దులీప్ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ దేశీవాళీ టోర్నీలో ఇండియా-డికి ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. అనంతపూర్ వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో మూడంకెల స్కోరును అందుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో వన్డే క్రికెట్‌ను తలపిస్తూ మెరుపు శతకాన్ని సంజూ నమోదు చేశాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 94 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న శాంసన్.. 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.
సంజూకు ఇది 11వ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సెంచరీ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా-డి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. సంజూతో పాటు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చదవండి: IND vs BAN: జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే?
Comments
Please login to add a commentAdd a comment