Head Injury
-
నిమజ్జనంలో విషాదం.. చావును ఏరికోరి తెచ్చుకోవడం అంటే ఇదే!
సాక్షి, అన్నమయ్య: రాజంపేటలో శనివారం జరిగిన వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. విన్యాసాలు చేయబోయి ఓ వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అప్పటిదాకా సంతోషంగా గంతులేసిన వ్యక్తి.. అరక్షణంలో రక్తపు మడుగులో పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయయారు. రాజంపేట పట్టణంలో శనివారం కిరణ్ అనే వ్యక్తి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్న కిరణ్.. రకరకాల విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో విగ్రహం తీసుకెళ్తున్న ట్రాక్టర్ బంపర్‌పై నుంచి దూకి విన్యాసం చేయాలనుకున్నాడు. అయితే.. ఆ ఊపులో తల సరాసరిగా రోడ్డుకు బలంగా తగిలింది. దీంతో స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్నవాళ్లు కడప ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలలో నరాలు దెబ్బ తిన్నాయని.. ఆపరేషన్ అవసరమని, పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మద్యం మత్తులో వినోదానికి పోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. -
మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం
ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది. అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే! ‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF — Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023 -
పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే ఆసుపత్రికి!
శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వరుస పెట్టి గాయాల బారినపడుతున్నారు. శ్రీలంక చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది. దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్తాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే. Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD — Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022 చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు -
వెంకటేశ్ అయ్యర్‌కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ!
దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో గాయపడ్డాడు. వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో అయ్యర్ బౌలర్ దిశగా ఢిపెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్ తీవ్ర నొప్పితో గ్రౌండ్లో విలవిలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్ కూడా గ్రౌండ్లోకి వచ్చింది. అయితే అయ్యర్ మాత్రం నెమ్మదిగా నడుస్తునే ఫీల్డ్‌ను వదిలాడు. ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తుండగా చోటుచేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రిటైర్ హార్ట్‌గా వెనుదిరిగిన అయ్యర్ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. Unpleasant scene here. Venkatesh Iyer has been hit on the shoulder as Gaja throws the ball defended ball back at the batter. Venkatesh is down on the ground in pain and the ambulance arrives. #DuleepTrophy pic.twitter.com/TCvWbdgXFp — Dhruva Prasad (@DhruvaPrasad9) September 16, 2022 చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్! -
సైరస్ మిస్త్రీ విషాదం: పోస్ట్‌మార్టం నివేదిక ఏం చెబుతోందంటే?
ముంబై: గత ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాథిమిక పోస్ట్‌మార్టం పూర్తియింది. దీని ప్రకారం ఆయన తలకు, గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా అంతర్గత రక్తస్రావంతో అక్కడి కక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది. అలాగే పాలీట్రామా (శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బ తినడం)కు గురయ్యారని ఈ నివేదిక తేల్చింది.(Instagram: భారీ జరిమానా..షాకింగ్! ఎందుకో తెలుసా?) సోమవారం తెల్లవారుజామున ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రిలో సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరి శవపరీక్ష నివేదికను కాసా పోలీస్ స్టేషన్‌కు (ప్రమాదం జరిగిన ప్రాంతం)పంపారు. మరో రెండురోజుల్లో తుది నివేదిక వెలువడ నుంది. ఇందులో మిస్త్రీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిస్త్రీ శరీరంనుంచి ఎనిమిది శాంపిళ్లను సేకరించి, తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలు భద్రం చేశారు. మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: New milestone: వావ్.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి ముగిసిన అంత్యక్రియలు జేజే ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిన ఆయన భౌతికకాయాన్నిస్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు వర్లీ శ్మశానవాటికలో ఉంచారు. అనంతరం సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ సంఘం సభ్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు దహన సంస్కారాలకు హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ సోదరుడు షాపూర్ మిస్త్రీ, మామ, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు సైరస్ మిస్త్రీకి తుది నివాళులర్పించారు. అమూల్ ప్రత్యేక నివాళి డైనమిక్ బిజినెస్‌మ్యాన్ అంటూ అమూల్ ఇండియా మిస్త్రీకి నివాళులర్పించింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) -
బీర్ బాటిల్‌తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా
సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ అసిస్టెంట్ రిఫరీ తలపై ఒక ఆకతాయి బీర్ బాటిల్ విసరడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటన బుండెస్లిగా లీగ్‌లో జరిగింది. బోచుమ్, బోరుస్సియా మోయెన్చెంగ్లాడ్బాచ్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. హాఫ్ టై ముగిసేసరికి గ్లాడ్బాచ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. బోచుమ్ జట్టు ఓడిపోతుందన్న విషయాన్ని ఒక ఆకతాయి అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఇక రెండో హాఫ్ మొదలైన తర్వాత ఆట 71వ నిమిషంలో అసిస్టెంట్ రిఫరీ క్రిస్టియన్ గిట్టిల్మన్పై సదరు ఆకతాయి బీర్ బాటిల్‌ను విసిరాడు. అది వచ్చి నేరుగా రిఫరీ తలకు బలంగా తగిలింది. గ్రౌండ్లో కూలబడ్డ రిఫరీ నొప్పితో విలవిల్లాలాడు. విషయం తెలుసుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు రిఫరీ వద్దకు వచ్చి అతనికి ఎలా ఉందోనని ఆందోళన పడ్డారు. దాదాపు 20 నిమిషాల చర్చ అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌ను సజావుగా జరగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కోసం రిఫరీని గాయపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ తెలిపింది. ఇదిలాఉంటే.. గ్లాడ్బాచ్కు చెందిన ఒక ఆటగాడు స్టాండ్స్‌లో ఉన్న సదరు ఆకతాయితో గొడవకు దిగాడు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా.. నీ బుద్దిని కాస్త అదుపులో ఉంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఉదంతాన్ని ఇరు క్లబ్‌లు సోషల్ మీడియా వేదికగా ఖండించాయి. ''మేం రిఫరీ లైన్స్‌మన్ క్రిస్టియన్ గిట్టిల్మన్ను క్షమాపణ కోరుతున్నాం. ఈ విషయం మాకు భరించలేనిది. ఒక ఆకతాయి అభిమాని పిచ్చిగా ప్రవర్తించినందుకు మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతాం'' అంటూ బోచుమ్ క్లబ్ వెల్లడించింది. చదవండి: PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! Nick Kyrgios: టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే? Disgraceful situation at Vonovia Ruhrstadion, where the Bochum-Gladbach Bundesliga clash was abandoned after 71 minutes due to a linesman being struck on the head by an object from the crowd.#BOCBMG pic.twitter.com/Yfdn4R2blJ — Sacha Pisani (@Sachk0) March 18, 2022 -
ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం!
ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ 2 ఓవర్లో దక్షిణాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేసింది. బౌన్సర్ బంతిని పుల్ షాట్ ఆడటానికి మంధాన ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి మంధాన హెల్మెట్‌కు బలంగా తగిలింది. అయితే వెంటనే ఫీల్డ్‌లోకి ఫిజియో వచ్చి మంధానను పరిశీలించాడు. అయితే ఆమెకు ఎలాంటి కంకషన్ లక్షణాలు కనిపించలేదు. దీంతో ఆమెకు తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని ఫిజియో నిర్ధారించాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మంధాన ఫీల్డ్‌ను విడిచి వెళ్లింది. 12 పరుగులు చేసిన ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించి. భారత బ్యాటర్లలో హర్మాన్ ప్రీత్ కౌర్ సెంచరీతో మెరిసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మాన్ ప్రీత్ కౌర్(103), యస్తికా భాటియా(58) పరుగులతో రాణించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటిస్ జట్టు 242 పరుగులకే పరిమితమైంది. చదవండి: Rohit Sharma: రోహిత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేటపుడు జాగ్రత్త.. పట్టిందల్లా బంగారమే: టీమిండియా మాజీ క్రికెటర్ -
ఏ ముహుర్తానా సిరీస్ ప్రారంభమయిందో.. ఇషాన్ కిషన్ తలకు గాయం
ఏ ముహుర్తానా టీమిండియా, శ్రీలంక సిరీస్ ప్రారంభమైందో తెలియదు కానీ ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్‌లు దూరమయ్యారు. తొలి టి20 తర్వాత రుతురాజ్ కూడా గాయంతో వైదొలిగాడు. తాజాగా టీమిండియా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ రెండో టి20 మ్యాచ్‌లో గాయపడ్డాడు. టీమిండియా బ్యాటింగ్ సమయంలోనే ఇషాన్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో లాహిరు కుమారా 147. 6 కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. క్రీజు నుంచి పక్కకు వెళ్లిన ఇషాన్ హెల్మెల్ తీసిన తలను చూసుకున్నాడు. ఇంతలో ఫిజియో వచ్చి ఇషాన్‌ను పరిశీలించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో మ్యాచ్‌లో కంటిన్యూ అయ్యాడు. ఇక ఈ యువ ఓపెనర్ 16 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగిలిందా లేక సాధారణమేనా అన్న కోణంలో సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితం ఆదివారం రానుంది. ఇప్పటికైతే ఇషాన్ బాగానే ఉన్నాడని.. అబ్జర్వేషన్లో ఉంచామని డాక్టర్ శుభమ్ తెలిపారు. చదవండి: Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ మూడో టి20 ఆడేది అనుమానంగా మారింది. అతను ఆడకపోతే రోహిత్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ మూడో టి20లో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమల్ గాయం బారిన పడ్డాడు. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ సందర్భంగా చండిమల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో చండిమల్ కూడా కంగ్రా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వేలికి స్కానింగ్ నిర్వహించామని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మెరుపులతో 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు pic.twitter.com/QhV1bsmuLC — Sports Hustle (@SportsHustle3) February 26, 2022 -
తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు
ఫుట్‌బాల్ ఆటలో ఇరుజట్లు గోల్ కొట్టాలని ప్రయత్నిస్తాయి ఈ నేపథ్యంలో గోల్ అడ్డుకునే క్రమంలో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం అయితే ఒక్కోసారి అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా సెనెగల్, కేప్ వర్డేల మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి ఆట 57వ నిమిషంలో సెనెగెల్ స్ట్రైకర్ సాడియో మానే, కేప్‌వర్డే గోల్‌కీపర్ వోజిన్హా ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. గోల్ కొట్టే క్రమంలో సాడియో మానే.. కేప్‌వర్డే నెట్స్ వైపు వేగంగా దూసుకొచ్చాడు. అదే సమయంలో గోల్ కీపర్ వోజిన్హా గోల్‌ను అడ్డుకునే క్రమంలో బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ మానే అతని పైనుంచి గోల్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునే క్రమంలో అతని తల ..మానే తలకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన మానే స్టేడియంలోనే కుప్పకూలాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి చికిత్స అవసరమని చెప్పాడు. చదవండి: Australian Open 2022: పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు కానీ మానే ఇదేం పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. గాయం బాధిస్తున్నా నొప్పిని పంటికింద అదిమి సరిగ్గా ఆరు నిమిషాలకు గోల్ కొట్టాడు. అలా సెనెగ్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత గోల్ కొట్టడంలో కేప్‌వర్డే విఫలం కావడంతో సెనెగల్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. కాగా మానేను ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు గోల్ కీపర్ వోజిన్హాకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపెట్టాడు. ఇక ఆదివారం మాలి వర్సెస్ ఈక్వెటోరియల్ జినియా మధ్య విజేతతో సెనెగల్ క్వార్టర్ఫైనల్లో తలపడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మానేను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం అయినప్పటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమి లేదని.. తర్వాతి మ్యాచ్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు మానే ఆసుపత్రిలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చదవండి: Mitchell Santner: మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి 💥 NASTY HEAD COLLISION BETWEEN SADIO MANE AND YOSIMAR DIAS! The goalkeeper was sent off after VAR review 🟥 Cape Verde down to nine men! 😱#TotalEnergiesAFCON2021 | #AFCON2021 | #SENCPV pic.twitter.com/GBGwasSHmk — beIN SPORTS USA (@beINSPORTSUSA) January 25, 2022 -
ప్రాక్టీస్ చేస్తుండగా తలకు బలమైన గాయం; కీలక మ్యాచ్‌లకు దూరం
గయానా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టుకు షాక్ తగలింది. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు శనివారం పాకిస్తాన్ ఆటగాడు అజమ్‌ఖాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని తలకు బలమైన గాయం తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే అజమ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పీసీబీ తెలిపింది. అజమ్‌కు వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించారని.. ప్రస్తుతం అతను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొంది. కాగా 24 గంటల తర్వాత అజమ్ గాయం తీవ్రతపై ఒక అంచనా వస్తుందని పీబీబీ తెలిపింది. కాగా అజమ్ బ్యాటింగ్ సమయంలో హెల్మట్ ధరించినప్పటికి.. బంతి వేగంగా రావడంతో తలకు బలంగా తగిలింది. కాగా విండీస్, పాకిస్తాన్ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షార్పణంతో రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది. -
సీరియల్ నటుడిపై 10 మంది దాడి
న్యూఢిల్లీ: "దిల్‌తో హ్యాపీ హై జీ" సీరియల్ నటుడు అన్ష్ బగ్రీపై శనివారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు ఢిల్లీలోని తన ఇంటికి చేరుకుని మరీ మూకదాడి చేసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఇది తన మాజీ కాంట్రాక్టర్ పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. "ఇల్లు నిర్మించాలన్నది నా కల. దీనికోసం గతేడాదే ఓ కాంట్రాక్టర్‌ను మాట్లాడుకున్నాం. అయితే అతను చెప్పిన గడువుకల్లా ఇంటి నిర్మాణం పూర్తిచేయనందు వల్ల గతంలోనూ ఓసారి అతడిని హెచ్చరించాను. త్వరగా పనులు పూర్తి చేయాలని కోరాను. అయినప్పటికీ ఎప్పుడో పూర్తవాల్సిన నిర్మాణాన్ని సాగదీస్తూ వచ్చాడు. పైగా ఇల్లు పెండింగ్‌లో ఉండగానే డబ్బులు అడిగాడు. పని పూర్తయ్యాకే ఇస్తానని కరాఖండిగా చెప్పాను. కానీ అతను వినలేదు" (వాడి పళ్లు రాలగొడతా: సింగర్ సునీత) "దీంతో ఇద్దరిమధ్య మాటామాటా పెరగడంతో ఆ కాంట్రాక్టర్ మధ్యలోనే పని వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత లాక్డౌన్లో నేను ముంబైలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్ నా తల్లిని, చెల్లిని బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు చేశారు. వాళ్లు అతడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రస్తుతం కొత్త కాంట్రాక్టర్ నా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఈ విషయం తెలిసి మాజీ కాంట్రాక్టర్ మనుషులను పంపించాడు. జూలై 26న సుమారు పది మంది నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అక్కడున్న ఎవరూ నాకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు" అని అన్ష్ బగ్రీ తెలిపారు. (నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!) -
రోగి పట్ల బంగారంలాంటి సమయం...గోల్డెన్ అవర్
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా రోగికి పక్షవాతం లేదా గుండెపోటు లక్షణాలు కనిపించినా వారికి అత్యవసరంగా చికిత్స అందాల్సిన ఆ కీలకమైన సమయాన్ని వైద్యులు ‘గోల్డెన్ అవర్’గా చెబుతుంటారు. తెలుగులో చెప్పాలంటే ఈ వ్యవధిని బంగారు ఘడియలు అనుకోవచ్చు. రోడ్డు ప్రమాదలు జరిగినప్పుడు : వీటిని వైద్య పరిభాషలో ట్రామా కేసులుగా చెబుతుంటారు. ప్రమాదం జరిగినప్పుడు రోగికి కొన్ని అత్యవసర వైద్యసేవలు అందాలి. ఉదాహరణకు తక్షణం ఆక్సిజన్ అందించాలి. ఇందుకోసం అవసరమైతే శ్వాసనాళంలోకి గొట్టాన్ని వేయాల్సి రావచ్చు. ఇక రక్తస్రావాన్ని ఆపడం, సెలైన్ ఎక్కించడం వంటి చికిత్సలూ అందించాలి. వీటిని అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ (ఏటీఎల్ఎస్) అంటారు. ఇలాంటి వైద్య సహాయాలు యాక్సిడెంట్ అయిన అరగంట / గంట లోపే అందితే ప్రాణాపాయాన్ని నివారించవచ్చు కాబట్టి దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. హెడ్ ఇంజ్యూరీ అయితే మరింత వేగంగా : తలకు దెబ్బతగిలినప్పుడు (హెడ్ ఇంజ్యురీలో) రోగిని ఎంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయాన్ని అంతగా తప్పించవచ్చు. తలకు గాయమైనప్పుడు ప్రాణాపాయం సంభవించే అవకాశాలెక్కువ కాబట్టి ఇలాంటి సమయంలో మరింత త్వరితంగా స్పందించాలి. గుండెపోటు వచ్చినప్పుడు : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వల్ల గుండె కండరానికి రక్తప్రసరణ ఆగితే దాన్ని హార్ట్ఎటాక్ అంటారన్నది తెలిసిందే. హార్ట్ ఎటాక్ వచ్చినవారికి గుండెకండరాన్ని కాపాడటానికి ఇచ్చే మందును గుండెపోటు వచ్చిన గంటన్నర (90 నిమిషాల్లో) లోపు ఇవ్వాలి. ఈ చికిత్సను థ్రాంబోలైసిస్ (రక్తపు గడ్డను కరిగించే మందు ఇవ్వడం) అంటారు. ఈ నిర్ణీత సమయం దాటాక థ్రాంబోలైసిస్ చికిత్సతో ఫలితం ఒకింత తక్కువ. కాంప్లికేషన్లూ ఎక్కువ. బ్రెయిన్‌స్ట్రోక్ (పక్షవాతం ) నివారణకు... మెదడుకు అందాల్సిన రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే పక్షవాతం వస్తుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇలాంటి వారికి మొదటి నాలుగున్నర గంటలలోపు టిష్యూ ప్లాస్మెనోజిన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే మందును ఇస్తారు. కాకపోతే ఎంత త్వరగా ఇస్తే అంత మంచి ఫలితాలుంటాయి. దీన్ని ఇవ్వాలంటే ముందుగా సీటీ స్కాన్, ప్లేట్లెట్ కౌంట్ పరీక్ష చేసి ఈ టీపీఏ ఇవ్వవచ్చా అనే విషయాన్ని నిర్ధారణ చేయాలి. ఇది చేయగలిగితే జీవితాంతం బాధపెట్టే పక్షవాతాన్ని నివారించవచ్చు. సెప్సిస్ : రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితిని సెప్సిస్ అంటారు. వీళ్లకు బీపీ పడిపోతుంది. అలాగే మూత్రపిండాలు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలు ఫెయిల్ అయ్యేందుకూ అవకాశాలెక్కువ. ఇలాంటి కండిషన్ రాకుండా నివారించడాన్ని వైద్య పరిభాషలో రిససిటేషన్ అంటారు. ఈ రిససిటేషన్ చేయడానికి రోగిని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలి. కొందరిలో ఇలా రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే... బీపీ తగ్గి షాక్‌లోకి వెళ్తారు. అలాంటి సందర్భాల్లో రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రిలో చేర్చాలి. చేర్చడానికి పట్టే వ్యవధి ఎంత తక్కువగా ఉంటే ప్రమాదం అంత తక్కువని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్‌ను అనుమానించినప్పుడు నిర్ధారణ కంటే ముందే ఎంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇస్తే అంత ఫలితం దక్కుతుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్‌లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్‌లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
తలకు దెబ్బ తగిలిందని వెళ్తే..
న్యూఢిల్లీ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య కడుపు నొప్పని వచ్చిన ఓ మహిళకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు డయాలసిస్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయేంద్ర త్యాగి అనే వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు ఢిల్లీలోని సుశ్రుత ట్రామా సెంటర్‌కు వెళ్లాడు. అయితే అదే రోజు కాలు విరగడంతో వీరేంద్ర అనే మరో వ్యక్తి అదే ఆస్పత్రిలో చేరాడు. వీరి పేర్ల విషయంలో అయోమయానికి గురైన డాక్టర్.. ఒకరికి చేయాల్సిన వైద్యం మరోకరి చేశాడు. కాలు విరిగిన వీరేంద్రకు అందించాల్సిన చికిత్సను విజయేంద్ర త్యాగికి అందించాడు. చికిత్సలో భాగంగా అతడి కాలికి రంధ్రం చేశాడు. మత్తులో ఉండటంతో అతడికి కూడా ఏమీ అర్థం కాలేదు. పేషంట్‌కు మెలకువ వచ్చిన అనంతరం అసలు విషయం తెలుసుకున్న వైద్యుడు కంగుతిన్నాడు. వెంటనే మళ్లీ తలకు సంబంధించిన చికిత్స చేసి తప్పించుకోవాలని చూశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విజయేంద్ర త్యాగి కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సూపరిండెంటెండ్ అజయ్ భాల్ తెలిపారు. -
పట్టపగలు బిజీ మార్కెట్లో మహిళపై దారుణం
-
స్టేజి మీద పడి.. మంత్రి తలకు గాయాలు
హిమాచల్ ప్రదేశ్ సీనియర్ మంత్రి విద్యా స్టోక్స్ (88) స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేదికపై పడిపోవడంతో.. ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. వేదిక మీద ప్రసంగించిన అనంతరం తన సీటు వైపు వెళ్తుండగా ఆమె కింద పడిపోయారు. దాంతో ఆమె తలకు స్వల్పంగా గాయాలయ్యాయని, అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉందని విద్యా స్టోక్స్‌తో పాటు ఉన్న ఓ అధికారి తెలిపారు. ఇప్పటికి ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. చాలా కాలంగా భారత హాకీ సంఘంలో కూడా సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల, ప్రజారోగ్య శాఖలు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం గవర్నర్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. తొలిసారి ఆమె 1974లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
ది గ్రేట్ ఖలీకి తీవ్రగాయాలు
ఉత్తరాఖండ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరుగుతున్న 'ది గ్రేట్ ఖలీ షో'లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించారు. భారత్పేరును ఖలీ రెస్లింగ్‌లో కూడా ఖండాతరాలు దాటేలా చేశారు. ఖలీ గాయాలనుంచి కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.