Special Gifts
-
ఈ క్రిస్మస్కి సింపుల్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ ఏవో తెలుసా..!?
'మరికొద్దిరోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్కు దాదాపు ప్రపంచమంతా ఆతృతగా రెడీ అయి΄ోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి క్రిస్టియన్ లోగిళ్లు, చర్చ్‌లు.. క్రిస్మస్ స్టార్లు, ట్రీల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వీటితో΄ాటు తప్పనిసరిగా సందడి చేసేవి శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు. శాంతాక్లాజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం పిల్లలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పిల్లలేగాక, కొన్ని కంపెనీలు సైతం ఉద్యోగులకు, కొంతమంది బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగులకు సర్ప్రైజ్గిప్ట్స్ను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి క్రిస్మస్కు తక్కువ బడ్జెట్లో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా నిలిచే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..' మొక్కలు పర్యావరణం పచ్చగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే పర్యావరణ స్నేహితం అయిన పచ్చని మొక్కలను క్రిస్మస్కు బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడున్న ఇరుకు ఇళ్లకు ఇండోర్ ΄్లాంట్స్ అయితే మరింత మంచి గిఫ్ట్ అవుతాయి. గిఫ్ట్‌కార్డ్స్, స్పా వోచర్స్ మార్కెట్లో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏవైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. స్పా వోచర్స్ కూడా మంచి గిఫ్ట్సే. మ్యాచింగ్ పీజేఎస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నప్పేలా మ్యాచింగ్ క్రిస్మస్ పైజమాలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి ప్రత్యేకంగానూ, ఫన్నీగా ఉండి పండుగ సందడిని మరింత పెంచుతాయి. బుక్స్.. మార్కెట్లో ΄ాపులర్గానూ, బాగా సేల్ అవుతున్న నవలలు, క్లాసిక్ సాహిత్యం, ప్రేరణ కలిగించే పుస్తకాలు, ఆర్ట్, ఫొటోగ్రఫీ, ట్రావెల్‌కు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్స్కూడా మంచి బహుమతులు. ఈ గిఫ్ట్ ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ఇమిటేషన్ జ్యూవెలరీ, ట్రెండీ అండ్ స్టైలిష్ ఫ్యాషన్ యాక్సరీస్ (వాచ్‌లు, సన్‌గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్), ఫొటో ఆల్బమ్స్, ఫ్రేమ్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్‌గా పనికొస్తాయి. ఇవి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. సెల్ఫ్‌కేర్ చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎక్కువమంది వింటర్లో చర్మాన్ని కోమలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కాబట్టి వింటర్ స్కిన్ కేర్ ఉత్పత్తుల సెట్స్‌ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇవేగాక..సెంటెడ్ క్యాండిల్స్, ఫేస్‌మాస్క్‌లు, స్లీపింగ్ మాస్కులు, బాతింగ్ కిట్స్ మంచి గిఫ్ట్స్. పెర్ఫ్యూమ్స్.. పెర్ఫ్యూమ్స్ క్లాసిక్గానూ, అందుబాటు ధరలో దొరికే గిఫ్ట్ ఐటమ్స్. పెర్ఫ్యూమ్ వాడిన ప్రతిసారి .. ఆ సువాసన భరిత పరిమళాలు మీ గిఫ్ట్‌తో΄ాటు మిమ్మల్ని, మీ అభిమానాన్ని గుర్తుచేస్తాయి. మ్యూజిక్ బాక్స్ చార్మింగ్ లిటిల్ మ్యూజిక్ బాక్స్ కూడా ప్రత్యేకంగానూ ఫన్నీగా ఉంటుంది. ఇది కూడా క్రిస్మస్కు మంచి గిఫ్ట్. దీనినుంచి వచ్చే సంగీతం మనసుని ఆహ్లాద పరుస్తుంది. అందమైన మగ్స్ ఉద్యోగులకు లేదా కొలీగ్స్‌కు అందంగా ఉండే మగ్స్ మంచి గిఫ్ట్ ఐడియా. ఈ మగ్స్లో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడం లేదా, ఇష్టమైన కాఫీ తాగడం లేదా తరచూ వాడే ఐటమ్స్, అందమైన వస్తువులను పెట్టుకుంటారు. ఇవి తక్కువ ధరలో మంచి మంచి డిజైన్స్‌లో కూడా దొరుకుతాయి. ఎయిర్ ప్యూరిఫైర్.. ఎంతవేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతేస్పీడుగా గాలి కలుషితమై΄ోతున్న ఈ రోజుల్లో.. ఎయిర్ ప్యూరిఫయర్స్, ఫిల్టర్స్ అవసరంగా మారి΄ోతున్నాయి. అందుకే మినీ ప్యూరిఫయర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. వీటిద్వారా మీ సన్నిహితులకు మంచి ఆక్సిజెన్‌ను అందించిన వారవుతారు. డెకరేషన్ ఐటమ్స్ అలంకరించేకొద్దీ ఇంటి అందం పెరగడంతో΄ాటు.. కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీ, టీసెట్స్, కుకింగ్ గాడ్జెట్స్, కిచెన్ టూల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఆర్ట్ వర్క్ హోం డెకరేటివ్ ఐటమ్స్ కూడా మంచి గిఫ్ట్స్. చిన్న పరిమాణం నుంచి పెద్దసైజులో ఎంతో ఆకర్షణీయమైన, ఉపయోగకరమైనవి అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. క్రాఫ్ట్స్ మేకింగ్ కిట్స్ జ్యూవెలరీ తయారీ, క్యాండిల్ తయారీ, సబ్బుల తయారీ కిట్స్, వెరైటీ దియా మేకింగ్ కిట్స్, ΄్లాంట్ టెర్రారియం, గార్డెనింగ్ సెట్స్ కూడా మంచి బహుమతులే. వీటిలో ఏది బహుమతిగా ఇచ్చినా మీరు మీ ఆత్మీయుల సంతోషాన్ని చూరగొంటారు. ఇవి కూడా చదవండి: ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం! -
Valentines Day 2023: ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..!
కరీంనగర్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసే సందర్భం. ప్రేమలో ఉన్నవారు ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మనసులో మాట చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. మదిలో ప్రేమ సందేశాలను ఇచ్చిపుచ్చుకునేందుకు మార్కెట్లో ఎన్నో వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. కేక్‌లు ప్రత్యేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఆయా దుకాణాలు యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి. వారు మెచ్చిన, నచ్చిన ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి ఇవ్వడంతోపాటు లవర్స్ స్పెషల్ కీచైన్లు, టుడే అండ్ టుమారో, జస్ట్ ఫర్ యూ అనే హార్ట్ పిల్లోస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రేమికుల కోసం ఎన్నో రకాల విదేశీ చాక్లెట్లు నోరూరిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి వెరైటీ గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చైనా క్రిస్టల్‌తో తయారైన ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇష్టమైన వారి ప్రేమను పొందేందుకు కానుకలు మంచి సాధనాలుగా పని చేస్తాయని నమ్మేవాళ్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఒక బహుమతి ఇస్తా మాది ప్రేమ వివాహం. ఏటా ప్రేమికుల దినోత్సవం రోజు తప్పనిసరిగా మా వారికి ఏదో ఒక బహుమతి ఇస్తా. ఈసారి అది ప్రత్యేకంగా ఉండాలని షాపింగ్ చేస్తున్నా. ప్రేమ జీవితంలో భాగం కావాలి. – తాటి అమల పవన్, సవరన్ స్ట్రీట్ అందుబాటులో లవ్ గిఫ్ట్స్.. ఈసారి మా స్టోర్‌లో రూ.100 నుంచి రూ.2 వేల విలువైన లవ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంచాం. ప్రేమికులు రేటు ఆలోచించకుండా అందమైన బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. – ఈశ్వర్, గణేశ్ జనరల్ స్టోర్, శాస్త్రీరోడ్ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి బహుమతుల కన్నా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటే అది జీవితాంతం చెదిరిపోకుండా ఉంటుంది. నాకు కాబో యే శ్రీవారి కోసం ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి కొనుగోలు చేసి, పంపిస్తున్నాను. – ఉపాధ్యాయుల రుత్విక, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంకమ్మతోట లవ్ సింబల్స్ ఉన్నవే ఎక్కువ.. లవ్ సింబల్స్ ఉన్న వస్తువులు, బొమ్మల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మంచి కొటేషన్లతో గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. ఇంటర్నెట్ నుంచి తీసుకొని, ఇచ్చుకుంటున్నారు. – ఉప్పుగల్ల మురళీకష్ణ, వాణిశ్రీ బుక్స్, స్టేషనరీ, 7హిల్స్ చదవండి: ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు -
ప్రియమైన నాన్నకు కానుకగా...
‘ఫాదర్స్ డే’ రోజు నాన్నకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పటినుంచో ప్రిపేరవుతున్న వారితోపాటు, ‘ఈరోజు ఫాదర్స్ డే కదా! మరిచేపోయాను’ అంటూ నాన్నకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? అని ఆలోచించేవారు కూడా మనలో ఉంటారు.నాన్నే మనకు పెద్ద కానుక.. మరి అలాంటి నాన్నకు మనం కానుక ఇవ్వాలి కదా... కొన్ని గిఫ్ట్ గ్యాడ్జెట్స్... ►నాన్నకు సంగీతం అంటే ఇష్టమా? అయితే సోనోస్ రోమ్ మినీ స్పీకర్‌ను కానుకగా ఇవ్వవచ్చు. నాన్న టేబుల్‌పై ఒక గ్లాస్లాగా దీన్ని పెడితే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. వినడానికి హాయిగా ఉంటుంది. ►నాన్నకు పుస్తకాలు చదవడం ఇష్టం అయితే, ఇ–రీడర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం మంచిది. దీన్ని ఎంచుకునే ముందు లాంగ్ బ్యాటరీ లైఫ్, అడ్జస్టబుల్ కలర్ టెంపరేచర్, చదవడానికి అనుకూలం, వాటర్–ఫ్రూఫ్... మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ►మజిల్ పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి, టెన్షన్ పోగొట్టడానికి ఆల్ట్రా–పోర్టబుల్ మసాజ్ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ►నాన్నకు సినిమాలు, షోలు చూడడం ఇష్టం అయితే రోకు స్ట్రీమింగ్ స్టిక్ 4కెను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఇది మేజర్ స్టీమింగ్ సర్వీస్‌లకు సపోర్ట్ చేసింది. యాప్స్‌తో యాక్సెస్ కావచ్చు. ►మిడ్సైజ్డ్ స్మార్ట్ డిస్ప్లే...అమెజాన్ ఎకో షో. వార్తలు, వాతావరణం, క్యాలెండర్... మొదలైనవి డిస్ప్లే అవుతాయి. మ్యూజిక్ వినవచ్చు. వీడియో కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ హోమ్ డివైజ్‌లను నియంత్రించవచ్చు. ►ఆన్లైన్లో ఫిట్నెస్ క్లాస్ మెంబర్షిప్, మెడిటేషన్ యాప్ సబ్స్క్రిప్షన్లు ఎన్నో ఉన్నాయి. నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఒకటి ఎంచుకోండి. ►నాన్నకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, ఆయన దగ్గర ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా సరే మోడ్రన్ పోలరైడ్ ఇన్స్టంట్ కెమెరాలాంటివి గిఫ్ట్‌గా ఇస్తే ఆయన ‘వావ్’ అనడం ఖాయం. ►ఫోన్ ఛార్జింగ్ చేయడం మరచిపోయి, బయటికి వెళ్లే అలవాటు నాన్నకు ఉందా? అయితే ఆయనకు ‘మీ పవర్‌బ్యాంక్’లాంటివి ఇవ్వడం పర్ఫెక్ట్ గిఫ్ట్. ‘ఫాదర్స్ డే’ రోజు ఖరీదైన గిఫ్ట్‌లే ఇవ్వాలని ఏమీ లేదు. మన పరిధిలో, తక్కువ టైమ్‌లో రకరకాల బహుమతులు ఇవ్వవచ్చు. అందులో కొన్ని.... ఫాదర్స్ డే ట్రోఫీ: ఒక షీల్ట్పై ‘మై బెస్ట్ ఫాదర్’ అని రాసి ఫాదర్స్ డే ట్రోఫీగా ఇవ్వండి. నాన్న చెట్టు: నాన్న పేరుతో పెరట్లో ఒక మొక్క నాటండి. నాన్న ఫోటోబుక్: నాన్న చిన్నప్పటి ఫోటో నుంచి పెళ్లికొడుకు డ్రెస్‌లో ఉన్న ఫోటో వరకు రకరకాల ఫోటోలతో ఒక పుస్తకం తయారు చేసి ఇవ్వండి. పోస్టర్: నాన్న ఫోటోతో ఒక పోస్టర్ తయారుచేసి ‘బెస్ట్ డాడ్ ఎవర్–లవ్ యూ’ అని రాసి ఇంటిగోడలకు అతికించండి. జనరేషన్ ఫోటోగ్రాఫ్: మీ తాత ఫోటో ఆ తరువాత రెండో వరుసలో నాన్న ఫోటో, ఆ తరువాత మీ ఫోటో డిజైన్ చేసి, మీ శుభాకాంక్షలు రాసి ఇవ్వవచ్చు. మినీ బుక్: పది నుంచి ఇరవై కార్డులతో(పేక ముక్కల సైజ్‌లో) ఒక బుక్‌లాగా తయారుచేయండి. మొదటి కార్డుపై ‘మీరు నాకు ఎందుకు ఇష్టం అంటే...’ అని పెద్ద అక్షరాలతో రాయండి. ఆ తరువాత వచ్చే కార్డులలో మీ నాన్న అంటే మీకు ఎందుకు ఇష్టమో చిన్న చిన్న వాక్యాలుగా రాసి గిఫ్ట్‌గా ఇవ్వండి. -
ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్
Allu Arjun Special Gifts To Pushpa Movie Team: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప ది రైజ్ పేరుతో ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా దీనికి విశేష స్పందన వస్తోంది. చదవండి: ఆ డైరెక్టర్‌తో రెండో పెళ్లికి సిద్దమవుతున్న సోనియా అగర్వాల్! ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. పూర్తిగా లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు. యాక్షన్ సన్నివేశాలతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పుష్ప ట్రైలర్. ఈ ట్రైలర్‌పై అభిమానులే కాకుండా పలువురు సెలబ్రెటీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ మొదలు పెట్టగా నిన్న(సోమవారం)తో షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి పాట షూటింగ్‌ని ఇంత త్వరగా పూర్తి చేసినందుకు ఫుల్‌గా ఇంప్రెస్ అయిన బన్నీ 12 మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట. ఇందులో అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
వధువుకు వింత బహుమతులు.. వరుడుని ఉతకడానికేనా?
న్యూఢిల్లీ: ఈ మధ్య పెళ్లిలో జరిగే నాటకీయ దృశ్యాలు సీరియల్స్‌ని మించి ఉంటున్నాయి. ఇక స్నేహితులు ఇచ్చే వింత బహుమతులు బంధువులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో వధువుకి ఇచ్చిన వింత బహుమతుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అప్పడాల కర్ర (రోలింగ్ పిన్), చిమాటా (టాంగ్స్) వంటి వంటగదికి సంబంధించిన వస్తువులను కొంత మంది స్నేహితులు వధువుకు బహుమతిగా అందజేశారు. అయితే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘స్నేహితులు కొత్త సంసారం ముందుకు సాగడానికి ఈ వస్తువులన్నింటినీ బహుమతిగా ఇచ్చారా లేదా వరుడుని ఉతకడానికా..’’ అంటూ చమత్కరించాడు. (చదవండి: వైరల్: స్ప్రింటర్లను మించి కెమెరామెన్ పరుగో పరుగు..) (చదవండి: ముంబైని ముంచెత్తిన వర్షాలు) -
ముస్లిం సోదరులకు తెలంగాణ సర్కారు ప్రత్యేక కానుకలు..
సాక్షి, నిర్మల్: రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సరఫరా చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే కోవిడ్ నిబంధనల ప్రకారం పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు 6 వేలు గిఫ్ట్‌ప్యాక్‌లు.. పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఏటా గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 6వేల వరకు వచ్చాయి. వీటిని నియోజకవర్గాల వారీగా పంపణీకి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గానికి 2వేలు, ము థోల్ నియోజకవర్గానికి 2500, ఖానాపూర్ నియోజ కవర్గానికి 1500 చొప్పున కేటాయించారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి అందజేయనున్నారు. పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్లను ప్రత్యేక అధికారులుగా, మిగతా మండలాల తహసీల్దార్లను ఆయా మండలాల ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. ఇఫ్తార్ విందు రద్దు.. ఏటా రంజాన్ సందర్భంగా డ్రెస్ మెటీరియల్, చీర, కుర్తా పైజామాకు సంబంధించిన దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు అందించడంతో పాటు ఇఫ్తార్ విందు కూడా ఘనంగా ఇచ్చేవారు. అయితే కోవిడ్ కారణంగా గతేడాది ఇఫ్తార్ విందు రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటిస్తూ గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ.. రంజాన్ సందర్భంగా జిల్లాకు 6వేల గిఫ్ట్‌ప్యాక్‌లు వచ్చాయి. త్వరలోనే వీటిని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేయనున్నాం. – స్రవంతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, నిర్మల్ -
ప్రేమికుల మొదటి ఛాయిస్ అదే!
సాధారణంగానే ప్రేమికులు సందర్భం లేకుండానే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఎదురుచూసే వాలెంటైన్స్‌డేని మరింత అందంగా, మదుర ఙ్ఞాపకంలా మలుచుకునేందుకు ప్రేమికులంతా గిఫ్ట్‌లతో రెడీ అయిపోతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన బహుమతులు ఇచ్చి తమవారిని ఇంప్రెస్ చేస్తుంటారు. వాటిలో ప్రత్యేకంగా వాలెంటైన్స్ డేకి ఇచ్చిపుచ్చుకునే మోస్ట్ పాపలర్ గిఫ్ట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 1. రోజా పువ్వు : ప్రేమను వ్యక్తపరచడానికి దాదాపు ఎనభై శాతం ప్రేమికుల మొదటి ఛాయిస్ రోజా పువ్వేనట. రోజా పువ్వులోనూ రకరకాల రంగులున్నా ఎర్ర గులాబీకే ఎక్కువ మక్కువ చూపుతారు. 2. చాక్లెట్స్ : వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడేది చాక్లెట్స్. వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రతీ ఒక్కరి గిఫ్ట్ బాక్స్‌లలో ఉండే కంపల్సరీ ఐటెమ్. చాక్లెట్‌లోని తీపిదనంతో ఆ బంధం మరింత దృఢంగా మారుతుందనేది ప్రేమికుల నమ్మకం. 3. రింగ్ : తాము ప్రేమించినవారి ముందు మోకాళ్లపై కూర్చొని వారి చేతిని దగ్గరగా తీసుకొని ఉంగరాన్ని తొడుగుతూ ప్రేమను వ్యక్తపరుస్తారు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం వారికి తోడుగా నిలుస్తామని భరోసానిస్తూ ప్రపోజ్ చేస్తారు. ఇలా ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు త్వరగా ప్రేమను అంగీకరిస్తారని ఓ సర్వేలో తేలింది. 4. వ్రిస్ట్ వాచ్ : తమ మనసుకు నచ్చినవారికి అమ్మాయిలు ఎక్కువగా వాచ్ ఇవ్వడానికి ఇష్టపడతారు. అబ్బయిలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా తక్కువ ఆఫ్షన్స్ ఉంటాయి. వాటిలో వాచీలదే ప్రథమ స్థానం. అంతేకాకుండా చేతికి ఉండే గడియారం అనుక్షణం తమను గుర్తుచేస్తూ ఉంటుందని ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు వాచ్‌లను ఇవ్వడానికి మక్కువ చూపిస్తుంటారట. 5. టెడ్డీబేర్ : చూడటానికి చాలా క్యూట్‌గా, అందంగా ఉండే టెడ్డీస్ అంటే ఇష్టపడని మగువ ఉండదు. అందుకే తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలామంది అబ్బయిలు టెడ్డీ బేర్లను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. తాము వారి పక్కన లేకున్నా వారున్నట్లుగా భావించి మనసులో మాటలు చెప్పుకోవడానికి టెడ్డీబేర్ బెస్ట్ ఛాయిస్ 6. కాఫీ మగ్ : ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మత్తు వదలదు చాలామందికి. ఉదయం లేవగానే తాము గుర్తొచ్చేలా ఉండేందుకు చాలా మంది కాఫీ మగ్‌లను గిఫ్ట్ చేస్తుంటారు. వీటిలో చాలా రకాలున్నాయి. వాళ్ల అభిరుచికి తగ్గట్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంచుకుంటుంటారు. 7. గాగుల్స్ : బయటికి వెళ్లాలంటే కాలంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి ఆల్‌టైం ఫేవరెట్ ఛాయిస్ గాగుల్స్. సో వారి ప్రేమించినవారికి గాగుల్స్ ని గిఫ్ట్ గా ఇస్తుంటారు. 8. సెల్‌ఫోన్ : సెల్‌ఫోన్ ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. అందుకే తమ జీవిత భాగస్వామికి సెల్‌ఫోన్ ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు చాలా మంది ప్రేమికులు. తమతో గడిపిన ప్రతీ క్షణాన్ని మధురానుభూతిగా మలచుకోవడానికి సెల్ఫోన్లో బందిస్తుంటారు. 9. మేకప్ సెట్ : ప్రతీ అమ్మాయి తన అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు మేకప్‌ను ఉపయోగిస్తుంటారు. సందర్భానికి తగ్గట్లు వారి అలంకరణలో మార్పులు చేసుకుంటూ మరింత అందంగా కనబడేందుకు సిద్దమతుంటారు. ఇక వాలెంటైన్స్ డే న వారికి ఎంతో ఇష్టమైన మేకప్సెట్ గిఫ్ట్‌గా ఇస్తే అమ్మాయిలు ఫుల్ ఖుష్ అవుతారు. 10. పరఫ్యూమ్ : పర్ఫ్యూమ్ మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే లైట్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్స్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. మంచి సువాసనాభరితమైన పర్ఫ్యూమ్ తమ వారిని ఆకర్షించుకునేందుకు మరో సున్నతిమైన ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. 11. గ్రీటింగ్ కార్డ్ : ఏ చిన్న వేడుక జరిగినా గ్రీటింగ్ కార్డు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. గ్రీటింగ్ కార్డుల్లోనూ అకేషన్‌కి తగ్గట్లు చాలా వెరైటీస్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా తమ ప్రేమికుల కోసం స్వయంగా వారే గ్రీటింగ్ కార్డులను రూపొందించవచ్చు. అది కూడా చాలా సులభమైన పద్దతిలో. సో మీరు ప్రేమించేవారికోసం కొంత సమయం కేటాయించి గ్రీటింగ్కార్డును మీరే అందంగా తీర్చిదిద్దవచ్చు. మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో హ్యండ్ క్రాఫ్ట్ ఇచ్చినా బావుంటుంది. -
హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు..
డిసెంబర్ నెల ముదలైందంటే చాలు నగరం అంతా క్రిస్మస్, న్యూయర్ వేడుకల సెలబ్రేషన్స్‌తో హడావుడిగా ఉంటుంది. హిందూ, ముస్లిం పండుగలు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలతో గడిచే ఏడాది.. చివరగా క్రిస్మస్ పండుగతో పూర్తవుతుంది. అందుకే ఈ పండగకు పట్టణప్రజలు అత్యంత ప్రాముఖ్యత నిస్తారు. ఏసుక్రిస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడా చూసినా క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్రిస్మస్ తాతలు దర్శనమిస్తాయి. క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. క్రిస్మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేకు. ఈ కేకును ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు. అలాగే ఈ పండుగలో బహుమతులు ఒక భాగమే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ పండగను మన హైదరాబాద్‌లో ఏలా జరుపుకుంటారో, నగరంలో ఉండే హడావుడి గురించి బహుమతులు, కేకుల తయారి గురించి తెలుసుకుందాం రండి. క్రిస్మస్కి నగరం ఇలా ముస్తాబవుతుంది: డిసెంబర్ రాగానే నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎక్కడ చూసిన స్టార్స్, వివిధ రంగుల లైట్లతో హైదరాబాద్ నగరమంతా తారలే కిందకు వచ్చేయేమో అనేలా విరజిల్లుతుంది. క్రైస్తవులు తమ ఇంటినంతా రంగుల రంగుల లైట్లతో, ఓ పెద్ద స్టార్, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటారు. ఇక షాపింగ్ మాల్స్ గురించి పెద్దగా చెప్పనక్కేర్లేదు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఏరియాలలో ఉండే ఏ షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత దర్శనమిస్తారు. బిల్డింగ్ అంత ఎత్తు ఉండే.. ఆకాశాన్ని తాకుతుందేమో అనేంత ఎత్తుగా క్రిస్మస్ ట్రీని పెట్టి దానికి బహుమతుల బొమ్మలు, చాక్లేట్స్ బొమ్మలు, క్రిస్మస్ తాత బొమ్మలు వంటి వివిధ రకాల మెరిసే బొమ్మలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. కోన్ ఆకారంలో ఉండే క్రిస్మస్ ట్రీకి చివరి అంచున పెద్ద స్టార్‌ను బొమ్మను ఉంచుతారు. ఇది ఏసుక్రిస్తు జననానికి సూచిక. ఈ క్రిస్మస్ ట్రీ అలంకరణకను సంబంధించిన డేకరేషన్ వస్తువులు అన్ని చోట్ల దొరకవు. వాటికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బజార్లు ఉంటాయి. కోఠి, సికింద్రాబాద్ బజార్, ఒల్డ్ సీటి బేగం బజారు వంటి ప్రత్యేకంగా వాటి కోసం బజార్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ సంబంధించిన వస్తువులు, బహుమతులు అన్ని కూడా దొరుకుతాయి. క్రిస్మస్ కేకు ప్రాముఖ్యత: క్రిస్మస్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేకు. అన్ని కేకుల్లా కాకుండా క్రిస్మస్ కేకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకోసం కేకు తయారీని రెండు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కేకు కోసం ఏ ఒక్క డ్రై ఫ్రూట్స్ వదలరు అన్నీరకాల డ్రై ఫ్రూట్స్‌ను వాడుతారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ కేకును ‘ప్లమ్ కేక్’ అంటారు. దీని కోసం రెండు నెలల ముందే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వైన్‌తో బాగా కలిపి నానబెట్టి తయారు చేస్తారు. వైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ను కలిపేందుకు తాజా ద్రాక్ష పండ్ల రసాన్ని వాడతారు. ఇందుకోసం గ్రేప్ వైన్ ప్రక్రియ విధానాన్ని వాడతారు. అంటే తాజా ద్రాక్ష పండ్లను తొక్కుతూ రసాన్ని తీస్తారు. ఈ క్రమంలో దేవుడి పాటలు పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. క్రైస్తవులు ఉల్లసంగా డ్యాన్స్ చేస్తూ ప్రతిఒక్కరు ఈ ‘గ్రేప్ స్టంపింగ్’లో పాల్గొంటారు. ఈ కేకు మిక్సింగ్ వేడుకతోనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఓ వేడుకలా జరుపుకునే కేకు మిక్సింగ్ ప్రక్రియ విదేశాలల్లో క్రిస్మస్ పండుగలో ఆచారంగా ఉంది. అలాగే క్రిస్మస్ సంబరాలలో ఇది ఒక భాగం కూడా. ఈ ఆచారం మొదట విదేశాలలో మాత్రమే ఉండేది. ఆ తరువాత క్రమ క్రమంగా మన భారతదేశంలో కూడా జరుపుతున్నారు. మన హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెండు నెలల ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. శంషాబాద్ నోవాటేల్ స్టార్ హోటల్స్, హైదరాబాద్ గోల్కొండ హోటల్, తాజ్ బంజారా, తాజ్ క్రిష్ణా హోటల్స్‌తో పాటు పలు ప్రముఖ హోటల్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకు మిక్సింగ్ వేడుకను జరుపుతున్నాయి. దీని కోసం సినీ ప్రముఖులను, ప్రముఖలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. కేకు తయారీ కోసం చేసే డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌లో వారు పాల్గొని అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా తయారు చేసే క్రిస్మస్ కేకు రుచికరంగా ఉండటమే కాదు.. దాని ధర కూడా ఎక్కువగానే. అరకిలో కేకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో క్రైస్తవులు ఇలా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు: మతబేధం చూపకుండా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ సీజన్ మొత్తం క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచే ఆయా చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యుల ఇళ్లకు వెళ్లి పాటలు పాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఆహ్వానం ఇస్తారు. దీనినే ‘క్యారెల్స్’ అని పిలుస్తారు. ఈ క్యారెల్స్ను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా నిర్వహిస్తారు. చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యులతో కలసి గుంపులుగా చేరి.. ఎవరెవరి ఇళ్లకు వెళ్లాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ప్రతి సంఘ సభ్యుడి ఇంటికి వెళ్లి వారిని క్రిస్మస్ పండుగ వేడుకలో భాగస్వాములను చేస్తూ పండుగ వేడుకలకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో వారంతా గిటారు, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో డ్యాన్స్‌లు వేస్తూ ఆ ఇంట్లో కాసేపు సందడి చేసి క్రిస్మస్ పండుగకు వారికి ఆహ్వానం తెలుపుతారు. ఇలా ప్రతిరోజు క్రిస్మస్ వరకు చర్చి పెద్దలు, ఇతర సంఘ సభ్యులంతా బీజీగా ఉంటారు. ఈ క్యారెల్స్లో ప్రతి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందే. అలాగే క్రిస్మస్ డిసెంబర్ 25 తేదికి 10 రోజుల ముందు చర్చిలో సేమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చర్చిలోని సభ్యులందరికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో స్వీట్స్, కేకు, వివిధ రకాలు భోజన పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటం, ఆటల పోటీలను నిర్వహిస్తారు. పోటీల్లో గెలిచిన వారికి, పాటలు బాగా పాడిన వారికి, డ్యాన్స్ బాగా చేసే వారికి బహుమతులు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకునే ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆట, పాటలతో చిందలేస్తూ రోజంతా ఆనందోత్సహాలతో సందడిగా గడుపుతారు. ఇలా సందడి చేస్తూ గ్రాండ్ క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతారు. ఇలా హైదరాబాద్‌లో కొన్ని చర్చిలలో ప్రీ క్రిస్మస్ ఈవేంట్స్ను ఘనంగా క్రిస్మస్ నిర్వహిస్తారు. అవి సికింద్రాబాద్ వెస్టీ చర్చి, సెయింట్ మార్టిన్స్, కల్వరి టెంపుల్, ది కింగ్స్ టెంపుల్, బాప్తిస్ట్ చర్చిలు మొదలైనవి. క్రిస్మస్ బహుమతులు: క్రిస్మస్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కేకు ఆ తరువాత బహుమతులు. అవును క్రిస్మస్ అంటేనే బహుమతులు ఇవ్వడం. ఈ బహుమతులను ఇచ్చేది శాంటా క్లాజ్(క్రిస్మస్ తాత). ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం, ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రేట్‌గా ఓ ప్లేస్ ఉంచి వారు చూసేలా చేసి సర్ప్రైజ్ చేస్తారు. నిజంగానే క్రిస్మస్ తాత వచ్చి తనకు నచ్చిన వస్తువు ఇచ్చి వెళ్లాడనుకుని పిల్లలు నమ్ముతారు. ఈ పండుగకు కానుకలను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావాలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇవ్వాల్సిందే మరి. చోట్ల, విదేశాలలో లేనివారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు కూడా. అలా ఇదే పద్దతిని క్రమ క్రమంగా మన ఇండియాకి కూడ వచ్చేసింది. బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాత ఇలా వచ్చాడు.. అసలు క్రిస్మస్కి ఈ బహుమతుల ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓ ధనికుడైన వృద్దుడు ఒంటరిగా జీవించేవాడు. అతడు కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయట నడుస్తూ ఉండేవాడు. రోజూలాగే ఓ రోజు సాయంత్రం బయటకు వెళ్లిన అతనికి వీధిలో ఓ పేద కుటుంబం రోడ్డు పక్కన నివసిస్తున్నట్లు గమనించాడు. అది క్రిస్మస్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంటుంది వారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉండేవారు. పిల్లలకు సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని రోజు చూస్తుండేవాడు. అలా రోజు వారిని చూసి వారికి ఏ విధంగానైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రేట్‌గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు. అప్పుడు ఆయన తలకు చలి చోపి, కోటును ధరించి చేతి కర్రతో ఉన్న ఆయనను వారు గమనించారు. అయితే తెల్లవారు జామున అది చూసి వారు. దేవుడే శాంటాక్లాస్(క్రిస్మస్ తాత)ను పంపించాడని. అతడే వారికి సాయం చేశాడని అనుకుంటారు. అలా ఈ క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు. దీంతో ప్రజలు సీక్రేట్ శాంటా క్లాజా అంటూ పిలుచుకుంటారు. ఇలా క్రిస్మస్ తాత కథలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్పుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అసలు కథ బైబిల్లో కూడా ఉంది. దీనిని చర్చిలోని సండే స్కూల్స్‌లో పిల్లలకు కథగా చెబుతారు. -
ఈ క్రిస్మస్ మీ ప్రియమైన వారితో..
క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేవి మనసు దోచే కానుకలు.. చల్లటి సాయంత్రాలు.. రంగుల రాత్రులు. పండుగ నాడు తమకిష్టమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని తహతహలాడే వారు కొందరైతే. అందరిలా మామూలుగా కాకుండా పండుగను కొంత ప్రత్యేకంగా.. మరికొంత ‘ప్రేమ’గా జరుపుకోవాలని ఆలోచించే వారు మరికొందరు. అలాంటి వారు, ముఖ్యంగా పర్యటనలంటే ఇష్టపడేవారు తమ ప్రియమైన వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే పండుగను తమదైన రీతిలో కన్నుల పండుగగా జరుపుకునే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ మనసుకు దగ్గరైన వారితో ఈ క్రిస్మస్ పండుగ రోజును మరింత అందంగా, గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోండి. 1) గోవా ఈ క్రిస్మస్ మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవటానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. క్రిస్మస్ రోజున గోవాలోని దాదాపు 400 చర్చిలు సప్తవర్ణశోభితంగా వెలుగిపోతాయి. రాత్రి వేళల్లో గోవా ఓ నూతన స్వర్గంలా అనిపిస్తుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగను మరింత అందంగా జరుపుకోవటానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు గోవా చేరుకుంటారు. ఇక ఇక్కడి బీచ్‌ల వద్ద ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2) పాండిచ్చేరి ‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలువబడే పాండిచ్చేరి అద్భుతమైన కట్టడాలతో, సుందరమైన సముద్ర తీరాలతో మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్రాన్స్ మూలాలు ఉన్న చాలామంది క్రిస్టియన్లు క్రిస్మస్ను తమదైన సాంప్రదాయాలు పాటిస్తూ కన్నులపండువగా జరుపుకుంటారు. పండుగనాడు అక్కడి చర్చిలు, బీచ్‌లు ఓ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి. 3) మనాలి చల్లని శీతాకాలం నాడు తెల్లటి మంచుతో మనాలి ఓ వెండి పర్వతంలా అందంగా మెరిసిపోతుంది. అందుకే మనాలిలో జరుపుకునే క్రిస్మస్కు వైట్ క్రిస్మస్ అని పేరు కూడా ఉంది. కేవలం క్రిస్మస్తోనే కాకుండా న్యూ ఇయర్‌తో మొదలయ్యే పండుగలన్నింటికి మంచుతో కప్పబడిన మనాలి స్వాగతం పలుకుతుంది. అందంగా అలంకరించబడిన హోటళ్లు పండుగ వాతావరణాన్ని పరిమళించేలా కులు ఫోక్ మ్యూజిక్ మనల్ని మైమరిపింపజేస్తుంది. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోందంటే మనాలి ప్రకృతి అందచందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4) కేరళ దైవ భూమిగా పిలువబడే కేరళ పచ్చటి పకృతి అందాలతో, సముద్రపు తీరాలతో, బ్యాక్ వాటర్‌తో ఎంతో రమణీయంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున కేరళ పర్యటన మీ జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జనాభాలో అధిక భాగం ఉన్న క్రిస్టియన్లు పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్రిస్మస్ రోజు రాత్రి అందరూ చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు చేస్తారు. ప్రకృతి ఒడిలో క్రిస్మస్ జరుపుకోవాలనుకునే వారికి కేరళ ఓ బెస్ట్ ఛాయిస్. 5) సిమ్లా మీకిష్టమైన వారితో ఈ క్రిస్మస్ను ప్రశాంతంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తప్పకుండా సిమ్లా వెళ్లి తీరాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే కొండ ప్రాంతాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అక్కడి ఇళ్లు, వీధులు, చర్చిలు రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించబడి కొత్త శోభను సంతరించుకుంటాయి. నోరూరించే సాంప్రదాయ వంటకాలు మనల్ని లొట్టలేసుకునేలా చేస్తాయి. చల్లటి సాయంత్రాలు క్రిస్మస్ వాతారణాన్ని మరింత అందంగా చేస్తూ వినసొంపైన పాటలతో మనల్ని అలరిస్తాయి. 6) లాన్స్ డౌన్ ఈ క్రిస్మస్ను కొండ ప్రాంతంలో జరుపుకోవాలనుకుంటే లాన్స్ డౌన్ అద్బుతమైన ప్రదేశం. యాంత్రికమైన జీవితంలో కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. వెండికొండల్లో.. మంచులోయల్లో.. చల్లటి సాయంత్రాలు.. వెన్నెల రాత్రులు మనకో గొప్ప అనుభూతిగా మిగిపోతాయి. భాగస్వామితో మాత్రమే కాదు, కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపటానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. 7) దాద్రా నగర్ హవేలీ అన్ని క్రిస్మస్ డెస్టినేషన్లకంటే దాద్రా నగర్ హవేలీ కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ పండుగ మొత్తం గిరిజన పద్దతిలో జరుగుతుంది. రాత్రి వేళ చర్చిల వద్ద నిండుగా గుమిగూడే జనంతో పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. పండుగ నాడు మీ ప్రియమైన వారితో ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవటం నిజంగా ఓ మరిచిపోలేని జ్ఞాపకం అవుతుంది. 8) షిల్లాంగ్ చలికాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మరెక్కడా రాని అనుభూతి మనకిక్కడ దొరుకుతుంది. పర్యాటకుల్లా కాకుండా స్థానికుల్లా క్రిస్మస్ పండుగను ఆస్వాదించవచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే రంగుల లైట్లతో.. వినసొంపైన గాస్పెల్ పాటలతో రేయి ఇట్టే గడిచిపోతుంది. అక్కడి ప్రజలతో పాటు కలిసి స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు. 9) డామన్ అండ్ డయ్యూ గోవాకు ప్రత్యామ్నాయంగా దీనిని చెప్పుకోవచ్చు. పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. సంప్రదాయ నృత్యాలతో పాటు కారిడినో వంటి పోర్చుగీసు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద సంఖ్యలో చర్చిల వద్ద గుమిగూడే జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. 10) నార్త్ ఈస్ట్ క్రిస్మస్ పండుగను వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ ఒకటి. ఇక్కడి గిరిజనులు పండుగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లోని పట్టణాలలో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రి వేళ వీధుల్లో ఎక్కడ చూసినా కనపించే జనంతో వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మన కిష్టమైన వారితో పండుగను మరింత సరదాగా జరుపుకోవటానికి ఇదో చక్కటి ప్రదేశం. -
ప్రధానికి సీమ రైతుల స్పెషల్ గిఫ్ట్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 68వ పుట్టినరోజు జరుపుకున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుంచి పార్టీల కతీతంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేయటం చూశాం. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఆయనకు ఊహించని బహుమతులు అందాయి. 68 పైసలతో 400 చెక్కులు రాసి ఆయనకు కానుకగా పంపారు రాయలసీమ సాగునీటి సాధన సమితి(ఆర్ఎస్ఎస్ఎస్) సభ్యులు. దేశంలోనే థార్ ఎడారి తర్వాత అనంతపురం జిల్లా అత్యల్ప వర్షాపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కింది. అలాంటిది ఆ ప్రాంతంలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ఎస్ ప్రతినిధులు ఇలా వినూత్న నిరసన తెలియజేశారు. ‘రాయలసీమ నాలుగు జిల్లాలో సాగునీటి వసతిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. అయితే ఇక్కడ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో కోస్తాంధ్రా అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నారు. సాయం చేయాల్సిన కేంద్రం కూడా ఇక్కడి రైతులను పట్టించుకోవటం లేదు. అందుకే తమ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా నిరసనను తెలియజేశాం’ అని ఆర్ఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.