ఆకట్టుకుంటున్న గూగుల్ స్పెషల్ డూడుల్ | Google marks Father's Day with cute doodle | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న గూగుల్ స్పెషల్ డూడుల్

Published Sun, Jun 19 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

ఆకట్టుకుంటున్న గూగుల్ స్పెషల్ డూడుల్

ఆకట్టుకుంటున్న గూగుల్ స్పెషల్ డూడుల్

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన హోం పేజీ డూడుల్ ఆకట్టుకుంటోంది. 'ఫాదర్స్ డే'ను పురస్కరించుకుని యూజర్స్ అందరికీ విషెస్ చెప్పింది. గూగుల్ హోం పేజీలో డోర్ మ్యాట్పై రెండు జతల షూ కనిపిస్తున్నాయి. ఒకటి పెద్ద జత, మరొకటి చిన్న షూ జత. తండ్రి షూను చిన్నారి షూ ఫాలో అవ్వాలని సూచిస్తున్నట్లుగా, తండ్రి అడుగు జాడల్లో చిన్నారులు నడుచుకుంటారని అర్థం వచ్చేలా గూగుల్ యాజమాన్యం ఆ ఫొటోను పెట్టింది. తన పిల్లల కోసం జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం ప్రతీ ఏడాది జూన్ మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక డూడుల్ తో గూగుల్ ఆకట్టుకుంటన్న విషయం తెలిసిందే. ఇటీవల సంవత్సారాల్లో గూగుల్ డూడుల్స్ ను ఇక్కడ ఓ లుక్కేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement