wife died
-
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భార్య మరణం దృష్ట్యా సూపరింటెండెంట్ రాహుల్ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు. చదవండి: Live Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్ -
భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్
సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు. చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం... -
టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె వలసరవాక్కంలో దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబకులహాల కారణంగా ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చైన్నె వలసరవాక్కము అన్బునగర్ రెండవ వీధిలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న నాగరత్నం (47). ఇతను టీవీ సీరియల్ డైరెక్టర్. ప్రముఖ ప్రైవేటు చానల్లో ప్రసారం అవుతున్న పాండవర్ ఇల్లం అనే సీరియల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పైగా వాణి రాణి, సెవ్వంది అనే టీవీ సీరియల్ లోను డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతని భార్య పద్మావతి (37). వీరి సొంత ఊరు కోవై జిల్లా పొల్లార్చి. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వీరికి నవీనేషు (15), సాయి ఆదర్శ (8) ఇద్దరు కుమారులు. ప్రస్తుతం పాఠశాలలలకు సెలవులు కావడంతో నాగరత్నం కుటుంబంతో కలిసి సొంతూరు పొల్లాచ్చికి వెళ్లారు. తర్వాత ఇద్దరు కుమారులను అక్కడ వదిలిపెట్టి భార్యతో కలిసి నాగరత్నం చైన్నెకి వచ్చారు. ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టి ఏదైనా వ్యాపారం చేపడతామని నాగరత్నంతో భార్య పద్మావతి చెప్పింది. ఈ విషయంగా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి టీవీ సీరియల్ షూటింగ్‌కు వెళ్లి నాగరత్నం గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య భర్త మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు గురువారం ఉదయం పొల్లాచ్చి నుంచి చైన్నెకి తిరిగి వచ్చారు. వారిని తీసుకొచ్చేందుకు నాగరత్నం కోయంబేడు బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కుమారులను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గదిలో పద్మావతి ఉరి వేసుకొని వేలాడుతుండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రకి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన్నట్లు తెలిపారు. విషయం తెలిసి వలసరవాక్కం పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి..
అనంతపురం సిటీ: కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి చెందింది. జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ తెలిపిన మేరకు... అనంతపురం మండలం రాచానుపల్లికి చెందిన గోపాల్, రమాదేవి (35) దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్, రెండేళ్ల కుమార్తె మేఘన ఉన్నారు. శనివారం రాత్రి గుంతకల్లుకు వెళ్లేందుకు అనంతపురం రైల్వే స్టేషన్లో కాచిగూడ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. చదవండి: మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు.. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు తీసి తొలుత భార్య, ఇద్దరు పిల్లలను గోపాల్ ఎక్కించారు. అప్పటికే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో పట్టుతప్పి అతను కిందపడ్డాడు. భర్తను కాపాడబోయి రమాదేవి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే దంపతలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం అర్ధరాత్రి రమాదేవి మృతి చెందింది. పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సంతోషంగా మేడారం వెళ్లొచ్చారు.. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉన్నాయని..
సాక్షి, ఖమ్మం: కుటుంబంతో సహా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించి సరదాగా గడిపి వచ్చారు. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉండడంతో దంపతులిద్దరూ కలిసి సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు కాలు జారి భార్య కాల్వలో పడి కొట్టుకుపోతుండగా.. కాపాడేందుకు దిగిన భర్త ఇద్దరూ ప్రవాహంలో మునిగారు. పోలీసులు, ఈతగాళ్లు చేపట్టిన గాలింపుల్లో భార్య మృతదేహం లభించగా, భర్త కోసం గాలింపు కొనసాగుతోంది. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడుకు చెందిన ఆరెంపుల పరశురాం – నందిని(25) భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు సుమశ్రీ, యశ్వంత్ ఉన్నారు. పరశురాం తాపీ మేస్త్రీ పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉంటోంది. వీరు మేడారంలో మొక్కు చెల్లించుకోవడానికి ఈనెల 15న వెళ్లి 17న తిరిగి వచ్చారు. ఇంట్లో ఉతకాల్సిన ఎక్కువగా బట్టలు ఉండటంతో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు కూతురు సుమశ్రీని తీసుకుని ముత్తగూడెం – పల్లెగూడెం గ్రామాల నడుమ ఉన్న సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై ఉంచి బట్టలు ఉతుకుతుండగా నందిని ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయింది. దీంతో హతాశుడైన పరశురాం ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దూకాడు. ఈత వచ్చిన ఆయన కొట్టుకుపోతున్న భార్యను కాపాడే యత్నంలో నందిని భర్త మెడ పట్టుకోవడంతో ఊపిరి ఆడక ఇద్దరూ మునిగి కొట్టుకుపోసాగారు. చదవండి: హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని... తల్లిదండ్రులు కానరాకపోవడంతో బేల చూపులు చూస్తున్న చిన్నారులు ఈ విషయాన్ని గుర్తించిన వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించింది. పరశురాం ఆచూకీ కోసం ఇంకా కాల్వలో వెతుకుతున్నారు. కాగా, ఇదిలా ఉండగా కాల్వలో పడి తల్లి మృతి చెందడం, తండ్రి జాడ తెలియకపోవడంతో వీరి పిల్లలిద్దరు అమ్మానాన్న ఏరీ అంటూ బేల చూపులు చూస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది. -
నువ్వైనా నా మాట వినూ! భర్త విషం తీసుకోవడం చూసి ఆ భార్య..
కరోనాతో కోట్లాది మంది బతుకులు తలకిందులు అయ్యాయి. ఉపాధి లేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ తమ జీవితాలన్ని తలకిందులు చేసిందంటూ బాధపడేవాళ్లూ ఉన్నారు. ఈ జాబితాలో రాజీవ్ తోమర్ కూడా ఉన్నారు. కరోనా దెబ్బకి కోలుకోలేకుండా అయిన ఈయన.. ఏకంగా ప్రాణం తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడీ ఉదంతం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. కరడుగట్టిన బీజేపీ అభిమాని కాస్త విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ పెంచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్పట్కు చెందిన బూట్ల వ్యాపారి రాజీవ్ తోమర్ (40) దంపతులు లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో రాజీవ్ భార్య మరణించగా, రాజీవ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన ఫేస్బుక్ లైవ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై, ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మరణానికి మోదీనే కారణం అవుతారంటూ వ్యాఖ్యలు చేశారు రాజీవ్. భార్య అడ్డుకుంది కానీ.. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల తాను అప్పుల పాలయ్యానని ఆ లైవ్ వీడియోలో రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, చిన్న వ్యాపారులకు మోదీ ఎంతమాత్రమూ హితుడు కాదని విమర్శించారు. ప్రధానికి చేతనైతే పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. ‘‘ప్రభుత్వం నాలాంటి వాళ్ల మాట వినడం లేదు.. కనీసం నువ్వైనా విను’’ అంటూ విసురుగా విషం తాగేశారు. భర్త విషం తాగడంతో షాక్ తిని.. ఆమె కూడా ఆ వెంటనే విషం తీసుకున్నారు. కాసేపటికి లైవ్ ద్వారా స్పందించిన కొందరు.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పూనం మరణించినట్టు నిర్ధారించారు. రాజీవ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2020లో విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా రాజీవ్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించే వీలులేకపోయిందన్నారు. బీజేపీ అభిమాని నుంచి.. రాజీవ్ తోమర్ కరడుగట్టిన బీజేపీ అభిమాని. ఈ మేరకు బీజేపీ మీద అభిమానంతో కట్టిన బ్యానర్లలో ఆయన ఫొటోలు ఉండడం, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు కీలక నేతలతో ఆయన సన్నిహితంగా దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. భాగ్‌పట్ ఎంపీ సత్యపాల్ సింగ్(ఎడమ)తో రాజీవ్(కుడి) వీడియోలో చెప్పినట్లుగా బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లే చనిపోయి ఉంటారని సన్నిహితులు చెప్తున్నారు. అయితే బీజేపీ మాత్రం వ్యక్తిగత కారణాలకు.. పార్టీని నిందించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కరోనాతో ఎంతో మంది నష్టపోయారని, కేవలం పార్టీ ప్రతిఫలాలు అందలేదన్న ఉద్దేశంతో నిందించడం సబబేలా అవుతుందని రాజీవ్ వీడియోను ఖండిస్తున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇక ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్యాయం జరిగినా వదలం. ఈ పోరాటంలో మీరు ఒంటరివారు కాదు - నేను మీతో ఉన్నాను అంటూ రాజీవ్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రాజీవ్ భార్య మృతికి సంతాపం తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. बागपत के राजीव तोमर जी व उनकी पत्नी के वीडियो ने छोटे व्यापारियों की लाचारी का दर्दनाक सच दिखाया है। तोमर जी के स्वस्थ होने की कामना व उनकी पत्नी के दुखद देहांत पर मेरी शोक संवेदनाएँ। अन्याय के सामने हम हार नहीं मानेंगे। इस लड़ाई में आप अकेले नहीं हैं- मैं आपके साथ हूँ। — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 बागपत में एक व्यापारी एवं उनकी पत्नी की आत्महत्या के प्रयास और उनकी पत्नी की मृत्यु के बारे में जान कर बेहद दुःख हुआ। परिजनों के प्रति मेरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि श्री राजीव जी को जल्द स्वास्थ्य लाभ मिले। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022 -
చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్‌ను షూట్ చేశాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడిని షూట్ చేసిన నేరం కింద ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై డాక్టర్ ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు కాల్పులు జరిపారు. ప్రధాన నిందితుడు బాధితుడిని నకిలీ డాక్టర్ అంటూ ఆరోపణలు చేశాడు. ఈ ఉదంతంపై పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు ఫైల్ చేశారు. నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేఖుపుర గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సల్మాన్, అతని భార్యకు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఐతే చికిత్స పొందుతూ అతని భార్య ప్రాణాలు కోల్పోవడంతో, కోపోధ్రిక్తుడైన సల్మాన్ అదును చూసి అతని భార్యకు వైద్యం చేసిన డాక్టర్ తిలక్ రామ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా ఈ విషయంపై పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ధరమ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. నంగల్ పోలీస్ స్టేషన్‌లోని షేకుపురా గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ డాక్టర్ తిలక్ రామ్‌ను డిసెంబర్ 30న సాయంత్రం సల్మాన్, మెహబూబ్ అనే మరో వ్యక్తితో కలిసి డాక్టర్‌పై కాల్పులు జరిపారు. గాయాలపాలైన డాక్టర్‌ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసులో నిందితులైన సల్మాన్, మెహబూబ్‌లపై బాధితుడి సోదరుడు కాల్పుల కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..
సింథియా/మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవితంపై ఎన్నో కలలు కన్నాడు. కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావించాడు. అక్క కూతురినే వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సరదాగా సాగిన వీరి కాపురంలో ‘అనుమానం’ పెనుభూతంలా మారింది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన అతను.. విచక్షణ మరిచి డంబెల్‌తో భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య లేని లోకంలో తానెందుకు అనుకున్నాడో లేక భార్య మృతితో తీవ్రంగా ఆందోళన చెందాడో గానీ.. అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని గుల్లలపాలెంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. కాకినాడ ప్రాంతానికి చెందిన పోలవరపు శివనాగేశ్వరరావు(34) తన అక్క కూతురైన మాధవి(28)ని మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలం కిందట విశాఖకు వలస వచ్చి.. శ్రీహరిపురంలోని గొల్లలపాలెం ప్రాంతంలోని కుంచుమాంబకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయిన శివనాగేశ్వరరావు ఎక్కడ పని ఉండే అక్కడ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.పెళ్లయి మూడేళ్లయినా వీరికి పిల్లలు లేరు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఆరు నెలల నుంచి మాధవిపై శివనాగేశ్వరరావు అనుమానం పెంచుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివనాగేశ్వరరావు భార్యపై దాడికి తెగబడ్డాడు. వ్యాయామం కోసం ఉపయోగించే ఇనుప డంబెల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురైన శివనాగేశ్వరరావు కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్యకు ముందుకు తన అన్నయ్య కనకారావుకు వాట్సాప్‌లో మేసేజ్‌లు పంపించాడు. తన భార్యపై అనుమానం ఉందని, పలువురితో చనువుగా ఉంటోందని.. ఆమెకు ఎంత నచ్చజెప్పినా మాట వినలేదని అందులో పేర్కొన్నాడు. వాట్సాప్‌లో రెండు సందేశాలతో పాటు లెటర్‌పై తాను చనిపోవడానికి గల కారణాలు వివరించాడు. ఆందోళనతో కనకారావు వెంటనే తన భార్యతో కలిసి శివనాగేశ్వరరావు ఇంటికి వచ్చాడు. తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తలుపులు బలంగా తెరిచారు. గదిలోకి వెళ్లిచూడగా తమ్ముడు భార్య రక్తపు మడుగులో ఉండటం, తమ్ముడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటంతో కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం కేజీహెచ్‌కు తరలించారు. ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వీరి జీవితం అనుమానం కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు.. -
చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్
Uttej Wife Padmavati Died: ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత ఇన్నాళ్లు ప్రతి పనిలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేని ఉత్తేజ్.. చిరంజీవిని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో చిరు, ప్రకాశ్ రాజ్‌లు సైతం భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన కూతురు చేతన, ఉత్తేజ్.. చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక కూతురు చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిరంజీవి, ప్రకాష్ రాజ్ కంటతడి...
-
నటుడు ఉత్తేజ్కి సతీ వియోగం.. పరామర్శించిన పలువురు ప్రముఖులు
-
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖు బసవతారకం ఆసత్రికి వెళ్లి అక్కడ ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. -
సినీ మేకప్ చీఫ్ మాధవరావుకు సతీవియోగం
సాక్షి, చెన్నై: తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ మేకప్ చీఫ్ సి.మాధవరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (76) కరోనాతో చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నెలరోజుల క్రితం మాధవరావు దంపతులు చెన్నైకి వెళ్లి కోవిడ్ బారినపడ్డారు. రాంప్రసాద్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చి చికిత్సకు సహకరించాడు. కాకినాడలో ఉన్న కుమార్తె గీత, అమెరికాలో ఉన్న చిన్న కుమారుడు రాజ చెన్నైకి చేరుకున్నారు. మాధవరావు కోలుకోగా సుబ్బలక్ష్మమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ, నరేష్ పరామర్శ సుబ్బ లక్ష్మమ్మ మరణ సమాచారం అందగానే నటులు కృష్ణ, నరేష్, మరికొందరు సినీ ప్రముఖులు ఫోన్ ద్వారా మాధవరావును పరామర్శించి సంతాపం తెలిపారు. -
కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..
ముదిగుబ్బ: మనమధ్య వివాదాలు ఎందుకు? కలిసిమెలిసి ఉందాం అని నచ్చజెప్పి భార్యను తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపేణ అతడి భార్యను కబళించింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లనంతపురం సమీపాన ఆదివారం రోడ్డు పక్కను వున్న కల్వర్టును కారు డీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చింతామణికి చెందిన రమేశ్‌బాబు, రుక్మిణమ్మ భార్యాభర్తలు. వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రుక్మిణమ్మ భర్తతో విబేధించింది. అనంతపురంలోని వారి బంధువుల ఇంటికి వచ్చి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భార్యకు నచ్చచెప్పి తిరిగి కాపురానికి తీసుకెళ్దామని రమేశ్‌బాబు భావించాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య రుక్మిణమ్మ వద్దకు వచ్చి మాట్లాడాడు. భర్త నచ్చచెప్పడంతో తిరిగి కాపురానికి ఆమె అంగీకరించింది. దీంతో అందరూ సంతోషంగా కారులో చింతామణికి బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు రాళ్లనంతపురం వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యింది. రుక్మిణమ్మ, డ్రైవర్ శివన్న (43) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌బాబు, లక్ష్మీదేవి, అభిషేక్ బాబులు తీవ్రంగా గాయపడడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి..
ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. మరోవైపు వరకట్నం తేవాలని భర్త ఉన్నిరాజన్ వేదిస్తున్నాడని వట్టప్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల ప్రకారం ఉన్నిరాజన్ భార్య ప్రియాంక బుధవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని విగతజీవితా కనిపించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, భర్త, నటుడు ఉన్నిరాజన్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి ఉన్నిరాజన్ కట్నం డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నిరాజన్ ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, అయితే పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అతడి నైజం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇక 2019లో ఉన్నిరాజన్-ప్రియాంకలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే వివాహం అయిన కొన్నాళ్లకే వీరి మధ్య కలహాలు వచ్చాయని, తన వ్యక్తిగత అవసరాలకు ప్రియాంక నగలు కూడా నమ్మేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంత డబ్బు అడిగినా ప్రియాంక తల్లి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేదని కానీ తన భర్త అడుగుతున్నట్లు కాకుండా, తనకే అవసరం ఉందని ప్రియాంక చెప్పేదని పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి ఉన్ని రాజన్ పెట్టే టార్చర్‌ను భరించలేక విషయం తమకు చెప్పిందని, శారీరక హింసకు పాల్పడినట్లు వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ప్రియాంక మృతిచెందడం అనుమానాలకు తివిస్తోందన్నారు. ఇక ఉన్నిరాజన్ మరెవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోను ప్రతినాయకుడి పాత్రలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. -
ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరావు సతీమణి కన్నుమూత
కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కొందరు కరోనాకు బలైపోతుంటే.. మరికొందరూ ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. తాజా టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం(మే 4) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిత ఈ రోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత సైతం కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించింది. -
క్షణికావేశం.. భార్య మద్యం తాగి రావడంతో..
సాక్షి, పాచిపెంట: భార్యాభర్తల మధ్య మద్యం వివాదం పెద్దదైంది. క్షణికావేశంలో భర్త దాడిచేయడంతో భార్య తనువుచాలించిన విషాదకర ఘటన పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్ (30), భార్య మర్రి తులసి(24) ఏడాది కిందట నుంచి మాతుమూరులోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తులసి తన తల్లితో కలిసి శనివారం ఉదయం సాలూరు వెళ్లింది. మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చింది. మద్యం సేవించడంపై భర్త శోభన్ మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో తాము నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరం భార్యను తీసుకెళ్లి మోహంపై కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలైన తులసి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ ఎల్.అప్పలనాయడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రసాద్ తెలిపారు. చదవండి: ‘నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు..’ -
నటుడు కాకరాల సత్యనారాయణకు సతీ వియోగం
సాక్షి, హఫీజ్‌పేట్: ప్రముఖ సినీ నటుడు కాకరాల సత్యనారాయణ భార్య సూర్య కాంతం(81) మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్)ఫౌండేషన్ వయోధికాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. కన్నుముశారు. సుమారు రెండువందల సినిమాల్లో నటించిన కాకరాల సత్యనారాయణ, ఆయన భార్యతో కలిసి కొంతకాలంగా సీఆర్ ఫౌండేషన్ వయోధికాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన తనకంటూ సొంత ఆస్తిని కూడా మిగుల్చుకోలేదు. వీరి ఇద్దరి కుమార్తెలూ విప్లవోద్యమ క్షేత్రంలో పనిచేస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్‌లో ఉంచారు. ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ, సూర్యకాంతం భర్త కాకరాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.రామకృష్ణ, వి.చెన్నకేశవరావు, డాక్టర్ కె.రజిని ఆమెకు నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి సూర్యకాంతం కళ్లను దానం చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అప్పగిస్తామని కాకరాల తెలిపారు. చదవండి: మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట ‘వరుణ్ తేజ్ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’ -
అయ్యో.. చికెన్ గొడవ ఎంతపని చేసింది!
డిస్పూర్: ఇంట్లో భర్త మాంసాహరం వండించడంతో గొడవపడ్డ అనంతరం కొత్తజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇసానగర్ పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్(22), రేష్మా(19)ను జూన్ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్ కావడంతో తన భర్త సోమవారం చికెన్ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. (ఆన్లైన్ చదువు: స్మార్ట్ ఫోన్ లేదని.. ) దీంతో రేష్మా అతడిని నిలదీయడంతో ఇద్దరూ గొడవడ్డారు. అనంతరం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్ తండ్రి శివనాథ్ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. ప్రస్తుతం గురుదయాళ్ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇసానగర్ పోలీస్టేషన్ హౌజ్ ఆఫీసర్ సునిల్ సింగ్ మాట్లాడుతూ... రేష్మాకు, గురుదయాళ్‌కు ఇటీవల వివాహం జరిగిందని చెప్పారు. సోమవారం రాత్రి ఇంట్లో నాన్‌వెజ్ వండొద్దని గొడవ పడిన అనంతరం భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా భార్య రేష్మా మృతిచెందగా.. భర్త గురుదయాళ్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి స్టేట్మెంట్ తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
ఘోరం: భర్త కళ్లెదుటే...
సాక్షి, యడ్లపాడు (చిలకలూరిపేట): యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం(పుట్టకోట) గ్రామానికి చెందిన కాకాని బ్రహ్మయ్య, రమాదేవి (30) దంపతులు. వారికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఐదేళ్ల క్రితం కుమారుడు బాలమణికంఠ, 11 నెలల క్రితం కుమార్తె యశస్విని జన్మించారు. పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన రమాదేవి పుట్టిళ్లయిన కొదమగుంట్లలో వెంకటేశ్వరస్వామి గుడి ప్రతిష్టకు భార్య, పిల్లలను బ్రహ్మయ్య తన బైక్‌పై ముందురోజు తీసుకెళ్లి దిగబెట్టి వచ్చాడు. పొలం పనులు చూసుకొని శనివారం తిరిగి బైక్‌పై అత్తగారింటికి వెళ్లి, రెండు రోజులు అక్కడే ఉండి సోమవారం ఉదయం స్వగ్రామానికి బైక్‌పై తిరుగుప్రయాణం కట్టారు. (గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం) సాతులూరు వద్దకు చేరుకోగానే వర్షం మొదలవడంతో భార్యా పిల్లలు తడిచి పోతారని భావించిన బ్రహ్మయ్య సాతులూరు జంక్షన్లో ముగ్గురిని ప్యాసింజెర్ ఆటో ఎక్కించి, ఆ వెనుకే తనూ బయలుదేరాడు. ఒడిలో కుమార్తెను, పక్కన కుమారుడిని కూర్చోబెట్టి ఆటో వెనుకే వస్తున్న భర్తను రమాదేవి గమనిస్తూనే ఉంది. ఆటో బయలుదేరి 15 నిమిషాలు గడిచాయో లేదో ట్రాలీ ఆటో ఎదురుగా వచ్చి ఢీకొంది. అంతే బ్రహ్మయ్యకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్లయింది. ఒక్క ఉదుటున ఆటోవద్దకు చేరుకున్నాడు. ఒకవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందిన భార్య.. తల్లి పొత్తిళ్లలోనే ప్రాణం వదిలిన కుమార్తె.. గాయాలను తట్టుకోలేక నాన్నా అంటూ తల్లడిల్లుతున్న కుమారుడు.. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో తెలియక.. మొద్దుబారిన మెదడుతో గుండెలు బాదుకుంటూ భోరుమన్నాడు. బ్రహ్మయ్య తండ్రి లక్ష్మీ నారాయణకు రెండేళ్ల క్రిందట పక్షవాతం బారిన పడ్డాడు. ఏడాది కిందట మామయ్య వెంకటరామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భార్యాబిడ్డలు దూరం కావడంతో బ్రహ్మయ్యను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు. రమాదేవి, బాలమణికంఠ, యశస్విని మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.సాయంత్రం 5 గంటల సమయంలో నరసరావుపేట ఆసుపత్రి నుంచి రమాదేవి, చిన్నారి యశస్విని మృతదేహాలను కొత్తపాలెం గ్రామానికి తీసుకువచ్చారు. 7 గంటలకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలమణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి గ్రామానికి తరలించారు. మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. ఎమ్మెల్యే రజని పరామర్శ నాదెండ్ల (చిలకలూరిపేట): రేపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సాతులూరుకు చెందిన అశోక్ కుమార్, చందవరం వాసి ఆవుల యువరాజ్ మృతదేహాలను ఎమ్మెల్యే విడదల రజని సోమవారం రాత్రి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు పరామర్శించారు. కలచివేసింది : ఎమ్మెల్యే శ్రీదేవి పేరేచర్ల (తాడికొండ): రేపూడి రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రేçపూడి రోడ్డు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు చిన్నారులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణి ఆత్మహత్య
కాగజ్‌నగర్(సిర్పూర్): అత్తింటి వేధింపులు తాళలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాగజ్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న పాప లోకం చూడకముందే పరలో కాలకు వెళ్లగా..ఏడాదిన్నర చిన్నారి ఈశ్వరిప్రియ గోరుముద్దలు తినిపించి లోకాన్ని పరిచయం చేసే తల్లిని కోల్పోయింది. కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూర్‌కాలనీకు చెందిన పునమల్లి తేజశ్రీ (25) బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్, కుటుంబీకులు తెలి పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన తేజశ్రీతో ఆగస్టు 2016లో కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన తిలక్‌కుమార్‌తో వివాహమైంది. దంపతులకు ఏడాదిన్నర కుతూరు ఈశ్వరిప్రియ ఉంది. అంతే కాకుండా ఆమె ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. భర్త తిలక్‌కుమార్ స్థానికంగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తేజశ్రీకు తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో మేనమామలు, చిన్నాన్నాలు ఆమె వివాహం జరిపించారు. కొంతకాలం కాపురం సాఫీగానే సాగినా అత్త రామక్రిష్ణమ్మ, భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్ వేధింపులు మొదలయ్యాయి. దిక్కు మొక్కులేని దానివని, చిన్నచిన్న విషయాలకు తగాదాలు పడుతూ వేధించేవారు. బుధవారం రాత్రి కూడా ఇలాగే వేధించడంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య పరిశీలించారు. మేనత్త నందేటి సుధా ఫిర్యాదు మేరకు భర్త తిలక్‌కుమార్, మామ బాలచందర్, అత్త రామక్రిష్ణమ్మపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తేజశ్రీ ఆత్మహత్యతో కాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి. తేజశ్రీ ఇక లేదని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
‘రూత్... మాకు తీరని శోకాన్ని మిగిల్చింది’
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్(46) కన్నుమూశారు. గత కొంత కాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె శనివారం మరణించినట్లు స్ట్రాస్ కుటుంబం తెలిపింది. ‘మహమ్మారి క్యాన్సర్ బారిన పడిన రూత్ మమ్మల్ని శాశ్వతంగా విడిచివెళ్లింది. మాకు తీరని శోకాన్ని మిగిల్చింది. నాతో పాటుగా సామ్, లుకా తనని ఎంతగానో మిస్సవుతారు. రూత్‌ను కలిసిన ప్రతీ ఒక్కరికీ తన ఎంత స్నేహభావం కలదో ఇట్టే తెలిసిపోయేది. గత 12 నెలలుగా తన చికిత్సకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తన పేరిట ఫౌండేషన్ నెలకొల్పి క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తాం’ అంటూ ఆండ్రూ స్ట్రాస్ తరఫున ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన రూత్.. 2003లో ఆండ్రూ స్ట్రాస్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సామ్, లుకా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2017లో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, గోల్ఫ్ ప్లేయర్ ల్యూక్ డొనాల్డ్ తదితరులు రూత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. -
పాకిస్తాన్ మాజీ ప్రధాని భార్య మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సుమ్ షరీఫ్ మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. 2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఈ మేరకు పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ ప్రెసిడెంట్ షహాబాజ్ షరీఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 1950లో పాకిస్తాన్లో జన్మించిన కుల్సుమ్ 1971లో నవాజ్ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్, ఆమె కుమార్తె మరియమ్ రావాల్పిండిలోని అదిలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతికి పలువురు పాకిస్తాన్ జాతీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. -
ముగిసిన ఎమ్మెల్యే సతీమణి అంత్యక్రియలు
వికారాబాద్ అర్బన్ : వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి తార (రెండోభార్య) అంత్యక్రియలు గంగారం సమీపంలోని శ్మశాన వాటికలో మంగళవారం పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా మెథడిస్టు చర్చికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ క్రిష్టియన్ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లఎమ్మెల్యే కాలె యాదయ్య, విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్‌గౌడ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
శుభకార్యానికి వెళ్తూ.. అనంతలోకాలకు
రామడుగు(చొప్పదండి) : కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై రామడుగు మండలం వెదిర శివారులోని గణేష్‌నగర్ స్టేజీ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెదిర గ్రామానికి చెందిన రాల్లబండి భాగ్యమ్మ (65)మృతి చెందింది. అమె భర్త రాల్లబండి హన్మంతరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెదిరకు చెందిన రాల్లబండి హన్మంతరెడ్డి– భాగ్యమ్మలు బుధవారం వాళ్ల కూతురి ఇంట్లో శుభకార్యం ఉండడంతో బయల్దేరారు. రోడ్డుపై నిల్చుని బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఆటోరాగా ఆపేందుకు ప్రయత్నించారు. వెనకాలే వస్తున్న టిప్పర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనకాలే వస్తున్న ఆయిల్ ట్యాంకర్ టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న దంపతులను ఢీకొట్టి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. తీవ్రగాయాలైన వీరిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాగ్యమ్మ మృతి చెందింది. హన్మంతరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతరాలి కుమారుడు మధుసూదన్‌రెడ్డి జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. గురువారం స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
అన్నానగర్: ప్రభుత్వ బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందింది. ఈఘటన నాగర్‌కోవిల్‌లో గురువారం జరిగింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కలియక్కావిలైకి చెందిన అశోకన్(51) కార్మికుడు. ఇతని భార్య వీజీ సహాయ(45). దంపతులు పేచ్చిపారై పల్లిముక్కు గ్రామంలో నివశిస్తున్నారు. వీరికి ఆకాష్ జోసఫ్ (13), అజయ్స్ జోసఫ్ (10) ఇద్దరు కుమారులున్నారు. గురువారం మధ్యాహ్నం నాగర్‌కోవిల్ ఒళుగినచేరి ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు అశోకన్, భార్య వీజీ సహాయ బైక్‌పై వెళుతున్నారు. పార్వతిపురం సమీపం కట్టయన్విలై విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన ప్రభుత్వ బస్సు బైకును ఢీకొంది. కిందపడిన వీజీ సహాయపై బస్సు చక్రం ఎక్కడంతో భర్త కళ్లెదుటే విషాదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వీజీ సహాయ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆచారిపళ్లం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ రూబన్ (44)ను అరెస్టు చేశారు. -
నెల్సన్ మండేలా మాజీ భార్య కన్నుమూత
జోహన్స్‌బర్గ్ : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విన్నీ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినప్పుడు, అతని విడుదల కోసం ఉద్యమించటంతో పాటు, నల్ల జాతీయుల హక్కుల కోసం విన్నీ పోరాడారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు. -
భార్య మృతి...భర్త పరిస్థితి విషమం
సాక్షి, శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగుడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీపై వెళుతున్న భార్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా వేములునర్వ గ్రామానికి చెందిన దంపతులు రాములు, సుగుణ స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ సంఘటన స్థలంలో మృతిచెందగా, రాములు తీ‘ంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మృతి.. భర్త ఆత్మహత్యాయత్నం..!
బుక్కపట్నం(అనంతపురం): బుక్కపట్నం మండలపరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన దైవకుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎరికలప్ప కుమారుడు దైవకుమార్ ఏడాది క్రితం చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య నాగమణి మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే నాగమణి మృతిచెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు దైవకుమార్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన దైవకుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బత్తలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దైవకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
- భర్త, కుమార్తె పరిస్థితి విషమం మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి శివారులోని సోనియా దాబా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కుమార్తెతో పాటు దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం భార్య మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని రాజేంద్రనరగ్ ఉప్పరపల్లిలో నివాసముంటున్న లక్ష్మణ్, కవిత దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వీరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం కవిత మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
కంబదురు: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం నూతిమడుగులో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వడ్డె హనుమంతు, జయమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన హనుమంతు(38) ఈ రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగదు కొరత: మానవత్వం చాటుకున్న ఊరిజనం
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో విధించిన పరిమితులకు ఓ సీనియర్ సిటిజన్‌కు తన భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది. బ్యాంకు వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఊరిజనమే విరాళాల రూపాలుగా నగదు సేకరించి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.... జ్యుయర్ కాజూర్ జార్ఖాండ్‌లోని లాతేహార్ జిల్లా బ్రిష్ రాంపుర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. గురువారం ఉదయం తన భార్య హీరామని కాజూర్ మరణించడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి రూ.10వేల అవసరం పడ్డాయి. తన అకౌంట్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకోవడానికి మేనల్లుడితో కలిసి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లాడు. అయితే కాజూర్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి క్యాషియర్ నిరాకరించారు. మొత్తం పరిస్థితిని వివరించినప్పటికీ, ఆయన రూ.4000 కంటే అధికంగా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కాజూర్కు మరో అవకాశం లేకపోవడంతో ఇచ్చిన నగదుని తీసుకుని ఇంటికొచ్చాడు. బ్యాంకుల్లో జరిగిన పరిస్థితినంతా గ్రామస్తులకు వివరించాడు. కాజూర్ బాధను చూసి చలించిపోయిన స్థానికులు తమకు తోచినంతా సాయంగా అందించి అతని భార్యకు అంత్యక్రియలు నిర్వహించారు. వారి వద్ద నగదు తక్కువున్నప్పటికీ, తన భార్య అంత్యక్రియలకు సాయంగా ముందుకు వచ్చి, కార్యక్రమం నిర్వహించారని, గ్రామస్తులందరికీ తాను రుణపడి ఉంటానని తెలిపాడు. తమ అవసరాలకు కూడా తీసుకోవడానికి పనికి రాని నగదును బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేయడమెందుకని అతను ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు నగదు అందిన వెంటనే గ్రామస్తులకు చెల్లిస్తానని మాటిచ్చాడు. కాజూర్, పాలమూ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్మెంట్ పొందాడు. -
భార్యను కడతేర్చిన భర్త
చందంపేట (నేరడుగొమ్ము) : ఏడడుగులు వేసి జీవితాంతం తనతో అండగా నిలవాల్సిన భర్తే కాలయముడయ్యాడు. క్షణికావేశంలో భార్యను అత్యంత క్రూరంగా రాయి తో కొట్టాడు. అనంతరం ఆమె మృతి చెందలేదని భావించి పురుగుల మందు తాగించి హతమార్చాడు. ఈ ఉదంతం నేరడుగొమ్ము మండల పరిధిలోని జోడుబావితండాలో మంగళవారం చోటు చేసుకుంది. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, నింది తుడు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జోడుబావితండాకు చెం దిన లావుడ్య విజయ (30)కు అదే గ్రా మానికి చెందిన అండిల్ అనే వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యభర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విజ య కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుండగా అండిల్ నిత్యం మద్యం సేవిస్తూ భార్యపిల్లలను పట్టించుకోకుండా తిరుగుతుండేవా డు. ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పత్తి ఏరేందుకు వెళ్లి మూడు రోజుల క్రితం తిరిగి వచ్చారు. వచ్చిన రోజు నుంచీ అండిల్ మద్యం తాగి భార్యతో ఘర్షణ పడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా కుటుంబ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అనంతరం జోడుబావితండా శివారులో తమకు ఉన్న ఎకరం సొంత పొలంలో పత్తి ఏరేందుకు వెళ్లారు. అక్కడ కూలీలతో పత్తి ఏరిద్దామని అండిల్ పేర్కొన్నాడు. ‘అసలే పైసలు లేవు..కూలీలు ఎందుకు.. మనమే ఏరుకుందాం’ అని విజయతెలిపిం ది. దాంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటికే గతంలో జరి గిన గొడవల నేపథ్యంలో అండిల్ భార్యపై కో పంతో ఉన్నాడు. మళ్లీ గొడవ జరగడంతో ఆవేశంతో అండిల్ పక్కనే ఉన్న రారుుని తీసుకొని భార్యపై గట్టిగా మో దాడు. ఆమె మృతి చెందలేదని భావించి అనంతరం పొలంలో ఉన్న క్రిమిసంహారక మందును తీసుకొచ్చి భార్యకు తాపించాడు. దాంతో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత తేరుకున్న అం డిల్ మృతురాలి సోదరుడికి ఫోన్ చేసి ‘మీ అక్క మృతి చెందింది’ అని పేర్కొన్నాడు. తల్లిదండ్రులు వెంటనే వచ్చి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలి పారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
గూడూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం రావూరు సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త రాంబాబు కథనం ప్రకారం... భార్య వెంకట నాగమణి(23)తో కలిసి ద్విచక్ర వాహనంపై కావలి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. తామిద్దరం కావలి నుంచి చెరువు మీదుగా బైక్‌పై రావూరు వస్తున్నామని, గుర్తు తెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందన్నాడు. ఈ ఘటనలో తనకు గాయాలు కాగా భార్య నాగమణి తీవ్రగాయాలతో మృతిచెందిందని రాంబాబు చెబుతున్నాడు. ఆయన చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కాగా, రాంబాబే నాగమణిని చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మరణంతో మనోవేదనకు గురై భార్య మృతి
నల్లబెల్లి : భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మండలంలోని శనిగరం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మాట్ల సూరయ్య(60), రాజమ్మ(50) దంపతులు గుడిసెలో నివాసముండేవారు. ఇద్దరు కూలీకి వెళ్తూ జీవించేవారు. సూరయ్య ఈ నెల 9న నిద్రిస్తుండగానే అకస్మాత్తుగా మృతిచెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య రాజమ్మ తీవ్రమనోవేదనతో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కడుబీద కుటుంబానికి చెందిన మృతురాలి అంత్యక్రియలను గ్రామస్తులు చందాలు వేసుకొని పూర్తి చేశారు. -
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి
-
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వివాహిత మృతి
రాయచోటి(వైఎస్సార్‌జిల్లా): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన అంజనమ్మ(20) భర్తతో కలిసి బైక్‌పై రాయచోటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అంజనమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
గొంతు కోసి గృహిణి హత్య
యాకుత్‌పురా: గొంతు కోసి గృహిణిని హత్య చేసిన ఘటన శుక్రవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అనుమానంతో భర్తే ఆమెను చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతురాలి తల్లిదండ్రులు, ఇన్స్పెక్టర్ జి.రమేశ్ కథనం ప్రకారం...యాకుత్‌పురా హఫేజ్‌నగర్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆరీఫ్, తహసీన్ ఫాతీమా అలియాస్ తస్కీన్ (23)లకు 2011లో పెళ్లైంది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఆటో ట్రాలీ నడుపుతూ ఆరీఫ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానంతో మూడు నెలలుగా నిత్యం గొడవపడేవాడు. ఆమెను కొట్టి, చిత్రహింసలు పెట్టేవాడు. గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో అదే విషయమై మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం ఆరీఫ్ ఇంట్లో రక్తం మడుగులు కట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. రక్తపుమడుగులో తస్కీన్ మృతి చెంది ఉంది. ఎవరో ఆమె గొంతు కోసి చంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంట్లో ఉన్న చిన్నారులను ఈ హత్య గురించి ఆరా తీయగా తాము నిద్రలో ఉన్నామని, తమకు ఏమీ తెలియదని చెప్పారని పోలీసులు తెలిపారు. భర్త పరారీలో ఉంటంతో అతడే తస్కీన్‌ను హతమార్చి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వానికి మరో మచ్చ
భోపాల్: మొన్న ఒడిశా.. నేడు మధ్యప్రదేశ్.. ప్రాంతం ఏదైతేనేం.. రూపానికే మనుషులు బతికుంటున్నారు.. మానవత్వాన్ని చంపేస్తున్నారని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మార్గం మధ్యలోనే చనిపోవడంతో చంటిబిడ్డ, ఓ పెద్దావిడ ఉందనే జాలి కూడా లేకుండా వారి కుటుంబాన్ని అర్థాంతరంగా బస్సులో నుంచి దింపేశారు. అటవీ ప్రాంతంలో జోరు వర్షం పడుతుండగా వారిపై ఏమాత్రం కనికరం లేకుండా మధ్యలోనే బస్సులో నుంచి వెళ్లగొట్టారు. దీంతో చిన్నబోయిన ముఖంతో కంటి నిండా నీరుతో రెండు చేతులపై చంటి బిడ్డను వేసుకొని రోడ్డుపక్కన భార్య మృతదేహాన్ని ఉంచి తన ముసలితల్లితో కలిసి వచ్చిపోయే వాహనాల వైపు అతడు దీనంగా చూడటం మొదలుపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దామో జిల్లాలో రామ్ సింగ్ లోధి అనే వ్యక్తి అనారోగ్యానికి గురైన తన భార్య మల్లి బాయి, తన ఐదురోజులపాప, తల్లి సునియా బాయ్ తో కలిసి ఆస్పత్రికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. అయితే, మార్గం మధ్యలో ఉండగానే సింగ్ భార్య సునియా చనిపోయింది. దీంతో బస్సు కండక్టర్ వారిని అర్ధాంతరంగా దింపేశాడు. అలా అరగంటపాటు వర్షంలోనే దామోకు 20 కిలో మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపక్కన కూర్చున్నారు. అదే సమయంలో మృత్యుంజయ్ హజారీ, రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు న్యాయవాదులు ఆ రోడ్డు గుండా పోతూ వారికి సహాయం చేశారు. పోలీసులకు ఫోన్ చేయగా వారు కేవలం వివరాలు మాత్రమే నమోదుచేసుకొని వెళ్లిపోగా లాయర్లు మాత్రం వారికి ఒక ట్యాక్సీ ఏర్పాటుచేశారు. అనంతరం ఈ విషయం బయటకు రావడంతో ప్రైవేటు బస్సును సీజ్ చేసి.. డ్రైవర్, కండక్టర్ ను అరెస్టు చేశారు. -
భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత
మనూర్ : భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన భర్త అకస్మాత్తుగా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనూర్ మండలం కర్సగుర్తి పంచాయతీ పరిధిలోని గంగారం తండాలో శనివారం వెలుగుచూసింది. తండాకు చెందిన మరునిబాయి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆమె భర్త దేవిదాస్(45) గుండెపోటుకు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. -
భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం
కీసర: రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆస్పత్రిలో భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కీసర మండలం కుందన్‌పల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు రజిత(22), మహేష్(25). గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కత్తితో రజిత గొంతు కోసిన మహేష్, తాను కూడా గొంతు కొసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించే లోపే రజిత మృతిచెందింది. మహేష్‌ను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిబాబు సతీమణి మృతి
సీనియర్ నటుడు గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవి (70) అనారోగ్యంతో మృతి చెందారు. మూడేళ్ళుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రఘుబాబు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. -
భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య మృతి
అతిగా మద్యం తాగడం వల్లే ? హైదరాబాద్: అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న ఓ మహిళ భర్త ఊరెళ్లొచ్చేసరికి మరణించింది. నల్లకుంట ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జి.చలపతిరావుకు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్‌కు చెందిన స్వరూప(30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కడపలో ఉద్యోగం చేస్తున్న చలపతిరావు భార్యతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. స్వరూపకు నిత్యం మద్యం తాగే అలవాటుంది. విధి నిర్వహణలో భాగంగా చలపతిరావు ఈనెల 22న కడపకు వెళ్లగా... స్వరూప ఒక్కత్తే ఇంట్లో ఉంది. గురువారం ఉదయం 8.30కి ఇంటికి తిరిగి వచ్చి భర్త తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో చలపతిరావు చుట్టు పక్కల వారి సహాయంతో కిచెన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లగా.. మంచంపై స్వరూప చలనం లేకుండా పడి ఉంది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యురాలిని పిలిపించగా.. అప్పటికే స్వరూప మృతి చెందినట్టు వెల్లడించింది. చలపతిరావు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న స్వరూపకు కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తే నిప్పు పెట్టి చంపాడు..
-
అనుమానంతో భార్యను నరికేశాడు..
మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న ఆంజనేయులు, అతని తల్లి కోసం గాలింపు చేపట్టారు. -
వాహనం ఢీకొని మహిళ మృతి
ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. నందవరం గ్రామానికి చెందిన బడేబూ, రఫీ స్కూటర్‌పై ఎమ్మిగనూరుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బడేబూ అక్కడికక్కడే మృతిచెందింది. రఫీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఎమ్మిగనూరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా బిడ్డను బతికించరూ..
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి తీవ్ర గాయంతో 9 నెలల కుమారుడు ఆదుకోవాలని అభాగ్యుడి వేడుకోలు విశాఖపట్నం: ‘రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయాను. అదే ప్రమాదంలో తొమ్మిది నెలల కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. నేను చేస్తున్నది కూలి పని. కుమారుడికయ్యే శస్త్ర చికిత్సలకు ఆర్థిక స్థోమత లేదు. ఇప్పటికి గ్రామస్తుల సహకారంతో మూడు శస్త్ర చికిత్సలు జరిగాయి. నా కుమారుడ్ని బతికించాలని దాతలను వేడుకుంటున్నా. నిండు హృదయంతో ముందుకొచ్చి నా బిడ్డను రక్షించండ’ని ఇటీవల విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయి.. కుమారుడ్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న ఇ.రాంబాబు కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈ అభాగ్యుడు వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో తన బాధలను వివరించాడు. కుమారుడు ఇ.కుశాల్‌కు పుట్టు జుత్తు తీయించడానికి భార్య ఇ.త్రివేణితో కలిపి లక్కవరపుకోట శ్రీరామపురం గ్రామం నుంచి విశాఖలోని అత్తవారింటికి ఈ నెల 3న ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రివేణి మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ కుశాల్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆస్పత్రి ఖర్చులు భరించడానికి తన ఆర్థిక పరిస్థితి సరిపోదని, తన కుమారుడ్ని బతికించుకోడానికి దాతల సాయం కోరుతున్నట్టు రాంబాబు తెలిపాడు. తన కుమారుడికి ప్రాణం పోయాలని వేడుకున్నాడు. దాతలు కె .లక్ష్మి పేరిట ఉన్న కెనరాబ్యాంక్ డాబాగార్డెన్స్ శాఖలోని అకౌంట్ నెంబరు 0620108000007కు సొమ్ము జమ చేయాలని, లేదా 9963884410, 7207820494 నంబర్లకు ఫోన్ చేసి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. -
టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో తృణముల్ కాంగ్రెస్ నేత బురో హన్సడా బర్బహమ్ నివాసంలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో టీఎంసీ నేత బురో హన్సడా భార్య మృతిచెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యర్ధి పార్టీల వారు ఈ ఘటనకు పాల్పడ్డారా, లేక ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
మనస్తాపంతో ఉన్మాదిగా మారి...
-
మనస్తాపంతో ఉన్మాదిగా మారి...
హైదరాబాద్ సిటీ : మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా భార్యాభర్తలపై కత్తితో దాడి చేయడంతో భార్య మృతి చెందగా భర్త ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన గుమ్మకొండ వెంకటయ్య, కురువమ్మ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్ క్రిస్టియన్ కాలనీలో నివాసముంటూ కూలీ పని చేస్తున్నారు. గురువారం కూలీపనికి వెళ్లి వచ్చిన వెంకటయ్య దంపతులు బీఎన్‌రెడ్డినగర్‌లోని సాగర్ రహదారిపై ఉన్న కల్లు కాంపౌండుకి వెళ్లాడు. సరిగా అదే సమయంలో సరూర్‌నగర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన భువనగిరి ఆంటోని (38) కల్లు కాంపౌండ్‌లోకి వచ్చి తన దగ్గరున్న కత్తితో మద్యం మత్తులో భార్యాభర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో భార్యాభర్తల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం స్థానిక డెల్టా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య కురువమ్మ(35) మృతి చెందగా, భర్త వెంకటయ్య (40) చికిత్స పొందుతున్నాడు. వెంకటయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నిందితుడు ఆంటోని సంతోష్‌నగర్‌లో ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాజత్సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 12 సంవత్సరాల క్రితం ఆంటోనిని భార్య వదిలి వెళ్లిపోయిందని, ఇటీవలే ఆంటోని మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె కూడా వదిలి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఆంటోని తన వెంట కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. తాగిన మైకంలోనే అన్యోన్యంగా ఉన్న వెంకటయ్య దంపతులపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడు ఆంటోనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్య మరణించిందని భర్త ఆత్మహత్య
తిరుత్తణి: భార్య ఆత్మహత్య చేసుకోవడంతో వియోగాన్ని భరించలేని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెయ్యూరు తాలుకా కొడుక్కుత్తూరుకు చెందిన తిరువేంగడం. ఇతని కొడుకు భాగ్యరాజ్(32). బిటెక్ చదువుకున్న భాగ్యరాజ్ విశాఖపట్నంలో ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. ఇతనికి ఐదేళ్ల క్రితం భువనేశ్వరితో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం భాగ్యరా జ్, తన సొంత ఊరికి చెందిన అన్భళగన్ కూమార్తె విజయలక్ష్మి(28)ని ప్రేమించాడు. విజయలక్ష్మి చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాల్గొవ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని మార్చి మూడవ తేదీ చెన్నైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విజయలక్ష్మి తండ్రి అన్భళగన్ వీరి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో విజయలక్ష్మి మూడవ తేదీ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త భాగ్యరాజ్ దిగ్భ్రాంతి చెందాడు. భార్య వియోగం భరించలేని భాగ్యరాజ్ తిరుత్తణికి వచ్చి స్థానిక బస్టాండులోని ఓ ప్రైవేటు లాడ్జిలో బస చేశాడు. బుధవా రం రాత్రి లాడ్జి రూమ్‌లో జరిగిన విషయూన్ని లెటర్ రాసిపెట్టి, తన జీన్స్ ప్యాంట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన తిరుత్తణి ఇన్స్పెక్టర్ శిఖామణి భాగ్యరాజ్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గుండెపోటుతో భార్య.. ఆ షాక్‌తో భర్త మృతి
ఆ భార్యాభర్తలిద్దరు చిట్టచివరి క్షణం వరకు కలిసే ఉన్నారు. చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారు. విమానంలో వెళ్తున్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటు వచ్చి మరణించగా.. అది చూసి తట్టుకోలేక షాక్ తిన్న భర్త కూడా వెంటనే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని చురు ప్రాంతానికి చెందిన ప్రేమలత (65) తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి గువాహటికి విమానంలో బయల్దేరారు. వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బంధువులు కూడా అదే విమానంలో ఉన్నారు. ప్రయాణం మొదలైన కొద్ది సేపటికే తనకు గుండెలో నొప్పిగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పైలట్‌కు చెప్పగా, విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. వెంటనే ప్రేమలతను అక్కడుకు సమీపంలోని మాక్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ, తీసుకొచ్చేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలిసిన కొద్దిసేపటికే ఆమె భర్త శాంతిలాల్ జైన్ (75) షాక్‌తో కుప్పకూలిపోయారు. వైద్యులు పరిశీలించి, ఆయన కూడా మరణించినట్లు చెప్పారు!! -
అనుమానమే పెనుభూతమైందా?
డెంకాడ, న్యూస్‌లైన్ :అనుమానమే పెనుభూతమైందా.. అనుమానంతోనే భార్యను హతమార్చాడా.. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం నిండు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో గండిబోయిన రామయ్యమ్మ(28) హత్యకు గురైంది. కట్టుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డి.తాళ్లవలస గ్రామానికి చెందిన గండిబోయిన నర్సింగరావు వృత్తిరీత్యా గీత కార్మికుడు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో కల్లుగీత తీసేందుకు భార్య రామయ్యమ్మను తీసుకుని గ్రామ పొలిమేరల్లో ఉన్న తాటిచెట్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఏమైందో తెలియదు గానీ... రామయ్యమ్మ తలభాగంపై తన చేతిలో ఉన్న కీడుబడితితో బలంగా కొట్లాడు. అనంతరం గ్రామంలోకి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి పరుగు తీశారు. రక్తపు మడుగులో ఉన్న రామయ్యమ్మను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడవడంతో.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. డెంకాడ ఎస్సై కళాధర్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నర్సింగరావు పరారీలో ఉన్నాడు. మృతురాలు రామయ్యమ్మది ఇదే మండలంలోని అమకాం పంచాయతీ బెల్లాం గ్రామం. అమ్మకు ఏమైందో తెలియక... మృతురాలు రామయ్యమ్మకు నర్సింగరావుతో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. స్వయానా మేనత్త కూతురినే అతను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఆరేళ్ల కుమారుడు సురేష్, నాలుగేళ్ల కుమార్తె అప్పయ్యమ్మ ఉన్నారు. అభం శుభం తెలియని పసితనం వీరిది... తమ తల్లి మృతి చెందిందన్న అవగాహన కూడా లేదు... తల్లి మృతదేహం వద్ద అందరూ రోదిస్తుంటే.. వీరు ఏం జరిగిందో తెలియక బిత్తరచూపులు చూస్తుండడం అక్కడి వారిని కలిచివేసింది. తమ తల్లికి ఏమైందని అక్కడి వారిని ప్రశ్నించడం కంటనీరును తెప్పించింది. అనుమానంతోనేనా.. భార్యపై ఉన్న అనుమానంతోనే నర్సింగరావు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. పిల్లల ముఖం చూసైనా కనికారం చూపలేకపోయాడని గ్రామస్తులు శాపనార్థాలు పెడుతున్నారు.