
Allu Arjun Special Gifts To Pushpa Movie Team: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప ది రైజ్ పేరుతో ఫస్ట్ పార్ట్‌ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా దీనికి విశేష స్పందన వస్తోంది.
చదవండి: ఆ డైరెక్టర్‌తో రెండో పెళ్లికి సిద్దమవుతున్న సోనియా అగర్వాల్!
ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. పూర్తిగా లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు. యాక్షన్ సన్నివేశాలతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పుష్ప ట్రైలర్. ఈ ట్రైలర్‌పై అభిమానులే కాకుండా పలువురు సెలబ్రెటీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ మొదలు పెట్టగా నిన్న(సోమవారం)తో షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది.
చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి
పాట షూటింగ్‌ని ఇంత త్వరగా పూర్తి చేసినందుకు ఫుల్‌గా ఇంప్రెస్ అయిన బన్నీ 12 మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట. ఇందులో అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనసూయ, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment