birth anneversary
-
రతన్ టాటా సాధించిన అతిపెద్ద విజయాలు ఇవే!
అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి యుగ పురుషుడు, భరతమాత ముద్దుబిడ్డ.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మన 'రతన్ టాటా' (Ratan Tata). ఈయన ప్రస్తుతం దేహంతో లేకపోయినా.. దేశం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అంతటి గొప్ప మహనీయుడు ఎందరికో ఆదర్శనీయం.. మరెందరికో పూజ్యనీయం. నేడు రతన్ టాటా జయంతి. ఈ కథనంలో ఆయన సాధించిన ఘనతలు, ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.రతన్ టాటా: ఎ విజనరీ లీడర్1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా.. నాయకత్వానికి, సమగ్రతకు పర్యాయపదం. టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా, నాణ్యత, సామాజిక బాధ్యత.. నైతిక అభ్యాసాల వంటి విలువలకు కట్టుబడి ఉంటూనే, టాటా గ్రూప్‌ను గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మార్చిన ఘనుడు. తన తల్లితండ్రులు విడిపోయిన తర్వాత, అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా యొక్క ప్రయాణం సంకల్పం & ప్రేరణతో కూడుకున్నది.టాటా గ్రూప్‌లో తొలి అడుగులుకార్నెల్ యూనివర్సిటిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' (IBM) నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.NELCO డైరెక్టర్1971లో టాటా అనుబంధ సంస్థ అయిన 'నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్' (NELCO)కి రతన్ టాటా డైరెక్టర్ అయ్యారు. అతని నాయకత్వంలో.. NELCO వ్యాపారాలు గణనీయమైన పురోగతివైపు అడుగులు వేసాయి.టాటా గ్రూప్ చైర్మన్1991లో JRD టాటా తర్వాత 'రతన్ టాటా'.. టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అతని పదవీకాలంలోనే టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008)ల కొనుగోళ్ల వంటి వాటితో పాటు ప్రపంచ విస్తరణలు కూడా జరిగాయి.ఈ సమయంలో టాటా గ్రూప్ ఉనికి ప్రపంచ దేశాలకు వ్యాపించింది.మొదటి స్వదేశీ కారురతన్ టాటా 1998లో టాటా ఇండికాను లాంచ్ చేయడం ద్వారా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇది దేశంలో మొట్టమొదటి స్వదేశీ కారు. ఆ తరువాత 2008లో అందరికీ అందుబాటు ధరలో ఓ కారు ఉండాలనే ఉద్దేశ్యంతోనే 'టాటా నానో' ప్రారంభించారు. ఈయన ప్రయత్నాలు వల్ల నాణ్యమైన వాహనాలను ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.పురస్కారాలు & పదవీ విరమణరతన్ టాటా 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. అయితే ఈయన 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. -
Konda Laxman Bapuji: ఉద్యమాల కొండ..
తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.1938లో తాను మెట్రిక్యులేషన్ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్–ఉస్మాన్ అలీఖాన్‌ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్‌లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిటీ, మండల కమిషన్లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక! -
Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
జనం గొడవే.. ఆయన గొడవ!
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత– అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన సమరశీలి; సామాజిక స్పర్శతో కవిత్వాన్ని పునీతం చేసిన ప్రజాకవి కాళోజీ! ప్రజా ఉద్య మాల్లో పాల్గొని అన్యాయాన్ని కవిత్వ కరవాలంతో ఎదిరించి ప్రశ్నించి నిలదీసిన ధీశాలి. నిజాం రాజును ఆత్మస్థైర్యంతో ఎదిరించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాటను నిర్దేశించిన యోధుడాయన. తనను వదిలేసుకొని ఇతరుల మంచి కోసం పోరాడే సామాజిక స్పృహ, నిరంతర తపన కాళోజీలో ఉన్నాయి. పీడిత, తాడిత ప్రజల గుండెల్లో పోరాటపు పుప్పొడిని చల్లి కవిగా నిలిచి పోయారు. మాటల్లో, చేతల్లో, ప్రవ ర్తనలో, వేషభాషల్లో, ఆలోచ నలో, ఆర్తిలో, ఆవేదన – సంవే దనల్లో తెలంగాణ తనాన్ని విని పించి, కనిపింపజేసిన ఆయన అసాధారణ కవి. ప్రజల్లోకి బలంగా తన కవిత్వాన్ని తీసు కెళ్లిన కాళోజీని మహాకవి దాశరథి ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ అని అభివర్ణించారు. ఉద్యమ ప«థ నిర్దేశం చేసి చిరకాల కవిత్వాన్ని కాళోజీ ప్రజలకు మిగిల్చారు.సమాజ గొడవను తన గొడవగా మార్చు కొని ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయి. దేశీయ దృక్పథం, ప్రాంతీయ çస్పృహ కలిగిన కాళోజీ ఖండాంతర కవి. ప్రజా ఉద్యమాలతో మమేకమైన ఆయన సమాజాన్ని నా గొడవలో అనేక కోణాలలో ఆవిష్కరించి చూపారు. నిజా లను కవిత్వంలో కుండబద్దలు కొట్టి చెప్పిన కాళోజీ ఎవరేమనుకున్నా తన తత్వం ఇదేనని స్పష్టం చేశారు. ‘ఓటేసేటప్పుడు వుండాలి బుద్ధి’ అన్న మాటల్లో వాస్తవాల ఆవిష్కరణ కనిపిస్తుంది. ఆచరణ యోగ్యంగా ఆయన కవిత్వపంక్తులు ఉంటాయి.సామాన్య ప్రజానీకానికి అంత దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లిన కవిగా కాళోజీ మిగిలిపోయారు. ‘తిననోచని మాట్లాడ నోచని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవచేసి ప్రేమించనోచని శరీరం...’ వంటివాటి పక్షం వహిస్తాడు కాళోజీ. కచ్చితమైన అభిప్రా యాలు కల్గిన కాళోజీ... పలుకుబడుల వ్యావహా రిక భాషలో రచనలు చేశారు. ‘ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరుముతాం... ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాత రేస్తాం’ అంటూ తెలంగాణ వాణిని వినిపించిన కాళోజీ ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది... వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి’ అని స్పష్టం చేశారు. స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, ద్వంద్వ ప్రవృత్తులపై, అన్యా యం వంటివాటిపై ఖండనలు చేసిన ఆయన సామాజిక కవి శిఖరంగా కనిపిస్తారు. రాజ కీయ లౌక్యాలు, వ్యంగ్యాస్త్రాలు ప్రస్తావిస్తూనే సాహిత్య విలువ లను నా గొడవలో స్థాపన చేశారు. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించినట్టే తనకు ఎదిరించినోడే ఆరాధ్యుడని ఆయన చెప్పారు. ఓటు విలువను సమాజానికి చెప్పిన ఆయన సమాజ అంతరాలను నా గొడవలో బట్ట బయలు చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరడం తప్పదు... కాలంబు రాగానె కాటేసి తీరాలే... కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె’ అన్న కాళోజీ... నిర్భయత్వానికి నిదర్శనం! – డా. తిరునగరి శ్రీనివాస్, కవి, సాహిత్య విశ్లేషకులు, 94414 64764 -
గూగుల్‌కు పాతికేళ్లు.. ఆ తప్పు వల్లే ఇవాళ ఇలా..
గూగుల్.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ పుట్టి నేటికి 25 ఏళ్లు. 25ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజీలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గూగులమ్మ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ♦1996 లో లారీపేజ్, సెర్జీ బ్రెయిన్లు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆ సమసయంలో ప్రాజెక్ట్ నిమిత్తం ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ♦అన్నట్లు గూగుల్ మొదటి పేరు ‘బ్యాక్‌రబ్’ ♦సెర్చ్ ఇంజిన్‌లో మొదట వెబ్ పేజీల ప్రాముఖ్యత ఎలా ఉందని తెలుసుకునే వారు. ఇందుకోసం ఒక వెబ్ పేజ్ నుంచి మరో వెబ్ పేజీకి లింక్‌లను జత చేసేవారు. అలా మొదటగా గూగుల్‌కు బదులు బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు. ♦ఆరు ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా సెంటర్లు ఉన్నాయి. ♦గూగుల్ సెకనులో అంచనా ప్రకారం దాదాపు రూ. 9,40,000 రూపాయలు సంపాదిస్తుంది. ♦ లారీ పేజ్,సెర్గీ బ్రిన్లు స్థాపించారు. ♦ గత 12 (2021 డేటా ప్రకారం) ఏళ్లలో గూగుల్ 827 కంపెనీలను కొనుగోలు చేసింది. గూగుల్ సంస్థ ఎంత పెద్దదో ఇప్పుడు మీరు ఊహించవచ్చు. ♦ గూగుల్‌లో 420000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఇప్పుడు అనేక మంది కుబేరులుగా అవతరించారు. ♦ గూగుల్ ఖచ్చితంగా ఎంత సంపాదిస్తుంది అనేది స్పష్టత లేదు. కానీ గూగుల్ వార్షిక ఆదాయం సుమారు 55,00,00,00,000,000,000,000,000 డాలర్లు. ♦ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్ తయారు చేసింది. అయితే ప్రతి 5 స్మార్ట్ఫోన్లలో 4 ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై మాత్రమే పనిచేస్తాయని మీకు తెలుసా? ♦గూగుల్ హెడ్ ఆఫీస్‌లో 20,000 మేకలకు ఉద్యోగం కల్పించింది. అవును ఇది నిజమే. ఆఫీస్ క్యాంపస్‌లో గడ్డిని తొలగించేందుకు మెషిన్ని (మొవర్)ఉపయోగించదు. ఎందుకంటే? మొవర్తో దుమ్ము లేస్తుంది. ఉద్యోగులు పనిచేసే సమయంలో సౌండ్ వస్తుందని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. మేకలకు ఉద్యోగం అంటే జీతం ఇస్తుందా? అని మాత్రం అనుకోకండి. వాటి పోషణ, ఆరోగ్యానికి అయ్యే ఖర్చులన్నీ సంస్థే భరిస్తుంది. ♦ ప్రతి వారం 220,000 కంటే ఎక్కువ మంది గూగుల్‌లో ఉద్యోగం కోసం అప్లయ్ చేస్తుంటారు. ♦ గూగుల్ తన సంపాదనలో మొత్తం 95 శాతం యాడ్స్ నుంచే వస్తుంది. ♦ నమ్మండి.. రెప్పపాటులో గూగుల్ రూ. 5.5కోట్లు సంపాదిస్తుందని అంచనా . ♦ ‘గూగుల్’ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి 1 తర్వాత 100 సున్నాలను ఉంచడం ద్వారా ఏర్పడే సంఖ్యను ‘గూగోల్’ అని పిలుస్తారు. ఈ పదం నుంచి గూగుల్ పుట్టింది. ♦ అలాంటప్పుడు ‘గూగుల్‌కు’ బదులు ‘గూగోల్’ అని పెట్టొచ్చుకదా అని మీరు అనుకోవచ్చు. నిజానికి ‘గూగుల్’ అనే పేరు స్పెల్లింగ్ మిస్టేక్. ఓ ఉద్యోగి టైపింగ్‌లో చేసిన తప్పిదం వల్ల గూగోల్ కాస్త గూగుల్‌గా మారింది. ♦ గూగుల్ 2006లో ‘యూట్యూబ్’ని కొనుగోలు చేసింది, ఆ సమయంలో చాలా మంది ఈ ఒప్పందాన్ని గూగుల్ తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు. కానీ యూట్యూబ్‌ని నేడు ప్రతి నెల 6 బిలియన్ గంటల పాటు వీక్షిస్తున్నారు. ♦ గూగుల్‌లో ప్రతి సెకనుకు 60 వేల కంటే ఎక్కువ సెర్చ్‌లు జరుగుతాయి. ♦ 2010 నుండి గూగుల్ కనీసం వారానికి ఒక కంపెనీని కొనుగోలు చేసింది. ♦ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ కోసం 80 లక్షల 46 వేల కిలోమీటర్ల రహదారికి సమానమైన ఫోటోలను తీసింది. ♦ గూగుల్ మొత్తం సెర్చ్ ఇంజిన్ స్టోరేజ్ 100 మిలియన్ గిగాబైట్లు. మీ వద్ద అంత డేటాను సేవ్ చేయడానికి, ఒక టెరాబైట్ లక్ష డ్రైవ్‌లు అవసరం. ♦ యాహూ కంపెనీ గూగుల్‌ను ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని భావించింది కానీ అది జరగలేదు. ♦ గూగుల్ ప్రారంభించబడినప్పుడు, గూగుల్ వ్యవస్థాపకుడికి హెచ్‌టీఎంఎల్ కోడ్ గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే అతను గూగుల్ హోమ్‌పేజీని చాలా సింపుల్‌గా డిజైన్ చేశారు. ♦ 2005లో, గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ వంటి కొత్త అప్లికేషన్లను ప్రారంభించింది. ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక క్షణంలో కొలవగలదు. ♦ గూగుల్ అనధికారిక స్లోగన్ ఏంటంటే? ‘చెడుగా ఉండకు’ ♦ గూగుల్ హోమ్‌పేజీలో 88 భాషలను ఉపయోగించుకోవచ్చు! -
పునీత్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి!
Late Kannada SuperStar Birth Anniversary Special: పునీత్ రాజ్‌కుమార్.. నువ్వయ్యా నిజమైన జగదేకవీరుడివి! ఇండియన్ సినిమాలో ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్ అప్పు సొంతం! ఏంటో తెలుసా? ‘అమ్మా.. ఆయన ఫొటో వాట్సాప్‌లో ఎందుకు స్టేటస్ పెట్టుకున్నావ్?’.. అనే కొడుకు ప్రశ్నకు.. ‘‘లేదు బిడ్డా.. ఆయన కన్నడ హీరో అట. చాలా మంచోడు అట. 45 స్కూళ్లు కట్టించాడట. 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపిస్తున్నాడట. 19 గోశాలలకు సాయం చేస్తున్నాడట. ఇప్పుడు చనిపోయినా రెండు కళ్లూ దానం చేశాడట. ఇంత మంచోడు ఇయ్యాల రేపు ఉంటాడా?.. అందుకే స్టేటస్ పెట్టిన్రా అని సమాధానం ఇచ్చింది ఆ తల్లి. ఎక్కడ కర్ణాటక.. ఎక్కడ తెలుగు రాష్ట్రాలు.. పోనీ పునీత్ ఆయన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయమా? అంటే.. అదీ లేదు. ఓ చిన్న సాయం చేసి ప్రపంచానికి ఎలా చెప్పాలా? అని అనుకుంటాం మనమంతా. కానీ, స్టార్ హీరోగా ఉండి కూడా పునీత్ అలా కాదు. ఆయన చేస్తున్న సాయం ఏంటో ఆయన మరణం తర్వాతే ప్రపంచానికి తెలిసింది. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం. ఆ.. ఎలా బతికామన్నదాన్ని బట్టే, ఎంతకాలం జనం గుండెల్లో నిలిచిపోతామన్నది ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం.. తన అభిమానులనే కాదు.. ఏమాత్రం సంబంధం లేని వేరే రాష్ట్ర ప్రజలను సైతం కదిలించింది. పాతిక లక్షల మంది కరోనా లాంటి మహమ్మారిని సైతం లెక్కచేయకుండా పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు.. అతను సంపాదించుకున్న అభిమానం ఎంత గొప్పదో!.. ఆ అభిమానం చిరకాలం సజీవంగా ఉంటుంది కూడా!. తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ లెజెండరీ నటుడు. తల్లి దివంగత పార్వతమ్మ.. నిర్మాత. పెద్దన్న శివ రాజ్‌కుమార్ స్టార్ హీరో. రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ నటుడు కమ్ నిర్మాత. మొత్తం కుటుంబం సినీ నేపథ్యం ఉన్నా, బాల్యం నుంచే తెర మీద కనిపిస్తున్నా.. టాలెంట్‌తో ఎదిగిన పునీత్ అంటే అక్కడి జనాలకు ఇష్టం ఎక్కువ. తెర మీద ఒక స్ప్రింగ్‌లా అప్పు స్టెప్పులు వేస్తుంటే.. రెప్పవేయరు ఆడియొన్స్. ఆయన డైలాగ్ డెలివరీని మాస్‌తో పాటు క్లాస్ ఆడియొన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ ఫాలోయింగ్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఒరియెంటెడ్ కంటెంట్ సినిమాలూ చిన్నవయసులోనే ఆయన క్రేజ్‌ను విపరీతంగా పెంచాయి. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. ‘గుడిసలె ఆగలి.. అరమనే ఆగలి.. అటవే నిల్లదు ఎందు ఆట నిల్లదు గుడిసెలో ఉన్నా.. బంగళాలో ఉన్నా.. అతనెప్పుడూ ఒకేలా ఉంటాడు. దాని చుట్టూనే ఆడుకుంటాడు. హిరియరె ఇరళి.. కిరియరి బరళి.. బెదవే తోరదు.. ఎందు బేధ తోరదు చిన్న అయినా.. పెద్ద అయినా.. అందరినీ గౌరవిస్తాడు. ఉన్నతంగా జీవిస్తాడు. ఎల్ల ఇద్దు ఎను ఇళ్లద హాగే బదుకిరువా ఉన్నతుడు కానీ గర్వం చూపించడు ఆకాశ నోడద కైయె నిన్నదు ప్రీతి హంచిరువా మధురమైన పాత జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు..’ పునీత్ రాజ్‌కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకుమార సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవి. అలాంటి జ్ఞాపకాలనే కుటుంబానికి, అశేష అభిమానులకు అర్థాంతరంగా మిగిల్చి వెళ్లిపోయాడు అప్పు. పునీత్ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు.. పునీత్ చనిపోయేనాటికి వయసు 46 ఏళ్లు. సినీ ప్రస్థానం సాగింది 45 ఏళ్లు. ఆరు నెలల వయసుకే లోహిత్(పునీత్ పసితనంలో పేరు) తండ్రి లీడ్ రోల్ చేసిన ‘ప్రేమదా కనికే’ చిత్రంలో కనిపించాడు. బెట్టాడ హూవు సినిమాకుగానూ ఏకంగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ అవార్డు అందుకున్నాడు లోహిత్(పునీత్). 1976 నుంచి 89 మధ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా కన్నడ సినిమాల్లో సందడి చేశాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో హీరోగా 2002లో అప్పు తో(తెలుగు ఇడియట్‌కి రీమేక్) ఎంట్రీ. ఒక హీరో తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి వరుసగా ఆరు సినిమాలు.. వంద రోజులు పూర్తి చేసుకుని కమర్షియల్ సక్సెస్ సాధించగలడా?. ఇండియన్ సినిమాలో ఆ రికార్డు పునీత్ పేరిట ఉంది. దానిని ఇప్పటిదాకా ఎవరూ బ్రేక్ చేసింది లేదు. 19 ఏళ్ల హీరో కెరీర్లో 29 సినిమాల్లో నటించాడు. శాండల్‌వుడ్‌లో మోస్ట్ సక్సెస్‌లు సాధించిన హీరోగా గుర్తింపు. అందుకే కన్నడలో పవర్ స్టార్ ట్యాగ్ దక్కింది ఆయనకు. అప్పు, అభి, వీర కన్నడిగ(ఆంధ్రావాలా రీమేక్), మౌర్య, ఆకాశ్, అజయ్(ఒక్కడు రీమేక్), అరసు, మిలనా, వంశీ, రామ్, జాకీ(పునీత్ స్టార్‌డమ్‌ను ఆకాశానికి చేర్చిన సినిమా), హుడుగరు, రాజకుమార, అంజనీ పుత్ర(తమిళ చిత్రం పూజై రీమేక్).. ఇలా పునీత్ కెరీర్లో కమర్షియల్ బ్లాక్బస్టర్లుగా నిలిచిన సినిమాలు. ముంగారు మలే(తెలుగులో ‘వాన’గా రీమేక్).. కన్నడ నాట ఒక సెన్సేషన్ హిట్. ఆ సినిమా కలెక్షన్లకు చాలా కాలం తర్వాత బ్రేక్ చేసింది పునీత్ రాజ్‌కుమారే. ఆయన నటించిన ‘రాజకుమార’ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత కే.జీ.ఎఫ్ చాప్టర్ 1 ఆ రికార్డును క్రాస్ చేసేసింది. నటుడు, ప్లేబ్యాక్ సింగర్, టెలివిజన్ ప్రజెంటర్, నిర్మాత, వాయిస్ ఓవర్.. ఇలా పునీత్ మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ విషయంలో తండ్రి దివంగత రాజ్‌కుమార్‌కు ఏమాత్రం తీసిపోని ఆణిముత్యం పునీత్. చిన్నవయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా మెప్పించాడు. హీరోగా రాణిస్తున్న టైంలోనూ.. ప్రొఫెషనల్ సింగర్‌లాగా ఎన్నో సినిమాలకు.. అదీ ఇతర హీరోలకు సైతం పాడారు. అజాత శత్రువు స్టార్ డమ్ ఉన్న హీరోకి ఫ్యాన్స్ వార్ తప్పని విషయం. మరి పునీత్‌కు ఇలాంటివేం లేవా? అనే అనుమానాలు రావొచ్చు. ఆ విషయంలో పునీత్ ఫ్యాన్స్‌ను మెచ్చుకోవాల్సిందే. డ్యాన్సులో పోటీపడే హీరోలు ఉన్నా.. అంతా పునీత్‌తో సమానంగా అవతలి హీరోలనూ అభిమానించేవాళ్లే. అభిమానులే కాదు.. హీరోలూ పునీత్‌ను ఒక మంచి మిత్రుడిగా చూస్తుంటారు. ఎందుకంటే పునీత్‌కు తానొక బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని, స్టార్ హీరోను అనే గర్వం ఏ కోశాన కనిపించదు. అందుకే తమ సినిమా ఈవెంట్లలలో పునీత్‌కు ఆప్యాయంగా ప్రత్యేక ఆహ్వానం అందిస్తారు. ఇక సీనియర్లను పునీత్ గౌరవించే తీరు చూస్తే ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ఒక కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ, ఆఖరికి బాలీవుడ్‌లోనూ పునీత్‌కు మంచి స్నేహితులు ఉన్నారు. విమర్శలు లెక్కచేయడు అన్ని భాషల్లోలాగే.. మిగతా భాషల్లోనూ మిగతా హీరోల్లాగే పునీత్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. సినిమాల్లోకి రాకముందు.. సినిమాల్లోకి వచ్చాక.. నెపోటిజం దగ్గరి నుంచి బాడీ షేమింగ్ దాకా ఎన్నింటినో చిరునవ్వుతో దాటేశాడు. సినిమాలపైనా, వ్యక్తిగత విమర్శలపై ఏనాడూ అతిగా ఆయన స్పందించింది లేదు. కన్నడ సోదరసోదరీమణులు అప్పూ అని పిల్చుకునే పునీత్.. శాశ్వతంగా దూరమైనా ఆయన సినిమాలు, వేల మందికి అందుతున్న సాయం రూపంలో నిత్య సజీవుడిగా ఉంటాడు. ఆ అభిమానం అలాంటిది మరి. మార్చి 17న కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ 47వ జయంతి సందర్భంగా.. -
Silk Smitha: సిల్క్ స్మిత గురించి ఈ విషయాలు తెలుసా?
Silk Smitha Birth Anniversary Special Story: సిల్క్ స్మిత అసలుపేరు విజయలక్ష్మీ. 1960 డిసెంబర్2న ఏలూరులో జన్మించిన ఆమె నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్లకే పెళ్లి చేసేశారు. అయితే భర్త, అత్తమామలు వేధింపులతో ఇల్లు వదిలి పారిపోయింది. నటనపై ఉన్న ఇష్టంతో మద్రాసుకి వెళ్లి తొలుత టచప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ‘ఘరానా గంగులు’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. చదవండి: Silk Smitha: సిల్క్‌స్మిత మరణం.. ఇప్పటికీ ఓ మిస్టరీనే! ఎన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…”సాంగ్‌లో నర్తించిన సిల్క్..ఆ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. మత్తు కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కి హాట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఆ సమయంలోనే ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సిల్క్‌స్మిత చనిపోయి నేటికి 25ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ అభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటున్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. -
చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్
Actor Uttej Very Emotional Words About His Wife: ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 13న ఆమె మృతి చెందారు. ఆ సమయంలో ఉత్తేజ్ భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఉత్తేజ్‌ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం కంటతడి పెట్టుకున్నారు. నేడు(నవంబర్ 24) పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను తలచుకుంటూ.. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
భయపడితే... చూపుడువేలైనా బెదిరిస్తుంది!
1975 జూన్ రోజులు. ఆనాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఎమ ర్జెన్సీలో భాగంగా పత్రికా వార్తలపై సెన్సార్షిప్ మొదలైంది. వాటితో పాటే నా కార్టూన్లూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ పర్యవేక్షణ క్రింద ఉంచబడ్డాయి. నేను నా తెలివి తేటలు ఉపయోగించి అరటి తొక్క మీద కాలు వేసి జారిపోయే ముతక హాస్యము, చీరల కొట్టులో మహిళామణుల బేరసారాల వెకిలి హాస్యాల కార్టూన్లు కొన్ని పట్టుకుని సరాసరి ప్రధా నిని కలిశా. ఈ సెన్సార్షిప్ నుంచి నాకు మినహా యింపు ఇవ్వమని కోరుకున్నాను. ఆవిడ చాలా ఓపిగ్గా ఈ అప్పడాల కర్ర కార్టూన్లు అన్ని పరిశీ లించి నా కార్టూన్లు బొత్తిగా నిరపాయకరమనీ, నేను కార్టూన్లను పత్రికలో నిరభ్యంతరంగా ప్రచు రించుకోవచ్చనీ అభయం ఇచ్చారు. ఢిల్లీ నుండి బొంబాయికి తిరిగి రాగానే నేను ప్రధానమంత్రి ముందు ఒలకబోసిన దొంగ వేషం కట్టిపెట్టి ఒకటీ రెండు రోజులు అప్పడాల కార్టూన్లు వంటివి వేసినా, 3వ రోజునుండి నా అసలు రంగు చూపిం చడం మొదలు పెట్టాను. మొదట కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే కార్టూనులు, ఆ పై ఎమర్జెన్సీని తూర్పారపట్టే కార్టూనులు... ఒకదాని తరువాత మరొకటిగా నిప్పు రగిలిస్తున్నా. చండీగఢ్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ప్రారంభమైన రోజున టైమ్స్ మొదటి పేజీలో కాంగ్రెస్ అధ్యక్షుడు దేబ్ కాంత్ బరూవా – ఎమర్జెన్సీలను కలిపి కార్టూన్ అచ్చయింది. బరువాకు కార్టూన్ సెగ బాగా తగిలింది. వీసీ శుక్లా అప్పుడు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. బరువా, శుక్లాని తన దగ్గరికి పిలిపించుకుని నా కార్టూన్ చూపించి నానా చీవాట్లు పెట్టారు. శుక్లా సరాసరి ఢిల్లీ నుండి బొంబాయి వచ్చారు నా సంగతి కనుక్కోడానికి! కట్ చేస్తే శుక్లా బసచేసిన తాజ్ హోటల్ సూట్లో నేను ఉన్నాను. హలో, హాయ్, నమస్తే వంటి పరామర్శ ఏమీ లేదు. కనీసం నన్ను కూచో మని అన్నది కూడా లేదు. ఒకే మాట ‘ఇంకోసారి ఇటువంటి పిచ్చి గీతలు గీస్తే నిన్ను అత్తారింటికి పంపిస్తా ఏమనుకుంటున్నావో... గెటవుట్’ చూపుడు వేలు ఆడిస్తూ శుక్లా పరమక్రూరంగా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నాకు భయం వేసింది, దుఃఖం అనిపించింది, అవమానంగా ఉంది, కడుపు రగిలిపోతోంది. ఇంటికి తిరిగి రాగానే నా భార్య కమలని పిలిచి విషయం చెప్పాను: ‘ఈ పొలిటికల్ కార్టూనింగ్ పనంటూ చేస్తే వెన్నెముక విరుచుకుని పనిచేయాలి, లేదా అసలు ఈ పనే చేయకూడదు, ఇప్పుడు అదే దశ వచ్చింది. నేను ఇక ఈ ఉద్యోగం చేయను, రాజీనామా ఇచ్చేస్తాను’. మా ఆవిడ తెగ సంతోష పడింది. ‘ఎందుకులెద్దూ వెధవ లంపటమూ, ముప్ఫయ్ ఏళ్ళు చేశారు. ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. హమ్మయ్య!’ సాయంకాలం ఆఫీస్‌కు వెళ్ళి దీర్ఘకాలిక సెల వుకు దరఖాస్తు చేశాను. అక్కడి నుండి సరాసరి ఒక ట్రావెల్ ఏజన్సీకి వెళ్ళి మా దంపతులిరువురి పేరిట మారిషస్‌కు టిక్కెట్లు కొన్నాము. మూడు వారాల పాటు అక్కడ ఉండాలనేది మా ఆలోచన. ఆ దీవిలో ఆ సముద్ర తీరాన బేఫికర్‌గా జీవితాన్ని అస్వాదిం చాము. అక్కడి విదేశీయులు నా భార్య కమల చీర కట్టు గురించీ, నుదుటన దాల్చిన సిందూరం గురించీ ప్రశ్నలు అడగడమే తరువాయి ‘మా దేశం, మా ప్రాచీన సంస్కృతి, మా సంప్రదాయం’ అంటూ రొమ్ము విరుచుకుని వాళ్ళకు జవాబు ఇవ్వ డంలో గొప్ప ఆనందాన్ని పొందేవాణ్ణి. ఒకరోజు మా సాయంకాలపు వాహ్యాళి ముగించుకుని ఇసుక తీరంలోని ఒక కాటేజ్‌లో విశ్రాంతిగా కూర్చు న్నాము. మాకు సమీపంలో ఒక నల్లజాతీయుడు కూచుని ఉన్నాడు. మాకు మాటా మాటా కలిసింది. అతనికి లెబనాన్‌లో ఏదో ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఆయన నన్ను అడిగాడు: ‘ఇంతకూ మీరేం పని చేస్తారో చెప్పనే లేదు?’ ‘నేనా? వార్తా పత్రికలో పని చేస్తా, పాత్రికే యుణ్ణి.’ ‘ఓ పత్రికా పనా! గుడ్. అది చాలా గొప్ప వృత్తి, సంపాదకీయాలు అవీ రాస్తారా మీరు?’ ‘రాస్తాను.’ ‘మరి మీరిక్కడ సెలవులో ఉంటే అక్కడ మీ పత్రికలో సంపాదకీయాలు ఎలా రాస్తారు? అది చాలా ముఖ్యమైన పని కదా?’ ‘మహాశయా! నేను వ్రాయను, నేను కార్టూన్లు గీస్తాను.’ ‘కార్టూన్లా! అంటే వ్యంగ్య చిత్రాలు! అబ్బో, అది చాలా అద్భుతమైన కళ, ఇంతకు మీరు ఏ పత్రికలో పని చేస్తారో?’ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా.’ ‘నాకు తెలుసుగా ఆ పత్రిక! మీ పేరు?’ ‘లక్ష్మణ్’ ‘వావ్! యూ సెడ్ ఇటా?’ నేను అదిరి పోయాను. భారత దేశానికి అయిదు వేల మైళ్ల దూరంలోని ఒక ప్రదేశంలో, అటు ఆ దేశానికీ, ఇటు ఈ దేశానికీ చెందని ఒక వ్యక్తి నోటి నుండి నేను రోజూ వేసే కార్టూన్ శీర్షిక, అతని యాసలో! ‘మీకు ఎలా తెలుసు?’ ‘లెబనాన్‌లో మీ దేశపు రాయబారి ఎల్కే సింగ్ ఉంటారు. అతనికి, నాకు పరిచయం. నేను అతని వద్దకు వెళ్లినప్పుడల్లా మీ కార్టూన్లు చూపిస్తారు. చూపిస్తూ ఇలా అంటారు: ‘‘చూశావా! మా ప్రజా స్వామ్యం గొప్పతనం! మా దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, పత్రికా స్వేచ్ఛకు మాత్రం అడ్డం లేదు. అక్కడ మా కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఎమర్జెన్సీలో కూడా అక్కడి రాజకీయ నాయకుల డొక్క చింపుతున్నాడు. ఆ నాయకులు కూడా ప్రజా స్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ కార్టూన్లని ప్రచురించ డానికి తల ఒగ్గి ఉన్నారు. అదీ మా దేశ మంటే! సారే జహా సే అచ్ఛా’. దేవుడా! బహుశా ఆ కార్టూన్లు నేను దేశం వదిలి వచ్చేముందు గీసినవి అయి ఉంటాయి. వాటి ఆధారంగా పరాయి దేశంలో మా పత్రికా స్వేచ్ఛని, మా కార్టూనిస్టుల పదును నైజాన్ని, నా దేశపు ప్రజాస్వామ్యపు స్వేచ్ఛని నిరూపించడానికి దేశం కాని దేశంలో వాటిని భద్రంగా ఉపయోగి స్తున్నారు. ఇక్కడ ఒక విదేశీయుడు వాటి ఆధా రంగా మమ్మల్ని, మా ధైర్యాన్ని గానం చేస్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఒక చూపుడు వేలు బెదిరింపు నకు వణికిపోయి ఇక్కడికి వచ్చి కూచున్నాను. లేచి నిలబడి బట్టలకంటిన ఇసుక దులుపుకొన్నాను. కమల అడిగింది: ‘ఎక్కడికి, హోటల్ రూం కా?’ ‘కాదు, సెలవు ముగిసింది, వెళ్ళి ఇక కార్టూన్లు వేయాలి.’ – ఆర్కే లక్ష్మణ్ అంతరంగ కథనం: అన్వర్ (ఇండియన్ పొలిటికల్ కార్టూన్ అంటే ప్రపంచమంతా తలతిప్పి ఆర్ కే లక్ష్మణ్ అనే సంతకం వైపు చూస్తుంది. అక్టోబర్ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ శతజయంతి) -
ఇంతకంటే మంచి సమయం లేదు..ఇది మన కల: మేఘనా రాజ్
సాక్షి, ముంబై: నటి మేఘనా రాజ్ తాను మళ్లీ నటించబోతున్నట్టు ప్రకటించింది. మేఘనా భర్త, దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సన్నిహితుడు పన్నగా భరణ నిర్మిస్తున్న సినిమా ద్వారా మళ్లీ మూవీల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ అక్టోబర్ 17, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పన్నగ భరణ, నూతన దర్శకుడు విశాల్‌తో చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘనా లీడ్ రోల్లో నటించనుంది. చదవండి: Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత ఈ రోజు నీ పుట్టిన రోజు, ఇది మన కల... ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు అంటూ తన భర్త రెండో జయంతిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది మేఘనా. మన కలని బహుమతిగా ఇచ్చేందుకు ఇంతకంటే మంచి టీం కూడా తనకు దొరకదని ఆమె వ్యాఖ్యానించింది. అంతేకాదు నిర్మాత పన్నగా లేకపోతే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించనని కూడా తెలిపింది. కాగా మేఘన భర్త, కన్నడ హీరో చిరు సర్జా 2020, జూన్ 7న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా గత నెలలో తన కొడుకు పేరును రాయన్ రాజ్ సర్జాగా రివీల్ చేసింది. అంతేకాదు కొడుకుతో కలిసి జరుపుకున్న దసరా వేడుకల ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. మరోవైపు అక్టోబర్ 22 న రాయన్ ఫస్ట్ బర్తడే జరుపుకోనున్నాడు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
‘దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశం బలోపేతానికి అబ్దుల్‌కలాం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం 90వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ‘దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు అబ్దుల్‌కలాం కృషి చేశారు. దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. मिसाइल मैन के रूप में विख्यात देश के पूर्व राष्ट्रपति डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर सादर नमन। उन्होंने अपना जीवन भारत को सशक्त, समृद्ध और सामर्थ्यवान बनाने में समर्पित कर दिया। देशवासियों के लिए वे हमेशा प्रेरणास्रोत बने रहेंगे। pic.twitter.com/Pn2tF73Md6 — Narendra Modi (@narendramodi) October 15, 2021 -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
Allu Ramalingaiah Statue: లెజెండరీ నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో అల్లు అర్జున్,బాబీ, శిరీష్‌లు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్ చేస్తూ.. మా తాత, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఆయన మాకు ఎంతో గర్వ కారణం. అల్లు స్టూడియోస్ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ ఉంటారు అంటూ ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల Unveiled the statue of my grandfather Padmashri #AlluRamalingaiah garu in ALLU Studios on his birth anniversary today along with #AlluBobby & @AlluSirish . He was our pride and will continue to be a part of our journey at Allu studios . pic.twitter.com/UHMZYvgiC3 — Allu Arjun (@alluarjun) October 1, 2021 -
జక్కంపూడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో జక్కంపూడి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. సీఎంతోపాటు.. రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, తదితరాలు కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/X53DGY1Qjd — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 6, 2021 -
PV Narasimha Rao: విదేశాంగ విధానంలో వాస్తవికత తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశాంగ విధానంలో వాస్తవికతను తెరపైకి తెచ్చిన ఘనత పీవీ నర్సింహారావుకు దక్కుతుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కొనియాడారు. ఇరుగు, పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన విశేష కృషి చేశారని ప్రశంసించారు. దేశ ప్రజల వాస్తవిక పరిస్థితులు, ప్రత్యేక స్వభావం, వారి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, పేదలు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సోమవారం గాంధీభవన్ నుంచి వర్చువల్ విధానంలో జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రులు మల్లికా ర్జున ఖర్గే, పల్లంరాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. పీపీ సంస్కరణలతో సుదీర్ఘ కాలం మేలు ముఖ్య అతిథిగా హాజరైన మన్మోహన్సింగ్ మాట్లాడుతూ పీవీ నాయకత్వంలోనే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక మార్పులు, సంస్కరణలు వచ్చాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలితాలు సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రజలకు మేలు చేయనున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో కలిపే విధంగా ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని పీవీ తీసుకువచ్చారని చెప్పారు. ఆయన హయాంలోనే ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, బాలిస్టిక్ క్షిపణిల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, దార్శనికతతో శాస్త్ర, సాంకేతిక రంగాలను సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించిన ఘనుడు పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ కె.శ్రీనాథరెడ్డికి అందజేశారు. వైద్య రంగంలో శ్రీనాథరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇవ్వడం సముచితమని మన్మోహన్ పేర్కొన్నారు. పీవీ సోదరుడు మనోహర్‌రావుకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వినోద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఎ.మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ నేతలు వేణుగోపాల్, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నిరంజన్, బొల్లు కిష న్, నగేశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
‘దాశరథి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం’
సాక్షి, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా అధికారికంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాశరథి అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తుందని చెప్పారు. -
విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం
‘‘విజయనిర్మల ఐదారు సినిమాల్లో నటించాక డైరెక్ట్ చేస్తానంది.. వంద సినిమాల్లో నటించి, ఆ తర్వాత డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నాను. ఆమె అలానే చేసింది’’ అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ– విజయనిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినీరెడ్డికి నటుడు కృష్ణంరాజు, హీరో మహేష్‌బాబు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి మలయాళ సినిమా ‘కవిత’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో తీసిన ‘మీనా’ వందరోజులు ఆడింది. మొత్తం 46 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలకి దర్శకత్వం వహించడం ఓ చరిత్ర’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. మహేష్ బాబు మాట్లాడుతూ– ‘‘నా సినిమాల మొదటి ఆట చూసి నాన్నగారు నాతో మాట్లాడేవారు. తర్వాత విజయనిర్మలగారు మాట్లాడి అభినందనలు చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు అభినందించారు.. తర్వాత ఆవిడ మాట్లాడబోతుందనుకుని వెంటనే ‘ఆమె లేరు కదా’ అనే విషయాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. ‘‘మా అమ్మ పేరున నటీనటులకు ప్రతి సంవత్సరం అవార్డు అందించనున్నాం’’ అన్నారు నరేష్ విజయకృష్ణ. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
సింగపూర్‌లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
సింగపూర్ : తొలి తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్‌లో ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని, సామూహికంగా సంకీర్తనలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి, అన్నమయ్య, ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శోభారాజు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజానికి ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిథిగా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం, మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేశామని వివరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలిలో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య, గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్, దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు. -
శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా నంద్యాల ఎమ్మెల్యే, భర్త భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు శోభా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవీ కళ్యాణ మండపంలో నేత్ర, రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది రక్త దాతలు, అభిమానుల, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో పాటు అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు.