BRICS Summit Begins Today, Possibility Of PM Modi-Xi Jinping Meet - Sakshi
Sakshi News home page

BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ

Published Tue, Aug 22 2023 10:05 AM | Last Updated on Tue, Aug 22 2023 10:25 AM

BRICS Summit Begins Today Possibility Of PM Modi Xi Jinping Meet - Sakshi

న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. 

జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. 

ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు.  అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. 

చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది.  

బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ  చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది.

ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు.

ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement