దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా రౌండ్-2 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అనంతపురం వేదికగా ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తొలుత భారత్-ఎను బ్యాటింగ్ ఆహ్హనించాడు.
డి జట్టులోకి సంజూ శాంసన్, సౌరభ్ కుమార్ రాగా.. ఎ జట్టులోకి తిలక్ వర్మ, విధ్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా వచ్చారు. దులీప్ ట్రోఫీలో భాగమైన చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు వెళ్లడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
తుది జట్లు
ఇండియా D : అథర్వ తైదే, యశ్ దూబే, శ్రేయాస్ అయ్యర్ (సి), దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప
ఇండియా A : ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్
బౌలింగ్ ఎంచుకున్న ఇండియా-బి
ఇక ఈ టోర్నీలో మరోవైపు అనంతపూర్‌లో బి స్టేడియంలో ఇండియా-బి, ఇండియా-సి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-బి టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత-బి జట్టులోకి
ఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్
ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్
భారత బి జట్టులోకి ముఖేష్ కుమార్, రింకూ సింగ్, జగదీసన్ రాగా, ఇండియా సి జట్టులోకి మయాంక్ మార్కండే, రజిత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment