గూగుల్.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ పుట్టి నేటికి 25 ఏళ్లు. 25ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజీలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గూగులమ్మ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
♦1996 లో లారీపేజ్, సెర్జీ బ్రెయిన్‌లు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆ సమసయంలో ప్రాజెక్ట్ నిమిత్తం ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు.
♦అన్నట్లు గూగుల్ మొదటి పేరు ‘బ్యాక్‌రబ్’
♦సెర్చ్ ఇంజిన్‌లో మొదట వెబ్ పేజీల ప్రాముఖ్యత ఎలా ఉందని తెలుసుకునే వారు. ఇందుకోసం ఒక వెబ్ పేజ్ నుంచి మరో వెబ్ పేజీకి లింక్‌లను జత చేసేవారు. అలా మొదటగా గూగుల్‌కు బదులు బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు.
♦ఆరు ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా సెంటర్‌లు ఉన్నాయి.
♦గూగుల్ సెకనులో అంచనా ప్రకారం దాదాపు రూ. 9,40,000 రూపాయలు సంపాదిస్తుంది.
♦ లారీ పేజ్,సెర్గీ బ్రిన్‌లు స్థాపించారు.
♦ గత 12 (2021 డేటా ప్రకారం) ఏళ్లలో గూగుల్ 827 కంపెనీలను కొనుగోలు చేసింది. గూగుల్ సంస్థ ఎంత పెద్దదో ఇప్పుడు మీరు ఊహించవచ్చు.
♦ గూగుల్‌లో 420000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఇప్పుడు అనేక మంది కుబేరులుగా అవతరించారు.
♦ గూగుల్ ఖచ్చితంగా ఎంత సంపాదిస్తుంది అనేది స్పష్టత లేదు. కానీ గూగుల్ వార్షిక ఆదాయం సుమారు 55,00,00,00,000,000,000,000,000 డాలర్లు.
♦ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్ తయారు చేసింది. అయితే ప్రతి 5 స్మార్ట్‌ఫోన్‌లలో 4 ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై మాత్రమే పనిచేస్తాయని మీకు తెలుసా?
♦గూగుల్ హెడ్ ఆఫీస్‌లో 20,000 మేకలకు ఉద్యోగం కల్పించింది. అవును ఇది నిజమే. ఆఫీస్ క్యాంపస్‌లో గడ్డిని తొలగించేందుకు మెషిన్‌ని (మొవర్)ఉపయోగించదు. ఎందుకంటే? మొవర్‌తో దుమ్ము లేస్తుంది. ఉద్యోగులు పనిచేసే సమయంలో సౌండ్ వస్తుందని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. మేకలకు ఉద్యోగం అంటే జీతం ఇస్తుందా? అని మాత్రం అనుకోకండి. వాటి పోషణ, ఆరోగ్యానికి అయ్యే ఖర్చులన్నీ సంస్థే భరిస్తుంది.
♦ ప్రతి వారం 220,000 కంటే ఎక్కువ మంది గూగుల్‌లో ఉద్యోగం కోసం అప్లయ్ చేస్తుంటారు.
♦ గూగుల్ తన సంపాదనలో మొత్తం 95 శాతం యాడ్స్ నుంచే వస్తుంది.
♦ నమ్మండి.. రెప్పపాటులో గూగుల్ రూ. 5.5కోట్లు సంపాదిస్తుందని అంచనా .
♦ ‘గూగుల్’ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి 1 తర్వాత 100 సున్నాలను ఉంచడం ద్వారా ఏర్పడే సంఖ్యను ‘గూగోల్’ అని పిలుస్తారు. ఈ పదం నుంచి గూగుల్ పుట్టింది.
♦ అలాంటప్పుడు ‘గూగుల్‌కు’ బదులు ‘గూగోల్’ అని పెట్టొచ్చుకదా అని మీరు అనుకోవచ్చు. నిజానికి ‘గూగుల్’ అనే పేరు స్పెల్లింగ్ మిస్టేక్. ఓ ఉద్యోగి టైపింగ్‌లో చేసిన తప్పిదం వల్ల గూగోల్ కాస్త గూగుల్‌గా మారింది.
♦ గూగుల్ 2006లో ‘యూట్యూబ్’ని కొనుగోలు చేసింది, ఆ సమయంలో చాలా మంది ఈ ఒప్పందాన్ని గూగుల్ తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు. కానీ యూట్యూబ్‌ని నేడు ప్రతి నెల 6 బిలియన్ గంటల పాటు వీక్షిస్తున్నారు.
♦ గూగుల్‌లో ప్రతి సెకనుకు 60 వేల కంటే ఎక్కువ సెర్చ్‌లు జరుగుతాయి.
♦ 2010 నుండి గూగుల్ కనీసం వారానికి ఒక కంపెనీని కొనుగోలు చేసింది.
♦ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ కోసం 80 లక్షల 46 వేల కిలోమీటర్ల రహదారికి సమానమైన ఫోటోలను తీసింది.
♦ గూగుల్ మొత్తం సెర్చ్ ఇంజిన్ స్టోరేజ్ 100 మిలియన్ గిగాబైట్‌లు. మీ వద్ద అంత డేటాను సేవ్ చేయడానికి, ఒక టెరాబైట్ లక్ష డ్రైవ్‌లు అవసరం.
♦ యాహూ కంపెనీ గూగుల్‌ను ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని భావించింది కానీ అది జరగలేదు.
♦ గూగుల్ ప్రారంభించబడినప్పుడు, గూగుల్ వ్యవస్థాపకుడికి హెచ్‌టీఎంఎల్ కోడ్ గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే అతను గూగుల్ హోమ్‌పేజీని చాలా సింపుల్‌గా డిజైన్ చేశారు.
♦ 2005లో, గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ వంటి కొత్త అప్లికేషన్‌లను ప్రారంభించింది. ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక క్షణంలో కొలవగలదు.
♦ గూగుల్ అనధికారిక స్లోగన్ ఏంటంటే? ‘చెడుగా ఉండకు’
♦ గూగుల్ హోమ్‌పేజీలో 88 భాషలను ఉపయోగించుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment