నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి! | Woman Strips Naked to Hug Mandela Statue in South Africa | Sakshi
Sakshi News home page

నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి!

Published Thu, Jul 31 2014 4:53 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి! - Sakshi

నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి!

జోహెన్నెస్బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా విగ్రహాన్ని ఓ మహిళ కౌలిగించుకుని కలకలం రేపింది. ఇందులో వింతేముందని అప్పుడే నిర్ణయానికి వచ్చేయకండి. నల్లసూరీడు ప్రతిమను నగ్నంగా హత్తుకుని అందరినీ ఆమె ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింతను చూసి అక్కడున్నవారంతా నోరెళ్ల బెట్టారు.

దక్షిణాఫ్రికా వాణిజ్య రాజధాని జోహెన్నెస్బర్గ్ లోని అప్ మార్కెట్ ఏరియాలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుందని స్టార్ న్యూస్పేపర్ తెలిపింది. అమ్మడు అక్కడితో ఊరుకోకుండా నెల్సన్ మండేలా విగ్రహాన్ని కౌగిలించుకున్న ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఒంటిమీద ఆచ్ఛాదన లేకుండా తన తలను మండేలా విగ్రహం మోకాలికి ఆన్చినట్టు ఫోటోలో కనబడుతోంది.

'అందాల ప్రదర్శనతో ఒక ప్రైవేటు వ్యక్తి తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు చేసిన అనధికార చర్య'గా దీన్ని నెల్సన్ మండేలా స్క్వార్ మార్కెటింగ్ మేనేజర్ మెగాన్ మియాస్ వర్ణించారు. అక్కడున్న సెక్యూరిటీ బతిమాలడంతో ఆమె బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఎటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. వెర్రి వెయ్యి విధాలంటే ఇదేనేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement