
జోహన్స్‌బర్గ్ : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విన్నీ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య అన్న విషయం తెలిసిందే.
జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినప్పుడు, అతని విడుదల కోసం ఉద్యమించటంతో పాటు, నల్ల జాతీయుల హక్కుల కోసం విన్నీ పోరాడారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment