ఆ ఇద్దరిలోను ఉత్తేజం... | Uttej Daughters Special Interview In Sakshi | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరిలోను ఉత్తేజం...

Published Mon, Jul 2 2018 10:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Uttej Daughters Special Interview In Sakshi

శ్రీనగర్‌కాలనీ: ఒకరు ‘చెల్డ్‌ ఆర్టిస్ట్‌’గా సుపరిచితురాలు. కూచిపూడి నృత్యకారిణి..మరొకరు తన అభినయంతో.. గాత్రంతో అదరగొడుతున్న చిచ్చరపిడుగు. ఈ ఇద్దరుఅక్కాచెల్లెళ్లూ.. కళా రంగానికి వన్నె తేవాలని, తండ్రిని మించిన కూతుళ్లుగా పేరుతెచ్చుకోవాలని తపన పడుతున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభతో అవకాశాలనుఅందిపుచ్చుకుంటున్నారు. వారెవరో కాదు.. నటుడు, రచయిత ఉత్తేజ్‌ కుమార్తెలు ఒకరు చేతన, మరొకరు పాట (చేతన చిన్న కూతురు పేరు పాట). ‘వియ్‌ ఆర్‌ హైదరాబాదీస్‌’ అంటూతమ ప్రతిభా పాటవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు వారి మాటల్లోనే..

నా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ని. అందరికి గుర్తుండేది తేజ దర్శకత్వంలోని ‘చిత్రం’ సినిమాలో ‘అన్నయ్యా.. కుక్క కావాలి’ అంటూ ఏడుస్తూ డైలాగ్‌ చెప్పానే.. హీరో ఉదయ్‌కిరణ్‌ తమ్ముడిని. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 20 చిత్రాల వరకూ చేశాను. నా తొలి చిత్రం ‘గిల్లికజ్జాలు’. తర్వాత ‘బ్రది, భద్రాచలం’ వంటి సినిమాలు చేశాను. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. శ్రీనగర్‌కాలనీలో స్కూలింగ్‌. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేశాను. డిప్లొమా ఇన్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌ చేశాను. ఇక్కడే పుట్టి పెరిగా కాబట్టి.. హైదరాబాద్‌తో చాలా అనుబంధం ఉంది. శ్రీనగర్‌కాలనీ.. యూసుఫ్‌గూడ మా అడ్డాలు. అమ్మకి బొటిక్‌ ఉంది.. చార్మినార్‌ వద్ద షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌లో అన్నిప్రదేశాలు చుట్టేశా. బిర్యానీతోపాటు అమ్మ చేసినసీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం.

థియేటర్‌ ఆర్టిస్ట్‌ని..
నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ని. తెలుగులో నాటకాలు చాలా వేశాను. కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చాను. కొత్తగా ప్రొడక్షన్‌ ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాను. ఇంట్లోనే నటుడు ఉన్నందన నటన అంటే భయం లేదు. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాను. ‘పిచ్చిగా నచ్చావ్‌’ చిత్రం హీరోయిన్‌గా నా మొదటి సినిమా. ‘సైరా’లో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నాను.

కూచిపూడి అంటే ప్రాణం..
నా ఏడేళ్ల వయసు నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నారు. నా గురువు బాలత్రిపుర సుందరి. ప్రస్తుతం హెచ్‌సీయూలో కూచిపూడిలో మాస్టర్స్‌ చేస్తున్నాను. నాట్యం అంటే ప్రాణం. ఎప్పటికీ నాట్యాన్ని వదలను. కొత్త నృత్యాలు నేర్చుకొని కూచిపూడితో కలిపి కొత్త నృత్యరీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ‘కలరీ స్టంట్స్‌’ కూడా నేర్చుకున్నాను. ఒడిస్సీ కూడా నేర్చకుంటాను. అన్ని నృత్యాలపై అవగాహన పెంచుకుని కూచిపూడి రూట్స్‌ను మార్చకుండా కొంగొత్తగా చేయడానికి కృషి చేస్తున్నాను. 

మొదటి గురువు నాన్నే..
నాన్న ఉత్తేజ్‌ చెల్లికి, నాకు కూడా మొదటి గురువు. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. మా అభిప్రాయాలను గౌరవిస్తారు. అది చెయ్‌.. ఇది చెయ్‌ అని అనరు.. ఇష్టాలను గౌరవించి ప్రధాన్యతను ఇస్తారు. ఉత్తేజ్‌ కూతురు కదా అని అవకాశాలు రావు. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటాం. అమ్మ నాకు అన్ని అంశాల్లో సపోర్ట్‌గా ఉంటుంది. చెల్లి ‘పాట’ అల్లరి పిల్ల. చిన్నతనంలో నేను ఎలా ఉన్నానో.. అంతకు రెట్టింపుగా ఉంటుంది. ఎవరినైనా ఇమిటేట్‌ చేయగలదు. చాలా యాక్టివ్‌.. సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది. తెలుగు అమ్మాయిగా అవకాశాలు వస్తే తప్పక నిరూపించుకుంటా.

నా పేరే పాట..
మా నాన్న ఉత్తేజ్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నాకు ‘పాట’ అని పేరు పెట్టారు. చాలా కొత్తగా ఉంది కదూ..! విన్నవాళ్లంతా నా పేరును ప్రశంశిస్తున్నారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాను. కర్ణాటిక్‌ సంగీతం నేర్చుకున్నాను. ఎవరినైనా ఇమిటేట్‌ చేయడం బాగా అలవాటు. నవ్వు చాలా మంచింది. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటాను. 

‘ఓరయ్యో..ఓలమ్మో’ సూపర్‌హిట్‌  
‘రంగస్థలం’ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఘన విజయం సాధించింది. అందులోని ‘రంగమ్మ..మంగమ్మ’ సాంగ్‌ పేరడిగా సినిమా విజయాన్ని తెలుపుతూ ‘ఓరయ్యో.. ఓలమ్మో’ అంటూ పాట రూపొందించారు. అక్క నృత్యాన్ని అందించింది. సినిమా జర్నలిస్ట్‌ ప్రభు అంకుల్‌ పాట రాస్తే నేను పాడాను. చిన్న ప్రయత్నంగా చేసిన ఈ పాట యూట్యూబ్‌లో మంచి హిట్టయ్యి ఆరు మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. చాలా మంది ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు.

పాప్‌ సాంగ్స్‌ చేస్తా..
మంచి సింగర్‌ అవ్వాలని కోరిక.. పాప్‌ సాంగ్స్‌ చేయాలని ఉంది. తెలుగమ్మాయిగా పాప్‌ గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతానికి మరో కవర్‌సాంగ్‌ చేస్తున్నా. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ చిత్రంతో
పాటు కళ్యాణ్‌రామ్‌ చిత్రంలోనటిస్తున్నాను. పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. మంచి గాయనిగా, నటిగా పేరు తెచ్చుకొని మా నాన్న పేరును నిలబెట్టాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement