Duleep Trophy: Venkatesh Iyer gets hit on neck from Chintan Gaja Throw - Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌ అయ్యర్‌కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్‌ వచ్చినప్పటికీ!

Published Fri, Sep 16 2022 4:02 PM | Last Updated on Fri, Sep 16 2022 4:32 PM

Duleep Trophy: Venkatesh Iyer gets hit on neck from Chintan Gajas throw - Sakshi

దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో  గాయపడ్డాడు. వెస్ట్ జోన్ పేసర్‌ చింతన్ గజా వేసిన ఓవర్‌లో అయ్యర్‌ బౌలర్‌ దిశగా ఢిపెన్స్‌ ఆడాడు.

వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్‌ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్‌ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్‌ తీవ్ర నొప్పితో గ్రౌండ్‌లో విలవిలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్‌ కూడా గ్రౌండ్‌లోకి వచ్చింది. అయితే అయ్యర్‌ మాత్రం నెమ్మదిగా నడుస్తునే ఫీల్డ్‌ను వదిలాడు.

ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా చోటుచేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రిటైర్‌ హార్ట్‌గా వెనుదిరిగిన అయ్యర్‌ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతోన్నాయి.


చదవండి: IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్ బేలిస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement