Search Engine
-
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్‌కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్‌జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్‌తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్‌తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్‌లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్‌జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్‌కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్‌లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్‌కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్‌కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్‌లో అధికంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్‌కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్‌ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్‌కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్‌లో గూగుల్‌తో పోటీపడుతున్న బింగ్‌ను యాపిల్ డిఫాల్ట్‌బ్రౌజర్‌గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్‌ను డిఫాల్ట్‌గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్‌కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
గూగుల్ గుత్తాధిపత్యం..డీఫాల్ట్ సెర్చింజన్ కోసం 28 బిలియన్ డాలర్లు ఖర్చు
సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై యూఎస్ ప్రభుత్వం, గూగుల్ మధ్య యాంటీట్రస్ట్ కేసు కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా మొబైల్స్, వెబ్బ్రౌజర్లలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఉంచేందుకు 2021లో ఆ సంస్థ పలు కంపెనీలకు 26.30 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..డీఫాల్ట్ సెర్చింజన్ స్టేటస్ కోసం గూగుల్ చెల్లింపులు 2014 నుంచి ముడింతలు పెరిగాయని గూగుల్ సెర్చ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభాకర్ రాఘవన్ ఇదే విషయాన్ని తెలిపారు. సెర్చ్ యాడ్స్ ద్వారా గూగుల్‌కి 2021లో 146.4బిలియన్ డాలర్లు రెవెన్యూ వచ్చిందని..అందులో ఎక్కువ మొత్తం డీఫాల్ట్ సెట్టింగ్ కోసమే ఖర్చవుతున్నట్లు చెప్పారంటూ నివేదించింది. అయితే, ఈ విచారణ సందర్భంగా.. ఆదాయ వాటా, ఒప్పందాలు, చట్టబద్ధమైనవని గూగుల్ తెలిపింది. సెర్చింగ్, అడ్వటైజింగ్ విభాగంలో పెరిగిపోతున్న పోటీని తట్టుకునేలా పెట్టుబడి పెట్టినట్లు వాదించింది. ప్రజలు డిఫాల్ట్ సెర్చింజిన్ పట్ల అసంతృప్తిగా ఉంటే, వారు మరొక సెర్చ్ ప్రొవైడర్ మార్చుకోవచ్చు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో ఇలా చెల్లింపులకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో తాము కుదుర్చుకునే కాంట్రాక్టులపై ప్రభావం చూపుతుందని గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోర్టు మాత్రం ఆ వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతంది. -
ఒకే నెలలో 40లక్షల వీడియోలు డిలీట్..కారణం అదేనా..
మనదేశంలో టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే యురోపియన్ యూనియన్‌లో మాత్రం సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. సెప్టెంబరులో యూరప్‌లో 40లక్షల వీడియోలను తొలగించినట్లు కంపెనీ అక్టోబరు 25న తెలిపింది. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. యురోపియన్ యూనియన్‌లో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సేవల చట్టం(డీఎస్ఏ) ప్రకారం..ప్రధాన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకత నివేదికను అందించాలి. అందులో భాగంగా టిక్‌టాక్ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఆగస్టులో అమలులోకి వచ్చిన ఈచట్టం ద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజిన్లకు భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపెనీలకు కలిపి దాదాపు వాటి ప్రపంచ టర్నోవర్‌లో ఆరు శాతం వరకు జరిమానా వేసినట్లు తెలుస్తుంది. టిక్‌టాక్‌తోపాటు మరో 18 ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలు యూరప్‌లో వాటి నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నాయి. -
గూగుల్‌కు పాతికేళ్లు.. ఆ తప్పు వల్లే ఇవాళ ఇలా..
గూగుల్.. ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ పుట్టి నేటికి 25 ఏళ్లు. 25ఏళ్ల క్రితం సరిగ్గా ఈరోజు కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజీలో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గూగులమ్మ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ♦1996 లో లారీపేజ్, సెర్జీ బ్రెయిన్లు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఆ సమసయంలో ప్రాజెక్ట్ నిమిత్తం ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ♦అన్నట్లు గూగుల్ మొదటి పేరు ‘బ్యాక్‌రబ్’ ♦సెర్చ్ ఇంజిన్‌లో మొదట వెబ్ పేజీల ప్రాముఖ్యత ఎలా ఉందని తెలుసుకునే వారు. ఇందుకోసం ఒక వెబ్ పేజ్ నుంచి మరో వెబ్ పేజీకి లింక్‌లను జత చేసేవారు. అలా మొదటగా గూగుల్‌కు బదులు బ్యాక్ రబ్ అని పేరు పెట్టారు. ♦ఆరు ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా సెంటర్లు ఉన్నాయి. ♦గూగుల్ సెకనులో అంచనా ప్రకారం దాదాపు రూ. 9,40,000 రూపాయలు సంపాదిస్తుంది. ♦ లారీ పేజ్,సెర్గీ బ్రిన్లు స్థాపించారు. ♦ గత 12 (2021 డేటా ప్రకారం) ఏళ్లలో గూగుల్ 827 కంపెనీలను కొనుగోలు చేసింది. గూగుల్ సంస్థ ఎంత పెద్దదో ఇప్పుడు మీరు ఊహించవచ్చు. ♦ గూగుల్‌లో 420000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఇప్పుడు అనేక మంది కుబేరులుగా అవతరించారు. ♦ గూగుల్ ఖచ్చితంగా ఎంత సంపాదిస్తుంది అనేది స్పష్టత లేదు. కానీ గూగుల్ వార్షిక ఆదాయం సుమారు 55,00,00,00,000,000,000,000,000 డాలర్లు. ♦ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్ తయారు చేసింది. అయితే ప్రతి 5 స్మార్ట్ఫోన్లలో 4 ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై మాత్రమే పనిచేస్తాయని మీకు తెలుసా? ♦గూగుల్ హెడ్ ఆఫీస్‌లో 20,000 మేకలకు ఉద్యోగం కల్పించింది. అవును ఇది నిజమే. ఆఫీస్ క్యాంపస్‌లో గడ్డిని తొలగించేందుకు మెషిన్ని (మొవర్)ఉపయోగించదు. ఎందుకంటే? మొవర్తో దుమ్ము లేస్తుంది. ఉద్యోగులు పనిచేసే సమయంలో సౌండ్ వస్తుందని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. మేకలకు ఉద్యోగం అంటే జీతం ఇస్తుందా? అని మాత్రం అనుకోకండి. వాటి పోషణ, ఆరోగ్యానికి అయ్యే ఖర్చులన్నీ సంస్థే భరిస్తుంది. ♦ ప్రతి వారం 220,000 కంటే ఎక్కువ మంది గూగుల్‌లో ఉద్యోగం కోసం అప్లయ్ చేస్తుంటారు. ♦ గూగుల్ తన సంపాదనలో మొత్తం 95 శాతం యాడ్స్ నుంచే వస్తుంది. ♦ నమ్మండి.. రెప్పపాటులో గూగుల్ రూ. 5.5కోట్లు సంపాదిస్తుందని అంచనా . ♦ ‘గూగుల్’ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందని మీరెప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి 1 తర్వాత 100 సున్నాలను ఉంచడం ద్వారా ఏర్పడే సంఖ్యను ‘గూగోల్’ అని పిలుస్తారు. ఈ పదం నుంచి గూగుల్ పుట్టింది. ♦ అలాంటప్పుడు ‘గూగుల్‌కు’ బదులు ‘గూగోల్’ అని పెట్టొచ్చుకదా అని మీరు అనుకోవచ్చు. నిజానికి ‘గూగుల్’ అనే పేరు స్పెల్లింగ్ మిస్టేక్. ఓ ఉద్యోగి టైపింగ్‌లో చేసిన తప్పిదం వల్ల గూగోల్ కాస్త గూగుల్‌గా మారింది. ♦ గూగుల్ 2006లో ‘యూట్యూబ్’ని కొనుగోలు చేసింది, ఆ సమయంలో చాలా మంది ఈ ఒప్పందాన్ని గూగుల్ తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు. కానీ యూట్యూబ్‌ని నేడు ప్రతి నెల 6 బిలియన్ గంటల పాటు వీక్షిస్తున్నారు. ♦ గూగుల్‌లో ప్రతి సెకనుకు 60 వేల కంటే ఎక్కువ సెర్చ్‌లు జరుగుతాయి. ♦ 2010 నుండి గూగుల్ కనీసం వారానికి ఒక కంపెనీని కొనుగోలు చేసింది. ♦ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ కోసం 80 లక్షల 46 వేల కిలోమీటర్ల రహదారికి సమానమైన ఫోటోలను తీసింది. ♦ గూగుల్ మొత్తం సెర్చ్ ఇంజిన్ స్టోరేజ్ 100 మిలియన్ గిగాబైట్లు. మీ వద్ద అంత డేటాను సేవ్ చేయడానికి, ఒక టెరాబైట్ లక్ష డ్రైవ్‌లు అవసరం. ♦ యాహూ కంపెనీ గూగుల్‌ను ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని భావించింది కానీ అది జరగలేదు. ♦ గూగుల్ ప్రారంభించబడినప్పుడు, గూగుల్ వ్యవస్థాపకుడికి హెచ్‌టీఎంఎల్ కోడ్ గురించి పెద్దగా అవగాహన లేదు. అందుకే అతను గూగుల్ హోమ్‌పేజీని చాలా సింపుల్‌గా డిజైన్ చేశారు. ♦ 2005లో, గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ వంటి కొత్త అప్లికేషన్లను ప్రారంభించింది. ఇది మొత్తం ప్రపంచాన్ని ఒక క్షణంలో కొలవగలదు. ♦ గూగుల్ అనధికారిక స్లోగన్ ఏంటంటే? ‘చెడుగా ఉండకు’ ♦ గూగుల్ హోమ్‌పేజీలో 88 భాషలను ఉపయోగించుకోవచ్చు! -
కంప్యూటర్ సైన్స్‌లో ఫెయిల్.. పట్టుదలతో గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ని నెలకొల్పాడు
స్కూల్ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిలైన ఏకైక విద్యార్థికి సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదల పెరిగితే ఎలా ఉంటుంది? అచ్చం... అభిక్ సాహ లా ఉంటుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన అభిక్ సాహ పదిహేను సంవత్సరాల వయసులోనే దేశీ సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేసి భేష్ అనిపించుకున్నాడు. స్నేహితుడు హర్షిత్ జైన్‌తో కలిసి మొదలు పెట్టిన డీ సెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ గేమ్’ విజయపథంలో దూసుకుపోతోంది. కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన ఏకైన విద్యార్థి అభిక్ సాహ. అది తనపై బలమైన ప్రభావం చూపించింది. సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదలను పెంచింది. కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్‌గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు.ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ సాఫ్ట్వేర్ నుంచి వెబ్సైట్ బ్లాకింగ్ వరకు ఎన్నో విషయాలపై పట్టు సాధించాడు. పదమూడవ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి తనకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రపంచ సాంకేతికతపై అవగాహన పెంచుకోవడానికి, రకరకాల మొబైల్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగపడింది. పదిహేను సంవత్సరాల వయసులో వినూత్నమైన దేశీ సెర్చ్ ఇంజిన్ ‘ఒరిగాన్’ను డెవలప్ చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చి ‘భేష్’ అనిపించుకున్నాడు అభిక్ సాహ. పశ్చిమబెంగాల్లోని చల్స పట్టణానికి చెందిన సాహ హైస్కూల్ రోజుల్లోనే మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్ బిల్డింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డెవలపింగ్ లాంగ్వేజిలపై ఉచిత వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడంలో తలమునకలై ఉండేవాడు. ఇండియన్ ఇ–స్పోర్ట్స్ వృద్ధిరేటు ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉందని, 2027 కల్లా భారీ వృద్ధిరేటు కనిపిస్తుందని కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) రిపోర్ట్ తెలియజేస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రకరకాల టోర్నమెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. మన దేశంలో ఇ–గేమ్స్‌కు పెరుగుతున్న పాపులారిటీని గమనించి హర్షిత్ జైన్, అభిక్ సాహ డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’ ప్రారంభించారు. దీన్ని ‘నెక్ట్స్ బిగ్ వోటీటీ’ లక్ష్యంగా మొదలు పెట్టారు. గేమ్ ఆడాలనే ఉత్సాహం ఒక కోణం అయితే ఖర్చును దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండడం మరో కోణం. పీసీ, కీబోర్డ్, హై–కంప్యూటింగ్ సీపీయూ సెటప్ వరకు ఎంతో ఖర్చు అవుతుంది. అయితే క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోన్లీ ప్లే’తో యూజర్లు మంత్లీ ప్లాన్ రూ.499 ద్వారా డిఫరెంట్ స్టోర్స్ నుంచి ఎన్నో టైటిల్స్‌తో యాక్సెస్ కావచ్చు. హై ప్రాసెసింగ్ సీపీయూలాంటి అడ్వాన్స్డ్ గేమింగ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు. యూజర్స్ తమ దగ్గర ఉన్న ఏ డివైజ్ ద్వారా అయినా గేమ్స్‌తో యాక్సెస్ కావచ్చు.‘ఒక విధంగా చెప్పాలంటే ఇది సైబర్ కేఫ్లాంటిది అనుకోవచ్చు. నిర్ణీతమైన టైమ్‌కు కొంత డబ్బు చెల్లించి ఇంటర్నెట్తో యాక్సెస్ కావడంలాంటిది’ అంటాడు కంపెనీ కో–ఫౌండర్, సీయివో హర్షిత్ జైన్. బేరింగ్ క్యాపిటల్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ ‘వోన్లీ ప్లే’కు సీడ్ ఫండింగ్ చేశాయి. కునాల్ షా, సూరజ్ నళిన్, అమృత్ శ్రీవాస్తవ, జితేంద్ర గుప్తా ఏంజెల్ ఇన్వెస్టర్లు. గత నెలలలో అధికారికంగా లాంచ్ అయిన ‘వన్ ప్లేయర్’కు 27,000 రిజిస్టర్డ్ యూజర్లు, 5,000 ప్లేయింగ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు క్లౌడ్‌లో ప్రతీది చేయవచ్చు. ఉదాహరణకు 3డీ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేయడంలాంటివి’ అంటున్నాడు కంపెనీ కో–ఫౌండర్, సీటీవో అభిక్ సాహ. -
కొత్తగా ఎర్నీ బాట్!
హాంకాంగ్: మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకొచ్చిన కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి పోటీగా చైనా సెర్చ్ ఇంజిన్ బైదూ కొత్తగా ఏఐ ఆధారిత చాట్‌బాట్ ‘ఎర్నీబాట్’ను గురువారం ఆవిష్కరించింది. అయితే, ఇది యూజర్లను నిరాశపర్చింది. ఎర్నీబాట్ సంపూర్ణమేమీ కాదని, ఇంకా మెరుగుపరుస్తామని బైదూ సీఈఓ రాబిన్ లీ చెప్పారు. ఎర్నీబాట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బైదూ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది. ఎర్నీబాట్ను ఉపయోగించుకొనేందుకు ఇప్పటిదాకా 650 కంపెనీలు ముందుకొచ్చాయని రాబిన్ లీ తెలిపారు. ఈ చాట్‌బాట్ మొదటి వెర్షన్‌ను 2019లో అభివృద్ధి చేశామన్నారు. -
అంతర్జాలంలో ‘కృత్రిమ’ యుద్ధం
సాంకేతిక యుద్ధం ఇది. కృత్రిమ మేధ(ఏఐ)తో అంతర్జాలంలో టెక్ దిగ్గజాల మధ్య వచ్చిపడ్డ పోటీ ఇది. సరికొత్త ఏఐ ఛాట్‌బోట్ విపణిలో సంచలనాత్మక సంగతులివి. మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడి పెట్టిన ‘ఓపెన్ ఏఐ’ సంస్థ సృష్టి ‘ఛాట్ జీపీటీ’దే నేటిదాకా హవా. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్ తనదైన ఛాట్‌బోట్ ‘బార్డ్’ను తెస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కథ మలుపు తిరిగింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్ ఇంజన్‌గా మునుపటి తమ ‘బింగ్’ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. వెంటనే గూగుల్ సైతం సెర్చ్ ఇంజన్‌గా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొనేందుకు ఏఐ ఫీచర్లతో సై అంటోంది. వెరసి, అంతర్జాలంలో కృత్రిమ మేధ ఆధారంగా కనివిని ఎరుగని పోటాపోటీ వాతావరణం నెలకొంది. కృత్రిమ మేధతో సాగే ఈ పనిముట్లతో మానవాళికి కలిగే మేలు, కీడులపై చర్చ ఊపందుకుంది. సంక్లిష్ట అంశాల్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పడానికి కృత్రిమమేధతో నడిచే ఈ ఛాట్‌బోట్స్ ఉపకరిస్తాయన్నది ప్రాథమిక ఆలోచన. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘ఛాట్ జీపీటీ’ అలా నూత్నపథగామి అయింది. 2 నెలల్లో 10 కోట్ల యూజర్లతో సంచలనమైంది. శాన్ఫ్రాన్సిస్కోలో 375 మంది ఉద్యోగుల చిన్న స్టార్టప్ ‘ఓపెన్ ఏఐ’ 30 బిలియన్ డాలర్ల విలువైనదైంది. దీంతో, పోటీగా ‘బార్డ్’ను తేవడంలో గూగుల్ తొందరపడక తప్పలేదు. నిజానికి, గూగుల్ బృందపు ఆరేళ్ళ శ్రమ ఫలితం ‘బార్డ్’. తద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని సంభాషణల పద్ధతిలో జనానికి సులభంగా అందిస్తామన్నది గూగుల్ మాట. తీరా ప్రయోగదశలో ‘బార్డ్’కు బాలారిష్టాలు తప్పలేదు. గూగుల్ స్వీయ ప్రచార ప్రకటనలోనే ‘బార్డ్’ కొన్ని జవాబులు తప్పు చెప్పినట్టు ‘రాయిటర్స్’ వార్తాసంస్థ పట్టుకొనేసరికి గగ్గోలు మొదలైంది. ప్యారిస్‌లో ఆ సర్వీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే సంరంభానికి కొద్ది గంటల ముందే ఆ లోటుపాట్లు బయటపడ్డాయి. దీంతో ఒకపక్క మైక్రోసాఫ్ట్ షేర్ల ధరలు పెరిగితే, మరోపక్క గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు ఒక్క బుధవారమే 7.8 శాతం పడిపోయాయి. 100 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్ గురించి ‘బార్డ్’ తప్పు చెప్పడం ఒకరకంగా గూగుల్‌కు తలవంపులే. కాకపోతే, ఈ ఛాట్‌బోట్ సేవల్ని ఇంకా ప్రజా వినియోగానికి పెట్టలేదు గనక ఫరవాలేదు. అందు బాటులోకి తెచ్చే ముందు ప్రత్యేక పరీక్షకులతో క్షుణ్ణంగా పరీక్షలు జరిపిస్తామంటోంది గూగుల్. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్‌దే ఆధిపత్యం. ఏ సమాచారం కావాలన్నా ‘గూగులమ్మను అడుగు’ అనేది ఆధునిక జనశ్రుతి. ఈ ప్రాచుర్యంతో గూగుల్‌కు నిరుడు వాణిజ్య ప్రకటనల ద్వారా 100 బిలియన్ (10 వేల కోట్ల) డాలర్ల ఆదాయం వచ్చిపడింది. అయితే, ‘ఏఐ’ను ఆసరాగా చేసుకొని విజృంభిస్తున్న ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్‌తో గూగుల్ పీఠం కదులుతోంది. మైక్రోసాఫ్ట్ తమ సెర్చ్ ఇంజన్ ‘బింగ్’ను సైతం సరికొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్ది, గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వ నున్నట్టు ఈ వారమే యుద్ధభేరి మోగించింది. వెంటనే ఫిబ్రవరి 8న గూగుల్ సైతం జనరేటివ్ ఏఐ అనుసంధానిత ఫీచర్లతో తమ సెర్చ్ ఇంజన్ ఫలితాల్ని మెరుగుపరుస్తామని చెప్పాల్సి వచ్చింది. ‘బార్డ్’ను తెచ్చిన రెండ్రోజులకే గూగుల్ ఈ రెండో ప్రకటన చేయాల్సిరావడం గమనార్హం. అంతర్జాలంలో పెరుగుతున్న పోటీకీ, టెక్ దిగ్గజాల పోరుకూ ఇది దర్పణం. ఆధునిక ఏఐ సాంకేతికత ఆవిర్భావం, పోటాపోటీ ఒక రకంగా మంచిదైతే, మరోరకంగా చెడ్డది. అనేక ఇతర సాంకేతిక విప్లవాల లానే దీనివల్లా కొత్త ఉద్యోగాలొస్తాయి. కొన్ని పాతవి పోతాయి. ఏఐతో ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారులు సహా అనేక అంశాల్లో మానవ సామర్థ్యం పెరగవచ్చు. తరగతిలో వేర్వేరు అవగాహన స్థాయుల్లో పది మంది ఉంటే, ఒకే పాఠం ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి అర్థమయ్యేలా అందించడం లాంటి మామూలు మేళ్ళు సరేసరి. అయితే, సంభాష ణాత్మక ఛాట్‌బోట్ సర్వీస్‌లు సమస్యలకు సమాధానాలివ్వడంతో పాటు సొంతంగా కథలు, కవితలు అల్లగలగడం సృజనాత్మకతకూ సవాలే. ఇలా సమాజాన్నే మార్చేసే సవాలక్ష అంశాలతో తలెత్తే నైతిక, సామాజిక, తాత్త్విక ప్రశ్నలెన్నో. మానవజాతి మేలుకు వాడాల్సినదాన్ని దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం. దీనిపై ప్రపంచ వ్యాప్త పర్యవేక్షణ ఎలా అన్నది చూడాలి. సాక్షాత్తూ ‘ఛాట్ జీపీటీ’ సృష్టికర్తలే ప్రభుత్వాల నియంత్రణ కోరుకుంటూ ఉండడం గమనార్హం. వ్యాపార కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను జొప్పించడానికీ, తద్వారా ఉద్యోగుల స్థానంలో అవే పనిచేయడానికీ చాలాకాలమే పట్టవచ్చు. ఈలోగా గ్రంథచౌర్యాలు, తప్పుడు పరిష్కారాలు తలెత్తే ప్రమాదమైతే ఉంది. అందుకే, అమెరికాలో కొన్ని స్కూళ్ళలో ఛాట్ జీపీటీని నిషేధించారు. అయితే, కాలప్రవాహంలో ఏ సాంకేతిక పురోగతినైనా స్వాగతించాల్సిందే. అడ్డుకోవాలని చూస్తే ఆగదు, అందువల్ల ప్రయోజనమూ లేదు. దశాబ్దాల క్రితం కంప్యూటర్ విషయంలో భయపడడం లాంటిదే ఇదీ. కానీ, జీవితంలో భాగమయ్యే కొత్త సాంకేతికత సక్రమంగా, బాధ్యతాయుతంగా వినియోగమయ్యేలా చూసుకోవాలి. విలువలకు తిలోదకాలివ్వకుండా అప్రమత్తం కావాలి. ఇప్పటికే సమాజంలో డిజిటల్ విభజనతో పెరిగిపోతున్న అసమానతలకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచించాలి. యంత్రాన్ని సృష్టించిన మనిషికి, ఆ యాంత్రిక కృత్రిమ మేధే ప్రత్యామ్నాయం కావడం సమా జానికే సవాలన్నది నిజమే కానీ మనిషికి ఇవి మహత్తర క్షణాలు. టెక్నాలజీని మనిషి తీర్చిదిద్దితే, ఆ టెక్నాలజీయే మళ్ళీ మనిషిని తీర్చిదిద్దే కీలక ఘట్టం. వెల్కమ్ టు ది న్యూ ఏఐ వరల్డ్! -
స్తంభించిన గూగుల్ సేవలు..! ట్విట్టర్లో యూజర్ల అరాచకం..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేసే సమయంలో గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపిస్తుంది. ఇంటర్నల్ సర్వర్లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్‌కు మెయిల్స్ పెడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. గూగుల్ ట్రెండ్స్ విభాగం ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో బ్లాంక్ పేజ్ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అవి మీకోసం. everyone in the world running to twitter after using google : pic.twitter.com/c4OzMoCxc1 — Carla Ng (@cnntwlc) August 9, 2022 Me omw to twitter to check if google is down for anyone else since I cant google search it #googledown pic.twitter.com/g797tcAv1q — Ur mom (@bigfatBUSSY6) August 9, 2022 Me switching to twitter after experiencing error 500 in google#Google #googledown pic.twitter.com/hu4TMsB2K5 — 1038 (@remier_acbang) August 9, 2022 Se cayó Google alv xd pic.twitter.com/WO1HDNblta — Yisus Gonzalez🍀🚂🇲🇽🐉 (@YisusRGR) August 9, 2022 trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr — mou ☘️🌐 (@pxresouls) August 9, 2022 -
కొత్త బిజినెస్‌లోకి యాపిల్, గూగుల్ ఫ్యూచర్ ఏంటో!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా యాపిల్ సొంతంగా సెర్చ్ ఇంజిన్‌ను లాంచ్ చేయనుంది. అందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ సంస్థ ఐఫోన్‌తో స్మార్ట్ ఫోన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంటే.. వరల్డ్ వైడ్‌గా ఎన్ని సెర్చ్ ఇంజిన్లు ఉన్నా..సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్ సొంతంగా వెబ్ సెర్చ్ ఇంజిన్‌ను తయారు చేస్తుందని, త్వరలోనే విడుదల చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. యాపిల్ సెర్చ్ ఇంజిన్ విడుదల ఎప్పుడంటే యాపిల్ సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేస్తుందంటూ గతంలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ టెక్ బ్లాగర్ రాబర్ట్ స్కోబుల్ వరుస ట్విట్లతో హోరెత్తించాడు. కొత్త సెర్చ్ ఇంజిన్ త్వరలో రాబోతుంది. యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ 'సిరి' మరింత స్మార్ట్‌గా తయారవుతుందంటూ ట్విట్లలో హైలెట్ చేశాడు. తాజాగా రాబర్ట్ యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ -2023లో ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం తన సెర్చ్ ఇంజిన్‌ను విడుదల చేయనుందని ఊదరగొట్టేస్తున్నాడు. టెక్ రాడర్ సమాచారం ప్రకారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ-2022 లో అత్యంత ఖరీదైన ప్రొడక్ట్ ఇదేనని అన్నాడు. లేదంటే వచ్చే ఏడాది జనవరి నెలలో యాపిల్ కొత్త సెర్చ ఇంజిన్ గురించి ప్రకటన విడుదల కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
ఈ రేంజ్లో మైక్రోసాఫ్ట్‌కు అవమానం ఎప్పుడు జరగలేదనుకుంటా..!
మనలో ఏదైనా అంశంపై మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఏం..చేస్తాం..! సింపుల్‌గా ఒకే గూగుల్...అంటూ గూగుల్‌ను అని అడిగేస్తాం. మనలో చాలా మంది ఎక్కువగా గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజన్‌నే వాడుతుంటాం. క్రోమ్‌కు బదులుగా మరింత సెక్యూర్డ్ బ్రౌజింగ్ కోసం ఫైర్‌ఫాక్స్‌ను ఉపయోగిస్తాం. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రముఖమైనవి...గూగుల్ క్రోమ్, మోజిలా ఫైర్ ఫాక్స్, టార్, బింగ్, యాహూ. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! షాకిచ్చిన యూజర్లు...! తాజాగా మైక్రోసాఫ్ట్‌కు యూజర్లు భారీ షాకే ఇచ్చారు. ఆయా సెర్చ్ ఇంజన్స్ అప్పడప్పుడు ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు ఏంటని ఆయా సెర్చ్ ఇంజన్స్ ప్రకటిస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజన్ బింగ్ కూడా యూజర్లు ఎక్కువగా వెతికిన పదాలచిట్టాను విడుదలచేసింది. ఈ విషయంలో బింగ్‌కు భారీ షాకే తగిలింది. బింగ్ సెర్చ్ ఇంజన్‌ను వాడుతున్న యూజర్లు ఎక్కువగా గూగుల్‌ను సెర్చ్ చేసినట్లు తేలింది. దీంతో బింగ్‌ను అభివృద్ధి చేసిన మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా కంగుతింది. ఇదిలా ఉండగా సెర్చ్ ఇంజన్ ఎకోసిస్టమ్‌పై గూగుల్‌పై యూఎస్కోర్టులో పలు దావాలు నమోదైనాయి. గూగుల్ పలు ఈలీగల్ ప్రాక్టిసెస్ చేసినందుకుగాను ఈయూ కోర్టు కూడా భారీ జరిమానాలను విధించింది. సెర్చ్ ఇంజన్ విషయంలో..యూజర్లు ఎక్కువగా క్రోమ్నే కోరుకుంటున్నారు..వారిని ఏవరు బలవంతంగా ఆయా సెర్చ్ ఇంజన్‌నే వాడాలనే షరతును మేము ఏవర్నీకోరడం లేదంటూ గూగుల్ తన వాదనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది యూజర్లు గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను ఆదరిస్తున్నారని గూగుల్ పేర్కొంది. చదవండి: జీవితాంతం వర్చువల్‌గానే..! ఎక్కడనుంచైనా పనిచేయండి..!ఉద్యోగులకు బంపర్ఆఫర్..! -
ఐఫోన్లలో గూగుల్.. కళ్లు చెదిరే డీల్!
బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ‘డిఫాల్ట్’గా ఉంటుందని తెలిసిందే. ఇందుకోసం కొన్ని కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంటుంది గూగుల్. తాజాగా ఈ ఇంటర్నెట్ బ్రౌజింగ్ దిగ్గజం.. యాపిల్‌తో ఈ ఏడాది కోసం లక్షా పదివేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. 2021లో తయారైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ కోసం 15 బిలియన్ల డాలర్ల(లక్షా పదివేల కోట్లకు పైనే) ఒప్పందం చేసుకుంది గూగుల్. తద్వారా సఫారీ బ్రౌజర్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌గా పని చేయనుంది. మైక్రోసాఫ్ట్-బింగ్ పోటీని తట్టుకునేందుకు ప్రతీ ఏడాది ఇలా భారీ ఒప్పందాలు చేసుకుంటూ పోతోంది గూగుల్. కిందటి ఏడాది ఈ ఒప్పందం విలువ పది బిలియన్ల డాలర్లు ఉండగా.. 2019లో 8 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక వచ్చే ఏడాది ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని(18-20 బిలియన్ డాలర్ల మధ్య) అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. ఇక ఐవోస్ డివైజ్‌లపై యాపిల్-గూగుల్ డీల్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విస్తరణకు మిగతా బ్రౌజింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు అవకాశం ఇవ్వాలంటూ యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ అభిప్రాయపడింది. హాట్ న్యూస్: అలర్ట్- ఫోన్ నుంచి ఈ యాప్స్ తీసేయండి ఆఖరి రోజు:ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..! -
Google : ‘మీరు కోరిన సమాచారం మారుతోంది’
ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌ని అడిగేస్తున్నాం. క్షణాల్లో మనం అడిగిన దానికి సంబంధించిన సమాచారం గూగుల్ మన ముందు ఉంచుతోంది. అయితే గూగుల్ అందించే సమాచారంలో కచ్చితత్వం ఎంత అనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చిన్నట్టు తన బ్లాగ్‌లో గూగుల్ పేర్కొంది. నోటిఫికేషన్ సాధారణంగా గతంలో జరిగిన విషయాలకు సంబంధించి గూగుల్‌లో సమాచారం అప్ టూ డేట్గానే ఉంటోంది. అయితే బ్రేకింగ్ న్యూస్, అప్పటికప్పుడు జరిగే సమాచారం విషయంలో కచ్చితత్వం లోపిస్తోంది. గూగూల్లో సెర్చ్ చేసే సమయానికి జరుగుతున్న సంఘటల్లో క్షణక్షణానికి మార్పులు వస్తుంటాయి. వివిధ రకాల సోర్సుల ద్వారా ఇవన్నీ ఎప్పటిప్పుడు గూగుల్‌లో అప్డేట్ అవుతుంటాయి. ఇలా వెంటవెంటనే అప్డేట్ అవుతున్న సమాచారానికి సంబంధించి అలెర్ట్ ఇవ్వనుంది గూగుల్. మారుతోంది ఏదైనా బ్రేకింగ్ న్యూస్‌కి సంబంధించిన సమాచారం గూగుల్‌లో వెతికే క్రమంలో ‘ రిపోర్ట్స్ అబౌట్ ద టాపిక్ ఆర్ చేంజింగ్ ర్యాపిడ్లీ (results about the topic are changing rapidly) అంటూ గూగుల్ మనకు తెలియజేయనుంది. దీని వల్ల సమాచారం పొందడంలో కచ్చితత్వం వస్తుందని గూగుల్ చెబుతోంది. చదవండి : Google Meet: నయా ఫీచర్లు, ఇక డౌట్లు అడగాలంటే.. -
బన్నీ ఖాతాలో మరో రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ మూవీ ట్రైలర్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన టాప్ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. (చదవండి : ‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డు) ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ లోని టాప్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సెలెబ్రెటీల జాబితాలో మొత్తం ఇండియన్స్ లో ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో సినీ పరిశ్రమ నుంచి ఎస్సీ బాలసుబ్రమణ్యం, సోనుసూద్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. -
బుడుగులకో ‘సెర్చ్ ఇంజన్’!
సాక్షి, న్యూఢిల్లీ : అక్షరాలు సరిగ్గా రాని మూడేళ్లలోపు నర్సరీ పిల్లల కోసం గూగుల్ కంపెనీ ‘గూగుల్ అసిస్టెంట్’ తరహాలో ప్రత్యేక ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్‌ను తీసుకొస్తోంది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ‘గూగుల్ అసిస్టెంట్’ నడుస్తుందని, మన వాయిస్ కమాండ్ ద్వారా ఇంటర్నెట్లో మనకు కావాల్సిన సమాచారాన్ని అది అందిస్తుందని తెల్సిందే. ఇదే తరహాలో పనిచేసే, పిల్లలకు మరింత ఆకర్షణగా ఉండేలా దీన్ని తీసుకొచ్చేందుకు కషి చేస్తున్నామని. అప్పుడు దీనికి ‘గేమిఫైయింగ్ వాయిస్ సెర్చ్ ఎక్స్పీరియన్స్ ఫర్ చిల్డ్రన్’ పేరిట యూరప్‌లో పేటెంట్‌కు దరఖాస్తు కూడా చేశామని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ ఎకో ‘అలెక్సా’తో ప్రైవసీ దెబ్బతింటోందని గోల చేస్తున్న సామాజిక కార్యకర్తలు దీనివల్ల కూడా ప్రైవసీకి ముప్పుందంటూ మొత్తుకుంటున్నారు. పైగా చిన్నతనంలో పిల్లలను ఇంటర్నెట్కు బానిసలను చేయడం మరింత అన్యాయం అంటున్నారు. పిల్లల్లో ఆటలు సృజనాత్మకతను పెంచుతాయని, తాము రూపొందించాలనుకుంటున్నసెర్చ్ ఇంజన్ కూడా ఓ ఆటలాగే ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. పిల్లలు బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకున్నట్లే, వాటిని కంప్యూటర్లలో చూస్తూ మరింత వేగంగా నేర్చుకుంటారని వాదిస్తోంది. జీబ్రా, టైగర్ అంటూ పిల్లలు ఉచ్చరించగానే టేబుల్ టాప్‌లో వాటి బొమ్మలు ప్రత్యక్షమవడం వారికి ఆనందనిస్తాయని చెబుతోంది. అయినా తాము పేటెంట్ కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, అది సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదని గూగుల్ చెప్పింది. చాలా ఐటీ కంపెనీలు ఇలా పేటెంట్లు దాఖలు చేసుకోవడం అందులో మూడోవంతు కార్యరూపం దాల్చకపోవడం తెల్సిందేనంటూ తెలిపింది. శిశువుల మల, మూత్ర విసర్జనలతోపాటు వారి తిండి, నిద్రను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసే ‘స్మార్ట్నాపీ’ పేరుతో పాంపర్స్ యాప్ లూమి వచ్చిన నేపథ్యంలోనే గూగుల్ నుంచి ఈ వార్త వెలువడడం హాట్ టాపిక్‌గా మారింది. శిశువుకు గదిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలో ముందుగానే ఫీడ్ చేసుకున్న ఈ యాప్ గదిలో ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లినప్పుడు, మూత్ర విసర్జనతో బట్టలు తడిసినప్పడు, డైపర్ మార్చాల్సి వచ్చినప్పుడు ఈ యాప్ స్మార్ట్ ఫోన్ సందేశాలతో తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది. ఇది కూడా ప్రైవసీని దెబ్బతీస్తోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
ఆపిల్‌ను మరింత రిచ్‌గా చేస్తున్న గూగుల్
ఐఫోన్ 8 లాంచింగ్‌తో ప్రపంచంలో తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించబోతున్న ఆపిల్‌కు గుట్టలుగుట్టలుగా నగదు వచ్చి చేరుతోంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, ఈ టెక్ దిగ్గజాన్ని మరింత రిచ్‌గా చేస్తోంది. ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్‌నే ఉంచడానికి 3 బిలియన్ డాలర్లను(రూ.19,240 కోట్లను) ఈ సెర్చ్ ఇంజిన్ చెల్లించనుంది. కేవలం 3 ఏళ్లలోనే 1 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు ఈ లైసెన్సింగ్ ఫీజును పెంచేసింది. 2014లో గూగుల్ వీటి కోసం 1 బిలియన్ డాలర్లను చెల్లించింది. ప్రస్తుతం ఇవి 3 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఆపిల్ సర్వీసెస్ బిజినెస్‌లకు గూగుల్ నుంచే భారీ మొత్తంలో లాభాలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆపిల్ మొత్తం నిర్వహణ లాభాల్లో ఇవి 5 శాతంగా ఉన్నాయని, అంతేకాక గత రెండేళ్ల నుంచి కంపెనీ నిర్వహణ లాభాల వృద్ధి 25 శాతం మేర ఉన్నట్టు బెర్న్స్టైయిన్ నిపుణుడు ఏ.ఎం సక్కోనాఘి జూనియర్ చెప్పారు. ఇటు ఆపిల్‌కే కాక, అటు గూగుల్‌కు మంచి ప్రయోజనాలే చేకూరుతున్నాయని పేర్కొన్నారు. గూగుల్ మొబైల్ సెర్చ్ రెవెన్యూల్లో 50 శాతం ఆపిల్ ఐఓఎస్ డివైజ్లవేనని తెలిపారు. ఆపిల్‌తో ఉన్న ఈ డీల్‌కు గూగుల్ గుడ్‌బై చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ నిపుణుడు తెలిపారు. అదేవిధంగా క్వాల్‌కామ్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆపిల్‌కు ఇతర టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. -
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
-
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్... ఈ కాన్ఫరెన్స్ అంటేనే టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఎలాంటి కొత్తకొత్త ప్రొడక్ట్ లు గూగుల్ మార్కెట్లోకి తీసుకొస్తుంది అని ఆసక్తి చూపుతుంటారు. మౌంటెన్ వ్యూలో నిన్ననే అంటే మే 17వ తేదీన గూగుల్ తన ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. టెక్ అభిమానుల ఆసక్తి మేరకు గూగుల్ నిజంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఇన్ని రోజులు మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దేనినైనా చూస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ లెన్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో ఫ్లవర్ కనిపించింది అనుకుంటే. ఆ ఫ్లవర్ ఏంటి? దాని వివరాలు కావాలంటే? ఆ పువ్వును లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందుతామట. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. -
గూగుల్ దేవోభవ!
సెప్టెంబర్ 4 గూగుల్ వార్షికోత్సవం, సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం సందర్భంగా... ఆవకాయను ఎలా తయారు చేయాలి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సచిత్ర పాఠం క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది. అంతరిక్ష విజ్ఞానంలో తాజా పరిణామాలేంటి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సమస్త సమాచారమూ సమగ్రంగా చిటికెలో ప్రత్యక్షమవుతుంది. కొరుకుడు పడని పాఠాలేవైనా కావచ్చు, కోరుకున్న విద్యలేవైనా కావచ్చు.. ‘గూగుల్’ను అడిగితే చాలు... యమ ఓపికగా పండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరిస్తుంది. బెత్తం పట్టుకోదు, గుంజీలు తీయించదు, గోడ కుర్చీలు వేయించదు... ఎలాంటి పాఠాలనైనా ఏమాత్రం కసురుకోకుండా ఫ్రెండ్లీగా బోధిస్తుంది. ఎలాంటి సందేహాన్నైనా ఏమాత్రం విసుక్కోకుండా చిటికెలో తీర్చేస్తుంది. ఈ-తరానికి గురువూ, దైవం గూగుల్. ఈ-తరానికి ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గూగుల్. గూగుల్ ఒక జ్ఞాన నిధి, ఒక విజ్ఞాన ఖని. పద్దెనిమిదేళ్ల కిందట సాదాసీదా సెర్చ్ ఇంజన్‌గా ‘గూగుల్’ మొదలైనప్పుడు అది నిరంతర సమాచార ఖనిగా పరిణమించగలదని, అంచెలంచెలుగా విస్తరించి విశ్వవ్యాప్తమై అధునాతన ప్రపంచంలో అనేకానేక ఏకలవ్య శిష్యులకు జగద్గురువుగా అవతరించగలదని ఎవరూ ఊహించలేదు. గూగుల్ ప్రస్థానం అభూత కల్పనల కంటే విడ్డూరమైనది. గూగుల్ సాధించిన విజయాలు ఇంటర్నెట్ ప్రపంచంలోని ఇతరేతర శతకోటి విజయాల కంటే ఘనమైనవి. ‘ఆచార్య దేవో భవ’ అని గురువులను గౌరవించడం మన సంస్కృతి. దాదాపు ఇంటింటికీ ఇంటర్నెట్ విస్తరించడంతో సమాచార విప్లవంలో ‘గూగుల్’ గురుతర పాత్ర పోషిస్తోంది. శాస్త్ర సాంకేతికాలకు మాత్రమే పరిమితం కాకుండా వంటా వార్పు వంటి సామాన్య విషయాలపైనా పాఠాలు బోధిస్తోంది. ఈ-తరానికి గురువుగా మారిన గూగులాచార్యుల కథా కమామిషూ... చదువులెంత సులభం! చదువుల తీరుతెన్నుల చరిత్రను ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఆ చరిత్రను గూగుల్ పూర్వయుగం, గూగుల్ అనంతర యుగంగా విభజించుకోవడం అనివార్యం. ఇంటర్నెట్ అనేది ఊహకందని కాలంలో, గూగుల్ అనే సమాచార ఖని అందుబాటులోకి రాని కాలంలో చదువులు బహు కష్టంగా ఉండేవి. పాఠాలు నేర్చుకునే విద్యార్థులకే కాదు, పాఠాలు నేర్పే గురువులకు కూడా! పొల్లు పోకుండా పాఠాలను వల్లె వేయాల్సి వచ్చేది. పరీక్షలకు ముందు అవే పాఠాలను పదే పదే బట్టీ పట్టాల్సి వచ్చేది. అయినా ఒక పట్టాన గుర్తుండి చచ్చేవి కాదు. చాలా అంశాల్లో ఏమిటి? ఎందుకు? ఎలా? అనే మౌలికమైన ప్రశ్నలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాధానాలు అర్థమయ్యీ కానట్లు ఉండేవి. రకరకాల సందేహాలు తలెత్తేవి. వెనువెంటనే వాటిని నివృత్తి చేసుకునే మార్గమే అందుబాటులో ఉండేది కాదు. కొత్త పదాలు వేటికైనా అర్థాలు తెలుసుకోవాలంటే దిండు సైజులో కొండలా ఉండే నిఘంటువుల్లో పేజీలకు పేజీలు ఓపికగా తిరగేస్తూ వెదుక్కోవాల్సి వచ్చేది. కొరుకుడుపడని సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు తలెత్తినా, టీచర్లను అడగాలంటే భయ సంకోచాలు వెంటాడేవి. ఓపికగా సందేహాలను నివృత్తి చేసే టీచర్లు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. చాలామంది టీచర్లు కోపతాపాలను ప్రదర్శించేవారు. ఇవన్నీ విద్యార్థుల కష్టాలు. అయితే, టీచర్ల కష్టాలు టీచర్లకూ ఉండేవి. తమకే తెలియని విషయాలపై సందేహాలతో నిత్యం విసిగించే విద్యార్థులతో వేగడం అగ్నిపరీక్షలా ఉండేది. అపర చండామార్కుల వంటి టీచర్లు అలాంటి గడ్డు పరిస్థితులను దండోపాయంతో నెట్టుకొచ్చేసేవారు. అయితే, టీచర్లందరూ దండోపాయ దురంధరులగు చండామార్కుల వారసులు కాదు కదా! వాళ్లల్లోనూ అమాయకపు పరమానందయ్యలు ఉంటారు. పాపం అలాంటి వాళ్లకే కష్టాలన్నీ... పైగా విద్యార్థులకు కూడా పరమానందయ్యల వంటి టీచర్ల దగ్గరే కాస్త చనువెక్కువ. అందుకే వాళ్లనే పదే పదే సందేహాలతో సతాయిస్తూ ఉంటారు. ‘గూగుల్’ పుట్టుకకు మునుపు గడచిన సత్తెకాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చదువులు సవాలుగా ఉండేవి. ‘గూగుల్’ ఆవిర్భావం తర్వాత చాలావరకు కష్టాలు తీరిపోయాయి. చదువులు సులభమయ్యాయి. ఎలాంటి సందేహమైనా సరే, నివృత్తి చేసుకోవడం ఒక క్లిక్కుతో జరిగే పనిగా మారింది. ఇద్దరు మిత్రుల కథ పాతికేళ్ల కిందట ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ టిమ్ బెరర్స్ లీ తొలిసారిగా 1989 మార్చి 12న ‘వరల్డ్ వైడ్ వెబ్’ ప్రతిపాదన చేశారు. మొదటి సెర్చ్ ఇంజన్ ‘ఆర్చీ’ 1990లో ఏర్పాటైంది. ఆ తర్వాత 1991 ఆగస్టులో మొట్టమొదటి వెబ్సైట్ ‘ఇన్ఫో.సెర్న్.సీహెచ్’ ఏర్పడింది. కంప్యూటర్ల నుంచి కంప్యూటర్లకు సమాచార మార్పిడి తేలికైంది. ఈ-మెయిల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెబ్సైట్లు ఒక్కొక్కటే ఏర్పడసాగాయి. విద్యారంగంలో నెమ్మదిగా హైటెక్కు టమారాలన్నీ మొదలవసాగాయి. అలాంటి కాలంలో... 1996లో ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే అమెరికన్ కుర్రాళ్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరూ పీహెచ్డీ స్కాలర్లే! పాపం అప్పటికి అబ్దుల్ కలాం వాళ్లకేమీ చెప్పలేదు గాని, వాళిద్దరూ ఒక పెద్ద కల కన్నారు. ఇంటర్నెట్లోని సమస్త సమాచారాన్నీ ఒకేచోట అందుబాటులోకి తేవాలన్నదే వారి కల. దానిని సాకారం చేసుకోవడానికి 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఏడాది గడవకుండానే... 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేశారు. తమ తోటి పీహెచ్డీ సహాధ్యాయి క్రెయిగ్ సిల్వర్స్టీన్ను తొలి ఉద్యోగిగా చేర్చుకున్నారు. అప్పట్లో వాళ్లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్కు ప్రాంతంలో సూసాన్ వోజ్సికి అనే స్నేహితురాలి ఇంటి గ్యారేజీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా మొదలైన ప్రస్థానం రెండు దశాబ్దాలైనా గడవక ముందే అనేకానేక మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే పరిమితమైపోకుండా, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ‘గూగుల్ ఎర్త్’ వంటి వినూత్నమైన సేవలను ప్రారంభించింది. అనూహ్యంగా అసంఖ్యాక ఘనవిజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో గూగుల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ‘గూగుల్’ సంస్థ నికర విలువ ఇప్పుడు 49,800 కోట్ల డాలర్లకు పైమాటే. తాజా లెక్కల ప్రకారం ‘గూగుల్’లో 57,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐటీ విద్యార్థులందరి కలల లక్ష్యం ‘గూగుల్’లో ఉద్యోగమేనంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్’లో ఉద్యోగమంటే రాజ వైభోగమేనని చెబుతారు. గూగుల్ నీడలో విద్యా వేదికలు ‘బ్లాగర్’, ‘యూట్యూబ్’ వంటివి ‘గూగుల్’ నీడలోనివే. ఇవి అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. అంతేనా! చదువు సంధ్యల్లోనూ ఇవి తమదైన ముద్ర వేస్తున్నాయి. ‘గూగుల్’ దెబ్బతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారింది. చదువుకోదలచిన వాళ్లకు చదువుకునేంత సమాచారం అందుబాటులో ఉంటోంది. ఔత్సాహిక రచయితలకు ‘బ్లాగర్’ అద్భుతమైన వేదికగా మారింది. తమకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడానికి, తమ సృజనాత్మకతను లోకానికి చాటుకోవడానికి ‘బ్లాగర్’ చక్కని వెసులుబాటు కల్పిస్తోంది. నిజానికి ‘బ్లాగర్’ను 1999లో పైరా ల్యాబ్స్ ప్రారంభించగా, దీనిని 2003లో ‘గూగుల్’ సొంతం చేసుకుంది. ఇక ‘యూట్యూబ్’ వినోద, విజ్ఞానాల సమ్మేళనంగా ఉపయోగపడుతోంది. వీడియో షేరింగ్ వెబ్సైట్ ‘యూట్యూబ్’ను 2005లో ‘పేపాల్’ ఉద్యోగులు కొందరు ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే ‘గూగుల్’ దీనిని సొంతం చేసుకుంది. ‘యూట్యూబ్’లో సినిమాలు, టీవీ సీరియల్ ఎపిసోడ్లు, క్రీడలు, పాటలు వంటివే కాదు, పలు విషయాలకు సంబంధించిన పాఠాల వీడియోలూ రోజూ అసంఖ్యాకంగా చేరుతూనే ఉంటాయి. వినోదం కోసం ‘యూట్యూబ్’ను వినియోగించుకునే వారి సంగతి సరే, చాలామంది ‘యూట్యూబ్’ ద్వారా విలువైన పాఠాలను వ్యయప్రయాసలేవీ లేకుండానే నేర్చుకోగలుగుతున్నారు. గృహాలంకరణ వస్తువుల తయారీ, మొక్కల పెంపకం, వంటల తయారీ మొదలుకొని భౌతిక, రసాయనిక శాస్త్రాల ప్రయోగాలు, శస్త్రచికిత్సా ప్రక్రియల వరకు వివిధ అంశాల్లో పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు లక్షలాది మంది ‘యూట్యూబ్’పై ఆధారపడుతున్నారు. ఈ-లెర్నింగ్... ‘గూగుల్’తో ఎలాంటి సంబంధాలు లేని ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ రకరకాల విషయాలను కూలంకషంగా బోధిస్తున్నాయి. ఇంటర్నెట్ మొదలైన కొద్దికాలంలోనే ఈ-లెర్నింగ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 1999 నుంచే ఈ-లెర్నింగ్‌కు జనాదరణ పుంజుకుంది. అయితే,‘గూగుల్’ లేకుంటే... ఏయే వెబ్సైట్లు ఈ-లెర్నింగ్ సేవవలను అందిస్తున్నాయో, ఏ సబ్జెక్టులను ఏయే వెబ్సైట్లు బోధిస్తున్నాయో జనాలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ‘గూగుల్’ పుణ్యాన చాలా ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు జనాలకు చేరువయ్యాయి. మనకు నచ్చిన అంశాన్ని ఎన్నుకుని, ఆన్లైన్లో ఆ అంశాన్ని బోధిస్తున్న సంస్థలేవేవి ఉన్నాయో ‘గూగుల్’ను అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది. అప్పటి వరకు మనం కనీవినీ ఎరుగని వందలాది వెబ్సైట్లను చిటికెలో పరిచయం చేస్తుంది. ఈ-లెర్నింగ్ ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడంలో గూగుల్ గురుతర పాత్ర పోషిస్తోంది. గూగుల్ సారథిగా భారతీయుడు ఇద్దరు అమెరికన్ కుర్రాళ్లు ప్రారంభించగా, అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘గూగుల్’ కంపెనీకి సారథిగా సుందర్ పిచయ్ గత ఏడాది బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది చేపట్టిన కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘అల్ఫాబెట్’కు ‘గూగుల్’ అనుబంధ సంస్థగా మారింది. ‘గూగుల్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ ‘అల్ఫాబెట్’కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, మరో వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ ‘అల్ఫాబెట్’ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచయ్ని నియమించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ పట్టభద్రుడైన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యలు పూర్తి చేసుకున్న సుందర్ పిచయ్ 2004లో ‘గూగుల్’లో చేరి, వివిధ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఈవోగా ఆయన ‘గూగుల్’ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్ గురించి అవీ... ఇవీ... ♦ తొలినాళ్లలో గూగుల్ సెకనుకు 30-40 పేజీలను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. ఇప్పుడు ఏకంగా కొన్ని మిలియన్ల పేజీలను ప్రాసెస్ చేయగలుగుతోంది. పద్దెనిమిదేళ్ల వ్యవధిలోనే ‘గూగుల్’ తన వేగాన్ని అపరిమితంగా పెంచుకుంది. ♦ ఇంటర్నెట్లో గూగుల్ కంటే ‘యాహూ’ నాలుగేళ్ల సీనియర్ సంస్థ. ‘గూగుల్’ శరవేగంగా ఎదుగుతుండటంతో, దానిని కొనుగోలు చేయాలని ‘యాహూ’ భావించింది. ‘గూగుల్’ కొనుగోలుకు 2002లో 300 కోట్ల డాలర్లు ఇవ్వజూపింది కూడా. అయితే, ‘గూగుల్’ వ్యవస్థాపకులు ఆ ఆఫర్‌ను తోసిపుచ్చారు. ♦ ‘గూగుల్’ స్పెల్లింగ్ ఒక అచ్చుతప్పు. ‘గూగుల్’ అసలు స్పెల్లింగ్ ‘జీఓఓజీఓఎల్’. అంటే, ఒకటి తర్వాత వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. ♦ ‘గూగుల్’ తొలిదశలో రూపొందించిన అల్గొరిథమ్ ‘పేజ్‌ర్యాంక్’ పేటెంట్ ఇప్పటికీ స్టాన్ఫోర్డ్ వర్సిటీ అధీనంలోనే ఉంది. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో ఇప్పుడైతే వివిధ సందర్భాల్లో డూడుల్స్ కనిపించడం మామూలైంది గాని, తొలి రోజుల్లో ‘గూగుల్’ లోగో యథాతథంగానే కనిపించేది. అయితే, గూగుల్ వ్యవస్థాపకులు ల్యారే పేజ్, సెర్జీ బ్రిన్లు నెవడాలో జరిగే ‘బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్’ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. తాము కార్యాలయంలో ఉండటం లేదనే సమాచారాన్ని యూజర్లకు తెలియజేసేందుకు తొలిసారిగా అప్పుడు ‘బర్నింగ్ మ్యాన్’ డూడుల్‌ను హోమ్‌పేజీలో పెట్టారు. దానికి స్పందన బాగుండటంతో ప్రత్యేక సందర్భాల్లో డూడుల్స్ పెట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో లోగో, సెర్చ్ బాక్స్ తప్ప మిగిలిన భాగమంతా తెల్లగా ఖాళీగానే ఉంటుంది. మిగిలిన వెబ్సైట్ల హోమ్పేజీల మాదిరిగా అందులో ఎలాంటి రంగులు, చమక్కులు, డిజైన్లు కనిపించవు. ఎందుకంటే, ‘గూగుల్’ వ్యవస్థాపకులిద్దరికీ వెబ్‌పేజీ డిజైనింగ్‌కు అత్యవసరమైన హెచ్‌టీఎంఎల్‌లో పరిజ్ఞానం అంతంత మాత్రమే. ♦ ‘గూగుల్’ భాషపై కూడా తనదైన ముద్ర వేసింది. ఆక్స్ఫర్డ్, వెబ్‌స్టర్ డిక్షనరీలో 2006లో ముద్రించిన ఎడిషన్లలో ‘గూగుల్’ పదాన్ని క్రియాపదంగా గుర్తించాయి. ఇంటర్నెట్లో సమాచారాన్ని వెదుకులాడటానికి ‘గూగులింగ్’ అనడం ఏకపద ప్రత్యామ్నాయంగా మారింది. గూగుల్ పరిమితులు... ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే కాలం పోయి ‘అన్నీ గూగుల్లోనే ఉన్నాయష’ అనుకునే కాలం వచ్చిపడింది. పిడికిట్లోకి ప్రపంచం ఇమిడిపోయే దశలో దూసుకొచ్చిన గూగుల్ చాలామందికి గురువుగా మారింది సరే, గురువులకు పరిమితులు ఉన్నట్లే, గూగుల్ పరిమితులు గూగుల్కూ ఉన్నాయి. వాటిని గుర్తించకుండా గూగుల్ చెప్పిందే వేదమనే భ్రమలో పడితే మాత్రం తంటాలు తప్పవు. అందువల్ల గూగుల్ పరిమితుల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా... * గూగుల్ సెర్చ్‌లో ఏదైనా పదం కొడితే, ఆ పదానికి సంబంధించిన సమస్త లింకులూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఒక్కో లింకు ఒక్కో వెబ్‌పేజీకి దారితీస్తుంది. కొన్ని వెబ్‌పేజీలలో ఇక్ష్వాకులం నాటి సమాచారం ఉంటుంది. పేజీని ప్రారంభించిన తర్వాత అప్డేట్ చేయకుండా ఏళ్ల తరబడి వదిలేసిన పేజీలు ఉంటాయి. అలాంటి సమాచారాన్ని నమ్ముకోలేం. * వెబ్పేజీల్లో పొందుపరచిన విషయాలలోని నాణ్యతను, కచ్చితత్వాన్ని గుర్తించడం గూగుల్‌కే కాదు, ఏ సెర్చ్ ఇంజన్‌కూ సాధ్యం కాదు. వివిధ విషయాల రచనా నాణ్యతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడం మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యం. * సాంకేతిక పురోగతి ఫలితంగా గూగుల్‌తో పాటు చాలా సెర్చ్ ఇంజన్లు హెచ్‌టీఎంఎల్‌లో లేని అంశాలను కూడా చాలావరకు చదవగలుగుతున్నాయి. అయినప్పటికీ తగిన వ్యాఖ్య, సమాచారం లేకుండా అప్లోడ్ చేసిన ఫొటోలు, ఆడియో, వీడియో సమాచారాన్ని విశ్లేషించడం ఇప్పటికీ వీటికి దుస్సాధ్యంగానే ఉంటోంది. * వివిధ సాంకేతిక కారణాల వల్ల సెర్చ్ ఇంజన్లకు అందని వెబ్‌పేజీలు కూడా చాలానే ఉంటాయి. అలాంటి వెబ్‌పేజీలలో ఏదైనా విలువైన సమాచారం ఉన్నా, వాటి యూఆర్ఎల్ మనకు కచ్చితంగా తెలిస్తే తప్ప వాటిని చూడటం సాధ్యం కాదు. వాటిని వెదుకులాడటానికి సెర్చ్ ఇంజన్లపై ఆధారపడటం కష్టమే. - పన్యాల జగన్నాథదాసు -
ఆకట్టుకుంటున్న గూగుల్ స్పెషల్ డూడుల్
న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన హోం పేజీ డూడుల్ ఆకట్టుకుంటోంది. 'ఫాదర్స్ డే'ను పురస్కరించుకుని యూజర్స్ అందరికీ విషెస్ చెప్పింది. గూగుల్ హోం పేజీలో డోర్ మ్యాట్‌పై రెండు జతల షూ కనిపిస్తున్నాయి. ఒకటి పెద్ద జత, మరొకటి చిన్న షూ జత. తండ్రి షూను చిన్నారి షూ ఫాలో అవ్వాలని సూచిస్తున్నట్లుగా, తండ్రి అడుగు జాడల్లో చిన్నారులు నడుచుకుంటారని అర్థం వచ్చేలా గూగుల్ యాజమాన్యం ఆ ఫొటోను పెట్టింది. తన పిల్లల కోసం జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం ప్రతీ ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక డూడుల్ తో గూగుల్ ఆకట్టుకుంటన్న విషయం తెలిసిందే. ఇటీవల సంవత్సారాల్లో గూగుల్ డూడుల్స్ ను ఇక్కడ ఓ లుక్కేయండి. -
ఆటను మార్చగల యువకుడు!
‘ఇండియాలో కూడా గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’ అని అంటాడు అంకిత్ ఫదియా. సెర్చింజన్ దిగ్గజం గూగుల్స్థాయి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా అంకిత్ కామెంట్‌ను విని ఆశ్చర్యపోతారు. మనకంత దృశ్యం ఉందా? అని సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే అంకిత్ ఫదియా లాంటి ప్రతిభ ఉన్న వాళ్లకు తగిన ప్రోత్సాహం, కాలం కలిసొస్తే సెర్చింజన్గానో మరో విధంగా ఇంటర్నెట్ పనులకు ఉపయోగపడే సంస్థను స్థాపించడం, దాన్ని ‘గూగుల్’ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విశేషం కాదు. ఎథికల్ హ్యాకర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొని, హ్యాకింగ్ ట్రైనర్‌గా 27 యేళ్లకే 16 పుస్తకాలను రాసి, ఎమ్టీవీలో యూత్‌కు ఇంటర్నెట్ గురించి టిప్స్ అందించే కార్యక్రమానికి హోస్ట్‌గా పనిచేసిన ఘనత అంకిత్ ది! పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే కొన్ని గిప్ట్స్ వారి జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకొనే తీరును బట్టి వాళ్ల జీవితాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. అలా జీవితాలను మలుపుతిప్పగల సాధనం కంప్యూటర్. ఇప్పుడు కాదు దాదాపు 17 యేళ్ల కిందట అంకిత్‌కు పదేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు అతడికి కంప్యూటర్ను బహుమతిగా ఇచ్చారట! కంప్యూటర్ కొద్ది సేపు ఆటగా అనిపించిందట. తర్వాత... ఈ పిల్లాడికి కంప్యూటర్ ఎలా పనిచేస్తోంది, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అవుతోంది అనే విషయం గురించి ఆలోచన మొదలైందట. దీంతో మొదలైంది ఇతడి పరిశోధన. అలా పరిచయం అయ్యింది నెట్వర్కింగ్. అటు నుంచి హ్యాకింగ్ ప్రమాదం.. దాన్ని అధిగమించేదే ఎథికల్ హ్యాకింగ్. కంప్యూటర్ పదేళ్ల వయసులో పరిచయం అయితే ఎథికల్ హ్యాకింగ్ గురించి 12 యేళ్ల వయసులో తెలుసుకొన్నాడట. 14 యేళ్ల వయసులో ఏకంగా ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకమే రాసేశాడు! కాపీ బుక్స్ రాసుకోవాల్సిన వయసులో ‘ఎథికల్హ్యాకింగ్ గైడ్’ పేరుతో పుస్తకం రాశాడు! ఆ పుస్తకం పబ్లిష్ అయ్యింది. పలు భాషల్లోకి అనువాదం అయ్యింది. తలపండిన నిపుణులు ఎంతోమంది ఉన్నా.. ఎథికల్ హ్యాకింగ్‌లో అప్పటికి పుస్తకాలు రాసే ఐడియా ఎవరికీ లేదో ఏమోకానీ అంకిత్ పుస్తకం బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. 14 యేళ్ల కుర్రాడు రాసిన పుస్తకంగా కాక ఎథికల్ హ్యాకింగ్ విషయంలో మంచి గైడ్‌గా గుర్తింపు తెచ్చుకొంది అది. అక్కడే నిపుణుడిగా అంకిత్ తొలి విజయం సాధించాడు. పుస్తకంతో అపరిచితుడుగానే ఎంతోమందికి ఎథికల్ హ్యాకింగ్ ద్వారా అవగాహన కల్పించిన అంకిత్ తొలిసారి పోలీస్ డిపార్ట్మెంట్కు ట్రైనర్‌గా మారడం ద్వారా మరో రకమైన గుర్తింపు సంపాదించుకొన్నాడు. అనేక రాష్ట్రాల పోలీస్డిపార్ట్మెంట్లకు ఎథికల్ హ్యాకింగ్ విషయంలో ట్రైనర్‌గా మారాడు. సైబర్ క్రైమ్‌కు పగ్గాలు వేయడంలో సహకరించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అప్పటికి అంకిత్ వయసు 16 సంవత్సరాలు.రెండేళ్లు అలాగడిపేసిన తర్వాత సొంతంగా ఎథికల్ హ్యాకింగ్ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను మొదలు పెట్టాడు. తనే ఒక బ్రాండ్‌గా మారాడు. ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించి వివిధ శాఖల ద్వారా దాదాపు 25 వేల మందిని ఎథికల్హ్యాకింగ్ నిపుణులుగా తీర్చిదిద్దాడు. ఈ విధంగా ట్రైనర్‌గా దూసుకుపోతున్న ఇతడిని ఎమ్‌టీవీ గుర్తించింది. యూత్‌కు ఎంతో ప్రియమైన ఇంటర్నెట్ గురించి కిటుకులను చెప్పే ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలనుకొన్న ఆ ఛానల్ అంకిత్‌ను అందుకు తగిన వ్యక్తిగా భావించింది. అతడే హోస్ట్‌గా ‘ వాట్‌ద హ్యాక్’ అనే కార్యక్రమం మొదలైంది. ఎమ్టీవీలో యాంకర్లు అంటే ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అవకాశం గొప్ప లాంచింగ్ ప్యాడ్. అంకిత్‌కు కూడా అది అలాగే ఉపయోగపడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వరకూ ఇతడి పేరు వెళ్లింది. ఒకవైపు ఈ కెరీర్లను కొనసాగిస్తూ ఎథికల్ హ్యాకింగ్ గురించి పుస్తకాలు రాస్తూ వచ్చాడు. దీంతో ఇతడిని డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబర్ షేపర్’గా గుర్తించింది . అవార్డును ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ఎథికల్ హ్యాకర్లలో అంకిత్ ఒకరు. ఎథికల్ హ్యాకింగ్ గురించి 16 పుస్తకాలను రాశాడు. దాదాపు 25 దేశాల్లో వివిధ సమావేశాల్లో ప్రసంగించాడు. అనేక అవార్డులను అందుకొన్నాడు. దాదాపు 25 వేల మందిని ఎథికల్ హ్యాకింగ్ రంగంలోనిపుణులుగా తీర్చిదిద్దాడు. అనేక కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుగా ఉన్నాడు. ఉత్తమ ప్రసంగకర్తగా నిలిచాడు. ఇండియా టుడే వాళ్లు ఇతడిని ‘గేమ్ ఛేంజర్’గా గుర్తించారు. భారత ప్రభుత్వం కూడా పలు అవార్డులను ఇచ్చింది. మరి ఇప్పుడు, ఇతడి ప్రొఫైల్‌ను పరిశీలించాక... ‘ఇండియాలో గూగుల్ స్థాయి కంపెనీ ఒకటి ప్రారంభం అయినా పెద్దగా ఆశ్చర్యపోవద్దు...’అన్న ఇతడి మాటను మరోసారి ప్రస్తావించుకొంటే... ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రపంచ స్థాయి వ్యక్తులు వస్తున్న మన దేశంలో ‘గూగుల్’ స్థాయి కంపెనీ స్థాపించగల సమర్థులూ ఉంటారనిపిస్తుంది! -
పోర్న్ సైట్లకూ ఓ సెర్చింజన్!
ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో కొత్త సెర్చింజన్ రావడం కొత్తేమీ కాదు. కానీ.. ఏకంగా బూతు సైట్ల కోసం కూడా ప్రత్యేకంగా ఓ సెర్చింజన్ వచ్చిందంటే నమ్ముతారా? గూగుల్ మాజీ ఉద్యోగులు డెవలప్ చేసిన ఓ టూల్ అచ్చంగా పోర్నోగ్రఫీ కోసమేనట. తమ సెర్చింజన్ రాకెట్లా దూసుకొచ్చిందని, ఈనెల 15వ తేదీన అది ప్రారంభమైందని దాని వ్యవస్థాపకులలో ఒకరైన కోలిన్ రౌన్ట్రీ చెప్పారు. ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌ను గూగుల్, బింగ్ క్రమంగా తమ సెర్చింజన్ల నుంచి తీసేస్తున్నాయని, అందుకే ఇప్పుడు కొత్తగా దానికోసం ఒక సెర్చింజన్ ఉండాల్సిన అవసరం కనిపించిందని చెబుతున్నారు. గూగుల్‌లో ఎవరైనా వీటికోసం వెతికితే కనపడకపోగా.. హెచ్చరికలు ఉంటాయని, అలాంటివాళ్లు వెంటనే తమ సెర్చింజన్ చూస్తే సరిపోతుందని రౌన్ట్రీ అంటున్నారు. ఇదే సమయంలో యూజర్ల వ్యక్తిగత రహస్యాలను కూడా కాపాడేలా తమ ఇంజన్ ఉంటుందని చెప్పారు. కుకీస్ గానీ, ఇతర యూజర్ ట్రాకింగ్ టెక్నాలజీలను గానీ తాము ఉపయోగించట్లేదని అన్నారు. -
చైనాకు గూగుల్ జబర్ధస్త్ షాక్!
ప్రపంచ నెంబర్ వన్ సర్చ్ ఇంజన్ గూగుల్ తన కార్యకలాపాలను గత రాత్రి నుంచి అర్ధాంతరంగా చైనాలో ఆపివేసింది. ఇటీవల కాలంలో హ్యాకర్ల దాడులు ఎక్కువ కావడం, అనేక నిబంధనలు వ్యాపార లావాదేవిలకు అడ్డుగా మారడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి హాంకాంగ్ కు తమ కార్యాలయాన్ని గూగుల్ బదిలీ చేసింది. ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం గూగుల్ పై నిప్పులు చెరుగుతోంది. గూగుల్ సర్చ్ ఇంజిన్ పై సెన్సార్ విధించడం, కొన్ని సెన్సిటివ్ సర్చ్ ఆపరేషన్స్ ను ప్రభుత్వం ఫిల్టర్ చేయడం లాంటి అంశాలు గూగుల్ కు ఇబ్బందిగా మారాయి. దాంతో చైనా నుంచి తమ కార్యకలాపాలను హాంకాంగ్ బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజీంగ్ హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయం ఎదుట మద్దతుదారులు ఫ్లవర్ బోకేలు, చాకోలెట్, ఇతర బహుమతులతో నిరసన తెలిపారు. 400 మిలియన్ల యూజర్లు ఉన్న చైనా గూగుల్ కు అతిపెద్ద బిజినెస్ మార్కెట్ గా ఉంది. అయితే అధికారులు చైనా సర్చ్ సర్వీస్ లపై ఆంక్షలు విధించడం, నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో గూగుల్ ఈ విధంగా షాకిచ్చినట్టు తెలుస్తోంది. -
దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’
న్యూయార్క్: ప్రపంచాన్ని మన ‘కళ్ల’ముందు ఉంచేలా సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న గూగుల్ గ్లాస్ మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది. దృష్టిలోపాలకు అనుగుణంగా, మనకు నచ్చే ఆకృతిలో కంటిఅద్ధాలను తయారు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంకా పరీక్ష దశలోనే ఉన్న గూగుల్ గ్లాస్ ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి విడుదలకానుంది. సరికొత్త హంగులతో, మనకునచ్చే రీతిలో లభించే వీటి ధర సుమారు రూ.14,000 ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.