ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది.
అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!
‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది.
కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF
— Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023
Comments
Please login to add a commentAdd a comment