Actor Uttej Very Emotional Words About His Wife - Sakshi
Sakshi News home page

Uttej Very Emotional Words: చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Wed, Nov 24 2021 3:48 PM | Last Updated on Wed, Nov 24 2021 4:25 PM

Actor Uttej Emotional Words About His Wife Padma - Sakshi

Actor Uttej Very Emotional Words About His Wife: ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌ సంబంధిత వ్యాధితో సెప్టెంబర్‌ 13న ఆమె మృతి చెందారు. ఆ సమయంలో ఉత్తేజ్‌ భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఉత్తేజ్‌ను చూసి మెగాస్టార్‌ చిరంజీవి సైతం కంటతడి పెట్టుకున్నారు. నేడు(నవంబర్‌ 24) పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్‌ మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను తలచుకుంటూ.. సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు.

 ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement