సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
చెన్నై: సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. పీయూష్ చావ్లా (56) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిథున్, ఓజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 2 వికెట్లకు 137 పరుగులు చేసింది. ముకుంద్ (61), అపరాజిత్ (35) క్రీజులో ఉన్నారు.
ఉన్ముక్త్ సెంచరీ: కొచ్చిలో ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉన్ముక్త్ చంద్ (116), ఇయాన్ దేవ్‌సింగ్ (95 రిటైర్డ్‌హర్ట్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 2 వికెట్లకు 329 పరుగులు చేసింది.