కర్‌తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
సెంట్రల్ జోన్ విజేతగా ’పశ్చిమ’
ఏలూరు రూరల్ : జిల్లా బాలికల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ నెల 8 నుంచి 15 వరకూ గుంటూరు ఏసీఏలో జరిగిన అండర్19 సెంట్రల్‌జోన్ పోటీల్లో విజేతగా నిలిచింది. 9 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జట్లపై వరుసగా గెలిచింది. జట్టు క్రీడాకారిణిలు కె హెప్సిబా, జి సత్యవేణి, ఎం లావణ్య, టి ఉమాదేవి బ్యాటింగ్‌లో రాణించగా ఎస్ శైలజ, జి నవ్యదుర్గ, ఈ తేజస్వి బౌలింగ్ విభాగంలో రాణించారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లా క్రీడాకారులు జి నవ్యదుర్గ, జి సత్యవేణి, టి ఉమాదేవి, ఎం లావణ్య, కె హెప్సిబా, ఎస్ శైలజ, ఈ తేజస్వి, ఎస్ మంజుల సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికయ్యారని అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్ వివరించారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్ రమాదేవి వ్యవహరించనున్నారని తెలిపారు. జట్టు సభ్యులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
ముగిసిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నగరంలోని కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల 13 నుంచి జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. బాలుర సీనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అనంతపురం), కేసీజీహెచ్‌ఎస్ (కళ్యాణదుర్గం) జట్లు నిలిచాయి. బాలుర జూనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 15 పాయింట్లతో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం జట్టు నిలిచింది. సీనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పెనుకొండ జట్టు నిలిచింది. జూనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 5 పాయింట్లతో కేజీబీవీ బెళుగుప్ప, జెడ్పీ ఉన్నత పాఠశాల తురకలాపట్నం, కేజీబీవీ రాప్తాడు, కేజీబీవీ మాలాపురం, జెడ్పీ ఉన్నత పాఠశాల ముదిరెడ్డిపల్లి జట్లు నిలిచాయి. సీనియర్ స్పోర్ట్స్ (క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్) బాలుర సీనియర్ విభాగంలో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం పాఠశాల నిలిచింది. బాలుర జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి, జెడ్పీ ఉన్నత పాఠశాల నల్లమాడ జట్లు నిలిచాయి. బాలికల సీనియర్, జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు జట్టు నిలిచింది. - ఇండివిజువల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో బాలుర సీనియర్ విభాగంలో రఘునందన్ (కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం) నిలిచాడు. జూనియర్ బాలుర విభాగంలో : జీవన్ (జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి). సీనియర్ బాలికల విభాగంలో : దీప్తి (జెడ్పీ ఉన్నత పాఠశాల చల్లపల్లి) జూనియర్ బాలికల విభాగంలో : ధనలక్ష్మీ (జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు) క్రీడలతో ఆరోగ్యం ప్రతిరోజూ క్రీడల్లో పాల్గోనడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎస్డీఓ బాషామొహిద్దీన్ తెలిపారు. సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యకళలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే వారు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏడీఎస్ఎస్ఏఏ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, శంకరన్న, వేణుగోపాల్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి గోపాల్, లింగమయ్య, నాగరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ జోన్‌కు వీఆర్ఎస్ కళాశాల
చీరాలటౌన్: స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల సౌత్ జోన్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రెండో రోజు మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఒంగోలు గీతం డిగ్రీ కళాశాల జట్టు 18 ఓవర్లకే ఆల్అవుట్ అయి కేవలం 68 పరుగులు సాధించి ఓటమి చెందింది. దీంతో సెంట్రల్ జోన్‌కు వీఆర్ఎస్ జట్టు స్థానం సాధించింది. బుధవారం గుంటూరు హిందూ కళాశాల జట్టు, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చిమటా సుబ్బారావు తెలిపారు. వీఆర్ఎస్ జట్టులో నరేష్, నాగేంద్ర, అజయ్ చక్కని ప్రతిభచూపి జట్టు విజయానికి కృషి చేశారు. సెంట్రల్ జోన్‌కు అర్హత సాధించిన వీఆర్ఎస్ జట్టును కళాశాల ప్రిన్సిపాల్ బాల సుబ్బారావు, అధ్యాపకులు జాగర్లమూడి దేవి అభినందించారు. -
దేవధర్ సెమీస్‌లో సౌత్‌జోన్
ముంబై: దేశవాళీ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ 116 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (105 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) అద్భుత ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కరుణ్ నాయర్ (62 బంతుల్లో 9 ఫోర్లతో 77)తో కలిసి అపరాజిత్ నాలుగో వికెట్‌కు 124 పరుగులు జత చేశాడు. సెంట్రల్ జట్టులో పంకజ్‌సింగ్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 36.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అర్జిత్ గుప్తా (49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66) మినహా అందరూ విఫలమయ్యారు. సౌత్ కెప్టెన్ వినయ్ కుమార్ 8 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. సోమవారం జరిగే సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. ఆదివారం (నేడు) జరిగే సెమీస్‌లో ఈస్ట్‌తో నార్త్ తలపడుతుంది. -
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్
చెన్నై: బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సౌత్‌జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. -
సెంట్రల్ జోన్ 209 ఆలౌట్
చెన్నై: సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిథున్, ఓజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. ముకుంద్ (61), అపరాజిత్ (35) క్రీజులో ఉన్నారు. ఉన్ముక్త్ సెంచరీ: కొచ్చిలో ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉన్ముక్త్ చంద్ (116), ఇయాన్ దేవ్‌సింగ్ (95 రిటైర్డ్‌హర్ట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 2 వికెట్లకు 329 పరుగులు చేసింది. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్‌ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్‌కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్‌జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.