ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్‌కు చేరాడు.
అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్‌తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.
ఇషాన్ సూపర్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.
ఆదుకున్న ములానీ
ఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం
Comments
Please login to add a commentAdd a comment