ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరావు సతీమణి కన్నుమూత | Producer Kodali Venkateswara Rao Wife Anitha Died | Sakshi
Sakshi News home page

నిర్మాత కొడాలి వెంకటేశ్వరావు సతీమణి కన్నుమూత

Published Tue, May 4 2021 6:01 PM | Last Updated on Tue, May 4 2021 6:06 PM

Producer Kodali Venkateswara Rao Wife Anitha Died - Sakshi

నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత సైతం కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించింది.

కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కొందరు కరోనాకు బలైపోతుంటే.. మరికొందరూ ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. తాజా టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం(మే 4) కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిత ఈ రోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత సైతం కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement