ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడిని షూట్ చేసిన నేరం కింద ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై డాక్టర్ ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు కాల్పులు జరిపారు. ప్రధాన నిందితుడు బాధితుడిని నకిలీ డాక్టర్ అంటూ ఆరోపణలు చేశాడు. ఈ ఉదంతంపై పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు ఫైల్ చేశారు.
నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేఖుపుర గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సల్మాన్, అతని భార్యకు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఐతే చికిత్స పొందుతూ అతని భార్య ప్రాణాలు కోల్పోవడంతో, కోపోధ్రిక్తుడైన సల్మాన్ అదును చూసి అతని భార్యకు వైద్యం చేసిన డాక్టర్ తిలక్ రామ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా ఈ విషయంపై పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ధరమ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. నంగల్ పోలీస్ స్టేషన్‌లోని షేకుపురా గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ డాక్టర్ తిలక్ రామ్‌ను డిసెంబర్ 30న సాయంత్రం సల్మాన్, మెహబూబ్ అనే మరో వ్యక్తితో కలిసి డాక్టర్‌పై కాల్పులు జరిపారు. గాయాలపాలైన డాక్టర్‌ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసులో నిందితులైన సల్మాన్, మెహబూబ్‌లపై బాధితుడి సోదరుడు కాల్పుల కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.
చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా!
Comments
Please login to add a commentAdd a comment