దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత్ ‘బి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
వికెట్ కీపర్ సంజు సామ్సన్ (83 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) కూడా రాణించాడు.
అయితే ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా అయ్యర్ వెనుదిరిగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్, పడిక్కల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందివ్వగా.. రికీ భుయ్, సంజు సామ్సన్ దాన్ని కొనసాగించారు. భారత్ ‘బి’ బౌలర్లలో రాహుల్ చహర్ 3, ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సామ్సన్‌తో పాటు సారాంశ్ జైన్ (56 బంతుల్లో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment