
గిరిబాబు సతీమణి మృతి
సీనియర్ నటుడు గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవి (70) అనారోగ్యంతో మృతి చెందారు. మూడేళ్ళుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రఘుబాబు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.