Uttej
-
నటుడు, రచయిత ఉత్తేజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? (అరుదైన ఫొటోలు)
-
నా సంస్కారం ఎలాంటిది అంటే: హీరో ఉత్తేజ్
-
ఉత్తేజ్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్న
-
అలా చేస్తే నా కూతురిని చచ్చిపొమ్మని చెప్పా
-
ఆర్జీవీ భార్య పై ఉత్తేజ్ కామెంట్స్
-
జ్ఞాపకాలు మిగిల్చి పోయావా అమ్మ.. కుమార్తెలు ఎమోషనల్ పోస్ట్!
ఉత్తేజ్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. నటుడిగా, రచయితగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సారిగా శివ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రతి సినిమాలో మెప్పించారు. గాయం, అనగనగా ఒకరోజు చిత్రాల్లో నటించారు. అయితే 2021లో ఆయన కుటుంబం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 13న మరణించారు. ఆమె మృతి చెంది నేటికి రెండేళ్లు పూర్తయింది. (ఇది చదవండి: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే? ) ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఆమె కుమార్తెలు చేతన, పాట ఎమోషనలయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మను తలుచుకుంటూ మాకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావంటూ గుర్తు చేసుకున్నారు. పెద్దకూతురు చేతన సైతం అమ్మతో ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఎమోషలైంది. కాగా.. ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన 2017లో పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటుతోంది. చిన్న కూతురు పాటకి కూడా మంచి టాలెంట్ ఉంది. ఇటీవలే అకీరా నందన్ పియానో వాయిస్తూ ఉండగా, పాట అద్భుతంగా పాడి అలరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్ ) View this post on Instagram A post shared by paata...music ... (@paatauttej1424) View this post on Instagram A post shared by paata...music ... (@paatauttej1424) -
'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం'
టాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో జర్నీ మొదలుపెట్టిన జేడీ చక్రవర్తి తాజాగా మర్డర్ మిస్టరీగా రూపొందిన 'దయ' వెబ్‌సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిస్నీ + హాట్‌స్టార్‌లో ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా,విష్ణు ప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా పాల్గొని పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: వాళ్ల కోసమే బూతు సినిమాలు చేశా.. పాత రోజుల్ని గుర్తుచేసుకున్న సన్నీ లియోన్) జేడీ గురించి చెబుతూ.. 'చాలా ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర అర్థరాత్రి సమయంలో హీరోయిన్ రంభ తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్ మేమిద్దరం. అక్కడ ఒక సినిమాకు చెందిన రంభ కటౌట్ చాలా పెద్దది పెట్టారు. అబ్బా ఏముందిరా రంభ అని కారులో వెళ్లి చూసొచ్చిన బ్యాచ్ మాది. తర్వాత అదే రంభతో బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా చేసిన ఫ్రెండ్ వీడు' అంటూ ఉత్తేజ్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. జేడీకి సినిమాలంటే పిచ్చి. దర్శకత్వం అని ఎదో కొంచెం రూట్ మార్చాడు కానీ లేదంటే టాప్ హీరోలలో జేడీ కూడా ఒకడిగా ఉండేవాడని ఉత్తేజ్ తెలిపాడు. ఒకరకంగా చెప్పాలంటే జేడీ టాలీవుడ్ అమిర్‌ఖాన్ అంటూ ప్రశంసించాడు. అతనికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు. ఏ సినిమా గురించి అయినా కానివండి అర్దరాత్రి అడిగినా.. ఆ సినిమాకు సబంధించిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఇలా పేర్లన్నీ చెప్పేస్తాడని పేర్కొన్నాడు. అంతలా అతనిలో సినిమా గురించి నాలెడ్జి ఉందని తెలిపాడు. బొంబాయి వెళ్లి 'సత్య' చేసినా... హైద్రాబాదులో 'బొంబాయి ప్రియుడు' చేసినా... అతనికి సినిమా తప్ప ఇంకేమి తెలియదని జేడీ గురించి ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు. -
ఉత్తేజ్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్
ఉత్తేజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ప్రొఫెసర్ దేవన్న, బేబి ధార్వి కీలక పాత్రల్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఊర శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దర్శఖుడు వి. సముద్ర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత బాల బ్రహ్మచారి,మన్నెపల్లి అప్పారావు, శ్రీలక్ష్మి, పి. జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవారు నటిస్తున్నారు అన్నారు నిర్మాతలు. -
చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్
Actor Uttej Very Emotional Words About His Wife: ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 13న ఆమె మృతి చెందారు. ఆ సమయంలో ఉత్తేజ్ భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఉత్తేజ్‌ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం కంటతడి పెట్టుకున్నారు. నేడు(నవంబర్ 24) పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను తలచుకుంటూ.. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఘనంగా ఉత్తేజ్ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాట తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీమంతం వేడుకకు సింగర్స్ గీతా మాధురి, శృతి సహా నటుడు తనీష్ సైతం హాజరయ్యారు. చదవండి: నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్ హాట్ టాపిక్‌గా మారిన కృతిశెట్టి లిప్‌లాక్ సీన్ -
నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Bump Photos Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న ఆమె మెటర్నటీ షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. కాగా ఇటీవలె ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఇక చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. -
నా భార్య చనిపోతే నరేష్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు: ఉత్తేజ్
MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్‌రాజ్ సహా పలువురు హస్పిటల్ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నా 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్ పేర్కొన్నారు. చదవండి: మోహన్ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్ -
ఉత్తేజ్ భార్య గురించి చెబుతూ ఏడ్చేసిన చిరంజీవి
-
ఉత్తేజ్ భార్య సంతాప సభ
-
ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం
ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో ఈ నెల 13న ఆమె కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 30) ఉత్తేజ్ తన భార్య పద్మ సంస్మరణ సభను హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రములు హజరై పద్మకు ఘన నివాళి అర్పించారు. చిరును చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి ఆయనను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను, కూతురు చేతనను ఓదార్తూ చిరు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ ఇక ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్‌కు మనమందరం అండదండగా ఉండాలి. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సంతాప సభకు మెగాస్టార్‌తో పాటు మెగా బ్రదర్ నాగాబాబు, హీరోలు డా. రాజశేఖర్, శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి, గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య -
చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్
Uttej Wife Padmavati Died: ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, బ్రహ్మాజితో పాటు పలువురు సినీ ప్రముఖులు బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత ఇన్నాళ్లు ప్రతి పనిలో తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేని ఉత్తేజ్.. చిరంజీవిని చూడగానే కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి కాళ్లమీద పడి ఉత్తేజ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో చిరు, ప్రకాశ్ రాజ్‌లు సైతం భావోద్యేగానికి లోనయ్యారు. ఆయన కూతురు చేతన, ఉత్తేజ్.. చిరుని పట్టుకుని ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇక కూతురు చేతనను జీవిత ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా పద్మావతి.. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేవారు. అంతేగాక ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చిరంజీవి, ప్రకాష్ రాజ్ కంటతడి...
-
నటుడు ఉత్తేజ్కి సతీ వియోగం.. పరామర్శించిన పలువురు ప్రముఖులు
-
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖు బసవతారకం ఆసత్రికి వెళ్లి అక్కడ ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. -
నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్ పేరుతో ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, టాలీవుడ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి పలు అభ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్ మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్ -
‘కేసీఆర్ సర్.. నిన్ను నాయినా అని పిలవనా?’
నటుడు, రచయిత ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెరపై వైవిధ్య పాత్రల్లో కనిపించి మెప్పించే ఈ నటుడిలో గొప్ప రచయిత దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత, వాస్తవిక సంఘటనలపై తన అంతరంగంలో మెదిలిన భావాలను సూటిగా, నిక్కశ్చిగా చెప్పడం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలో షార్ట్ కట్ అంటూ మానవాళి చేస్తున్న తప్పిదాలను ఉత్తేజ్ వేలెత్తి చూపించాడు. తాజాగా తెలంగాణ గడ్డపై కరోనా బారి నుంచి ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వారికి అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలచేశాడు. తన పదునైన, గుండెబరువెక్కె విధంగా ఉత్తేజ్ పలికిన మాటలు అందరని ఆకట్టుకునే,ఆలోచించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తేజ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని, మానవ మనుగడను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ యుద్దం చేస్తున్నాం. అటువైపు మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు, అలుపులేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గడ్డపై ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా కొండంత అండగా నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్నందుకు కేసీఆర్ సర్ నిన్ను నాయినా అని పిలవాలని ఉందే.. నిన్ను నాయినా అని పిలవాలని వుంది పిలవనా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాటలు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు.. మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిలవాలనుంది పిలవనా నాయినా. మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు పానాలు లేచివచ్చినయ్ అన్నరు తెలంగాణ వెన్నుపూసగ నిల్శినవ్ గుండె దమ్మువై నడుస్తున్నవ్ మా బాగోగులు పట్టించుకుంటున్నవ్నిన్ను చూసినా నీ మాటలిన్నా బ్రతుకుమీద నమ్మకం వస్తది.. భయం అన్నది ఆమడ దూరం బోతది. దేన్నైనా జయిస్తాం అనిపిస్తది. మేం చేసుకున్న అదృష్టమే నువ్వు. ఇది నా ఒక్కడి మాట కాదు, తెలంగాణ వాళ్లే కాదు తెలుగు వాళ్లందరి మాట. అందరు సల్లగుండాలె మనుషులు పోతే వస్తరా అని మానవ వనరుల విలువలు చెప్తివి. తెలంగాణ బిడ్డలే కాదు ఈ గడ్డమీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మలెక్క అర్సుకున్నవ్ ఆఫీసర్లకి ఆర్డర్లిస్తివి ఆపన్నుల ఆదుకుంటివి అనాథల అక్కున చేర్చుకుంటివి గీ ‘కరోనా’ని తరుముకుంట పానాలు నిలుపుతుంటివి..! నాయిన లెక్క చూసుకున్నవ్. అప్పుడెప్పుడో ఎనకట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమెత్తి గోవులను కాపాడినట్టు కరోనా బారిన పడకుండా ఆ గడ్డ మీదున్నోళ్లు ఓటర్లు కాదు మనుషులని కాపాడినవ్. కనపడన వాడు దేవుడైతే నాయినా నువ్వు మాకు కనిపించే దేవునివి. నువ్వు సల్లగుండాలె నాయినా.. నీ కొడుకులు బిడ్డలు సల్లగుండాలే’అంటూ ఉత్తేజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో.. లాక్డౌన్: ఏకబిగిన 70 కి.మీ. నడక ‘మా ఇంటి బిడ్డ(కేసీఆర్) పైసలు పంపిండు’ -
సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం
సిటీబ్యూరో: ‘‘ ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి. నా చేతుల మీదుగా ప్రారంభించిన మయూఖ టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ మంచి ఆర్టిస్టులను అందిం చగలదన్న నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నటుడు ఉత్తేజ్ హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఏర్పాటు చేసిన మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్‌ను పూరి జగన్నాథ్ జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తేజ్ 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడని రామ్‌గోపాల్ వర్మకు పరిచయం చేసి, నేను దర్శకుడు కావటానికి కారకుడయ్యాడని చెప్పారు. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాక్టింగ్ కోచ్‌గా ఉత్తేజ్‌కు ఉన్న అనుభవం అపారమని అన్నారు. మా అబ్బాయి ఆకాష్‌కు కూడా ఉత్తేజ్ దగ్గరే శిక్షణ ఇప్పించానని చెప్పారు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. సమర్థులు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ విజయవంతం అవుతా యన్నారు. పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, సురేందర్ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందినీరెడ్డి వంటి దర్శకుల ప్రోత్సాహంతోనే స్కూల్‌ను ప్రారంభించాన్నారు. తొలి బ్యాచ్‌కి 32 అప్లికేషన్స్ రాగా కేవలం 18 మందిని మాత్రమే తీసుకున్నామని చెప్పారు. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి, ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్, మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత రామకృష్ణ వీరపనేని, ప్రముఖ రచయిత నడిమింటి నరసింహారావు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరిలోను ఉత్తేజం...
శ్రీనగర్‌కాలనీ: ఒకరు ‘చెల్డ్ ఆర్టిస్ట్’గా సుపరిచితురాలు. కూచిపూడి నృత్యకారిణి..మరొకరు తన అభినయంతో.. గాత్రంతో అదరగొడుతున్న చిచ్చరపిడుగు. ఈ ఇద్దరుఅక్కాచెల్లెళ్లూ.. కళా రంగానికి వన్నె తేవాలని, తండ్రిని మించిన కూతుళ్లుగా పేరుతెచ్చుకోవాలని తపన పడుతున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభతో అవకాశాలనుఅందిపుచ్చుకుంటున్నారు. వారెవరో కాదు.. నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తెలు ఒకరు చేతన, మరొకరు పాట (చేతన చిన్న కూతురు పేరు పాట). ‘వియ్ ఆర్ హైదరాబాదీస్’ అంటూతమ ప్రతిభా పాటవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు వారి మాటల్లోనే.. నా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్‌ని. అందరికి గుర్తుండేది తేజ దర్శకత్వంలోని ‘చిత్రం’ సినిమాలో ‘అన్నయ్యా.. కుక్క కావాలి’ అంటూ ఏడుస్తూ డైలాగ్ చెప్పానే.. హీరో ఉదయ్‌కిరణ్ తమ్ముడిని. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20 చిత్రాల వరకూ చేశాను. నా తొలి చిత్రం ‘గిల్లికజ్జాలు’. తర్వాత ‘బ్రది, భద్రాచలం’ వంటి సినిమాలు చేశాను. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. శ్రీనగర్‌కాలనీలో స్కూలింగ్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. డిప్లొమా ఇన్ స్క్రీన్‌ప్లే రైటింగ్ చేశాను. ఇక్కడే పుట్టి పెరిగా కాబట్టి.. హైదరాబాద్‌తో చాలా అనుబంధం ఉంది. శ్రీనగర్‌కాలనీ.. యూసుఫ్‌గూడ మా అడ్డాలు. అమ్మకి బొటిక్ ఉంది.. చార్మినార్ వద్ద షాపింగ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌లో అన్నిప్రదేశాలు చుట్టేశా. బిర్యానీతోపాటు అమ్మ చేసినసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్‌ని.. నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. తెలుగులో నాటకాలు చాలా వేశాను. కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చాను. కొత్తగా ప్రొడక్షన్ ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇంట్లోనే నటుడు ఉన్నందన నటన అంటే భయం లేదు. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. ‘పిచ్చిగా నచ్చావ్’ చిత్రం హీరోయిన్గా నా మొదటి సినిమా. ‘సైరా’లో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాను. కూచిపూడి అంటే ప్రాణం.. నా ఏడేళ్ల వయసు నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నారు. నా గురువు బాలత్రిపుర సుందరి. ప్రస్తుతం హెచ్‌సీయూలో కూచిపూడిలో మాస్టర్స్ చేస్తున్నాను. నాట్యం అంటే ప్రాణం. ఎప్పటికీ నాట్యాన్ని వదలను. కొత్త నృత్యాలు నేర్చుకొని కూచిపూడితో కలిపి కొత్త నృత్యరీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ‘కలరీ స్టంట్స్’ కూడా నేర్చుకున్నాను. ఒడిస్సీ కూడా నేర్చకుంటాను. అన్ని నృత్యాలపై అవగాహన పెంచుకుని కూచిపూడి రూట్స్‌ను మార్చకుండా కొంగొత్తగా చేయడానికి కృషి చేస్తున్నాను. మొదటి గురువు నాన్నే.. నాన్న ఉత్తేజ్ చెల్లికి, నాకు కూడా మొదటి గురువు. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. మా అభిప్రాయాలను గౌరవిస్తారు. అది చెయ్.. ఇది చెయ్ అని అనరు.. ఇష్టాలను గౌరవించి ప్రధాన్యతను ఇస్తారు. ఉత్తేజ్ కూతురు కదా అని అవకాశాలు రావు. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటాం. అమ్మ నాకు అన్ని అంశాల్లో సపోర్ట్‌గా ఉంటుంది. చెల్లి ‘పాట’ అల్లరి పిల్ల. చిన్నతనంలో నేను ఎలా ఉన్నానో.. అంతకు రెట్టింపుగా ఉంటుంది. ఎవరినైనా ఇమిటేట్ చేయగలదు. చాలా యాక్టివ్.. సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది. తెలుగు అమ్మాయిగా అవకాశాలు వస్తే తప్పక నిరూపించుకుంటా. నా పేరే పాట.. మా నాన్న ఉత్తేజ్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నాకు ‘పాట’ అని పేరు పెట్టారు. చాలా కొత్తగా ఉంది కదూ..! విన్నవాళ్లంతా నా పేరును ప్రశంశిస్తున్నారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాను. కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నాను. ఎవరినైనా ఇమిటేట్ చేయడం బాగా అలవాటు. నవ్వు చాలా మంచింది. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటాను. ‘ఓరయ్యో..ఓలమ్మో’ సూపర్‌హిట్ ‘రంగస్థలం’ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించింది. అందులోని ‘రంగమ్మ..మంగమ్మ’ సాంగ్ పేరడిగా సినిమా విజయాన్ని తెలుపుతూ ‘ఓరయ్యో.. ఓలమ్మో’ అంటూ పాట రూపొందించారు. అక్క నృత్యాన్ని అందించింది. సినిమా జర్నలిస్ట్ ప్రభు అంకుల్ పాట రాస్తే నేను పాడాను. చిన్న ప్రయత్నంగా చేసిన ఈ పాట యూట్యూబ్‌లో మంచి హిట్టయ్యి ఆరు మిలియన్ వ్యూస్ సాధించింది. చాలా మంది ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. పాప్ సాంగ్స్ చేస్తా.. మంచి సింగర్ అవ్వాలని కోరిక.. పాప్ సాంగ్స్ చేయాలని ఉంది. తెలుగమ్మాయిగా పాప్ గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతానికి మరో కవర్‌సాంగ్ చేస్తున్నా. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంతో పాటు కళ్యాణ్‌రామ్ చిత్రంలోనటిస్తున్నాను. పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. మంచి గాయనిగా, నటిగా పేరు తెచ్చుకొని మా నాన్న పేరును నిలబెట్టాలి. -
పోలీసులకు నటుడు ఉత్తేజ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్‌పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్‌కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. -
‘రంగమ్మ మంగమ్మ’ పేరడీ సాంగ్