duleep trophy
-
సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
2024 దులీప్ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకుంది.350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్ కృష్ణ (3/50), తనుశ్ కోటియన్ (3/47), ఆకిబ్ ఖాన్ (2/26), షమ్స్ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్ పాటిదార్ (7), ఇషాన్ కిషన్ (17), అభిషేక్ పోరెల్ (0) నిరాశపరిచారు.శాశ్వత్ సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్ ఖాన్ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచగా.. అభిషేక్ పోరెల్ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆకిబ్ ఖాన్ తలో 3, షమ్స్ ములానీ 2, తనుశ్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టారు.రాణించిన రియాన్63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్ పరాగ్ (73), శాశ్వత్ రావత్ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కుషాగ్రా (42), మయాంక్ అగర్వాల్ (34), తనుశ్ కోటియన్ (26 నాటౌట్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.That Winning Feeling! 🤗 India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆 The celebrations begin 🎉@IDFCFIRSTBank Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024సాయి సుదర్శన్ పోరాటం వృధా350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.రన్నరప్‌గా నిలిచిన ఇండియా-సిమూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ టైటిల్ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం -
సెంచరీకి చేరువలో సంజూ.. భారీ స్కోర్ దిశగా భారత్-డి
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత్ ‘బి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.వికెట్ కీపర్ సంజు సామ్సన్ (83 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) కూడా రాణించాడు. అయితే ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా అయ్యర్ వెనుదిరిగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్, పడిక్కల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందివ్వగా.. రికీ భుయ్, సంజు సామ్సన్ దాన్ని కొనసాగించారు. భారత్ ‘బి’ బౌలర్లలో రాహుల్ చహర్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సామ్సన్తో పాటు సారాంశ్ జైన్ (56 బంతుల్లో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
భారత్-ఎ vs భారత్-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు.. ఫోటోలు
-
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్‌దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్‌దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
ఆదుకున్న ములానీ
సాక్షి, అనంతపురం: ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7)తో పాటు మరో ఓపెనర్ ప్రథమ్ సింగ్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శాశ్వత్ రావత్ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో తనుశ్ కొటియాన్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి షమ్స్ ములానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టాపార్డర్ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్ ములానీతో పాటు ఖలీల్ అహ్మద్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) అర్‡్షదీప్ (బి) విద్వత్ 7; మయాంక్ (సి) సామ్సన్ (బి) విద్వత్ 7; తిలక్ వర్మ (సి) శ్రేయస్ (బి) సారాంశ్ జైన్ 10; రియాన్ పరాగ్ (సి) పడిక్కల్ (బి) అర్‡్షదీప్ 37; శాశ్వత్ రావత్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ రాణా 15; కుశాగ్ర (సి) యశ్ దూబే (బి) అర్‡్షదీప్ 28; షమ్స్ ములానీ (బ్యాటింగ్) 88; తనుశ్ (సి) అర్‡్షదీప్ (బి) సౌరభ్ 53; ప్రసిద్ధ్ కృష్ణ (సి) (సబ్) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 8; ఖలీల్ అహ్మద్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్: హర్షిత్ రాణా 16–4–49–2; విద్వత్ 14–5–30–2; అర్‡్షదీప్ 18–3–73–2; సారాంశ్ జైన్ 14–3–55–1; సౌరభ్ కుమార్ 20–1–65–1. -
DT 2024: అనంతపురంలో దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్ (ఫొటోలు)
-
రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్
ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్‌కు చేరాడు. అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్‌తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.ఇషాన్ సూపర్ సెంచరీఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.ఆదుకున్న ములానీఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం -
రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు?
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జట్టు తరపున రింకూ ఆడనున్నాడు. భారత-బి జట్టులోని చాలా మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్నారు.ప్రస్తుతం బి జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్‌లకు బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న తదుపరి రౌండ్ మ్యాచ్‌లకు వీరిందరూ అందుబాటులో ఉండరు.ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్‌తో పాటు మరో ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆకిబ్ ఖాన్‌కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వచ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జట్లలో రింకూకు చోటు దక్కలేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్‌లో భాగమయ్యాడు. కానీ ఇప్పుడు సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అతడు ఇండియా బి జట్టుతో చేరనున్నాడు."దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొదట జట్లను ప్రకటించినప్పుడు.. నా పేరు లేకపోవడం కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పడు మళ్లీ పిలుపు రావడంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్‌లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరుదైన రికార్డు సాధించాడు. దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఈ అరుదైన ఫీట్‌ను ధ్రువ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇండియా- A జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్.. భారత-బి జట్టుపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇండియా బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ ఏకంగా 7 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా మిస్టర్ కూల్ సరసన ఈ యంగ్ వికెట్ కీపర్ నిలిచాడు. దులీప్ ట్రోఫీ 200-2005 సీజన్లో ఈస్ట్‌జోన్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో ధోని 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా ఎ జట్టు విజయానికి 169 పరుగులు అవసరమవ్వగా.. ఇండియా బి జట్టు గెలపునకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఇండియా ఎ ఆశలు అన్నీ కేఎల్ రాహుల్‌పైనే ఉన్నాయి. రాహుల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే? -
ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. 202/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-బి టీమ్.. అదనంగా 119 పరుగులు చేసి తమ మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది.ముషీర్ ఖాన్ అదుర్స్..ఇక తొలి రోజు ఆటలో సెంచరీతో చెలరేగిన భారత-బి జట్టు బ్యాటర్ ముషీర్ ఖాన్.. రెండో రోజు కూడా తన మార్క్‌ను చూపించాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. బి జట్టు 321 పరుగులు చేయడంలో ముషీర్ కీలక పాత్ర పోషించాడు.ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా కన్పించిన ముషీర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఓటౌయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 373 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 181 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్ నవ్‌దీప్ సైనీ కీలక నాక్ ఆడాడు. 144 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. ఇక టీమ్-ఎ బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్, ఖాలీల్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
Duleep Trophy 2024: అక్షర్ ఆల్‌రౌండ్ షో..
సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్‌దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1. భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0. -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా క్రీడాకారులు సాధన (ఫొటోలు)
-
#DuleepTrophy2024 : అనంతపురం చేరుకున్న క్రికెటర్లు (ఫొటోలు)
-
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్‌ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్‌లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
రోహిత్, కోహ్లికి విశ్రాంతి అవసరమా?: టీమిండియా దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనాల్సిందని భారత జట్టు మాజీ సారథి సునిల్ గావస్కర్ అన్నాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు ఈ ఇద్దరు సీనియర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదని పేర్కొన్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ రెడ్‌బాల్ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చి మంచి పని చేశారని సెలక్టర్ల నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు.ఆ నలుగురు మినహాకాగా.. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా భాగం కానున్నారు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ జరుగబోతోంది. కానీ సెలక్టర్లు మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మినహాయింపు ఇచ్చారు.తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదినిజానికి ఈ టోర్నీలో ఆడితే బంగ్లాతో సిరీస్‌కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది. జస్ప్రీత్ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడికి గాయాల ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ బ్యాటర్లకు అలా కాదు. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసు దాటిన ఏ ఆటగాడైనా సరే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించడం అవసరం.ఆ సమస్యలు వస్తాయిసుదీర్ఘ విరామం తీసుకుని.. ఒకేసారి బరిలోకి దిగితే కండరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా మ్యాచ్‌లు ఆడితేనే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లికి విశ్రాంతినివ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. కాగా కోహ్లి 2012, రోహిత్ 2016లో చివరగా దేశవాళీ క్రికెట్ ఆడారు.లంకలో రో‘హిట్’..ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కోహ్లి- రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం.. శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, లంకతో మూడు వన్డేల్లో 37 ఏళ్ల రోహిత్ 58, 64, 35 పరుగులు చేయగా.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం 24, 14, 20 రన్స్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో రోహిత్- కోహ్లి ద్వయం మైదానంలో దిగనున్నారు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ
బ్యాటుతో రప్ఫాడేస్తారు. పరుగులతో హోరెత్తిస్తారు. కళ్లు చెదిరే సిక్సులు, ఫోర్లతో అలరించేస్తారు. ఎప్పుడూ టీవీలో కనిపించే అలాంటి తారలు మన నగరానికే వస్తున్నారు. వినోదం పంచనున్నారు. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం దేశవాళీ క్రీడా సంరంభానికి సిద్ధమవుతుండగా, తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం క్రికెట్ ప్రేమి కులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.అనంతపురం: దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా, అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక మ్యాచ్ నాలుగు రోజుల పాటు (మల్టీడే మ్యాచ్) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే టెస్ట్ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఒక మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగుతుంది. క్రీడా గ్రామం ఖ్యాతి.. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు తొలిసారిగా అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తుండడంతో జిల్లా పేరు దేశస్థాయిలో మార్మోగనుంది. 2003లో ప్రారంభించిన ఆర్డీటీ క్రీడా గ్రామం అనతి కాలంలోనే తన కీర్తిని ఇనుమడింపజేసుకుంది. స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలు పాటిస్తుండడంతో దులీప్ ట్రోఫీ నిర్వహణకు అవకాశం దక్కింది. పేద, మధ్య తరగతి క్రీడాకారులకు దన్నుగా నిలుస్తూ ఎంతో మంది ప్రతిభావంతులను క్రీడల వైపు ఆసక్తి పెరిగేలా కృషి చేసిన ఫాదర్ ఫెర్రర్ ఆశయం నెరవేరుతోందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు పండగే.. టోర్నీ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, పంత్ తదితర క్రికెట్ స్టార్లు నగరానికి రానున్నారు. తమ ఆటతో అభిమానులను మురిపించనున్నారు. భారత జట్టు క్రికెటర్లలో ముగ్గురు మినహా అందరూ దులీప్ ట్రోఫీలోని జట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరంలోని రెండు త్రీ స్టార్ హోటళ్లలో భారత క్రికెటర్లకు బస ఏర్పాట్లు చేస్తున్నారు.గర్వకారణం ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. ఇటువంటి మ్యాచ్‌లు జరుగుతాయని ఊహించలేదు. ఇంత మంది స్టార్ క్రికెటర్లు వస్తారని కలలో కూడా అనుకోలేదు. దులీప్ ట్రోఫీ వంటి వాటి నిర్వహణకు కేవలం గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. క్రికెటర్లకు అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి టోర్నీల వల్ల జిల్లా క్రికెటర్లకు స్ఫూర్తి కలుగుతుంది. ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. చాలా పెద్ద పని. చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందరి సహకారంతో ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేస్తాం. సెపె్టంబర్ 5 నుంచి 22 వరకూ టోర్నీ జరుగుతుంది. భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులు మినహా తక్కిన వారందరూ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. – మాంఛో ఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ మెంబర్ దులీప్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించే జట్లు ఇవే..టీమ్–ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ ధూబే, తనుస్ కోటియన్, కులదీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్్ధకృష్ణ, ఖలీల్ అహమ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషగ్ర, షస్వత్ రావత్. టీమ్–బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, యశ్ దయాల్, ముకేష్ కుమార్, రాహుల్ చహార్, ఆర్ సాయి కిశోర్, మోహిత్ అశ్విత్, ఎన్. జగదీషన్ (వికెట్ కీపర్) టీమ్–సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిష్క్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి. ఇంద్రజిత్, హార్ధిక్ షోకీన్, మనవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్‌కుమార్, అన్సుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్ఖండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్ టీమ్ –డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అతర్వ టైడ్, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భూయి, షరాన్స్ జైన్, ఆక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్దేశ్పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్‌గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
రోహిత్, కోహ్లి అందుకే ఆడటం లేదు: జై షా
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా యువ క్రికెటర్లందరూ భాగం కాబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తదితరులతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా ఈ దులిప్ ట్రోఫీలో ఆడనున్నారు.ఇందుకు సంబంధించి ఏ,బి,సి,డి జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్లకు వరుసగా శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనకు ముందు.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారనే వార్తలు వినిపించాయి.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఈ నవతరం దిగ్గజాలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్, కోహ్లితో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ టోర్నీకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాత్రమే మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మినహాయింపు ఇవ్వడం గురించి చెబుతూ.. ‘‘వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇందుకు వారందరిని ప్రశంసించాలి. అంతేకాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇది హర్షించదగ్గ పరిణామం.ఇక రోహిత్, కోహ్లి వంటి మేటి ఆటగాళ్లను కూడా దులిప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబట్టడం సమంజసం కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని అంతర్జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరు. బోర్డులు కూడా వారిని ఆడమని బలవంతపెట్టవు. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి కదా!’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.ఇక బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా భారత్‌తో టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇంతవరకు మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారేమో చూడాలి. లేదంటే.. మేమే వాళ్లను సంప్రదిస్తాం. ఎందుకంటే టీమిండియాకు బంగ్లాదేశ్‌తో సిరీస్ అత్యంత ముఖ్యమైనది’’ అని జై షా బదులిచ్చారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలవాలంటే బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ తప్పనిసరి. ఈ రెండింటిలో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. -
దులీప్ ట్రోఫీలో అగ్రశ్రేణి క్రికెటర్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలుకానుంది. వచ్చేనెల 5 నుంచి బెంగళూరు, అనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. దీనికోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం నాలుగు జట్లను ప్రకటించింది. శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ వరుసగా ‘ఎ’ ‘బి’ ‘సి’ ‘డి’ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, అశి్వన్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోని సీనియర్ పేసర్ షమీని కూడా ఎంపిక చేయలేదు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ చాలా రోజులకు ఎర్రబంతితో ఆడనున్నాడు. గత సీజన్లో రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్‌పై దృష్టి పెట్టి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నాడు. సెపె్టంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ‘బి’ జట్టుకు ఎంపిక చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు సిరాజ్ ‘బి’ జట్టులో చోటు పొందగా.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టులో ఉన్నాడు. ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్, రికీ భుయ్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నారు. -
అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్ కోసం!
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.అన్నదమ్ముల మధ్య పోటీ?వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్‌తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్‌తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 200 పరుగులు సాధించాడు.తమ్ముడు ఆల్రౌండర్నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్‌క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్‌రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం. -
దులీప్ ట్రోఫీ జట్ల ప్రకటన.. కెప్టెన్లుగా గిల్, రుతురాజ్, శ్రేయస్.. సీనియర్లకు విశ్రాంతి
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్).టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్‌కీపర్), సందీప్ వారియర్.టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్.షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
దులీప్ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా స్టార్లు వీరే..!
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందు చాలామంది టీమిండియా స్టార్లు దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ పాల్గొననున్నారని తెలుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరు మినహా ఇటీవలికాలంలో టీమిండియాకు ఆడిన దాదాపు అందరు ప్లేయర్లను ఈ టోర్నీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తుంది. విరాట్, రోహిత్‌తో పాటు అశ్విన్, బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండరని తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు (ఇండియా ఏ, బి, సి, డి) పాల్గొననున్నాయి. క్రికెట్ వర్గాల సమాచారం మేరకు జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.ఇండియా ఏ: రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దత్ పడిక్కల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, నవ్‌దీప్ సైనీఇండియా బి: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అజింక్య రహానే, రింకూ సింగ్, రికీ భుయ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), పుల్కిత్ నారంగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్ఇండియా సి: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), దృవ్ జురెల్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, విధ్వత్ కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణఇండియా డి: యశస్వి జైస్వాల్, మయాంక్ అగర్వాల్, ప్రదోశ్ రంజన్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్కుమార్షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి