fathers day
-
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)
-
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ఫాదర్స్ డే : నాన్నను మురిపించిన స్టార్స్ (ఫోటోలు)
-
Father's Day 2024: హాయ్..! నాన్న..!!
"ఏ కష్టం ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం"...నేడు ‘ఫాదర్స్ డే’ ఈ పాట వినగానే గూస్బమ్స్ వస్తాయి.. ఇప్పుడెందుకు ఈ పాట గురించి చెప్పాల్సి వచ్చిందంటే..అదే నండి జూన్ 16న ‘ఫాదర్స్ డే’. నేటి హాయ్ నాన్న.. మొదలుకుని.. నాటి ‘డాడీ’ వరకూ అనేక సినిమాలు నాన్న కూతురు, నాన్న కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా చిత్రించారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నిజజీవితంలోనూ మనలో చాలామందికి రోల్ మోడల్ నాన్నే.. పైకి కోపంగా, కటువుగా, గంభీరంగా కనిపించే నాన్న మనసు పొరల్లో దాగున్న ప్రేమ బయటకు చెప్పలేనిది.లోపల ఎంత ప్రేమున్నా.. పైకి చూపిస్తే..పిల్లలపై ప్రభావం పడుతుందనుకునే నాన్నను అర్థం చేసుకునేవాళ్లు తక్కువ మందే.. అందుకే చాలా మందికి చివరి వరకూ నాన్న విలన్ లానే కనిపిస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఆయనే నిజమైన హీరో. అయితే నాన్న ప్రేమను అర్థం చేసుకోవడమూ అంత తేలికేం కాదు...మన కోసం తన కోర్కెలను, ఆశయాలను, ఆలోచనలను, ప్యాషన్‌ను, ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తాడు. అలాంటి నాన్నల గురించి ఫాదర్స్ డే సందర్భంగా పలువురిని సాక్షి పలుకరించగా.. వారు పంచుకున్న విశేషాలు...వారిమాటల్లోనే...ఆయన అలవాట్లే నాకొచ్చాయి..మాది ఉమ్మడి కుటుంబం. తాత కొండా వెంకటరంగారెడ్డి. నాన్న పేరు జస్టిస్ కొండా మాధవరెడ్డి. మాది పెద్ద కుటుంబం కావడంతో అంతా కలిసి భోజనం చేసే వాళ్లం. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాను. ఆయనంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ విధిగా పాటించేవాడిని. నాపై ఆయన కోపం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఎంత బిజీగా ఉన్నా...కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేవారు. ప్రతి రోజు కలిసే డిన్నర్ చేసేవాళ్లం. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే కాకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలపై పెద్ద చర్చే జరిగేది.ఆయన అలవాట్లే నాకూ వచ్చాయని అంతా అంటుంటారు. భోజనం తర్వాత స్వీటు తినే అలవాటు ఆయన నుంచి వచ్చినదే. కోపం కూడా ఆయన మాదిరే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జడ్జిగా పని చేస్తూ వ్యవసాయ పనులు చూసుకునే వారు. సాంస్కృతిక కేంద్రాలు. విద్యా సంస్థలు నిర్వహించారు. చాలా అంశాల్లో నాన్నే ఆదర్శం. ప్రతి అంశాన్నీ విశ్లేషించడమేకాదు..వాటి పరిణామాలనూ చెప్పేవారు. – చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డినాన్నే స్ఫూర్తి..స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. కుటుంబంతో కలిసి సోమాజీగూడలోనే స్థిరపడ్డాం. ఖైరతాబాద్ నాసర్ స్కూల్లోనే 12వ తరగతి వరకూ చదువుకున్నా. అమ్మ సుజాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉద్యోగిని. నాన్న చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఆఫీస్ మా ఇంటి పక్కనే ఉండేది. మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్ అయిపోయేది. దీంతో నాన్నే వచ్చి చూసుకునే వారు. ఆయన ప్రోత్సాహంతోనే స్కూల్ టాపర్‌గా మారా.నాన్న వారసురాలిగా 2011లో సీఏ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యా. నాన్నకు చిన్న తనం నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో సాధ్యంకాలేదు. నాకూ చిన్నప్పటికీ నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. మొదటి రెండు ప్రయత్నాల్లో సరైన గైడెన్స్ లేక అర్హత సాధించలేకపోయా. మూడో ప్రయత్నంలో నేను చేసిన తప్పు వల్ల అవకాశం కోల్పోయా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.‘నా కోసం వద్దు. నీకు పూర్తి ఆసక్తి ఉంటే విఫల్యాలను మర్చిపోయి మరింత దీక్ష, ప్రణాళికతో ముందుకెళ్లు’ అంటూ స్ఫూర్తి నింపారు. 2016లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో ఇండియాన్ ఫారెన్ సరీ్వస్‌కు ఎంపికయ్యా. ఆ తర్వాత అనేక విభాగాల్లో పనిచేశా. గడిచిన ఆరు నెలలుగా సికింద్రాబాద్ ఆరీ్పఓగా సేవ లు అందిస్తున్నా. నా భర్త రోహిత్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సరీ్వస్ (ఐఐఎస్) అధికారి. మా పాప సహస్రను ఆయనే చూసుకుంటారు. నాన్నకు సహస్ర మరో స్నేహజ. ‘నేను స్నేహజ ఫాదర్’ అంటూ నాన్న గర్వంగా చెప్పుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. –స్నేహజ, ఆర్పీఓ, సికింద్రాబాద్నాన్న వల్లనే ఈ స్థాయికి..చిన్న తనం నుంచి చదువు ఎంత ముఖ్యమో చెప్పేవారు. తాను హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉద్యోగవిరమణ చేసినా పిల్లలందరినీ ఉన్నత చదువులకు పట్టుబట్టారు. నాన్న పేరు అంబడపూడి మనోహరం. నాన్నతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ఎంతో ప్రేమానురాగాలను పంచేవారు. ఎంత కష్టమైనా ఉద్యోగాలు పొందాలనే అందరికీ చెప్పేవారు. ఆయన ఒత్తిడితోనే గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను. ఆడపిల్లలకు నాన్న అంటే భరోసా, కొండంత అండ, అన్నింటికీ నాన్న ఉన్నాడులే అనే భావన ఎప్పటికీ ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే నాన్నే నాకు స్పూర్తి. – అంబడపూడి శారద, ప్రిన్సిపల్ – సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డి ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం..నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆ పాత్ర ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. మాది కోనసీమజిల్లా చెయ్యేరు అగ్రహారం. దార్ల లంకయ్య(అబ్బాయిగారు), తల్లి దార్ల పెదనాగమ్మకు మేము ఐదుగురు సంతానం. అయినా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో చూసేవారు. తాను చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు.నాన్న ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా మా కడుపులు నిండాలని తపించేవారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఆ ఫలితాలను అనుభవించడానికి ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. మా చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకుని నాటకాలకీ, సినిమాలకీ తీసుకెళ్లేవారు. ఆహార పదార్థాలను తన చేతి రుమాలలో మూటగట్టుకొని తెచ్చిన రోజుల్ని మర్చిపోలేము.మా నాన్నని అందరూ ముచ్చటగా ‘అబ్బాయి’ అని పిలిచేవారు. అసలు పేరుకంటే అదే íస్థిరపడిపోయింది. అదే మానాన్న ఆత్మీయానురాగాలకు గొప్ప నిదర్శనం. నాన్న జ్ఞాపకార్థం హెచ్‌సీయూలో ప్రతి ఏటా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు–హెచ్సీయూమంచి ఇంజినీర్ కావాలి..ఆస్తులు అమ్మి అయినా ఖర్చు పెడతా అనేది మా తండ్రి. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్లలో పేద కుటుంబం మాది. నాన్న జి బాలకిష్టయ్య గౌడ్, అమ్మ లక్ష్మీదేవమ్మ. ఇంట్లో ఆరుగురు అక్కలు పుట్టిన తర్వాత నేను పుట్టడం, అదే రోజు మా వనపర్తి రాజుగా ఉండే రామేశ్వరరావు ఊరికి రావడంతో అయన పేరునే నాకు పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో తెలుగు మీడియం చదివా. తర్వాత పాలిటెక్నిక్ చేసి ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చదివా.అవసరమైతే ఆస్తులు అమ్మేస్తా... నువ్వు ఇంజినీర్ అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలనేవారు. నాన్న కల నెరవేర్చేందుకు మా తమ్ముడిని కూడా ఇంజినీరింగ్ చదవించా. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ కావడం నాన్న ప్రోద్బలమే.. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నలుగురూ చదువుకునేలా ప్రోత్సహించాలనేవారు నాన్న. ఇప్పటికీ నాన్న మాటలు నా చెవులకు వినిపిస్తుంటాయి. – డాక్టర్ జి రామేశ్వరరావు, డైరెక్టర్ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాఅందరూ చదవాలి..ఎంతకష్టమైనా పడతా...చదవండి అనేవారు నాన్న... అనంతపురం రాయదుర్గంలో టైలర్ మహ్మద్ అనీఫ్ నాన్న. కుటుంబంలో చదువుకున్నవారుంటే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడతా చదవండి అంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.ఒకరిని నేవీలో ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అక్క మంచి గైనకాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. నన్ను కూడా చదివించగా అనంతపురం జేఎన్టీయూలోఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించాను. అనంతరం ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి 1999లో రాయదుర్గం జీఐఎల్‌టీలో లెక్చరర్‌గా చేరా. ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ రాయదుర్గంలో ఉంటూ ఫోన్ చేస్తే మొదట పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతారు. –షేక్ ఎక్బాల్ హుస్సేన్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ–రాయదుర్గంనా ఇష్టాలను గౌరవిస్తారు...నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చేవారు. మొదట సినిమాల గురించి అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. దీంతో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే ఓ షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో చేయడం, అది పెద్దగా హిట్ అవ్వడంతో సుకుమార్ నన్ను రంగస్థలానికి ఎంపికచేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ప్రీమియర్‌కి పిలిచినప్పుడే చెప్పా.యాక్టింగ్ చూశాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకూ ఒప్పుకోరనుకున్నా.. మా నాన్నే నా లైఫ్‌లో రియల్ హీరో.. ఇండస్ట్రీకి ఓ అమ్మాయి వెళ్తుందంటే చాలా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. రూమర్స్‌ని అస్సలు పట్టించుకోరు.. నా ఎదుగుదల చూసి గర్వపడతారు.. – పూజిత పొన్నాడ, హీరోయిన్ఇవి చదవండి: -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
నాన్న... ఓ సూపర్ హీరో
చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
మా నాన్న సూపర్ హీరో!
‘మా నాన్న సూపర్‌హీరో’ అంటున్నారు సుధీర్ బాబు. ‘లూజర్’ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో ఆర్నా హీరోయిన్. సీఏఎం ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం (జూన్ 18) ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
సంపదకు మించిన స్ఫూర్తి.. బిజినెస్‌లో స్ఫూర్తివంతమైన తండ్రీకొడుకులు
ప్రపంచంలో అద్భుతమైన బంధం తండ్రీకొడులది. తండ్రి పిల్లలకు అన్నీ ఇస్తాడు. చాలా మంది తండ్రులు జీవితాంతం కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇస్తారు. కానీ కొంత మంది సంపదకు అంతకు మించిన స్ఫూర్తిని వారసత్వంగా అందిస్తారు. పిల్లలు కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తానే ఆ తండ్రుల పేరు శాశ్వతంగా నిలబడుతుంది. ఏటా జూన్ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకొంటున్నాం. ఎంతో మంది విజయవంతమైన బిజినెస్మెన్ వేలు, లక్షల కోట్ల సంపదను సృష్టించి వారసులకు అందించారు. కానీ కొంతమందే సంపదతోపాటు అంతకుమించిన స్ఫూర్తిని వారసులకు పంచారు. అటువంటి కొందరు బిజినెస్‌మన్ ఫాదర్స్ గురించి తెలుసుకుందాం.. జమ్సెట్జీ టాటా భారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం జలపాతం శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. ఈ సమయంలో టెక్స్టైల్ మిల్లుల పొగలతో ముంబై నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పశ్చిమ కనుమలలో మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు డోరాబ్, రతన్ టాటాలు తదనంతరం బొంబాయి నగరానికి సరసమైన, స్వచ్ఛమైన విద్యుత్తు అందించేందుకు పునాది వేసినట్లు టాటా గ్రూప్ వారి వెబ్సైట్లో పేర్కొంది. అప్పటి నుంచి రతన్ టాటా తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన పేరును ఉన్నత స్థాయిలో నిలిపారు. ధీరూభాయ్ అంబానీ అంబానీ అనే పేరు దాదాపు ప్రతి భారతీయుడికి సుపరిచితమే. ధీరూభాయ్ అంబానీ అని కూడా పిలిచే ధీరజ్‌లాల్ హరిచంద్ అంబానీ.. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించారు. నిరాడంబరమైన సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన స్థాపించిన వ్యాపారం భారతదేశం అత్యంత గుర్తించదగిన, విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా మారింది. ధీరూభాయ్ అంబానీ తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ అంబానీలు వారసత్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కొడుకుగా ముఖేష్ అంబానీ తండ్రి స్ఫూర్తివంతమైన వారసత్వాన్ని కొనసాగించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. నేడు అదే చర్యను ఆకాష్ అంబానీ చేతుల మీదుగా అంబానీ మూడవ తరం అమలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, గ్రూప్‌లోని ఇతర కంపెనీల వృద్ధి, విజయానికి ఆయన చేసిన కృషి, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం. సజ్జన్ జిందాల్ సజ్జన్ జిందాల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది భారీ మల్టీ బిలియన్ల వ్యాపార సంస్థ. సజ్జన్ జిందాల్ కుమారుడు పార్త్ జిందాల్ తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తనకు అందించిన దానికంటే మించి సాధించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న బెంగళూరు ఎఫ్సీకి సీఈవో అయ్యారు. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో తిరుగులేని సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను మరింత వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు తండ్రీ కొడుకులు పెద్ద కలలు కన్నారు. ఈ డైనమిక్ తండ్రీ కొడుకుల వ్యాపార విజయ గాథలు నిజంగా ఆదర్శవంతమైనవి. లాలా కేదార్నాథ్ అగర్వాల్ లాలా కేదార్నాథ్ అగర్వాల్ 1947లో దేశ విభజన తర్వాత బికనీర్ నుంచి జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్లారు. చాందినీ చౌక్‌లో ట్రాలీలో సంప్రదాయ స్వీట్లు, సావరీస్ అమ్మడం ప్రారంభించారు. ఆయన కృషికి అదృష్టం తోడైంది. తక్కువ కాలంలోనే అదే ప్రాంతంలో 'బికనేర్ నమ్కీన్ భండార్' పేరుతో చిన్నపాటి దుకాణాన్ని ప్రారంభించి నంకీన్లు, చిరుతిళ్లు విక్రయించారు. కాలక్రమేణా అది 'బికనీర్‌వాలా'గా గుర్తింపు పొందింది. బికనేరి భుజియా, ఇతర ప్రామాణికమైన భారతీయ చిరుతిళ్ల వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. 1965లో వ్యాపారంలోకి అడుగుపెట్టిన లాలా కుమారుడు శ్యామ్ సుందర్ అగర్వాల్ బికనీర్‌వాలాను ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించారు. ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ బికానోను ప్రారంభించారు. బికనీర్‌వాలా వారసత్వాన్ని కొనసాగిస్తూ మూడో తరం వ్యాపారవేత్త మనీష్ అగర్వాల్ 2000లో వ్యాపారంలో చేరారు. బికానో ఇప్పుడు వివిధ రకాల నామ్కీన్లు, కుకీలు, స్వీట్లు, పాపడ్, సిరప్లు, సమోసా వంటి పిండి పదార్థాలను విక్రయిస్తోంది. -
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
నాన్నా! నన్నెందుకు కన్నావు? అని అమితాబ్ అడిగితే..
నేడు(జూన్ 18) అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి.. ఆధునిక భారతీయ కవులలో హరివంశ్రాయ్ బచ్చన్ సుప్రసిద్ధుడు. హిందీ కవిత్వంలోని ‘నయీ కవితా’ ఉద్యమ సారథుల్లో ఆయన ఒకరు. ఆయన 135 రుబాయిలతో రాసిన ‘మధుశాల’ కావ్యం ఆధునిక హిందీ కవిత్వానికి తలమానికంగా నిలిచే కావ్యాలలో ఒకటి. హిందీ సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా హరివంశ్రాయ్ బచ్చన్ ‘పద్మభూషణ్’ పొందారు. హరివంశ్రాయ్ బచ్చన్ భార్య తేజీ బచ్చన్ కూడా కవయిత్రి. తల్లిదండ్రుల రంగంలో కాకుండా, భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్‌పై తండ్రి ప్రభావం చాలానే ఉంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ తొలినాళ్లలో నానా ఇక్కట్లు, తిరస్కారాలు ఎదుర్కొన్నా, సూపర్‌స్టార్‌గా ఎదిగి, బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. (చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? సనాతన ద్రోహినా?: రచయిత భావోద్వేగం) కష్టాలు పడుతున్న కాలంలో అమితాబ్ ఒకనాడు పట్టరాని ఉక్రోషంతో తండ్రి గదిలోకి వెళ్లి ‘నాన్నా! నన్నెందుకు కన్నావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఏదో రాసుకుంటూ ఉన్న హరివంశ్రాయ్ బచ్చన్ కొడుకు అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా అతన్ని ఒకసారి తేరిపార చూశారు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటికి అమితాబ్ ఆ గది నుంచి వెళ్లిపోయాడు. మర్నాటి ఉదయమే హరివంశ్రాయ్ తన కొడుకును నిద్రలేపి, చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో ఈ కవిత ఉంది: ‘నా కొడుకు నన్నడిగాడు– నన్నెందుకు కన్నావని బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు. నన్ను కనడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు. నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు నా తాత కూడా అతణ్ణి అడగలేదు... నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు? నీ పిల్లలను కనే ముందు నువ్వు వాళ్లనడుగు’ అమితాబ్ ఆలోచనలో మార్పు తెచ్చిన కవిత ఇది. ఒక సందర్భంలో ఈ కవితను ప్రస్తావించాడాయన. తనను ప్రభావితం చేసిన తన తండ్రిని అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. -
Fathers Day: తండ్రీ..నిన్ను తలంచి!
‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అన్నాడు అమెరికన్ రచయిత క్లారెన్స్ బడింగ్టన్ కెలాండ్. పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు, అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే, తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే చాలదు. నిజాయితీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో! ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే, పిల్లలు సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే, రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మిగులుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా, ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినప్పుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి! ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని శతకకారుడు అందుకే అన్నాడు. తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు, పుత్రికల వల్ల కూడా కలుగుతుంది. చరిత్రలోను, వర్తమానంలోను అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన వారి పిల్లల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తండ్రుల దినోత్సవం జరుపుకోవడం వెనుకనున్న కథా కమామిషును కూడా తెలుసుకుందాం. తండ్రుల దినోత్సవం వెనుకనున్న మహిళ అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 నుంచి మొదలైంది. తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకొంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్ మహిళ సొనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది. ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవం జరిగింది. దీంతో ఆమె ‘మదర్ ఆఫ్ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్ నెల మూడోవారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఒక తండ్రి, ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తిమంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడ్డాయని ఇందిరా గాంధీ ఒక సందర్భంలో చెప్పారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27న కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిర తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే, 1959లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా, ఆయన మంత్రివర్గంలో ఇందిరా గాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి, ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతా పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుపొందారు. పండిట్ రవిశంకర్ అనౌష్కా శంకర్ భారతీయ సంగీత దిగ్గజాల్లో పండిట్ రవిశంకర్ ప్రముఖుడు. సితార్ వాద్యానికి పర్యాయపదంగా మారిన రవిశంకర్ సంగీతరంగంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తొలినాళ్లలో తన సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలసి నృత్యం చేసుకుని, దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నా, అనతి కాలంలోనే నృత్యాన్ని విడిచిపెట్టి, సంగీతాన్ని తన రంగంగా ఎంచుకున్నారు. నాటి ప్రఖ్యాత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్ వద్ద సితార్ నేర్చుకున్నారు. ప్రస్తుత సంగీతరంగంలో ప్రాచుర్యం పుంజుకున్న ఫ్యూజన్ ప్రయోగాలను రవిశంకర్ దశాబ్దాల కిందటే చేశారు. ఎందరో పాశ్చాత్యులకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. సంగీతంపై అభిరుచి కనబరచిన తన కూతురు అనౌష్కా శంకర్‌ను అద్భుతమైన విద్వాంసురాలిగా తీర్చిదిద్దారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మాదిరిగా సంగీత రంగంలో వారసత్వం పెద్దగా పనిచేయదు. పిల్లలకు స్వతహాగా అభిరుచి, ఆసక్తి ఉంటే తప్ప తండ్రుల అడుగుజాడల్లో ఈ రంగంలో రాణించలేరు. పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్కా శంకర్ తండ్రి అడుగుజాడల్లోనే సితార్ విద్వాంసురాలిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం ఒక అరుదైన విశేషం. అనౌష్కా తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి రవిశంకర్ శిక్షణలో సితార్‌పై సరిగమలు పలికించడం నేర్చుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, కాలేజీలో చేరకుండా పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని నిర్ణయించుకుని, తండ్రి ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది గంటలు సాధన చేస్తూ విద్వాంసురాలిగా ఎదిగారు. ఎన్ని శైలీభేదాలు ఉన్నా, సంగీతం విశ్వజనీనమైనదని తన తండ్రి నమ్మేవారని, ఆయన నుంచే విభిన్న శైలులకు చెందిన సంగీతాన్ని సమ్మేళనం చేయడం నేర్చుకున్నానని, సంగీతంలో తనకు గురువు, దైవం, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత తన తండ్రేనని అనౌష్కా శంకర్ చెబుతారు. ధీరూభాయ్ అంబానీ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ భారతీయ పారిశ్రామిక రంగంలో టాటా, బిర్లాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా చరిత్ర సృష్టించారు. సామాన్య గ్రామీణ ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన ధీరూభాయ్ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఉపాధి వేటలో భాగంగా యెమెన్ వెళ్లి, అక్కడ కొంతకాలం ఒక పెట్రోల్ పంపులో పనిచేశారు. యెమెన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశాక తన సమీప బంధువు చంపక్లాల్ దమానీతో కలసి ‘మజిన్’ పేరుతో ఎగుమతులు దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలానికి చంపక్లాల్తో భాగస్వామ్యాన్ని వదులుకుని ధీరూభాయ్ సొంతగా వ్యాపారంలోకి దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించి, తొలుత పాలియెస్టర్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా దాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. ధీరూభాయ్ తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు వ్యాపార నిర్వహణలోని మెలకువలను నేర్పించారు. ధీరూభాయ్ 2002లో మరణించే నాటికి రిలయన్స్ గ్రూప్ భారతీయ పారిశ్రామిక రంగంలోనే అగ్రస్థానంలో ఉండేది. తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ముదరడంతో 2004లో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చేతికి, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అనిల్ అంబానీ చేతికి వచ్చాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కొంత వెనుకబడినా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది. (చదవండి: మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?) -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్నే
‘ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్నే’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మన జీవితం అమ్మది.. జీవనం నాన్నది’ అని చెప్పారు. ‘మా నాన్న రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచే నాకు నాయకత్వ లక్షణాలునేర్పారు’ అని పేర్కొన్నారు. నాన్న ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని.. ఉన్నతంగా బతకాలని చెప్పేవారని తెలిపారు. ఆయన చూపిన బాటలో తాను నడుస్తున్నానని.. రాజకీయంగా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నానని చెప్పారు. -
నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే: పాయల్ రాజ్‌పుత్
‘తండ్రీకూతుళ్ల అనుబంధం అపురూపమైనది.. మాటల్లో వర్ణించలేనిది. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే. అర్ధరాత్రివరకూ సాగే కబుర్లు, సరదా ఆటలు, చిన్నపాటి సాహసాలు వంటివి తండ్రీకూతుళ్ల అనుబంధాలను చాలా స్పెషల్‌గా మార్చుతాయి. మా లైఫ్‌లో అలాంటి ప్రత్యేక సమయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారే నా బలం. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయనే’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి విమల్‌కుమార్ రాజ్‌పుత్ గురించి పాయల్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ► జీవితం అంటే ఏంటో మా నాన్న నాకు నేర్పించారు. అలాగే మనతో మనం నిజాయతీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో డైరెక్షన్లో వెళుతుంది. తండ్రీ కూతురి జీవితం కూడా అంతే. మా లైఫ్ వెళ్లే డైరెక్షన్ ఏదైనా మా బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. అది ‘అన్బ్రేకబుల్’. ► చాలా విషయాల్లో మా నాన్న నాకు స్ఫూర్తిగా ఉంటారు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి? అనే విషయాలు మాత్రం నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే తోటివారితో ఎలా మసులుకోవాలో కూడా ఆయన్ను చూసే తెలుసుకున్నాను. హార్డ్‌వర్క్ చేసేవారికి ఉండే విలువ ఏంటో నాన్న నాకు చెప్పారు. అలాగే మనం నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. నా కలల విషయంలో రాజీ పడకుండా నన్ను నేను ఓ బెటర్ పర్సన్‌గా తీర్చిదిద్దుకోవడానికి మా నాన్నగారి మాటలు, ఆచరణ విధానాలే నాకు దోహదపడ్డాయి. ► మా నాన్న చాలా ట్రెడిషనల్. నేను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా.. నటనపై నాకు ఉన్న ప్యాషన్‌ను, సినిమా ఇండస్ట్రీ పంథాను అర్థం చేసుకున్నాక నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వృత్తిపరంగా నిరూపించుకునే విషయంలో అసలు ఏ మాత్రం తగ్గొద్దు అని అంటుంటారు. అంతేకాదు..కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి మా నాన్న ఒకప్పుడు యాక్టర్ కావాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు ఆయన కలను నేను నిజం చేసినందుకు గర్వంగా ఉంది. ► ఓ నటిగా నా కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడతారు. ‘నీ ప్రయాణంలో జయాపజయాలు ఓ భాగం మాత్రమే. వైఫల్యాలు ఎదురైతే వాటిని మైండ్‌కు ఎక్కించుకోకు. ఏదైనా తాత్కాలికమే. ఏదీ శాశ్వతం కాదు. సో.. జీవితం ఎలా వస్తే అలా ఉండు.. హ్యాపీగా ఉండు’ అంటారు. -
నాన్నా.. నీ స్పర్శ ఈ బొంత రూపంలో.. మదిని మెలిపెట్టే వీడియో!
మనకు ఎంతో ఇష్టమైనవారు దూరమైనప్పుడు భరించలేని బాధ కలుగుతుంది. వారు లేకపోయినప్పటికీ జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉంటారు. దూరమైన వారు వాడిన వస్తువులు, వారికి ఇష్టమైన వాటిని ఇంట్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ వారు ఉన్నట్లుగా భావిస్తుంటారు కొందరు. కానీ నిఖిత అనే అమ్మాయి తన తండ్రి స్పర్శ మరింత దగ్గర ఉండాలని భావించింది. ఇందుకోసం తన తండ్రి ధరించిన దుస్తులను బొంతలుగా మార్చింది. ఆ బొంత స్పర్శలో తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ సాంత్వన పొందుతోంది. ముంబైకి చెందిన నిఖిత ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఎంతో సరదాగా ఉండే నిఖిత తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి మరణాన్ని కుటుంబం మొత్తం జీర్ణించుకోలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆయనతో గడిపిన క్షణాలు నిఖితకు పదేపదే గుర్తుకొచ్చేవి... ఇలా ఆలోచిస్తోన్న సమయంలో ఆయన ధరించిన బట్టలు కనిపించాయి నిఖితకు. ‘‘ఎంతో ఖరిదైన, మంచి రంగు రంగుల షర్ట్స్ ధరించేవారు నాన్న. వీటిని ఇలా వదిలేస్తే పాడైపోతాయి. వీటిని నాన్న జ్ఞాపకంగా భద్రంగా మార్చాలి’’ అనుకుంది. అనుకున్న వెంటనే తన తండ్రికి ఎంతో ఇష్టమైన పింక్, బ్లు కలర్ చొక్కాలన్నింటిని ప్యాక్ చేసి ‘పుర్కాల్ స్త్రీ శక్తి సమితి’ వాళ్లకు పంపింది. పుర్కాల్ వారు ఆ చొక్కాలతో తయారు చేసిన బొంతలను అనుకోకుండా వాళ్ల నాన్న పుట్టినరోజు మార్చి 8న పంపించారు. ఈ విషయాన్ని తాజాగా జూన్ 19 ‘ఫాదర్స్ డే’ రోజున నిఖిత తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఇప్పటిదాక ఈ విషయం తెలియని నిఖిత సోదరుడు నిఖిత ఇచ్చిన బొంతను ఆశ్చర్యంతో తెరిచి చూసిన వీడియో, తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఆనందంగా గడిపిన క్షణాలున్న వీడియోను పోస్టుచేస్తూ..‘‘నాన్న నువ్వు మా పక్కన లేకపోయినప్పటికీ, నీ స్పర్శ ఈ బొంత రూపంలో మమ్మల్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుతుంది’’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసింది. దీంతోపాటు తన తండ్రి చొక్కాలను బొంతగా ఎలా మార్చిందో వివరించి చెప్పింది. ఇప్పటిదాక నిఖిత పోస్టుకు పన్నెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. లక్షమందికి పైగా యూజర్లు ఆమె చేసిన పనిని మెచ్చుకోలుగా లైక్ చేశారు. కొంతమంది యూజర్లు తమకిష్టమైన వారిని గుర్తుచేసుకుంటూనే, ఐడియా చాలా బావుంది. మేముకూడా ఇలా చేస్తామని భావోద్వేగ కామెంట్లు పెడుతుంటే నిఖిత పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయారని జీవితాంతం కుమిలిపోకుండా, వారి జ్ఞాపకాలను రకరకాలుగా భద్రపరచుకుంటూ వారు మనతోనే ఉన్నట్లు భావించవచ్చు అని నిఖిత ఆలోచన చెబుతోంది. దీని ద్వారా తమ వారిని కోల్పోయిన వారికి కొంత ఊరట కలుగుతుంది. పుర్కాల్.. చిన్ని స్వామి అనే పెద్దావిడ నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ‘పుర్కాల్ స్త్రీ శక్తి సమితి’ని డెహ్రాడూన్‌లో స్థాపించింది. చేతులతో తయారు చేయగల... ఇళ్లలో వినియోగించే వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. గత పదిహేడేళ్లుగా డెహ్రడూన్‌లోని నలభై గ్రామాల్లోని దాదాపు రెండువందల మంది మహిళలకు ఈ సమితి బాసటగా నిలిచింది. వీరు రూపొందిస్తోన్న వాటిలో ముఖ్యమైనవి బొంతలు కాగా, కుషన్ కవర్స్, ఆఫ్రాన్స్, టీ కాసీస్, బ్యాగ్స్, సాఫ్ట్ టాయిస్, పెట్స్ కోసం ప్లేమ్యాట్స్ వంటివెన్నో తయారు చేసి విక్రయిస్తున్నారు. వీరు తయారు చేసినవే గాక, నిఖితలాంటి వాళ్లు ఇచ్చిన ఆర్డర్లను అందమైన జ్ఞాపకాలుగా మార్చడం వీరి ప్రత్యేకత. View this post on Instagram A post shared by Nikhita Kini (@nikhitakini) -
హృదయ విదారకం: ఓ వైపు వివాహ తంతు, మరో వైపు అంత్యక్రియలు
పుల్కల్(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్ అహ్మద్(గూడు పటేల్)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి.. -
ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రులతో కలిసి పిల్లలు క్యాట్ వాక్
-
'మా నాన్నే మా సూపర్ హీరో'!
మైక్రో బ్లాగర్ ట్విటర్ యూజర్లను దాటే లక్ష్యంగా దేశీయ సోషల్ మీడియా సంస్థ 'కూ' దూసుకుకెళ్తుంది. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో 'కూ' 'పాపా కి లవ్ లాంగ్వేజ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫాదర్స్ డే సందర్భంగా వినియోగదారులు వారి తండ్రికి సంబంధించిన ఆత్మీయ కథనాలతో పాటు ఫోటోలు, మీమ్‌లు,వీడియోల ద్వారా ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకునే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా యూజర్లు వారి నాన్నల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో గుర్తు చేస్తూ ఆయన్ని సంతోష పెట్టే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తుంది.ఈ కాంపెయిన్లో భాగంగా, కూ యాప్ ప్రత్యేక కవితల పోటీని కూడా ప్రారంభించింది, కవిత్వం ద్వారా తమ తండ్రికి కృతజ్ఞత తెలియజేసేందుకు యూజర్లను ఆహ్వానిస్తోంది. మరి ఈ పోటీల్లో మీరూ పాల్గొంటున్నారా. Koo App Baat koi bhi ho, papa se sidha reply kahan aana hai.😝 Yeh #PapaKiLoveLanguage bhi na, Daant aur Dulaar ka perfect mixture hai.🥰 Share kariye apne #PapaKiLoveLanguage & jeetiye Koo Goodies. 🎁 #FathersDay #ContestAlert View attached media content - Koo (@KooOfficial) 17 June 2022 -
మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
నేడు ఫాదర్స్ డే (జూన్ 19). ఈ సందర్భంగా టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అనారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. It is a great feeling to be a grateful son and a proud father! #HappyFathersDay to all!💐😍 pic.twitter.com/3n7OFwQ8Ka — Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2022 మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ..‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’అని మహేశ్ ట్వీట్ చేశాడు. You led by example and showed me what it means to be a father.. I wouldn't be who I am without you.. Happy Father's Day Nanna! ❤️ pic.twitter.com/UYADkoKeOm — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2022 ‘నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న’అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న ❤️ pic.twitter.com/j4eAgUct5S — BANDLA GANESH. (@ganeshbandla) June 19, 2022 View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Nanna, You had not only given me life but also all the qualities required to live it happily and successfully: The courage to face difficulty, The cheerfulness to savour every moment.. This is the first father's day without you and miss you badly nannaa.. Love you Forever ❤️ pic.twitter.com/ZNZNewlZke — Sreenu Vaitla (@SreenuVaitla) June 19, 2022 Thank you for guiding me in my best and worst. No one like you! #HappyFathersDay love u daddy❤️❤️ pic.twitter.com/krXxGZwh45 — nithiin (@actor_nithiin) June 19, 2022 View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
Father's Day: తండ్రిని తలుచుకొని పాట పాడిన ఎమ్మెల్యే నోముల భగత్
సాక్షి, నల్గొండ: అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే..బతుకంతా ధారపోసి జీవితమిచ్చేది మాత్రం నాన్నే. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించేది.. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదల్లో ధైర్యంగా నిలబడేలా చూసేది నాన్నే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి నాన్నే. అందుకే.. నాన్న నీకు వందనం. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డేఏ సందర్భంగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్యను తలుచుకొని పాట పాడారు.. నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా’ అంటూ పాట పాడారు. ఈ పాటను తనే స్వయంగా రాసి తండ్రికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన టట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘మా నాన్నకు అంకితం.. ప్రపంచంలోని నాన్నలందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట జనాలకు ఆకట్టుకుంటోంది. చదవండి: Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే! A small dedication to my father..Happy father's day to all father's out there...#fathersday pic.twitter.com/xuUEXJtC3s — Nomula Bhagath Kumar (@BagathNomula) June 19, 2022 -
మా మంచి నాన్న..
తప్పటడుగులు వేసే వేళ వేలు పట్టుకు నడిపిస్తాడు.. భుజాన కూర్చోబెట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు.. ముళ్లబాటలో పయనించేవేళ హెచ్చరించి సన్మార్గంలో నడిపిస్తాడు..తాను చిరిగిన దుస్తులు ధరించైనా పిల్లలకు కొత్తవి కొనిస్తాడు.. తిన్నా తినకపోయినా వారి కడుపునింపే ప్రయత్నం చేస్తాడు.. పిల్లల్లో పిల్లల్లా కలిసిపోతూ వారి సరదాలు, ఆనందాలు, బాధలు అన్నింట్లో పాలుపంచుకుంటాడు.. వారి విజయాన్ని తాను సాధించినట్లుగా సంబరపడిపోతాడు.. ఓడినప్పుడు ఈసారి నీదేలే గెలుపని భుజం తట్టి ప్రోత్సహిస్తాడు.. కష్టసుఖాల్లో తోడు, నీడగా నిలుస్తాడు.. ‘నేనున్నా’నంటూ భరోసా కల్పిస్తాడు. మొదటిగురువుగా మారి అక్షరాలు దిద్దించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాడు.. ఇవన్నీ నాన్న కాక ఇంకెవరు చేస్తారు. అందుకే ‘ఓ నాన్న.. నీ మనసే వెన్న.. అమృతం కన్నా అది ఎంతో మిన్న..’ వెన్నుతట్టి.. ప్రోత్సహించి.. మీర్‌పేట: ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించే రోజులు.. పుట్టిన నాటి నుంచి పెళ్లీడు ఎప్పుడు వస్తుందా.. ఓ అయ్యకిచ్చి పెళ్లి తంతు జరిపించేస్తే బాధ్యత పూర్తవుతుందని వేచి చూసేవారు ఎందరో. కానీ ఆ తండ్రి అలా కాదు.. పుట్టింది ఆడపిల్ల అయినప్పటికీ మగపిల్లాడి కంటే మిన్నగా చిన్న నాటి నుంచి చదువుతో పాటు నచ్చిన రంగాల్లో వెన్నంటి ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఆ కూతురు ఉన్నత శిఖరాలకు చేరి ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత భద్రత సంస్థ అయిన సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్‌గా వైద్య సేవలందించే స్థాయికి ఎదిగింది. అవసరమైనప్పుడు దేశ రక్షణకు తుపాకీ చేత పట్టి పహారా కాస్తోంది. ఆమే మీర్‌పేట నందీహిల్స్‌కు చెందిన నారాయణరెడ్డి చిన్న కుమార్తె డా.కె.షర్మిళారెడ్డి. ప్రతి అడుగులో నాన్న తోడున్నారు.. గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 2020 జూలై 18న విధుల్లో చేరాను. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా భద్రతా బలగాలకు ఎలాంటి శిక్షణ ఇస్తారో అన్ని రకాల శిక్షణలు ఇచ్చారు. వైద్య సేవలు అందిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో జవాన్లతో కలిసి విధులు నిర్వర్తిస్తాం. ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్‌గా కాంపోజిట్ హాస్పిటల్ చాంద్రాయణగుట్టలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే. ఆయన నా ప్రతి అడుగులోనూ తోడుండి వెన్నుతట్టి ప్రోత్సహించారు. మహిళలు భద్రతా బలగాల్లో ఎలా పనిచేస్తారు అని ఏనాడూ వద్దని చెప్పలేదు. నాన్న, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. – డా.కె.షర్మిలారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ మెడికల్ ఆఫీసర్, సీఆర్పీఎఫ్ -
కెఎస్ఆర్ లైవ్ షో 19 June 2022
-
డాడీది చిన్నపిల్లల మనస్తత్వం.. ముగ్గురిని ఒకేలా చూస్తాడు: లావణ్య త్రిపాఠి
నాన్న మంచి స్నేహితుడు అయితే.. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు’ అంటున్నారు లావణ్యా త్రిపాఠి. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా లావణ్య తండ్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. ♦ మా నాన్నగారు వెరీ ఫ్రెండ్లీ. ఆయనకు సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువ. ఆయన్నుంచి నాకు కూడా అది వచ్చింది. నా లైఫ్‌లో నేను చూసిన మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నా చిన్నప్పట్నుంచీ ఆయన్ను చూసిన వ్యక్తిగా చెబుతున్నాను... మా డాడీ బెస్ట్. అందర్నీ సమానంగా చూస్తారు. మా ఇంట్లో పని చేసేవాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లకు ఏదైనా కష్టం అంటే ఆదుకుంటారు. మనం మన కోపాన్ని ఎవరో ఒకరి మీద చూపించవచ్చని కొందరం అనుకుంటాం. కానీ మా డాడీ అలా కాదు. తన కోపాన్ని తనలోనే దాచుకుంటారు. ఆనందాన్ని మాత్రమే పంచుతారు. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ♦ మా డాడీ తన శక్తికి మించిన మంచి పనులు చేయడం చూశాను. ఆ మంచి పనులే ఆయన పిల్లలకు మంచి ఆశీర్వాదాలు అయ్యాయన్నది నా నమ్మకం. యూపీలో చిన్న పల్లెటూరి నుంచి వచ్చినప్పటికీ డాడీ ఆలోచనలు చాలా ఫార్వార్డ్‌గా ఉంటాయి. కూతుళ్లుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డాడీలో మంచి ఫ్రెండ్ ఉండటం ఏ కూతురికైనా అదృష్టం. ♦మా డాడీది చిన్నపిల్లల మనస్తత్వం. చాలా కూల్ ఫాదర్. పిల్లల మీద ఏమాత్రం ప్రెజర్ పెట్టని తండ్రి. తన ఇద్దరి కూతుళ్లను, కొడుకుని సమానంగా చూస్తారు. మా ముగ్గుర్నీ ఒకేలా ప్రోత్సహిస్తారు. మా నాన్నగారి సహాయపడే గుణం, పాజిటివ్నెస్.. ఇవన్నీ చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. మా డాడీ చేసే మంచి పనులు నాకు చాలా స్ఫూర్తిగా ఉంటాయి.. ‘ఐ లవ్ హిమ్’. నాకు ఆయనంటే ప్రేమ మాత్రమే కాదు.. గౌరవం కూడా. -
డాడీతో ఫ్రెండ్లీగా ఉంటా..ముద్దుగా అలా పిలుస్తాడు: కృతీశెట్టి
మా డాడీ వెరీ నైస్. మా ఇద్దరికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుందని అంటోంది సొట్టబుగ్గల భామ కృతీ శెట్టి. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి గురించి కృతి ఏమంటున్నారో తెలుసుకుందాం. ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో మా డాడీ కోసం ముంబై వచ్చాను. మా డాడీకి స్వీట్స్ అంటే ఇష్టం. ఈ ఫాదర్స్ డేకి నాన్న కోసం కేక్ ఆర్డర్ చేశాను. డాడీకి షూస్ అంటే చాలా ఇష్టం. అవి కొన్నాను. మీ నాన్నని సంతోషపెట్టే విషయం? ‘నేనే’. కూతురు ఉంటే చాలు ఆయనకు. మీపట్ల మీ డాడీ తీసుకునే కేర్ గురించి? అమ్మానాన్న ఇద్దరూ జాబ్ చేసేవారు. నేను స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ‘స్కూల్ నుంచి వచ్చేశావా’ అని రోజూ ఇద్దరూ ఫోన్ చేసేవారు. తినడానికి ఏమైనా రెడీగా ఉంచేవారు. ఏ డ్రెస్ వేసుకోవాలో రెడీగా పెట్టేవారు. ట్యూషన్‌కి వెళ్లే ముందు ఫోన్ చేసేవారు. డాడీ చాలా కేరింగ్. ఒక్కోసారి డాడీ స్కూల్‌కి వచ్చి పికప్ చేసుకుని, రెస్టారెంట్‌కి తీసుకెళ్లేవారు. ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్లం. డాడీ నన్ను వదిలి ఉండేవారు కాదు. మరి.. షూటింగ్స్‌కి మీతో పాటు వస్తుంటారా? వస్తారు కానీ ఓ 15 నిమిషాల తర్వాత ఆయనకు బోర్ కొట్టేస్తుంది. డాడీకి సినిమాలంటే ఇష్టమే కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఓపిక తక్కువ. నేను, అమ్మ హైదరాబాద్‌లో ఉంటున్నాం. డాడీకి వర్క్ ఉంది కాబట్టి ముంబైలో ఉంటారు. నన్ను వదిలి ఒక్క 20 రోజులు ఉండగలరు. ఆ తర్వాత డాడీకి బెంగగా ఉంటుంది.. నాకూ అలానే ఉంటుంది. మీ డాడీ చాలా కేరింగ్ అన్నారు. జనరల్‌గా అమ్మాయిలకు చెప్పే జాగ్రత్తలు చెబుతుంటారా? మా డాడీ వెరీ నైస్. ఎందుకంటే ‘అమ్మాయివి కదా అలా ఉండకూడదు.. ఇలా ఉండాలి’ అని ఎప్పుడూ అనలేదు. ‘నువ్వు అమ్మాయివి కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలి. భయపడుతూ ఉండక్కర్లేదు’ అని అంటుంటారు. ఆ మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంటాయి. మీరు అలిగినప్పుడు నవ్వించడానికి మీ నాన్నగారు, మీ నాన్నకి కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ మా ఇద్దరికీ కోపమే రాదు. మాది ‘ఫ్రెండ్లీ కామెడీ రిలేషన్షిప్’. ఫలానా టైమ్‌లో నాన్న నన్ను కోప్పడ్డారు అని చెప్పడానికి నా లైఫ్‌లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. అలానే నేను అలిగిన సందర్భాలూ లేవు. చెప్పాలంటే నాన్న నాకంటే కూల్. ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడో, అల్లరి చేసినప్పుడో మందలించలేదా? నాకెప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. అల్లరి పిల్లని కూడా కాదు. మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ‘బుంగీ’ అని పిలుస్తారు. బుంగీ అంటే అర్థం? అర్థం లేదు. ముద్దుగా అలా అంటారు. లైఫ్‌లో డల్ మూమెంట్స్ సహజం. అలాంటి టైమ్‌లో మీ నాన్న మిమ్మల్ని ఎలా ఓదార్చుతారు? ‘నీకు లైఫ్‌లో బాధ పడే క్షణాలు లేకపోతే ఆనందం విలువ తెలియదు. అందుకని కొన్ని బాధలు ఉండాలి. ఆ బాధను పాజిటివ్‌గా తీసుకుని అధిగమించాలి’ అని మా డాడీ అంటుంటారు. అందుకే ఏదైనా చిన్న చేదు అనుభవం ఎదురైనా పాజిటివ్‌గా తీసుకుంటాను. మీ తండ్రీకూతుళ్లలో ఉన్న కామన్ క్వాలిటీస్? ఇద్దరికీ ఫుడ్ అంటే ఇష్టం. అది కూడా ఫాస్ట్ ఫుడ్. లిమిట్ లేకుండా లాగించేస్తాం. అలాగే ఇద్దరికీ కామెడీ చాలా ఇష్టం. పాత హిందీ సినిమా పాటలను ఇష్టపడతాం. ఇద్దరం కలిసి వింటాం. ఒక్క సినిమా (ఉప్పెన)తోనే మీరు స్టార్ హీరోయిన్ కావడంపట్ల మీ నాన్న చాలా ఆనందపడి ఉంటారు.. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కాబట్టి హీరోయిన్ అవుతానంటే మీ నాన్నగారు ఏమన్నారు? అమ్మానాన్న నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ అంటే ఇద్దరికీ మంచి అభిప్రాయం ఉంది. ‘మనం మంచి పనులు చేస్తే మనకు అంతా మంచే జరుగుతుంది’ అని మా డాడీ అంటారు. ఆ మంచి పనులు చేయడంవల్లే నాకు మంచి జరిగిందని నమ్ముతాను. నా కెరీర్ మంచి షేప్ తీసుకున్నందుకు నాన్న చాలా హ్యాపీ. ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది (నవ్వుతూ). మీ డాడీ విషయంలో మీరు ప్రౌడ్‌గా ఫీలయ్యేది? మా డాడీ అంత మంచి మనిషిని చూడలేదు. సమాజానికి తిరిగి ఇవ్వాలంటారు. పాజిటివ్ పర్సన్. నన్ను కూడా హెల్ప్ చేయమని అంటుంటారు. ఇంత మంచి లక్షణాలున్న వ్యక్తి కాబట్టి డాడీని చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న ఎప్పుడూ ఇంతే హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. -
ప్రియమైన నాన్నకు కానుకగా...
‘ఫాదర్స్ డే’ రోజు నాన్నకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పటినుంచో ప్రిపేరవుతున్న వారితోపాటు, ‘ఈరోజు ఫాదర్స్ డే కదా! మరిచేపోయాను’ అంటూ నాన్నకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? అని ఆలోచించేవారు కూడా మనలో ఉంటారు.నాన్నే మనకు పెద్ద కానుక.. మరి అలాంటి నాన్నకు మనం కానుక ఇవ్వాలి కదా... కొన్ని గిఫ్ట్ గ్యాడ్జెట్స్... ►నాన్నకు సంగీతం అంటే ఇష్టమా? అయితే సోనోస్ రోమ్ మినీ స్పీకర్‌ను కానుకగా ఇవ్వవచ్చు. నాన్న టేబుల్‌పై ఒక గ్లాస్లాగా దీన్ని పెడితే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. వినడానికి హాయిగా ఉంటుంది. ►నాన్నకు పుస్తకాలు చదవడం ఇష్టం అయితే, ఇ–రీడర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం మంచిది. దీన్ని ఎంచుకునే ముందు లాంగ్ బ్యాటరీ లైఫ్, అడ్జస్టబుల్ కలర్ టెంపరేచర్, చదవడానికి అనుకూలం, వాటర్–ఫ్రూఫ్... మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ►మజిల్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి, టెన్షన్ పోగొట్టడానికి ఆల్ట్రా–పోర్టబుల్ మసాజ్ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ►నాన్నకు సినిమాలు, షోలు చూడడం ఇష్టం అయితే రోకు స్ట్రీమింగ్ స్టిక్ 4కెను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఇది మేజర్ స్టీమింగ్ సర్వీస్‌లకు సపోర్ట్ చేసింది. యాప్స్‌తో యాక్సెస్ కావచ్చు. ►మిడ్సైజ్డ్ స్మార్ట్ డిస్ప్లే...అమెజాన్ ఎకో షో. వార్తలు, వాతావరణం, క్యాలెండర్... మొదలైనవి డిస్ప్లే అవుతాయి. మ్యూజిక్ వినవచ్చు. వీడియో కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ హోమ్ డివైజ్‌లను నియంత్రించవచ్చు. ►ఆన్లైన్లో ఫిట్నెస్ క్లాస్ మెంబర్షిప్, మెడిటేషన్ యాప్ సబ్స్క్రిప్షన్లు ఎన్నో ఉన్నాయి. నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఒకటి ఎంచుకోండి. ►నాన్నకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, ఆయన దగ్గర ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా సరే మోడ్రన్ పోలరైడ్ ఇన్స్టంట్ కెమెరాలాంటివి గిఫ్ట్‌గా ఇస్తే ఆయన ‘వావ్’ అనడం ఖాయం. ►ఫోన్ ఛార్జింగ్ చేయడం మరచిపోయి, బయటికి వెళ్లే అలవాటు నాన్నకు ఉందా? అయితే ఆయనకు ‘మీ పవర్‌బ్యాంక్’లాంటివి ఇవ్వడం పర్ఫెక్ట్ గిఫ్ట్. ‘ఫాదర్స్ డే’ రోజు ఖరీదైన గిఫ్ట్‌లే ఇవ్వాలని ఏమీ లేదు. మన పరిధిలో, తక్కువ టైమ్‌లో రకరకాల బహుమతులు ఇవ్వవచ్చు. అందులో కొన్ని.... ఫాదర్స్ డే ట్రోఫీ: ఒక షీల్ట్పై ‘మై బెస్ట్ ఫాదర్’ అని రాసి ఫాదర్స్ డే ట్రోఫీగా ఇవ్వండి. నాన్న చెట్టు: నాన్న పేరుతో పెరట్లో ఒక మొక్క నాటండి. నాన్న ఫోటోబుక్: నాన్న చిన్నప్పటి ఫోటో నుంచి పెళ్లికొడుకు డ్రెస్‌లో ఉన్న ఫోటో వరకు రకరకాల ఫోటోలతో ఒక పుస్తకం తయారు చేసి ఇవ్వండి. పోస్టర్: నాన్న ఫోటోతో ఒక పోస్టర్ తయారుచేసి ‘బెస్ట్ డాడ్ ఎవర్–లవ్ యూ’ అని రాసి ఇంటిగోడలకు అతికించండి. జనరేషన్ ఫోటోగ్రాఫ్: మీ తాత ఫోటో ఆ తరువాత రెండో వరుసలో నాన్న ఫోటో, ఆ తరువాత మీ ఫోటో డిజైన్ చేసి, మీ శుభాకాంక్షలు రాసి ఇవ్వవచ్చు. మినీ బుక్: పది నుంచి ఇరవై కార్డులతో(పేక ముక్కల సైజ్‌లో) ఒక బుక్‌లాగా తయారుచేయండి. మొదటి కార్డుపై ‘మీరు నాకు ఎందుకు ఇష్టం అంటే...’ అని పెద్ద అక్షరాలతో రాయండి. ఆ తరువాత వచ్చే కార్డులలో మీ నాన్న అంటే మీకు ఎందుకు ఇష్టమో చిన్న చిన్న వాక్యాలుగా రాసి గిఫ్ట్‌గా ఇవ్వండి. -
నాన్నకు ప్రేమతో.. కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసుకు..
సాక్షి, అమరావతి: ఆ తండ్రి కుమారుడిని వేలు పట్టుకుని నడిపించారు. అంతగా అక్షరాలు తెలియని ఆయన తన బిడ్డ ఆర్డీఓ కావాలని, పది మందికీ సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆ విష యాన్ని కుమారుడితో పాటు బంధువులు, ఊరి ప్రజలతో పదేపదే చెప్పేవారు. కొన్నాళ్లకు ఆ కుమారుడు తన తండ్రి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని కాదని ఆర్డీఓ ఉద్యోగంలో చేరాడు. నాన్న కలను నెరవేర్చాడు. ఆ కుమారుడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సేనాపతి ఢిల్లీరావు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన కోసం తండ్రి తపించిన తీరును, ఆయన కల నెరవేర్చిన వైనాన్ని కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పిడిమందస. మాది పేద కుటుంబం మాది. అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. నాన్న త్రినాథ్ పనులపై బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వరకు అంతా వేచి ఉండి, వచ్చాకే భోజనం చేసేవాళ్లం. ఎప్పుడైనా ఆయన రావడం ఆలస్య మైతే నేను నిద్రపోయేవాడిని. నాన్న వచ్చాక నన్ను నిద్రలేపి తన చేత్తో ఓ ముద్ద తినిపించి తిరిగి నిద్రపుచ్చేవారు. నన్ను బాగా చదివించి ఆర్డీఓను చేయాలన్నది నాన్న కల. విశాఖ సింహాచలం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే నన్ను తనే రైల్లో తీసుకెళ్లేవారు. చదవండి: (నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు) అలా తీసుకెళ్లేటప్పుడు నువ్వు బాగా చదువుకుని ఆర్డీఓ కావాలి నాన్నా.. అనేవారు. మా ఊరి వాళ్లతోనూ, బంధుగణంతోనూ అదే చెబుతుండేవారు. మా వాడు తహసీల్దారుకన్నా పెద్ద ఆఫీసర్ ఆర్డీఓ అవుతాడనేవారు. దురదృష్టవశాత్తూ నా ఇంటర్ అయ్యాక ఆయన చనిపోయారు. నేను చదువు పూర్తి చేసుకుని 2003లో కేంద్ర సర్వీసుకు చెందిన అగ్రికల్చర్ రీసెర్చి సర్వీసు ఇనిస్టిట్యూట్‌లో సైంటిస్ట్ ఉద్యోగంలో చేరాను. నాన్న కోసం కేంద్ర సర్వీసును వదిలి 2007లో రాష్ట్ర సర్వీసులకొచ్చాను. 2008 మార్చిలో విజయనగరం జిల్లా ఆర్డీఓగా చేరి నాన్న కల నెరవేర్చాను. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత గుంటూరు ఆర్డీఓగా, రాష్ట్రంలో పలు చోట్ల ఇతర హోదాల్లోనూ పనిచేశాను. ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నాను. నాన్న కోరుకున్నట్టుగా ఆర్డీఓ అయ్యాను. ఆర్డీఓకు మించి కలెక్టర్ స్థాయిలో ఉన్న నన్ను చూస్తే నాన్న ఎంత మురిసిపోయేవారో. కానీ విధి ఆయన్ను మా నుంచి దూరం చేసింది. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నాన్న ఆశీస్సులతోనే నేను ఆర్డీఓగా, కలెక్టర్‌గా ఎదిగానని భావిస్తున్నాను. మహేష్‌కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా నాన్న కోరిక నెరవేర్చా మా నాన్న రావిరాల నరసయ్య రెవెన్యూ శాఖలో నల్గొండ పట్టణంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగపర్వం ప్రారంభించారు. నాకు, మా అన్నయ్యకు చదువులో చిన్ననాటి నుంచి మార్గం చూపేవారు. మా వెన్నంటి ఉండి మా అన్నదమ్ములను ఎంబీబీఎస్ వరకు చదివించారు. మా నాన్నలో ఉన్న చిన్ననాటి కోరిక తీరకపోవటం, చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోవటంతో నన్ను సివిల్స్ వైపు నడిపించి ఐఏఎస్ అధికారి అయ్యేలా నా వెన్నంటి ఉండి నడిపించారు. 2016లో నేను ఐఏఎస్‌కు ఎంపికైనప్పుడు నా కోరికను నీలో చూసుకుంటున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మా కుటుంబం అంతా అంతులేని ఆనందం పొందాం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన మా నాన్నకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు. – మహేష్‌కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా -
Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే!
జీవితంతో విడదీయలేని బంధం నాన్న. కుటుంబ పెద్దగా ఎన్నో బాధ్యతలు మోస్తాడు. పిల్లల ఉన్నతికి పరితపిస్తూ ఎంత కష్టమైనా సంతోషంగా చేస్తాడు. అయితే, ఈ బాధ్యతల్లో తల్లి పాత్ర కూడా మరువలేనిది. కానీ తల్లి దూరమైన పిల్లల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. కొందరు పిల్లల పోషణ బాధ్యతల కోసం మరో వివాహం చేసుకుంటున్నా...మరికొందరు మాత్రం ‘మరో’ ఆలోచన లేకుండా పిల్లలే సర్వస్వంగా జీవనం సాగిస్తున్నారు. పిల్లల పెంపకం, పోషణపై దృష్టి సారిస్తూనే బతుకు బాధ్యతలు మోస్తున్న కొందరు ‘నాన్న’ల కథనాలు నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా... నిరూప్‌కు టిఫిన్ తినిపిస్తున్న శ్రీనివాస్ అన్నీ తానే వేంసూరు : వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన అర్చేపల్లి శ్రీనివాస్ ఆర్ఎంపీ గా, భార్య సుజాత హెచ్ఎంగా పనిచేస్తూ ఆనందంగా జీవించేవారు. 2021 ఏప్రిల్ 28 సుజాత కరోనాతో మృతి చెందడంతో కొడుకు నిరూప్‌కు శ్రీనివాస్ అమ్మానాన్న తనే అయ్యాడు. ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తూనే కొడుకును అమ్మలా లాలిస్తూ.. నాన్నలా ప్రేమిస్తున్న ఆయన ‘తల్లి లేని లోటు తీర్చలేకున్నా ఆ బాధ తెలియకుండా అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నాను’ అని తెలిపారు. హేమకు జడ వేస్తున్న తండ్రి సురేష్ హోటల్ పని.. పిల్లల ఆలనాపాలన బోనకల్ : వైరాకు చెందిన సురేష్ – మరి యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జెస్సీ, హేమ ఉన్నారు. హోటళ్లలో వంటలు చేస్తూ సురేష్ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, మూడేళ్ల క్రితం డెంగీ జ్వరంతో మరియమ్మ మృతి చెందింది. అప్పటికి పిల్లలు చిన్న వారే కావడంతో వారి ఆలనాపాలన అన్నీ సురేష్ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బోనకల్‌లోని హోటల్ పనిచేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో వారిని బడికి తయారుచేసి పంపడం కష్టంగా ఉన్నా.. ఇష్టంగా, ప్రేమతో చేస్తున్నారు.. జెస్సీ 8వ తరగతి, హేమ 5వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమార్తెను వైరా గురుకుల పాఠశాలలో చేర్పించాడు. చిన్న కుమార్తె హేమను మాత్రం తన వద్దే ఉంచుకుని చదివిస్తున్నాడు. తల్లి లేని వాళ్లం అనే ఆలోచన పిల్లల మనస్సులోకి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నానని సురేష్ చెబుతున్నాడు. ఉదయం లేవగానే కుమార్తెకు జడ వేయడం మొదలు వంట చేసి తినిపించి స్కూల్‌కు పంపించాక తాను హోటల్లో పనికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎంత కష్టమైనా సరే పిల్లలను ఉన్నత చదువులను చదివించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఇది కూడా చదవండి: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు సత్యసాయిబాబుతో కుమార్తెలు సుప్రియ, శ్రీలక్ష్మి నాన్నే ధైర్యం.. సత్తుపల్లి టౌన్ : సత్తుపల్లికి చెందిన నండూరి సత్యసాయిబాబు – లలిత దంపతులకు కుమార్తెలు సుప్రియ, శ్రీలక్ష్మి ఉన్నారు. లలిత గతేడాది కరోనాతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి తండ్రే తమకు అమ్మ ప్రేమ కూడా పంచుతూ.. స్నేహితుడిలా, గైడ్‌లా ప్రోత్సాహం అందిస్తూ ధైర్యాన్ని నింపుతున్నాడని సుప్రియ, లక్ష్మి చెబుతున్నారు. ఇంట్లో పిండివంటలు చేసి షాపుల్లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించే సత్యసాయిబాబు... పిల్లలను కష్టపడి చదివించారు. ప్రస్తుతం సుప్రియ హైదరాబాద్‌లో అకౌంట్ స్పెషలిస్ట్‌గా, శ్రీలక్ష్మి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులతో ముస్తఫా అమ్మలేని బాధ తెలియకుండా.. ఖమ్మం గాంధీచౌక్ : కన్న కొడుకులకు అమ్మ లేని లోటు తీరుస్తున్నారు మహ్మద్ ముస్తఫా. ఖమ్మం త్రీటౌన్ శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ముస్తఫా – జువేదా దంపతులకు ఇద్దరు కుమారులు రోషన్, రిఫా ఉన్నారు. జువేదా కేన్సర్ కారణంగా గత ఏడాది మరణించారు. అప్పటి నుంచి కొడుకుల ఆలనాపాలనా పూర్తిగా ముస్తఫా చూస్తున్నారు. రోషన్ పదో తరగతి, రిఫా తొమ్మిది తరగతి చదువుతుండగా, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ముస్తఫా తన ఉద్యోగ బాధ్యతలను చూసుకుంటూనే కొడుకులకు అవసరమైన ఏర్పాట్లు చేసి పాఠశాలకు పంపిస్తారు. వారిని ప్రయోజకులకు తీర్చిదిద్దమే తన లక్ష్యమని ముస్తఫా అంటున్నారు. పిల్లలతో వెంకటేశ్వర్లు ఆ లోటు లేకుండా... ఖమ్మం గాంధీచౌక్ : ముదిగొండ మండలం ధనియాలగూడెంకు చెందిన చెరుకుపల్లి వెంకటేశ్వర్లు – నిర్మల దంపతులకు ఆరేళ్లు, ఐదేళ్ల కుమార్తెలు సాహితి, లహరితో పాటు ఏడాదిన్నర కుమారుడు హర్ష ఉన్నారు. ఇంటి వద్దేచిన్న కిరాణం నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. ఏడాది కిత్రం కరోనాతో నిర్మల కన్నుమూసింది. అప్పటి నుంచి తన తల్లి సహకారంతో పిల్లల పోషణ బాధ్యతలు వెంకటేశ్వర్లు చూస్తుండగా ఆయన తల్లి కూడా పక్షవాతంతో మంచాన పడింది. అప్పటి నుంచి అన్నీ సిద్ధం చేసి చిన్నారులను స్కూల్‌కు పంపించాక తన కిరాణం నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పిల్లలే ప్రాణంగా జీవిస్తున్నాడు. పిల్లలకు వంట చేయడం మొదలు అన్ని పనులు చేస్తూ ఆయనను గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును పలకరించగా ‘నా పిల్లలే నాకు ప్రాణం.. కొందరు వారికి దద్తత ఇవ్వాలని అడిగినా అందుకు నేను అంగీకరించలేదు. మరో ఆలోచన కూడా లేదు.’ అని తెలిపారు. -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
ఫాదర్స్ డే రోజున ఘోరం: చిన్నారి కూతురు ఆత్మహత్య.. ఆగిన తండ్రి గుండె
సాక్షి, మండ్య: ప్రపంచ తండ్రుల దినోత్సవంనాడు సంతోషంగా శుభాకాంక్షలు చెప్పాల్సిన కుమార్తె ఉరితాడుకు వేలాడడం చూసి తండ్రి గుండెపోటుతో తనువు చాలించాడు. ఈ ఘోరం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలోని తళగవాది గ్రామంలో ఆదివారం జరిగింది. బాలిక బాంధవ్య (17), ఆమె తండ్రి కె.రాజు (65) మృతులు. రాజుకు నలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు బాంధవ్య ఇంటర్ ఫస్టియర్ మైసూరులోని ఒక ప్రైవేట్ కళాశాల్లో చదువుతోంది. కరోనా ఇబ్బందుల నేపథ్యంలో సెకెండియర్ను ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలని తండ్రి సూచించగా కూతురు ససేమిరా అంది. ఏదైనా మంచి ప్రైవేటు కాలేజీలోనే చదువుకుంటానని చెప్పగా తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆవేదనకు లోనైంది. ఆదివారం ఉదయం 8 గంటలప్పుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి రాజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఇరువురి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మళవళ్ళి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీ, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య తండ్రుల దినోత్సవంనాడు మరో విషాదం సంభవించింది. ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా పోగత్యానట్టి గ్రామంలో ఆదివారం జరిగింది. కాడప్ప పి. రంగాపపురె (48), ఆయన కుమార్తెలు కీర్తి (18), స్ఫూర్తి (16) మృతులు. వారం రోజుల క్రితం కాడప్ప భార్య చెన్నవ్వ మృతి చెందారు. ఆమె మృతిని తట్టుకోలేక జీవితం విరక్తితో సామూహిక బలవన్మరణాలకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. -
బాలాదిత్య, కౌశిక్ ల ఫాథర్స్ డే చిట్ ఛాట్
-
మిడిల్ క్లాస్ డాడీస్
-
వెండితెర పై హీరోగా రాణించిన తండ్రీ కొడుకులు
-
హల్చల్ : నాన్నే నా హీరో అంటున్న మహేశ్.. డీఎస్పీ ఎమోషనల్
View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by MONNALLISA (@aslimonalisa) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Mannara❤️ (@memannara) And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 -
A ఫ్యామిలీ వాయిస్
-
ఫాదర్స్‌డే : కంటతడి పెట్టించే ‘నాన్న’ పాటలు విన్నారా?
ఇవ్వాళ ఫాదర్స్‌డే. నాన్నకు... ప్రేమతో మనమేం ఇవ్వగలం? అసలు నాన్నకు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? ఆయన మన నుంచి ఇష్టంగా కోరుకునేది ఏదైనా ఉంటుందా? ఆయనైతే మనకు ధైర్యాన్నిచ్చాడు. అండగా నిలబడ్డాడు. ఒక దారి చూపించాడు. అన్నింటికీ మించి ‘నాన్న’ అనే బంధం పిల్లలకిచ్చే అన్ని సౌకర్యాలను, ఆనందాలను ఇచ్చాడు. అలాంటి నాన్నను ప్రేమగా పలకరించడానికి ఒక్క రోజు చాలుతుందా? చాలదు కదూ! కానీ ఆయన మనకు చేసినవన్నీ ఇవ్వాళ గుర్తు చేసుకుంటే ? ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని నాన్న పాటలు.. ఆయనకు మనమీదున్న ప్రేమను ఇలా చూపిస్తున్నాయి.. పాడుకోండి! -
Father's Day: సర్వస్వం తండ్రే అంటున్న టాలీవుడ్ తారలు
భార్య నవమోసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే.. అతడు కంటికి రెప్పలా కాపాడతాడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసి మెరిసిపోతాడు. వారసుల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా శ్రమించడంలోనే సంతోషం ఉందనుకుంటాడు. పిల్లల ఎదుగుదలను చూస్తూ కష్టాన్ని మర్చిపోతాడు. పొద్దంతా షూటింగ్స్‌తో అలసిపోయినా పిల్లలు ఎదురు రాగానే వారి చిరునవ్వు చూసి ఆనందంతో పరవశించిపోతాడు. సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటే సంతోషాన్ని కూడా వ్యక్తం చేయలేక భార్య పక్కన నిలబడి విజయగర్వంతో కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ► నా బలం, మార్గదర్శి, ఆదర్శం, హీరో అన్నీ నా తండ్రే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: మహేశ్‌బాబు My hero, guiding light, strength, inspiration.. you're all of this and much more to me. Celebrating you today and every day of the year! Happy Father's Day Nanna ❤️ pic.twitter.com/BujCvGCNec — Mahesh Babu (@urstrulyMahesh) June 20, 2021 ► నాన్నకు కోపం ఎక్కువ. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమకు బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి హ్యాపడీ ఫాదర్స్‌డే: చిరంజీవి మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay pic.twitter.com/62jXHkbWTR — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2021 ► తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన అంజలి I Love You and Miss You Daddy. Always and forever. Happy Father’s Day ❤️#daddyslittlegirl #FathersDay pic.twitter.com/nsU6Dy5Tgx — Anjali (@yoursanjali) June 20, 2021 ► నీతో ఉన్న క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి: మంచు లక్ష్మీ Happy Father’s Day @themohanbabu ❤️ Most of my favourite memories of life are with you Nana. You’ve been the mentor, leader, best friend and the best inspiration for everyone in the family. We couldn’t have been what we are today without your constant love & support. pic.twitter.com/LnLbgVfaI1 — Lakshmi Manchu (@LakshmiManchu) June 20, 2021 ► నాన్న సినిమాటోగ్రాఫర్ అని చాలా కొద్దిమందికే తెలుసు: దేవి శ్రీ ప్రసాద్ Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 ► తండ్రి ప్రేమానురాగాలతోటే మేము ఇంతటివాళ్లమయ్యాం: సుధీర్ బాబు And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 Happy Father's Day#FathersDay pic.twitter.com/UrXE3rKje8 — Mohanlal (@Mohanlal) June 20, 2021 Happy Father’s Day to the captain of our ship, for smoothly sailing us through thick and thin. I love you Boatloads Dad ❤️😘 #FathersDay pic.twitter.com/TC73g3bVRg — Sidharth Malhotra (@SidMalhotra) June 20, 2021 Nana! I’m so glad our father-son relationship has evolved into such a beautiful friendship over years! Love you 🤗🤗🤗@NagaBabuOffl #happyfathersday pic.twitter.com/cTMWQnoV2C — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) June 20, 2021 You are blessed if the person you learn from the most and the person who makes you laugh the most also happen to be your parent !! Happy Father’s Day @ikamalhaasan 💖 pic.twitter.com/pj4bBSfPhR — shruti haasan (@shrutihaasan) June 20, 2021 -
లవ్ యు డాడీ
-
Father's Day: తండ్రీకొడుకుల బంధానికి కొత్త అర్థం చెప్పే చిత్రాలు..
బాధ్యతకు మారు పేరు నాన్న. మనం వేసే తప్పటడుగులను హెచ్చరిస్తూ వాటిని సరిదిద్దుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించే వ్యక్తి నాన్న. మనల్ని 9 నెలలు కడుపులో మోసేది తల్లయితే, ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం నుంచి జీవితాంతం గుండెల మీద పెట్టుకుని చూసేది నాన్న. వేలు పట్టి నడిపించేది, భుజంపై ఎక్కించుకుని ప్రపంచాన్ని మనకు చూపిస్తూ మన కళ్లతో ప్రపంచాన్ని చూసి మురిసిపోయే వ్యక్తి నాన్న. అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ హీరో, రీయల్ హీరో ఆయనే. మన జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు. అయనతో ఉండే అనుబంధం, ఆయన పంచే ప్రేమ చాలా గొప్పది, దానిని మాటల్లో చెప్పలేం. కానీ తెరపై మాత్రం ఈ బంధాలను అద్భుతంగా చూపించిన సినిమాలున్నాయి. తండ్రి-కొడుకుల ఎమోషనల్ బాండింగ్‌తో మనల్ని కట్టిపడేసిన టాప్ చిత్రాలేంటో చూసేద్దాం రండి.. బొమ్మరిల్లు ఈ సినిమాలో తండ్రి ప్రేమ, కేరింగ్ తట్టుకోలేక హీరో సతమతమవుతాడు. కానీ ఆయన మాత్రం కొడుకు, కూతుళ్లకు ఏం చేసినా, ఏం ఇచ్చినా ది బెస్ట్ ఇవ్వాలని చూస్తాడు. ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా ముందే వారికి అన్నీ అమర్చి పెడతాడు. కొడుక్కి ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని పరితపించే తండ్రిగా ప్రకాశ్ రాజ్, అతడి ప్రేమ, కేరింగ్‌తో తన సెల్ఫ్ ఐడెంటిటీని పొగొట్టుకుంటున్నానని బాధపడే కొడుకుగా హీరో సిద్దార్థ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే తండ్రి ఏం చేసినా మన సౌకర్యం, సంతోషం కోసమేనని చెప్పడానికి బొమ్మరిల్లు మూవీ ఉదాహరణ. సన్నాఫ్ సత్యమూర్తి తండ్రి చనిపోయినా కూడా ఆయన పాటించిన విలువలను బతికించాలని ఉన్న ఆస్తిని వదులుకుంటాడు కొడుకు. అంతేగాక ఆయనను నమ్మిన వారు నష్టపోకూడదని ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. తన తండ్రి గొప్పవాడని, ఆయన పాటించే విలువలు తప్పు కాదని, దీన్ని వందకు వంద మంది నమ్మాలని కోరుకుంటాడు కొడుకు. అలా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిన తండ్రి మీద ఒక్క మచ్చ రాకుండా ఉండాలని ఆరాటపడుతాడు. అంటే తండ్రి విలువలను కాపాడటం కొడుకు బాధ్యత అని చెప్పేదే సన్నాఫ్ సత్యమూర్తి. నాన్నకు ప్రేమతో.. తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తండ్రి కృతజ్ఞత తీర్చుకోవడానికి ఆయన పగను పంచుకుంటాడు కొడుకు. బిజినెస్‌లో మోసం చేసిన వ్యక్తి గురించి డైరీలో రాసుకుని పగ తీర్చుకోవాలని ఆరాటపడతాడు తండ్రి. ఈ విషయం తెలుసుకుని ఆ పగను తన పగగా తీసుకుని బిజినెస్‌మ్యాన్‌కు గుణపాఠం చెబుతాడు. అంటే తండ్రి ఆస్తే కాదు ఆయన ఆశయం కూడా మనదే అని చెప్పడానికి నాన్నకు ప్రేమతో మూవీ ఒక ఉదాహరణ. కిక్ ఈ మూవీలో తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. కొడుకు ఏం చేసినా వాడు కరెక్ట్ అంటూ మురిసిపోతాడు తండ్రి. అలా తండ్రి, కొడుకు మధ్య స్నేహ బంధం కూడా ఉందని చెప్పడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. ఈ మూవీలో కొడుకు ఉద్యోగం లేకుండా జులాయిగా తీరుగుతున్నాడని తండ్రి ఎప్పుడూ తిట్టిపోస్తుంటాడు. నీకు తిండి దండగ అంటూ విమర్శిస్తుంటాడు. కానీ ఒక్కసారిగా కొడుకు ఉద్యోగం తెచ్చుకోగానే తన గుండె బరువు దిగినంతగా రిలాక్స్ అవుతాడు. కొడుకు మొదటి జీతంతో కొనిచ్చిన పట్టు వస్త్రాలను ధరించి నలుగురికి గొప్పగా చెప్పుకుంటాడు. అంటే కొడుకు బాధ్యతగా ఉండి ఓ స్థాయికి చేరుకుంటే ఆ తండ్రి ఎంతలా పొంగిపోతాడో చెప్పడానికి ఈ మూవీ నిదర్శనం. అంటే ఏ తండ్రీ తన కొడుకుని పనికి మాలిన వాడిగా చూడలేక వాళ్లు మంచి ప్రయోజకులవ్వాలనే అలా కోప్పడుతుంటారని కుర్రాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు నాకు నచ్చావ్.. కొడుకు ఊర్లో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతడికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి. కానీ సంబంధాలు రావు. మరోవైపు కొడుకు పాస్ అవ్వాలని ఎగ్జామ్ హాల్లో చిట్టీలు కూడా అందిస్తాడు తండ్రి. అంటే కొడుకు బాగుపడటానికి ఆ తండ్రి ఏం చేయడానికైనా వెనుకాడడని చెప్పాడానికి ఈ మూవీ చాలు. అలాగే తండ్రి స్నేహం పాడవకూడదని తను ప్రేమించిన అమ్మాయినే త్యాగం చేయడానికి సిద్ధపడటం కొసమెరుపు. చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
Fathers Day: లవ్ యూ నాన్న..
నాన్నా.. ‘మీరు’ అనే పెద్దరికంతో దూరంగానే ఉండిపోయారు.. ‘నువ్వు’ అనే ఆలింగనంతో దగ్గరవలేదు! ఆ పిలుపు భయాన్ని పెంచింది తప్ప ప్రేమను చూపించలేకపోయింది! అందుకే మీతో మాట్లాడాల్సిన ప్రతిసారీ అమ్మను మధ్యవర్తిగా పెట్టాల్సి వచ్చింది! మీ చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిచాం.. మీ కళ్లజోడును తగిలించుకుని గంభీరాలు పోయాం మీ చొక్కాలో చేతులు దూర్చి.. మీ స్వరాన్ని అనుకరించి సరదా పడ్డాం! కానీ మీతో ఆడుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాం! మీ మీసాలెప్పుడూ తెచ్చిపెట్టుకున్న కోపాన్ని ప్రదర్శించాయి.. వస్తున్న నవ్వును ఆపేశాయి ఎందుకు నాన్నా? ఎప్పుడూ భావోద్వేగాల ఫ్రూఫ్ జాకెట్‌లోనే కనిపించారు ? బాధ్యతనే మోశారు... ఆత్మీయతను ఎందుకు దాచుకున్నారు! మాకు గమనించే వయసొచ్చిందని బీరువా వెనకగూట్లో సిగరెట్లను దాచడం మానేశారు! ఫ్రెండ్స్‌తో పార్టీలూ తగ్గించారు.. స్టయిల్‌గా ఉండే క్రాఫ్‌ను సాదాసీదాగా మార్చుకున్నారు! పెరుగుతున్న ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలూ మొదలుపెట్టారు! అయినా హిట్లర్‌గానే మిగిలిపోయారు! లవ్ యూ నాన్నా.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా!! ఒక్కోసారి ఒక మాట చెప్పలేనిది .. అక్షరం చెపుతుంది.... జీవన ప్రయాణంలో జన్మనిచ్చినవాళ్లు .. దూరంగా ఉన్నా ఉత్తరాలు ఆ బంధాన్ని పట్టి ఉంచుతాయి.. బాధ్యతను గుర్తుచేస్తాయి.. స్వాతంత్య్రోద్యమమైనా, సార్వత్రిక ఎన్నికలైనా, కూతురి పెళ్లి అయినా.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న రోజైనా.. గెలుపు, ఓటముల ప్రసక్తి అయినా.. ఆశనిరాశల ఆరాటమైనా.. ఏ సందర్భం అయినా తమ పితృ వాత్సల్యాన్ని భట్వాడా చేశారు కొందరు తండ్రులు. ఆ అక్షరాల్లోని వాళ్ల మనసు.. పెంపకంలో వాళ్లు వదిలిన జాడలు ఈ ఫాదర్స్‌డే సందర్భంగా... టు ఇందిరా ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ (అలహాబాద్ నైని సెంట్రల్ జైల్ నుంచి) సందర్భం: ఇందిర 13వ పుట్టిన రోజు డియర్ ఇందిరా.. ఏది సరైంది.. ఏది కాదు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనేవి ఉపన్యాసాలతో తెలుసుకోలేం. చర్చించడం ద్వారా తెలుసుకుంటాం. నీతో నేనెప్పుడూ చర్చించడాన్నే ఇష్టపడ్తాను. ఇప్పటికే మనం చాలా అంశాలను చర్చించుకున్నాం. కానీ ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది. అన్నీ తెలుసనే భావనను దరిచేరనీయకు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంతో పాటు అది కొనసాగాలి. సూర్యుడితో స్నేహం చేద్దాం. అంటే ఎప్పుడూ మెలకువగా ఉందాం. డబ్బు ఎప్పుడూ మంచిది కాదు. అది వస్తువులను పొందడానికి మాత్రమే సహాయపడుతుంది. నువ్వెలా ఉండాలంటే ఈ దేశ సేవలో ఒక యోధురాలిలా! - మీ నాన్న జవహర్లాల్ నెహ్రూ టు అక్షిత ఫ్రమ్ నారాయణమూర్తి (ఇన్ఫోసిస్) సందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు... డియర్ అక్షితా మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ సమ్మతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయితీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ - మీ అప్పా టు మాలియా, సాషా.. ఫ్రమ్ బరాక్ ఒబామా సందర్భం: అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు. డియర్ మాలియా, సాషా.. ఈ రెండేళ్లు నా ప్రచార కార్యక్రమాల్లో పడి మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో నాకే తెలుసు. ఈ రోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నా జీవితంలోకి రాకముందు నాకు నేనే లోకం. నేను కోరుకున్నది పొందడమే లక్ష్యం. ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పటి నుంచి నా జీవనగమనం మారిపోయింది. మీతోడిదే నా లోకమైంది. మీ నవ్వులు, కేరింతలు, అల్లర్లతో మనసు నిండిపోని రోజు లేదు. నాకు నేను ముఖ్యమనే ఆలోచనే పోయింది. నాకోసం నేను పెట్టుకున్న ఆశయాలు మీముందు చిన్నవయ్యాయి. మీ కళ్లల్లో కనపడే ఆంనదాన్ని మించిన గొప్ప లక్ష్యం లేదనిపించసాగింది. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యతను మించిన పరమార్థం లేదు నా జీవితానికనిపించింది. మీకే కాదు ఈ దేశంలోని పిల్లలందరికీ సంతోషంగా బతికే హక్కు ఉంది. మీతోపాటు వాళ్లంతా ఆ హక్కును పొందేలా చూడ్డానికే అధ్యక్ష్య పదవికి పోటీ చేశా. వైట్‌హౌజ్‌లోని కొత్తజీవితానికి సహనం, సంయమనాన్ని ఫ్రెండ్స్‌గా తోడు తెచ్చుకుంటారని భావిస్తున్నా. విత్ లవ్ .. - యువర్స్ డాడ్ బరాక్ ఒబామా టు మేఘన ఫ్రమ్ గుల్జార్ సందర్భం: మేఘన గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు మేఘనా.. నీ చదువు పూర్తయ్యింది. అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నావు. నీ ఆసక్తిని బట్టే అవకాశాన్ని ఎంచుకో. దానివల్ల నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నమూ మొదలవుతుంది. మనల్ని మనం తెలుసుకోలేని జీవన ప్రయాణం వ్యర్థం. నీకు ఆ శక్తి ఉంది. నువ్వు అనుకున్నది సాధించగల సమర్థురాలివనీ తెలుసు. డిగ్రీతో అకడమిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకున్నావు. ఇంకొంచెం ఎఫర్ట్‌తో జీవన పాఠాలన్నీ ఆకళింపు చేసుకో. సరైన నిర్ణయం తీసుకో. ఆల్ ది బెస్ట్ బేటా..! - తుమ్హారే పాపా టు దీపిక పడుకోణ్ ఫ్రమ్ ప్రకాశ్ పడుకోణ్ మై డియర్ దీపిక... జీవితంలో ప్రతిసారీ గెలవలేం. కావల్సినవన్నీ మన దారికి రావు. మనం కోరుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. మారవు. కొన్ని గెలవాలంటే కొన్ని కోల్పోవాలి. జీవితంలో కొన్ని సార్లు తగ్గడమే నెగ్గడం. అది నేర్చుకో. అయితే పూర్తిగా వదిలేయకూడదు. నా కెరీర్ అంతా కూడా నేను చేసింది అదే. మొదటి ఆట నుంచి రిటైర్మెంట్ వరకు ప్రయత్నాన్ని వీడలేదు. ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా సరే వల్లకాదు వదిలేయాలన్న ఆలోచనకు తావివ్వలేదు. నా శక్తిపైనే దృష్టిపెట్టాను. నీ నుంచీ అదే కోరుకుంటున్నా బేటా! గెలవడమంటే నిలబడడమే! - విత్ లాట్స్ ఆఫ్ లవ్, డాడీ టు సర్వజిత్, అచిన్త్య .. ఫ్రమ్ వివిఎస్ లక్ష్మణ్ సర్వజిత్, అచిన్త్య.. తాత్వికంగా చెప్పడం కాదు కానీ ఊహించని వాటిలోనే జీవన సౌందర్యం దాగుంది. అందుకు ఉదాహరణ నా జీవితమే. ఎప్పటికప్పుడు భిన్నమైన అంచనాలతోనే సాగింది నా జీవితం. ఆస్వాదించే స్వభావం అలవడింది. దేన్నయినా ఎదుర్కొనే సమర్థత వచ్చింది. అదృష్టవశాత్తు అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం దక్కింది. ఈ దేశం తరపున ప్రాతినిథ్యం వహించే చాన్స్ దొరికింది. ఈ ఆట నాకు చాలా విషయాలు నేర్పింది. క్రమశిక్షణ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని ప్రాముఖ్యత, కృషి విలువను అనుభవంలోకి తెచ్చింది. ముఖ్యంగా గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాను. అవి నాణానికి రెండు వైపులు అని అర్థంచేసుకున్నాను. మీరూ వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితానికి బలమైన పునాది వేసుకోవాలి. - ఇట్లు ,మీ నాన్న -
Fathers Day: ‘నాన్నే రియల్ హీరో అంటున్న పిల్లలు’
అమ్మ ఊపిరిపోస్తే.. జీవితాన్ని ఇస్తాడు నాన్న.. తన గుండెలపై నడక నేర్పిస్తాడు నాన్న..ఊహతెలిసే వయసులో మొదటి స్నేహితుడు నాన్న..ఎంత కష్టమైనా కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు నాన్న.. పిల్లలు ఎదిగిన కొద్ది మొదట గర్వించేది నాన్న..బిడ్డల భవిష్యత్‌కోసం కొవ్వొత్తిలా కరిగేది నాన్న..ఆపదలో ఆత్మరక్షణగా నిలిచేది నాన్న..ప్రాణాపాయంలో ఊపిరిపోసేది నాన్న.. అందుకే నాన్న.. ఎవ్రీడే వారియర్ .. ప్రతీ మనిషి నిండు జీవితానికి దిక్సూచి నాన్న. బిడ్డ వేలు పట్టి నడిపించడమే కాదు, వెన్ను తట్టి జీవన యానానికి ప్రోత్సహించడమూ తండ్రికే చెల్లింది. కరోనా లాంటి మహమ్మారి తన బిడ్డలను మింగేయాలని చూసిన తరుణంలో కూడా చెదరని ఆత్మవిశ్వాసంతో బిడ్డల రక్షణ కోసం వ్యయ, ప్రయాసాలకు ఓర్చిన త్యాగమూర్తులు ఎందరో. కుటుంబం మొత్తం పాజిటివ్ వచ్చినా.. పిల్లలు క్లిష్టపరిస్థితిలో ఉన్నా ధైర్యం కోల్పోకుండా కొత్త ఊపిరిపోశారు. కరోనా కాటుకు కొడుకు, బిడ్డలను కోల్పోయి వారి పిల్లల బాధ్యత తీసుకుని తాతే.. తండ్రైన సంఘటనలూ అనేకం. ఇంటి పెద్దగా.. కుటుంబానికి రక్షణ వలయంగా తండ్రి సేవ మరువలేనిది. అందుకే ఏ కొడుకుకైనా.. కూతురుకైనా.. తమ జీవితంలో రియల్ హీరో నాన్న అంటారు. నేడు అంతర్జాతీయ ఫాదర్స్‌డే సందర్భంగా కథనం.. కొడుకు పోయిండు.. కుర్చే మిగిలింది.. సాక్షి, జగిత్యాల: పక్క ఫొటోలో కటింగ్ చేస్తున్న పెద్దాయన కోరుట్లకు చెందిన సాయన్న. ఇద్దరు కొడుకులు ధనుంజయ్, సురేశ్ (34), కూతురు ఉంది. చిన్న కొడుకు సురేశ్‌తో కలిసి కటింగ్షాపును నిర్వహిస్తుండేవాడు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. సురేశ్ మే మూడోవారంలో కరోనా బారిన పడ్డాడు.హోం క్వారంటైన్లో ఉన్న కొడుకుకు సాయన్ననే అన్నీ తానై సేవలు చేశాడు. ఆరో రోజు శ్వాస ఇబ్బందులు వచ్చాయి. కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. తదుపరి సాయన్న, అతని భార్య దేవక్క, తమ్ముడు దిలీప్, సురేశ్ భార్య సునీత కరోనాబారిన పడి హోం క్వారంటైన్లో ఉండగా.. వారి బంధువులు సురేశ్ దగ్గర ఉండిపోయారు. చికిత్స పొందుతున్న సురేశ్ మే 26న చనిపోయాడు. అతన్ని కాపాడుకునేందుకు సాయన్న రూ.5లక్షలు ఖర్చు చేశాడు. అదే సమయంలో సాయన్న ఆరోగ్యం సైతం విషమించింది. జగిత్యాలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. సురేశ్ చని పోయిన విషయాన్ని సాయన్నకు ఎవరూ చెప్పలేదు. రెండు రోజుల తర్వాత చెప్పడంతో కుమిలిపోయాడు. అదేబాధలోనే వారం రోజులకు సాయన్న, అతని కుటుంబసభ్యులందరూ కోలుకున్నారు. వీరందరికి కలిపి మరో లక్ష ఖర్చయింది. అటు కుటుంబ పోషణ, ఇప్పుడు అప్పుల భారం నుంచి బయటపడేందుకు సాయన్న రోజూ మళ్లీ సెలూన్ తీసి పనిచేస్తున్నాడు. కానీ.. పక్కనే ఖాళీగా కనిపిస్తున్న కుర్చీని చూస్తూ నిత్యం తన కొడుకునే గుర్తు తెచ్చుకుంటున్నాడు. మనవళ్లలో కొడుకును చూసుకుంటూ.. రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కుడికాల మల్లేశ్ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. భార్య మల్లమ్మ, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. మూడో కొడుకు మల్లేశ్ 13 ఏళ్లుగా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మెడికల్‌షాపు నిర్వహిస్తూ.. భార్య సృజన, కొడుకులు శ్రీచరణ్, మణిదీప్లను పోషిస్తున్నాడు. గత మే నెలలో మల్లేశ్(కొడుకు) కరోనా బారిన పడ్డాడు. నాలుగురోజులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. భర్త బాగోగులు చూసుకుంటున్న క్రమంలో సృజన కూడా వైరస్‌బారిన పడి అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఇద్దరికి వైద్యానికి తల్లిదండ్రులు సుమారు రూ.12లక్షలు అప్పుచేసి ఖర్చు చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గత నెల 26న మల్లేశ్, 27న సృజన మృతిచెందారు. అప్పటి నుంచి ఇద్దరు చిన్నారులను నానమ్మ, తాతయ్య మల్లేశ్, మల్లమ్మ చేరదీశారు. కరోనాతో దూరమైన కొడుకు కోడలును చిన్నారుల్లో చూసుకుంటూ.. నిత్యం బాధపడుతున్నారు. ‘పోయిన కొడుకు కోడలును మనవళ్ల ముఖంలో చూసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోషించుకుంటాం. ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్ అందిస్తామని’ మల్లేశ్ చెబుతున్నాడు. అనుక్షణం.. ఒక నరకం మెట్పల్లి పట్టణానికి చెందిన సత్యనారాయణ కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. భార్య భవాని, కూతుళ్లు నందిని(15), ప్రజ్ఞ(7) ఉన్నారు. సెకండ్‌వేవ్ మొదట్లో సత్యనారాయణతో పాటు భార్యాపిల్లలకు పాజిటివ్ వచ్చింది. దంపతులకు సమస్య లేకపోయినప్పటికీ.. పిల్లలిద్దరు పదిరోజుల పాటు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. బలహీనులయ్యారు. కంగారుపడిన సత్యనారాయణ ఏదైనా ప్రయివేటు ఆస్పత్రికి పిల్లలను తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇంట్లో ఉంటేనే ఉత్తమం అని స్నేహితులు ఇచ్చిన సలహాతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచుతూ.. నిత్యం ధైర్యం చెబుతూ చిన్నారులను చూసుకున్నాడు. పదిరోజులకు కొంత కోలుకున్నారు. తరువాత మంచి ఆహారం అందించడంతో నిత్యం వారి పరిస్థితిని గమనించడం, డాక్టర్ సలహాలు తీసుకోవడంతో 20 రోజులకు కోలుకున్నారు. తరువాత కుటుంబం మొత్తం పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ వచ్చింది. ఇప్పడు సంతోషంగా వారి పనులు చేసుకుంటున్నారు. ‘పిల్లలే నా ప్రపంచం. వారికి పాజిటివ్ వచ్చిన సమయంలో ఒక్కరోజు అన్నం తినకుంటే నాకు నిద్ర పట్టేది కాదు. ప్రతీక్షణం యుగంగా గడిచింది. దేవుడికి మొక్కని రోజులేదు. నేను ధైర్యంగా ఉంటూ.. పిల్లలకు భయం లేకుండా చేశాను. ఫలితంగా కుటుంబం మొత్తం కరోనాను జయించాం.’ అని సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశాడు. పిల్లలను మిస్ అయ్యాను కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కుటుంబాన్ని చాలా వరకు మిస్ అవుతున్నా. నా భార్య రాధిక, కొడుకు రాజశేఖర్‌రెడ్డి, కూతురు దీపక హైదరాబాద్‌లో ఉంటారు. చాలా సార్లు కుటుంబంతో గడపాలని ఉన్నా.. విపత్కర పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు సంచరిస్తూ అందరినీ కలుస్తుంటాం కాబట్టి పిల్లలను చూడాలనిపించినప్పుడు వీడియో కాల్ మాట్లాడేవాన్ని. కరోనా పరిస్థితుల్లో ప్రతిరోజూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పా. వాళ్లు కూడా నా శ్రేయస్సు గురించి చెప్పేవారు. – వీబీ. కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ తండ్రి ధైర్యం.. బిడ్డ సేఫ్ సిరిసిల్లకు చెందిన బోనాల సత్యం స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్. భార్య పద్మశ్రీ ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు. కొడుకు రాజేశ్ డాక్టర్. కూతురు స్వాతి, మనవరాలు రుచిత కలిసే ఉంటారు. గత ఆగస్టు 13న ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన సత్యం కరోనా బారిన పడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఇంటిల్లిపాదికి వైరస్ సోకింది. డాక్టర్‌గా పనిచేస్తున్న కొడుకు రాజేశ్ సూచనతో ఆస్పత్రిలో చేరాలని అనుకున్నారు. అప్పటికే కూతురు స్వాతి గర్భిణికాగా.. డెలివరీ టైమ్ కూడా. పాజిటివ్ ఉన్న స్వాతికి ప్రస వం చేసేందుకు స్థానిక డాక్టర్లు ధైర్యం చేయలేదు. తండ్రి ధైర్యంచేసి స్వాతిని కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఓ ఆస్పత్రిలో డెలివరీ అయిన తరువాత ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు. తిరిగి సిరిసిల్లకు వచ్చాక కొడుకుతో కలిసి సత్యం ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌లో చేరారు. పక్షం రోజుల్లో అంతా మామూలు స్థితికి చేరుకున్నారు. ‘కొడుకు నేను పక్కపక్క బెడ్లలోనే చికిత్స తీసుకున్నాం. ఆ రోజు లు మళ్లీ రావొద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు క్షేమంగా ఉన్నాం’ అని సత్యం పేర్కొన్నాడు. కొడుకు కోసం విదేశాల నుంచి.. బుగ్గారం మండలం సిరికొండకు చెందిన వంచిత ధర్మరాజుకు తల్లి మల్లవ్వ, భార్య గంగవ్వ, కొడుకులు రాహుల్, శ్రీయాన్స్ ఉన్నారు. ధర్మరాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తుంటాడు. సెకండ్‌వేవ్‌లో రాహుల్ కరోనా బారిన పడ్డాడు. ఇల్లు చిన్నదికావడంతో తెలిసినవాళ్ల గొర్రెలషెడ్డులో క్వారంటైన్లో ఉంచారు. కొద్దిరోజులకు ధర్మరాజు తల్లి మల్లవ్వ కూడా వైరస్ బారిన పడింది. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నకొడుకుకు వైరస్ సోకకుండా ఉండేందుకు గంగవ్వ పుట్టింటికి వెళ్లింది. రాహుల్, మల్లవ్వల బాగోగులను సమీప బంధువులు చూసుకోసాగారు. గల్ఫ్‌లో ఉన్న ధర్మరాజు ఇక్కడి పరిస్థితి చూసి చలించిపోయాడు. కొడుకుల కన్నా ఏదీ ముఖ్యం కాదనుకున్నాడు. వెంటనే గల్ఫ్ నుంచి అతికష్టంమీద వచ్చేశాడు. అందరి బాగోగులు దగ్గరుండి చూసుకున్నాడు. మంచి ఆహారం ఇచ్చి వైరస్‌నుంచి బయటపడేలా చేశాడు. ప్రస్తుతం స్థానికంగానే ఉంటున్నాడు. ‘పిల్లల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను వచ్చాకే మా వాళ్లకు ధైర్యం వచ్చింది’ అని ధర్మరాజు చెప్పాడు. -
ఫాదర్స్ డే స్పెషల్: సాయికుమార్ ఫ్యామిలీ వాయిస్!
‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’... సాయికుమార్ కెరీర్‌కి తొలి బ్రేక్ అయిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్ ఇది. సాయికుమార్ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సాయికుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని... స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది – సాయికుమార్ ► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది. ► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది. ► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్ ఫంక్షన్లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు. ► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయి. యాక్ట్రస్ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ అని ఆది చెబుతుంటాడు. ► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ). నాన్నకి వందకి వంద – ఆది సాయికుమార్ ► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో మళ్లీ స్టార్ట్ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్ 19 ఆడాం. క్రికెట్లో నేను ఆల్‌రౌండర్. క్రికెట్లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్. ఇప్పుడు ఐపీఎల్ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని. ► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది. నాన్నకి వందకి నూటపది – డాక్టర జ్యోతిర్మయి ► నేను డాక్టర్ అవ్వాలనే టాపిక్ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్ ‘ఈశ్వర్’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను. ► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్ మ్యాచ్ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను. సాయికుమార్ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ -
వాట్సాప్ న్యూ అప్డేట్.. ‘పాపా మేరే పాపా’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు చక్కటి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా (జూన్ 20, 2021) యూజర్ల సౌలభ్యం కోసం ‘పాపా మేరే పాపా’ పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. బాలీవుడ్ మూవీ ‘ మై ఐసా హీ హూం’’ లోని పాపులర్ సాంగ్ ‘పాపా మేరే పాపా’ ప్రేరణతోనే దీన్ని తీసుకొచ్చింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో స్టిక్కర్ ప్యాక్ అందుబాటులో ఉంది. స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకునేందుకు వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట భారత్, ఇండోనేషియాలో లాంచ్ చేసినా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్, వాబేటా ఇన్ఫో ఈ ప్యాక్ గురించి నివేదించింది. "చెప్పడానికి కష్టంగా అనిపించే విషయాలు చెప్పడంలో సహాయం చేస్తూ లవింగ్ తండ్రీ కొడుకులను గుర్తుచేస్తుంది" అనే సందేశంతో దీన్ని తీసుకొచ్చింది. కాగా వాట్సాప్ సందర్భానికి తగినట్టు సిక్కర్ ప్యాక్‌లను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లవ్ అండ్ ప్రైడ్ స్టిక్కర్ ప్యాక్‌ను, అదేవిధంగా మదర్స్ డే స్టిక్కర్లను కూడా విడుదల చేసింది. స్టిక్కర్న ప్యాక్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వ్యక్తిగత చాట్ విండో లేదా గ్రూప్ చాట్ విండోను ఓపెన్ చేయండి. కొత్త స్టిక్కర్ విభాగాన్ని బ్రౌజ్ చేసేందుకు స్టిక్కర్స్ మెనులో ప్లస్ చిహ్నంపై ప్రెస్ చేస్తే తాజా స్టిక్కర్ ప్యాక్ పైన కనిపిస్తుంది. దాంట్లోంచి ఇష్టమైన ఎమోజీని డౌన్ లోడ్ చేస్కోవచ్చు. -
దృశ్యం-2 రిలీజ్ డేట్ ఫిక్స్?
అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ
వాషింగ్టన్: ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ దినము, ఫాదర్స్ డేని పురస్కరించుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) వాషింగ్టన్ డీసీ వారి ఆధ్వర్యంలో జూన్ 21న ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కోవిడ్ కష్ట కాలంలో సరైన రక్షణ, ఆహరం దొరకక అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొందరు హోమ్ బిల్డర్స్ కేర్ అస్సెస్మెంట్ (HBCAC)లో రక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీఎఫ్ వారికి ఆహార అవసరాలను సమకూర్చి చిరునవ్వు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అత్యవసర వసతి గృహంలో వున్న వారికి మంచి విందును ఇవ్వగలిగింది. టీడీఎఫ్ సభ్యుల సహకారంతో తత్వా (TATVA) రెస్టారెంట్ వారికి రుచికరమైన ఆహరాన్ని సమకూర్చింది. తద్వారా ఎంతో మంది నిరుపేదల ముఖాలపై, చిరునవ్వు, సంతోషం వెల్లివిరిసింది. స్వరూప్ కూరెళ్ల ఆధ్వర్యంలో SEWA టీం, టీడీఎఫ్ సంయుక్తంగా ఈ ఫాదర్స్ డే నాడు చాలా మంది నిరుపేదలకు ఆహరాన్ని అందించడంతోపాటు నిత్యావసర వస్తువులు కొనిచ్చింది. (టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు) ఈ సందర్భంగా టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షులు కవిత చల్ల SEWA టీమ్‌కు, టీడీఎఫ్ (TDF) కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా టీడీఎఫ్.. సభ్యుల సహకారంతో ఇలాంటి సాంఘీక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన టీడీఎఫ్ డీసీ కోఆర్డినేటర్ జీనత్ కుండూర్, రజని కొప్పారపు, శివాని రెడ్డి , ప్రతిభా కొప్పుల గారికి ప్రేత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన టీడీఎఫ్ వర్జీనియా కోఆర్డినేటర్ రామ్మోహన్ సూరినేని , టీడీఎఫ్ వర్జీనియా కోశాధికారి హర్షా రెడ్డి , టీడీఎఫ్ డీసీ సలహాదారు సుధీర్ బండారు, రవి పల్ల, టీడీఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఆరుట్ల, టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్వరూప్ కూరెళ్ల (సేవా ఆర్గనైజషన్ ), ఫేస్బుక్ , టీడీఎఫ్ వెబ్సైట్ ద్వారా ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం) -
నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల
న్యూఢిల్లీ: ప్రపంచంలో పెద్ద కంపెనీకి బాస్ అయినా నాన్నకు బిడ్డే కదా. భౌతికంగా ఆయన దూరమైనా... పంచిన ప్రేమనురాగాలు ఎల్లప్పుడూ గుండెల్లో పదిలంగా దాగుంటాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి లింక్డ్ ఇన్ లో తనివితీరా రాసుకొచ్చారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల ముఖంలోని చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు. యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్ లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలోనూ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోనూ వివిధ పదవుల్లో పని చేశారు. -
రౌడీ న్యూ మూవీ లుక్ చూసి నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో తన ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. దాంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు రౌడీ. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా రౌడీ తన నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో తన తండ్రితో కలిసి విజయ్ ఫోన్లో ఏదో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్.) ‘నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో, రిస్క్‌లో, ప్రతి సహసోపేతమైన పనిలో నేనున్నాను నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్పే వ్యక్తి’ అని కాప్షన్ జోడించి విజయ్ ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోలో రౌడీ లుక్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. పొడవాటి జుట్టు, ఫ్రెంచ్ స్టైల్లో గడ్డం పెంచి కనిపించాడు. ఈ లుక్‌లో విజయ్ను చూసి కొంత మంది రాకేష్మాస్టర్ లా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ సినిమాలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. (విజయ్‌కు ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడి మద్దతు) View this post on Instagram "I am with you." Is all he says everytime to my decisions, mistakes, risks, adventures and wars I take on. The first Deverakonda - Happy Father's Day Daddy - I love you ❤️ A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Jun 21, 2020 at 5:14am PDT -
నాన్న అంటే ప్రేమ.. ధైర్యం
జూన్ 21.. ఫాదర్స్ డేని పురస్కరించుకుని పలువురు సినీ సెలబ్రిటీలు ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి శుభాకాంక్షలు చెప్పారు. ఓ కొడుకుగా తమ తండ్రితో ఉన్న బంధాన్ని.. ఓ తండ్రిగా తమ పిల్లలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. హీరో చిరంజీవి తన తండ్రి వెంకట్రావు, తనయుడు రామ్‌చరణ్ తేజ్ కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేసి, ‘చిరుత.. విత్ మై ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే’’ అంటూ ఓ సందేశం పోస్ట్ చేశారు. తండ్రి చిరంజీవితో చిన్నప్పుడు, ఇప్పుడు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రామ్‌చరణ్ ‘కొన్ని బంధాల్ని వర్ణించాల్సిన అవసరం లేదు.. హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసుకొచ్చారు. తన తండ్రి చిరంజీవికి స్వయంగా హెయిర్ కట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు సుష్మిత. తమ తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఉన్న ఫొటోల్ని లక్ష్మీ మంచు, విష్ణు, మనోజ్ షేర్ చేశారు. తండ్రి కృష్ణతో బాల్యంలో దిగిన ఫొటోను మహేశ్‌బాబు షేర్ చేసి, ‘నా తండ్రి గురించి నిర్వచించమని చెబితే నా బలం, ధైర్యం, ప్రేమ, స్ఫూర్తి నాన్నే. ఈరోజు నేనేంటో అవి ఆయన నుంచి వచ్చినదే. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతోనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను ముందుండి నడిపించే వ్యక్తివి. హ్యాపీ ఫాదర్స్ డే’ అని పేర్కొన్నారు. అలాగే తన పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్‌బాబు ఉన్న ఫొటోల్ని ఆయన శ్రీమతి నమ్రత షేర్ చేశారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న ఫొటోల్ని గోపీచంద్ షేర్ చేసి, ‘ఓ తండ్రిగా ఉండటం మంచి అనుభూతి. నా పిల్లల్ని చూసిన ప్రతిసారీ నా జీవితం సంపూర్ణమైందని అనిపిస్తుంది. నా బలం వారే.. ఇందుకు వారికి థ్యాంక్స్’ అని పోస్ట్ చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, నాగశౌర్య, సుశాంత్, అల్లు శిరీష్, హీరోయిన్లు రాశీ ఖన్నా, రకుల్, కాజల్, అనుపమా పరమేశ్వరన్, శ్రుతీహాసన్, శ్రద్ధా కపూర్, సోనమ్ కపూర్‌తో పాటు మరికొందరు నటీనటులు తమ తండ్రితో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్ చేశారు. వెంకట్రావు, రామ్‌చరణ్; మోహన్‌బాబు, విష్ణు మహేశ్‌బాబు, కృష్ణ; కుమారులతో గోపీచంద్ గోవర్ధన్‌రావు, విజయ్ దేవరకొండ; నాగశౌర్య, శంకర్ ప్రసాద్ నిషా, వినయ్ అగర్వాల్, కాజల్; రాజేందర్ సింగ్, రకుల్ -
ఫాదర్స్ డే : టాలీవుడ్ తారలు
-
నాన్నే నాకు స్ఫూర్తి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన తండ్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ వైఎస్సార్ ఫోటోను జతచేశారు. (నా దగ్గర ఉండు నాన్నా..) Nanna is my strength and inspiration in my every stride. Fathers strive, motivate, give love and support to see their children succeed. He is our first and best friend, mentor and hero with whom we share many precious moments. Happy #fathersday to all the great fathers out there! pic.twitter.com/eSe37YyN7U — YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2020 -
‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’
హైదరాబాద్: ‘మా నాన్న నవ్వు.. నా బిడ్డ చిరునవ్వు.. రెండు నాకు చాలా ఇష్టం’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన తండ్రితో రామ్‌చరణ్ చిన్నప్పుడు దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పరవశించిపోయారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, సుధీర్ బాబు, దేవిశ్రీ ప్రసాద్, గౌతమ్, సితార, మంజుల, తదితర టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ('20 ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నారు') ఇక మహేశ్ బాబుకు గౌతమ్, సితారలు ఇన్‌స్టాలో ఫాదర్స్ డే విషెస్ తెలుపుతూ పలు ఫోటోలను పోస్ట్ చేశారు. ‘మీరు మాకు ఎంతో గర్వకారణం’ అని గౌతమ్ పేర్కొనగా.. ‘నేను మీతో అల్లరి చేయటాన్ని ప్రేమిస్తుంటాను. మీరు కూడా ఇష్టపడతారు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’ అంటూ సీతు పాప ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక మహేశ్‌బాబు కూడ తన తండ్రి కృష్ణకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (రోల్ మోడల్ రీల్ ఫాదర్స్) ‘ప్రేమ, దయ, శ్రద్ధ, ధృడత్వం, సున్నితత్వం, సంరక్షణ ఇలా అనేక పదాలతో మా నాన్న గురించి చెప్పగలను. చెబుతూనే ఉంటాను. నాతో ఎలా ఉన్నారో నేను మా పిల్లలతో ఉండటానికి ప్రయత్నిస్తునా. మీరే నా మార్గ నిర్దేశకులు. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’ అంటూ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశారు. మహేశ్ బాబు. ఇక యువ హీరోలు తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఓ తండ్రిగా తమ అనుభూతిని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. (ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!) Chirutha with my charming Dad.మా నాన్న నవ్వు ...నా బిడ్డ చిరునవ్వు...రెండు నాకు చాలా ఇష్టం.#HappyFathersDay pic.twitter.com/qcYx1wVrJe — Chiranjeevi Konidela (@KChiruTweets) June 21, 2020 Strong, compassionate, loving, gentle, kind, caring are some of the words I could describe my relationship with my father and I can go on and on... He is all that I am and all that I'm trying to be to my kids!! Happy Father’s Day Nanna♥️♥️ You are my way forward always🤗🤗 pic.twitter.com/qaEvXRBhEf — Mahesh Babu (@urstrulyMahesh) June 21, 2020 View this post on Instagram I love irritating you !! And you love it too 🥰🥰🥰 You are the best father and I love you very very much ♥️♥️♥️( this is almost a routine just before bedtime I go and snuggle up to him and then we all go to bed )♥️♥️♥️ Happy Father’s Day Nanna 🥰🥰 #bestdadever🏆 @urstrulymahesh #FathersDay A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on Jun 20, 2020 at 8:32pm PDT View this post on Instagram My father !! My superhero My friend My everything! I love you Nanna !! Happy Father’s Day! You make me very proud ♥️♥️♥️ @urstrulymahesh #fathersday A post shared by Gautam Ghattamaneni (@gautamghattamaneni) on Jun 20, 2020 at 8:33pm PDT Being a father is the best feeling. Looking at my kids I feel so complete and blessed. My lovely little ones, thank you for being my strength.#HappyFathersDay pic.twitter.com/KjUssS4doG — Gopichand (@YoursGopichand) June 21, 2020 -
'20 ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నారు'
సాక్షి, హైదరాబాద్ : ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. తరువుకు కాయ భారమా.. కని పెంచే తండ్రికి బిడ్డ భారమా.. అని కొత్తగా పాడుకోవాల్సి ఉంటుంది ఓ తండ్రి గురించి.. అమ్మ నవ మాసాలు మోసి కనీ.. పెంచీ.. కనిపించే ప్రత్యక్ష దైవమేతే.. నాన్న పిల్లల భారాన్ని మోసే అనురాగమూర్తి. వారి బురువూ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని అన్ని అవసరాలు తీర్చే ప్రేమైక స్ఫూర్తి. ఇదే కోవకు చెందినవారు రాంనగర్‌కు చెందిన బుజ్జి వెంకటేశ్వరరావు. ప్రత్యేక ప్రతిభావంతురాలైన కూతురును కంటిరెప్పలా చూసుకుంటున్నారు ఆయన. తల్లి సపర్యలు చేసినా తానూ బిడ్డకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోలియో బారినపడి నడవలేని అసహాయ స్థితిలో ఉన్న కుమార్తెకు తానే పాదాలై ముందుకు నడిపిస్తున్నారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ.. రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులు కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో కదల్లేని పరిస్థితి. ఆమెకు 24 ఏళ్లు. కాలు ఇంటి బయట పెట్టాలంటే మరొకరి సపోర్ట్ ఉండాల్సిందే. స్నానంతో పాటు ఇతర అవసరాలన్నీ తల్లి తీరుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు హయత్‌నగర్‌లోని తేజస్విని ఓ స్కూల్లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు రోజూ వదిలివచ్చేవారు. ప్రత్యేకంగా ఆటో కొనుగోలు అందులో తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేవారు. రాంనగర్లో ఇంటర్ చదువుతుప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఆటోలో గేట్ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి కూతురును భుజాలపై ఎత్తుకొని వెళ్లి మళ్లీ తీసుకొచ్చేవారు. రెండేళ్లపాటు ఆయన రోజూ ఇలాగే చేశారు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాలో తేజస్విని మూడేళ్ల పాటు డిగ్రీ చదివినప్పుడు ఇదే విధంగా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అనంతరం అదే కళాశాలలో ఆమె పీజీ (ఎంబీఏ) సీటు సంపాదించింది. ఆ రెండు సంవత్సరాలు కూడా తండ్రి అన్ని పనులూ మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించారు. ఇలా 24 ఏళ్లుగా కూతురు సేవకే అంకితమయ్యారు తండ్రి వెంకటేశ్వరరరావు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అయినా అదేమీ పట్టించుకోలేదు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కూతురును తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కస్తూర్బా మహిళా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యం ఆయనను సత్కరించడం విశేషం. నా పూర్వజన్మ సుకృతం.. ‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు నాన్న. నేను ఏదైనా ఉద్యోగం సంపాదిస్తా. నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటా. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ దూరం కావడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉండడంతో వద్దనుకున్నాను. త్వరలో జరగబోయే కామర్స్ పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం, గ్రూప్– 2కి ప్రిపేర్ అవుతున్నాను. వైకల్యంతో ఉన్నానని నేను ఏనాడూ బాధపడలేదు. ఇటువంటి తండ్రి దొరకడం నా పూర్వ జన్మసుకృతం’ అని చెబుతోంది తేజస్విని. -
నాన్నకి గిఫ్ట్
ఈసారి ఫాదర్స్‌డే.. మలాలాకు స్పెషల్. డిగ్రీని తండ్రికి కానుకగా తెచ్చి ఇచ్చింది. ప్రతి ఏడాదీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. నోబెల్ పీస్ ప్రైజ్.. ‘టైమ్’ కవర్ పేజ్.. యు.ఎన్.లో స్పీచ్.. స్టీవర్ట్ ఇంటర్వూ్య.. అన్నిటికన్నా.. డిగ్రీ పెద్ద గిఫ్ట్ ఆ తండ్రికి! ‘చదివితే చంపేస్తాం’ అన్నారు తాలిబన్లు. ‘చదివి చంపేసెయ్’ అన్నాడు ఆయన. అన్నంత పనీ చేసింది. పట్టా కూతురిది.. తలపై క్యాప్ తండ్రిది. ‘‘లోకం మొత్తం మౌనం వహించినప్పుడు.. ఒక్క గొంతు.. ఒక్క గొంతు చాలు లోకం మొత్తం ప్రతిధ్వనించడానికి’’. తండ్రి చెప్పాడు ఆ అమ్మాయికి. పద్నాలుగేళ్ల అమ్మాయికి అంత మాట అర్థం అవుతుందా? అర్థమయ్యేలా చెప్పాడు. ‘‘వన్ చైల్డ్. వన్ టీచర్. వన్ బుక్. వన్ పెన్. ఒక్కటి చాలు.. ప్రపంచాన్ని మార్చెయ్యడానికి’’ తండ్రి చెప్పాడు ఆ అమ్మాయికి. పద్నాలుగేళ్ల అమ్మాయికి అంత మాట అర్థం అవుతుందా? అర్థమయ్యేలా చెప్పాడు. తాలిబన్ల తూటాలకు పావురంలా కూలి, కోమాలోకి వెళ్లి, మూడు నెలల తర్వాత మృత్యుంజయురాలై లేచిన మలాలా యూసఫ్‌జాయ్.. ఆ కూతురు. ఆసుపత్రి నుంచి కూతురు డిశ్చార్జి కాగానే ఇక ముందు ఏమేమి చేయాలో చెప్పిన జియావుద్దీన్.. ఆ తండ్రి. ఆ తండ్రికి ఆ కూతురు జానీ మన్. ఇంట్లో పిలుపు అదే. సోల్‌మేట్ అని. కూతురికి మలాలా అనే పేరు పెట్టుకుంది కూడా ఆయనే. పాక్ జానపద కథల్లోని ఒక హీరోయిన్ మలాలా. స్త్రీల తరఫున మాట్లాడే గొంతు! పేరు పెట్టి ఊరుకోలేదు. పేరుకే ప్రతిష్ట తెచ్చేలా కూతుర్ని పెంచాడు. పెంచడం అంటే ‘ఇలా నడువు’ అని కాదు. ‘నీలా నడువు’ అని. రెండు ఆయుధాలు కూడా ఇచ్చాడు. విద్య, వాగ్ధార! రెండు రోజుల క్రితమే డిగ్రీ పూర్తి చేసింది మలాలా. అంతకుముందే ప్రపంచమంతా తిరిగి స్పీచ్‌లు ఇచ్చింది. తండ్రే చెప్పాడు. ఫిలాసఫీ చదవమని, పాలిటిక్స్ చదవమని, ఎకనమిక్స్ చదవమని. ‘గడ్డు’న ఉన్న ప్రపంచాన్ని గట్టున పడేసేవి ఈ మూడే అని చెప్పాడు. బాలికల విద్యకోసం ఆమె పోరాటం.. ప్రాణాలు దక్కించుకున్న రోజే మొదలైంది. ‘‘ఆడపిల్లలు చదవడానికి వీల్లేదని కదా ఆ రోజు వాళ్లు కాల్పులు జరిపారు. ఆడపిల్లల్ని చదివించే పోరాటంలో నువ్వు ఎదురు కాల్పులు జరుపు’’ అని చెప్పాడు. చదువు కోసమే కాదు, సమాజ శాంతి కోసమూ పోరాడమని చెప్పాడు. కూతురుకి ఇంతగా చెప్పే తండ్రి ఉండటం లోకానికే వెలుగు. జియావుద్దీన్ విద్యా ఉద్యమ కార్యకర్త. ‘లెట్ హర్ ఫ్లయ్’ అని పుస్తకం కూడా రాశాడు. ఆడపిల్లల్ని ఎగరనివ్వండి అంటాడు. ఆక్స్ఫర్డ్ డిగ్రీ, నోబెల్ ప్రైజ్, జాన్ స్టీవార్ట్ ఇంటర్వూ్య, టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రం, యు.ఎన్. స్పీచ్.. మలాలా సాధించిన ప్రతి ఘనత వెనుకా తండ్రి ఛాయ వెలుగుతూ ఆమెను కాంతిమంతం చేసింది. ‘‘స్త్రీవాదం గురించీ, స్త్రీల హక్కుల గురించీ మాట్లాడ్డం అంటే.. స్త్రీవాదనను అంగీకరించాలని పురుషులకు నచ్చచెప్పడమే’’ అని మలాలా దావోస్‌లో ప్రసంగిస్తూ అన్నప్పుడు ఆ తండ్రి హృదయం మురిసిపోయింది. ‘‘ఫెమినిజానికి ఇంకో అర్థం సమానత్వం. స్త్రీ.. సమానత్వాన్ని అడుగుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే మనం ఫెమినిజం అన్న ప్రతిసారీ అది పురుషుడిని ఉద్దేశించి మాట్లాడడమే’ అని అన్నప్పుడు ఆయన సంతోషం నింగిని తాకింది. తన భావాలు కూతురిగా ఆకృతి దాల్చడాన్ని ఆయన చూస్తున్నాడు మరి. ఆక్స్‌ఫర్డ్‌లో డిగ్రీ చేసింది కూతురే అయినా.. తనే కాన్వొకేషన్ గౌను వేసుకుని, తలపై క్యాప్ పెట్టుకున్నట్లుగా పుత్రికోత్సాహంలో ఉన్నాడు జియావుద్దీన్. ఓ తండ్రి ప్రయాణం అంటూ జియావుద్దీన్ రాసిన పుస్తకం.. ‘లెట్ హర్ ఫ్లయ్’ (ముందుమాట మలాలా) -
రోల్ మోడల్ రీల్ ఫాదర్స్
బాలీవుడ్ రీల్ నాన్నల రోల్ మారింది. ఆడపిల్లను గడపదాటనివ్వొద్దనే సంప్రదాయపు ఆలోచన నుంచి తేరుకొని అమ్మాయి కోరుకుంటే చదువు కోసం విదేశాలకూ పంపాలనే ప్రాక్టికల్ థీమ్‌లోకి వచ్చింది. కాలం మారింది. కథలనూ మార్చాలి. లేదా మారిన కథలతో కాలాన్ని ప్రభావితం చేయాలి. అత్తింట్లో ఆడపిల్లకు గౌరవం దక్కాలంటే ముందు మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విషయంలో కొడుకు, కూతురికి తండ్రే రోల్ మోడల్ అని గ్రహించింది. అందుకే ఇదిగో ఈ సినిమాలను తెరమీదకు తెచ్చింది. పిల్లలకు స్నేహాన్ని పంచే తండ్రులను పరిచయం చేస్తోంది. అంగ్రేజీ మీడియం చంపక్ బన్సల్ సాదాసీదా మనిషి. ఉదయ్‌పూర్‌లో స్వీట్‌షాప్ ఓనర్. కూతురే అతని లోకం. తల్లిలేని ఆ పిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కళ్లముందే పెట్టుకుంటాడు చంపక్. కానీ కూతురు తారికకు లండన్‌లో చదవాలనేది లక్ష్యం. ఇష్టంలేకపోయినా కన్నబిడ్డ కల కోసం తారికను లండన్‌కు పంపిస్తాడు. బతకడం నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. కష్టనష్టాల్లో అండగా నిలబడ్తాడు ఆ తండ్రి. థప్పడ్.. ‘నాక్కొంచెం ఊరట కావాలి నాన్నా.. ఇక్కడ కొన్నాళ్లుంటా’ అంటూ సూట్‌కేస్‌తో పుట్టింటికి చేరిన కూతురు అమృత (తాప్సీ) గుండెలో పొదువుకున్నాడు తండ్రి సచిన్ సంధు (కుముద్ మిశ్రా). ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా. ‘ఆ మనిషి మారేలా లేడు నాన్నా.. విడాకులు తీసుకుంటా’ అంటే ‘చిన్న చెంప దెబ్బకే విడాకుల దాకా ఎందుకమ్మా సర్దుకుపో’ అంటూ సలహా ఇవ్వలేదు. భార్యను తను గౌరవిస్తాడు కాబట్టి కూతురి బాధను అర్థం చేసుకున్నాడు. బిడ్డ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నానికి ఓ ఫ్రెండ్‌లా సపోర్ట్ చేస్తాడు. ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా బల్బీర్ చౌదరి (అనిల్ కపూర్) చాదస్తపు తండ్రి. షెఫ్ కావాలనుకున్న బల్బీర్‌ను అతని తల్లి ‘మగాడు వంట చేయడమేంటి అసహ్యంగా’ అని చీదరించుకొని గార్మెంట్స్ షాప్ ఓనర్ అయ్యేలా చేస్తుంది. అలా తల్లి నుంచే చాదస్తపు వాసనలు ఒంటబడ్తాయి బల్బీర్కు. అతని కూతురు స్వీటీ. ఓ పెళ్లిలో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని తన సెక్సువల్ ఐడెంటిటీని బయటపెడుతుంది. అతను పెరిగిన తీరు అతణ్ణి షాక్‌కు గురిచేసినా.. కూతురి మానసిక సంఘర్షణ అతనిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. ప్రిజుడీస్ను వదిలి బిడ్డను బిడ్డలా స్వీకరించే తండ్రిగా మారతాడు. కూతురు చేయి పట్టుకొని పెళ్లిమండపంలోకి తీసుకెళ్తాడు.. ఇంకో అమ్మాయితో పెళ్లి జరిపించడానికి. దంగల్ తల మీద కొంగు లేకుండా కనిపించకూడదని ఆడవాళ్ల మీద ఆంక్షలున్న చోట తన కూతుళ్లకు పెహల్వాన్లుగా తర్ఫీదునిస్తాడు కుస్తీ వీరుడైన తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్. వాళ్లు మహా యోధులుగా ప్రపంచ కీర్తిని సాధించి ఆ ప్రాంతంలోని తల మీద కొంగు సంప్రదాయానికి చెక్ పెడతారు. అలా రెజ్లింగ్ రింగ్స్ ఆడపిల్లలకు కాళ్ల పట్టీల్లాంటివనే కొత్త ఫ్యాషన్‌ను స్థిరపర్చాడు మహావీర్. అమ్మాయిల్లో ఆ క్రీడపట్ల ప్యాషన్‌ను డెవలప్ చేశాడా తండ్రి. -
నాన్న చెప్పినవి ఫాలో అవుతున్నా
‘‘ఏ అమ్మాయికైనా తండ్రిలో ఫ్రెండ్ కనబడితే ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్. మా నాన్న అలాంటివారే’’ అంటున్నారు రాశీ ఖన్నా. తన తండ్రి ‘రాజ్ ఖన్నా’ గురించి ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చారు. ► నా జీవితం మీద మా నాన్నగారి ప్రభావం చాలా ఉంది. ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం... అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు. ఇవాళ నేను నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నానంటే ఆయనే కారణం. ► నా చిన్నప్పుడు నాన్న చాలా స్ట్రిక్ట్. అందుకని భయంగా ఉండేది. కానీ నేను పెరిగేకొద్దీ నాన్న ఫ్రెండ్లీ అయ్యారు. ఇప్పుడు నేను దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు ఉంది. మనం అమ్మానాన్నలతో చెప్పుకోలేనివి ఫ్రెండ్స్‌తో చెప్పుకోవచ్చంటారు. నాకు అలాంటి మంచి ఫ్రెండ్ మా నాన్న. కొన్ని నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను ఆయన సలహా అడుగుతాను. ► యాక్చువల్లీ మా నాన్న మంచి ఫ్యామిలీమేన్. తన భార్యను బాగా చూసుకుంటారు. కూతురంటే చాలా ప్రేమ. మొత్తం ఫ్యామిలీకి ఓ పిల్లర్ ఆయన. ఇలాంటి తండ్రికి కూతురిని కావడం ఆ దేవుడి ఆశీర్వాదమే అనుకుంటున్నాను. ► ఫాదర్స్ డే అంటే మా డిన్నర్ బయటే. తీరికగా కబుర్లు చెప్పుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తాం. లాక్డౌన్ వల్ల బయటి ఫుడ్ నో. అందుకే మా నాన్న కోసం నేను స్పెషల్‌గా కేక్ తయారు చేస్తున్నాను. ► మనం ఎవరినైనా సంతోషపెట్టాలంటే పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనవసరంలేదు. వాళ్ల కోసం మనం చేసే చిన్న చిన్న పనులు కూడా వాళ్లను సంతోషపరుస్తాయని నాన్న అంటుంటారు. ఆయన చెప్పినవి ఫాలో అవుతున్నాను. నాన్నకు నేను కేక్ చేయడం అనేది చాలా చిన్న విషయం. కానీ కూతురు చేసిన కేక్ కాబట్టి నాన్న చాలా ఆనందపడతారు. మా నాన్న ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ ‘ఫాదర్స్ డే’ సందర్భంగా కోరుకుంటున్నాను. -
నాన్న రావా? నా దగ్గర ఉండవా?
ఇంట్లో మేకప్ లేకుండా తిరిగే హీరో నాన్న. ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియని నిస్వార్థ జీవి నాన్న. దేవుడి కంటే ముందు మొర ఆలకించేవాడు నాన్న. ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో మోసే హెర్కులస్ నాన్న. ఇవ్వాళ్ల నాన్నకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన రోజు. ఆయనను గట్టిగా గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఆయనతో మాట్లాడాల్సిన రోజు. ఆయన మాట్లాడేది వినాల్సిన రోజు. నాన్నకు నమస్కారం చేసుకోవాల్సిన రోజు. నాన్నా... చిన్నప్పుడు ఆడుకోవడానికి నీ ఛాతీని ప్లేగ్రౌండ్ చేశావు. నీ వీపుని స్కూటర్ని చేశావు. హుప్ అని ఎగరేసి ఆకాశానికి ఎగిరినట్టే అనిపించావు. నీకున్న సైకిల్ మీద ముందో వెనుకో కూచోబెట్టుకోకుండా ఎప్పుడూ సీటు మీదే కూచోబెట్టి నువ్వు మాత్రం నడుస్తూ సైకిల్ని, నన్నూ నెట్టుకొచ్చావు. జ్వరం నాకు వచ్చేది. కాని థర్మామీటర్ పెట్టి చూస్తే టెంపరేచర్ నీకు చూపించేది. పగలంతా పని చేసిన అమ్మ రాత్రి అలసి నిద్రపోతే నన్ను చూసుకోడానికి నువ్వు కదా నాన్నా గూర్ఖా అయ్యేవాడివి. నైట్ వాచ్‌మన్ అయ్యేవాడివి. జీతం భత్యం లేని కాపలాదారువి అయ్యేవాడివి కదా. సినిమా నచ్చక నేను ఏడిస్తే ఎన్నిసార్లు హాలు బయట తిప్పుతూ ఉండిపోయావ్. బిస్కెట్ కొనిపెట్టి నేను తింటూ ఉంటే అదే సినిమా అనుకున్నావ్. నీ ఉద్యోగం ఏమిటో. అందులో నీ సంతోషం ఏమిటో. నువ్వు ఎవరికి తల వొంచుతున్నావో. ఎక్కడ వెన్ను వంచుతున్నావో. మమ్మల్ని నిలబెట్టడానికే కదా నాన్నా అదంతా. సాయంత్రం వస్తూ వస్తూ డజన్ అరటిపళ్లు తేగలిగిననాడు నీ ముఖంలో సంతోషం. నెలాఖరున ఉత్త చేతులతో వచ్చినప్పుడు ముఖం చూపించడానికి కూడా మొహమాటం. నువ్వు తినే నాలుగు ముద్దలు కూడా అమ్మ ఒక్కోసారి వంట చెడగొట్టినప్పుడు నోరు మెదపకుండా తినేవాడివి. ఒక్క వొక్కపలుకు దొరికితే నోట్లో వేసుకొని అదే వైభోగం అన్నట్టు కూనిరాగం తీసేవాడివి. రెండు లుంగీలను సంవత్సరమంతా కడుతూ, చిరిగిన వైపును ఎంత నైసుగా మడతలోకి తోసేవాడివో. నా కొత్త టెరికాటన్ షర్ట్‌కు అదంతా తెలుసు నాన్నా. ఏమైనా దాచుకున్నావా నువ్వు నీకోసం. ఏదైనా చేసుకున్నావా నీకోసం. అల్సర్ వస్తే మజ్జిగ తాగితే చాలనుకుంటావు. వెన్నునొప్పికి చాప మీద దిండులేకుండా పడుకుని అదే మందంటావు. డాక్టర్ వారం రోజుల కోర్సు రాస్తే ‘యాభై రూపాయలకు ఎన్ని మందులొస్తే అన్నే ఇవ్వు’ అని ఎన్నిసార్లు నీదైన కోర్సును వాడావో తెలియదా నాన్నా. నువ్వు ఏడవగా ఎప్పుడూ చూళ్లేదుగాని అక్క పెద్దదయ్యిందని అమ్మ పట్టుబట్టి ఫంక్షన్ చేయించినప్పుడు అక్కను దగ్గరకు తీసుకుని ఏడ్చావు. ఎందుకు ఏడ్చావో. కాని సంతోషంగా ఏడ్చావనిపించింది. అక్క పెళ్లికి దాచిందంతా ఖర్చు పెట్టావు. పిల్లలనే నీ పెన్షన్ అనుకుని ఉంటావు కదా నాన్నా. అమ్మ అలిగితే భయపడ్డావు. పిల్లలు మంకుపట్టు పడితే భయపడ్డావు. ఇరుగుపొరుగువారు ‘నీకేమయ్యా... బంగారంలాంటి కుటుంబం’ అంటే ఎక్కడ దిష్టి తగులుతుందోనని భయపడ్డావు. మంచి మార్కులు వస్తే భయపడ్డావు. మరింత ముందుకు ఎక్కడ తీసుకెళ్లలేనో అని భయపడ్డావు. ఒక్కసారన్నా కొట్టినా తిట్టినా బాగుండేది. నువ్వు బాధ పడి అదే పెద్ద శిక్షగా మాకు విధించావు. ఏదైనా గుడికెళ్లినప్పుడు ఎంత దిలాసాగా ఉండేవాడివి. దేవుడు నా పిల్లలకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాడు అన్నట్టు నవ్వేవాడివి. నాన్నా... చిన్నప్పుడు అడిగేవాడివి... పెద్దయ్యాక పెద్ద ఇల్లు కట్టి నాకో గది ఇస్తావా... పేపర్లు, పుస్తకాలు చదువుకుంటూ హాయిగా నీ దగ్గర ఉంటాను అని. ఇప్పుడు ఉంది నాన్నా. ఇల్లు ఉంది. నీ కోసం గది ఉంది. పుస్తకాలు కూడా ఉన్నాయి. కాని నువ్వు మాత్రం లేవు నాన్నా. నాకెందుకు ఇబ్బంది అనుకుంటున్నట్టున్నావు. పిల్లలు పెద్దలను తమ దగ్గర ఉంచుకోవడం లేదు.. నా కొడుకు నన్నెందుకు ఉంచుకుంటాడు అని లోలోపల సందేహపడుతున్నట్టున్నావు. నేను వెళితే మనమలకు, మనమరాళ్లకు అడ్డం అని అనుకుంటున్నావు. అయ్యో నాన్నా.. దబాయించి అడగడం, లాగి లెంపకాయ కొట్టి నాకు ఇది కావాలి అని తీసుకోవడం ఎప్పుడు చేస్తావు నాన్నా. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు అలా ప్రశాంతంగా పడక్కుర్చీలో కూచుని ఉండే నిన్ను చూడటం కంటే ఐశ్వర్యం ఏముంటుంది. అమ్మతో నువ్వు కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది. చిన్నప్పుడు నీ వీపు మీద ఎక్కి ‘స్పీడ్ స్పీడ్’ అని పసి గుద్దులు గుద్దేవాణ్ణి. ఇప్పుడు పెద్దయ్యి కడుపులో గుద్దుతాననుకున్నావా? నీ కడుపున పుట్టాను నాన్నా. నా కడుపులో పెట్టుకు చూసుకుంటాను. రావా? నా దగ్గర ఉండవా? – సాక్షి ఫ్యామిలీ -
బిడ్డ కోసం ఓ తండ్రి ఆరాటం!
తిరువనంతపురం(కేరళ): మనం గెలిస్తే పది మందికి చెప్పుకొని మనం ఓడిపోయి ఒంటరిగా మిగిలితే మన భుజం తట్టి ప్రోత్సహించేవాడు నాన్న. మన భాద్యతను తను బతికున్నంత కాలం తీసుకునేవాడు నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురి కోసం ఎంతో పోరాటం చేసి గెలిచిన ఓ నాన్న కథను తెలుసుకుందాం. అతని పేరు ఎస్ బైజు. తిరువనంతపురానికి చెందిన బైజుది రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అతని 8 సంవత్సరాల కూతురు అబిన బైజు ఆరోగ్యం పాడై అసుపత్రిలోచేరింది. (ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!) అసలే లాక్డౌన్ కారణంగా మూడునెలల నుంచి పనిదొరక్క అల్లాడిపోతున్న అతడిపై పిడుగుపడినట్లు తన కూతురి కాలేయం పాడైందని, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తండ్రి ఎక్కని మెట్టులేదు, తొక్కని గడపలేదు. కానీ ఏ ఒక్కరూ అతని బాధను పంచుకోవడానికి ముందుకు రాలేదు. తన కూతురుకు సరిపోయే లివర్ దొరికిందని వెంటనే మారిస్తే పాప బతుకుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ చేతిలో పైసా లేని ఆ తండ్రి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక నర్సు క్రౌండ్ ఫండింగ్ సంస్థ గురించి తెలిపింది. దీంతో మిలాప్ క్రౌండ్ ఫండింగ్ సంస్థను అతడు కలిశాడు. (రేపొక్క రోజే ఏడు రోజులు) పాప ఆపరేషన్‌కు రూ. 20 లక్షలు అవసరం కాగా మిలాప్ సంస్థ రూ. 11,81,325 అందించింది. కొంత మంది దాతలు మరికొంత సాయం చేశారు. మిగిలిన డబ్బును పాపను చేర్పించిన కొచ్చి అస్టర్ మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించింది. పాపను 21రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. పాపకు మే మొదటివారంలో ఆపరేషన్ చేయగా మూడు వారాల పాటు ఐసీయూలో ఉంచారు. మరో మూడు నెలలు పాప ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బైజు ధన్యవాదాలు తెలిపాడు. -
ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!
మన జీవితం ఎలా ఉండాలో కలలు కంటూ.. ఆ జీవితాన్ని మనకు ఇవ్వడానికి కష్టపడే వ్యక్తి తండ్రి ఒక్కరే. మనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నిత్యం పరితపించే తండ్రికి మనం తిరిగి ఎదైనా ఇచ్చే రోజు ఉందంటే అది ఫాదర్స్ డే మాత్రమే. ఈ రోజు ఎలా వచ్చింది. మొదట ఏ దేశంలో దీన్ని సెలబ్రేట్ చేశారో తెలుసుకుందాం. అయితే ఫాదర్స్ డేకు కచ్చితమైన తేదీ లేదు. ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటారు. అయితే అన్ని దేశాలు ఒకేరోజున ఫాదర్స్ డేను జరుపుకోవు. ఒక్కొదేశంలో ఒక్కోరోజు, ఒక్కోనెలన జరుపుకుంటాయి. అమెరికన్ సివిల్ వార్ అనుభవజ్ఞుడైన విలియం జాక్సన్ స్మార్ట్ కుమార్తె సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డేను 1910 జూన్ మూడవ ఆదివారం రోజున సెలబ్రేట్ చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఫాదర్స్ డే వేడుకను ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితిగా మారింది. 111 దేశాలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు మాత్రం సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. బ్రెజిల్లో ఆగస్టు రెండవ ఆదివారం నాడు తండ్రులను ఘనంగా సత్కరిస్తారు. కావునా ఈ ఏడాది జూన్ మూడవ అదివారం (జూన్ 21)న ఫాదర్స్ డేను భారతదేశంతో పాటు మరిన్ని దేశాలు కూడా జరుపుకొనున్నాయి. నీస్వార్థంగా మీ భవిష్యత్తు కోసం పరితపించే మీ తండ్రికి ఈ ఫాదర్స్ డే ఎప్పటికీ గుర్తుండిపోయాలే మంచి బహుమతి ఇచ్చి సత్కరించండి. -
రేపొక్క రోజే ఏడు రోజులు
ఇండిపెండెన్స్ డే.. రిపబ్లిక్ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్‌డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం) భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు. మ్యూజిక్ డే (ఒక మంచి పాట విందాం) వరల్డ్ మ్యూజిక్ డే తొలిసారి పారిస్‌లో 1982 జూన్ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డే నెలకొల్పారు. వరల్డ్ హ్యూమనిస్డ్ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం) హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ హ్యూమనిస్డ్ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్ 21 అందుకు ఫిక్స్ అయింది. హ్యాండ్ షేక్ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం) ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్ హ్యాండ్‌షేక్ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది చేతులు చేతులు కలిపే హ్యాండ్‌షేక్ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే (నాన్న దీవెనలు కోరుకుందాం) తేదీ ఏదైనా గానీ మదర్స్ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్ మూడో వారమే ఫాదర్స్ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్ డే కూడా అంతే. హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం) హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ ఆర్గనైజేషన్’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న ‘వరల్డ్ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. టీ షర్ట్ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం) సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్‌లో 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్ స్టేట్మెంట్ అవడంతో యూత్ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్. జూన్ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు. -
నాన్న ఇల్లు అమ్మి.. రైఫిల్ కొనిచ్చాడు!
న్యూ ఢిల్లీ: ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రఖ్యాత షూటర్, ఒలింపిక్ మెడల్ సాధించిన గగన్ నారంగ్ తన తండ్రి గొప్పతనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. షూటింగ్లో బాడా ఆడి దేశానికి గొప్ప పాత్రినిథ్యం వహించి పలు జాతీయ, అంర్జాతీయ పతకాలు సాధించాలని తన తండ్రి ఆకాంక్షించారని తెలిపారు. 20 ఏళ్ల క్రితం సొంతింటిని అమ్మి తనకు షూటింగ్ ప్రాక్టిసుకు ఇబ్బంది కలగకూడదని ‘రైఫిల్’ కొనిచ్చారని గుర్తుచేసుకున్నాడు. ‘ఏదో రోజు నేను భారతదేశానికి గొప్ప మెడల్స్ సాధిస్తాననే నమ్మకం నాన్నకు ఉండేది. అందుకే నా కోసం సొంతింటిని అమ్మి.. రైఫిల్‌ను కొనిచ్చారు’ అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ‘షూటింగ్లో ప్రపంచ రికార్డును నెలకొల్పుతానని, ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధిస్తానని నేను ఏనాడూ ఊహించలేదు. కానీ ఓ తండ్రిగా మా నాన్న నా ప్రతిభ మీద అపార నమ్మకం కలిగి ఉండేవారు’ అని తెలిపారు. ‘నా విజయాల వెనుక మా నాన్న సహకారం ఎంతో ఉంది. తండ్రిగా నా ప్రతిభను తెలుసుకోవడంతోపాటు, నా ముఖంలో సంతోషాన్ని నింపాలని తాపత్రయ పడిన గొప్పతండ్రి ఆయన.. హ్యాపి ఫాదర్స్ డే నాన్న’ అని పోస్ట్ చేశారు. -
కొడుకు లేని లోటును తీరుస్తున్నాం..
‘మా అమ్మానాన్న ఆండాళమ్మ, స్వామిరెడ్డిలకు మేము నలుగురు కూతుళ్లమే. అమ్మాయిలని వివక్ష చూపకుండా.. విలువ కట్టలేని ప్రేమను పంచి మమ్మల్ని మా అమ్మానాన్న బాగా పెంచారు. అందరినీ చదివించారు. నేను డాక్టర్‌గా ఎదగాలన్నది నాన్న ఆకాంక్ష. ఈ గమ్యాన్ని చేరడంతో ఎంతో సంతోషపడ్డారు. అమ్మ మూడేళ్ల క్రితం మా నుంచి దూరమైంది. అప్పటి నుంచి నాన్న బాగోగులు బిడ్డలమే చూసుకుంటున్నాం. కొడుకులేని లోటు తీరుస్తున్నాం. ఒక ఆడబిడ్డగా దేవుడు మాకిచ్చిన వరమిది’ అని జిల్లా పరిషత్ నూతన చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి చెప్పారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మా అమ్మనాన్నలది హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్. అప్పట్లో మలక్‌పేట టీవీ టవర్ వద్ద ఉండేవాళ్లు. మాకు దగ్గర్లోని తిరుమల హిల్స్‌లో నా భర్త హరినాథ్‌రెడ్డి వాళ్ల ఇల్లు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకరి కంట ఒకరం పడలేదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి నాటికే మా ఇద్దరిదీ ఎంబీబీఎస్ పూర్తయింది. వివాహం తర్వాత నేను ఉన్నత చదువులు అభ్యసించడంలో హరి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను గుల్బర్గాలో ఎండీ, డీజీఓలో చేరగా.. ఆయన తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. పీజీలో ఉండగానే కూతురు త్రిష పుట్టింది. మూడు నెలల వయసులో పాపను అత్తమ్మ దగ్గరే ఉంచాను. ఆలనాపాలనా తనే చూసుకున్నారు. అప్పుడు పరీక్షలు ఉండటంతో గుల్బర్గా వెళ్లక తప్పలేదు. ఇలా పీజీ అయ్యే వరకు వారానికోసారి పాప వద్దకు వచ్చే వెళ్లేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఆప్యాయతకు, అనురాగానికి ఏమాత్రం కొదవ లేదు. మామ తీగల కృష్ణారెడ్డి, అత్తయ్య అరుంధతి, మరిది అమర్నాథ్రెడ్డి, తోటి కోడలు తులసి, మా వారు, ఇద్దరు పిల్లలం కలిసే నివసిస్తాం. నిత్యం ఎవరి బిజీలో వాళ్లుంటారు. ప్రతి శనివారం సాయంత్రం అందరం కలిసే భోజనం చేస్తాం. మా ఆడపడుచు కుటుంబమూ ఈ విందుకు హాజరవుతుంది. సమయాన్ని బట్టి కలిసే చోటు మారుతుంది. ఇలా ఇంటిల్లిపాదితో వారానికోసారి భేటీ ఉండటం గొప్ప సంతోషానిచ్చే అంశం. చిన్నప్పటి నుంచి టాపర్‌ని బాల్యం నుంచి చదువుల్లో ముందజలో ఉండేదాన్ని. పోటీతత్వం, ఇష్టంతో చదివేదాన్ని. ఏ క్లాస్‌ని తీసుకున్నా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేదాన్ని. టెన్త్ వరకు హైదరాబాద్‌లో చదవగా.. విజయవాడలో ఇంటర్ పూర్తయింది. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ చేశా. వైద్య విద్యలో పీజీ కాగానే నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న డక్కన్ మెడికల్ కాలేజీలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలందించాను. అనంతరం రెండేళ్లపాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగాను. మామ, మా ఆయన ప్రోత్సాహంతో 2010లో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్–ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థాపించాను. స్వీట్స్ తినేందుకు కిలోమీటర్లు వెళ్లేవాళం.. వైద్యవిద్య చదివే సమయంలో నచ్చిన ఆహారం తినేందుకు క్లాస్‌లకు డుమ్మా కొట్టేవాళ్లం. మా కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రసమలై స్వీట్ తినేందుకు వెళ్లేవాళ్లం. అలాగే అక్కడ ఆశీర్వాద్ హోట్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్, జనతా ఐస్‌క్రీం పార్లర్లో వివిధ రకాల ఫేవర్లలో ఐస్‌క్రీంలు చాలా ఫేమస్. చాలా ఆకర్షనీయంగా, టేస్టీగా ఉండటంతో తరగతులకు డుమ్మాకొట్టి ఆ రుచులను ఆస్వాదించేవాళ్లం. మా బెస్ట్ ఫ్రెండ్స్ మ్తొతం ఏడుగురు. ఎక్కడికి వెళ్లినా మేమంతా ఒకే జట్టుగా కదిలేవాళ్లం. 16ఏళ్ల నాటి కోరిక.. నెరవేరిన వేళ పెళ్లయిన కొత్తలో మేమిద్దరం మారీషస్కి వెళ్లాం. హెలికాప్టర్ రైడ్ చేయాలన్న కోరికను ఆయన ముందుంచా. అయితే, ఆ రైడ్ చేయడం వీలుపడలేదు. ఈ విషయాన్ని 16 ఏళ్లపాటు తనలో దాచుకున్న ఆయన నా 40వ పుట్టిన రోజు సందర్భంగా నిజం చేశారు. సౌతాఫ్రికాకు తీసుకెళ్లి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ హెలికాప్టర్ రైడ్ చేయించారు. ఈ ఘటన చాలా సర్ప్రైజ్ కలిగించింది. ఆ క్షణాన నాకసలు మాటలు రాలేదు. నా ఇష్టం పట్ల ఆయన చూపిన ప్రేమ నా జీవితకాలపు తీపిజ్ఞాపకం. వైద్య వృత్తి వల్ల నేను.. టీకేఆర్ విద్యాసంస్థల నిర్వహణలో మా భర్త చాలా బిజీ. ఉదయం లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారాలే ఉంటాయి. కానీ, ప్రతి ఆదివారం పూర్తిగా మేం కుటుంబానికే కేటాయిస్తాం. ఆ రోజు ఎటువంటి పనులూ పెట్టుకోం. ఆయనది విశాల మనస్తత్వం. అన్నీ అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. నాన్‌వెజ్ అంటే మహాఇష్టం.. మావారికి నాన్‌వెజ్ అంటే ఇష్టం. మటన్ మహాఇష్టం. మా ఇద్దరు పిల్లలు త్రిష, కృష్ణారెడ్డిలు కూడా వాళ్ల నాన్ననే అనుసరిస్తారు. రోజు వడ్డించినా వద్దనకుండా లాగించేస్తారు. నేనేమో నాన్‌వెజ్‌కు కొంచెం దూరం. నాన్‌వెజ్‌ని నేనే వండాలి..వడ్డించాలి. ఇక ఆరోజు క్రికెట్ ఉంటే పండగే. వారి ముంగిటకే వంటకాలను తీసుకెళ్లాలి. ఆ మ్యాచ్ అయ్యేదాకా టీవీని వదలరు. నేను పెద్దగా టీవీ చూడను. చూసే సమయమూ ఉండదు. పిల్లల చదువులో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాను. ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న మా కూతురు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నీట్లో మెరిట్ వచ్చింది. ఎంబీబీఎస్‌లో చేరనుంది. అబ్బాయి.. సెకండ్ క్లాస్. సినిమాలో విషయంలో మా అభిరుచులు వేరు. నేను హిందీ సినిమాలు చూస్తా, ఆయన తెలుగు కామెడీ మూవీలు ఎక్కువగా చూస్తారు. అయినా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తూ రెండు భాషల సినిమాలకు వెళ్తుంటాం. బేసిక్‌గా నేను చిరంజీవి ఫ్యాన్‌ని. జగదేకవీరుడు.. అతిలోకసుందరి బాగా నచ్చిన సినిమా. సేవకు కదిలి.. ప్రాణాలు కాపాడి మా ఆస్పత్రికి గ్రామీణ ప్రాంత మహిళలు అధికంగా వస్తుంటారు. వాళ్లంతా పెద్దగా పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిసింది. విశ్రాంతి పెద్దగా తీసుకోరని, మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు నా కౌన్సెలింగ్ ద్వారా తేలింది. ఇటువంటి మహిళలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి వారిని వేధిస్తున్నాయి. తొలుత వారికి చైతన్యం కల్పించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని భావించా. ఇందుకోసం ‘ఆర్ట్’ ఫౌండేషన్‌ను స్థాపించి.. గ్రామీణ మహిళల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. 60కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల బాలికల్లోనూ చైతన్యం తెచ్చాం. దీంతోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని మా ఆస్పత్రిలో ఉచితంగా చేయించాం. ఇలా 1,350 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. ఇందులో నలుగురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో వీరి ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పటికే నిత్యం ఒక గంట ఆ ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత ఓపీ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం. -
అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు
‘నా కష్టసుఖాల్లో నాన్న అండగా ఉంటాడు.. నేను చేసే పనుల్లో మంచి చెడు విడమరిచి చెప్పే విమర్శకుడు.. సాయం కోసం మనల్ని నమ్మి ఎవరైనా వస్తే రెండో సారి రాకుండా పని చేయాలని సునిశితంగా మందలిస్తారు.. ఓ రకంగా చెప్పాలంటే ఆయనే నాకు అండాదండ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నాకు అక్కాచెల్లెళ్లతో ఆడుకున్న ఆటపాటలు, అన్నయ్యతో కలిసి సైకిల్‌పై వెళ్లి చూసిన సినిమాలు అన్నీ గుర్తున్నాయి’ – ‘సాక్షి పర్సనల్ టైమ్’లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వరంగల్ సాక్షి ప్రతినిధి: నలుగురం అక్కాచెల్లెళ్లం కురవి మండలం గుండాత్రిమడుగు పక్కన ఉన్న పెద్ద తండాలో వ్యవసాయ చేసుకునే గిరిజన కు టుంబం మాది. నాన్న లింగయ్యనాయక్, అమ్మ దశిమి. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ఒక అన్నయ్య. నేను అందరి కంటే చిన్నదాన్ని. మా పెద్ద తండా నుంచి 5 కి.మీ దూరంలో ఉండే గుండాత్రిమడుగుకు వెళ్లి చదువుకున్నా. ఐదో తరగతిలో ఉన్నప్పుడు వరంగల్‌లోని సంక్షేమ హాస్టల్లో చేర్పిస్తే తిండి బాగాలేదని ఇంటికి పారిపోయి వచ్చా. ఏడో తరగతి వరకు గుండాత్రిమడుగులో చదువుకున్నా. నాది బాల్యవివాహం. ఏడో తరగతి పూర్తికాగానే లగ్గమైంది. మా అన్న స్నేహితుడైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైల్వే ఉద్యోగి గోవింద్ రాథోడ్‌తో 1982లో వివాహమైంది. ఆ తర్వాతే పదో తరగతి పరీక్ష పూర్తి చేశా. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను. ఇక రాజకీయాల్లో బిజీ కావడంతో చదువు అంతకంటే ముందుకు సాగలేదు. నాన్న సహకారం మరవలేనిది నేను రాజకీయాల్లోకి రావటానికి, రాణించటానికి, ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండటానికి నాన్న లింగ్యనాయకే కారణం. ఎందుకు ఇలా చెప్పుతున్నానంటే.. చాలామంది కార్యకర్తలు, ప్రజలు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కదా. వారందరినీ నాన్న గమనిస్తూ ఉండేవారు. అలా ఎవరైనా ఒకటి, రెండుసార్లకు మించి వస్తే గమనించి నాకు చెప్పేవాడు. మనపై నమ్మకంతో సహాయపడుతామని ఎందరో వస్తుంటారు. పని ఐతే ఐతది, లేకపోతే కాదు అని చెప్పాలే తప్ప తిప్పించుకోవద్దని సూచిస్తారు. నీ వల్ల అయ్యేటట్లు ఉంటే ఖచ్చితంగా సాయం చేయాలని, ఇప్పటికి కూడా నేను చేసే పనులను గమనిస్తూ నన్ను హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తాడు. మా నాన్న నాకు పెద్ద విమర్శకుడు, మార్గదర్శి. నాగలి దున్నుతా... వ్యవసాయ కుటుంబం కావటంతో చిన్నప్పుడు పొలం పనులకు అమ్మవాళ్లతో వెళ్లేదాన్ని. నాకు నాగలి దున్నటం, నాట్లు వేయటం, నీళ్లు పెట్టడం.. ఒక్కటేమిటి వ్యవసాయ పనులన్నీ వచ్చు. నిజంగా ఆ రోజుల్లో జీవితం చాలా అందంగా ఉండేది. అరమరికలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించేటోళ్లం. చిన్నప్పుడు మా అక్కలతో, అన్నలతో తీరొక్క ఆటలు ఆడేవాళ్లం. ఈత కొట్టడం కూడా వచ్చు. మగరాయుడిలా పెరిగా ఇంట్లో అన్నయ్యతో పాటు నలుగురం ఆడపిల్లలం. కానీ నేను చిన్నప్పటినుంచి మగరాయుడిలాగే పెరిగా. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. మా కజిన్స్‌తో ఎక్కువగా తిరిగేది. నా బలం, బలహీనత గిరిజన మహిళను కావటమే. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా ధైర్యంగా పెరగటం వల్లే ఈ స్థితికి చేరుకోగలిగిను. అలాగే మహిళను కావడం వల్ల చాలా ఇబ్బందుల సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందనిపిస్తుంది. నాకు మొదటి నుంచి అన్ని మతాలు, దేవుళ్లను ఆరాదించటం అలవాటు. కురవి వీరన్న ఇష్టదైవం. అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు మహేశ్ బాబు చిన్నప్పుడు మా అన్నయ్యతో కలిసి సైకిల్ మీద, ఎండ్లబండి మీద మహబూబాబాద్, బయ్యారం వెళ్లి సినిమాలు చూసేది. నాకు ఇంకా గుర్తుంది.. నేను మొదట చూసిన సినిమా లవకుశ. మా ఆయనకు తెలుగు రాకపోవటంతో ఇద్దరం కలిసి హిందీ సినిమాలు బాగా చూసేవాళ్లం. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో ఎక్కువగా చూడలేకపోయినా. అప్పుడు ఎన్టీఆర్, ప్రస్తుతం మహేష్‌బాబు అంటే ఇష్టం. హీరోయిన్లలో జయసుధ, జయప్రద అంటే ఇష్టం. జయప్రద తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి పనిచేశా. ఇటీవల ఫిదా, బాహుబలి సినిమాలను మా కొడుకులు, కోడళ్లతో కలిసి చూశాను. నా జీవితాంతం వెంటాడుతుంది మా ఆయన అకాల మరణం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన అదే. నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సునీల్‌కుమార్ రాథోడ్, చిన్నవాడు సతీష్ రాథోడ్. పెద్దకుమారుడు, కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్నబ్బాయి ఇక్కడే మహబూబా బాద్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే.. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతోనే పెరిగాను. ఎన్టీఆర్ ప్రజలకు పాలన చేరువ చేశారు. మా అన్న గోవింద్నారాయణ లడ్డా సహకారంతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఎన్టీఆర్ తరువాత, ప్రజలకు పరిపాలన దగ్గర చేసిన సీఎం కేసీ ఆర్. ప్రజలకు ఏం అవసరమో తెలిసిన నాయకుడు. నన్ను తన సొంత బిడ్డ్డలా చూసుకుంటాడు. ఇంటికి వెళ్తే భోజనం చేయకుండా వెళ్లనివ్వరు. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా.. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి, సర్పంచ్, జెడ్పీటీసీగానే కాకుండా పార్టీల్లో వివిధ పదవులు చేపట్టినా. 2004–05 ప్రాంతంలో పిల్లల చదువు కోసమైతేనేమి,ఇతరత్రా ఇబ్బందులతో రాజకీయాలు నాకు సరిపడవు.. తప్పుకుందాం అని అనుకున్నా. కానీ అనూహ్యంగా చంద్రబాబు 2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేయించారు. జెడ్పీటీసీగా గెలిచి స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశా. ఈ నేపథ్యంలో 2009లో డోర్నకల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందటం నా జీవితంతో అత్యంత ఆనందకరమైన విషయం. ఈ స్థితికి చేరుకోవటమే గొప్ప నేను సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థితికి చేరుకోవటమే గొప్పగా భావిస్తున్నా. ఉన్నత పదవులు ఆశించాలని కోరిక ఏమీ లేదు. కేసీఆర్ ఇప్పటి వరకు నాపై నమ్మకంతో ఇచ్చిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాను. నన్ను గుర్తుపెట్టుకుని మరీ నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా శిరసావహిస్తా. జగన్ పరిపాలన బాగుంది తండ్రిలాగ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన మంచి భవిష్యత్ ఉంటుంది.రాజకీయాలు పక్కకు పెడితే తను అనుకున్న లక్ష్యం కోసం ఎన్నికష్టాలైనా ఎదుర్కొని సాధించటం అనేది చాలా గొప్ప విషయం. కష్టాలు ఎదురైతే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటేనే విజయం వరిస్తుందని జగన్ నిరూపించారు. -
నాన్నా! నేనున్నాను
అమ్మ పాలు పడితే.. నాన్న జీవితాన్ని పిండి చెమట చిందిస్తాడు. పాలు తియ్యగా ఉంటాయి. చెమట ఉప్పగా ఉంటుంది. ఇవాళ తిన్న ఆ ఉప్పుకి రుణం తీర్చుకోవాలి. ‘నాన్నా! నేనున్నాను’ అని అయినా చెప్పండి. జనరల్‌గా అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడతాం.. నాన్న గురించి తక్కువ మాట్లాడినట్లనిపిస్తుంటుంది. ఎందుకు అమ్మ గురించే ఎక్కువ మాట్లాడతాం? నిజమే. సమాజంలో అమ్మ గురించి మాట్లాడినంత ఎక్కువగా నాన్న గురించి మాట్లాడం. అలాగని నాన్నను తగ్గించినట్లు కాదు. నాన్నను అర్థం చేసుకోవడంలో మనదే లోపం. సత్యం మాతా; పితా జ్ఞానం అన్నారు. సత్యం తల్లి. జ్ఞానం తండ్రి. కానీ నా దృష్టిలో ఇది సత్యం... ఇది అసత్యం అని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. కాబట్టి నాన్న ఎప్పుడూ గొప్పవాడే. నాన్నను తక్కువ చేసినా అది తక్కువయ్యేది కాదు. ఎందుకంటే ‘‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా.. నడిపించిన మా నాన్నకు నాన్నయ్యానుగా’’ అని ‘మనం’ సినిమా కోసం పాట రాశాను. చెడ్డ ప్రియురాలు ఉండొచ్చు. చెడు స్నేహితురాలు ఉండొచ్చు. కానీ చెడ్డ తల్లి ఉండదు అంటారు. అమ్మ కని పెంచుతుంది. అసలైన జీవన మార్గంలో మనం ముందుకు వెళ్లడానికి, మన లక్ష్యం వైపు వెళ్లడానికి శక్తిని, సామర్థ్యాన్ని, తెలివిని, విద్వత్తును ఇచ్చి దారిని చూపించి .. ఇలా వెళ్లు నీ గమ్యం వస్తుంది అని ఒక సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపించేవాడు నాన్న. నా దృష్టిలో కని పెంచడంకన్నా.. నడిపించేవాడు ఇంకా గొప్ప. ఎందుకంటే... తల్లి కన్న తర్వాత వాడు మంచివాడు కావొచ్చు. చెడ్డవాడు కావొచ్చు. కానీ నడిపించేవాడు.. నడిపించే శక్తి లేకపోతే వారు దుర్మార్గులు కూడా అవొచ్చు. రాక్షసులు కావొచ్చు. నడిపించేవాడు సరిగ్గా ఉంటేనే కని పెంచినదానికి ఓ అర్థం. నాన్న గురించి ఇంత బాగా చెప్పారు. అమ్మ గొప్పతనం గురించి ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’ అని రాశారు. ఆ పాట రాసిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటారా? మా అమ్మగారిని ఊహించుకునే ఆ పాట రాశాను. ఎందుకంటే ఆ ట్యూన్ నా దగ్గరకు వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. నేను భోజనం చేసి అంతా సిద్ధం చేసుకునే సరికి 12 అయ్యింది. పాట రాయడానికి అప్పుడు కూర్చున్నాను. ఆ ట్యూన్ కొత్తగా ఉంటుంది. ఆస్వాదించి రాయాలి. ఒంటి గంటకు ఆ ప్రవాహం ప్రారంభమైంది. రాసే ముందు మా అమ్మను ఓసారి తలుచుకున్నాను. ఆమె పడ్డ కష్టాన్ని, చేసిన త్యాగాన్ని, శ్రమను గుర్తు చేసుకున్నా. అలాగే నా పిల్లలకు తల్లి అయిన నా భార్య గురించి ఆలోచించాను. అలా నాకు ఇద్దరు అమ్మలు. వారిద్దరినీ నా మనోఫలకంపై గుర్తు చేసుకున్నాను. నాకు తెలియకుండానే, నాలో ఏదో శక్తి ప్రవేశించి ఆ పాట రాయించిందని నా అభిప్రాయం. ఆ రోజు ఆ పాటను నేను రాశానా? లేక మా అమ్మ రాయించిందా. నా భార్య రాయించిందా? లేక పైన ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ రాయించిందా? తెలియదు. ప్రపంచంలోని అమ్మలందరికీ చెందుతుంది ఈ పాట. ఎందుకంటే మనలోని ప్రాణం అమ్మ. మనదైన రూపం అమ్మ. ఎనలేని జాలిగుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ. కరుణించే కోపం అమ్మ. వరమిచ్చే తీపి శాపం అమ్మ. అమ్మ కోప్పడినా అది కోపం కాదు కరుణ. కరుణకు మరో రూపం. అమ్మ శాపనార్థాలు పెట్టినా అవి మనకు దీవెనలే. అమ్మ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మనకు అది అర్థం అవుతుంది. ఆ దూషణలే తర్వాత భూషణలు అవుతాయి అని. ఆ ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుని మనల్ని మనం మార్చుకుంటే..మనల్ని మనం మలుచుకుంటే ఆ తిట్లు మనం జీవితంలో పైకి రావడానికి మెట్లుగా వాడుకోవచ్చు. ప్రతి తిట్టు మనం పైకి ఎదగడానికి దోహదపడటానికి మెట్టు. నాన్న గురించి పాట రాయలేదేమో? ఆ అవకాశం నాకు ‘శత్రువు’ అనే చిన్న సినిమాకి వచ్చింది. అయితే ‘మనం’ సినిమాలో అమ్మ గురించి, నాన్న గురించి ఒకే పాటలో రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘ఒకరిది కన్ను.. ఒకరిది చూపు’ అని రాశాను. కన్ను అమ్మ అయితే చూపు నాన్న. కన్ను మూసుకుంటే లాభం ఏముంది? తెరిచి చూడాలి. కంటికి ప్రయోజనం చూపు. చూపుకి ఎంత ప్రయోజనం ఉందో చెబుతున్నాం. అలాగే ‘ఒకరిది మాట ఒకరిది భావం’ అని రాశాను. అంటే మాట ఒకరు.. అర్థం ఒకరు అని. మాట లేనిదే అర్థం లేదు. అలాగే మాటల్లేని భావం కూడ వ్యర్థమే. మాట, అర్థం రెండూ ఉండాలి. తల్లిదండ్రుల్లో ఎవరు గొప్పవారు అనే విషయం పక్కనపెడితే ఇద్దరి కలయికలోనే మనం వచ్చింది. మన శరీరంలోని ప్రతి కణంలో వారి తాలుకూ అంశలు ఉంటాయి. అమ్మలోని ఓర్పు... నాన్నలోని చాకచక్యం. తెలివి ఇలా అన్నీ ఉంటాయి. బీజం, క్షేత్రం రెండూ ఉంటేనే కదా ఫలం వచ్చేది. వారిద్దరికీ సమప్రాధాన్యం ఉంది కాబట్టే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. అమ్మానాన్నను పాటల రూపంలో కీర్తించడం బాగుంది. కానీ మనం వారిని ఎలా చూసుకోవాలి? మన కోసం ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలను ఓర్చుకుంటారు. త్యాగాలు సపర్యలు, సేవలు చేసీ చేసీ వాళ్ల యవ్వనాన్నంతా మనకోసం ధారపోస్తారు. వాళ్లు తాజాగా ఉన్నప్పుడు మన కోసం కరిగిపోతారు. వారి శరీరం వంగిపోయినప్పుడు, ముడతలు పడేలా కష్టపడినప్పుడు, వారి వృద్ధాప్యంలో మనం వారికి ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది ముఖ్యం. ‘అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా.. అడుగులు, నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా’ అని పాటలో రాశాను. చిన్నప్పుడు మనకు అడుగులు, నడకలు నేర్పించిన నాన్నకు మనం నేడు మార్గం కావాలి. దారి చూపించాలి. ఇప్పటి కాలంలో మనం సాంకేతికంగా చాలా ముందు ఉన్నాం. ఇదంతా నాన్నకు తెలియదు. మనం నాన్నకు తెలియజెప్పాలి. చెప్పడానికి విసిగించుకోకూడదు. చీదరించుకోకూడదు. నాన్నకు అన్నీ బోధపడేలా చెప్పాలి. ఆయన మనకోసం చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా మనం ఏం ఇస్తున్నాం? ఆ వయసులో వారు కోరుకునేదేంటి? కాస్తంత ప్రశాంతత. వాళ్లు ప్రశాతంగా ఉండేలా చూడాలి. మన పిల్లలతో ఆడుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆయన తన అనుభవాలను చెబుతుంటే శ్రద్ధగా వినాలి. విని వారిని సంతోషపెట్టాలి. వారి మాటల్లోని అనుభవసారాన్ని గ్రహించి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు వారి వృద్ధాప్యం కూడా బాగుంటుంది. వృద్ధాప్యం వారికి శాపంలా అనిపించకూడదు. స్వామి వివేకానంద ‘భరత భూమి నా బాల్యడోల. నా యవ్వన నందనవనం. నా వార్ధక్యం వారణాసి’ అన్నారు. వారణాసి అంటే పుణ్యక్షేత్రం. వృద్ధాప్యం అంత పవిత్రమైనది అని అర్థం. మనం అంత పవిత్రంగా వారిని చూసుకోవాలి. వారు ఉండే వాతావరణం కానీ ప్రదేశాన్ని బాగా ఉంచాలి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటే వారి రుణం తీర్చుకున్నట్లే అంటారు. కానీ ఆ రుణం తీరనిది. మనం దయారుణాన్ని మాత్రమే తీర్చుకుంటాం. అది ప్రయత్నం. మనకు ఇంత గొప్ప శరీరాన్ని, మనస్సును, జ్ఞానాన్ని అందించారు. ప్రపంచంలోకి తెచ్చారు. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అడుగులు తడబడే వయసులో ఉన్నప్పుడు వారికి మనం ఊతకర్ర అవ్వాలి. మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు? పిల్లలం ఒక్కోసారి తల్లి చెప్పింది చేస్తాం. ఒక్కోసారి చేయం. కానీ తండ్రి చేసేది మాత్రం కచ్చితంగా వింటాం. అంటే ఆచరిస్తాం అని అర్థం. మా అమ్మ మాకు రకరకాల విషయాలు చెబుతుండేది. జీవితం అంటే ఏంటి? కష్టం, సుఖం ఇలా తనకు తెలిసిన మాటల్లో చెప్పేది. కానీ నాన్న మాత్రం చేస్తుండేవారు. మా నాన్నను చూసి ఒకటే నేర్చుకున్నాం. అది చాలా గొప్ప విషయం. అది గొప్పదని ఎలా తెలిసిందంటే... నాకు జ్ఞానం కలిగాక, చాలా అధ్యయనం చేశాక తెలిసిందే. ఒక శ్లోకం చదివాను. ‘శ్లోకార్థేన ప్రవక్ష్యామి యద్యుక్తం గ్రంథకోటిబిం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం’. దీని అర్థం ఏంటంటే.. కోటి గ్రంథాలను కాచి వడపోసి ఒక సగం శ్లోకంలో ఇమిడిస్తే ‘పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అయింది’. గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు.. అన్నింటి సారాంశం ఇదే. ఈ విషయాన్ని మా నాన్న అమలు చేశారు. నేను విన్నాను, చూశాను. నాన్న పరోపకారం చేశారు. పరపీడన చేయలేదు. ఆయన చర్యలు, ఆయన చేష్టలు, ఆయన క్రియల ద్వారా ఇది తెలుసుకున్నాను. పరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల సొమ్ము ఆశించడం ఎప్పుడూ చేయలేదు. దీన్నంతా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఒకే ఒక్క విషయం అది. దాన్ని పాటిస్తున్నాను. కుదిరితే సాయం చేయాలి కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మీ నాన్నకు, నాన్నగా మీకు ఉన్న తేడాలేంటి? అప్పట్లో మా నాన్నకు ఉన్న పరిధులు వేరు. మేం నలుగురు సంతానం. ఆయనకు సంపాదన అంతగా లేదు. మాది పల్లెటూరు. మమ్మల్ని పెంచడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. మేం కూడా వాటిని అర్థం చేసుకొని పెరిగాం. నేను నాన్న అయ్యేసరికి ఆ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు లేవు. కాబట్టి పిల్లల్ని పెంచడానికి కష్టపడలేదు. అయితే సాధారణంగా కష్టాల నుంచి సగం నేర్చుకుంటారు. మేం నేర్చుకున్నాం. జీవితం గురించి తెలుసుకున్నాం. నా పిల్లలకు నేర్చుకునే అవకాశం పోయింది. అన్ని సదుపాయాలు కల్పించి, అందించి పిల్లల్ని పెంచడానికి మించిన దురదృష్టం ఇంకోటి లేదు. దాని వల్ల వాళ్లు చాలా కోల్పోతారు. ఇప్పుడు వాళ్లని పెంచడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను. మంచి మార్గంలో నడపడానికి, బోధించడానికి కష్టపడుతున్నాను. మా నాన్న జీవించడానికి కష్టపడారు. నేను జీవితాన్ని బోధించడానికి కష్టపడుతున్నాను. ఇప్పటి పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నాం కదా? అవును. ఇప్పుడు నా పిల్లలకు వారు ఎంచుకునే మార్గంలో నడిచే స్వేచ్ఛ ఉంది. చిన్నప్పుడు నాకు అది లేదు. పాటలు పాడకుండా మంచి ఉద్యోగం చేయి అంటూ అప్పుడప్పుడు కోప్పడేవారు నాన్న. మనకు అవి తిండిపెట్టవు, చదువుకోమని చెప్పేవారు. అలా నా చేతికి సంకెళ్లు ఉండేవి. ఆ సంకెళ్లతోటే నేను స్వేచ్చగా ఎగరగలిగాను. ఆ సంకెళ్లు వేసుకునే ఎగిరే విద్య నాకు అబ్బింది. ఆ సంకెళ్లు నాకు వరం అయ్యాయి. విహరించే శక్తి, ఓర్పు నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులలో కూడా నన్ను నేను మలుచుకున్నాను, చెక్కుకున్నాను. దానివల్ల ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తి ఏర్పడింది. ఇప్పటి తరానికి ఆ అవకాశం తక్కువ. ఇప్పటి పిల్లలకు సంకెళ్లు లేవు. పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్చ దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలో మనం చెప్పాల్సి వస్తొంది. పిల్లల్ని ఒకప్పుడు అమ్మే ఎత్తుకునేది. ఇప్పుడు నాన్న కూడా పిల్లల్ని ఎత్తుకుంటారు. ఈ మార్పు గురించి చెప్పండి? నాన్నకు అమ్మతనం వచ్చిందా? ఈ విషయాన్ని మనం రెండు కోణాల్లో చూడొచ్చు. చిన్నప్పుడు మా నాన్న దర్జాగా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. మా అమ్మ మమ్మల్ని ఎత్తుకొని వెళ్లేది. ఇప్పుడు నాన్న ఎత్తుకుంటున్నారు. వంట పని షేర్ చేసుకుంటున్నారు, ఆర్థిక స్వాతంత్య్రం స్త్రీకి వచ్చింది. ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆర్థిక భారాన్ని ఇద్దరూ పంచుకుంటున్నప్పుడు, బాధ్యతనూ ఇద్దరూ మోస్తున్నారు. వంటలు అమ్మకే పరిమితం కాదు. స్త్రీకి లభించిన విద్య, ఉద్యోగ అవకాశాలు వల్ల ఆర్థికంగా వాళ్లు భర్తకు తోడు రావడంతో ఇప్పుడు అన్నీ ఇద్దరూ పంచుకునేలా మారాయి. ఇది మంచి పరిణామం. మగవాళ్లు ఇంటి పనులు పంచుకుంటే తక్కువ అయిపోతారనే భావన సమాజంలో పూర్తిగా పోయిందంటారా? పూర్తిగా పోయిందని చెప్పలేం. అక్కడక్కడా ఇంకా ఇలాంటి భావాలు ఉన్నాయి. అయితే నేను ‘మాతృత్వపు మాధుర్యానికి మగ రూపం నాన్న’ అనే వాక్యం ఓ పాటలో విన్నాను. ఇప్పుడు నాన్న కూడా చాలా మెత్తబడిపోతున్నాడు. ఇంతకుముందు అమ్మ మృదువుగా ఉండేది నాన్న కఠినంగా ఉండేవారు. ఇప్పుడు నాన్న కూడా మృదువుగా మారిపోతున్నాడు. ఇంతకుముందు హూంకరించేవాడు, గర్జించేవాడు. ఇప్పుడు లాలించడమే. నాన్న కూడా ఎత్తుకుంటున్నాడు, వంట చేస్తున్నాడు, డైపర్ మార్చడం చేస్తున్నాడు. ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. పిల్లల సంరక్షణ భారంలో పాలుపంచుకుంటున్నాడు. ఓ రకంగా చాలా మంచి మార్పు. ఇద్దరు కలసి కన్నారు.. ఇద్దరు కలసి పెంచాలి. ఇద్దరూ కలసి తీర్చిదిద్దాలి. ఇలా చేయడం హర్షణీయం. మీ చిన్నతనంలో పేదరికం అనుభవించారు. ఇప్పుడు పరిస్థితి వేరు. మరి మీ నాన్న కోసం మీరు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి? చిన్నప్పుడు పాటలు వినడానికి మాకు రేడియో లేదు. ఒక కరెంట్ బల్బ్ ఉండేది. పాటలు ఎలా వినేవాడిని అంటే.. అప్పట్లో రేడియోలో జనరంజని ప్రోగ్రామ్ వచ్చేది. మా చుట్టుపక్కల చాలామందికి రేడియో ఉండేది. పక్కవాళ్ల ఇంట్లో పల్లవి వచ్చేది. ఆ ఇల్లు దాటేలోపే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంకో ఇంటికి చేరుకునే సరికి చరణం వచ్చేది. అలా పాటలు వినేవాణ్ణి. రేడియో లేదు అని నిరాశ చెందకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి అనుకునేవాణ్ణి. ఏకసంథాగ్రాహిత్వం ఆ పేదరికం నుంచే వచ్చింది. రేడియో లేకపోవడం నుంచి వచ్చింది. ఫ్యాను, కనీస వసతులు లేకపోవడం వల్ల ఏ చిన్న అవకాశం దొరికినా కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ రూపాయి, పాటల పుస్తకం దాచుకోవడం లాంటి లక్షణాలు వచ్చాయి. మా ఊళ్లో మా నాన్నకు మేం పిల్లలందరం కలసి ఇల్లు కట్టాం. కలర్ టీవీ, ఫ్రిజ్, గీజర్ ఇలా అన్నీ పెట్టాం. అన్ని సౌకర్యాలతో కట్టాం. మేమెలా ఉన్నామో వాళ్లు అలానే ఉండాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మా అమ్మగారు ఈ మధ్య చనిపోయారు. అది పెద్ద బాధ. రచయితగా మీరు సంపాదించిన కీర్తి ఎంతో. ఆ విజయానికి మీ నాన్న వ్యక్తపరిచిన ఆనందం గురించి? అదో అంతు చిక్కని ప్రశ్న. నేను మా ఊరు వెళుతుంటాను. నా చిన్నప్పుడు ఎలా ఉండేవారో నాతో నాన్న ఇప్పుడూ అలానే ఉంటారు. వేరేవాళ్లతో అలానే ఉంటారు. నా గురించి గొప్పగా మాట్లాడినా అలానే ఉంటారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు సైకిల్ మీద 20 కిమీ వెళ్లినప్పుడు ఎలాంటి వ్యక్తిత్వం ఉందో ఇప్పుడు బెంజి కారులో తీసుకెళ్లినా అదే వ్యక్తిత్వం. మట్టిని వదలని మనస్తత్వం ఆయనది. పిల్లల విజయాన్ని బయటకు వ్యక్తపరచకుండానే ఆస్వాదిస్తారు. తల్లి ఎక్కువా? తండ్రి ఎక్కువా? ఇద్దరూ సమానమే. మనకు తల్లి అందించే చనుబాలు ఎంత గొప్పవో తండ్రి చిందించే చమట నీళ్లు కూడా అంతే గొప్ప. రెండిటికీ ఒకటే విలువ అని అంటాను. తల్లి 9 నెలలు మోస్తుంది. తండ్రి తాను బతికున్నంత కాలం మనల్ని మోస్తూనే ఉంటాడు. తన ఊహల్లో, జ్ఞాపకాల్లో తన ఆలోచనల్లో తన కలల్లో నిరంతరం మోస్తూనే ఉంటాడు. నాన్న పాటల్లో మీకు నచ్చినవి? నాన్న మీద చాలా తక్కువ పాటలు వచ్చాయి. కవులందరూ అమ్మల్నే కీర్తించారు. ఈ మధ్య నాన్న గురుంచీ రాస్తున్నారు. విన్నారో లేదో కానీ ఈ మధ్య ఓ గజల్ బాగా ఫేమస్ అయింది. ‘నాన్న నాకు చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను. కానీ కనిపించని ఒక కవచం అది. నన్ను గాల్లో ఎగరేస్తున్నాడు అనే అనుకున్నాను కానీ నాలో ధైర్యాన్ని నింపుతున్నాడు’ అంటూ ఆ గజల్ సాగుతుంది. అది విన్నప్పుడల్లా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నాన్న పాట కూడా బావుంటుంది. మరి.. వృద్ధాప్యంలో ఉన్న నాన్న ఒంటరి జీవితం గడపబోతున్నారా? ఇప్పుడు మా నాన్న ఒక్కరే ఉంటున్నారు. అయితే నాన్నని ఇకనుంచి నా దగ్గరే పెట్టుకుంటాను. నాతోపాటే మా నాన్న ఉంటారు. నా పెళ్లయిన తర్వాత పదేళ్ల వరకూ కూడా నాతోనే ఉన్నారు. ఇల్లు కట్టాక సరదాగా ఉందాం అని అక్కడ ఉన్నారు. సో.. ఈ ఫాదర్స్ డే తర్వాత మీ నాన్న ఇక మీతోనే ఉంటారన్న మాట.. అవును. నేనున్నంతవరకూ నాన్న నాతోనే ఉంటారు. డి.జి. భవాని -
ఆ విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది..
చిన్నప్పటి నుంచే చదువంటే చాలా ఇష్టం.. ఆడపిల్ల అనే ఆంక్షలు దరిదాపునకు కూడా రానీయని తల్లిదండ్రులు. అమ్మనాన్న ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ఉన్నత విద్యభ్యాసానికి దారితీసింది. పుట్టింది.. పెరిగింది.. చదివింది అంతా బెంగళూరులోనే. అందుకే ఉన్నత విద్య మరింత చేరువైంది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీ అయినా.. మా చదువు దెబ్బతినొద్దనే ఉన్నత ఆశయంతో బెంగళూరులోనే కుటుంబాన్ని ఉంచారు. ఆయన త్యాగంతోనే నా విద్యభ్యాసానికి ఎక్కడా ఎలాంటి ఆటంకమూ కలగలేదు. నాన్న పెట్టుకున్న అచంచల విశ్వాసం నన్ను ఐపీఎస్ స్థాయికి చేర్చింది.. అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు మంచిర్యాల జిల్లా డీసీపీ రక్షిత కె.మూర్తి. ఉన్నత చదువు.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. అత్యున్నత వ్యక్తిత్వంలో నాన్నే నాకు స్ఫూర్తి అంటున్న డీసీపీ.. ‘సాక్షి’ పర్సనల్ టైంలో మరిన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: మా నాన్న కృష్ణమూర్తి. సేల్స్‌ట్యాక్స్ విభాగంలో ఉద్యోగి. ఉద్యోగరీత్యా నాన్న తరచూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేవారు. అయినా.. తనవల్ల కుటుంబం ఇబ్బంది పడొద్దని.. పిల్లల చదువుకు ఆటంకం కలగొద్దని కుటుంబాన్ని బెంగళూరు నుంచి కదలనీయలేదు. ఆయన మాత్రమే బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లే వారు. నాన్నకు మాపై నమ్మకం ఎక్కువ. మాకు పూర్తిస్వేచ్ఛ కల్పించారు. నాన్నకు నన్ను ఉన్నతంగా చూడాలని ఉండేది. ఇదే చదవాలని.. ఇదే చేయాలని ఏనాడూ పట్టుబట్టలేదు. చదువులో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకే ఇష్టమైన చదువును ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవగలిగాను. మా నాన్న బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో అమ్మ ఉష అన్నీ చక్కబెట్టేది. నాకు తమ్ముడు అర్జున్, చెల్లి రిషిక ఉన్నారు. మా ముగ్గురిలో నేనే చదువులో ముందుండేదాన్ని. ఇంటికి పెద్దదాన్ని కావడంతో చెల్లి, తమ్ముడికి చదువులో కొద్దిగా మెరుగయ్యేందుకు సాయం చేసేదాన్ని. మొదట చదువులో కొంత వెనుకబడి ఉన్న తమ్ముడు, చెల్లి ఇద్దరూ ఆ తరువాత ముందుకు దూసుకెళ్లారు. తమ్ముడు బీకాం పూర్తిచేసి యూఎస్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. చెల్లి బీటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. నేను ఐపీఎస్ పూర్తిచేసి డీసీపీగా పనిచేస్తున్న. అందుకే మా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. బెంగళూరులోనే విద్యాభ్యాసం నా విద్యభ్యాసమంతా బెంగళూరులోనే సాగింది. బెంగళూరులోని బోల్డ్ విన్స్ గరల్స్ పాఠశాలలో చదువు ప్రారంభించి.. అక్కడే ఇంటర్ పూర్తి చేశాను. 2008లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో బెంగళూరులోని ఎంఎస్ సిద్దరామయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తయ్యింది. 2012లో మొదటిసారి యూపీఎస్సీ రాశాను. 2013లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కు ఎంపికై ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకున్న. 2013లో మరోసారి యూపీఎస్సీ రాసి.. రెవెన్యూ సర్వీస్ విభాగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న. 2014లో 117వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2015 ఐపీఎస్ బ్యాచ్‌లో నన్ను తెలంగాణకు కేటాయించారు. 2018 మార్చి 13న గోదావరిఖని ఏసీపీగా బాధ్యతలు స్వీకరించాను. చదువు తప్ప మరో ధ్యాస లేదు అమ్మ చెబుతూ ఉండడం వల్లనో.. చదువు కోవాలన్న కోరికతోనో తెలియదుగానీ.. నాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకోవాలనే తాపత్రయం ఎక్కువ. నాకు చదువు తప్ప మరో ధ్యాసలేదు. వంట చేయడం అస్సలు రాదు. అన్ని అవసరాలూ అమ్మనే తీర్చేది. మేం కిచెన్‌లోకి వెళ్లింది తక్కువే. ఏ అవసరం ఉన్నా మా అమ్మనే చూసుకోవడంతో వంట చేయాల్సిన అవసరం రాలేదు. అమ్మ వండిన వంటలంటే చాలా ఇష్టం. ఎవరు వండినా తినేదాన్ని కాదు. అందుకేనేమో నాకు నేను వంట చేసుకోవాలనో.. నేర్చుకోవాలనో అనుకోలేకపోయి ఉంటాను. అందుకే నన్ను వంటవచ్చా అని ఎవరైనా అడిగితే నాకు చదువు ఒక్కటే వచ్చు.. వంట రాదు అని చెప్పేస్తా. స్నేహితుల్లో నేనే పోలీస్ మా కుటుంబంలో ఎక్కువమంది పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. అదే నాకు స్ఫూర్తినిచ్చి ఐపీఎస్ కావాలన్న ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదుగానీ.. మా స్నేహితుల్లో నేనొక్కదానే పోలీస్. నాతో పాటు చదువుకున్న స్నేహితులు వివిధ రంగాల్లో.. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారు. నేను పోలీసు కావడంతో మా స్నేహితులు కూడా నన్ను చూసి ఆనందిస్తుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే కావడంతో స్నేహితులంతా అక్కడివారే. మొదటిసారి బెంగళూరును వదిలి గోదావరిఖనిలో ఉద్యోగంలో చేరడంతో మా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అమ్మ చేతి వంటనే నాకు అలవాటు. ఇక్కడ నేను ఏంతింటానో అనే బెంగ పట్టుకుంది. ఇక్కడ వంటవారికి మా అమ్మ అన్ని వంటకాలను దగ్గరుండి నేర్పించింది. ప్రతిరోజు నా యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారు. అన్నిరకాల వంటకాలను ఇష్టంగా తింటా. ఆటల్లో టెన్నీస్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ నుంచి కళాశాల వరకు ఎక్కువగా బాస్కెట్‌బాల్, ఖోఖో, త్రోబాల్ ఎక్కువగా ఆడేదాన్ని. అలా అని జిల్లాస్థాయి ప్లేయర్‌ను కాదు. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. అందుకే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ లేవు. విద్యతోనే ఆత్మవిశ్వాసం విద్యతోనే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో చదువు ఉంటే వారిలో ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. నేను పోలీస్రంగాన్ని ఎంచుకున్న. నా ఉద్యోగ బాధ్యతను సమర్థవంతగా నిర్వహిస్తా. మరో ఉద్యోగంలోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. నిందితులను పట్టుకోవడం.. బాలికలు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడడం నా ప్రధాన లక్ష్యం. దొంగతనాలు, నేరాల అదుపునకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు తీసుకుంటా. ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండడంతో కుటుంబసభ్యులతో ఎక్కువగా గడపలేకపోతున్నాననే భావన ఉంది. ఉద్యోగాల్లో ఇవన్నీ సహజం. మహిళలు ధైర్యంగా ఉండాలి. కచ్చితంగా ప్రతి బాలికనూ చదివించడం ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేయాలి. -
‘మా నాన్నే.. నా స్నేహితుడు’
కొత్తపేట(తూర్పు గోదావరి) : భార్య మాట విని తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చకుండా ‘మా నాన్నే నా స్నేహితుడు’ అని అక్కున చేర్చుకున్న కొడుకు ఔన్నత్యంతో రూపొందించిన లఘు చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఆదివారం ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ తన స్నేహితులు గొర్రెల సాయిమణికంఠ, కుంచెనపల్లి ఆదిత్య, చోడపనీడి ఏసురత్నం తదితరులతో కలిసి ‘నాన్నే నా స్నేహితుడు’ టైటిల్‌తో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. తండ్రి తనను చిన్న వయసు నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఉద్యోగంలో చేర్చి, పెళ్లి చేస్తే.. వచ్చిన భార్య ‘నీ తండ్రి ఇంట్లో ఉంటే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాన’ని చెప్పి వెళ్లిపోతుంది దానితో తండ్రి కోసం ఆ భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడతాడు. ఈ విషయం తెలిసిన ఆ కొడుకు స్నేహితులు ‘తండ్రి కోసం భార్యకు విడాకులు ఇవ్వడం ఏమిటి? మీ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్చవచ్చు కదా!’ అని సలహా ఇస్తారు. ‘ఈ సలహా ఇవ్వడానికా మీరు ఇక్కడికి వచ్చింది? పొండి మీరు నా స్నేహితులే కాదు. 20 ఏళ్ల మీ స్నేహం కన్నా, నా భార్యతో ఉన్న ఏడాది బంధం కన్నా 30 ఏళ్లు పెంచిన మా నాన్నే నాకు ముఖ్యం. ‘మా నాన్నే నా మొదటి స్నేహితుడు’’ అని చెబుతాడు. ఆ కొడుకు – స్నేహితుల సంభాషణ తెలుసుకున్న కోడలుకి జ్ఞానో దయం కలిగి, పశ్చాత్తాప పడి మామ గారిని తండ్రిగా చూసుకుంటానని కాపురానికి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ తండ్రిని అక్కున చేర్చుకున్న కథాంశంగా తీసుకుని ఈ లఘుచిత్రాన్ని తీసినట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఈ మార్పు ప్రతి కొడుకు, కోడలిలో రావాలన్న మా చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రమని ఆయన తెలిపారు. -
ఫాదర్స్ డే.. బ్రాండెడ్ గిఫ్ట్స్
సాక్షి, సిటీబ్యూరో: రానున్న ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని పెంచే వైవిధ్యభరితమైన ప్లాటినం ఆభరణాల్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కలెక్షన్లో బ్రాస్లెట్స్, రింగ్స్, చెయిన్స్ తదితర విభిన్న రకాల వెరైటీలలో నగరంలోని ప్రముఖ షోరూమ్స్‌లో కొలువుదీరినట్టు వివరించారు. గెలాక్సీ బడ్స్.. సంగీత ప్రియులైన తండ్రులకు పిల్లలు అందించదగిన కానుకగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ పేరుతో ప్రత్యేకమైన ఉత్పత్తులను సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. వైవిధ్యభరితమైన ఫీచర్లతో ఈ కార్డ్ ఫ్రీ ఇయర్ బడ్స్ రూపొందాయని, అలాగే గెలాక్సీ వాచ్ వంటివి కూడా ప్రత్యేకంగా అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
బచ్చన్ ఫ్యామిలీ ఫోటోలకు అభిమానులు ఫిదా
నిన్న ప్రపంచమంతా ‘ఫాదర్స్ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ క్రీడాకారుల, బాలీవుడ్ హీరోలు తమ తండ్రితో వారికున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బాలీవుడ్ తొలి తరం సినీ కుటుంబానికి చెందిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య కూడా తమ తండ్రితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసారు. ఐశ్వర్య తన తల్లి బ్రిందా, కూతురు ఆరాధ్యతో పాటు తన తండ్రి క్రిష్ణరాజ్ చిత్రపటంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఎందుకంటే ఐశ్వర్య తండ్రి క్రిష్ణరాజ్ గతేడాది మార్చిలో మరణించారు. అందుకే ఐశ్వర్య తన కుటుంబంతో పాటు తండ్రి చిత్ర పటాన్ని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇవే కాక తన చెల్లెల్లు, కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఫ్యామిలి ఫోటోలను కూడా పెట్టారు. 💖 A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Jun 17, 2018 at 10:02am PDT ✨💖SISTERSUNDAY😘🌈 A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Jun 17, 2018 at 7:40pm PDT ఇక అభిషేక్ తన చిన్నతనంలో తండ్రి అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసాడు. అంతేకాక ఫోటోతో పాటు ‘ఎలా జీవించాలి అనే విషయంలో నాకు ఉదాహరణగా ఉంటూ, నా చేయి పట్టుకుని నిరంతరం నన్ను నడిపిస్తూ...ప్రేమను పంచే నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అనే సందేశాన్ని కూడా జత చేశాడు. అలానే కూతురు ఆరాధ్యతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘నన్ను తండ్రిని చేసిన నా ఏంజిల్‌కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అనే సందేశాన్ని జత చేసాడు. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అభిషేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న ‘మన్మార్జియాన్’ చిత్రంలో నటిస్తుండగా ఐశ్వర్య ఓం ప్రకాశ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఫన్నే ఖాన్’ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. For holding my hand and guiding my through it all.... For teaching my by leading by example.... For still holding my hand and for your unending love and support. Happy Father's Day! Love you Pa. @amitabhbachchan A post shared by Abhishek Bachchan (@bachchan) on Jun 16, 2018 at 11:20pm PDT #happyfathersday to this angel for making me a father and making me realise what it takes to do what a father needs to do. I hope I can make you very proud. Papa loves you. A post shared by Abhishek Bachchan (@bachchan) on Jun 17, 2018 at 9:03am PDT -
‘నా జీవితంలో ఆయనే నాకు స్పూర్తి’
ఫాదర్స్‌డే రోజున తమ తండ్రులతో వారికి ఉన్న అనుభవాల్ని, జ్ఞాపకాలను టాలీవుడ్ స్టార్ హీరోలు పంచుకున్నారు. అంతేకాక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన తండ్రితో ఉన్న బంధాన్ని, ఆయనపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. ‘నాన్న అంటే చాలా అభిమానం.. ఆయన అంటే భయం కూడా ఉంటుంది. నా జీవితంలో ఆయనే నాకు స్పూర్తి’ అని చిరంజీవి అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘మై గైడ్.. మై హీరో.. మై ఇన్సిప్రేషన్ అని మా నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న’ అని ట్విటర్లో పోస్టు చేశారు. హీరో అల్లు అర్జున్ తన ఫాదర్ అల్లు అరవింద్‌కు ట్విటర్ ద్వారా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను ఇప్పటి వరకు చూసిన, విన్న ఫాదర్స్ అందరికంటే నువ్వే చాలా గొప్ప. మీరు నాన్నగా లభించడం నా అదృష్టం. నాన్న ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజుని నేను ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటాన’ని తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. Mega Power Star #RamCharan Via Facebook!#HappyFathersDay pic.twitter.com/tyA8NPLN3N — Team RamCharan (@AlwayzRamCharan) June 17, 2018 Of all the dads I have ever seen , met spoke and heard of ... your the BEST . Soo Lucky that YOU are my dad . Lucky Me . Happy Father’s Day . I celebrate this day EVERY DAY , that’s how good you are . ❤️#FathersDay pic.twitter.com/XlNZrqZTuB — Allu Arjun (@alluarjun) June 17, 2018 -
హోరో
-
#YSR; ఆయన మన మధ్యే ఉన్నారు!
సాక్షి, రావులపాలెం: దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్సార్ కలకాలం ప్రజల మధ్యే, వారి మనసుల్లో ఉండిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసించారు. ఫాదర్స్ డే సందర్భంగా మహానేత స్మరణను ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘జీవితంలో ఎంత ఎదిగినా, ఏ స్థాయికి చేరినా మనం స్మరించుకునేది నాన్ననే. నా తండ్రిని నాతోపాటూ రాష్ట్రమంతా స్మరించుకుంటుండటం అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఆ మహానేత ఎన్నటికీ మన మధ్యే ఉంటారని, ఉండాలని విశ్వసిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 191వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. A father is someone who you look up to, no matter how tall you grow! I'm fortunate to have had a father, who was looked up to by not just me, but the entire state of Andhra Pradesh. Happy father’s day, #YSR. We all wish that you were still here. — YS Jagan Mohan Reddy (@ysjagan) 17 June 2018 -
నీ ప్రేమ.. ఆ చంద్రతారకం!
ఉదయం 6 గంటలు. రోజూ ఆ సమయానికి ఓ వ్యక్తి శ్మశానం వైపు అడుగులేస్తూ కనిపిస్తాడు. అపురూపంగా నిర్మించుకున్న సమాధి వద్దకు వెళ్లి శుభ్రం చేస్తాడు. పూజలు చేసి కాసేపు అక్కడే మౌనంగా కూర్చుండిపోతాడు. ఇదీ అతని దినచర్య. ఇక ఆదివారం రోజున నీళ్లుతీసుకెళ్లి శుభ్రంగా కడిగి పూలు పెట్టి పూజలు చేస్తాడు. పండుగలు.. పబ్బాలు వస్తే కొత్త దుస్తులు, చెప్పులు కొనుగోలు చేసి ఇంట్లో తయారు చేసిన తినుబండారాలను ఆ సమాధి వద్ద ఉంచి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మరణంతో కుమిలిపోయిన ఓ తండ్రి.. 18 ఏళ్లుగా తన కుమార్తెపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ‘సాక్షి’ సలాం. పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని చర్చి కాలనీకి చెందిన చంద్రశేఖర్, సులోచన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూనే కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమార్తె అరుణకుమారి అంటే చంద్రశేఖర్‌కు ప్రాణం. 6వ తరగతి చదువుతుండగా మార్చి 30, 2004న విషజ్వరం బారిన పడింది.చికిత్స నిమిత్తం తాడిపత్రికి తీసుకెళ్లగా ఫిట్స్ వచ్చి తండ్రి చేతుల్లోనే ప్రాణం విడిచింది. గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి నిర్మించాడు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి రోజూ ఉదయం 6 గంటల్లోగా సమాధి వద్దకు చేరుకోవడం, పూలు పెట్టి పూజలు చేయడం చేస్తున్నాడు. ప్రతి ఆదివారం సమాధిని నీటితో శుభ్రం చేసి పూజిస్తాడు. గత 18 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆ తండ్రి దిన చర్య తప్పకపోవడం చూస్తే కుమార్తెపై ఆయన ప్రేమాభిమానం అర్థమవుతోంది. పండుగలు వస్తే మిగిలిన పిల్లలకు తెచ్చినట్లుగానే అరుణకుమారికి కొత్త బట్టలు, చెప్పులు తీసుకొచ్చి సమాధి వద్ద ఉంచుతాడు. ఇంట్లో చేసుకున్న తినుబండారాలను కూడా తీసుకెళ్లి తన కడుపు నిండినంత సంతృప్తి చెందుతాడు. భౌతికంగా కుమార్తె లేకపోయినా ఆ చిన్నారి జ్ఞాపకాల్లో బతుకుతున్న ఈ తండ్రి ప్రేమ ఆ ‘చంద్ర’ తారకమే. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా కష్టపడి జీవించే చంద్రశేఖర్ మిగిలిన పిల్లల భవిష్యత్తుకూ తన వంతు బాటలు వేశాడు. పెద్ద కుమార్తె సునీత బీటెక్ పూర్తి చేయగా, డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు అనిల్ ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. మరో కుమారుడు ప్రవీణ్ ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. గ్రామస్తులు కూడా కుమార్తెపై ఇతని ప్రేమను చూసి చెమర్చిన కళ్లతో మనసులోనే అభినందిస్తుండటం విశేషం. అరుణ నా ఊపిరి చిన్న కూతురు కావడంతో ఎంతో ప్రేమగా చూసుకునేటోన్ని. శానా ఇష్టం ఆ పాపంటే. జరమొచ్చి నా చేతుల్లోనే ప్రాణం ఇడిసింది. ఆ రోజు నుంచి సమాధి కాడ పూజలు చేయనిదే ఏ పనీ చేయను. ఆ పాపను పూజించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పండగలొచ్చినా పబ్బాలొచ్చినా మిగిలిన పిల్లల మాదిరిగానే చూసుకుంటా. ఇన్నేళ్లయినా నా కళ్ల ముందు ఉన్నట్లే ఉంటాది. – చంద్రశేఖర్, పుట్లూరు -
రోల్‌మోడల్ నాన్నే
నెల్లూరు(క్రైమ్): జీవితంలో ప్రతి మలుపులో నాన్నే ప్రేరణ. ఆయనే నాకు రోల్‌మోడల్. నాన్న వి.సత్యనారాయణరెడ్డి వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. వ్యవసాయ పనులను సైతం నేర్పించారు. మా అభిప్రాయాలకు ఎంతో విలువనిచ్చేవారు. ఏది ఒప్పో, తప్పో మాతోనే చెప్పించేవారు. విశాల దృక్పథం అలవర్చారు. చిన్నప్పట్టి నుంచి ప్రతి అంశాన్ని పాఠంలా బోధించేవారు. ప్రపంచాన్ని ఎలా చూడాలన్న విషయాన్ని ఆయన ఆలోచనల నుంచే నేర్చుకొన్నాం. ప్రజా సేవకు ఉండే ప్రాధాన్యాన్ని నేర్పారు. ఏ పనిచేసినా పది మందికి ఉపయోగపడాలని చెప్పేవారు. ఒక స్నేహితుడిలా మార్గదర్శకం చేశారు. నాన్న ప్రేరణతో పోలీసుశాఖలో చేరాను. ప్రజలకు సేవచేయాలన్న ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నాను. నాన్నే నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. అలాంటి నాన్నకు కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. నాన్న నుంచి నేర్చుకొన్నదే నా బిడ్డలకు నేర్పుతున్నాను. -
వారి పితృ భక్తి చిరస్మరణీయం
తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యభోగాలను విడనాడి అడవులకు వెళ్లాడు రాముడు. తండ్రి ఆజ్ఞమేరకు పరశురాముడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. తండ్రిౖయెన యయాతి మహారాజు సుఖంకోసం యవ్వనాన్నే ధారపోశాడు కుమారుడు పూరువు. తండ్రి చెప్పిన మాట ప్రకారం పాండుపుత్రులు ఐదుగురిని వివాహమాడింది ద్రౌపది. భీష్ముడు తండ్రికోసం వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. కేవలం తండ్రికి వచ్చిన స్వప్నాన్నే దైవాజ్ఞగా భావించి, తండ్రిమాటనునెరవేర్చడం కోసం బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు ఇస్మాయీల్ ప్రవక్త. తండ్రి మాట మేరకు పాపభారాన్ని మోసేందుకు పరలోక భోగాలను వదులుకుని భూలోకం వచ్చిన జీసస్ శిలువ మరణం చెందాడు. నచికేతుడు తండ్రి మాటప్రకారం ఏకంగా యమలోకమే వెళ్లాడు. పితృదినోత్సవం సందర్భంగా వీరందరి త్యాగాలను స్మరించుకుందాం. నాన్న మాటను నిలబెడదాం! వాజశ్రవమనే యజ్ఞం చేసిన వాజశ్రవుడు సర్వసంపదలనూ దానం చేశాడు. ఇక దానం చేయడానికి ఏమీ మిగలక పోవడంతో నచికేతుడు ‘‘తండ్రీ! నన్నెవరికి దానం ఇస్తావు?’’ అని పదే పదే అడుగుతుండడంతో చిరాకుతో ‘నిన్ను యముడికి దానం చేశాను ఫో’’అంటాడు. ఆ మాటకు కట్టుబబడ్డ నచికేతు యమలోకం వెళ్లాడు. ఆ సమయానికి యముడు అక్కడ లేకపోయేసరికి మూడురోజుల పాటు వేచి ఉన్నాడు. యముడు రాగానే జరిగినదంతా తెలుసుకుని ముక్కుపచ్చలారని ఆ బాలుని పట్టుదలకు ముచ్చట పడి మూడు వరాలు కోరుకోమన్నాడు. మొదటి రెండూ లౌకికమైనవే కోరుకున్నప్పటికీ మూడవది మాత్రం జనన మరణ రహస్యాలను వివరించమని పట్టుబట్టడంతో కాదనలేక యముడు ఆ బాలునికి బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు. జరిగింది తెలుసుకుని తండ్రి అమితాశ్చర్యానందాలకు లోనై, దానిని గ్రంథస్థం చేయమని ఆదేశిస్తాడు. తండ్రి చెప్పిన మాటలను తు.చ తప్పకుండా ఆచరిస్తాడు నచికేతుడు. అదే అనంతరకాలంలో కఠోపనిషత్తుగా, నచికేతోపనిషత్తుగా పేరుగాంచింది. పరశురాముడు: జమదగ్ని, రేణుకల కుమారుడు పరశురాముడు. జమదగ్నికి ఒకసారి భార్యమీద అపరిమితమైన కోపంవచ్చి, కుమారులను ఒక్కొక్కరుగా పిలిచి తల్లిని వధించమని ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఒక్కరూ అందుకు నిరాకరిస్తారు. దాంతో వారిని తన తపోమహిమతో భస్మీపటలం చేస్తాడు. చివరిగా పరశురాముని వంతు వస్తుంది. పరశురాముడు పితృవాక్పాలన కోసం గొడ్డలి తీసుకుని తల్లిని వధిస్తాడు. జమదగ్ని మిక్కిలి సంతోషించి వరం కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు తల్లిని, అన్నలను బతికించమని, కోపాన్ని విడనాడమని కోరడంతో జమదగ్ని పరశురాముని పితృభక్తిని, తెలివితేటలను మెచ్చుకుని, వారందరినీ బతికిస్తాడు. శ్రవణ కుమారుడు: ఇతడు ఒక మునిబాలుడు. తల్లిదండ్రులు పుట్టుగుడ్డివారు. వయోభారంతో నడవలేని పరిస్థితులలో ఉన్నవారిని శ్రవణకుమారుడు తాను ఎక్కడికి వెళ్లినా కావడిలో కూర్చోబెట్టుకుని మోస్తూ తీసుకు వెళ్లేవాడు. ఓ రోజు తండ్రికి బాగా దాహం కావడంతో సొరకాయ బుర్ర తీసుకుని సమీపంలోని కొలనులోకి వెళ్లి, నీళ్లు ముంచుతుండగా, బుడబుడమని శబ్దం వస్తుంది. అదేసమయంలో వేటకై వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని ఏనుగు స్నానం చేస్తోందనుకుని శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వదులుతాడు. ఆ బాణం దెబ్బతగిలిన శ్రవణకుమారుడు విలవిలలాడుతూ మరణిస్తాడు. ఆఖరి కోరికగా దశరథునితో దాహంతో అలమటించి పోతున్న నా తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి దప్పిక తీర్చవలసిందిగా కోరి కన్నుమూస్తాడు. ఆ విధంగా ఆఖరి క్షణాల వరకు తల్లిదండ్రులకోసమే గడిపి పితౄణం తీర్చుకున్నాడు శ్రవణకుమారుడు. ద్రౌపది: యజ్ఞకుండం నుంచి ఉద్భవించి, ఐదుగురు పురుషులను వివాహమాడి, స్వతంత్ర భావాలు కలిగి పతివ్రతగా ప్రసిద్ధి చెందింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ద్రౌపదీ స్వయంవరం ప్రకటించాడు తండ్రి ద్రుపదుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. ప్రకటన ప్రకారం ద్రౌపది అర్జునుని వివాహమాడితే సరిపోతుంది. కాని ద్రుపదుడు పాండవులయిదుగురినీ వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. తండ్రిమాటను జవదాటలేదు, అయిదుగురిని ఎందుకు వివాహం చేసుకోవాలని ప్రశ్నించలేదు ద్రౌపది. తండ్రి ఏది నిశ్చయించినా అది తన మంచికేనని మనసులో అనుకుంది. పాండవులను వివాహం చేసుకుని పంచభర్తృక అయ్యింది. కన్నతండ్రి ఋణం ఆ విధంగా తీర్చుకుంది ద్రౌపది. రాముడు: పితృవాక్పాలనకు మారుపేరు శ్రీరామచంద్రుడు. తండ్రి మాట కోసం సర్వసౌఖ్యాలను విడిచి నార వస్త్రాలతో అడవులకు వెళ్లిన ఆదర్శమూర్తి. దశర థుని పెద్ద కుమారునిగా జన్మించిన రామునికి యుక్తవయసు రాగానే యువరాజ పట్టాభిషేకం నిర్ణయించాడు దశరథుడు. ఆ విషయాన్ని ముద్దుల భార్య కైకకు చెప్పడం కోసం ఆమె మందిరానికి వెళ్లాడు. అప్పటికే మంధరమాటలతో విషంతో నిండిపోయిన కైక తన దగ్గరకు వచ్చిన దశరథుని – రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేయాలని, భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరింది. ఆడినమాట తప్పని దశరథుడు కైక వరాలను నెరవేర్చవలసి వచ్చింది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు అడవులకి వెళ్లి పితృవాక్పాలనకు మారుపేరుగా, ఆదర్శపురుషునిగా, చరిత్రలో చిరస్థాయిగానిలబడిపోయాడు. అందరికీ ఆరాధ్యుడయ్యాడు. పూరువు: తండ్రి వార్థక్యాన్ని తాను తీసుకుని, తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసిన తనయుడు పూరువు. ఈయన యయాతి, శర్మిష్ఠల మానసపుత్రుడు. యయాతి చక్రవర్తినహుషుడి కుమారుడు. పాండవుల పూర్వికులలో ఒకడు. సర్వ శాస్త్రాలను చదివి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలను పూజిస్తూ, యయాతి ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. అయితే ఒకసారి అనుకోకుండా మామగారైన శుక్రాచార్యుని శాపం కారణంగా యయాతి వయసు మీరక ముందే ముసలివాడైపోతాడు. అయినప్పటికీ ఐహిక సుఖాలపై మమకారం వీడక, భౌతికమైన కోరికలతో బాధపడుతుంటాడు. భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ప్రసాదించమని అర్థిస్తాడు. ఇద్దరు కుమారులు అంగీకరించరు. శర్మిష్ఠ కుమారుడైన పూరువు మాత్రమే తండ్రి కోరికను మన్నించి తన యవ్వనాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. యయాతి పూరుని యవ్వనాన్ని స్వీకరించి, మరికొంతకాలం సుఖాలను అనుభవించి, పూరుని రాజ్యాభిషిక్తుణ్నిచేశాడు. తండ్రి ఆనందం కోసం పూరుడు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది. భీష్ముడు: తండ్రికోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీషణ ప్రతిన చేసి, కురుపాండవులను కన్నతండ్రిలా పెంచి, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని త్యాగం చేసిన వాడు దేవవ్రతుడు. శంతనుడికి, గంగాదేవికి పుట్టినవాడు దేవవ్రతుడు. ఓ సాయంసంధ్యలో శంతనుడు యమునా తీరాన విహరిస్తూ సుందరాకారంలో ఉన్న ఒక స్త్రీని చూసి ఆమె లావణ్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె పడవ నడిపే దాసరాజ కుమార్తె. ఆమెను శంతనునికి ఇవ్వడానికి దాసరాజు ఒక షరతు విధించాడు. అదేమంటే సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేయాలని. పెద్దకుమారుని విడిచి అన్యులకు రాజ్యాభిషేకం చేయడం శంతనునికి మనస్కరించలేదు, అదే సమయంలో సత్యవతి మీద వ్యామోహమూ తగ్గలేదు. తండ్రి విచారానికి ఉన్న కారణం తెలుసుకున్న భీష్ముడు దాసరాజుఇంటికి వెళ్లి, సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేస్తామని మాట ఇచ్చాడు. దాసరాజుకు ఇంకా నమ్మకం కలిగించడం కోసం తాను బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. సర్వసుఖాలు, రాజ్యభోగాలు అనుభవించే అర్హత ఉండి కూడా భీష్ముడు తండ్రి కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం. – భాస్కర్, జయంతి -
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీతానికి బాలమురళీకృష్ణ. సాహిత్యానికి సి.నారాయణరెడ్డి. సంగీత సాహిత్య సమలంకృతంగా వారి పిల్లలైన రవాలను, వాహినులను సాక్షి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన సంగీతాన్ని పండితపామరులకు చేరువ చేశారు. సంగీతంతో ప్రపంచాన్ని తన్మయత్వంలో ముంచెత్తారు. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగా ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా గడిపేవారు? ఈరోజు ఫాదర్స్‌డే. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. ఆయన ఆరుగురు పిల్లల్ని పలకరించింది. ఆ తండ్రి అను‘రాగాల’ గురించి తెలుసుకుంది. మురళీ రవాలు పెద్దబ్బాయి అభిరామ్, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి. పెద్దబ్బాయి ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్దమ్మాయి బీఏ మ్యూజిక్ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి బీఎస్సీ, మూడో అమ్మాయి ఎంఏ ఇంగ్లిష్. పెద్దమ్మాయి అమ్మాజీ నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు సూర్యకాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన నాకు చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు ఎంతో పరవశించిపోయారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి చేశాం. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి నాన్న ఎంతో సంబరపడ్డారు. రెండో అమ్మాయి లక్ష్మి మాతో క్యారమ్స్ ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్ రింగ్ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు. రెండో అబ్బాయి సుధాకర్ నాన్నగారికి అందమైన బాల్యం లేదు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆడే లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు. మాకోసం సింగపూర్ నుంచి టేప్ రికార్డర్ తెచ్చారు. అది ఇప్పటికీ మా దగ్గర ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్ డిసి వచ్చారు. అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్‌లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది. మూడో అమ్మాయి మహతి ఆయన మాతో చాలా అటాచ్డ్గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు... నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది. వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం. నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మానాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని. నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచాలనీ అనుకుంటున్నాం. మూడో అబ్బాయి డా. వంశీమోహన్ నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు. ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు. ( తల్లిదండ్రులు అన్నపూర్ణ, బాలమురళీకృష్ణలతో 1. సూర్యకాంతి, 2. లక్ష్మి 3. మహతి 4. అభిరామ్, 5. డాక్టర్ సుధాకర్, 6. డాక్టర్ వంశీమోహన్; అల్లుళ్లు, కోడళ్లు) పెద్దబ్బాయి అభిరామ్ మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను నాన్నగారు పనిచేశారు. 1964లో ఆయన మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్ వన్ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని నమ్మేవారు. (బాల మురళికృష్ణ పెద్దమ్మాయి అమ్మాజీ, పెద్దబ్బాయి అభిరామ్, రెండో కూతురు లక్ష్మి) నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం ^è దువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే. ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్ రివల్యూషనరీ నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ బట్ ఇన్ లైఫ్ ఆల్సో. – సంభాషణ: వైజయంతి పురాణపండ కవన వాహినులు ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ అన్నారు సినారె. అమ్మ బొమ్మ (ఫొటో) లేదని... అమ్మ బొమ్మ గీయలేని అశక్తుణ్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇది జరిగి రెండేళ్లయింది. ‘నాన్న రూపం కళ్ల ముందు నుంచి చెరగడం లేదు. ఆయన నవ్వు ముఖంతో శాశ్వతనిద్రలోకి జారిపోయి ఏడాదైంది. రోజూ అలవాటుగా నాన్న గది వైపు చూస్తూనే ఉన్నాం మా నలుగురు అక్కాచెల్లెళ్లం’ అన్నారు డాక్టర్ సినారె గారి పెద్దమ్మాయి గంగ. సంతోషం, దుఃఖం ఏదైనా సరే... అనుబంధం వ్యక్తమయ్యేది కన్నీళ్ల రూపంలోనే. ఫాదర్స్ డే సందర్భంగా డాక్టర్ సినారె జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారామె. ‘‘మా నాన్నకు మేము నలుగురం కూతుళ్లం. ఆ రోజుల్లో అబ్బాయి కోసం ఎదురు చూసేవాళ్లు. మగపిల్లవాడులేడని మా నానమ్మ, అమ్మ ఇద్దరికీ కొంచెం కొరత ఉండేది. కానీ నాన్నలో అది లేశమాత్రమైనా ఉండేది కాదు. ఎవరైనా ‘అందరూ అమ్మాయిలేనా’ అంటే ఆ మాట కూడా ఆయనకు నచ్చేది కాదు. ‘నాకు నలుగురు అమ్మలు’ అనేవారు. అమ్మ పోయిన తర్వాత నాన్న ఆమెతో చెప్పాలనుకున్న భావాలను ‘ఎంత స్వార్థం నీది... నలుగురు కూతుళ్లను కన్నావు. ఇప్పుడు తెలిసింది... నాలుగు దిక్కుల్లా తోడుంటారని’ అని రాసుకున్నారు. నదుల పేర్లు నాన్నది బాల్య వివాహం. వాళ్ల నానమ్మ తాను పోయేలోపు పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో పదకొండేళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మకి తొమ్మిదేళ్లు. అమ్మకి భక్తి ఎక్కువ, నాన్న దేవుణ్ని నమ్మేవారు కాదు. నేను పుట్టక ముందు నాలుగైదు సార్లు గర్భం పోవడంతో అమ్మ గోదావరి నది తీరాన నలభై రోజులు ఉపవాస దీక్ష చేసింది. ఆరోగ్యం పాడవుతుందని నాన్న వద్దన్నా వినకుండా దీక్ష చేసిందట. ఆ తర్వాత నేను పుట్టడంతో గంగ అని పేరు పెట్టుకుంది అమ్మ. మా కరీంనగర్లో గోదావరి నదిని గంగగానే వ్యవహరిస్తారు. నాన్నకు స్వతహాగా నదులంటే ఇష్టం. దాంతో మిగిలిన ముగ్గురికీ యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. ఇంట్లో అనుబంధాలు జీవనదుల్లా ప్రవహించాలనేది ఆయన కోరిక. (తండ్రి డాక్టర్ సి. నారాయణరెడ్డితో గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి) అమ్మకు పక్షవాతం నాకు ఏడేళ్లున్నప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చింది. అయినా సరే హెల్పర్‌తో అన్నీ సిద్ధం చేయించుకుని ఒక్కచేత్తోనే నాన్నకు ఇష్టమైనవి వండేది. రోజూ నాన్న ఇంటికి రాగానే తలుపు తీసేదాన్ని. ఇంటికి రాగానే అమ్మ మంచం దగ్గర కూర్చునేవారాయన. అమ్మ పోయే వరకు కూడా ఆయన దినచర్య అలాగే సాగింది. ఉపవాసాలతో ఆరోగ్యం పాడుచేసుకుంటుందని నాన్నకు అమ్మ గురించి ఎప్పుడూ బెంగ ఉండేది. భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడగని రోజుండేది కాదు. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుండేవారు. అమ్మ చేతి వంట కోసం గుమ్మడి గారు కూడా వచ్చేవారు. మీరు నన్ను పోనిస్తారా! చిన్నప్పటి నుంచి నాకు నాన్న కోసం ఎదురు చూడడం, నాన్న భోజనం చేస్తున్నంత సేపు దగ్గర ఉండడం నాలవాటయిపోయింది. నలుగురిలో ఎవరో ఒకరం నాన్న భోజనం చేసినంత సేపూ దగ్గర ఉండేవాళ్లం. భోజనం కాగానే ట్యాబ్లెట్ ఇస్తే ఎప్పుడు నోట్లో వేసుకునేవారో గుక్కెడు నీటితో మింగేసేవారు. నాకేమో ట్యాబ్లెట్ గొంతు దిగిందో లేదోనని భయం. ఇంకొంచెం నీళ్లు తాగు నాన్నా అంటే... ‘నీకు చాదస్తం ఎక్కువవుతోందమ్మాయ్. వయసొస్తున్నది నీకా నాకా’ అనేవారు. గొంతు పట్టేస్తే ఎలా నాన్నా అంటే... ‘నాకేమవుతుంది, ఏమైనా అయినా అడ్డుపడి కాపాడుకోవడానికి మీరున్నారు కదా, నన్ను అంత సులభంగా పోనిస్తారా’ అనేవారు నవ్వుతూ. అందరూ కనిపించాలి! ఏ తండ్రికైనా కూతుళ్ల మీద ప్రేమ అలాగే ఉంటుందేమో, మా నాన్న మమ్మల్ని పొద్దుపోయాక చదువుకుంటున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అంతంత కష్టం ఎందుకనేవారు. ఆయన నిద్రపోయిన తర్వాత లైట్ వేసుకుని చదువుకునేది మా యమున. జీవితంలో చికాకులు పెంచుకోకూడదు, ప్రశాంతంగా జీవించాలనేవారు. పెళ్లి చేసి అత్తగారిళ్లకు పంపిస్తే రోజూ మమ్మల్ని చూడడం కుదరదని అందరినీ తన దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఫిలింనగర్లో మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరి కుటుంబం, వెనుక ఒక పోర్షన్లో ఒక కుటుంబం ఉండేది. అందరికీ వంటగది ఒక్కటే. అల్లుళ్లతోనూ మాతో ఉన్నంత ప్రేమగా ఉండేవారు. ఇక మనుమలు, మనుమరాళ్లనయితే కనురెప్ప వేయకుండా చూసుకునే వారు. అచ్చమైన సోషలిస్టు! నాన్న గొప్ప సోషలిస్టు. ఉద్యమాల్లో పాల్గొనలేదనే కాని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను పాటించేవారు. మనుమల్లో ఎవరికీ పేరు చివర కులవాచకాల్లేవు. వాళ్లలో చిన్నప్పుడు కనిపించిన లక్షణాలను బట్టి పేర్లు పెట్టారు. లయ చరణ్ ఉయ్యాల్లో ఉన్నప్పుడు నాన్న చిటికెలు వేస్తుంటే వాడు ఆ చిటికెల శబ్దానికి ఆనందంగా కాళ్లను లయబద్దంగా ఆడించేవాడు. అందుకే ఆ పేరు. అన్వేష్ ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కళ్లు విప్పార్చి చూసేవాడు. మేడే రోజు పుట్టిన బాబుకి క్రాంతి కేతన్ అని, చైతన్యదేవ్ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ. మా ఊరు హనుమాజీ పేటలో అన్ని కులాల వారినీ బంధుత్వంతోనే పిలిచేది మా నానమ్మ. నాన్నకు కూడా అదే అలవాటు వచ్చింది. కులాలవారీగా మనుషులను దూరంగా ఉంచే రోజుల్లోనే వాళ్లు సోషలిస్టు భావాలను అనుసరించారు. అందుకేనేమో నాన్నలో మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం కనిపించేది. మనుమలతోపాటే ఇంట్లో ఉన్నంత సేపూ మనుమలు, మనుమరాళ్లందరూ ఆయన చుట్టూ ఉండాల్సిందే. మేము పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటే ‘నాకూ పెట్టమ్మాయ్’ అని పెట్టించుకునేవారు. మేము ఎంత దగ్గర బంధువుల పెళ్లి అయినా సరే నలుగురమూ వెళ్లింది లేదు. ఎవరో ఒకరం నాన్న దగ్గర ఉండేవాళ్లం. పెళ్లికి వెళ్తూ ‘నాన్నా పెళ్లికి వెళ్లి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాం’ అని చెప్పడానికి నోరు తెరిచినా, మాకు గొంతు పెగిలేది కాదు. ఆయనకు మేము వెళ్లడం నచ్చేదీ కాదు. ‘బంధువులు కదా’ అనేవారు ముక్తసరిగా. నేను మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడైతే ఆయన ఒకటే ఏడుపు. ఆయన కన్నీళ్లు చూసి నాకూ ఏడుపాగలేదు. చాలాసేపటి తర్వాత ‘నువ్వు వెళ్లకపోతే అక్కడ పాప ఇబ్బంది పడుతుంది. వెళ్లిరా’ అన్నారు. అలా పంపించిన తర్వాత ఆయన నా కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపారని చెల్లెళ్లు చెప్పేవాళ్లు. నేను మనుమరాలిని నెలల పాపాయిని తీసుకుని ఇండియాకి వస్తున్నప్పుడు (వరేణ్య, నాన్నకు మునిమనుమరాలు) ఎయిర్‌పోర్టుకి వచ్చేశారు. ఆలస్యంగా నిద్రపోయారు గత ఏడాది జూన్ 12వ తేదీ. తెల్లవారు జామున నాలుగ్గంటలకు నాకు మెలకువ వచ్చింది. అంతకు మూడు గంటల ముందే నాన్నకు దగ్గు మందు తాగించి ఆయనకు నిద్రపట్టిన తర్వాత నేను పడుకున్నాను. అంతలోనే మెలకువ వచ్చింది. నాన్న గది దగ్గరకు వచ్చాను. నాన్నకు టెంపరేచర్, బిపి చెక్ చేయడానికి యమున కూడా వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండడంతో భోజనం వద్దని బ్రెడ్, పాలు ఇచ్చాం. టెంపరేచర్ నార్మల్‌గానే ఉందని చెప్పి యమున పైన గదిలోకి వెళ్లింది. నేను నాన్నను ఒకసారి చూసి, ఆలస్యంగా పడుకున్నారు కదా, ఆరు గంటలకు నిద్రలేపుదాం అని అలాగే కూర్చున్నాను. ఆరయ్యేలోపే అటెండర్ వచ్చి ‘యమునమ్మ’ అంటూ ఆగాడు. యమున వచ్చి పల్స్ చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ ఏడాది కాలంగా నాకు ఎప్పటి లాగానే ఉదయం నాలుగింటికే మెలకువ వస్తోంది. నాన్న లేడని తెలిసి కూడా ‘నాన్నా లే’ అనే పిలుపు నోటి వరకూ వస్తూనే ఉంది. ఈ నెల పన్నెండవ తేదీన ఆయన సంవత్సరీకానికి మిత్రులందరూ సారస్వత పరిషత్‌లో కలిశారు. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే నాన్న లేదా వేదిక మీద పులిలా కనిపించే నాన్న రూపాలే తెలుసు. ఆ రోజు అందరూ ఉన్నారు వేదిక మీద నాన్నలేరు. ఇప్పుడు మాతో ఉన్నది ఆయన జ్ఞాపకాలే’’. యమున నాన్న మా చిన్నప్పుడు సినిమాలకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ నోరు తెరవమనేవారు. పళ్లు శుభ్రంగా తోముకుంటున్నామా లేదా అని అంత పట్టింపుగా ఉండేవారు. సరిగ్గా బ్రష్ చేయట్లేదనిపిస్తే కోప్పడేవారు. నాన్నకు రోజూ కళ్లద్దాలు, వాచీ తుడిచి ఇచ్చేదాన్ని. నాకు వంటలో ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడతాయి. ‘నువ్వింత సున్నితంగా ఉంటావు, మృదువుగా మాట్లాడుతావు. వంట ఎందుకు అంత ఘాటుగా చేస్తావు’ అనేవారు. ఆయన పరిషత్తుకెళ్లేటప్పుడు బాక్స్ పెడతాం. బాక్స్ తెరిచి చూడగానే... మా నలుగురిలో ఆ రోజు బాక్స్ ఎవరు పెట్టి ఉంటారనేది పట్టేసేవారు. సరస్వతి నాన్న ఉదయం ఐదున్నరకి అల్లుళ్లతోపాటు వాకింగ్‌కి వెళ్లేవారు. నాన్న జేబులో చిన్న నోట్‌బుక్, పెన్ను ఎప్పుడూ ఉంటాయి. వాకింగ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను నోట్‌బుక్‌లో రాసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్‌ని గంగక్కకిచ్చేవారు. అక్క కాపీని తిరగరాసేది. అమ్మ అనారోగ్యం కారణంగా చెల్లెళ్ల బాధ్యత అంతా పెద్దక్కే చూసుకుంది. నాన్న కూడా అన్ని పనులకూ అక్క మీదనే ఆధారపడేవారు. రచనలకు వచ్చిన డబ్బుని ఇంటికి రాగానే ‘అమ్మాయ్’ అని పిలిచి అక్కకిచ్చేసి జేబు బరువు తీరినట్లు భావించేవారు. జేబులో అసలే డబ్బు పెట్టుకోకపోతే ఎక్కడైనా టిప్పు ఇవ్వాల్సి వస్తే ఎలా అని అక్క రోజూ నాన్న జేబులో కొంత డబ్బు పెడుతుండేది. కృష్ణవేణి నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని తాను రాసిన గజల్స్ చదివి వినిపించేవారు. రాత్రి ఇంటికి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ‘పిల్లలు (మనుమలు, మనుమరాళ్లు) నిద్రపోకపోతే కొంచెం సేపు మెలకువగా ఉంచండి, వచ్చేస్తున్నాను’ అని చెప్పేవారు. ఆయనకు హిందీ సినిమాలిష్టం. సినిమాలు చూడాలనుకుంటే మనుమలు, మనుమరాళ్లందరినీ తీసుకుని వెళ్లేవారు. కుటుంబం డాలర్ హిల్స్‌కి మారేటప్పుడు పెద్దగా ఇష్టపడలేదు నాన్న. ఫిలిం నగర్ ఇల్లు బాగానే ఉందిగా మారడం ఎందుకన్నారు. ఆ ఇంటిని నాన్న కోసమే డిజైన్ చేయించాం. ఆయన డ్రాయింగ్ రూమ్‌లోకి కూర్చుంటే ఇల్లంతా ఆయనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నారంతే. – సంభాషణ: వాకా మంజులారెడ్డి