విఫలమైన సంజూ శాంసన్‌.. సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ | DT 2024 IND A vs IND D: Sanju Samson Cheaply Dismissed 5 Runs Fans Reacts | Sakshi
Sakshi News home page

విఫలమైన సంజూ శాంసన్‌.. సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌

Published Fri, Sep 13 2024 4:44 PM | Last Updated on Fri, Sep 13 2024 5:18 PM

DT 2024 IND A vs IND D: Sanju Samson Cheaply Dismissed 5 Runs Fans Reacts

టీమిండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ తనకు వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దులిప్‌ ట్రోఫీ జట్టుకు తొలిసారిగా ఎంపికైన అతడు.. ఆరంభ మ్యాచ్‌లోనే బ్యాటర్‌గా విఫలమయ్యాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేరళ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌.. చాలాకాలం తర్వాత దేశీ రెడ్‌బాల్‌ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

వారు వెళ్లిపోవడంతో
మరో వికెట్ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడిన నేపథ్యంలో ఇండియా-‘డి’ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ.. ఈ టీమ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో సంజూకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అయితే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు దులిప్‌ ట్రోఫీ నుంచి వైదొలగడంతో సంజూ ఎంట్రీకి మార్గం సుగమమైంది.

ఈ క్రమంలో ఇండియా-‘ఎ’తో అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ తరఫున సంజూ బరిలోకి దిగాడు. టాస్‌ గెలిచిన ఇండియా-‘డి’ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్‌లో  ఇండియా-‘ఎ’ను  290 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

క్యాచ్‌తో హైలైట్‌
ఇండియా- ‘డి’ బౌలర్లలో హర్షిత్‌ రాణా(4/51) నాలుగు వికెట్లతో చెలరేగగా.. విద్వత్‌ కవేరప్ప(2/30). అర్ష్‌దీప్‌ సింగ్‌(2/73) రెండేసి వికెట్లు తీశారు. మిగతా వాళ్లలో సారాంశ్‌ జైన్‌(1/55), సౌరభ్‌ కుమార్‌(1/65) ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇక కవేరప్ప బౌలింగ్‌లో ఇండియా-‘ఎ’ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఇచ్చిన క్యాచ్‌ను సంజూ పట్టిన తీరు హైలైట్‌గా నిలిచింది.

ఐదు పరుగులకే అవుట్‌
అనంతరం ఇండియా-‘డి’ బ్యాటింగ్‌కు దిగగా.. రెండో రోజు ఆటలో భాగంగా సంజూ ఐదో స్థానంలో వచ్చాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆకిబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సంజూ రెడ్‌బాల్‌ క్రికెట్‌కు పనికిరాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక దేవ్‌దత్‌ పడిక్కల్‌ 92 పరుగులతో రాణించడంతో.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగలిగింది.  ఫలితంగా వందకు పైగా పరుగుల ఆధిక్యంతో ఇండియా- ‘ఎ’ రెండో ఇన్నిం గ్స్‌ మొదలు పెట్టింది.

చదవండి: Shreyas Iyer: స‌న్‌గ్లాసెస్‌తో బ్యాటింగ్‌..! క‌ట్ చేస్తే డ‌కౌట‌య్యాడు(వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement