చైనాకు గూగుల్ జబర్ధస్త్ షాక్!
చైనాకు గూగుల్ జబర్ధస్త్ షాక్!
Published Mon, Sep 22 2014 4:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
ప్రపంచ నెంబర్ వన్ సర్చ్ ఇంజన్ గూగుల్ తన కార్యకలాపాలను గత రాత్రి నుంచి అర్ధాంతరంగా చైనాలో ఆపివేసింది. ఇటీవల కాలంలో హ్యాకర్ల దాడులు ఎక్కువ కావడం, అనేక నిబంధనలు వ్యాపార లావాదేవిలకు అడ్డుగా మారడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి హాంకాంగ్ కు తమ కార్యాలయాన్ని గూగుల్ బదిలీ చేసింది. ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం గూగుల్ పై నిప్పులు చెరుగుతోంది. గూగుల్ సర్చ్ ఇంజిన్ పై సెన్సార్ విధించడం, కొన్ని సెన్సిటివ్ సర్చ్ ఆపరేషన్స్ ను ప్రభుత్వం ఫిల్టర్ చేయడం లాంటి అంశాలు గూగుల్ కు ఇబ్బందిగా మారాయి.
దాంతో చైనా నుంచి తమ కార్యకలాపాలను హాంకాంగ్ బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజీంగ్ హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయం ఎదుట మద్దతుదారులు ఫ్లవర్ బోకేలు, చాకోలెట్, ఇతర బహుమతులతో నిరసన తెలిపారు. 400 మిలియన్ల యూజర్లు ఉన్న చైనా గూగుల్ కు అతిపెద్ద బిజినెస్ మార్కెట్ గా ఉంది. అయితే అధికారులు చైనా సర్చ్ సర్వీస్ లపై ఆంక్షలు విధించడం, నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో గూగుల్ ఈ విధంగా షాకిచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement