‘ఫాదర్స్ డే’ రోజు నాన్నకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పటినుంచో ప్రిపేరవుతున్న వారితోపాటు, ‘ఈరోజు ఫాదర్స్ డే కదా! మరిచేపోయాను’ అంటూ నాన్నకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? అని ఆలోచించేవారు కూడా మనలో ఉంటారు.నాన్నే మనకు పెద్ద కానుక.. మరి అలాంటి నాన్నకు మనం కానుక ఇవ్వాలి కదా... కొన్ని గిఫ్ట్ గ్యాడ్జెట్స్...
►నాన్నకు సంగీతం అంటే ఇష్టమా? అయితే సోనోస్ రోమ్ మినీ స్పీకర్‌ను కానుకగా ఇవ్వవచ్చు. నాన్న టేబుల్‌పై ఒక గ్లాస్‌లాగా దీన్ని పెడితే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. వినడానికి హాయిగా ఉంటుంది.
►నాన్నకు పుస్తకాలు చదవడం ఇష్టం అయితే, ఇ–రీడర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం మంచిది. దీన్ని ఎంచుకునే ముందు లాంగ్ బ్యాటరీ లైఫ్, అడ్జస్టబుల్ కలర్ టెంపరేచర్, చదవడానికి అనుకూలం, వాటర్–ఫ్రూఫ్... మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
►మజిల్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి, టెన్షన్ పోగొట్టడానికి ఆల్ట్రా–పోర్టబుల్ మసాజ్ డివైజ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
►నాన్నకు సినిమాలు, షోలు చూడడం ఇష్టం అయితే రోకు స్ట్రీమింగ్ స్టిక్ 4కెను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఇది మేజర్ స్టీమింగ్ సర్వీస్‌లకు సపోర్ట్ చేసింది. యాప్స్‌తో యాక్సెస్ కావచ్చు.
►మిడ్‌సైజ్‌డ్ స్మార్ట్ డిస్‌ప్లే...అమెజాన్ ఎకో షో. వార్తలు, వాతావరణం, క్యాలెండర్... మొదలైనవి డిస్‌ప్లే అవుతాయి. మ్యూజిక్ వినవచ్చు. వీడియో కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ హోమ్ డివైజ్‌లను నియంత్రించవచ్చు.
►ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ క్లాస్ మెంబర్‌షిప్, మెడిటేషన్ యాప్ సబ్‌స్క్రిప్షన్లు ఎన్నో ఉన్నాయి. నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఒకటి ఎంచుకోండి.
►నాన్నకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, ఆయన దగ్గర ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా సరే మోడ్రన్ పోలరైడ్ ఇన్‌స్టంట్ కెమెరాలాంటివి గిఫ్ట్‌గా ఇస్తే ఆయన ‘వావ్’ అనడం ఖాయం.
►ఫోన్ ఛార్జింగ్ చేయడం మరచిపోయి, బయటికి వెళ్లే అలవాటు నాన్నకు ఉందా? అయితే ఆయనకు ‘మీ పవర్‌బ్యాంక్’లాంటివి ఇవ్వడం పర్‌ఫెక్ట్ గిఫ్ట్.
‘ఫాదర్స్ డే’ రోజు ఖరీదైన గిఫ్ట్‌లే ఇవ్వాలని ఏమీ లేదు. మన పరిధిలో, తక్కువ టైమ్‌లో రకరకాల బహుమతులు ఇవ్వవచ్చు. అందులో కొన్ని....
ఫాదర్స్ డే ట్రోఫీ: ఒక షీల్ట్‌పై ‘మై బెస్ట్ ఫాదర్’ అని రాసి ఫాదర్స్ డే ట్రోఫీగా ఇవ్వండి.
నాన్న చెట్టు: నాన్న పేరుతో పెరట్లో ఒక మొక్క నాటండి.
నాన్న ఫోటోబుక్: నాన్న చిన్నప్పటి ఫోటో నుంచి పెళ్లికొడుకు డ్రెస్‌లో ఉన్న ఫోటో వరకు రకరకాల ఫోటోలతో ఒక పుస్తకం తయారు చేసి ఇవ్వండి.
పోస్టర్: నాన్న ఫోటోతో ఒక పోస్టర్ తయారుచేసి ‘బెస్ట్ డాడ్ ఎవర్–లవ్ యూ’ అని రాసి ఇంటిగోడలకు అతికించండి.
జనరేషన్ ఫోటోగ్రాఫ్: మీ తాత ఫోటో ఆ తరువాత రెండో వరుసలో నాన్న ఫోటో, ఆ తరువాత మీ ఫోటో డిజైన్ చేసి, మీ శుభాకాంక్షలు రాసి ఇవ్వవచ్చు.
మినీ బుక్: పది నుంచి ఇరవై కార్డులతో(పేక ముక్కల సైజ్‌లో) ఒక బుక్‌లాగా తయారుచేయండి. మొదటి కార్డుపై ‘మీరు నాకు ఎందుకు ఇష్టం అంటే...’ అని పెద్ద అక్షరాలతో రాయండి. ఆ తరువాత వచ్చే కార్డులలో మీ నాన్న అంటే మీకు ఎందుకు ఇష్టమో చిన్న చిన్న వాక్యాలుగా రాసి గిఫ్ట్‌గా ఇవ్వండి.
Comments
Please login to add a commentAdd a comment