![Uttej Wife Died Chiranjeevi And Prakash Raj Condolence Actor And His Family - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/13/Uttej.jpg1_.jpg.webp?itok=0RFoavGu)
Uttej Wife Padmavati Died: ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చదవండి: Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత
ఇన్నాళ్లు ప్రతి పనిలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేని ఉత్తేజ్.. చిరంజీవిని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో చిరు, ప్రకాశ్ రాజ్‌లు సైతం భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన కూతురు చేతన, ఉత్తేజ్.. చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక కూతురు చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.
చదవండి: మరో కాస్ట్‌లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment