Johannesberg
-
BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
బార్లో అర్ధరాత్రి కాల్పులు.. 14 మంది మృతి..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
IND Vs SA 2nd Test: ఆరు టెస్ట్‌లు, ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు వేదికైన జొహనెస్‌బర్గ్‌లో టీమిండియాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ వేదికపై టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆరుగురు వేర్వేరు కెప్టెన్లతో బరిలో దిగింది. 1992లో తొలిసారి భారత జట్టు ఈ వేదికపై ఆడినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం వహించగా..1997లో సచిన్ టెండూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్, 2013లో ధోని, 2018లో విరాట్ కోహ్లి కెప్టెన్లుగా వ్యవహరించారు. ప్రస్తుత మ్యాచ్‌లో కోహ్లి అనూహ్యంగా తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చిన విహారి(53 బంతుల్లో 20; 3 ఫోర్లు) నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో అశ్విన్(21 బంతుల్లో 24; 4 ఫోర్లు), పంత్(32 బంతుల్లో 13; ఫోర్) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్, జన్సెన్ తలో రెండు వికెట్లు, రబాడ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్ -
వైరల్: బంతి ఎక్కడ పడింది.. నువ్వెక్కడున్నవ్
జొహెన్నెస్‌బర్గ్: సోమవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఓపెనర్ షార్జీల్ ఖాన్ చేసిన పని సోషల్ మీడియలో నవ్వులు పూయిస్తుంది. విషయంలోకి వెళితే.. ఉస్మాన్ ఖాదీర్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఒక బంతిని జార్జ్ లిండే లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా లిండే బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అయితే లాంగాన్‌లో ఉన్న షార్జీల్ బంతి ఎక్కడ పడుతుందనే దానిని సరిగ్గా అంచనా వేయలేక బాగా ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అయితే బంతి మాత్రం అతన్ని దాటుకొని వెనకాల పడింది. ఈ ఘటనతో కాసేపు ఆశ్చర్యానికి లోనైన షార్జీల్ తాను చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడ్డాడు. అయితే బంతి బౌండరీ లైన్ దాటుతుందేమో అన్న సమయంలో లాంగాఫ్ నుంచి వచ్చిన ఫీల్డర్ బంతిని అందుకోవడంతో రెండు పరుగులే వచ్చాయి. అయితే షార్జీల్ చర్యపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అసలే ఫిట్‌నెస్‌లో పూర్ అని పేరున్న షార్జీల్‌కు క్యాచ్ పట్టుకోవడం కూడా రాదని గేలి చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్ 50 పరుగులతో రాణించాడు. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జార్జి లిండే ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/23; 10 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్స్‌లు), ఓపెనర్ మక్రమ్ 30 బంతుల్లోనే 54 పరుగులతో రాణించడంతో సునాయస విజయాన్ని అందుకుంది. చదవండి: లిండే ఆల్‌రౌండ్ ప్రదర్శన.. పాక్‌పై దక్షిణాఫ్రికా గెలుపు EPIC LOL 😂😂😂🤣🤣🤣 pic.twitter.com/Q8DhsUeyh2 — Taimoor Zaman (@taimoorze) April 12, 2021 -
'షర్ట్ విప్పితేనే విమానం ఎక్కనిస్తాం'
జోహన్నెస్‌బర్గ్ : జోహన్నెస్‌బర్గ్‌లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 ఏళ్ల బాలుడికి వింత అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన బాలుడిని బోర్డింగ్ వద్ద విమాన సిబ్బంది అడ్డుకొని నువ్వు వేసుకున్న షర్ట్‌ను విప్పితేనే విమానంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇంతకీ షర్ట్ ఎందుకు విప్పమన్నారనేగా మీ డౌటు.. అక్కడికే వసున్నాం ! న్యూజిలాండ్‌లో ఉండే తమ బంధువులను కలిసేందుకు దంపతులు తమ 10 ఏళ్ల స్టీవ్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే విమానం ఎక్కడానికి బోర్డింగ్ దగ్గరకు వచ్చారు. విమాన సిబ్బంది స్టీవ్‌ను అడ్డుకొని షర్ట్ మార్చుకోవాలని సూచించారు. కాగా స్టీవ్ వేసుకున్న షర్ట్‌పై కింగ్ కోబ్రా పాము బొమ్మ ముద్రించబడి ఉంది. ఆ బొమ్మ చూడడానికి కాస్త భయంకరంగా ఉండడంతో తోటి ప్రయాణికులు బొమ్మను చూసి భయానికి లోనవుతారంటూ అందుకే సిబ్బంది షర్ట్‌ను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. కానీ మొదట ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినా చేసేదేం లేక స్టీవ్ వేరే షర్ట్‌ను తొడిగి విమానం ఎక్కారు. అయితే అధికారులు తాము చేసిన పని సరైందేనంటూ సమర్థించుకున్నారు. ఆ అబ్బాయి వేసుకున్న షర్టువల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే, అయినా అలాంటి దుస్తులను మేం అంగీకరించబోమని వెల్లడించారు. దీనిపై ఒక సంస్థ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ' ఆ బాలుడిని అడ్డగించి బలవంతంగా షర్టు మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. అతను వేసుకున్న షర్టుపై ఒక పాము బొమ్మ ఉండడమే దీనికి కారణం' అంటూ ట్వీట్ చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఫోటోలను చూసి ' ఇవేం రూల్స్‌రా బాబు...దుస్తులపై బొమ్మలు ఉంటే విమానం ఎక్కనివ్వరా అంటూ' నెటిజన్లు మండిపడుతున్నారు. A Boy, 10, is forced to take his shirt off before boarding a flight from #NewZealand to #SouthAfrica because it had a picture of a reptile on it ✈️😬 pic.twitter.com/T0O6DqfBDo — aviation-fails (@aviation07fails) 26 December 2019 -
నెల్సన్ మండేలా మాజీ భార్య కన్నుమూత
జోహన్స్‌బర్గ్ : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విన్నీ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినప్పుడు, అతని విడుదల కోసం ఉద్యమించటంతో పాటు, నల్ల జాతీయుల హక్కుల కోసం విన్నీ పోరాడారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు. -
నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి!
జోహెన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా విగ్రహాన్ని ఓ మహిళ కౌలిగించుకుని కలకలం రేపింది. ఇందులో వింతేముందని అప్పుడే నిర్ణయానికి వచ్చేయకండి. నల్లసూరీడు ప్రతిమను నగ్నంగా హత్తుకుని అందరినీ ఆమె ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింతను చూసి అక్కడున్నవారంతా నోరెళ్ల బెట్టారు. దక్షిణాఫ్రికా వాణిజ్య రాజధాని జోహెన్నెస్‌బర్గ్ లోని అప్ మార్కెట్ ఏరియాలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుందని స్టార్ న్యూస్‌పేపర్ తెలిపింది. అమ్మడు అక్కడితో ఊరుకోకుండా నెల్సన్ మండేలా విగ్రహాన్ని కౌగిలించుకున్న ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఒంటిమీద ఆచ్ఛాదన లేకుండా తన తలను మండేలా విగ్రహం మోకాలికి ఆన్చినట్టు ఫోటోలో కనబడుతోంది. 'అందాల ప్రదర్శనతో ఒక ప్రైవేటు వ్యక్తి తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు చేసిన అనధికార చర్య'గా దీన్ని నెల్సన్ మండేలా స్క్వార్ మార్కెటింగ్ మేనేజర్ మెగాన్ మియాస్ వర్ణించారు. అక్కడున్న సెక్యూరిటీ బతిమాలడంతో ఆమె బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఎటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. వెర్రి వెయ్యి విధాలంటే ఇదేనేమో!