![Duleep Trophy 2022 2nd Semi Final Day 1: Hanuma Vihari Ton Put South Zone In Front - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/Untitled-5.jpg.webp?itok=V1XZjXxm)
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది.
మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు.
వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment